TELUGU MURLI 01-03-2023

               01-03-2023 ప్రాత:మురళిఓంశాంతి”బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలను అర్థం చేసుకోవాలి, ఏదైతే గతించిపోయిందో అదే ఇప్పుడు వర్తమానములో జరగనున్నది, ఇప్పుడు సంగమయుగము వర్తమానముగా ఉంది, తర్వాత సత్యయుగము రానున్నది’’

ప్రశ్న:-

శ్రీమతముపై తమను తాము పర్ఫెక్ట్ గా చేసుకునేందుకు విధి ఏమిటి?

జవాబు:-

తమను తాము పర్ఫెక్ట్ గా చేసుకునేందుకు విచార సాగర మథనము చేయండి. తమతో తాము మాట్లాడుకుంటూ ఉండండి. బాబా, మీరు ఎంత మధురమైనవారు, మేము కూడా మీలా మధురముగా అవుతాము. మేము కూడా మీలా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయి అందరికీ జ్ఞానాన్ని ఇస్తాము. ఎవరినీ అసంతుష్టపరచము. శాంతి మా స్వధర్మము, మేము సదా శాంతిగా ఉంటాము. అశరీరిగా అయ్యే అభ్యాసము చేస్తాము. ఇలా, ఇలా స్వయముతో మాట్లాడుకుంటూ స్వయాన్ని పర్ఫెక్ట్ గా చేసుకోవాలి.

పాట:-

మాతా ఓ మాతా, జీవిన దాతా… (మాత ఓ మాత, జీవన దాత…)

ఓం శాంతి.

శివ భగవానువాచ. కేవలం భగవానువాచ అని అన్నంత మాత్రాన మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. తప్పకుండా వారి పేరు తీసుకోవాల్సి ఉంటుంది. గీతను వినిపించేవారు ఎవరైతే ఉన్నారో వారు కృష్ణ భగవానువాచ అని అంటారు. కృష్ణుడు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. శ్రీకృష్ణుడు వచ్చారని మరియు గీతను వినిపించారని లేక రాజయోగాన్ని నేర్పించారని భావిస్తారు. ఇప్పుడు ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ తప్పకుండా వర్తమానముగా అవుతుంది. ఏదైతే వర్తమానములో ఉందో అది మళ్ళీ భూతకాలంగా అవుతుంది. ఏదైతే గతించిపోయిందో దానిని గతించిపోయింది అని అంటారు. కావున ఇప్పుడూ శివబాబా వచ్చారు, తప్పకుండా ఒకప్పుడు వచ్చి వెళ్ళారు. శివ భగవానువాచ, ఎవరైతే ఉన్నతోన్నతమైనవారో వారు అందరికీ తండ్రి, వారిని సర్వశక్తివంతుడు అని అంటారు, వారు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు వారి పిల్లలు, శివశక్తులు. శివశక్తి మహిమను పాటలో విన్నారు కదా. శివశక్తి అయిన జగదాంబ ఒకప్పుడు ఉండి వెళ్ళారు, వారిదే ఈ స్మృతిచిహ్నము. ఒకప్పుడు ఉండి వెళ్ళారు, మళ్ళీ తప్పకుండా వస్తారు. ఏ విధంగా సత్యయుగము గతించింది, ఇప్పుడు ఇది కలియుగము, మళ్ళీ సత్యయుగము రానున్నది. ఇప్పుడు ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచముల సంగమము. తప్పకుండా కొత్త ప్రపంచము ఒకప్పుడు ఉండి వెళ్ళింది, ఇప్పుడు పాత ప్రపంచము ఉంది. సత్యయుగము ఏదైతే గతించిపోయిందో, అది మళ్ళీ భవిష్యత్తులో వస్తుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. జ్ఞానం అంటేనే అర్థం చేసుకోవడము. అది భక్తి, ఇది జ్ఞానము. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఇది అర్థం చేసుకోవాలి. దానిని అర్థం చేసుకోకుండా మనుష్యులు ఏమీ అర్థం చేసుకోలేరు. డ్రామా ఆదిమధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. ఆ హద్దులోని డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుస్తుంది. ఇది అనంతమైన డ్రామా, దీనిని మనుష్యులు అర్థం చేసుకోలేరు. అనంతమైన యజమాని అయిన తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది శివ భగవానువాచ, అంతేకానీ శ్రీకృష్ణ భగవానువాచ కాదు. కృష్ణుడిని కూడా శ్రీ అని అంటారు ఎందుకంటే వారిని శ్రేష్ఠముగా చేసేవారు తండ్రి. కృష్ణుడే నారాయణుడిగా అవుతారని పాపం భారతవాసులకు తెలియదు. పాపం వారికి ఏమీ తెలియదు అని ఇప్పుడు మనం అంటాము. అందరూ నిరుపేదలుగా, దుఃఖితులుగా, పతితులుగా ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు అలానే ఉండేవారము కానీ ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము. పతితపావనుడైన తండ్రి ఇప్పుడు మనకు లభించారు. కృష్ణుడిని పతిత-పావనుడు అని అనరు. పావనమైన కొత్త ప్రపంచాన్ని తయారుచేసేవారు రచయిత అయిన తండ్రియే. వారినే పరమపిత పరమాత్మ, సర్వశక్తివంతుడు అని అంటారు. వారే పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేసేవారు, పతిత సృష్టిని పావనంగా తయారుచేసేవారు. మొత్తం సృష్టి అంతా పతితముగా ఉంది, రావణుడు పతితంగా తయారుచేస్తాడు. పతిత-పావనుడు ఒక్క ఈశ్వరుడే. మనుష్యులు పతితుల నుండి పావనులుగా ఎట్టి పరిస్థితిలోనూ తయారుచేయలేరు. ఇది మొత్తం ప్రపంచమంతటి విషయము కదా. ఒకవేళ సన్యాసులు ఒకటి, రెండు కోట్ల మంది పావనులుగా అయ్యారనుకున్నా కానీ, 5-6 వందల కోట్ల మంది పతితులుగానే ఉన్నారు, కావున తప్పకుండా దీనిని పతిత ప్రపంచము అనే అంటారు కదా. నిజానికి పతిత ప్రపంచములో పావనులు ఒక్కరు కూడా ఉండలేరు అని శివ భగవానువాచ ఉంది. తండ్రి అంటారు, పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారుచేసేందుకు మొత్తం సృష్టినంతటినీ పావనంగా తయారుచేస్తాను. పతిత-పావనుడు అనగా అర్థమే మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారుచేసేవారు అని. శివబాబా స్వయంగా అంటున్నారు, నేను పతితుల నుండి పావనులుగా తయారుచేస్తున్నాను. మీరే పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. కొత్త ప్రపంచములో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉంటుంది. ఇది కూడా ఎవరికీ తెలియదు. శివబాబా గురించి కూడా ఎవరికీ తెలియదు. మీరు ఇలా అడగండి – మీరు నిరాకార పరమపిత పరమాత్మ అయిన శివుని జయంతిని జరుపుకుంటున్నారు, వారెప్పుడు వచ్చారు? నిరాకారుడు ఎలా వచ్చారు? నిరాకారుడు తప్పకుండా శరీరములోకే వస్తారు, అప్పుడే కర్మ చేయగలుగుతారు. ఆత్మ శరీరము లేకుండా కర్మలు ఏమైనా చేయగలదా. పరమాత్మ వచ్చి తప్పకుండా ఉన్నతముగా తయారుచేసే కర్మనే చేస్తారు. మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారుచేయడము, ఇది ఒక్కరి చేతిలోనే ఉంది. మనుష్యులైతే ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. భక్తులు భగవంతుడిని పిలుస్తూ ఉంటారు, మరి తప్పకుండా భగవంతుడు ఒక్కరే ఉండాలి. భక్తులు అనేకులు ఉన్నారు. శివ భగవానువాచ, శివ భగవానుడినైన నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని మరియు సృష్టిచక్రపు జ్ఞానాన్ని అర్థం చేయిస్తాను అనగా ఇప్పుడు మీ ఆత్మకు సృష్టిచక్రపు జ్ఞానము ఉంది. ఏ విధంగా తండ్రినైన నాలో సృష్టిచక్రపు జ్ఞానము ఉంది, అది మీకు నేర్పించేందుకు నేను వచ్చాను. సృష్టిచక్రము తప్పకుండా తిరుగుతుంది. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఎవరో ఒకరు నిమిత్తులుగా అవుతారు కదా. పంచ వికారాల రూపీ జైలు నుండి విముక్తులుగా చేసేందుకు నేను వస్తాను. నేను శివుడిని, ఇప్పుడు ఈ తనువులో కూర్చున్నాను. మీరు అంటారు, ఆత్మనైన నేను ఈ శరీరములో కూర్చున్నాను, నా శరీరము పేరు ఫలానా అని. శివబాబా అంటారు, నిరాకారుడినైన నాకు శరీరమేదీ లేదు, పరమపితనైన నా పేరు శివ, పరమపిత పరమాత్మనైన నేను నక్షత్రము వలె ఉంటాను, నాకు శివ అన్న పేరు ఒక్కటే ఉంది, మీరు సాలిగ్రామాలు, కానీ మీ పేర్లు 84 జన్మలలోనూ మారుతూ ఉంటాయి, నాకైతే ఒక్కటే పేరు ఉంది, నేను పునర్జన్మలు తీసుకోను. గీతలో ఎవరి పేరునైతే వ్రాసారో అతను పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. శ్రీకృష్ణుడు గీతను వినిపించారు అని కాదు, ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము. మనుష్యుల చేతిలో ఏమీ లేదు, ఏదైతే చేయడం జరుగుతుందో అదంతా పరమపిత పరమాత్మయే చేస్తారు. మనుష్యులకు శాంతిని, సుఖాన్ని ఇవ్వడము – ఇది తండ్రి పని. ఎల్లప్పుడూ తండ్రినే మహిమ చేయాలి, ఇంకెవ్వరికీ మహిమ లేదు. లక్ష్మీ-నారాయణులకు కూడా మహిమ లేదు. కానీ రాజ్యం చేసి వెళ్ళారు కావున వారు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని భావిస్తారు. అద్భుతం చూడండి, అవి జడచిత్రాలు మరియు ఇక్కడ వారు చైతన్యముగా కూర్చున్నారు. శివ భగవానువాచ – మీరు రాజులకే రాజులుగా, పూజ్యులుగా అవుతారు, తర్వాత పూజారులుగా అవుతారు. పూజ్యులైన లక్ష్మీ-నారాయణులే మళ్ళీ తర్వాత పూజారులుగా అవుతారు. కావున ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి మందిరాలను తయారుచేసి పూజిస్తారు. దీనిని నిరూపించి తెలియజేయాలి. అంతేకానీ ఈశ్వరుడు తానే పూజ్యునిగా, మళ్ళీ తానే పూజారిగా అవుతారని కాదు, అలా కాదు. పరమాత్మనైన నేను ఎక్కడ నివసిస్తాను అనేది కూడా మనుష్యులకు తెలియదు. నా పిల్లలైన సాలిగ్రామాలెవరైతే ఉన్నారో వారికి కూడా తాము ఎక్కడి నివాసులు అనేది తెలియదు. ఆత్మలు మరియు పరమాత్ముని ఇల్లు ఒక్కటే, స్వీట్ హోమ్. కేవలం స్వీట్ ఫాదర్ హోమ్ అని మాత్రమే అనరు. నిర్వాణధామము మనకు కూడా ఇల్లేనని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ మన తండ్రి ఉంటారు. కేవలం ఇంటిని మాత్రమే స్మృతి చేస్తే అది బ్రహ్మముతో యోగమైనట్లు, దాని ద్వారా వికర్మలు వినాశనమవ్వవు. బ్రహ్మయోగులు, తత్వయోగులు ఉన్నా కానీ వారి వికర్మలు వినాశనమవ్వలేవు. అయితే భావన వల్ల అల్పకాలికముగా సుఖము లభిస్తుంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా శాంతి లభిస్తుంది. అయితే వారి యోగము తప్పు అని తండ్రి అంటారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. శ్రీకృష్ణుడు ఇలా అనలేరు, వారు వైకుంఠానికి యజమాని. అశరీరిగా అయి శివబాబాను స్మృతి చేయండి అని లేక నన్ను స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు ఏమైనా అంటారా. మొత్తం ఆధారమంతా గీతను సరిదిద్దడంలోనే ఉంది. గీత ఖండితమైన కారణముగా భగవంతుని అస్థిత్వమే మాయమైపోయింది. ఈశ్వరునికి నామ-రూపాలే లేవు అని అనేస్తారు. నిజానికి నామ, రూప, కాలాలు అనేవి ఆత్మకు కూడా ఉన్నాయి. ఆత్మ పేరు ఆత్మయే, వారు కూడా పరమపిత అయిన పరమ ఆత్మ. పరమ్ అనగా సుప్రీమ్, ఉన్నతోన్నతమైన. వారు జనన-మరణ రహితుడు, వారు అవతారము తీసుకుంటారు. డ్రామాలో ఎవరి పాత్ర అయితే ఉంటుందో వారిలోనే ప్రవేశిస్తారు మరియు వారికి బ్రహ్మా అన్న పేరును పెడతారు. బ్రహ్మా అన్న పేరు ఎప్పుడూ మారదు. బ్రహ్మా ద్వారానే స్థాపన చేస్తారు. కావున వారు ఏమైనా శ్రీకృష్ణుని తనువులోకి వస్తారా. ఒకవేళ వారు ఇంకెవరిలోకైనా వచ్చినా కానీ అతనికి కూడా బ్రహ్మా అన్న పేరు పెట్టవలసి ఉంటుంది. వారు ఇంకెవరిలోకైనా ఎందుకు రారు అని మనుష్యులు అడుగుతారు. అరే, ఇంకెవరి తనువులోకి రావాలి? వారు వచ్చేదే జ్ఞానాన్ని ఇచ్చేందుకు. రోజురోజుకు మనుష్యులు అర్థం చేసుకుంటూ ఉంటారు. మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. చాలా మంచి అవస్థ కావాలి. ఏ విధంగా డ్రామాలోని నటులకు తాము ఇంటి నుండి స్టేజ్ పైకి పాత్రను అభినయించేందుకు వచ్చాము అని తెలిసి ఉంటుందో, అలాగే ఆత్మలమైన మనము ఈ శరీరం రూపీ వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తాము, తర్వాత తిరిగి వెళ్ళాలి, శరీరాన్ని వదలవలసి ఉంటుంది. మీకైతే సంతోషము ఉండాలి, భయపడకూడదు. మీరు ఎంతో సంపాదన చేసుకుంటున్నారు. శరీరాన్ని వదిలేవారు తాము ఎంత సంపాదన చేసుకున్నారు అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళారో వారిలో ఎవరి పదవిని గొప్పది అని చెప్పవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఫలానావారు ఎంతో సేవ చేసేవారు, వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకున్నారు. వారు ముందుగానే వెళ్ళిపోయారు. వారి పాత్ర అంతే ఉంది. మళ్ళీ ఎంతో కొంత జ్ఞానాన్ని తీసుకునేందుకు రావచ్చు, ఇది జరగవచ్చు. వారసులుగా అయితే అయ్యారు కదా. ఎవరితోనో లెక్కాచారాలను తీర్చుకోవలసి ఉంటుంది, దానిని తీర్చుకునేందుకు వెళ్ళారు. ఆ ఆత్మలో జ్ఞాన సంస్కారాలైతే ఉన్నాయి కదా. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. అవి మాయమవ్వవు. ఎక్కడైనా మంచి స్థానములో సేవ చేస్తూ ఉండవచ్చు. జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్ళారు కావున వెళ్ళి ఎంతోకొంత సేవ చేస్తారు. అలాగని అందరూ అలా వెళ్తారని కాదు, అలా కాదు. అయితే యోగములో ఉండడం ద్వారా ఆయువు తప్పకుండా పెరుగుతుంది. మ్యానర్స్ (నడవడిక) కూడా చాలా బాగుండాలి. బాబా, మీరు ఎంత మధురమైనవారు, నేను కూడా మీ వలె మధురముగా అవుతాను, మేము కూడా మీ వలె జ్ఞానసాగరులుగా అవుతాము అని అంటారు. తండ్రి అంటారు, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి, నేను మాస్టర్ జ్ఞానసాగరునిగా అయ్యానా? మాత, పితల సమానముగా ఇతరులకు జ్ఞానాన్ని ఇస్తున్నానా? నా వల్ల ఎవరూ అసంతుష్టులవ్వడం లేదు కదా? శాంతిని ధారణ చేసానా? శాంతి మన స్వధర్మం కదా. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. నాలో ఏ వికారమూ లేదు కదా అని చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా వికారము ఉన్నట్లయితే ఫెయిల్ అయిపోతారు. ఇలా, ఇలా మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది విచార సాగర మథనము చేస్తూ శ్రీమతము ద్వారా తమను తాము పర్ఫెక్ట్ గా చేసుకోవడము. మిగిలినవారంతా ఆసురీ మతము ద్వారా అన్-పర్ఫెక్ట్ గా (అసంపూర్ణలుగా) అవుతూ ఉంటారు. ఇంతకుముందు మనం కూడా ఎంత అన్-పర్ఫెక్ట్ గా ఉండేవారము. అప్పుడు ఏ గుణాలూ ఉండేవి కావు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అని గానం చేస్తారు కదా. ఆ పదాలు ఎంత బాగున్నాయి. మహిమ అంతా ఆ పరమపిత పరమాత్మదే. గురునానక్ కూడా వారి మహిమనే చేసేవారు. కావున మనుష్యులకు కూడా అర్థం చేయించాలి.

కల్పపూర్వము ఎవరి అంటు అయితే కట్టబడిందో వారే వస్తారని మరియు ధారణ చేస్తారని పిల్లలకు తెలుసు. లేకపోతే, తికమక చెందినవారిలా వస్తారు మరియు వెళ్ళిపోతారు. మనకు జ్ఞానసాగరుడైన తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చారో అది ఇంకెవ్వరిలోనూ లేదని ఇక్కడ మీకు తెలుసు. మనం గుప్తవేషములో ఉన్నాము. తర్వాత మనము భవిష్యత్తులో స్వర్గానికి యజమానులుగా అవుతాము. కర్మలైతే అందరూ చేస్తున్నారు. కానీ మనుష్యుల కర్మలన్నీ వికర్మలవుతాయి ఎందుకంటే వాటిని రావణుని మతముపై చేస్తారు. మనం శ్రీమతముపై కర్మలు చేస్తాము, శ్రీమతాన్ని ఇచ్చేవారు బాబా.

మీరు సాల్వేషన్ ఆర్మీ (రక్షక దళము) అని బాబా అర్థం చేయించారు. ఎవరైతే మునిగిపోయిన నావలను తీరం చేరుస్తారో వారినే సాల్వేషన్ ఆర్మీ అని అంటారు. వారు దుఃఖితులను సుఖమయంగా చేస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతముపై అందరి నావలను తీరానికి చేరుస్తున్నారు. బలిహారమైతే శివబాబాదే కదా. మనం ఇంతకుముందు మూర్ఖులుగా ఉండేవారము. తండ్రి మతము లభించడంతో ఇక ఇతరులకు కూడా మతమును ఇస్తున్నాము. తండ్రి సమ్ముఖముగా వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. ఇలా వచ్చేందుకు రావణుడు ఏమీ ఒక వ్యక్తి కాదు. మాయ వికారాలలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడైతే తండ్రి మతాన్ని ఇస్తారు. ఏ విధంగా స్కూల్లో టీచర్ చదివిస్తారు. అదే విధముగా తప్పుడు చదువును చదివించేందుకు రావణుడు ఒక వ్యక్తి ఏమీ కాదు. తండ్రి జ్ఞానసాగరుడు. రావణుడిని సాగరుడని కానీ, నాలెడ్జ్ ఫుల్ అని కానీ అనరు. ఇప్పుడు మీరు శ్రీమతముపై నడుస్తున్నారు. మీరు బ్రాహ్మణులుగా అయి యజ్ఞ సేవను చేస్తారు. మీరు రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పించాలి. వారు యజ్ఞాలను రచించినప్పుడు శాస్త్రాలను కూడా పెడతారు కదా. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కానీ రుద్రుడు ఎక్కడ ఉన్నారు. ఇక్కడైతే రుద్రుడైన శివబాబా ప్రాక్టికల్ గా ఉన్నారు. వర్తమానములో రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఏదైతే గతంలో ఉండేదో అది ఇప్పుడు వర్తమానంలో ఉంది. మనుష్యులు గతాన్నే తలచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వారసత్వాన్ని తీసుకుంటున్నారు. గతంలో ఏదైతే ఉందో అది ఇప్పుడు వర్తమానంలో ఉంది, మళ్ళీ అదే భూతకాలంగా అవుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. కలియుగం కూడా గతించిపోయి మళ్ళీ సత్యయుగము రావాలి. ఇప్పుడు సంగమయుగము వర్తమానంలో ఉంది. గతంలో ఏవైతే జరిగాయో వాటి స్మృతిచిహ్నాలు ఉన్నాయి, ఎవరి జడమైన స్మృతిచిహ్నాలైతే ఉన్నాయో వారు ఇప్పుడు వర్తమానంలో చైతన్యముగా ఉన్నారు. ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో వారి మాలయే తయారయ్యింది. రుద్రమాల ఉంది కదా. ఇవన్నీ జడమైన చిత్రాలు. తప్పకుండా ఏదో చేసి వెళ్ళారు కావుననే రుద్రమాల అని అంటారు కదా. మీరు చైతన్యములో శివబాబా మాలగా నంబరువారుగా అవుతున్నారు. ఎంతగా యోగము జోడిస్తారో అంతగా సమీపముగా వెళ్ళి రుద్రుని కంఠహారముగా అవుతారు. ఇప్పుడు మనం సంగమయుగములో ఉన్నాము. ఈ-ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. మీకైతే జ్ఞానము ఉంది. మేము నిజానికి శివబాబా పిల్లలమని మీ లోలోపల ఈ చింతన కొనసాగుతూ ఉంటుంది. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము, మళ్ళీ చక్రములోకి వస్తాము. దీనిని స్వదర్శన చక్రము అని అంటారు. మీరు ఇతరులను ఎందుకు నిందిస్తున్నారు? అని చాలామంది మనుష్యులు అంటారు. మీరు చెప్పండి, భగవానువాచ అని వ్రాసి ఉంది, అంతేకానీ మేము ఎవరినీ నిందించడం లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతముపై ప్రతి కర్మనూ శ్రేష్ఠముగా చేయాలి. అందరి మునిగిపోయిన నావలను శ్రీమతము ఆధారంగా తీరానికి చేర్చాలి. దుఃఖితులకు సుఖాన్నివ్వాలి.

2. లోలోపల స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ రుద్రమాలలో సమీపముగా వచ్చేందుకు స్మృతిలో ఉండాలి. జ్ఞాన మథనాన్ని చేయాలి. మీతో మీరు తప్పకుండా మాట్లాడుకుంటూ ఉండాలి.

వరదానము:-

బ్రాహ్మణ జీవితంలో సదా ఆనందాన్ని మరియు మనోరంజనాన్ని అనుభవం చేసే అదృష్టవంతులుగా కండి

అదృష్టవంతులైన పిల్లలు సదా సంతోషమనే ఊయలలో ఊగుతూ బ్రాహ్మణ జీవితంలో ఆనందాన్ని మరియు మనోరంజనాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్మృతి మరియు సేవ అనే రెండు తాళ్ళు టైట్ గా ఉంటాయో అప్పుడు ఈ సంతోషమనే ఊయల ఏకరసంగా ఉంటుంది. ఒక్క తాడు లూజ్ గా ఉన్నా ఊయల కదిలిపోతుంది మరియు ఊగేవారు పడిపోతారు, అందుకే రెండు తాళ్ళు దృఢంగా ఉన్నట్లయితే మనోరంజనాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. సర్వశక్తివంతుని తోడు ఉంటే మరియు సంతోషాల ఊయల ఉంటే దాని అంతటి అదృష్టం ఇంకేమి ఉంటుంది.

స్లోగన్:-

అందరి పట్ల దయా భావాన్ని మరియు కృపా దృష్టిని ఉంచేవారే మహాన్ ఆత్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top