TELUGU MURLI 23-02-2023

23-02-2023 ప్రాత:మురళిఓంశాంతి”బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – ఒకరికొకరు తండ్రి మరియు వారసత్వముల స్మృతిని ఇప్పించుకుంటూ సావధానపర్చుకోవడము మీ కర్తవ్యము, ఇందులోనే అందరి కళ్యాణం ఇమిడి ఉంది’’

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఏ ఒక్క గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకుంటారు, దానిని సైన్స్ వారెవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు?

జవాబు:-

మీరు అర్థం చేసుకుంటారు, ఆత్మ అతి సూక్ష్మమైన నక్షత్రము, అందులోనే అన్ని సంస్కారాలు నిండి ఉన్నాయి. ఆత్మయే శరీరము ద్వారా తన-తన పాత్రను అభినయిస్తూ ఉంది. శరీరము జడమైనది, ఆత్మ చైతన్యమైనది. అలాగే పరమాత్మ కూడా నక్షత్రము వలె ఉన్నారు, వారిలోనే మొత్తం జ్ఞానం ఉంది. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారేమీ వేల సూర్యుల కన్నా తేజోమయుడు కారు. ఈ గుహ్యమైన రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. సైన్స్ వారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మీరు అందరికీ ఆత్మ మరియు పరమాత్మల పరిచయాన్ని మొట్టమొదట ఇవ్వాలి.

పాట:-

మాతా ఓ మాతా, నీవు అందరి భాగ్య విధాతవు… (మాతా ఓ మాతా తూ సబ్కీ భాగ్య విధాత…)

ఓంశాంతి.

తండ్రి పిల్లల కోసం అన్నారు, పిల్లలూ, స్వదర్శన చక్రధారీ భవ. తండ్రి పిల్లలను ఈ విధంగా సావధానపరిచారు. పిల్లలు కూడా ఒకరినొకరు సావధానపర్చుకోవాలి. తండ్రిని స్మృతి చేయడముతో వెంటనే ఆ నషా ఎక్కుతుంది. స్మృతినిప్పించేందుకు ఒకరినొకరు సావధానపర్చుకోవాలి. ఎలాగైతే పరస్పరంలో కలుసుకున్నప్పుడు నమస్కారం మొదలైనవి చేస్తారు కదా. కానీ దాని వలన కళ్యాణమేమీ జరగదు. ఎప్పుడైతే పిల్లలైన మీరు ఒకరినొకరు సావధానపర్చుకుంటారో, అప్పుడే కళ్యాణము జరుగుతుంది. స్వదర్శన చక్రధారి అన్న పదములో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి పరిచయము, పదవి యొక్క పరిచయము, చక్రం యొక్క పరిచయము కూడా వచ్చేసింది. కావున ఒకరినొకరు సావధానపర్చుకోవడము మొదటి కర్తవ్యము. స్మృతి కలిగించడం ద్వారా అప్రమత్తమవుతారు. ఘడియ-ఘడియ ఒకరినొకరు సావధానపర్చుకోవాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మీరు స్వదర్శన చక్రధారులు, స్వయాన్ని అశరీరిగా భావిస్తూ, అశరీరి అయిన తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి అనగా యోగము. యోగముతోనే మీది నిరోగి శరీరముగా అవుతుంది. ఇది ఇప్పటి పురుషార్థము. అంతిమంలో ఎప్పుడైతే పూర్తి కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో, అప్పుడే నిరోగులుగా అవుతారు. ఇప్పుడైతే పురుషార్థులుగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే అందరూ తెలివిహీనులుగా ఉన్నారని తెలుసు. దేవతలు మొదలైనవారిని పూజించేటప్పుడు, వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు, కావున మీరు అర్థం చేయించాలి – మేము అందరి జీవితచరిత్రను తెలియజేయగలము. మొదట అయితే ముఖ్యమైన పరమపిత పరమాత్మను తెలుసుకోవాలి. అందులో కూడా చాలామంది మనుష్యులు తికమకపడతారు. పరమాత్మకు నామ రూపాలు ఏవీ లేవని అంటారు. కావున మొట్టమొదట ముఖ్యమైన విషయము – ఆత్మ పరమాత్మల బేధాన్ని మరియు జ్ఞానాన్ని తెలియజేయడము. అందరూ ఆత్మలేనని తెలుసు. పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు. పాప పరమాత్మ అని అనరు. పతిత ప్రపంచము కదా. పరమాత్మ అయితే పతితంగా అవ్వరు, అందుకే మనుష్యులు మొట్టమొదట ఆత్మను తెలుసుకోవాలి ఎందుకంటే ఆత్మ జ్ఞానం మనుష్యులెవ్వరిలోనూ లేదు. ఆత్మనే వింటుంది, ఆత్మలే తింటాయి-తాగుతాయి, అన్నీ ఈ ఇంద్రియాల ద్వారా చేస్తాయి. ఆత్మ రూపమేమిటి? భృకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుందని అంటారు. కావున ఆత్మ రూపాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది కదా. ఆత్మ రూపము ఏమీ ఇంత పెద్దగా అయితే ఉండదు. ఆత్మ అతి సూక్ష్మమైనది. ఆత్మ రూపము జీరో లేక బిందువు అని కూడా అంటారు. ఆత్మ ఎంత సూక్ష్మమైనది అన్నదాని గురించి కూడా ఇప్పుడు ఆలోచించాలి. మనుష్యులు అడుగుతారు, ఆత్మ శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది? ఎక్కడి నుండి బయటకు వస్తుంది? తల నుండి బయటకు వస్తుందని కొందరు అంటారు, కళ్ళ నుండి బయటకు వస్తుందని కొందరు అంటారు… ఎందుకంటే ద్వారాలైతే చాలా ఉన్నాయి కదా. కానీ ఆత్మ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవడము చాలా అద్భుతము. కావున ఆత్మ ఎలా బయటకు వెళ్ళిపోతుందని అడుగుతారు, ఆత్మ ఎలా వస్తుంది అన్నది అడగరు. కానీ మొదట అయితే ఆత్మ అంటే ఏమిటో తెలిసి ఉండాలి. ఎంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాలు చాలా అద్భుతమైనవి. ఆత్మ అయితే తప్పకుండా నక్షత్రం వలె ఉంటుంది. దానిని పెద్దది అని అనరు. విమానం పైకి వెళ్ళినప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఆత్మ పెద్దదిగా అవ్వదు. దానికైతే రూపం ఒకటే ఉంటుంది. కావున మొట్టమొదట ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మనైన నేను ఈ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాను. కొంతమందికి నక్షత్రం వలె సాక్షాత్కారం జరుగుతుంది. ఆ చిన్నని ఆత్మలో జ్ఞానమంతా నిండి ఉంది. ఆత్మ ఒక్కటే. ఇది చాలా అద్భుతము. పరమాత్మ రూపం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఆత్మ ఎలా ఉంటుందో, పరమపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారు. వారు కూడా తండ్రి. ఇక్కడ తండ్రి మరియు కొడుకు చిన్నగా, పెద్దగా ఉంటారు, కానీ ఆత్మ చిన్నగా-పెద్దగా ఉండదు. ఆత్మ మరియు పరమాత్మల రూపంలో తేడా ఏమీ ఉండదు. ఇకపోతే, ఇరువురి పాత్రలలో, సంస్కారాలలో భేదము ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు, నాలో ఏ సంస్కారాలు ఉన్నాయి, ఆత్మలైన మీలో ఏ సంస్కారాలున్నాయి? మనుష్య ఆత్మ మరియు పరమాత్మ యొక్క రూపం గురించి తెలియని కారణంగా ఆత్మ-పరమాత్మ ఒక్కటేనని అంటారు. చాలా గందరగోళం చేసేసారు. తెలుసుకోవడము చాలా అవసరము. పరమాత్మ కూడా ఉన్నారు, బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా ఉన్నారు, వీరందరిలోనూ ఆత్మ ఉంది. జగదంబ సరస్వతిని గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు. మరి తప్పకుండా సరస్వతి ఆత్మలో నాలెడ్జ్ ఉంటుంది. కానీ వారిలో ఏ నాలెడ్జ్ ఉంది అన్నది ఎవరికీ తెలియదు. కేవలం గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు. వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ మొదలైనవి వచ్చినప్పుడు వాటి గురించి అర్థం చేయించాలి. మీరు సరస్వతిని గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు కానీ వారు ఏ నాలెడ్జ్ ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? వారికి తప్పకుండా గాడ్ నుండి నాలెడ్జ్ లభించి ఉంటుంది కదా. గాడ్ రూపమేమిటి? గాడెస్ ఆఫ్ నాలెడ్జ్, ఈ పేరు ఎలా వచ్చింది? నాలెడ్జ్ ఫుల్ అయితే గాడ్ మాత్రమే. వారు సరస్వతిని నాలెడ్జ్ ఫుల్ గా ఎలా తయారుచేసారు? ఒక్క విషయముపైనే ఎవరినైనా సంగమముపై నిలబెట్టాలి.

బాబా అంటారు, మేము అర్థం చేయిస్తాము, ఇకపోతే రాసేందుకు సంజయ్ ఉన్నారు (జగదీష్ భాయ్ నిమిత్తంగా ఉన్నారు). వీరు నంబరువన్ ముఖ్యమైన యాక్టర్. వీరైతే బాబాతోపాటు రైట్ హ్యాండ్ గా ఉండాలి. కానీ డ్రామా విధి ఎటువంటిదంటే వీరు ఢిల్లీలో కూడా ఉండవలసి వస్తుంది. ఇది కల్పక్రితపు పాత్ర. అర్జునుని పేరు ముఖ్యమైనదిగా గాయనం చేయబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రతి విషయం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట అయితే ఆత్మ మరియు పరమాత్మను అర్థం చేసుకోవాలి.

తండ్రి పిల్లలకు అర్థం చేయించారు – ఆత్మ నక్షత్రం వంటిది. అందులో మొత్తం జ్ఞానమంతా ఎలా నిండి ఉంది అన్నది సైన్సువారు కూడా ఏమీ అర్థం చేసుకోలేరు. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు ఆత్మ అయితే నక్షత్రం వంటిది. అచ్ఛా, పరమాత్మ రూపమేమిటి? వారు కూడా పరమ ఆత్మయే. వ్యత్యాసం లేదు. వారు వేల సూర్యుల కన్నా తేజోమయుడు అని మహిమను ఏదైతే పాడుతారో, అలా ఉండరు. తండ్రి అంటారు, కేవలం ఆత్మ అయిన మీలో నాలెడ్జ్ లేదు, పరమాత్మనైన నేను నాలెడ్జ్ ఫుల్ ను – కేవలం ఈ వ్యత్యాసం ఉంది. మాయ మీ ఆత్మను పతితముగా చేసింది. ఇకపోతే, ఆరిపోయిన దీపమంటూ ఏమీ లేదు. కేవలం ఆత్మ నుండి తండ్రి మరియు రచన యొక్క నాలెడ్జ్ తొలగిపోయింది. ఇప్పుడు మీకు నాలెడ్జ్ లభిస్తూ ఉంది. బాబాలో నాలెడ్జ్ ఉంది, వారు కూడా ఆత్మనే. వారేమీ పెద్దగా ఉండరు. వారిని కూడా నాలెడ్జ్ ఫుల్, సరస్వతిని కూడా నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు వారికి నాలెడ్జ్ ఎప్పుడు లభించింది? సరస్వతి ఎవరి పుత్రిక? ఇది ఎవ్వరికీ తెలియదు. కావున వారికి ఎలా అర్థం చేయించాలని మనసులోకి రావాలి. తండ్రి అయిన పరమాత్మ ఎవరు, వారు నక్షత్రము వలె ఉన్నారు, వారిలో మొత్తం జ్ఞానం ఉంది – ఇది కూడా అర్థం చేయించాలి. గాడ్ ఫాదర్ మనుష్య సృష్టికి బీజరూపుడు. అందరికీ అనంతమైన తండ్రి. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, వారిలో సత్యమైన నాలెడ్జ్ ఉంది. వారిని ట్రూత్ అని కూడా అంటారు. ఇంకెవ్వరిలోనూ సత్యమైన నాలెడ్జ్ లేదు. రచయిత ఒక్క తండ్రినే. కావున మొత్తం రచన యొక్క జ్ఞానము కూడా వారిలోనే ఉంది. వారు వృక్షానికి బీజరూపుడు కదా. ఆత్మ అయితే చైతన్యమైనది. శరీరమైతే జడమైనది. ఆత్మ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఇది చైతన్యంగా అవుతుంది. కావున తండ్రి అర్థం చేయిస్తారు, నేను కూడా అదే విధంగా ఉంటాను. ఆత్మ చిన్నగా, పెద్దగా అవ్వదు. ఏ విధంగా ఆత్మలైన మీరు ఉన్నారో, అలాగే పరమ ఆత్మ అంటే పరమాత్మ కూడా ఉంటారు, మళ్ళీ వారి మహిమ అందరికన్నా ఉన్నతమైనది. మనుష్య సృష్టికి బీజరూపుడు. మనుష్యులే వారిని స్మృతి చేస్తారు. తండ్రి పైన ఉంటారని అయితే తెలుసు. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా ఓ పరమపిత పరమాత్మ, అని అంటుంది. మనుష్యులకు ఇది తెలియదు ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అయ్యారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారు. గాడ్ అని అయితే నిరాకారుడినే అంటారని మీకు తెలుసు. మనం వారి సంతానము. ఆ గాడ్ యే వచ్చి నాలెడ్జ్ ఇస్తారు. వారిని నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్ అని అంటారు. దయాసాగరుడు, సుఖసాగరుడు, శాంతిసాగరుడు… ఈ మహిమను ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభించాలి. వారు ఏదో ఒక సమయంలో వచ్చి వారసత్వాన్ని ఇచ్చారు, అందుకే మహిమను చేయడం జరుగుతుంది. దేవతల మహిమ వేరు. తండ్రి మహిమ వేరు. ఆత్మలందరికీ వారు తండ్రి. రచయిత అయిన కారణంగా వారిని బీజరూపుడు అని అంటారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శాస్త్రాలలో బొటనవ్రేలు వలె ఉంటారని చూపిస్తారు. వారు జ్యోతిర్బిందువు అని మనం అంటాము. చిత్రాన్ని కూడా తయారుచేసాము. కానీ ఇంత పెద్దగా అయితే వారు ఉండరు. వారైతే అతి సూక్ష్మమైనవారు. కావున ఏం అర్థం చేయించాలి? చిత్రములో ఇంత పెద్ద రూపాన్ని ఎందుకు చూపించారని మిమ్మల్ని అడుగుతారు. లేకపోతే ఏం చూపించాలి అని అడగండి. వారైతే ఒక బిందువు, మరి వారిని ఎలా పూజిస్తారు? వారిపై పాలతో ఎలా అభిషేకం చేస్తాము? పూజ కోసం ఈ రూపం తయారుచేయబడింది. ఇకపోతే, వారు పరమపిత పరమ ఆత్మ, పరంధామంలో ఉండేవారని అర్థం చేసుకుంటారు. ఆ పరంధామము మన మధురమైన ఇల్లు. నిరాకారీ ప్రపంచము, మూలవతనము, సూక్ష్మవతనము ఆ తర్వాత స్థూలవతనము. తండ్రి నిరాకారీ లోకంలో ఉంటారు. మేము నిర్వాణధామంలోకి వెళ్ళాలని ఆత్మ అంటుంది. అక్కడ ఈ ఇంద్రియాలు ఉండవు. ఆత్మయే వచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. ఆత్మ ఎక్కడి నుండి వెళ్తుంది అన్నది ఇప్పుడు ఎలా అర్థం చేయించాలి. పిండంలోకి ఆత్మ ప్రవేశించడంతో చైతన్యమవుతుందని తెలుసు. వస్తువు ఎంత సూక్ష్మమైనది. అందులోనే అన్ని సంస్కారాలు నిండి ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క జన్మ యొక్క సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. సరస్వతి యొక్క విషయంపై కూడా అర్థం చేయించవచ్చు. వారు ఎవరి పుత్రిక? ఈ సమయంలో మిమ్మల్ని గాడెస్ అనైతే అనలేరు. సరస్వతి బ్రహ్మా యొక్క పుత్రిక. కావున తప్పకుండా వారు కూడా గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అయినట్లు. బ్రహ్మా ముఖ కమలము ద్వారా జ్ఞానము ఇచ్చినట్లుగా చూపిస్తారు. మరి బ్రహ్మా పేరు కూడా ఉంది కదా. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు. ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది కానీ శరీరమైతే పవిత్రంగా అవ్వదు. ఇది తమోప్రధాన శరీరము. కావున తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఒకరినొకరు సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తున్నారా? స్వదర్శన చక్రాన్ని స్మృతి చేస్తున్నారా? బాబా అంటారు, ఒక్కరు కూడా ఈ విధంగా సావధానపర్చుకోవడము లేదు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ నిద్రను జయించేవారిగా అవ్వాలి, ఇందులోనైతే చాలా సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడూ అలసట ఉండదు. కానీ స్థూలమైన పనులు కూడా చేయవలసి ఉంటుంది, అందుకే అలసట కూడా కలుగుతుంది.

తండ్రి అర్థం చేయిస్తారు, రాత్రి కూడా మేల్కొని బాబాతో మాట్లాడుతూ ఉండండి, జ్ఞాన సాగరంలో మునకలు వేయవలసి ఉంటుంది. ఎలాగైతే ఒక జంతువు ఉంటుంది, నీటిలో మునకలు వేస్తూ ఉంటుంది. కావున ఈ విధంగా మునకలు వేయడం ద్వారా, విచార సాగర మధనం చేయడం ద్వారా చాలా పాయింట్లు రావడము చూస్తారు. ఎక్కడెక్కడి నుండో బయటకు వస్తాయి. దీనినే రాత్రి మేల్కొని జ్ఞానాన్ని విచార సాగర మధనం చేయడము అని అంటారు. మనుష్యులకు ఏ మాత్రము తెలియదు, వారికి అర్థం చేయించాలి. తండ్రి జ్ఞాన సాగరుడు, వారి నుండి వారసత్వం లభించనున్నది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మంవారు ఎవరైతే సత్యయుగంలో ఉండేవారో, వారికి తప్పకుండా వారసత్వం లభించి ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం రాజధాని అంతటికీ వారసత్వం ఎలా లభించింది? కలియుగము నుండి సత్యయుగముగా అవ్వడంలో ఆలస్యమైతే పట్టదు, రాత్రి పూర్తయి పగలు వస్తుంది. ఇనుప యుగపు ప్రపంచమైన దుఃఖధామము ఎక్కడ, ఎక్కడ ఆ సుఖధామము. బ్రహ్మా పగలు మరియు బ్రహ్మా రాత్రికి ఎంత తేడా ఉంది! ఇప్పుడు గాడ్ ఫాదర్ నుండి మీకు నాలెడ్జ్ లభిస్తూ ఉంది. సరస్వతి ఏం చేసేవారో ఎవరికీ తెలియదు. కేవలం గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అయిన సరస్వతి యొక్క చిత్రము లభించింది మరియు సంతోషపడిపోయారు. కావున వారిని సావధానపరచవలసి ఉంటుంది. పరమాత్మ పరిచయము ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరుల పరిచయాన్ని కూడా ఇవ్వాలి. తండ్రి వచ్చి ఈ నాలెడ్జ్ ఇచ్చి నరుని నుండి నారాయణునిగా తయారుచేసారు. చాలా యుక్తితో ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని తెలియజేయాలి. సరస్వతి కూడా బ్రహ్మా ముఖ వంశావళి. మరి తప్పకుండా పరమపిత పరమాత్మ వచ్చి వారు బ్రహ్మా ద్వారా ముఖ వంశావళిని రచించారు. మొట్టమొదట నాలెడ్జ్ ఎవరికిచ్చారు? కలశాన్ని సరస్వతికి ఇచ్చారని అంటారు. మధ్యలో బ్రహ్మాను మాయం చేసారు. బ్రహ్మా తనువులోకి వచ్చి మాతలకు కలశాన్ని ఇచ్చారని ఎవ్వరికీ తెలియదు. మరి తప్పకుండా బ్రహ్మా కూడా వింటూ ఉంటారు కదా. బ్రహ్మా చేతిలో శాస్త్రాలను కూడా చూపిస్తారు. బ్రహ్మా మతము ప్రసిద్ధి చెందింది. మరి వారు కూడా అన్ని వేద, శాస్త్రాల సారం యొక్క మతాన్ని ఇస్తూ ఉంటారు. బ్రహ్మా ద్వారా శివబాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు? ఈ రథం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎవరికీ తెలియదు. బాబా ఇప్పుడు తెలియజేసారు, దీనిని మీరు అర్థం చేయించవచ్చు. అచ్ఛా!

మధురాతి-మధురవైున సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రాత్రి వేళ మేల్కొని జ్ఞానాన్ని విచార సాగర మంథనం చేయాలి. జ్ఞాన సాగరంలో మునకలు వేయాలి. తండ్రిని స్మృతి చేస్తూ నిద్రను జయించేవారిగా అవ్వాలి.

2. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. పరస్పరంలో తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిని ఇప్పించుకుంటూ ఒకరికొకరు సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందాలి.

వరదానము:-

స్వయాన్ని సంగమయుగీగా భావిస్తూ వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేసే సమర్థ ఆత్మ భవ

ఈ సంగమయుగము సమర్థ యుగము. కావున సదా ఈ స్మృతిని ఉంచుకోండి – మనం సమర్థ యుగ నివాసులము, సమర్థ తండ్రికి పిల్లలము, సమర్థ ఆత్మలము, అప్పుడు వ్యర్థం సమాప్తమైపోతుంది. కలియుగము వ్యర్థము, ఎప్పుడైతే కలియుగం నుండి దూరంగా వచ్చేసారో, సంగమయుగీగా అయ్యారో వ్యర్థం నుండి దూరమైనట్లే. ఒకవేళ కేవలం సమయం గుర్తున్నా కూడా సమయానుసారంగా కర్మ స్వతహాగానే నడుస్తుంది. అర్ధకల్పము వ్యర్థము ఆలోచించారు, వ్యర్థమైనవి చేసారు, కానీ ఇప్పుడు ఎటువంటి సమయమో, ఎటువంటి తండ్రినో, అటువంటి పిల్లలుగా ఉన్నారు.

స్లోగన్:-

ఎవరైతే సదా ఈశ్వరీయ విధానాలపై నడుస్తారో, వారే బ్రహ్మా తండ్రి సమానంగా మాస్టర్ విధాతలుగా అవుతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top