TELUGU MURLI 05-04-2023

05-04-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – ఇతరులకు అర్థం చేయించే సేవను చేస్తూ ఉండండి, జ్ఞాన ధనాన్ని దానం చేసినట్లయితే అపారమైన సంతోషముంటుంది, సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి, తండ్రి స్మృతిని మర్చిపోరు’’

ప్రశ్న:-

తండ్రి పిల్లలైన మీకు ఆత్మిక డ్రిల్ ను ఎందుకు నేర్పిస్తారు?

జవాబు:-

పహల్వాన్లుగా తయారుచేయడానికి. ఎంతగా మీరు తండ్రి స్మృతిలో ఉంటారో, చదువుపై ధ్యానం ఉంచుతారో, అంతగా మీలో శక్తి వస్తూ ఉంటుంది. ఈ బలంతోనే మీరు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మీరు స్థూలమైన ఆయుధాలు మొదలైనవేవీ ఉపయోగించరు, స్వదర్శన చక్రంతో మాయ మెడను ఖండిస్తారు – ఇది అహింసాత్మకమైన యుద్ధము.

పాట:-

బాల్యపు రోజులను మర్చిపోకండి… (బచ్పన్ కే దిన్ భులా నా దేనా…)

ఓంశాంతి.

పిల్లలు ఈ పాట యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. తండ్రి చేస్తూ-చేయించేవారు కదా. కావున ఇటువంటి పాటలను కూడా బాబా పిల్లల కోసం తయారు చేయించారు. తండ్రి పిల్లలకు ఏమని చెప్తారంటే – అనంతమైన తల్లిదండ్రులకు పిల్లలుగా అయ్యాక మళ్ళీ మర్చిపోకండి. ఈ స్మృతి సుదీర్ఘమైనది. స్మృతి చేస్తూనే ఉండాలి. తల్లిదండ్రులు అని అంటున్నప్పుడు మరి తండ్రిని తప్పకుండా గుర్తు చేయాలి. తల్లిదండ్రుల స్మృతి అయితే మొదట ఉంటుంది, ఆ తర్వాత వారసత్వం కోసం తండ్రినే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దైవీ స్వరాజ్యము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము అని వ్రాయబడి కూడా ఉంది. పరమపిత పరమాత్మ విశ్వ రచయిత, కావున తప్పకుండా స్వర్గాన్ని, కొత్త ప్రపంచాన్నే రచిస్తారు. తండ్రి ఎప్పుడూ కూడా – నేను పాత ఇంటిని తయారుచేస్తాను అని అనరు. ఎల్లప్పుడూ కొత్త ఇంటినే తయారుచేస్తారు. పాతదానిని తయారుచేసే మాట ఎప్పుడూ వెలువడదు. అనంతమైన తండ్రి కూడా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు. ఇప్పుడు పిల్లలకు తెలుసు – మనం తల్లిదండ్రుల నుండి వారసత్వాన్ని పొందేందుకు శ్రీమతంపై నడుస్తున్నాము. ఇది బుద్ధి యొక్క యాత్ర. ఆ దైహిక యాత్రలను జన్మ-జన్మలుగా చేస్తూ వచ్చారు మరియు ఘడియ-ఘడియ చేస్తూనే ఉంటారు. ఈ ఆత్మిక యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కావున యాత్రికులు మార్గదర్శకుడిని ఎప్పుడూ మర్చిపోలేరు మరియు పిల్లలు తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోలేరు. మీరు పాండవ సైన్యము, సుప్రీమ్ పండా (ఉన్నతమైన మార్గదర్శకుడు) శివబాబా. మీరు వారి పిల్లలు. బద్రీనాథ్ లేక అమరనాథ్ వద్దకు వెళ్ళినప్పుడు బుద్ధిలో యాత్రనే గుర్తుంటుంది. ఏ విధంగానైతే విదేశాల నుండి తిరిగి వచ్చినప్పుడు తమ జన్మస్థలమే గుర్తుంటుంది. మేము ఇంటికి వెళ్తున్నాము అన్న సంతోషముంటుంది. అదే విధంగా పిల్లలైన మీకు కూడా తెలుసు – మా అనంతమైన ఇంటికి, స్వీట్ హోమ్ (మధురమైన ఇంటి) కి వెళ్తున్నాము అని. వికర్మాజీతులుగా తప్పకుండా అవ్వాలి. ఇది తండ్రే వచ్చి నేర్పిస్తారు. వారంటారు – స్మృతి లేకుండా లేక యోగం లేకుండా మీ వికర్మలు వినాశనమవ్వలేవు. యోగానికి చాలా మహిమ ఉంది. ప్రాచీన భారత్ కు సంబంధించిన యోగము అతి పురాతనమైనదని మహిమ చేయబడింది. సత్యయుగము కొత్త ప్రపంచము. కావున ఈ సమయంలో పురాతన ప్రపంచములో పురాతన యోగాన్ని నేర్పిస్తారు. యోగానికి చాలా మహిమ ఉంది. తండ్రి ఈ యోగాన్ని నేర్పించి వెళ్తారు, మళ్ళీ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. మీరు అంటారు – ప్రాచీన యోగము మనుష్యులు, మనుష్యులకు ఎప్పుడూ నేర్పించలేరు. మిగిలిన అనేక రకాల యోగాలను మనుష్యులు, మనుష్యులకు నేర్పిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, అందరి యొక్క సత్యాతి-సత్యమైన తండ్రి ఒక్కరు మరియు అందరికీ తల్లి జగదాంబ. ఆ మాటకొస్తే ఫాదర్ అని అందరినీ అంటూ ఉంటారు. మునిసిపాలిటీ చైర్మన్ ను కూడా ఫాదర్ అని అంటారు. అలాగైతే మళ్ళీ ఎంతోమంది అయిపోతారు. గాడ్ ఫాదర్ ఒక్కరే. వారు రచయిత. సృష్టి కూడా ఒక్కటే. అలాగని కింద లేక పైన ఏదో సృష్టి ఉందని కాదు. మనుష్యులు చంద్రుని వద్దకు, నక్షత్రాల వద్దకు వెళ్ళి ప్లాట్లు కొనాలని ఎంతగా ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే అతిలోకి వెళ్తారో, ఎంత బుర్ర బద్దలగొట్టుకున్నా సరే అప్పుడు వినాశనమవుతుంది.

ఇప్పుడు తండ్రి అంటారు – గారాబాల పిల్లలూ, బాల్యాన్ని మర్చిపోకండి. ఇక్కడ మొదట తండ్రికి పిల్లలుగా అవుతారు. ఆ తండ్రే మళ్ళీ శిక్షకునిగా కూడా అవుతారు. వారసత్వాన్ని ఇచ్చేవారు ఒకే ఒక్క తండ్రి. సన్యాసులకైతే తల్లిదండ్రులు ఉండరు. వారికి ఆస్తి లభించదు. లౌకిక తండ్రి నుండైతే అందరికీ వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి ఒక్కరే. వారిని రచయిత అని అంటారు. తండ్రి అంటారు – నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. నా మహిమను కూడా చేస్తారు. నేను సత్-చిత్-ఆనంద స్వరూపుడను. తండ్రి మహిమ పూర్తిగా వేరు అనైతే అర్థం చేసుకున్నారు, ఇంకెవ్వరికీ ఆ విధంగా మహిమ చేయలేరు. విశ్వానికి యజమానులైన లక్ష్మీ-నారాయణుల మహిమ పూర్తిగా వేరు. సర్వగుణ సంపన్నులు… అహింసా పరమో ధర్మము, మర్యాదా పురుషోత్తములు అని వారి మహిమను చేస్తారు. మొదటి నంబరులో స్వర్గ మహారాజు, మహారాణి యొక్క మహిమ ఉంటుంది. ఆ రాజ్యమే అలా ఉంటుంది. యథా రాజా రాణి తథా ప్రజా. అక్కడ దుఃఖము అన్న మాట ఉండదు. ప్రజలకు కూడా దుఃఖము అన్న మాట ఉండదు. ఇటువంటి ప్రపంచాన్ని తప్పకుండా పరమపిత పరమాత్మనే రచిస్తారు. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. అయితే ఇంగ్లీషు వారు హెవెన్ అన్న పదాన్ని ఉపయోగిస్తారు కానీ ఆ హెవెన్ అంటే ఏమిటో తెలియదు. భారత్ యే హెవెన్ (స్వర్గము) గా ఉండేది. భారత్ కు చాలా గొప్ప మహిమ ఉంది. రావణుడు మీ శత్రువు. మీ అనంతమైన రాజ్యాన్ని పోగొట్టేది ఈ మాయ శత్రువు. అర్ధకల్పం నుండి మీరు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకుంటూ-పోగొట్టుకుంటూ మీరు పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు. మళ్ళీ మీకే రాజ్య భాగ్యము లభిస్తుంది. మిమ్మల్నే హీరో-హీరోయిన్ అని అంటారు. ఒక్క హీరో-హీరోయిన్, ఆ తర్వాత వారి వంశావళి, మీరంతా హీరో-హీరోయిన్ గా అవుతారు అనగా మొత్తం విశ్వంపైన మీరు విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు హీరో-హీరోయిన్ యొక్క పాత్రను అభినయిస్తున్నారు. మొత్తం విశ్వమంతటిలో తండ్రి మీకు హీరో-హీరోయిన్ అన్న టైటిల్ ను ఇప్పిస్తున్నారు. మీరు శివ శక్తి సైన్యము. యోగబలంతో మనం స్వర్గాన్ని తయారుచేస్తామని, మళ్ళీ స్వర్గంలో మనం రాజ్యం చేస్తామని మీకు తెలుసు. కానీ మాయ ఎటువంటిదంటే మరపింపజేస్తుంది. ఏ విధంగానైతే క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందో, అలాగే మాయ కూడా మళ్ళీ క్షణంలో మరపింపజేస్తుంది. జీవన్ముక్తికి వీడ్కోలు చెప్పి క్షణంలో మరణిస్తారు. తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు – పిల్లలూ, జీవితం యొక్క యాత్ర సుదీర్ఘమైనది. తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఏ తల్లిదండ్రుల నుండైతే అనంతమైన వారసత్వం లభిస్తుందో, వారి నుండి ఒకవేళ మొహం తిప్పుకున్నట్లయితే ఇక అటు వైపుకు వెళ్ళిపోతారు. పిల్లలు లక్నో లో భూల్-భులయ్యా (బయటకు వచ్చే దారి తెలియని ఆట) ను చూసి ఉంటారు, లోపలికి వెళ్ళడంతో మనుష్యులు తికమకపడతారు. ఇది కూడా అలాంటిదే. తండ్రిని మరియు తండ్రి యొక్క ఇంటిని మర్చిపోవడం వలన ఎదురుదెబ్బలు తింటూ, తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. మార్గం చూపించేవారైతే పైన నిలబడి ఉన్నారు.

తండ్రి అంటారు – ఇప్పుడు మీరు శ్రీమతం అనుసారంగా మాయపై విజయాన్ని పొందేటువంటి పురుషార్థము చేస్తున్నారు. అలాగని ఈరోజు తల్లి-తండ్రి అని అంటూ రేపు మళ్ళీ వారిని మర్చిపోవడం కాదు. ఇక్కడ ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో జోడించాలి. భక్తి మార్గంలో, నేను బలిహారమవుతాను, సమర్పణ అవుతాను… అని పాడుతారు కూడా. శ్రీకృష్ణుడి పేరును ఉపయోగిస్తారు. నిజానికి శ్రీకృష్ణుని విషయమే లేదు. ఇది ఉన్నదే రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివుడిని అంటారు, ఇంత చిన్న విషయాన్ని కూడా మనుష్యులు అర్థం చేసుకోరు. గీతను బాబా ఎక్కువగా చదివారు. కానీ ఇంతకుముందు ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. అందులో భగవానువాచ వ్రాయబడి ఉన్నట్లు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని మళ్ళీ కృష్ణ యజ్ఞము అని అంటారు. రుద్రుడు కూడా శ్రీకృష్ణుని అవతారమే అని అంటూ విషయాన్ని ఎగరగొట్టేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను కావున రాజ్యం చేయడానికి తప్పకుండా కొత్త సృష్టి కావాలి. దీపావళి నాడు లక్ష్మిని ఆహ్వానిస్తారు, అప్పుడు ఎంతగా శుభ్రము మొదలైనవి చేస్తారు. అవి భక్తి మార్గపు ఆచార-వ్యవహారాలు. ఇక్కడైతే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు కావున తప్పకుండా పూర్తిగా కొత్త సృష్టి కావాలి. దాని కోసమే పురాతన ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది అని గీతలో పూర్తిగా స్పష్టంగా ఉంది. తండ్రి అనంతమైన సృష్టిని రచించేవారు. వారంటారు – పిల్లలూ, తండ్రినైన నన్ను మర్చిపోకండి. ఈరోజు నవ్వుతారు, రేపు తండ్రిని మరచిపోయారంటే ఇక సమాప్తమైపోతుంది. అప్పుడిక ఎంత ఏడవాల్సి ఉంటుందంటే, ఆ విధంగా ఎప్పుడూ ఏడ్చి ఉండకపోవచ్చు. రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, చాలా నష్టం కలుగుతుంది. నష్టపోయిన మనిషి ముఖం పాలిపోతుంది. కావున తండ్రి అంటారు – పారలౌకిక తండ్రిని మరియు వారసత్వాన్ని మర్చిపోకండి. ఇతరులకు అర్థం చేయించే సేవ చేస్తూ ఉండండి. సేవలో బిజీగా ఉండడం ద్వారా మళ్ళీ మరచిపోరు. ధనము ఇచ్చినా ధనము తరగకూడదు, ఎంతగా దానం చేస్తారో అంతగా సంతోషపు పాదరసము ఎక్కుతుంది. ఇతరుల ఆశీర్వాదాలు మీ శిరస్సుపై ఉంటాయి. ఈ విధంగా స్వర్గం యొక్క మార్గాన్ని చూపించే మార్గదర్శకుడిపైన బలిహారమవ్వాలి అని అంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా తండ్రికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. తండ్రి అంటారు – అనంతమైన శాంతిని సదా కాలం కోసం ఇచ్చేవాడిని నేనే. నేను మీకు ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే దాని వలన ఎప్పటికీ మీకు దుఃఖము, అశాంతి కలగదు. కర్మల గతి చాలా సూక్ష్మమైనది. తండ్రి అంటారు, నేను మీకు కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తాను. సత్యయుగములో కర్మలు వికర్మలుగా అవ్వవు, కర్మలు అకర్మలుగా ఉంటాయి ఎందుకంటే అక్కడ మాయ ఉండదు. ఇప్పుడిది మాయా రాజ్యము కావున కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు మీరు డ్రిల్ నేర్చుకుంటున్నారు మరియు పహల్వాన్లుగా అవుతున్నారు. ఈ చదువునైతే అంతిమం వరకు చదవాలి. ఎంతగా చదువుతారో అంతగా శక్తి లభిస్తుంది, వృద్ధిని పొందుతూ ఉంటారు. ప్రతి మఠములో-మార్గములో మొదట ఒకరు వస్తారు, ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజుల్లో ప్రపంచంలో అంధవిశ్వాసం చాలా ఉంది, ఇక్కడ ఇది చదువు, ఇందులో అంధవిశ్వాసం యొక్క విషయమేమీ లేదు. వారు ఒకే ఒక్క లెక్చర్ ద్వారా ఎంతమందిని బౌద్ధులుగా లేక క్రిస్టియన్లుగా తయారుచేస్తారు. ఫాదర్లే ఎన్నో లెక్చర్లు చేస్తారు, దానితో అనేకమంది క్రిస్టియన్లుగా అవుతారు. ఇక్కడ ఆ విషయము లేదు. ఇక్కడ మాయతో యుద్ధం చేయాలి, దీనిని యుద్ధ స్థలము అని అంటారు. భగవంతుడు వచ్చి హింసను ఏమైనా నేర్పిస్తారా. అహింసా బలము కావాలని అంటారు. కానీ హింసాత్మకమైన మనుష్యులు ఎప్పుడూ అహింసను నేర్పించలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనం తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు పూర్తి పురుషార్థం చేస్తున్నాము. ఈ రాజధాని స్థాపనవుతుంది. మాలను తిప్పుతూ రామ-రామ అని అంటూ ఉంటారు. త్రేతా అంతిమం వరకు 16,108 మంది రాకుమారులు, రాకుమారీలు తయారవుతారు. ఇందులో ఎనిమిది మంది ముఖ్యమైనవారు. అష్ట రత్నాలకు చాలా మహిమ ఉంది. దీని రహస్యమేమిటో మనుష్యులు ఏమైనా అర్థం చేసుకోగలరా. 8 మంది పాస్ విత్ ఆనర్లుగా అవుతారు, అస్సలు శిక్షలను అనుభవించరు. మిగిలిన 100 మంది ఎంతో కొంత శిక్షను అనుభవిస్తారు. తండ్రి అంటారు – పిల్లలూ, అలసిపోకండి, ఓ రాత్రి ప్రయాణీకులారా, ఇప్పుడు మనం రాత్రిని దాటి పగలులోకి వెళ్తాము. బాబా కూడా సంగమంలో వస్తారు. అర్ధకల్పం యొక్క రాత్రి పూర్తవుతుంది కావున తండ్రి వస్తారు, అందుకే శివరాత్రి అని అంటారు. శివబాబా జన్మపత్రి గురించి మీరు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. బ్రహ్మా రాత్రి మరియు బ్రహ్మా పగలు అనంతమైనవిగా గాయనం చేయబడ్డాయి. ఘోరమైన అంధకారం నుండి అపారమైన ప్రకాశము వస్తుంది. తండ్రి – అంతిమంలో, ఎప్పుడైతే రాత్రి పూర్తి అయ్యి పగలు వస్తుందో అప్పుడు వస్తారు. కావున బ్రహ్మాది అనంతమైన రాత్రి. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. బాబా స్వయంగా అంటారు – నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. వీరికి తమ జన్మల గురించి తెలియదు, బ్రహ్మా మరియు బి.కే.లు ఇన్ని జన్మలు తీసుకున్నారని నేను తెలియజేస్తాను. ఈ విషయాలన్నింటినీ కల్పపూర్వం వారే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం తండ్రిని తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అయ్యాము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము.

ఆత్మలకు తండ్రి ఒక్కరే. బ్రహ్మా కూడా శివబాబా యొక్క సంతానమే. దత్తత తీసుకుంటారు కదా. నేను వీరిలోకి ప్రవేశిస్తాను అని వారు స్వయం అంటారు. ఇంకెవరూ ఈ మాటలను మాట్లాడలేరు. తండ్రి అంటారు – గారాబాల పిల్లలూ, తండ్రిని ఎప్పుడూ మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోయినట్లయితే స్వర్గ వారసత్వాన్ని పోగొట్టుకుంటారు, ఆ తర్వాత ఏడవాల్సి ఉంటుంది. ఇది కల్ప-కల్పపు ఆట. కల్ప-కల్పమూ ఈ విధంగా చేస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జీవితం యొక్క సుదీర్ఘమైన యాత్రలో అలసిపోకూడదు. తల్లిదండ్రుల నుండి ఎప్పుడూ మొహం తిప్పుకోకూడదు. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి.

2. స్వీట్ హోమ్ (మధురమైన ఇంటి) కి వెళ్ళే కన్నా ముందు వికర్మాజీతులుగా తప్పకుండా అవ్వాలి. శ్రీమతముపై బుద్ధి యొక్క యాత్రను చేస్తూ ఉండాలి.

వరదానము:-

తోడుగా ఉంటాము, తోడుగా జీవిస్తాము… ఈ వాగ్దానం యొక్క స్మృతి ద్వారా కంబైండుగా ఉండే సహజయోగీ భవ

పిల్లలైన మీ వాగ్దానము ఏమిటంటే – తోడుగా ఉంటాము, తోడుగా జీవిస్తాము, తోడుగా నడుస్తాము… ఈ వాగ్దానాన్ని స్మృతిలో ఉంచుకుని తండ్రి మరియు మీరు కంబైండ్ రూపములో ఉన్నట్లయితే, ఈ స్వరూపాన్నే సహజయోగి అని అంటారు. యోగం చేసేవారు కాదు, కానీ సదా కంబైండ్ అనగా తోడుగా ఉండేవారు. ఇలా తోడుగా ఉండేవారే నిరంతర యోగిగా, సదా సహయోగిగా, ఎగిరే కళలోకి వెళ్ళే ఫరిశ్తా స్వరూపులుగా అవుతారు.

స్లోగన్:-

ప్రశ్నార్థక చిహ్నంలో వంకర మార్గాన్ని ఎంచుకునేందుకు బదులు కళ్యాణం యొక్క బిందువును పెట్టడమే కళ్యాణకారిగా అవ్వటము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top