TELUGU MURLI 06-04-2022

06-04-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మాయకు దెబ్బ వేసే అవకాశము లభించే విధంగా ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఒకవేళ శ్రీమతముపై నడవకపోతే మాయ దెబ్బ వేసి ముఖాన్ని తిప్పేస్తుంది’’

ప్రశ్న:-

సూర్యవంశీ రాజధానిలో ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకునేందుకు ఆధారమేమిటి, అది ఎవరికి ప్రాప్తిస్తుంది?

జవాబు:-

సూర్యవంశీ రాజధానిలో ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకునేందుకు ప్రతి అడుగులో శ్రీమతముపై నడవాల్సి ఉంటుంది. తమదంతా తండ్రికి అర్పించవలసి ఉంటుంది. ఎవరైతే పూర్తిగా అర్పణ అవుతారో వారే షావుకార్లుగా అవుతారు. సూర్యవంశీ రాజధానియే ఎయిర్ కండిషన్ వంటిది. సూర్యవంశ పదవిని ప్రాప్తి చేసుకోవడమే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. ఇకపోతే నంబరువారు పదవులైతే ఉండనే ఉన్నాయి.

పాట:-

వారు చాలా అదృష్టవంతులు… (వహ్ బడా ఖుష్ నసీబ్ హై…)

ఓంశాంతి.

ఈ పాట యొక్క అర్థము బ్రాహ్మణ కుల భూషణ పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు, తర్వాత దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతారు. పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, అనంతమైన తండ్రి సమ్ముఖములో ఉన్నారు మరియు వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇంకేం కావాలి. భక్తి మార్గం ఎప్పటి నుండి కొనసాగుతోంది! ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. భక్తి మార్గానికి చెందిన భక్తులు భగవంతుడిని లేదా వధువులు వరుడిని స్మృతి చేస్తారు. కానీ ఆశ్చర్యమేమిటంటే – తండ్రి గురించి తెలియదు. ఇలా ఎప్పుడైనా చూసారా? ప్రేయసికి ప్రియుడి గురించి తెలియకపోతే ఎలా స్మృతి చేయగలరు? భగవంతుడైతే అందరికీ తండ్రి. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు కానీ పరిచయం లేకుండా స్మృతి చేయడం అంతా వ్యర్థము, అందుకే స్మృతి చేయడం వలన లాభమేమీ ఉండదు. స్మృతి చేస్తూ-చేస్తూ ఎవరూ కూడా ఆ లక్ష్యము-ఉద్దేశ్యాన్ని పొందరు. భగవంతుడు ఎవరు, వారి నుండి ఏమి లభిస్తుంది, ఏమీ తెలియవు. ఇన్ని ధర్మాలు ఉన్నాయి. క్రైస్టు, బుద్ధుడు మొదలగు ఉపదేశకులను లేదా ధర్మ స్థాపన చేసేవారిని వారి ఫాలోవర్స్ గుర్తు చేస్తారు, కానీ వారిని స్మృతి చేయడం వలన ఏమి లభించనున్నది! ఏమీ తెలియదు. దీని కన్నా దైహిక చదువు మంచిది. లక్ష్యము-ఉద్దేశ్యమైతే బుద్ధిలో ఉంటుంది కదా. తండ్రి నుండి ఏమి లభిస్తుంది, టీచరు నుండి ఏమి లభిస్తుంది – అది అర్థం చేసుకోగలరు. గురువు నుండి ఏమి లభిస్తుంది – ఇది ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం కలిగింది, మేము తండ్రికి చెందినవారిగా అయ్యాము. బాబా మాకు 5,000 సంవత్సరాల క్రితం వలె వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారు లేదా శాంతిధామానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలూ, మీరు నా నుండి నా వారసత్వాన్ని తీసుకుంటారు కదా. అవును బాబా, ఎందుకు తీసుకోము. అచ్ఛా, చంద్రవంశీ రామ పదవిని పొందడంలో సంతుష్టపడతారా? మీకు ఏమి కావాలి? తండ్రి కానుకను తీసుకొని వచ్చారు. మీరు సూర్యవంశీ లక్ష్మిని వరిస్తారా లేక చంద్రవంశీ సీతనా? శ్రీరాముని పూజారులు శ్రీకృష్ణుని పేరును వినడానికి ఇష్టపడరు. శ్రీరాముడిని త్రేతాలోకి, శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. వారు రాముడు గొప్పవారని భావిస్తారు. ఇలా వారికి పరస్పరంలో గొడవ జరుగుతుంది. ఎలాగైతే చిన్న పిల్లల మధ్య గొడవ జరుగుతుంది కదా.

తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఖచ్చితముగా ఏ విధముగా కల్పక్రితము అర్థం చేయించారో మళ్ళీ అదే విధముగా అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్ళీ వచ్చి వారసత్వం తీసుకుంటున్నారు. అనంతమైన వారసత్వం తీసుకోవడమే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. అది సూర్యవంశీ రాజ్య పదవి. సెకెండ్ గ్రేడ్ చంద్రవంశీయులు. ఎలాగైతే ఎయిర్ కండిషన్ కన్నా ఉన్నతమైనది ఏదీ ఉండదు. ఎయిర్ కండిషన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటుంది కదా. మరి సత్యయుగం యొక్క పూర్తి రాజధానిని ఎయిర్ కండిషన్ అని భావించండి, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్. కావున తండ్రి అంటారు, మీరు ఎయిర్ కండిషన్ సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకుంటారా లేక చంద్రవంశీ ఫస్ట్ క్లాస్ రాజ్యాన్నా? దాని కన్నా కూడా తక్కువ అయితే తర్వాత సెకండ్ క్లాస్ లో నంబరువారుగా వారసులుగా కండి, అప్పుడు మీరు చాలా వెనుక వచ్చి రాజ్యాన్ని పొందుతారు లేదంటే థర్డ్ క్లాస్ ప్రజలుగా కండి. కానీ అందులో కూడా టికెట్ రిజర్వు అవుతుంది. ఫస్ట్ క్లాస్ రిజర్వ్, సెకండ్ క్లాస్ రిజర్వ్. నంబరువారుగా పదవులైతే ఉంటాయి కదా. సుఖమైతే అక్కడ ఉండనే ఉంటుంది. ఇకపోతే, కంపార్ట్ మెంట్లు అయితే వేర్వేరుగా ఉంటాయి. షావుకార్లు ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకుంటారు. మీలో షావుకార్లుగా ఎవరు అవుతారు? ఎవరైతే అంతా తండ్రికి ఇచ్చేస్తారో. బాబా, ఇదంతా మీది. భారత్ లోనే ఈ మహిమ గాయనం చేయబడింది. వ్యాపారి, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు… ఈ మహిమ తండ్రిదే, శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుడైతే వారసత్వాన్ని తీసుకున్నారు. సత్యయుగములో ప్రారబ్ధాన్ని పొందారు. వారు కూడా తండ్రికి చెందినవానిగా అయ్యారు. ప్రారబ్ధాన్ని ఎక్కడి నుండో పొంది ఉంటారు కదా. లక్ష్మీ-నారాయణులు సత్యయుగములో ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు, తప్పకుండా వారు గతంలో ప్రారబ్ధాన్ని తయారుచేసుకొని ఉంటారు కదా. భారత్ కు చాలా మహిమ ఉంది, భారత్ వంటి ఉన్నతమైన దేశము ఇంకేదీ ఉండజాలదు. భారత్ యే పరమపిత పరమాత్మ యొక్క జన్మ స్థానము. ఈ రహస్యము ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పరమాత్మయే అందరికీ అర్ధకల్పం కోసం సుఖ-శాంతులను ఇస్తారు. భారత్ నంబరువన్ తీర్థ స్థానము. కానీ గీతలో శ్రీకృష్ణుని పేరును రాసారు, అందుకే వీరి పదవి తగ్గిపోయింది. లేదంటే మనుష్యులందరూ ఆ తండ్రినే నమ్మేవారు, ఇంకెవరి పైనా పుష్పాలు అర్పించేవారు కాదు. సర్వుల పతిత-పావనుడు తండ్రి, సోమనాథ మందిరము వారిదే. శివుడికే అందరూ వచ్చి తల వంచి నమస్కరిస్తారు. కానీ డ్రామానుసారంగా ఒక్క తండ్రిని మర్చిపోవడం వలన సృష్టి పరిస్థితి ఎలా అయిపోతుంది, అందుకే శివబాబా వస్తారు. ఎవరో ఒకరు నిమిత్తంగా అయితే అవుతారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, అశరీరి భవ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనైన నేను ఎవరి సంతానాన్ని, ఇది ఎవరికీ తెలియదు. అద్భుతం కదా. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అంటారు కూడా. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఇది ఎవరికీ తెలియదు. ఇది 5,000 సంవత్సరాల విషయము, తండ్రియే వచ్చి కొత్త ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. సత్యయుగం ఆయువు లక్షల సంవత్సరాలైతే కాదు.

తండ్రి పిల్లలకు ఎంత సహజము చేసి అర్థం చేయిస్తారు – కేవలం స్మృతి చేయండి, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా అవ్వండి. విష్ణువుకే అన్ని అలంకారాలను చూపించారు. శంఖాన్ని కూడా చూపించారు, కమల పుష్పాన్ని కూడా చూపించారు. వాస్తవానికి దేవతలకు ఈ అలంకారాలు ఇవ్వడం జరుగుతుందా ఏమిటి. ఇవి ఎంత గుహ్యమైన, గంభీరమైన విషయాలు. ఇవి బ్రాహ్మణుల అలంకారాలు కానీ బ్రాహ్మణులకు ఎలా చూపించాలి. ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నారు, రేపు శూద్రులుగా అయిపోతారు. బ్రహ్మాకుమారుల నుండి శూద్ర కుమారులుగా అయిపోతారు. మాయ ఆలస్యం చేయదు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే, తండ్రి శ్రీమతముపై నడవకపోతే, బుద్ధి పాడైనట్లయితే మాయ మంచి రీతిలో దెబ్బ వేసి ముఖాన్ని తిప్పేస్తుంది. మనుష్యులు కోపంలోకి వచ్చి అంటారు కదా – చెంపదెబ్బ వేసి ముఖాన్ని తిప్పేస్తాను అని. మరి మాయ కూడా అటువంటిదే. తండ్రిని మర్చిపోతే వెంటనే మాయ ఒక్క క్షణములో దెబ్బ వేసి ముఖం తిప్పేస్తుంది. ఎలాగైతే ఒక్క క్షణములో జీవన్ముక్తిని పొందుతారో, అలాగే క్షణములో జీవన్ముక్తిని సమాప్తం చేసుకుంటారు. ఎంత మంచి-మంచి వారిని మాయ పట్టుకుంటుంది. వీరు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారు అని చూసినట్లయితే వెంటనే దెబ్బ వేస్తుంది. తండ్రి అయితే పిల్లల ముఖాన్ని పాత ప్రపంచము నుండి తిప్పి కొత్త ప్రపంచము వైపుకు ఉంచుతారు.

లౌకిక తండ్రి ఎవరైనా పేదవారిగా ఉంటూ, పాత గుడిసెలో ఉంటూ, మళ్ళీ కొత్తది తయారుచేస్తున్నట్లయితే, ఇప్పుడు కొత్త ఇల్లు తయారవుతుంది, మేము అక్కడ కూర్చొంటాము, ఈ పాతదానిని కూలగొట్టేస్తాము అని పిల్లల బుద్ధిలో కూర్చుంటుంది. మీ కోసం కూడా ఇప్పుడు తండ్రి అరచేతిలో స్వర్గాన్ని లేక వైకుంఠాన్ని తీసుకువచ్చారు. ప్రియమైన పిల్లలూ… అని అంటారు, ఆత్మలతో మాట్లాడుతారు. ఈ కనుల ద్వారా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు కూడా. కాశ్మీరులో బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. శ్రాద్ధము మొదలైనవి కూడా అక్కడ తినిపిస్తారు, బ్రాహ్మణులలోకి ఆత్మను పిలుస్తారు, ఈ సాక్షాత్కారాలన్నింటి రహస్యము కూడా ఉంది. ఆత్మ ఎవరి నుండైనా బయటకు వచ్చేస్తుందని కాదు. తమ పెద్దవారి ఆత్మలను పిలుస్తారు. వారి కోసం అన్నీ తయారుచేసి పెడతారు. ఫలానావారి ఆత్మ వస్తుందని భావిస్తారు. తర్వాత వారిని అడగడం కూడా జరుగుతుంది, ఇంతకుముందు ఆత్మ మాట్లాడేది. అప్పుడు వారిని అడగడం జరుగుతుంది, మీరు సంతోషముగా, సంతుష్టంగా ఉన్నారా? అని, అది వినిపిస్తుంది. ఇది కూడా డ్రామానుసారంగా నడుస్తుంది. నేను ఫలానా ఇంట్లో జన్మ తీసుకున్నానని కూడా అప్పుడప్పుడు చెప్తారు. ఈ సాక్షాత్కారాలన్నింటి విధానము డ్రామాలో తయారై ఉంది, అది రిపీట్ అవుతుంది. ఇకపోతే, ఆత్మ ఏమీ రాదు. ఇంతకుముందు టేబుల్ లోకి కూడా పిలిచేవారు. బాబాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు టేబుల్ లోకైతే ఆత్మ రాలేదు. ఎవరు ఏది చేసారో, అదంతా డ్రామాలో ఉంది, అలా జరిగింది. డ్రామాను ఎంత మంచి రీతిలో పట్టుకోవలసి ఉంటుంది. భోగ్ పెట్టడం జరుగుతుంది, ఆత్మను పిలవడం జరుగుతుంది. ఇదంతా డ్రామాలో రచించబడి ఉంది. ఇందులో సంశయము అనే విషయమేమీ లేదు. కొత్త వ్యక్తులు అర్థం చేసుకోని కారణముగా తికమకపడతారు. తండ్రి ఇంద్రజాలికుడు కూడా కదా. నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను అని అర్థం చేయిస్తారు. డ్రామాలో లేకుండా ఏమైనా చేయగలను అని కాదు. అలా కాదు. పిల్లలు వ్యాధిగ్రస్థులైతే, నేను వారిని సరిచేస్తాను, ఆపరేషన్ నుండి విడిపిస్తానని కాదు. అలా కాదు. కర్మభోగమైతే అందరూ అనుభవించవలసిందే. మీ పైన అయితే భారము ఎంతో ఉంది ఎందుకంటే మీరు అందరికన్నా పాతవారు. సతోప్రధానము నుండి పూర్తిగా తమోప్రధానముగా అయ్యారు.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు, కావున తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీకు తెలుసు, కల్ప-కల్పము మనము డ్రామా అనుసారంగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. సూర్యవంశం, చంద్రవంశాలకు చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు తప్పకుండా వస్తారు. ఎవరైతే దేవీ-దేవతలుగా ఉండేవారో, వారు మళ్ళీ శూద్రులుగా అయ్యారు, మళ్ళీ వారే బ్రాహ్మణులుగా అయి దైవీ సంప్రదాయమువారిగా అవుతారు. ఈ విషయాలను తండ్రి తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రికి పిల్లలు ఎంతో మధురముగా అనిపిస్తారు! మీరు అదే కల్పక్రితపు నా పిల్లలు అని వారు అంటారు. నేను కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఎంత అద్భుతమైన విషయాలు! నిరాకార భగవానువాచ – శరీరము ద్వారానే మాట్లాడుతారు కదా. శరీరము వేరైతే ఆత్మ మాట్లాడలేదు. ఆత్మ వేరైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, అశరీరి భవ. ప్రాణాయామము మొదలైనవి చేయాలని కాదు. అలా కాదు. ఆత్మనైన నేను అవినాశీని, నా ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉందని భావించాలి. తండ్రి స్వయముగా అంటారు, నా ఆత్మ కూడా ఏ పాత్రనైతే అభినయిస్తుందో, ఆ పాత్ర అంతా నిండి ఉంది. భక్తి మార్గంలో కూడా అదే పాత్ర కొనసాగుతుంది. ఎవరైనా మద్యం తాగి ఉండకపోతే, దాని రుచి ఎలా తెలుస్తుంది. జ్ఞానం కూడా ఎప్పుడైతే తీసుకుంటారో, అప్పుడే తెలుస్తుంది. జ్ఞానంతోనే సద్గతి జరుగుతుంది. తండ్రి అంటారు, నేను సర్వుల సద్గతి దాతను. సర్వోదయ లీడర్స్ ఉన్నారు కదా. ఎన్నో రకరకాలవారు ఉన్నారు! వాస్తవానికైతే సర్వులపై దయ చూపించేవారు తండ్రి కదా. ఓ భగవంతుడా, దయ చూపించండి అని అందరూ అంటారు. కావున వారు అందరిపై దయ చూపిస్తారు. మిగిలినవారంతా స్వయముపై దయ చూపించుకునేవారు. తండ్రి అయితే మొత్తం ప్రపంచాన్ని సతోప్రధానముగా చేస్తారు. అందులో తత్వాలు కూడా వచ్చేస్తాయి. ఈ పని ఒక్క పరమాత్మదే. కావున సర్వోదయ అన్నదానికి ఎంత పెద్ద అర్థం ఉంది, పూర్తిగా సర్వుల పైనా దయ చూపిస్తారు. స్వర్గ స్థాపనలో ఎవరూ కూడా దుఃఖితులుగా ఉండరు. అక్కడ నంబరువన్ ఫర్నీచర్, వైభవాలు మొదలైనవి లభిస్తాయి. దుఃఖాన్ని ఇచ్చే జంతువులు, ఈగలు, దోమలు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ కూడా గొప్ప వ్యక్తుల ఇంట్లో ఎంత శుభ్రత ఉంటుంది! ఎప్పుడూ ఈగను కూడా మీరు చూడరు. ఏ ఈగ దూరలేదు. ఈ విధంగా అశుద్ధం చేసే ఏ వస్తువుకు స్వర్గంలో ఉండే శక్తి ఉండదు. అలా ఉండదు. సహజసిద్ధమైన పుష్పాలు మొదలైనవాటి సుగంధము ఉంటుంది. మీకు సూక్ష్మవతనములో శివబాబా శూభీ రసాన్ని కూడా తాగిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనములోనైతే ఏమీ లేదు. ఇవన్నీ సాక్షాత్కారాలు. వైకుంఠములో ఎంత మంచి ఫలాలు, తోటలు మొదలైనవి ఉంటాయి! సూక్ష్మవతనములో తోటలు ఏమైనా ఉంటాయా. ఇవన్నీ సాక్షాత్కారాలు. ఇక్కడ కూర్చొని ఉండగానే మీరు అన్ని సాక్షాత్కారాలు చేసుకుంటారు. పాట కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. మీకు తెలుసు, మనకు తండ్రి లభించారు, ఇంకేమి కావాలి! అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు కావున తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మతము ప్రసిద్ధమైనది. శ్రీమతముతో మనం శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా అవుతాము.

ఇది కాకి రెట్ట సమానమైన సుఖమని సన్యాసులు అంటారు. కానీ సత్యయుగములో సదా సుఖం ఉండేదని వారికి తెలియదు. బాల్యములో ఈ రాధే-కృష్ణులు ఉంటారు, వీరి చరిత్ర మొదలైనది ఏమీ లేదు. స్వర్గములో పిల్లలు మంచిగానే ఉంటారు. మురళీతో డాన్స్ మొదలైనవి చేస్తూ ఉంటారు. అంతేకానీ, జ్ఞానాన్ని వినిపించరు. శ్రీకృష్ణుడికి మురళీని చూపించారు, మరి సరస్వతి ఏమైనట్లు. సరస్వతికైతే సితారను చూపిస్తారు కావున వారే పెద్దవారైనట్లు కదా! ఇదంతా భక్తి మార్గము, బొమ్మలాట. దేవీ-దేవతల మూర్తులను తయారుచేసి, పూజ మొదలైనవి చేసి ఆ తర్వాత ముంచేస్తారు. ఈ విషయంపై మీ పాట కూడా ఒకటి తయారుచేయబడి ఉంది, దీనిని అంధ విశ్వాసమని అంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి ఒక్కరు ఈ డ్రామాకు వశమై ఉన్నారు, ఈ డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా సంశయం ఉత్పన్నమవ్వకూడదు. డ్రామాలోని ప్రతి రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుని స్థిరంగా ఉండాలి.

2. స్వయాన్ని అవినాశీ ఆత్మగా భావిస్తూ ఈ శరీరం నుండి వేరై అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి.

వరదానము:-

చేయించేవారి స్మృతి ద్వారా అతి పెద్ద కార్యాన్ని సహజము చేసే నిమిత్తులుగా, చేసేవారిగా కండి

బాప్ దాదా స్థాపన యొక్క అతి పెద్ద కార్యాన్ని స్వయం చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా చేసేవారైన పిల్లల ద్వారా చేయిస్తున్నారు. కరన్-కరావన్ హార్ (చేసేవారు-చేయించేవారు) ఈ పదములో తండ్రి మరియు పిల్లలు ఇద్దరూ కంబైండుగా ఉన్నారు. చేతులు పిల్లలవి మరియు పని తండ్రిది. చేతులను చాచే గోల్డెన్ ఛాన్సు పిల్లలకే లభించింది. కానీ చేయించేవారు చేయిస్తున్నారు, నిమిత్తంగా చేసి నడిపిస్తున్నారు అన్నదే అనుభవం చేస్తారు. ప్రతి కర్మలో చేయించేవారి రూపములో సహచరునిగా ఉన్నారు.

స్లోగన్:-

ఎవరైతే అర్జీ ఇచ్చేందుకు బదులుగా సదా సంతుష్టంగా ఉంటారో, వారే జ్ఞానీ ఆత్మలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top