TELUGU MURLI 23-03-2023

23-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – దేహీ-అభిమానులుగా అయినట్లయితే పాత జగత్తు నుండి సంబంధాన్ని తెంచే మరియు కొత్త జగత్తుతో సంబంధాన్ని జోడించే విశేషత సహజముగా వస్తుంది, ఒక్క తండ్రితో ప్రేమ జోడించబడుతుంది’’

ప్రశ్న:-

ఏ పిల్లల బుద్ధియోగము పారలౌకిక మాత, పితతో సదా జోడించబడి ఉండగలదు?

జవాబు:-

ఎవరైతే జీవిస్తూ మరణించి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉంటారో, గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా అందరి బుద్ధియోగాన్ని తండ్రితో జోడింపజేసే సేవను చేస్తారో, తండ్రి నుండి ఏ ప్రకాశమైతే లభించిందో దానిని ఇతరులకు ఇస్తారో, స్వర్గానికి యజమానులుగా తయారుచేసేందుకు పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారో – వారి బుద్ధియోగము స్వతహాగా తండ్రితో జోడించబడి ఉంటుంది.

పాట:-

తండ్రి ఎవరు, తల్లి ఎవరు… (కౌన్ పిత, కౌన్ మాతా…)

ఓంశాంతి.

ఈ పాట అర్థమేమిటి? ఏమంటారంటే – ఈ జగత్తులోని (లౌకిక) మాతా, పిత, మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ విడిచిపెట్టండి మరియు బుద్ధియోగాన్ని సృష్టి రచయిత అయిన మీ సత్యమైన మాత, పితతో జోడించండి. ఈ మాత, పిత, మిత్ర సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారి నుండి ఇప్పుడు సంబంధాన్ని తెంచాలి మరియు ఒక్కరితో సంబంధాన్ని జోడించాలి. వారిని కూడా మాతా, పిత అని అనడం జరుగుతుంది. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము… అని ఈ విధంగా అందరూ ఒక్కరి విషయంలోనే అంటారు, ఆ లౌకిక తల్లిదండ్రులైతే అందరికీ వేర్వేరుగా ఉన్నారు. వీరు మొత్తం భారత్ కు లేదా మొత్తం ప్రపంచానికి మాత, పిత. కావున పారలౌకిక మాత, పితకు చెందినవారిగా అవ్వాలి మరియు లౌకిక మాత, పిత, మిత్ర సంబంధీకులను విడిచిపెట్టాలి – దీని కోసం దేహీ-అభిమానులుగా అయ్యే జ్ఞానము కావాలి. ఎప్పటివరకైతే దేహీ-అభిమానులుగా అవ్వరో అప్పటివరకు విముక్తులవ్వడము చాలా కష్టము. ఈ పాత జగత్తు నుండి సంబంధాన్ని తెంచాలి మరియు కొత్త జగత్తుతో సంబంధాన్ని జోడించాలి – ఇదే విశేషత. హద్దులోని ఒక ఇంటి నుండి సంబంధాన్ని తెంచి హద్దులోని ఇంకొక ఇంటితో సంబంధాన్ని జోడించడమైతే చాలా సహజము. ప్రతి జన్మలో తెంచడము మరియు జోడించడం జరుగుతుంది. ఒక మాత, పిత, మిత్ర-సంబంధీకులను విడిచి మరొకరిని తీసుకున్నారు. ఒక శరీరాన్ని వదిలితే ఇక మాత, పిత, మిత్ర-సంబంధీకులు, గురువు మొదలైనవారందరూ కొత్తవారు లభిస్తారు. ఇక్కడున్నది జీవిస్తూ మరణించవలసిన విషయము. జీవిస్తూ పారలౌకిక మాత, పిత ఒడిలోకి రావాలి. ఈ కలియుగీ జగత్తులోని మాత, పిత మొదలైనవారందరినీ మర్చిపోవాలి. వీరు మనకు తండ్రి, వీరు తల్లిగా కూడా ఎలా అవుతారు? ఇది గుహ్యమైన విషయము. తండ్రి ఈ శరీరాన్ని ధారణ చేసి వీరి ద్వారా తమ పిల్లలుగా తయారుచేసుకుంటారు. కానీ చాలామంది పిల్లలు ఈ విషయాన్ని పదే-పదే మర్చిపోతారు. అజ్ఞాన కాలములో ఎప్పుడూ తల్లిదండ్రులను మర్చిపోరు. ఈ తల్లి, తండ్రిని మర్చిపోతారు ఎందుకంటే ఇది కొత్త విషయము. ఈ మాత, పితతో బుద్ధియోగాన్ని జోడించాలి, ఇక సేవలో తత్పరులై ఉండాలి. ఏ విధముగా తండ్రికి సేవ పట్ల చింత ఉంటుందో, అలాగే పిల్లలకు కూడా ఉండాలి. కొత్త ప్రపంచాన్ని రచించాలి అని భగవంతునికి చింత కలిగింది అని అంటారు. మరి ఇది ఎంత పెద్ద చింత! అనంతమైన తండ్రికి అందరినీ పావనంగా తయారుచేయాలి అనే అనంతమైన చింత ఉంటుంది. ఆ పావన ప్రపంచమైన స్వర్గము కోసం రాజయోగము నేర్పించాలి. ఎంతమందికి నేర్పించాలి! అందరి బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. ఇదే పిల్లలైన మన వ్యాపారము. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ పిల్లలైన మీరు సేవ చేసి చూపించండి.

సన్యాసులకు ఏ చింత ఉంటుందంటే, మేము ఎవరినైనా కాకిరెట్ట సమానమైన సుఖము నుండి విడిపించాలి, పవిత్రముగా తయారుచేయాలి అని. ఎవరికైనా వైరాగ్యం కలిగించి పవిత్రముగా తయారుచేసే బాధ్యత వారిపై కూడా ఉంటుంది. వారు ఇళ్ళు, వాకిళ్ళను విడిచిపెట్టాలి అని భావిస్తారు. అంతేకానీ పతిత ప్రపంచాన్ని విడిచిపెట్టాలి అని భావించరు. ఎప్పుడైతే తండ్రి వచ్చి పావన ప్రపంచం యొక్క సాక్షాత్కారం చేయిస్తారో, అప్పుడు మనం పతిత ప్రపంచం నుండి సంబంధాన్ని తెంచుతాము. అయినా కూడా, వారు స్వయాన్ని బాధ్యత ఉన్నవారిగా భావిస్తూ ఇళ్ళు, వాకిళ్ళను విడిచిపెట్టి ఎంతమందికి వైరాగ్యం కలిగించి పవిత్రముగా తయారుచేస్తారు. మహిమ అయితే వారిది కూడా పాడుతూ ఉంటారు. ఈ సన్యాస ధర్మం లేకపోతే భారత్ ఇంకా కామ చితిపై కాలి భస్మమైపోయేది. ఇప్పుడు ఆ రజో గుణీ సన్యాసాన్ని స్థాపన చేసేవారు ఎవరు మరియు ఈ సతోప్రధాన సన్యాసాన్ని స్థాపన చేసేవారు ఎవరు, ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వారి హెడ్ శంకరాచార్యులు, వారికి కూడా ఎంతమంది అనుచరులు ఉంటారు! లక్షల, కోట్ల సంఖ్యలో ఉంటారు. వారు పవిత్రముగా లేకపోతే వారి ప్రజలు కూడా వృద్ధి చెందరు. కావున ఈ సన్యాసులు కూడా మంచే చేసారు. మొదటి నంబరులో దేవతలు లెక్కించబడతారు, రెండవ నంబరులో సన్యాసులు లెక్కించబడతారు. అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచము పవిత్రము నుండి అపవిత్రముగా, మళ్ళీ అపవిత్రము నుండి పవిత్రముగా అవ్వాల్సిందే. సత్యయుగము నుండి మొదలుకొని డ్రామాలో ఏదైతే గతించిందో, అదంతా నిశ్చితమై ఉంది. భక్తి మార్గములో సాక్షాత్కారాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, అవి క్షణ, క్షణము మళ్ళీ కల్పం తర్వాత జరుగుతాయి. డ్రామాలో ఇవన్నీ నిశ్చితమై ఉన్నాయి. డ్రామా చక్రాన్ని అర్థం చేసుకోవాలి. డ్రామాలో ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది అని అంటూ కూర్చుండిపోకూడదు. డ్రామాలో అందరూ పాత్రధారులే. అయినా కూడా ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధి కోసం పురుషార్థం తప్పకుండా చేస్తారు. పురుషార్థం లేకుండా ఉండలేరు. చాలామంది మనుష్యులు – ఇది నాటకము, మనం పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు వచ్చాము అని భావిస్తారు కూడా. కానీ విస్తారంగా అర్థం చేయించలేరు. మొదట ఏ ధర్మంవారు వస్తారు, సృష్టి ఎలా రచించబడుతుంది అన్నది వారికి తెలియదు. సృష్టి కొత్తగా రచించబడుతుందా లేక పాత సృష్టిని తండ్రి వచ్చి కొత్తగా తయారుచేస్తారా – ఇది తెలియని కారణముగా వారు ప్రళయాన్ని చూపించి, తర్వాత కొత్త సృష్టిని చూపించారు. తండ్రి వచ్చి ఈ విషయాలపై ప్రకాశాన్ని అందిస్తారు. అప్పుడు మీరు కూడా ఇతరులకు ప్రకాశాన్ని అందించేందుకు బాధ్యులు అవుతారు. ఎంత సేవ ఉంది! ఏ విధంగా తండ్రి మీకు ముక్తి, జీవన్ముక్తులలోకి వచ్చే మార్గాన్ని తెలియజేశారు, ఆ మార్గం కోసమే అర్ధకల్పం భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తిన్నారు. కావున అనంతమైన తండ్రికి చింత ఉంటుంది – మనము మన ముక్తిదళాన్ని ఎలా వృద్ధి చేయాలి? అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి? అని.

పిల్లలైన మీరు అందరికీ తెలియజేయండి, తండ్రి కల్పక్రితము వలె రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉన్నారు. వారినే శివాయ నమః అని అంటారు. వారే అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు, పరంధామంలో ఉండేవారు. ఆత్మలమైన మనమందరము కూడా అక్కడ నివసిస్తాము. ఆత్మను ఎల్లప్పుడూ అమరము అని అంటారు. అది ఎప్పుడూ కాలిపోదు, మరణించదు. ప్రతి ఆత్మలో పాత్ర నిండి ఉంది. మీ ఆత్మను చూసుకోండి లేక ముఖ్యమైనవారు ఎవరైతే ఉన్నారో వారిని చూడండి. వృక్షాన్ని చూసినప్పుడు ముఖ్యమైన పునాదిని మరియు కొమ్మలు-రెమ్మలను కూడా చూడడం జరుగుతుంది. ఆకులైతే లెక్కలేనన్ని ఉంటాయి, వాటిని లెక్కపెట్టలేము. కొమ్మలు-రెమ్మలను లెక్కపెట్టవచ్చు. కావున తప్పకుండా ఈ వృక్షములో దేవీ-దేవతలైన మనదే పునాది. ఇప్పుడు పునాదియే కుళ్ళిపోయింది. ఏ విధంగా మర్రి వృక్షం యొక్క పునాది కుళ్ళిపోయింది, అయినా కూడా శాఖలు ఎన్ని వెలువడి ఉన్నాయి! శాఖల నుండి కూడా ఆకులు వెలువడుతూ ఉంటాయి. కావున ఇది కూడా ఎంత పెద్ద అనంతమైన వృక్షము! పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. అంతేకానీ ఎవరి బుద్ధిలోనూ రోజంతా ఇదే చింతన నడుస్తుందని కాదు. అన్ని పాయింట్లు ఒకే సమయంలో బుద్ధిలో తిరగడం కష్టము. అయినా కూడా విచార సాగర మథనం చేసేవారు ఎవరైతే ఉంటారో, వారి బుద్ధిలోనైతే అవి మెదులుతూనే ఉంటాయి. వృక్షము బుద్ధిలో ఉన్నట్లయితే బీజరూపుడైన తండ్రి కూడా గుర్తుంటారు. మనం కూడా అక్కడి నివాసులమే, తర్వాత ఈ వృక్షములో మనమే ఆది నుండి అంతిమము వరకు ఆల్రౌండ్ గా వస్తాము. ఎప్పుడైతే మీరు పతిత శిథిలావస్థలోకి వస్తారో అప్పుడు మొత్తం వృక్షము కూడా ఆ అవస్థకు వచ్చేస్తుంది. మొట్టమొదట ఎవరైతే ఉండేవారో, వారు కూడా ఇప్పుడు పాతవారిగా అయ్యారు. చివర్లో వచ్చిన కొమ్మలు-రెమ్మలు కూడా పాతవిగా అయ్యాయి. ఎవరైతే సర్వీసబుల్ గా ఉన్నారో వారికి చింత ఉంటుంది – మేము మనుష్యులను మళ్ళీ దేవతలుగా తయారుచేయడంలో బాబాకు సహాయకులము అని. ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది. మీరే దేవతలుగా ఉండేవారు, మీరే క్షత్రియులుగా అయ్యారు. 84 జన్మల జన్మపత్రి గురించి మీరే చెప్పగలరు. కావున ఈ విషయాలు ఎప్పుడైతే బుద్ధిలో మెదులుతూ ఉంటాయో అప్పుడే ఎవరికైనా అర్థం చేయించగలరు. పిల్లలమైన మేము బాబాకు సహాయకులము అన్న చింతన నడవాలి. కావున ఇది బుద్ధిలోకి రావాలి – మేము ఎవరికైనా డ్రామా రహస్యాన్ని ఎలా అర్థం చేయించాలి? వారి యోగాన్ని తండ్రితో ఎలా జోడింపజేయాలి? మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే పురుషార్థం చేయించాలి అనగా తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునే మార్గాన్ని తెలియజేయాలి. ఎవరికైతే తండ్రి ద్వారా మార్గం లభించి ఉందో వారే తెలియజేస్తారు. తండ్రే వచ్చి రాజయోగం నేర్పిస్తారు లేదా ముక్తి-జీవన్ముక్తి ద్వారాలను తెరుస్తారు. ఈ విధంగా రోజంతా విచార సాగర మథనం చేయాలి మరియు స్వభావం కూడా చాలా మధురమైనది ధారణ చేయాలి. ఎవరి భావ-స్వభావాల వలన దహించుకుపోకూడదు లేదా మరణించకూడదు. సహనం చేయాలి. తమ సేవను చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సేవకు టైమ్ ఇవ్వాలి. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి – నేను బాబా-బాబా అని అంటున్నాను, బాబాకైతే అనంతమైన సేవ యొక్క చింత ఉంటుంది, బాబా బిడ్డనైన నేను ఏం చేస్తున్నాను! నేను ఎంత సేవ చేయాలి? సమయమైతే చాలా లభిస్తుంది. దయ కలగాలి. పాపం, అందరూ తండ్రి నుండి విడిపోయి ఉన్నారు. ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. పాపాలు చేస్తూ ఉంటారు. తండ్రి నుండి విముఖులుగా చేసి అందరినీ తికమకపెడుతూ ఉంటారు.

బ్రాహ్మణులైన మీ పనే అందరికీ జ్ఞానాన్ని వినిపించి సమ్ముఖంలోకి తీసుకురావడము. బ్రాహ్మణులైన మీరే గీతా భగవంతుని సత్యాతి-సత్యమైన పిల్లలు. మీకు అథారిటీ లభించి ఉంది. మీ బుద్ధిలో గీతా జ్ఞానమే ఉంది. ఎవరైతే అర్థం చేయించలేరో వారిని మనం బ్రాహ్మణులు అని అనలేము. హాఫ్ కాస్ట్ లేదా క్వార్టర్ కాస్ట్ అని అంటారు. పేరేమో బ్రాహ్మణులు, వ్యాపారము శూద్రత్వానికి సంబంధించినది చేస్తారు. బుద్ధి శూద్రత్వానికి చెందినదిగా ఉంటుంది. అజ్మేర్ లో పుష్కరిణీ బ్రాహ్మణులు ఉంటారు, వారు గీతా శాస్త్రము మొదలైనవి వినిపించేవారై ఉంటారు. వారి వ్యాపారమే ఇది. శ్రాద్ధ భోజనాలు తినడము వారి పని కాదు. వారి పని కేవలం శాస్త్రాలను వినిపించి దక్షిణ తీసుకోవడము. ఇప్పుడు మీరైతే సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు, అనంతమైన తండ్రికి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మా అనంతమైన ప్రజలకు తండ్రి కదా మరియు శివబాబా ఆత్మలందరికీ తండ్రి. వారి నివాస స్థానము పరంధామములో ఉంది. వారే పతితులను పావనంగా చేసేవారు, అందుకే మొత్తం ప్రపంచం వారిని స్మృతి చేస్తుంది. ఓ గాడ్ అని అన్నప్పుడు నిరాకారుడే బుద్ధిలోకి వస్తారు. కానీ గురువుల సంకెళ్ళలో చిక్కుకుని ఉన్నారు. ఏ దేవతలనైతే పూజిస్తారో వారి కర్తవ్యము గురించి తెలియదు. వారు కూడా బొమ్మలుగా భావిస్తూ పూజిస్తారు. కర్తవ్యము గురించి తెలియదు, అందుకే బొమ్మల పూజ అని అంటారు. కావున ఎంత తేడా ఉంటుంది! లెక్కలేనంతమంది తికమక చెంది ఉన్నారు. దేవతల ముఖము మరియు గుణాలకు, మనుష్యుల ముఖము మరియు గుణాలకు రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరు సర్వగుణ సంపన్నులు… మేము నీచులము, పాపులము అని మనుష్యులు పాడుతారు. ఒకవేళ అలా అంటున్నారంటే మరి వారిని ఆ విధంగా తయారుచేసినవారు ఎవరు? ఇప్పుడైతే తప్పకుండా ఇది నరకము, మరి మేము మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవ్వగలమా? ఈ ఆలోచన ఎప్పుడూ మనుష్యులకు రాదు. మేము ఈ విధంగా ఎప్పుడు అవుతాము? అని పిల్లలైన మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చి ఉంటుందా. కేవలం భక్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మనమే దేవతలుగా అవ్వాలి, రాజధానిలో ఉన్నత పదవిని పొందాలి, అందుకే పురుషార్థం చేస్తారు. ఒకవేళ మా శరీరం పోతే మేము ఏ పదవిని పొందుతాము అని లోలోపల ఈ ప్రశ్న రావాలి. మీరు అడగవచ్చు కూడా – ఒకవేళ మేము మరణిస్తే ఏం పదవిని పొందుతాము? అప్పుడు బాబా వెంటనే చెప్తారు – మీరు పైసా అంత విలువ చేసే పదవిని పొందుతారు లేక 8 అణాలది పొందుతారు, 12 అణాలది పొందుతారు లేక గవ్వతుల్యమైన పదవిని పొందుతారు అని. ప్రజలది గవ్వతుల్యమైన పదవి అని అంటారు. మనస్సు అనే దర్పణములో మీ ముఖాన్ని చూసుకోండి – కోతి వంటి వ్యవహారమైతే లేదు కదా? అశుద్ధ అహంకారం నంబరువన్. కామ, క్రోధాలను కూడా జయిస్తారు కానీ దేహ-అభిమానము మొదటి నంబరు శత్రువు. దేహీ-అభిమానులుగా అవ్వడం ద్వారానే ఇక ఇతర వికారాలు చల్లబడతాయి. ఎప్పుడైతే తండ్రితో ప్రేమ జోడింపబడుతుందో అప్పుడే దేహీ-అభిమానులుగా అవుతారు. దేహాభిమానుల ప్రేమ జోడింపబడదు. కావున దేహాభిమానాన్ని విడిచిపెట్టడానికి చాలా శ్రమ కావాలి. దేహీ-అభిమానులు చాలా హర్షితముగా ఉంటారు. దేహాభిమానుల ముఖము శవం వలె ఉంటుంది. కావున మొదటి ముఖ్యమైన విషయము – దేహీ-అభిమానులుగా అవ్వడము, అప్పుడు తండ్రి కూడా సహాయం చేస్తారు. నిర్వికారులుగానైతే చాలామంది ఉంటారు కానీ నేను ఆత్మను, తండ్రి స్మృతి ఉండాలి అన్నది పదే-పదే మర్చిపోతారు. ఇందులో ఫెయిల్ అయిపోతారు. అశరీరిగా అవ్వకపోతే తిరిగి ఎలా వెళ్తారు? సేవ విషయంలో చాలా చింత ఉండాలి. సేవ ద్వారా అనేకమంది మనుష్యుల కళ్యాణము జరుగుతుంది. దేహాభిమానులు ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయి వస్తారు. దేహీ-అభిమానులు ఎంతో కొంత బాణము వేసి వస్తారు. ఫలానావారు విషయాన్ని అయితే కరక్టుగా చెప్పారు అని ఎదుటివారు అనుభవం చేస్తారు. యోగమూ జోడించబడి ఉండాలి, సేవ యొక్క చింత కూడా ఉండాలి. అందులో మొట్టమొదట అయితే అల్ఫ్ గురించి అర్థం చేయించాలి. ఎక్కువగా చెప్తూ ఉంటే విసిగిపోతారు. మొదట శివాయ నమః గురించి, మూడు అంతస్థులను గురించి కూడా అర్థం చేయించాలి. ఒకటి నిరాకారీ ప్రపంచము, అక్కడ పరమపిత పరమాత్మ మరియు ఆత్మలు ఉంటారు. మిగిలినది స్థూలవతనము మరియు సూక్ష్మవతనము. స్వర్గములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. ఇంతకుముందు కలియుగం ఉండేది, తర్వాత సత్యయుగముగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కలియుగ చరిత్ర రిపీట్ అవుతుంది. కావున ఇప్పుడు మళ్ళీ సత్యయుగ చరిత్ర కూడా రిపీట్ అవుతుంది కదా. ఇందులోనే ఆనందము ఉంది. ఇవి చాలా మంచి పాయింట్లు. అచ్ఛా!

బ్రాహ్మణ కుల భూషణులైన పిల్లలందరికీ మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరి భావ, స్వభావాల వలన దహించుకుపోకూడదు, మరణించకూడదు. మీ స్వభావాన్ని చాలా-చాలా మధురముగా తయారుచేసుకోవాలి. సహనశీలురుగా అవ్వాలి.

2. తండ్రికి సహాయకులుగా అయ్యేందుకు విచార సాగర మథనము చేయాలి. బుద్ధిలో జ్ఞాన చింతననే చేస్తూ ఉండాలి. దేహీ-అభిమానులుగా ఉండే శ్రమ చేయాలి.

వరదానము:-

సర్వ సంబంధాలను ఒక్క తండ్రితో జోడించి మాయకు వీడ్కోలనిచ్చే సహజయోగీ భవ

ఎక్కడైతే సంబంధం ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా సహజముగా ఉంటుంది. సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో జోడించడమే సహజయోగిగా అవ్వడము. సహజయోగిగా అవ్వడం ద్వారా మాయకు సహజంగా వీడ్కోలు లభిస్తాయి. ఎప్పుడైతే మాయ వీడ్కోలు తీసుకుంటుందో, అప్పుడు తండ్రి యొక్క అభినందనలు చాలా ముందుకు తీసుకువెళ్తాయి. ఎవరైతే ప్రతి అడుగులోనూ పరమాత్మ ఆశీర్వాదాలను, బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటూ ఉంటారో వారు సహజంగా ఎగురుతూ ఉంటారు.

స్లోగన్:-

సదా బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ గా అయినట్లయితే అడుగడుగునా పదమాల సంపాదన ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top