TELUGU MURLI 21-03-2023

21-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – భక్తులందరికీ భక్తికి ఫలముగా ముక్తి-జీవన్ముక్తుల ఆశ్రయాన్ని ఇచ్చేందుకు భగవంతుడు వచ్చారు, మీరు భక్తుల నుండి ఇప్పుడు వారసులుగా (పిల్లలుగా) అయ్యారు’’

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ స్మృతిలో ఉన్నట్లయితే హృదయములో సంతోషం యొక్క బాజా-భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి?

జవాబు:-

సదా ఈ స్మృతి ఉండాలి – అతి ప్రియమైన బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా, రాజులకే రాజుగా తయారుచేయడానికి వచ్చారు. మనం ఇప్పుడు సూర్యవంశీ రాజా, రాణిగా అవుతున్నాము. తండ్రి మనల్ని 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా, సుసంపన్నముగా తయారుచేస్తున్నారు. మన సత్యయుగీ రాజ్యంలో అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి. ఆత్మ మరియు శరీరము రెండూ పుష్పము సమానముగా ఉంటాయి. ఈ స్మృతితో హృదయములో సంతోషం యొక్క బాజా-భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి.

ఓంశాంతి.

తండ్రి పరంధామంలో నివసించేవారని పిల్లలకు తెలుసు. ఆ తండ్రి స్వయంగా పిల్లలతో అంటారు, ఇప్పుడు మీరు భక్తులు కారు, ఇప్పుడైతే మీరు భగవంతుని పిల్లలు. భక్తులు, భగవంతుడిని వెతుకుతూ ఉంటారు. భక్తులను భగవంతుడు అని అనలేరు. భక్తులు అనేకమంది ఉన్నారు, భగవంతుడు ఒక్కరే. ఇప్పుడు భక్తులు మనుష్యులు కావున తప్పకుండా భగవంతుడు కూడా మనిషి రూపంలో రావలసి ఉంటుంది. భగవంతుడు ఇంట్లో కూర్చుని ఉండగానే వస్తారని అంటూ ఉంటారు. ఎవరి ఇల్లు? మనుష్యుల ఇల్లు. భగవంతుడు తప్పకుండా మనిషి రూపాన్ని ధరించవలసి ఉంటుంది. నిరాకార పరమపిత పరమాత్మ ఒక్కరే, భక్తులు అనేకమంది. మనుష్యులందరూ ఈ సమయంలో భక్తులుగా ఉన్నారు, భగవంతుడిని స్మృతి చేస్తారు. ఏదో ఒక సమయంలో భగవంతుడు తప్పకుండా రానున్నారని భావిస్తారు. వారు స్వర్గ రచయిత కావున తప్పకుండా ఒక్కరే ఉంటారు కదా. అనేకమందైతే ఉండజాలరు. భగవంతుడు వచ్చి మనిషి రూపంలో భక్తులకు అర్థం చేయిస్తారు. అర్ధకల్పం అయితే నన్ను స్మృతి చేస్తారు. డ్రామానుసారంగా తప్పకుండా భక్తి మార్గంలో స్మృతి చేయవలసిందే. మళ్ళీ భగవంతుడినైన నేను మనిషి రూపాన్ని ధరించి భక్తుల వద్దకు వస్తాను. భక్తులు కూడా మనుష్యులే, కావున నేను కలుసుకోవాల్సింది కూడా మనుష్యులనే. తప్పకుండా మనిషి రూపాన్ని ధరించవలసి ఉంటుంది, తాబేలు, చేప రూపమేమీ కాదు. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలకు నా పరిచయాన్ని ఇస్తాను. నా గురించి పూర్తిగా ఎవరూ తెలుసుకోలేరు, అందుకే నేను వచ్చి ఉన్నానని నా పరిచయాన్ని నేనే వచ్చి ఇస్తాను. తండ్రి మనిషి తనువును తీసుకొని వస్తారని పిల్లలైన మీకు తెలుసు. నేను ఏ భక్తుని తనువులోకి ప్రవేశిస్తాను అన్నది కూడా వారు అర్థం చేయిస్తారు. వీరు (బ్రహ్మా) అందరికన్నా పెద్ద భక్తుడు. భక్తుడు ఒక్కరే ఉండరు. పాత భక్తులు ఎవరైతే ఉన్నారో వారి లెక్కను తెలియజేస్తారు. ఆ ప్రాచీన దేవీ-దేవతలు, ఎవరైతే సత్యయుగం ఆదిలో ఉండేవారో, తర్వాత వారు భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు భక్తిని ప్రారంభిస్తారు. కావున వారు అందరికన్నా పాత భక్తులు అయినట్లు. వారే పూర్తి భక్తిని చేసారు. భగవంతుడిని కలిసి దేవీ-దేవతా పదవిని ప్రాప్తి చేసుకునేందుకు వారే వచ్చారు. మళ్ళీ వచ్చి సమ్ముఖములో కలుసుకుంటారు. మీకు తెలుసు, మనం భక్తులుగా ఉండేవారము, మొత్తం ప్రపంచం భక్తులుగా ఉన్నారు. భక్తులను రక్షించేందుకు భగవంతుడు వచ్చి ఉన్నారు ఎందుకంటే భక్తులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. శాంతి మరియు సుఖం ఎక్కడ ఉంటుందో భక్తులకు తెలియదు. భగవంతుడు వచ్చి, నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు పిల్లల కొరకు కానుకను తీసుకొని వస్తానని అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన కానుకనే తీసుకువస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనం భక్తులము కాము. భగవంతుడు వచ్చి తమ వారసులుగా చేసుకున్నారు. భక్తులు వారసులు అవ్వరు. మేము పిల్లలము, తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకోవాలని వారు ఈ విధంగా భావించరు. వారైతే సర్వవ్యాపి అని అంటారు మరి భగవంతుడు ఎక్కడి నుండి వస్తారు. ఇప్పుడు మీకు వారసత్వం తప్పకుండా కావాలి, అందుకే నన్ను స్మృతి చేస్తారు. వారసత్వం కూడా ఫస్ట్ క్లాస్ అయినది కావాలి. సెకండ్, థర్డ్ క్లాస్ కాదు. భక్తులందరూ భగవంతుడిని స్మృతి చేస్తారు వెళ్ళి వారిని కలుసుకోవాలి అని. కానీ వారి వద్దకు ఎలా వెళ్ళాలో తెలియదు. కావున భగవంతుడు రావలసి ఉంటుంది. వారు చదివిస్తారు కూడా, మీకు తెలుసు, అందరికీ భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు లేక అందరినీ సుఖీగా చేయడానికి భగవంతుడు వచ్చి ఉన్నారు. భగవంతుడు ఇప్పుడే రావలసి ఉంటుంది. వారు ఆత్మిక పండా. వాస్తవానికి మనుష్యుల సత్యాతి-సత్యమైన తీర్థ స్థానాలు – ముక్తి మరియు జీవన్ముక్తి ధామాలు. స్వర్గములో నివసించే దేవతల జడ చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఆ జడ చిత్రాల వద్దకు వెళ్ళడానికి యాత్రలు చేస్తారు. అది దైహిక యాత్ర అవుతుంది. దిల్వాడా మందిరంలోకి లేక జగదంబ వద్దకు వెళ్ళడానికి యాత్రలు చేస్తారు, అది కూడా భక్తి. భగవంతుడు వచ్చి ఈ యాత్రల యొక్క దెబ్బల నుండి విడిపిస్తారు. భక్తులు భగవంతుడిని కలిసినప్పుడు భగవంతుడు భక్తి యొక్క దుఃఖాల నుండి విడిపించి ఆశ్రయానికి చేరుస్తారు. తండ్రి అంటారు, అన్ని ధర్మాలవారు ఎవరైతే ఉన్నారో, మనుష్యమాత్రులందరికీ ఇప్పుడు ఆశ్రయాన్ని ఇచ్చేందుకు వచ్చాను. యథార్థమైన ఆశ్రయము ముక్తి, జీవన్ముక్తి ధామాలు. అందరినీ మన ధామానికి లేక స్వర్గ ధామానికి తీసుకువెళ్తారు. బాబా పరంధామం నుండి వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మనం భగవంతుని వద్దకు వెళ్ళాలని ఆత్మయే కోరుకుంటుంది. స్మృతి ఎవరు చేస్తారు? ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా స్మృతి చేస్తుంది. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. మీ బుద్ధిలో జ్ఞానం యొక్క బిందువులు పడుతూ ఉంటాయి. తప్పకుండా డ్రామానుసారంగా బాబా వచ్చి ఉన్నారు. పిల్లలను రావణుడి దుఃఖాల నుండి విడిపించి తమతోపాటు తీసుకొని వెళ్తారు. గైడ్ గా అయి వచ్చారు. మీరు ఏ ఆత్మిక తీర్థయాత్రలకైతే వెళ్ళనున్నారో, అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. ఇక్కడిదైతే అల్పకాలికమైన దైహిక తీర్థ యాత్ర. ఈ జడమైన తీర్థ యాత్రలు ఆగిపోతాయి. మళ్ళీ మీరందరూ తీర్థయాత్రలకు వెళ్తారు. సత్యమైన తీర్థ యాత్రలు, ఒకటి ముక్తిధామము, ఇంకొకటి జీవన్ముక్తిధామము. ఆ తీర్థయాత్రలన్నింటికీ వెళ్ళేందుకు కూడా భక్తులు దైహిక తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. తప్పకుండా దైహిక తీర్థయాత్రలు జన్మ-జన్మాంతరాలుగా చేసిన తర్వాత వాటి నుండి విముక్తులై మనం ఆత్మిక తీర్థయాత్రలకు వెళ్తాము, మళ్ళీ ఇక్కడికి మృత్యులోకములోకి వచ్చేదే లేదు. ముక్తిధామంలోకి వెళ్ళి కూర్చుంటాము, రావడము-వెళ్ళడము ఆగిపోతుంది. తర్వాత స్వర్గంలోకి వెళ్తాము, ఇక అక్కడ రావడము-వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. స్వర్గవాసులుగా అయిపోతారు. మీకు తెలుసు, బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తున్నారు. స్వర్గములోకి వెళ్ళేందుకు మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ప్రపంచములోనైతే ఎవరికీ తెలియనే తెలియదు, పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారు. శాస్త్రాలు మొదలైనవి చదవడము ద్వారా కూడా లాభమేమీ ఉండదు. ఇప్పటిదానితో పోలిస్తే అలాగే అంటారు. అల్పకాలిక సుఖాన్ని స్వల్పమైనదని అంటారు. ఎక్కువ మిఠాయికి మరియు కొద్దిగా ఉండే మిఠాయికి తేడా అయితే ఉంటుంది కదా.

మనమైతే సూర్యవంశీ రాజా, రాణిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, చాలా ధనవంతులుగా అవ్వాలి అని వారు ఆశను పెట్టుకుంటారు. సంపద అయితే తప్పకుండా కావాలి, అప్పుడే సుఖము ఉంటుంది. సంపదతోపాటు మళ్ళీ ఆరోగ్యము కూడా కావాలి. ఆరోగ్యము, సంపద ఉన్నట్లయితే సుఖం చాలా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆరోగ్యము, సంపద రెండూ లభించజాలవు. ఒక్క జన్మ కోసం ఒక్క మనిషి వద్ద కూడా ఇవి ఉండజాలవు. అక్కడైతే మీరందరూ 21 జన్మల కోసం ఆరోగ్యవంతులుగా, సంపన్నంగా ఉంటారు. అక్కడైతే అనాది, ఆది ప్రతి వస్తువు చాలా చౌకగా ఉంటుంది. ధనమైతే అవసరమే ఉండదు. ధనానికి బదులుగా బంగారు నాణాలను ఇస్తూ ఉండవచ్చు మరియు వస్తువులు ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. తత్వాలు కూడా సతోప్రధానముగా అయిపోతాయి కావున వాటితో సామగ్రి కూడా చాలా బాగా తయారవుతూ ఉంటాయి. భోజనము మొదలైనవాటిలో ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీ మనసులో బాజా-భజంత్రీలు మ్రోగాలి. అతి ప్రియమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారంటారు, నేను మీ అతి ప్రియమైన తండ్రిని, 63 జన్మలు మీరు నన్ను స్మృతి చేసారు. తప్పకుండా ప్రియమైనవారు, అందుకే స్మృతి చేస్తారు కదా. మనుష్యులకైతే ఏమీ తెలియదు. బాబా మనల్ని రాజులకే రాజుగా, స్వర్గానికి యజమానులుగా, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. దేవీ-దేవతలు విశ్వానికి యజమానులు కదా. కానీ వారిపైన కూడా అసత్యమైన కళంకాలను బాల్యము నుండే మోపారు. ఎన్ని అసత్యమైన విషయాలను మోపారు. మాయ పూర్తిగా 100 శాతం తెలివితక్కువ బుద్ధికలవారిగా చేసేసింది. ఇది కూడా డ్రామా యొక్క ఆట. కావున ఇప్పుడు అతి ప్రియమైన తండ్రి అంటారు, నన్ను పూర్తిగా స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనమవుతాయి. పుష్పాలుగా అవ్వండి. ఆత్మ పుష్పంగా ఉంటే శరీరం కూడా అలాగే మంచిది లభిస్తుంది. త్వమేవ మాతాశ్చ పిత… ఇది ఎవరి మహిమ? కుక్క, పిల్లి అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నట్లయితే మరి వాటిని మాత, పిత అని అంటారా…? మనుష్యుల బుద్ధి ఎలా అయిపోయింది! ఆడంబరము ఎంతగా చూపిస్తారు. దీనిని మాయ యొక్క ఆడంబరము అని అంటారు. రావణ రాజ్యంలో మనుష్యులకు ఎంత నషా ఉంటుంది. వారికేమీ తెలియదు. మీలో కూడా జ్ఞానాన్ని ధారణ చేసే మంచివారు ఎవరైతే ఉన్నారో, వారికి నషా ఎక్కుతుంది. జ్ఞాన ధారణ జరగకపోతే ముఖం మనుష్యుల వలె ఉండవచ్చు కానీ గుణాలు కోతుల వలె ఉంటాయి. పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, మనం శ్రీమతముపై నడుస్తూ భారత్ లోని మనుష్యమాత్రులను శ్రేష్ఠమైన దైవీ గుణధారులుగా తయారుచేస్తున్నాము అనగా మనం భారత్ ను శ్రేష్ఠమైన దైవీ రాజస్థాన్ గా తయారుచేస్తున్నాము. ఎవరికైతే ఈ నషా ఉంటుందో, వారే ఇలా మాట్లాడుతారు. ఎక్కడ భాషణ చేసినా సరే, చెప్పండి – మేము శ్రీ అనగా శ్రేష్ఠమైన మతముపై నడుస్తున్నాము, భగవంతుడు జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, మేము వారి మతముపై నడుస్తున్నాము. యాదవులు మరియు కౌరవులు ఇరువురూ రావణుడి మతముపై ఉన్నారు మరియు పాండవులైన మేము భగవంతుని శ్రీమతముపై ఉన్నాము. గెలుపు కూడా మనదే. శ్రీకృష్ణుడు ఏమీ స్వర్గ స్థాపన చేయరు. భగవంతుడైన తండ్రే స్థాపన చేస్తారు. మనం భారత్ ను శ్రేష్ఠముగా తయారుచేస్తాము, మేము ఈశ్వరీయ మతముపై ఉన్నామని ఇంకెవ్వరూ కూడా ఈ విధంగా అనలేరు. అయితే, ఈశ్వరుని ప్రేరణ ద్వారా చేస్తున్నామని అంటారు. తండ్రి అయితే అంటారు, నేను ఈ తనువులోకి వచ్చి మతాన్ని ఇస్తాను. ఇందులో ప్రేరణ యొక్క విషయమైతే లేనే లేదు. కావున మొట్టమొదట నిరాకారుని మహిమ చేయాలి. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. వారి మతముపై మనం నడుస్తున్నాము. వారు మనకు తండ్రి. పరంధామంలో నివసించేవారు. వారు స్వర్గ రచయిత, ఎవరికైతే తెలిసి ఉంటుందో, వారే మహిమ చేస్తారు. మొత్తం సృష్టిని పావనంగా చేసేవారైతే ఒక్కరే ఉండాలి. అనేకమంది ఏమైనా ఉండాలా. కావున మనం తప్ప మిగిలినవారంతా రావణ మతముపై ఉన్నారు. మనం శ్రీమతముతో భారత్ ను మళ్ళీ దైవీ రాజస్థాన్ గా చేస్తున్నాము. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమవ్వనున్నాయి. బి.కె.లమైన మేము ఎవరైతే ఉన్నామో, మేమందరమూ దీనిని ప్రాక్టికల్ గా అనుభవం చేసి ఉన్నాము. మేము ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలము. నిజానికి మీరు కూడా పిల్లలే, కానీ మేము ప్రాక్టికల్ గా ఇప్పుడు ఉన్నాము. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచించారని మళ్ళీ భక్తి మార్గంలో అంటూ ఉంటారు. బహుశా వెంటనే దేవతలుగా అయ్యారని వారు భావిస్తారు. కానీ అలా కాదు, బ్రహ్మా ద్వారా మొదట బ్రాహ్మణులను రచించారు, ఆ తర్వాత వర్ణాల గురించి వివరించాలి. కథలను వినిపించడం వలన లేదా డ్రామా మొదలైనవాటి వలన లాభమేమీ ఉండదు. పూర్తిగా తండ్రి శిక్షణలను తెలియజేయాలి. తండ్రి మనతో ఏమంటారు? ఓ మధురమైన పిల్లలూ, ఓ ఆత్మలూ… మొత్తం సభలో చెప్పాలి, దేవతలుగా అయ్యేందుకు మేము శ్రీమతముపై నడుస్తున్నాము. వారు మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. గీతా భగవంతుడు కూడా ఆ నిరాకారుడే. సాకారములోకి వస్తారు, ప్రజాపిత బ్రహ్మా ముఖం ద్వారా ఈ బ్రాహ్మణ బ్రాహ్మణీలు వెలువడుతారు. మేము బి.కె.లము. పరమపిత పరమాత్మ మమ్మల్ని బ్రహ్మా ముఖము ద్వారా రచించారు. మేము శివబాబాకు మనవలము. బి.కె.ల పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మలైన మీరందరూ కూడా శివుని మనవలు, ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త రచన జరుగుతుంది. ఇలా అర్థం చేయించాలి. తప్పకుండా మేము కూడా శివుని మనవలము, బ్రహ్మాకు పిల్లలము అని వారు అర్థం చేసుకోవాలి. మేము వారికి చెందినవారిగా అయ్యాము, అందుకే మాకు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు అన్న పేరు ఉంది. కల్ప క్రితము వీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఇలా-ఇలా మంచి రీతిలో చక్రం యొక్క రహస్యాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. మొదట అయితే తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి మాకు వినిపించారు, మళ్ళీ మేము మీకు వినిపిస్తున్నాము. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుంది, చక్రవర్తీ రాజుగా ఎలా అవ్వవలసి ఉంటుంది – ఇదే జ్ఞానము. ఇందులో ఆయుధాలేమీ ఉండవు. ప్రపంచ చరిత్ర భౌగోళికాలనైతే తప్పకుండా మనుష్యులే తెలుసుకుంటారు కదా. మనుష్య సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది తప్పకుండా తెలుసుకోవాలి. మనం తండ్రి నుండి వింటాము కావున చక్రవర్తీ రాజాగా అవుతాము. మీరు కూడా అనంతమైన తండ్రి నుండి సుఖం తీసుకోవాలి అంటే పురుషార్థం చేయండి. అనంతమైన తండ్రే స్వర్గ రచయిత. వారి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది, మరి అనంతమైన తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు. లౌకిక తండ్రి యొక్క వారసత్వంతో సంతుష్టమవ్వము. మనం అనంతమైన తండ్రి నుండి 21 జన్మలు సుఖము పొందుతాము. మిగిలినదంతా భక్తి మార్గము యొక్క సామాగ్రి. శాస్త్రాలు మొదలైనవి అనాది అని మీరు అంటారు. కానీ ఇవన్నీ ఉంటూ కూడా ఇప్పుడైతే కలియుగము వచ్చింది. ప్రపంచం పతితముగా అవుతూ ఉంటుంది. లాభమైతే ఏమీ కలగలేదు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చారు, వారికి మనం మనవలము, బ్రహ్మాకు పిల్లలము బ్రాహ్మణులము. వాస్తవానికైతే వారు మీకు కూడా తండ్రి. ఇలా-ఇలా మంచి రీతిలో అర్థం చేయించినట్లయితే వారు కూడా కరిగిపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటూ, స్మృతితో ఆత్మ మరియు శరీరము రెండింటినీ పుష్పము సమానముగా తయారుచేసుకోవాలి. వికర్మలను వినాశనం చేయాలి.

2. మనం డైరెక్ట్ ఈశ్వరుని మతముపై భారత్ ను శ్రేష్ఠముగా, మానవమాత్రులను దైవీ గుణధారులుగా తయారుచేసే సేవకు నిమిత్తులము – ఈ స్మృతిలో ఉండాలి.

వరదానము:-

సూర్యముఖీ పుష్పం సమానముగా జ్ఞాన సూర్యుని ప్రకాశముతో ప్రకాశించే సదా సమ్ముఖ మరియు సమీప భవ

ఏ విధంగా సూర్యముఖీ పుష్పము సదా సూర్యుని సకాష్ తో వికసించి ఉంటుందో, దాని ముఖము సూర్యుని వైపు ఉంటుందో, రేకులు సూర్య కిరణాల సమానముగా సర్కిల్ లో ఉంటాయో, అదే విధంగా ఏ పిల్లలైతే సదా జ్ఞాన సూర్యునికి సమీపముగా మరియు సమ్ముఖములో ఉంటారో, ఎప్పుడూ దూరమవ్వరో – వారు సూర్యముఖీ పుష్పము సమానంగా జ్ఞాన సూర్యుని ప్రకాశముతో స్వయము కూడా ప్రకాశిస్తూ ఉంటారు మరియు ఇతరులను కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు.

స్లోగన్:-

సదా ధైర్యవంతులుగా కండి మరియు సర్వులకు ధైర్యాన్ని ఇప్పించండి, అప్పుడు పరమాత్మ సహాయం లభిస్తూ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top