TELUGU MURLI 28-03-2023

  • 27-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి సమానముగా నిర్భయులుగా అవ్వండి, మీ అవస్థను సాక్షిగా ఉంచుకుంటూ సదా హర్షితముగా ఉండండి, స్మృతిలో ఉండడం ద్వారానే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది’’

ప్రశ్న:-

అదృష్టవంతులైన పిల్లలు సదా ఫ్రెష్ గా మరియు హర్షితముగా ఉండేందుకు ఏ విధిని ఉపయోగిస్తారు?

జవాబు:-

రోజుకు రెండు సార్లు జ్ఞాన స్నానం చేస్తారు. గొప్ప వ్యక్తులు ఫ్రెష్ గా ఉండేందుకు రెండు సార్లు స్నానం చేస్తారు. పిల్లలైన మీరు కూడా జ్ఞాన స్నానం రెండు సార్లు చేయాలి. దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి 1. సదా హర్షితముగా ఉంటారు,
2. అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా అవుతారు,
3. ఎటువంటి సంశయమైనా తొలగిపోతుంది,
4. మాయావీ వ్యక్తుల సాంగత్యము నుండి సురక్షితముగా ఉంటారు,
5. తండ్రి మరియు టీచర్ సంతోషిస్తారు, 6. పుష్పాలుగా అవుతారు, అపారమైన సంతోషములో ఉంటారు.

పాట:-

[5:10 AM, 3/28/2023] Thirupam Reddy Garu Om Shanthi: 28-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారుతుంది, అందుకే దీనిపై ప్రీతి పెట్టుకోకూడదు, కొత్త ఇల్లు అయిన స్వర్గాన్ని స్మృతి చేయాలి’’

ప్రశ్న:-

సదా సుఖవంతులుగా అయ్యే ఏ విధిని తండ్రి పిల్లలందరికీ వినిపిస్తారు?

జవాబు:-

సదా సుఖవంతులుగా అవ్వాలి అంటే హృదయపూర్వకముగా ఒక్క తండ్రికి చెందినవారిగా అవ్వండి. తండ్రినే స్మృతి చేయండి. తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. స్వర్గములో ఎప్పుడూ ఎవరి పతి, ఎవరి పిల్లలు మరణించరు. అక్కడ ఈ అకాల మృత్యువు యొక్క వ్యాపారము ఉండదు. ఇక్కడైతే మాయా రావణుడు దుఃఖితులుగా చేస్తూ ఉంటాడు. బాబా దుఃఖహర్త, సుఖకర్త.

పాట:-

దుఃఖితులపై కొంచెం దయ చూపించండి, మా మాతా పితలారా… (దుఖియో పర్ కుచ్ రహమ్ కరో మా బాప్ హమారే…)

ఓంశాంతి.

ఆ మాత, పితలే ఇప్పుడు మళ్ళీ సదా సుఖవంతులుగా తయారుచేయడానికి రాజయోగం నేర్పిస్తున్నారు. ఎలాగైతే ఎవరైనా బ్యారిస్టరు కూర్చొని బ్యారిస్టర్లుగా అయ్యే నాలెడ్జ్ ఇస్తారు. ఇప్పుడు వీరు అనంతమైన మాతా-పితలు, స్వర్గ రచయితలు. వారు కూర్చొని పిల్లలకు స్వర్గానికి యజమానులుగా తయారుచేయడము కోసం శిక్షణనిస్తారు. స్వయము భగవంతుడు కూర్చొని చదివించే కాలేజి అయితే ఏదీ ఉండదు. ఇక్కడ స్వయము భగవంతుడు కూర్చొని భగవాన్-భగవతీలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. సత్యయుగములో శ్రీలక్ష్మి-నారాయణులను భగవాన్-భగవతి అని అంటారు. కొత్త ప్రపంచానికి యజమానులుగా ఎవరు తయారుచేసారు? వారు సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు. భారత్ లో సత్యయుగం ఆదిలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగము, దేవతల రాజ్యం లేనే లేదు. అందరూ దేవతల నుండి మారి నిరుపేదలైన మనుష్యులుగా అయ్యారు. దేవతలైతే చాలా ధనవంతులుగా, సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు కలియుగాంతము ఉన్న కారణముగా మనుష్యులందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధము జరుగుతుంది, మనుష్యులు చాలా ఆర్తనాదాలు చేస్తారు. చాలామంది నిరాశ్రయులుగా అయిపోతారు. మనుష్యులు పూర్తిగా అనాథలుగా ఉన్నారు ఎందుకంటే స్వర్గ సుఖాలను ఇచ్చే తల్లిదండ్రుల గురించి తెలియనే తెలియదు. మీరు ఆ మాత, పితలకు చెందినవారిగా అయ్యారు. మీకు ఆ మాత, పితల నుండి అపారమైన సుఖము లభిస్తుంది. మనుష్యులు ఎవరైతే భక్తి చేస్తారో, వారు భగవంతుడిని ఏమీ స్మృతి చేయరు, భగవంతుడినైతే రాయి, రప్పలలో, కుక్క-పిల్లిలోకి తోస్తూ మళ్ళీ స్వయాన్ని భగవంతునిగా భావిస్తూ కూర్చున్నారు. అందరిలోనూ భగవంతుడు విరాజమానమై ఉన్నారని అంటారు. పతితులలో భగవంతుడు విరాజమానమై ఉన్నారని భావించడము నింద అయినట్లే కదా. కానీ ఇది కూడా డ్రామాలో మనుష్యులు పొరపాటును చేయవలసిందే మరియు తండ్రి వచ్చి పొరపాటు చేయనివారిగా తయారుచేయాలి. మనుష్యులకు తెలియనే తెలియదు. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు, వేలాదిమంది ఏమైనా ఉంటారా. లౌకిక తండ్రులైతే చాలామంది ఉంటారు. తండ్రి అయితే జంతువులకు కూడా ఉంటారు. కానీ అందరి సద్గతిదాత, పతిత-పావనుడు ఒక్కరే. కావున ఆ తండ్రి వచ్చి భవిష్యత్తు కోసం పిల్లలను చదివిస్తారు. భగవాన్-భగవతిలుగా తయారుచేస్తారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ తప్ప భగవాన్-భగవతిగా ఎవరు తయారుచేయగలరు! వారు తండ్రి అయినప్పుడు మరి తల్లి లేకుండా సృష్టిని ఎలా రచిస్తారు! భారతవాసులకు పాడుతారు, మీరు కూడా భక్తి మార్గంలో, నీవే తల్లివి, తండ్రివి… నీ కృపతో సుఖపు గనులు లభిస్తాయి అని మహిమ చేసేవారు, అందుకే మనం భక్తి చేస్తాము. ఎవరి భక్తి చేసినా సరే, మేము భగవంతుడిని స్మృతి చేస్తున్నామని భావిస్తారు. సన్యాసులు కూడా సాధన చేస్తారు, కానీ ఎవరి సాధనను చేస్తున్నారో వారికి తెలియదు. రావణ మతముపై అన్నీ మర్చిపోయారు. మరి తండ్రి ఏం చేస్తారు. ఇంతటి దుఃఖితులుగా, నిరుపేదలుగా అవ్వడము, ఇది కూడా డ్రామాలో ఉంది.

తండ్రి వచ్చి పిల్లలను మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. స్వర్గానికి యజమానులుగా తయారుచేసేవారు పారలౌకిక మాత, పితలు, నరకానికి యజమానులుగా తయారుచేసేవాడు రావణుడు. కావున ఆ రావణుడిపై ఇప్పుడు విజయం పొందాలి. ఇప్పుడు మీరు మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవుతారు. మీరు ఏమైనా పాత ప్రపంచములో రాజ్యం చేయనున్నారా. మాయపై విజయాన్ని పొంది మళ్ళీ స్వర్గములో రాజ్యం చేయాలి. మాయతో ఓడిపోవడం ద్వారా నరకములోకి వచ్చేస్తారు. ఈ విషయాలను పతిత మనుష్యులెవ్వరూ అర్థం చేయించలేరు. వారు ఎవరినీ పావనంగా చేయలేరు. మొత్తం ప్రపంచము పతితముగా ఉంది. విషం ద్వారా జన్మిస్తారు. దేవీ-దేవతలైతే సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. అక్కడ విషం యొక్క పేరే ఉండదు. భగవంతుడి గురించి ఎవ్వరికీ తెలియదు. మరి వారిని గురువుగా చేసుకోవడము వలన లాభమేముంది? స్వయము వారు భగవంతుడిని కలుసుకోలేరు, ఇతరులను కల్పించలేరు. ఆత్మ పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు… వారిని మళ్ళీ కలిపే ఆ పరమపిత పరమాత్మ కూడా కావాలి. నాటకము ఇప్పుడు పూర్తవుతుంది అని కూడా వారు భావించరు. ఇది డ్రామా, సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు నడుస్తుంది, ఇది రిపీట్ అవ్వాలి. ఈ డ్రామా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు చక్రవర్తిగా అవుతారు. 84 జన్మలను మనం ఎలా తీసుకుంటామో మీకు తెలుసు. ఇది లీప్ యుగము, పురుషోత్తమ యుగము. ఇందులో ఇది అంతిమ జన్మ. ఇప్పుడు తండ్రికి చెందినవారిగా అవ్వాలి. తండ్రి అంటారు – ఓ పిల్లలూ, మీరు నా వారిగా అవ్వండి. ఓ పరమపిత పరమాత్మా అని అంటారు కూడా. లౌకిక తండ్రినైతే ఈ విధంగా అనలేరు. కావున ఇప్పుడు పారలౌకిక తండ్రి అంటారు, నేను వచ్చి ఉన్నాను. ఇకపోతే, మీ ఈ పినతండ్రి, బాబాయి మొదలైనవారందరూ సమాప్తమవ్వనున్నారు. ఈ పాత ప్రపంచము మారుతుంది. ఎదురుగా మహాభారీ మహాభారత యుద్ధము కూడా నిలబడి ఉంది. ఈ అనేక ధర్మాలు వినాశనమవ్వనున్నాయి. ఇది పాత ప్రపంచము, ఇందులో అనేకానేక ధర్మాలు ఉన్నాయి. సత్యయుగములో ఒకే ధర్మం ఉంటుంది. కావున ఇప్పుడు ఈ ప్రపంచము మారనున్నది, అందుకే దీనిపై ప్రీతి జోడించకండి. లౌకిక తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తే పిల్లల మనసులో కొత్త ఇల్లే గుర్తుంటుంది కదా – ఇల్లు తయారవుతుంది, తర్వాత మేము కొత్త ఇంట్లో కూర్చుంటాము. పాతదానిని కూలగొట్టి అంతం చేసేస్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచము వినాశనమవ్వనున్నది. పిల్లలు సాక్షాత్కారము కూడా పొందారు – నిప్పు ఎలా అంటుకుంటుంది, కుండపోత వర్షం కురుస్తుంది, సముద్రము మొదలైనవి ఎలా ఉప్పొంగుతాయి, ఈ సాక్షాత్కారాలన్నీ పొందారు.

బాబా బొంబాయికి వెళ్ళినప్పుడు ఈ బొంబాయి ఇంతకుముందు లేదు అని అర్థం చేయిస్తారు. ఒక చిన్న గ్రామంగా ఉండేది, ఇప్పుడు సముద్రాన్ని ఎండబెట్టారు. చరిత్ర రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇంతటి ఈ బాంబే ఉండదు. సత్యయుగములో బాంబే అన్న గ్రామం ఏమీ ఉండదు. ఈ అమెరికా మొదలైనవి ఏమిటి! ఒక్క బాంబుతోనే అన్నీ అంతమైపోతాయి. హిరోషిమాలో బాంబు పడినప్పుడు ఏమి జరిగింది? నగరానికి నగరమే అంతమైపోయింది. అదైతే ఒక్క బాంబు మాత్రమే. ఇప్పుడైతే చాలా బాంబులను తయారుచేసారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు అని అంటారు కూడా, దీనిని పాత నరకముగా రావణుడు తయారుచేస్తాడు. ఇది భారతవాసులకు తెలియదు. మాయ అందరికీ గాడ్రేజ్ తాళము ఎలా వేసింది అంటే ఇక తెరుచుకోదు. మనుష్యులు ఎంత ధుఃఖితులుగా ఉన్నారు. షావుకారులు సుఖవంతలుగా ఉండవచ్చు కానీ అనారోగ్యులుగా, రోగగ్రస్తులుగా అయితే అవుతారు కదా. ఈరోజు కొడుకు జన్మిస్తాడు, సంతోషము కలుగుతుంది, మళ్ళీ కొడుకు మరణిస్తే దుఃఖం కలుగుతుంది. విధవగా అయి ఏడుస్తూ ఉంటారు. దీనిని దుఃఖధామము అని అంటారు. భారత్ సుఖధామముగా ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచము దుఃఖధామముగా ఉంది. మళ్ళీ తండ్రి సుఖధామముగా తయారుచేస్తారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకోండి అని తండ్రి అంటారు. మరి తప్పకుండా స్మృతి కూడా వారినే చేయవలసి ఉంటుంది, మిగిలిన దేహ సంబంధాలన్నీ దుఃఖాన్ని ఇచ్చేవి. ఒక్క తండ్రి తప్ప సుఖాన్ని ఇచ్చేవారు ఎవరూ ఉండరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు అంటారు – బాబా, మీరు స్వర్గానికి యజమానులుగా తయారుచేసిన ఆ పిల్లలమే మేము, ఇప్పుడు మేము దుఃఖితులుగా ఉన్నాము, మీరైతే దయార్ద్ర హృదయులు. దుఃఖితులుగా ఉన్నారు, అందుకే పిలుస్తారు. సత్యయుగములో సుఖవంతులుగా అవుతారు, అక్కడ ఎవరూ పిలవరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించనే లభించడు. భక్తులు హనుమంతుడిని తలచుకుంటున్నారనుకోండి. అచ్ఛా, హనుమంతుడు ఎక్కడ ఉంటారు? హనుమంతుని కోసం మీరు ఎక్కడకు వెళ్ళాలి. ముక్తి లేక జీవన్ముక్తిధామంలోకి వెళ్ళేందుకు మనుష్యులు భక్తి చేస్తారు. హనుమంతుడు లేక గణేష్ మొదలైనవారిని స్మృతి చేయడం ద్వారా మీరు ఎక్కడికి వెళ్తారు? వారి నివాస స్థానం ఎక్కడ ఉంది? వారి ద్వారా మీకు ఏమి లభించనున్నది? ఏమీ తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తారు, సృష్టిలో సుఖాన్ని ఇచ్చేవారు నేనొక్కడినే. అంతేకానీ, భగవంతుడే సుఖాన్ని ఇస్తారు, భగవంతుడే దుఃఖాన్ని ఇస్తారు, వారే పిల్లలను ఇస్తే సుఖము కలుగుతుంది, పిల్లలను లాక్కుంటే దుఃఖము కలుగుతుంది అని కాదు. కావున తండ్రి అంటారు, నేనైతే సదా సుఖాన్ని ఇస్తాను. మీ నుండి సుఖాన్ని మాయ లాక్కుంటుంది. సత్యయుగములో ఇలా ఉండదు, కొడుకు మరణించడము లేదా ఎవరి పతి అయినా మరణించడము ఉండదు. ఇక్కడ ఈ మాయావీ ప్రపంచములో ఒకసారి ఒకరి కొడుకు, ఒకసారి ఒకరి పతి మరణిస్తూనే ఉంటారు. ఈ వ్యాపారము స్వర్గములో ఉండదు. ఇక్కడైతే నరకము. ఇప్పుడు తండ్రి అంటారు, ఒకవేళ సదా సుఖవంతముగా అవ్వాలని కోరుకుంటే తండ్రికి చెందినవారిగా అవ్వండి. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండూ తమోప్రధానముగా ఉన్నాయి, అంతేకానీ, ఆత్మ నిర్లేపి అని కాదు. ఆత్మలోనే మాలిన్యం చేరుకుంటుంది. ఈ కారణముగా ఇప్పుడు ఆభరణాలు కూడా ఇనుప యుగానికి చెందినవిగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మీరు స్వర్ణిమ యుగానికి చెందినవారిగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. తండ్రి వచ్చి అమరులుగా చేసి అమరపురిలోకి తీసుకువెళ్తారు. ఇక్కడైతే మృత్యులోకము. గీతలో కూడా పదాలు ఉన్నాయి. అమరపురిలో ఆదిమధ్యాంతాలు దుఃఖము ఉండదు. మృత్యులోకములో ఆదిమధ్యాంతాలు దుఃఖము ఉంటుంది. ఇటువంటి దుఃఖధామాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని స్మృతి చేయాలి. మనం వయా శాంతిధామము సుఖధామంలోకి వెళ్తున్నాము. మనం అక్కడి నివాసులము. ఇది కూడా స్వదర్శన చక్రము అయినట్లు కదా. మీ తండ్రిని మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. కన్య తండ్రి ఇంటిని వదిలి అత్తవారింటికి వెళ్ళినప్పుడు, పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళాలి… అని పాడుతారు కదా, ఇది మీ బ్రహ్మా యొక్క పుట్టినిల్లు. ఇప్పుడు మీరు మెట్టినిల్లయిన స్వర్గానికి వెళ్తారు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడ దుఃఖము ఉంది. కన్య కూడా సుఖము కోసము ఇంటిని విడిచిపెడుతుంది. కానీ అక్కడ ఆమెను పతితముగా చేసి దుఃఖితముగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, నేను మిమ్మల్ని పూర్తిగా నయనాలపై కూర్చోబెట్టుకొని స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చి ఉన్నాను. కేవలం నన్ను స్మృతి చేయండి. అక్కడ మీకు దుఃఖమేమీ ఉండదు. శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుందో పిల్లలు చూసారు. ముందే సాక్షాత్కారమవుతుంది. శరీరము విడిచిపెట్టాల్సినప్పుడు ఆ సమయంలో సాక్షాత్కారమవుతుంది – నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారునిగా అవుతాను. అంతే, ఆత్మ శరీరము నుండి బయటకు వచ్చి వెళ్ళి గర్భ మహలులో కూర్చుంటుంది. పిల్లలు జన్మించే సమయంలో ఏ కష్టము ఉండదు. అక్కడ గర్భ మహలులో మీకు సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడైతే గర్భ జైలు కూడా ఉంది మరియు ఎవరైతే దొంగతనాలు, పాపాలు చేస్తారో వారు కూడా గవర్నమెంట్ యొక్క జైలులోకి వెళ్తారు. అక్కడ ఈ రెండు జైళ్ళు ఉండవు. పాపాలు మొదలైనవి ఎవరూ చేయరు. దానిని పుణ్యాత్ముల ప్రపంచము అని అంటారు. కావున తండ్రి స్వర్గములోకి తీసుకువెళ్తారు. ఇంతమంది పురుషార్థము చేస్తున్నారు మరి ఎందుకు మనం కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని సదా సుఖవంతులుగా అవ్వకూడదు అని చూస్తారు. కొందరైతే ఈ కర్మ బంధనము ఎలా వదులుతుంది అని పశ్చాత్తాపపడతారు. పిల్లలు లేకపోతే బాగుండేది అని అంటారు. కొందరు వివాహం చేసుకున్న తర్వాత జ్ఞానంలోకి వస్తారు, వారు, ముందే తెలిసి ఉంటే వివాహం చేసుకోము అని అంటారు. ఇలా చాలామంది రాస్తారు. ఎవరి భాగ్యము ఎప్పుడు తెరుచుకునేది ఉందో, అప్పుడే వస్తారు. అది కూడా ఇష్టపడితే వస్తారు. ఒక వారం రోజులు తండ్రికి పిల్లలుగా అయి చూడండి. నచ్చితే అవ్వండి, లేకపోతే వెళ్ళి లౌకిక తల్లిదండ్రులకు చెందినవారిగా అవ్వండి. ఫీజు అయితే ఏమీ ఉండదు. ఇది శివబాబా భండారము. పుస్తకాలు మొదలైనవేవీ కొనిపించము. కేవలం మురళీ పంపించడం జరుగుతుంది. తండ్రి ఖజానా, వారు ఫీజు ఏం తీసుకుంటారు! అయితే, మంచిగా అనిపిస్తే పేదవారి కోసం కొరకు లిటరేచరును ముద్రింపజేయండి.

భారత్ వంటి దాతృత్వ దేశము ఇంకేదీ లేదు. తండ్రి కూడా వచ్చి భారత్ లోనే దానం చేస్తారు. పిల్లలైన మీరు కూడా తనువు, మనస్సు, ధనములను తండ్రికి అర్పిస్తారు. మహాదానులుగా అవుతారు. ఈ బాబా మహాదానిగా అయ్యారు కదా. ఇంతకుముందు అయితే పరోక్షంగా దానం చేసేవారు. ఇప్పుడు స్వయం ప్రత్యక్షముగా వచ్చారు, ప్రతిఫలముగా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. ఇది చౌక వ్యాపారము కదా. మళ్ళీ అంటారు, ఇప్పుడు మీ సమానముగా తయారుచేయండి, వికారాలను జయించండి, దేహీ అభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. వివస్త్రగా వచ్చాము, వివస్త్రగా వెళ్ళాలి అని పాడుతారు కూడా. మొదటి నంబరులో దేవీ దేవతల ఆత్మలు వచ్చారు. వారి వెనుక రెండవ నంబరువారు వచ్చారు. హెడ్స్ అయితే దేవీ-దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు. ఎవరైతే మొదట వస్తారో మొదట వారే వెళ్ళవలసి ఉంటుంది కూడా. వారిది ఆల్రౌండ్ పాత్ర. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు, ఎవరి భాగ్యములోనైతే ఉంటుందో వారైతే వెంటనే అర్థం చేసుకుంటారు కదా. భాగ్యములో లేకపోతే మనసు నిలవదు. తండ్రి అంటారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, నేనే మీకు తండ్రిని, గాడ్ ఫాదర్ ను. తాబేలు, చేప ఏమైనా గాడ్ అవుతాయా. ఈ విషయాలు తండ్రి తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే సర్వీసబుల్ పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తనువు, మనస్సు, ధనము అన్నింటినీ తండ్రికి అర్పించి మహాదానులుగా అవ్వాలి. తమ సమానముగా తయారుచేసే సేవను కూడా చేయాలి మరియు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి.

2. ఈ పాత ప్రపంచాన్ని దుఃఖధామాన్ని మరిచి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. కర్మబంధనాలలో ఎప్పుడూ చిక్కుకోకూడదు.

వరదానము:-

రావడము మరియు వెళ్ళడము యొక్క అభ్యాసము ద్వారా బంధనముక్తులుగా అయ్యే అతీత, నిర్లిప్త భవ

మొత్తం చదువు లేక జ్ఞానం యొక్క సారము – రావడము మరియు వెళ్ళడము. బుద్ధిలో ఇంటికి వెళ్ళే మరియు రాజ్యంలోకి వచ్చే సంతోషము ఉంది. కానీ ఎవరికైతే సదా వచ్చే మరియు వెళ్ళే అభ్యాసము ఉంటుందో, సంతోషంగా వారే వెళ్తారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అశరీరి స్థితిలో స్థితులవ్వండి మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కర్మాతీతులుగా అవ్వండి – ఈ అభ్యాసము చాలా పక్కాగా ఉండాలి. దీని కోసం ఏ బంధనము తన వైపుకు ఆకర్షించకూడదు. బంధనమే ఆత్మను టైట్ గా చేస్తుంది మరియు టైట్ వస్త్రాన్ని తీయడంలో ఒత్తిడి ఉంటుంది, అందుకే సదా అతీతంగా, నిర్లిప్తంగా ఉండే పాఠాన్ని పక్కా చేసుకోండి.

స్లోగన్:-

సుఖం యొక్క ఖాతాతో సంపన్నంగా ఉన్నట్లయితే మీ ప్రతి అడుగులో అందరికీ సుఖము అనుభూతి అవుతూ ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top