TELUGU MURLI 03-04-2024

       03-04-2023 ప్రాత:మురళి ఓంశాంతి” బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి వచ్చారు, దాని ద్వారా మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకొని తెలివైనవారిగా అయ్యారు’’

ప్రశ్న:-

ఆత్మ మరియు శరీరము రెండింటినీ పవిత్రముగా చేసేందుకు లేక రాజ్య పదవి యొక్క అధికారము తీసుకునేందుకు సహజ విధి ఏమిటి?

జవాబు:-

మీ వద్ద దేహ సహితముగా పాత విలువలేనివి ఏవైతే ఉన్నాయో, వాటిని ఎక్స్-చేంజ్ చేసుకోండి. తండ్రికి అర్పించండి. పూర్తిగా బలి అవ్వండి, తండ్రిని ట్రస్టీగా చేసుకోండి. శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రముగా అవుతాయి. రాజ్య పదవి ప్రాప్తిస్తుంది. జనకుడు కూడా బలిహారమయ్యారు, అందుకే వారికి జీవన్ముక్తి లభించింది, పిల్లలైన మీరు కూడా తండ్రిని వారసునిగా చేసుకున్నట్లయితే 21 జన్మల అధికారము లభిస్తుంది.

పాట:-

నయనహీనునికి మార్గం చూపించు ప్రభూ… (నయనహీన్ కో రాహ్ దిఖావో ప్రభు…)

ఓంశాంతి.

పిల్లలు పాటను విన్నారు. భక్తులు ఈ విధంగా భగవంతుడిని పిలుస్తారు. భగవంతుడిని పూర్తిగా తెలుసుకోని కారణముగా మనుష్యులు ఎంతగా దుఃఖితులుగా ఉన్నారు. భక్తి మార్గములో ఎంతగా కష్టపడుతూ ఉంటారు. కేవలం ఈ జన్మ విషయం కాదు. ఎప్పటి నుండైతే భక్తి మార్గము ప్రారంభమైందో, అప్పటి నుండి ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భారత్ లోనే పూజ్య దేవీ-దేవతల రాజ్యం ఉండేది, దానినే స్వర్గము, సత్యఖండము అని అనేవారు. ఇప్పుడు భారత్ అసత్య ఖండముగా ఉంది. భారత్ యొక్క మహిమ చాలా గొప్పది ఎందుకంటే భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థానము. వారి అసలైన పేరు శివుడు మాత్రమే. శివ జయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేక సోమనాథ జయంతి అని అనరు. శివ జయంతి లేక శివరాత్రి అని అంటారు. ఇప్పుడు అందరూ నయనహీనులుగా, బుద్ధిహీనులుగా ఉన్నారు ఎందుకంటే అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించాయి. రావణుడు నయనహీనులుగా మరియు బుద్ధిహీనులుగా తయారుచేసాడు, ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు దుఃఖము యొక్క పేరు ఉండేది కాదు. స్వర్గ స్థాపన చేసేవారు హెవెన్లీ గాడ్ ఫాదర్. ఇప్పుడు భక్తులందరి భగవంతుడైతే తప్పకుండా ఒక్కరే ఉండాలి కదా. అందరూ నయనహీనులుగా ఉన్నారు అనగా జ్ఞానమనే నేత్రము లేక దివ్య పరిజ్ఞానం లేదు. భగవానువాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. శ్రీమత్ భగవద్గీత ముఖ్యమైనది. శ్రీ అనగా శ్రేష్ఠ మతముతో ఇప్పుడు మిమ్మల్ని తెలివైనవారిగా చేయడం జరుగుతుంది. దివ్య నేత్రము అనగా జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తారు. వాస్తవానికి జ్ఞానమనే మూడవ నేత్రము బ్రాహ్మణులైన మీకే లభిస్తుంది, దాని ద్వార మీరు తండ్రిని మరియు తండ్రి రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు.

ఈ సమయంలో దేహ అహంకారము లేదా 5 వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి, అందుకే అందరూ ఘోర అంధకారములో ఉన్నారు. పిల్లలైన మీ వద్ద ప్రకాశము ఉంది. మీ ఆత్మ మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికాలను తెలుసుకుంది. ఇంతకుముందు మీరందరూ అజ్ఞానములో ఉండేవారు, జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమయ్యింది… ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. పూజ్యులు ప్రకాశములో ఉన్నారు, పూజారులు అంధకారములో ఉన్నారు. పరమాత్మను, నీవే పూజ్యునివి, నీవే పూజారివి అని అనలేరు. వారు ఉన్నదే పరమ పూజ్యులు, అందరినీ పూజ్యులుగా చేసేవారు. వారిని పరమ పూజ్య పరమపిత పరమాత్మ అని అంటారు. కృష్ణుడిని ఏమైనా అలా అంటారా. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అనరు. నిరాకార గాడ్ నే అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు కూడా ఆత్మయే, కానీ శ్రేష్ఠమైనవారు, అందుకే వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ రూపము ఒక్కటే. తప్పకుండా మనము ఆత్మలము, ఆ పరమ ఆత్మ సదా పరంధామంలో నివసించేవారు. ఇంగ్లీషులో వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. తండ్రి అంటారు, ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు… అని మీరు పాడుతారు కూడా. అంతేకానీ, పరమాత్మ, పరమాత్మతో చాలాకాలం వేరుగా ఉన్నారు అని కాదు. అలా కాదు. మొదటి నంబరు అజ్ఞానము, ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అని అనడము. ఆత్మ అయితే జనన-మరణాలలోకి వస్తుంది. పరమాత్మ ఏమైనా పునర్జన్మలలోకి వస్తారా. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా, పూజ్యులుగా ఉండేవారు. ఇదంతా ఈశ్వరీయ ఫ్యామిలీ అయ్యింది కదా. అచ్ఛా, నీవే తల్లివి, తండ్రివి అని మీరు ఎవరిని అంటారో చెప్పండి. ఇలా ఎవరు అంటారు? ఆత్మ అంటుంది – నీవే తల్లివి, తండ్రివి… నీ కృపతో స్వర్గం యొక్క సుఖపు గనులు లభిస్తాయి… మనకు స్వర్గములో లభించాయి. తల్లిదండ్రులైన మీరు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, అప్పుడు మేము మీకు పిల్లలుగా అవుతాము. తండ్రి అంటారు, నేను సంగమములోనే వచ్చి కొత్త ప్రపంచం కోసం రాజయోగం నేర్పిస్తాను.

మీరు నన్ను మర్చిపోయారు అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. నా శివజయంతిని కూడా భారత్ లో జరుపుకుంటారు కదా. శివరాత్రి అని అంటూ ఉంటారు కూడా. ఏ రాత్రి? ఇది బ్రహ్మా యొక్క అనంతమైన రాత్రి. సంగమములో వచ్చి రాత్రిని పగలుగా అనగా నరకాన్ని స్వర్గముగా తయారుచేస్తారు. శివరాత్రి అర్థము కూడా ఎవరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుష్యులకైతే జన్మ-జన్మలోనూ శరీరానికి పేర్లు మారుతూ ఉంటాయి. పరమాత్మ అంటారు, నాకు శారీరకమైన పేరే లేదు. నా పేరు శివ మాత్రమే, నేను కేవలం వృద్ధ, వానప్రస్థ తనువును ఆధారముగా తీసుకుంటాను. వీరు పూజ్యునిగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయ్యారు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనం వారి పిల్లలము కావున తప్పకుండా మనం స్వర్గానికి యజమానులుగా ఉండాలి కదా. ఆ శివబాబా ఉన్నతోన్నతమైనవారు. బ్రహ్మా, విష్ణు, శంకరుల పాత్ర ఎవరిది వారిది. పాత్రధారులు ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిది. ప్రతి ఒక్క ఆత్మలో తన సుఖం యొక్క పాత్ర రచించబడి ఉంది. తండ్రి కల్ప-కల్పము వచ్చి భారతవాసులను స్వర్గవాసులుగా తయారుచేస్తారు, వారిని మరచిపోయారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు. అరే, ఇప్పుడైతే నరకముగా ఉంది కావున పునర్జన్మలు తప్పకుండా నరకములోనే తీసుకుంటారు కదా. మళ్ళీ మీరు వారికి నరకం యొక్క భోజనాన్ని ఎందుకు తినిపిస్తారు! స్వర్గములోనైతే లెక్కలేనన్ని వైభవాలు ఉంటాయి. మరి వారి ఆత్మను పిలిపించి నరకం యొక్క భోజనాన్ని ఎందుకు తినిపిస్తారు! పతిత బ్రాహ్మణులకు తినిపిస్తారు, ఉల్లిపాయలు మొదలైనవి తినిపిస్తారు. అక్కడ ఇవి ఏమైనా ఉంటాయా. మరి చూడండి, భారత్ కు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది! భగవానువాచ – ఇప్పుడు నేను మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తాను. మీరు మళ్ళీ రాజులకే రాజులుగా అవుతారు. దేవీ-దేవతలు 84 జన్మలు అనుభవించి పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. మనం శివబాబాకు వారసులుగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా స్వర్గవాసులుగా తయారుచేసారు, అందుకే వారిని, ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అందరూ స్మృతి చేస్తారు. సాధువులు కూడా సాధన చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది కావున నిర్వాణధామానికి వెళ్ళాలనుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైతే అవ్వదు. ఇలా భావించడం పొరపాటు. ఆత్మలైన మనం పరంధామంలో నివసించేవారమని ఇప్పుడు మీరు అంటారు. ఆత్మలైన మనం దేవీ-దేవతా కులములోకి వెళ్తాము, తర్వాత 84 జన్మలు అనుభవిస్తాము. ఆత్మలైన మనమే తర్వాత దైవీ కులములోకి, క్షత్రియ కులము నుండి వైశ్య, శూద్ర కులములోకి వస్తాము. శివబాబా జనన-మరణాలలోకి రారు, కేవలం వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. సత్యయుగములో సూర్యవంశీయులైన శ్రీ లక్ష్మీ-నారాయణుల వంశం ఉండేదని అంటూ ఉంటారు కూడా. ఏ విధముగా క్రిస్టియన్ల వంశములో ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్, థర్డ్ నడుస్తుంది. అలాగే అక్కడ కూడా లక్ష్మీ-నారాయణ ది ఫస్ట్, లక్ష్మీ-నారాయణ ది సెకండ్, థర్డ్, ఇలా 8 వంశాలు నడుస్తాయి. ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మూడవ నేత్రము తెరుచుకుంది. తండ్రి కూర్చొని ఆత్మలతో మాట్లాడుతారు. మీరు ఈ విధముగా 84 జన్మల చక్రం తిరిగి ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చారు. వర్ణాల చిత్రాన్ని కూడా ఒకటి తయారుచేస్తారు, అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులను తయారుచేస్తారు. బ్రాహ్మణులమైన మనం పిలక స్థానములో ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సమయంలో మనం ప్రాక్టికల్ గా ఈశ్వరీయ సంతానముగా ఉన్నాము. ఈ సమయంలో రాజయోగము మరియు జ్ఞానముతో మనకు సుఖపు గనులు లభిస్తాయి. కొందరైతే సూర్యవంశీ రాజా రాణి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు, కొందరు చంద్రవంశీయులది తీసుకుంటారు. మొత్తం రాజ్యము స్థాపించబడుతుంది. ప్రతి ఒక్కరు తమ పురుషార్థముతో ఆ పదవిని పొందుతారు. ఒకవేళ ఎవరైనా, ఇప్పుడు చదువుతూ-చదువుతూ మా శరీరము వదిలిపోతే ఏం పదవి లభిస్తుంది అని అడిగితే బాబా తెలియజేయగలరు. యోగముతోనే ఆయుష్షు పెరుగుతుంది, వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనులుగా అవ్వడానికి ఇంకే ఉపాయము లేదు. పతిత-పావనా అని అనడంతోనే భగవంతుడు గుర్తుకొస్తారు. కానీ భగవంతుడు ఎవరు అన్నది తెలియదు. తండ్రి అంటారు, నేను రావడము భారత్ లోనే వస్తాను, ఇది నా జన్మ స్థానము. సోమనాథ మందిరము ఎంత వైభవముగా ఉండేది! ఈ విషయాలను తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇవే తర్వాత శాస్త్రాలుగా అవుతాయి. భక్తి మార్గములోనే ఈ స్మృతిచిహ్నాలు తయారవ్వడము ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే పూజారులుగా అవుతారో, అప్పుడు మొట్టమొదట సోమనాథ మందిరాన్ని తయారుచేస్తారు. భారత్ అయితే సత్య, త్రేతాయుగాలలో చాలా షావుకారుగా ఉండేది. మందిరాలలో అపారమైన ధనం ఉండేది. భారత్ వజ్రతల్యముగా ఉండేది, ఇప్పుడైతే నిరుపేదగా, గవ్వ తుల్యముగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి భారత్ ను వజ్ర తుల్యముగా తయారుచేస్తారు. మొత్తం వృక్షము శిథిలావస్థను పొంది ఉంది. తండ్రి అంటారు, మీ ముఖాన్ని అయితే చూసుకోండి, లక్ష్మీ-నారాయణులను వరించేందుకు యోగ్యునిగా ఉన్నానా. నారదుని కథ ఉంది కదా. పతిత ఆత్మ, పవిత్ర లక్ష్మిని లేదా నారాయణుడిని ఎలా వరించగలదు? వికారాల్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ పాస్ పోర్ట్ క్యాన్సల్ అయిపోతుంది. తమను తాము చూసుకోవడము జరుగుతుంది – మేము బాబా, మమ్మా యొక్క సింహాసనాధికారులుగా అవ్వగలిగే విధముగా పురుషార్థము చేస్తున్నామా. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పవిత్రత ముఖ్యమైనది. ఇప్పుడైతే ఆరోగ్యము లేదు, సంపద లేదు, సంతోషము లేదు. ఇది ఎండమావిలో నీరు (మృగతృష్ణ) వంటి రాజ్యము. దీని గురించి కూడా దుర్యోధనుని కథ శాస్త్రాలలో ఉంది. దుర్యోధనుడు అని వికారిని అంటారు. నా పరువు కాపాడండి, అని ద్రౌపది అంటుంది. వీరు ద్రౌపదులే కదా. తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, ఎంతగా బుద్ధి యోగము పూర్తిగా జోడించబడి ఉంటుందో, అంతగా ధారణ కూడా జరుగుతుంది. బ్రహ్మచర్యములోనే జ్ఞానం చదువుకోవడము జరుగుతుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండాలని తండ్రి అంటారు. ఇరువైపులా నిర్వర్తించాలి, తప్పకుండా మరణించాలి కూడా. మరణించే సమయంలో మనుష్యులకు మంత్రాన్ని ఇస్తారు. తండ్రి అంటారు, మీరందరూ మరణించేటువంటివారు. నేను కాలుడికే కాలుడిని, అందరినీ తిరిగి తీసుకువెళ్ళేవాడిని, కావున సంతోషము ఉండాలి కదా. ఇక ఎవరు మంచి రీతిలో చదువుతారో, వారు స్వర్గానికి యజమానులుగా అవుతారు. చదవకపోతే ప్రజా పదవిని పొందుతారు. ఇక్కడకు మీరు రాజ్య పదవిని పొందేందుకు వచ్చారు. ఇది చదువు, ఇందులో అంధ విశ్వాసం యొక్క విషయం లేదు. ఇది రాజ్యం కోసము చదువు. ఎలాగైతే ఆ చదువులో బ్యారిస్టరు అవుతానని లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుందో, అప్పుడు యోగం తప్పకుండా చదివించే టీచరుతో పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని భగవంతుడు చదివిస్తారు కావున వారితో యోగం జోడించాలి.

తండ్రి అంటారు, నేను పరంధామం నుండి చాలా దూర దూరాల నుండి వస్తాను. పరంధామం ఎంత ఉన్నతమైనది. సూక్ష్మవతనము కన్నా పైన ఉంది. అక్కడి నుండి రావడానికి నాకు ఒక్క క్షణము పడుతుంది. వారి కన్నా వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. క్షణములో జీవన్ముక్తిని ఇస్తాను. జనకుని ఉదాహరణ ఉంది కదా. ఇప్పుడు ఇదైతే నరకము, పాత ప్రపంచము. కొత్త ప్రపంచము అని స్వర్గాన్ని అంటారు. తండ్రి నరకాన్ని వినాశనము చేయించి స్వర్గ స్థాపన చేయిస్తారు. అంతేకానీ, వారిని సర్వవ్యాపి అని అనడముతో ఏం లభిస్తుంది? ఏమీ లభించదు. తండ్రి అయితే వచ్చి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఆత్మ అమరము, దానికి పాత్ర కూడా అమరమైనదే లభించి ఉంది. మరి ఆత్మ చిన్నగా-పెద్దగా ఎలా అవ్వగలదు! ఆత్మ ఉన్నదే నక్షత్రము. చిన్నగా, పెద్దగా ఉండదు. ఇప్పుడు మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్, గాడ్ ఫాదర్ నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువుతో మనమే దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మీరు భారత్ కు సేవ చేస్తున్నారు. మొట్టమొదట అయితే తండ్రికి చెందినవారిగా అవ్వాలి, ఇతర స్థానాలలో గురువు వద్దకు వెళ్తారు, వారికి చెందినవారిగా అవుతారు లేదా వారిని తమ గురువుగా చేసుకుంటారు. ఇక్కడైతే వీరు తండ్రి. కావున మొదట తండ్రికి పిల్లలుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు తమ ఆస్తిని ఇస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు ఎక్స్-చేంజ్ చేసుకోండి. మీ విలువలేనివి మావి, మాదంతా మీది. దేహ సహితముగా ఏదైతే ఉందో దానినంతటినీ నాకు ఇచ్చేయండి, నేను మీ ఆత్మను మరియు శరీరాన్ని రెండింటినీ పవిత్రముగా చేస్తాను, మళ్ళీ రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ వద్ద ఏదైతే ఉందో దానిని బలిహారం చేయండి. నన్ను ట్రస్టీగా చేసుకోండి, నా శ్రీమతముపై నడవండి. జనకుడు రాజ్య భాగ్య సహితముగా బలిహారమయ్యారు, అందుకే వారికి జీవన్ముక్తి లభించింది. బాబా, ఇదంతా మీదే. తండ్రి అంటారు, నన్ను వారసునిగా చేసుకోండి, నేను 21 జన్మలు మిమ్మల్ని వారసునిగా చేసుకుంటాను. కేవలం నా మతముపై నడవండి. వ్యాపార, వ్యవహారాలు చేసుకోండి, విదేశాలకు వెళ్ళండి, ఏమైనా చేసుకోండి, కేవలం నా మతముపై నడవండి. అప్రమత్తముగా ఉండాలి. మాయ ఘడియ-ఘడియ కింద పడేస్తుంది. ఏ వికర్మలు చేయకండి. అడుగడుగునా శ్రీమతముపై నడిచినట్లయితే మీరు శ్రేష్ఠముగా అవుతారు. తండ్రి అయితే దాత, కేవలం మిమ్మల్ని ట్రస్టీగా చేస్తారు. ఈ పిల్లలు, ధనము మొదలైనవన్నీ భగవంతుడు ఇచ్చినవి అని అంటారు కూడా. ఇప్పుడు భగవంతుడు అంటారు – నాకు ఇవ్వండి. నేను ఎక్స్-చేంజ్ చేస్తాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను – శ్రీమతముపై నడవడము ద్వారా మిమ్మల్ని ఆ విధముగా శ్రేష్ఠముగా తయారుచేస్తాను. ఇది రాజయోగము. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా ఈ రాజయోగముతోనే ఈ విధంగా తయారయ్యారు. బిర్లా, ఎవరైతే లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని తయారుచేసారో, స్వయము వారికి, ఈ లక్ష్మీ-నారాయణులు ఇంతటి ధనవంతులుగా ఎలా అయ్యారో తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – ఇక్కడి పేదవారు అక్కడ షావుకార్లుగా అవుతారు మరియు షావుకార్లదంతా మట్టిలో కలిసిపోతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాతా-పితల సింహాసనాధికారులుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేయాలి. ఇరువైపులా నిర్వర్తిస్తూ చదువుపై పూర్తి ధ్యానము పెట్టాలి.

2. ఎటువంటి వికర్మ చేయకూడదు. చాలా అప్రమత్తంగా ఉంటూ శ్రీమతముపై నడుస్తూ ఉండాలి. ట్రస్టీగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-

తమ మస్తకం మధ్యలో సదా తండ్రి స్మృతిని ఇమర్జ్ గా ఉంచుకునే మస్తకమణి భవ

ఎవరి మస్తకములోనైతే సదా తండ్రి స్మృతి ఉంటుందో, వారే మస్తకమణి, దీనినే ఉన్నతమైన స్థితి అని అంటారు. స్వయాన్ని సదా ఇటువంటి ఉన్నత స్థితిలో స్థితులై ఉండేటువంటి శ్రేష్ఠ ఆత్మగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎవరైతే ఈ ఉన్నతమైన స్థితిలో ఉంటారో, వారు కింద ఉన్న అనేక రకాల విషయాలను సహజంగా దాటేస్తారు. సమస్యలు క్రిందనే ఉండిపోతాయి మరియు స్వయం వారు పైన ఉంటారు. మస్తకమణి స్థానమే ఉన్నతమైన మస్తకము, అందుకే క్రిందకు రాకండి, సదా పైన ఉండండి.

స్లోగన్:-

నిశ్చింతా చక్రవర్తి స్థితిని అనుభవం చేయాలంటే నాదిని నీదిలోకి పరివర్తన చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top