TELUGU MURLI 27-02-2023

                 27-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి అనంతమైన సృష్టి యొక్క సేవార్థము వచ్చారు, నరకాన్ని స్వర్గముగా తయారుచేయడము – ఈ సేవను కల్ప-కల్పమూ తండ్రియే చేస్తారు’’

ప్రశ్న:-

సంగమములోని ఏ ఆచారము మొత్తం కల్పమంతటిలోకీ అతీతమైనది?

జవాబు:-

మొత్తం కల్పములో పిల్లలు తండ్రికి నమస్కరిస్తారు, కానీ సంగమములో తండ్రి పిల్లలకు నమస్కరిస్తారు. తండ్రి అంటారు, నేను చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలైన మీ సేవలో ఉపస్థితుడనయ్యాను, కావున పిల్లలైన మీరే పెద్దవారు అయినట్లు కదా. తండ్రి కల్పం తర్వాత పిల్లల వద్దకు వస్తారు, మొత్తం సృష్టిలోని చెత్తను శుభ్రం చేసి నరకాన్ని స్వర్గంగా తయారుచేయడానికి. తండ్రి వంటి నిరాకారి, నిరహంకారి ఇంకెవ్వరూ ఉండలేరు. తండ్రి అలసిపోయిన తమ పిల్లలకు కాళ్ళు ఒత్తుతారు.

ఓం శాంతి.

వచ్చీ రావడంతోనే, తండ్రి మొట్టమొదట పిల్లలకు నమస్కరించాలా లేక పిల్లలు తండ్రికి నమస్కరించాలా? (పిల్లలు తండ్రికి నమస్కరించాలి). అలా కాదు, మొదట తండ్రియే నమస్కరించవలసి ఉంటుంది. సంగమయుగపు ఆచార-వ్యవహారాలు అన్నింటికన్నా అతీతమైనవి. మీ అందరికీ తండ్రినైన నేను మీ సేవలో వచ్చి ఉపస్థితుడనయ్యాను అని స్వయంగా తండ్రియే చెప్తున్నారు. కావున తప్పకుండా పిల్లలు పెద్దవారు అయినట్లు కదా. ప్రపంచములోనైతే పిల్లలు తండ్రికి నమస్కారం చేస్తారు. ఇక్కడ తండ్రి పిల్లలకు నమస్కారం చేస్తారు. నిరాకారి, నిరహంకారి అన్న మహిమ కూడా ఉంది, కావున దానిని కూడా చూపించవలసి ఉంటుంది కదా. మనుష్యులు సన్యాసుల చరణాల వద్ద తల వంచుతారు. వారి చరణాలను ముద్దు పెట్టుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి, కల్పం తర్వాత, పిల్లలను కలుసుకునేందుకే వస్తారు. పిల్లలు చాలాకాలం దూరమై తర్వాత కలిసినవారు, అందుకే ఏమంటారంటే – మధురమైన పిల్లలూ, అలసిపోయారా. ద్రౌపదికి కూడా కాళ్ళు ఒత్తారు కదా. కావున వారు సేవకుడైనట్లు కదా. వందేమాతరం అని ఎవరు ఉచ్చరించారు? తండ్రి. మొత్తం సృష్టి అంతటి అనంతమైన సేవార్థము తండ్రి వచ్చారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ సృష్టిపై ఎంత చెత్త ఉంది. ఇదంతా నరకమే కావున తండ్రి నరకాన్ని స్వర్గముగా తయారుచేసేందుకు రావలసి ఉంటుంది, ఎంతో ప్రేమతో, ఉత్సాహముతో వస్తారు. నేను పిల్లల సేవార్థము రావలసి ఉంటుంది అని వారికి తెలుసు. కల్ప-కల్పమూ ఈ సేవలో ఉపస్థితమవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే వారు స్వయం వస్తారో అప్పుడు, తండ్రి మా సేవలో ఉపస్థితులయ్యారు అని పిల్లలు భావిస్తారు. ఇక్కడ కూర్చునే అందరి సేవ జరుగుతుంది. అలాగని అందరి వద్దకూ వెళ్తారు అని కాదు. వాళ్ళకు సర్వవ్యాపి అర్థం కూడా తెలియదు. మొత్తం సృష్టి అంతటి కళ్యాణకారి అయిన దాత ఒక్కరే కదా. వారు చేసినట్లుగా మనుష్యులెవ్వరూ సేవ చేయలేరు. వారిది అనంతమైన సేవ.

పాట:-

మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి… (జాగ్ సజనియా జాగ్…)

ఓం శాంతి.

ఇది ఎంత మంచి గీతమో చూడండి. నవ యుగము మరియు పురాతన యుగము… యుగాల గురించి కూడా అర్థం చేయించాలి. ఈ యుగాలు భారతవాసుల కొరకే. సత్య, త్రేతాయుగాలు ఒకప్పుడు ఉండేవని వారు భారతవాసుల నుండే వింటారు ఎందుకంటే వారు రావడం ద్వాపరములో వస్తారు. కావున వారు ఇతరుల ద్వారా వింటారు – ప్రాచీన ఖండము భారత్ అని, అందులో దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు అని. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. బ్రహ్మా ద్వారా స్థాపనను, విష్ణువు ద్వారా పాలనను చేయిస్తారని గానం చేస్తారు. వారు చేయరు, చేయిస్తారు. కావున ఇది వారి మహిమ. వాస్తవానికి వారు మొదట సూక్ష్మవతనపు రచనను రచించవలసి ఉంటుంది, ఎందుకంటే వారు రచయిత. గీతను సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమత్ భగవద్గీత అని అందరూ అంటారు. కానీ వారు ఏ భగవంతుడు, ఆ భగవంతుని పేరేమిటో తెలియదు. శాస్త్రాలను తయారుచేసే వ్యాసుడు మొదలైనవారు శ్రీకృష్ణుని పేరును వ్రాసేసారు. గీత అయితే దేవీ-దేవతా ధర్మానికి మాత, పిత వంటిది. మిగిలినవన్నీ తర్వాత వచ్చాయి. కావున ఇది ప్రాచీనమైనది అయినట్లు. అచ్ఛా! భగవంతుడు గీతను ఎప్పుడు వినిపించారు? తప్పకుండా ఆ సమయంలో అన్ని ధర్మాలు ఉండి ఉండాలి. వాస్తవానికి అన్ని ధర్మాలకూ ఒక్క గీతయే ముఖ్యమైనది. దీనిని అన్ని ధర్మాలవారూ నమ్మాలి. కానీ ఎక్కడ నమ్ముతున్నారు? ముస్లిములు, క్రైస్తవులు తమ-తమ ధర్మములో చాలా దృఢముగా ఉంటారు. వారు తమ ధర్మశాస్త్రాన్నే నమ్ముతారు. ఎప్పుడైతే గీత ప్రాచీనమైనది అని తెలుసుకుంటారో అప్పుడు దానిని తెప్పించుకుంటారు. కానీ భగవంతుడు గీతను ఎప్పుడు వినిపించారు అనేది తెలియదు. చిన్మయానందుడు అన్నారు, క్రీస్తుకు 3500 సంవత్సరాల క్రితం గీతా భగవానుడు గీతను వినిపించారు అని. కానీ 3500 సంవత్సరాల క్రితమైతే ఇతర ధర్మాలేవీ లేవు. మరి అది సర్వ ధర్మాల శాస్త్రముగా ఎలా అవ్వగలదు. ఈ సమయంలోనైతే అన్ని ధర్మాలూ ఉన్నాయి. గీత ద్వారా అన్ని ధర్మాల సద్గతిని చేసేందుకు తండ్రి వచ్చారు. గీత తండ్రి ద్వారా ఉచ్చరింపబడినది. అందులో తండ్రికి బదులుగా కొడుకు పేరును వ్రాసి దానిని కష్టతరం చేసారు. దీని వల్ల శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి అన్నది నిరూపించబడదు. శివజయంతి మరియు కృష్ణజయంతి కలిసిపోతాయి. శివజయంతి సమాప్తమవుతుంది, ఆ తర్వాత కృష్ణుని జన్మ జరుగుతుంది. ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ జ్ఞాన యజ్ఞము అని అనరు. రుద్ర జ్ఞాన యజ్ఞము అనే అంటారు, దాని నుండే వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. దానిని మీరు ప్రత్యక్షముగా చూస్తున్నారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మళ్ళీ స్థాపించబడుతోంది. ఇక తర్వాత ఇతర ధర్మాలు ఉండవు. ఎప్పుడైతే అన్ని ధర్మాలూ ఉండవో అప్పుడే కృష్ణుడు వస్తారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం కదా. సత్యయుగములో సూర్యవంశీ దేవీ-దేవతల రాజ్యము ఉన్నప్పుడు తప్పకుండా కొద్దిమంది మనుష్యులే ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు. భగవంతుడినైతే అందరూ కలుసుకోవలసి ఉంటుంది కదా. అందరూ తండ్రికి నమస్కరిస్తారు కదా. తర్వాత తండ్రి కూడా వచ్చి పిల్లలకు నమస్కరిస్తారు. పిల్లలు మళ్ళీ తండ్రికి నమస్కరిస్తారు. ఈ సమయంలో తండ్రి చైతన్యముగా వచ్చి ఉన్నారు. తర్వాత అక్కడ ఆత్మలందరూ తండ్రిని తప్పకుండా కలుసుకుంటారు. అందరూ భగవంతుడిని తప్పకుండా కలుసుకునేదే ఉంది. ఎక్కడ కలుసుకోవాలి? ఇక్కడైతే కలుసుకోలేరు ఎందుకంటే కోట్లాది మందిలో ఏ ఒక్కరో, ఆ కొద్దిమందిలో ఏ ఒక్కరో మాత్రమే వస్తారు. మరి భక్తులందరూ ఎప్పుడు మరియు ఎక్కడ కలుస్తారు? ఎక్కడి నుండైతే భగవంతుడి నుండి విడిపోయారో అక్కడికే వెళ్ళి కలుసుకుంటారు. భగవంతుని నివాస స్థానము పరంధామమే. తండ్రి అంటారు, నేను పిల్లలందరినీ దుఃఖము నుండి విముక్తులను చేసి పరంధామానికి తీసుకువెళ్తాను. ఈ పని వారొక్కరిదే. ఇప్పుడు చూడండి, అనేక భాషలు ఉన్నాయి. ఒకవేళ సంస్కృత భాషను ఉపయోగించడం మొదలుపెడితే ఇంతమంది ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఈ రోజుల్లో గీతను సంస్కృతములో కంఠస్థము చేయిస్తారు. సంస్కృతములో గీతను ఎంతో బాగా గానం చేస్తారు. కానీ అహల్యలకు, నడుము వంగిపోయిన వారికి, అబలలకు సంస్కృతము ఎక్కడ తెలుసు. హిందీ భాష కామన్. హిందీ ప్రచారము ఎక్కువగా ఉంది. భగవంతుడు కూడా హిందీలో వినిపిస్తున్నారు. వారు గీతా అధ్యాయాలను చూపిస్తారు, కానీ ఇక్కడ వినిపించేదానికి అధ్యాయాలను ఎలా తయారుచేయగలరు. ఇక్కడైతే మొదటి నుండి మురళి చెప్పబడుతూ ఉంది. తండ్రి పతిత సృష్టిని పావనంగా తయారుచేసేందుకు రావలసిందే. స్వర్గస్థాపకుడైన తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు. వారు నరకాన్ని ఏమైనా రచిస్తారా. నరకాన్ని రావణుడే స్థాపిస్తాడు, స్వర్గస్థాపనను తండ్రి చేస్తారు, వారి యథార్థ నామము శివ. శివ అనగా బిందువు. ఆత్మయే బిందువు కదా. నక్షత్రము అంటే ఏమిటి. అది ఎంత చిన్నగా ఉంటుంది. ఆత్మలు పైకి వెళ్తే పెద్దవిగా ఏమైనా అవుతాయా. భృకుటి మధ్యలో ఒక గుర్తుగా చూపిస్తారు. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార మెరుస్తూ ఉంటుందని అంటారు కూడా. మరి తప్పకుండా భృకుటి మధ్యలో ఇంత చిన్నని ఆత్మయే ఉండగలదు. కావున ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరమాత్మ కూడా ఉంటారు. కానీ, అద్భుతం ఏమిటంటే ఇంత చిన్నని ఆత్మలో అన్ని జన్మల పాత్రా నిండి ఉంది. అది ఎప్పుడూ అరిగిపోదు, సదా కొనసాగుతూనే ఉంటుంది. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. ఇంతకుముందెప్పుడైనా ఇటువంటి విషయాలను వినిపించారా? ఇంతకుముందు లింగరూపమని, అంగుష్టాకారమని చెప్పేవారు. మొదటే ఈ విషయాలను వినిపించినట్లయితే మీరు అర్థం చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు ఇవి బుద్ధిలో కూర్చుంటాయి. నక్షత్రము అని అయితే అందరూ అంటారు. సాక్షాత్కారము కూడా నక్షత్ర రూపములోనే జరుగుతుంది. మీకు ఏ సాక్షాత్కారము కావాలి? కొత్త ప్రపంచానిది. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తండ్రియే రచిస్తారు. వారే అందరినీ పంపిస్తారు. వారు స్వయం ఒక్కసారే వస్తారు. ఇప్పుడు మనుష్యులు శాంతిని కోరుకుంటారు ఎందుకంటే అందరూ శాంతిలోకే వెళ్ళనున్నారు. సుఖము కాకిరెట్టతో సమానమైనదని అంటారు. గీతలో రాజయోగము గురించి చెప్పబడింది, దాని ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. ఎవరైతే సుఖము కాకిరెట్టతో సమానమైనదని అంటారో వారికి రాజ్యం ఎలా లభించగలదు. ఇది ప్రవృత్తి మార్గపు విషయము. సన్యాసులు గీతను గురించి చెప్పడానికి కూడా వీల్లేదు. తండ్రి అంటారు, సన్యాసము రెండు రకాలుగా ఉంటుంది. నిజానికి సన్యాసుల్లో కూడా ఎన్నో రకాలవారు ఉన్నారు. ఇక్కడైతే ఒకే రకమైన సన్యాసము ఉంది. పిల్లలైన మీరు పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి. అలా ఎలా ఉంటున్నారు, అది వీరిని అడిగి తెలుసుకోండి. అలా ఉండేవారు ఎందరో ఉన్నారు. ఇది సన్యాసుల పని కాదు. అలాగైతే మరి వారు స్వయం ఇళ్ళూ-వాకిళ్ళను ఎందుకు వదిలేస్తారు. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. మొట్టమొదటైతే పత్నికి నేర్పించాలి. శివబాబా కూడా అంటారు, నేను కూడా మొట్టమొదట నా స్త్రీకు (సాకార బ్రహ్మాకు) అర్థం చేయిస్తాను కదా. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. శివబాబాకు వీరు చైతన్యమైన ఇల్లు. మొట్టమొదట నా స్త్రీ అయిన వీరు నేర్చుకుంటారు, ఆ తర్వాత వారి నుండి దత్తత తీసుకోబడిన పిల్లలు నంబరువారుగా నేర్చుకుంటున్నారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. అన్ని శాస్త్రాలలోకి ముఖ్యమైన శాస్త్రము గీత. కానీ వారేమీ గీతా శాస్త్రము ద్వారా ప్రేరణను ఇవ్వరు. వారు స్వయం ఇక్కడకు వస్తారు, స్మృతిచిహ్నాలు కూడా ఉన్నాయి. శివుని మందిరాలు ఎన్నో ఉన్నాయి. వారు స్వయం అంటారు, నేను సాధారణ బ్రహ్మా తనువులోకి వస్తాను. వీరికి తమ జన్మల గురించి తెలియదు. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. అందరూ బ్రహ్మా ముఖవంశావళులే కూర్చొని ఉన్నారు. కేవలం వీరు ఒక్కరికే తండ్రి అర్థం చేయిస్తారా, అలా కాదు. బ్రహ్మా ముఖము ద్వారా బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు, ఆ బ్రాహ్మణులకే అర్థం చేయిస్తారు. యజ్ఞం ఎల్లప్పుడూ బ్రాహ్మణుల ద్వారానే నడపబడుతుంది. ఆ గీతను వినిపించేవారి వద్ద బ్రాహ్మణులు లేరు, కావున అది అసలు యజ్ఞమే కానట్లు. ఇది చాలా భారీ యజ్ఞము. ఇది అనంతమైన తండ్రి యొక్క అనంతమైన యజ్ఞము. ఎంతకాలంగా పెద్ద-పెద్ద వంట పాత్రలు పొయ్యి పైకి ఎక్కుతూ ఉన్నాయి. ఇప్పటివరకు భండారా (వంటిల్లు) నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు సమాప్తమవుతుంది? ఎప్పుడైతే మొత్తం రాజధాని అంతా స్థాపించబడుతుందో అప్పుడు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. ఆ తర్వాత నంబరువారుగా పాత్రను అభినయించేందుకు పంపిస్తాను. నేను మీ మార్గదర్శకుడిని అని, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఇలా ఇంకెవరూ అనలేరు. పతిత మనుష్యులు ఎవరైతే ఉన్నారో, వారందరినీ పావనంగా తయారుచేసి తీసుకువెళ్తాను. ఆ తర్వాత తమ-తమ ధర్మాలను స్థాపించే సమయంలో పావన ఆత్మలు రావడం మొదలుపెడతారు. అనేక ధర్మాలు ఇప్పుడే ఉన్నాయి. కానీ ఒక్క ధర్మమే లేదు. ఆ తర్వాత అర్ధకల్పం వరకూ ఏ శాస్త్రమూ ఉండదు. కావున గీత అన్ని ధర్మాల, అన్ని శాస్త్రాల శిరోమణి. ఎందుకంటే దీని ద్వారానే అందరి గతి-సద్గతి జరుగుతుంది. కావున భారతవాసులకే సద్గతి లభిస్తుందని, మిగిలిన వారందరికీ గతి లభిస్తుందని అర్థం చేయించాలి. భారతవాసులలో కూడా ఎవరైతే మొట్టమొదట పరమాత్మ నుండి విడిపోయారో వారే మొదట జ్ఞానాన్ని తీసుకుంటారు. వారే మళ్ళీ మొట్టమొదట వెళ్ళడం ప్రారంభిస్తారు. మళ్ళీ నంబరువారుగా అందరూ రావాలి. సతో, రజో, తమో గుణాలనైతే అందరూ దాటాలి. ఇప్పుడు కల్పం యొక్క ఆయువు పూర్తయ్యింది. ఆత్మలందరూ హాజరైయున్నారు. తండ్రి కూడా వచ్చేసారు. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయించాలి. నాటకంలో నటులందరూ ఒకేసారి రారు కదా, తమ-తమ సమయమనుసారంగా వస్తారు. నంబరువారుగా ఎలా వస్తారు అనేది తండ్రి అర్థం చేయించారు. వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పిలక బ్రాహ్మణులకు చిహ్నము. కానీ ఆ బ్రాహ్మణులను కూడా రచించేవారు ఎవరు? శూద్రులైతే రచించరు. పిలక కన్నా పైన బ్రాహ్మణులకు తండ్రి అయిన బ్రహ్మా ఉన్నారు. ఆ బ్రహ్మాకు తండ్రి శివబాబా. కావున మీరు శివ వంశీ బ్రహ్మా ముఖవంశావళి. బ్రాహ్మణులైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. వర్ణాల లెక్కను అర్థం చేయించాలి. పిల్లలకు సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకే రకమైన తెలివి కలిగియుండరు. కొత్తవారి ముందు ఎవరైనా విద్వాంసులు, పండితులు మొదలైనవారు వాదిస్తే వారు అర్థం చేయించలేరు. కావున అప్పుడు, నేను కొత్తవాడిని, మీరు ఫలానా సమయంలో రండి, అప్పుడు మా కన్నా పెద్దవారు వచ్చి మీకు అర్థం చేయిస్తారు, నా కన్నా చురుకైనవారు ఇంకా ఉన్నారు అని చెప్పాలి. క్లాస్ లో నంబరువారుగా ఉంటారు కదా. ఇందులో దేహాభిమానంలోకి రాకూడదు లేకపోతే పరువు పోతుంది. బి.కే.లు పూర్తిగా అర్థం చేయించలేరు అని అంటారు. అందుకే దేహాభిమానాన్ని వదిలి ఇతరుల వైపుకు రిఫర్ చేయాలి. నేనూ పైనున్న వారిని అడుగుతాను అని ఈ బాబా కూడా అంటారు కదా. పండితులు బాగా తల పాడు చేసేస్తారు. కావున వారికి చెప్పాలి – నేను నేర్చుకుంటున్నాను, నన్ను క్షమించండి, మీరు రేపు వచ్చినట్లయితే మా పెద్ద అన్నయ్యలు, అక్కయ్యలు మీకు అర్థం చేయిస్తారు. మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, పాదచారులు ఉన్నారు కదా. కొందరు సింహంపై సవారీ చేసేవారు కూడా ఉన్నారు. సింహం అన్నింటికన్నా చురుకైనది. అడవిలో ఒంటరిగా ఉంటుంది. ఏనుగు ఎల్లప్పుడూ గుంపులలో ఉంటుంది, అది ఒంటరిగా ఉంటే ఎవరైనా హతమార్చేస్తారు కూడా. సింహం చాలా చురుకుగా ఉంటుంది. శక్తులు కూడా సింహాలపై స్వారీ చేస్తారు.

మీ ఈ మిషన్ (కార్యము) కూడా బయటకు (విదేశాలకు) వెళ్ళనున్నది. కానీ ఈ బాధ్యతను తీసుకునేవారు ఎవరు అనేది బాబా చూస్తారు. ప్రాచీన దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు – ఇది నిరూపించి చెప్పాలి. చాలామంది గాడ్, గాడెస్ అని కూడా అంటారు. దేవీ-దేవతలు వేరు, ఈశ్వరుడు వేరు అని వారు భావిస్తారు. లక్ష్మీ-నారాయణులను భగవతీ, భగవానులు అని అంటారు. కానీ అలా అనడం నియమ విరుద్ధం. నిజానికి వారు దేవీ-దేవతలే. ఒకవేళ లక్ష్మీ-నారాయణులను భగవతి, భగవానులు అని అన్నట్లయితే వారికన్నా ముందు బ్రహ్మా, విష్ణు, శంకరులను భగవాన్ అని అనవలసి ఉంటుంది. వివేకము కూడా కావాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానాన్ని వదిలి మీ కన్నా పెద్దవారిని ముందు ఉంచాలి. తండ్రి సమానముగా నిరహంకారులుగా అవ్వాలి.

2. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది… మొదట మీ గృహస్థ వ్యవహారాన్ని కమలపుష్ప సమానముగా తయారుచేసుకోవాలి. ఇంట్లో ఉంటూ బుద్ధి ద్వారా పాత ప్రపంచమంతటినీ సన్యసించాలి.

వరదానము:-

సంబంధాలలో సంతుష్టత రూపీ స్వచ్ఛతను ధారణ చేసి సదా తేలికగా మరియు సంతోషంగా ఉండే సత్యమైన పురుషార్థీ భవ

మొత్తం రోజంతటిలో వెరైటీ ఆత్మలతో సంబంధం ఏర్పడుతుంది. అందులో చెక్ చేసుకోండి – మొత్తం రోజంతటిలో స్వయం యొక్క సంతుష్టత మరియు సంబంధంలోకి వచ్చే ఇతర ఆత్మల సంతుష్టత ఎంత శాతము ఉంది? సంతుష్టతకు గుర్తు – స్వయం కూడా మనసుతో తేలికగా మరియు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతోషంగా ఉంటారు. సంబంధాలలో స్వచ్ఛత అనగా సంతుష్టత, ఇదే సంబంధాలలో సత్యత మరియు స్వచ్ఛత, అందుకే సత్యము ఉన్న చోట మనసు ఆనందముతో నాట్యం చేస్తుంది అని అంటారు. సత్యమైన పురుషార్థులు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

ఎవరికైతే ఏ విషయము యొక్క దుఃఖము ఉండదో, వారే నిశ్చింత రాజ్యానికి నిశ్చింత చక్రవర్తులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top