TELUGU MURLI 02-04-2023

02-04-2023 ప్రాత:మురళి ఓంశాంతి ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 18-02-94 మధువనం

‘‘స్వమానము యొక్క స్మృతి అనే స్విచ్ ను ఆన్ చేయడము ద్వారా దేహ భానమనే అంధకారం యొక్క సమాప్తి”

ఈ రోజు అకాల మూర్తి అయిన తండ్రి అకాల సింహాసనాధికారులు, విశ్వ కళ్యాణ కిరీటధారులు, మస్తకంలో మెరుస్తూ ఉండే బిందువు యొక్క తిలకధారులైన పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సింహాసనాధికారులు కూడా, కిరీటధారులు కూడా, తిలకం కూడా అందరిదీ మెరుస్తూ ఉంది. అందరి మస్తకం మధ్యలో ఆత్మ బిందువు సితార సమానంగా కనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా తమ సింహాసనం, కిరీటం మరియు తిలకాన్ని చూస్తున్నారా. మొత్తం సభ బాప్ దాదాకు కిరీటధారులుగా మరియు తిలకధారులుగా, సింహాసనాధికారులుగా కనిపిస్తూ ఉంది. ఈ అలౌకిక సభ, కలియుగీ రాజ్య సభ మరియు సత్యయుగీ రాజ్య సభ కన్నా ఎంత అతీతమైనది మరియు ఎంత ప్రియమైనది! కావున ఇటువంటి సభకు అధికారులైన ఆత్మలు ఎంత ప్రియమైనవారు! మీ అందరికీ కూడా మీ ఈ సింహాసనం, కిరీటం మరియు తిలకధారి స్వరూపం ప్రియమనిపిస్తుంది కదా! ఎప్పుడైతే అకాల సింహాసనాధికారి, అకాలమూర్తి, శ్రేష్ఠ ఆత్మ స్థితిలో స్థితులై సింహాసనంపై కూర్చుంటారో, ఈ స్థితి ఎంత శ్రేష్ఠమైనది! అందరి శ్రేష్ఠ స్థితి యొక్క మెరుపు ఈ ముఖాన్ని ఫరిశ్తాగా చేస్తుంది. సాధారణ ముఖము కాదు, ఫరిశ్తా ముఖము. మరి ఫరిశ్తా ముఖం కూడా ఎంత ప్రియమైనది! ఫరిశ్తా అందరికీ చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే ఫరిశ్తా అనగా సర్వులకు చెందినవారిగా ఉంటారు, ఒకరిద్దరికి చెందినవారు కాదు. అనంతమైన దృష్టి, అనంతమైన వృత్తి, అనంతమైన స్థితి కలిగినవారు. ఫరిశ్తా అనగా సర్వాత్మల కోసం పరమాత్మ సందేశ వాహకులు. ఫరిశ్తా అనగా సదా ఎగిరే కళలో ఉండేవారు. ఫరిశ్తా అనగా సర్వుల యొక్క సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింపచేసేవారు. ఫరిశ్తా అనగా డబుల్ లైట్. దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా, తేలికగా ఉండేవారు. ఫరిశ్తా అనగా స్వయం యొక్క నడవడిక మరియు ముఖం ద్వారా సర్వులను తండ్రి సమానంగా తయారుచేసేవారు. ఫరిశ్తా అనగా సహజంగా మరియు స్వతహాగా అనాది మరియు ఆది సంస్కారాలను సదా ఇమర్జ్ స్వరూపంలో చూపించేవారు. ఫరిశ్తా అనగా నిమిత్త భావము, నిర్మాన స్వభావం మరియు సర్వుల పట్ల కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావన కలిగినవారు. ఇటువంటి ఫరిశ్తాలే కదా? మేము కాకపోతే ఇంకెవరు అవుతారు అని నషాతో చెప్పండి. నషా ఉంది కదా! కావున బాప్ దాదా ఇటువంటి ఫరిశ్తాల దర్బారును చూస్తున్నారు. కేవలం ఇదే స్వమానంలో స్థితులై ఉండడము ద్వారా దేహ భానం స్వతహాగానే సమాప్తమవుతుంది.

పిల్లలు దేహ భానం విడిచిపెట్టడానికి చాలా శ్రమ చేయడాన్ని తండ్రి చూస్తున్నారు. దేహ భానం యొక్క ఒక రూపాన్ని వదిలేస్తే రెండవది వచ్చేస్తుంది, మళ్ళీ రెండవది వదిలేస్తే మూడవది వచ్చేస్తుంది. కానీ విడిచిపెట్టడము సదా కష్టముగా ఉంటుంది మరియు ధారణ చేయడము సహజముగా ఉంటుంది. కనుక బాప్ దాదా అంటారు, స్వమానంలో సదా ఉండండి. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహ భానం రానే రాలేదు. కనుక వదలాలనే శ్రమ చేయకండి కానీ స్వమానంలో స్థితులయ్యే అటెన్షన్ పెట్టండి మరియు సంగమయుగంలో స్వయము తండ్రి ద్వారా ఎన్ని మంచి-మంచి స్వమానాలు ప్రాప్తించాయి. ప్రాప్తి చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాప్తించి ఉన్నాయి. తమ స్వమానాల లిస్టు తీయండి. ఎంత పెద్ద లిస్ట్ ఉంది! మొత్తం కల్పములో ఏ ప్రసిద్ధ ఆత్మలకైనా ఎన్నో స్వమానాలు అనగా టైటిల్స్ ఉండవచ్చు, రాజకీయ వేత్తలు కావచ్చు, అభినేతలు కావచ్చు, ధర్మాత్మలు కావచ్చు, మహాన్ ఆత్మలు కావచ్చు, వారి టైటిళ్ళను ఒకవేళ లెక్కపెట్టినా కూడా మీ స్వమానాల లిస్టు కన్నా ఎక్కువ ఉండగలవా? మరియు రోజూ ఉదయాన్నే బాప్ దాదా స్వమానం యొక్క స్మృతినిప్పిస్తారు, స్వమానంలో స్థితులయ్యేటట్లు చేస్తారు. రోజూ కూడా ఒక సరికొత్త స్వమానాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే ప్రకాశం ఎదురుగా అంధకారం పారిపోయినట్లుగా స్వమానం ముందు దేహ భానం పారిపోతుంది. సమయము పట్టదు, శ్రమ అనిపించదు. కావున పదే-పదే రకరకాల దేహ భానాలను సమాప్తం చేసే శ్రమ ఎందుకు చేస్తారు? స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ ను ఆన్ చేయడము రావడము లేదా ఏమిటి? ఎంతటి గాఢమైన నల్లని మేఘాలైనా, సూర్యుడి ప్రకాశాన్ని దాచేసేవే కావచ్చు, కానీ మీ దగ్గర ఆటోమెటిక్ డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. డైరెక్ట్ లైన్ ఉంది కదా? లైన్ స్పష్టంగా ఉందా లేక లీకేజ్ ఉందా? కొంతమందికి లింక్ ఉంటుంది కానీ లీకేజ్ అయిపోతుంది. కావున డైరెక్ట్ లైన్ ఎంత శక్తివంతంగా ఉంటుంది! డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేక ఇన్ డైరెక్ట్ గా ఉందా? అందరికీ డైరెక్ట్ లైన్ ఉంది కదా? అందరికీ డైరెక్ట్ లైన్ లభించిందా? అప్పుడిక ఒక మేఘం ఏమిటి, మేఘాలన్నీ వచ్చేసినా కానీ అంధకారమయంగా చేయగలవా? స్మృతి అనే స్విచ్ ను డైరెక్ట్ లైన్ తో ఆన్ చేసిన వెంటనే ఎంత లైట్ వచ్చేస్తుందంటే స్వయమైతే లైట్ లోనే ఉంటారు, అంతేకాక ఇతరుల కోసం కూడా లైట్ హౌస్ గా అవుతారు. ఇలా జరుగుతుంది కదా? అనుభవీలే కదా? కానీ అప్పుడప్పుడు అనుభవాన్ని పక్కన పెట్టేస్తారు. ఆధారం లభించింది కానీ అప్పుడప్పుడు ఆధారానికి బదులుగా పక్కకు తప్పుకుంటారు. శ్రమ అనిపిస్తుందా? సదా అనిపించడము లేదు, అప్పుడప్పుడు అనిపిస్తుందా! స్విచ్ ఆన్ చేయడము మర్చిపోతున్నారా? వాస్తవానికి ఒకవేళ మాస్టర్ సర్వశక్తిమాన్ అనే ఒక్క స్వమానము గుర్తున్నా కూడా శ్రమ అనే విషయము ఏదీ ఉండనే ఉండదు. మార్గం శ్రమతో కూడినది కాదు కానీ హైవేకి బదులుగా సందులలోకి వెళ్ళిపోతున్నారు లేదా గమ్యం యొక్క గుర్తు కన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు, కావున తిరిగి వచ్చే శ్రమ చేయవలసి వస్తుంది. బాప్ దాదా సదా తమ స్నేహము మరియు సహయోగము అనే ఒడిలో కూర్చోబెట్టుకుని గమ్యానికి తీసుకువెళ్తున్నారు. ఒడిలో కూర్చుని గమ్యానికి చేరడానికి శ్రమ ఎందుకు అనిపిస్తుంది? స్నేహము మరియు సహయోగము అనే ఒడి నుండి బయటకు వచ్చి అప్పుడప్పుడు వేరే ఆకర్షణ లాగినట్లయితే తిరగడానికి బయటకు వెళ్ళిపోతారు. అలసిపోతారు కూడా, మళ్ళీ శ్రమను కూడా అనుభవం చేస్తారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? శ్రమ సమాప్తము. ప్రేమలో, లవ్ లో లీనమైపోండి, లవలీనమై ప్రతి కార్యం చేయండి. ఎవరైతే లీనమవుతారో, వారికి ఇంకేదీ కనిపించదు, ఆకర్షించదు. మరి లవ్ లో ఉంటున్నారా. నాకు తండ్రిపై ప్రేమ లేదు, లవ్ లేదు అనేవారు ఎవరైనా ఉంటారా! అందరికీ లవ్ ఉంది కదా! కానీ అప్పుడప్పుడు లవ్ లో ఉంటారు, అప్పుడప్పుడు లవ్ లో లీనమైపోతారు. లేదంటే చూడండి, మనసు-బుద్ధి ద్వారా స్థితిలో తండ్రి సర్వ సంబంధాలతో తోడుగా ఉన్నారు. తోడుగా కూడా ఉన్నారు మరియు సేవలో తండ్రి ప్రతి సమయం సహచరునిగా ఉన్నారు. కావున స్థితిలో కూడా తోడుగా ఉన్నారు మరియు సేవలో సహచరునిగా ఉన్నారు. ఎక్కడైతే సదా తోడుగా కూడా ఉంటారో మరియు సహచరునిగా కూడా ఉంటారో, అక్కడ కష్టమేముంది! పరమ ఆత్మ మహిమయే ఉంది – కష్టాన్ని సహజం చేసేవారు అని. ఇటువంటి తండ్రి మీకు తోడుగా ఉన్నారు మరియు సహచరునిగా ఉన్నారు, మరి కష్టం ఉండగలదా? మరి ఎందుకు కష్టతరము చేస్తున్నారు?

సమయానుసారంగా తండ్రి స్వయంగా ప్రతి బిడ్డకు సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తారు. ఎటువంటి సమయమో అటువంటి సంబంధంతో తోడుగా ఉండండి లేదా సహచరునిగా చేసుకోండి. కొన్ని సమయాలలోనైతే సంబంధంతో సహచరునిగా చేసుకుంటున్నారు మరియు కొన్ని సమయాలలో సహచరుడిని దూరంగా పెట్టేస్తున్నారు. మళ్ళీ, ఒంటరితనం అనుభవమవుతుందని అంటారు. నడుస్తూ-నడుస్తూ ఒంటరితనం అనిపిస్తుంది. ఒంటరితనం ఉండడము వలన ఏమవుతుంది? తమ శ్రేష్ఠ జీవితం సాధారణ జీవితంగా అనుభవమవుతుంది. అప్పుడు అంటారు, బోరింగ్ లైఫ్ అయిపోయింది, కొంచెం మార్పు కావాలి. ఒక వైపు, మేమైతే కంబైండుగా ఉన్నామని బాప్ దాదాను సంతోషపెడతారు. కంబైండుగా ఉన్నవారు ఎప్పుడైనా ఒంటరిగా అవుతారా ఏమిటి? చాలా మంచి-మంచి మాటలు మాట్లాడుతారు -బాబా, మేమైతే ఉన్నదే కంబైండ్ గా. మళ్ళీ 15-20 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటారు, మార్పు కావాలి, ఒంటరిగా అయిపోయాము. మామూలుగా కూడా చూడండి, ప్రపంచంలో ఒకవేళ మార్పు కావాలనుకుంటే కొంతమంది సాగర తీరానికి వెళ్ళి నిద్రపోతారు, కొంతమంది మనోరంజనంలోకి వెళ్ళిపోతారు, డాన్స్ చేస్తారు, కొందరు పాటల యొక్క ఆనందంలో ఆనందాలు జరుపుకుంటారు, కొంతమంది కంపెనీ లేదా కంపానియన్ యొక్క తోడును తీసుకుంటారు. ఇవే చేస్తారు కదా! ఆట ఆడుతున్నారా? ఆటల ప్రపంచంలోకి, తోటలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ జ్ఞాన సాగరుని తీరం ఉంది అన్నది మర్చిపోతారు. ఒకవేళ సాగరం ఇష్టమనిపిస్తే సాగర తీరంలో కూర్చుండిపోండి. తండ్రి జ్ఞాన సాగరుడు కదా. తండ్రి కంపానియన్ కాదా ఏమిటి? వారితో ఆనందముగా అనిపించదా? బిందువుతో ఏం ఆనందం కలుగుతుంది అని భావిస్తున్నారా! మిమ్మల్ని అందరినీ సదా వినోదపర్చడము కోసమే బ్రహ్మా తండ్రి కూడా అవ్యక్తమయ్యారు. కానీ ఇక్కడైతే సదా కోసం సహచరుడు కావాలి కదా. ఎప్పుడైనా మీకు ఒంటరితనం అనుభవమైతే ఆ సమయంలో బిందువు రూపాన్ని గుర్తు చేయకండి. అది కష్టమవుతుంది, దానితో బోర్ అయిపోతారు. కానీ తమ బ్రాహ్మణ జీవితంలో భిన్న-భిన్న సమయాలలో కలిగిన రమణీకమైన అనుభవాల కథలను స్మృతిలోకి తెచ్చుకోండి. అనుభవాల కథల పుస్తకం అందరి దగ్గర ఉంది. ఎప్పుడైతే బోర్ అవుతారో, అప్పుడు నవల్స్ చదువుతారు కదా! కనుక మీరు మీ కథల పుస్తకాన్ని తెరవండి మరియు దానిని చదవడములో బిజీ అయిపోండి. తమ స్వమానాల లిస్టును ఎదురుగా తెచ్చుకోండి, తమ ప్రాప్తుల లిస్టును ఎదురుగా తెచ్చుకోండి. బ్రాహ్మణ ప్రపంచంలోని విచిత్రమైన ప్రాక్టికల్ కథలను స్మృతిలోకి తెచ్చుకోండి. ఎలాగైతే స్వయాన్ని మార్చుకోవడము కోసం వార్తాపత్రికలను చదవడాన్ని కూడా ఆధారంగా తీసుకుంటారు, అలాగే బ్రాహ్మణ ప్రపంచంలో ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని అలౌకిక సమాచారాలను చూసారు లేక విన్నారు, వార్తాపత్రికలు కూడా మీ దగ్గర ఉన్నాయి. చాలామందికి పేపర్ చదవకపోతే మనశ్శాంతి అనిపించదు. పేపర్ కూడా మీ దగ్గర ఉంది. పేపర్ చదవండి. డాన్స్ మరియు పాటల గురించి అయితే తెలుసు. అలసట లేకుండా డాన్స్ చేస్తారు. మన్మనాభవగా అవ్వడమే అన్నింటికన్నా గొప్ప మనోరంజనము ఎందుకంటే సర్వ సంబంధాల రసాన్ని అనుభవము చేయడము లేక అనుభూతులను పొందడమే మన్మనాభవ. కేవలం తండ్రి రూపంలో లేక విశేషంగా మూడు రూపాల సంబంధాలతో అనుభవం చేసుకోవడము కాదు, కానీ సర్వ సంబంధాల స్నేహాన్ని అనుభవం చేసుకోగలరు. సంబంధాలతో స్మృతి అయితే చేస్తారు కానీ తేడా ఎక్కడ వస్తుంది? ఒకటేమో, బుద్ధితో జ్ఞానం ఆధారంగా సంబంధాన్ని స్మృతి చేయడము మరియు రెండవది, హృదయముతో ఆ సంబంధం యొక్క స్నేహంలో, లవ్ లో లీనమైపోవడము. సగం అయితే చేస్తారు కానీ మిగతా సగం ఉండిపోతుంది, అందుకే కొద్ది సమయమైతే సరిగ్గా ఉంటారు, కొద్ది సమయం తర్వాత కేవలం బుద్ధి ద్వారానే సంబంధాన్ని స్మృతి చేస్తారు మరి బుద్ధిలో మరో విషయం రావడము వలన మనసు మారిపోతుంది. మళ్ళీ శ్రమ చేయవలసి వస్తుంది. మళ్ళీ ఏమంటారు – మేము స్మృతి అయితే చేసాము, బాబా నా కంపానియన్, కానీ కంపానియన్ తోడునైతే నిర్వర్తించలేదు! అనుభవమైతే ఏమీ కాలేదు! ఇది బుద్ధితో స్మృతి చేసారు. హృదయములో స్నేహాన్ని ఇముడ్చుకోలేదు. ఎప్పుడైనా ఏ విషయమైనా బుద్ధిలోకి వస్తే అది త్వరగా తొలగిపోతుంది కూడా. కానీ హృదయంలో ఇమిడిపోతే దానిని మొత్తం ప్రపంచం కూడా హృదయం నుండి తొలగించాలని అనుకున్నా కూడా తొలగించలేరు. కావున సర్వ సంబంధాలను సమయానుసారంగా, ఏ సమయంలో ఏ సంబంధం అవసరము ఉందో, స్నేహితుని అవసరం ఉంది మరియు స్మృతి తండ్రిని చేసినట్లయితే ఆనందం అనిపించదు, అందుకే ఏ సమయంలో, ఏ సంబంధం యొక్క అనుభూతి కావాలో, ఆ సంబంధాన్ని స్నేహంతో, హృదయంలో అనుభవం చేసుకోండి. అప్పుడు శ్రమ కూడా అనిపించదు, బోర్ కూడా అవ్వరు, సదా మనోరంజనంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు?

శ్రమ నుండి తొలగిపోవాలి. ప్రతి నెల కేవలం ఓ.కె అని రాయాలి, ఇంకేమీ రాయకండి. ఓ.కె తో శ్రమ నుండి బయటకు వచ్చారని అర్థం చేసుకుంటారు. పెద్ద-పెద్ద ఉత్తరాలు రాయకండి. లేదంటే ఉత్తరమైతే రాసాము, జవాబు రాలేదు అని అంటారు. మీ ఉత్తరాలు చేరకపోవడము అనేది ఉండదు. ఉత్తరం రాయడము ప్రారంభించిన వెంటనే మరియు అక్కడి కంప్యూటర్ లోకి ముందే వచ్చేస్తుంది, పోస్ట్ లో తర్వాత చేరుకుంటుంది. మామూలుగా బాప్ దాదా ఇంత పెద్ద ఉత్తరాలకు రోజూ మురళీలో అందరికీ జవాబు ఇస్తారు. రోజూ ఉత్తరాలు రాస్తారు. ఇంత పెద్ద ఉత్తరం ఎవరైనా రాస్తారా! కావున మీ స్వమానాన్ని చూసుకోండి – మీ అందరిపై పరమాత్మకు ఎంత ప్రేమ ఉంది. పరమాత్మకు ప్రేమ ఉంది, అందుకే ఉత్తరాలు రాస్తారు అనగా మురళీలో జవాబులు కూడా ఇస్తారు మరియు ప్రియస్మృతులు కూడా ఇస్తారు. ఒకవేళ ఏదైనా ప్రశ్న వస్తే లేదా ఏదైనా సమస్య ఎదురుగా వస్తే మురళీ ద్వారా సమాధానం లభిస్తుంది. కనుక జవాబు రాలేదు అని ఇంకెప్పుడూ ఫిర్యాదు చేయకండి. ఇకపోతే, మంచి పని చేస్తున్నారు, మనసులోకి ఏ విషయము వచ్చినా, దానిని తండ్రి ఎదురుగా పెట్టడము అంటే మనసు నుండి దానిని తీసేసారు. అదైతే చేయండి, కానీ క్లుప్తంగా రాయండి. ఉత్తరం రాసేటప్పుడు ఆ సమయంలోనే మనసు అయితే తేలిక అయిపోతుంది కదా! ఎందుకంటే ఇచ్చేసారు కదా. మళ్ళీ రెండవ రోజు మురళీని ఆ విధితో చూడండి, నేను ఏదైతే ఉత్తరం రాసానో దానికి జవాబు ఏమిటి? బదులు అయితే లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి కనుక ఉత్తరం కూడా అనంతమైనది రాస్తారు, చిన్నదిగా ఏమైనా రాస్తారా.

బాప్ దాదా చూసారు, నలువైపులా ఉన్న డబుల్ విదేశీ పిల్లలు సేవలో మంచి తపనతో నిమగ్నమై ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు ప్రియమనిపిస్తారు. ఒకవేళ పేర్లు తీసుకుంటే ఎన్ని పేర్లు తీసుకుంటారు! అందుకే అందరూ విశేష సేవకు రిటర్న్ గా తమ పేరుతో శుభాకాంక్షలు స్వీకరించండి. పేర్లు తీసుకోవడము ప్రారంభించినట్లయితే మాలను తయారుచేయవలసి వస్తుంది. కానీ మాలలోని మణులందరూ బాప్ దాదా ఎదురుగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సేవ అనంతమైనదిగా అవుతూ ఉంది మరియు సఫలతా సంపన్నంగా అవుతూ ఉంది. వర్తమాన సమయంలో విశేషంగా విదేశములో రెండు సేవల రిజల్టు మంచిగా ప్రత్యక్షమయ్యింది. అనేక రకాల సేవలైతే నడుస్తూనే ఉంటాయి, కానీ విశేషంగా ఒకటేమో ఈ గ్లోబల్ బుక్, శ్రమ చేసి తయారుచేసారు, దీని నిమిత్తంగా నలువైపులా ఉన్న విశేష ఆత్మలతో సంబంధ సంపర్కములోకి రావడము సహజమైపోయింది. కనుక ఏ పిల్లలైతే ప్రాణప్రదముగా, ఎంతో ప్రేమతో సమయాన్ని కేటాయించారో, సహయోగము ఇచ్చారో, దానికి ప్రత్యక్షఫలంగా సేవకు నిమిత్తమైన ఆత్మలకు బాప్ దాదా పదమారెట్లు అభినందనలు చెప్తున్నారు. మరియు దానితో పాటు ఎవరైతే ఇప్పుడు డైలాగ్ లేక రిట్రీట్ చేసారో, దాని రిజల్టు కూడా ముందు నుండే చాలా మంచిగా ఉంది. మిగిలిన అన్ని దేశాలవారు ఇందులో ఎవరైతే సహయోగం ఇచ్చారో, వారందరికీ కూడా అభినందనలు. లక్ష్యము మంచిగా పెట్టుకున్నారు. కావున నలువైపులా ఇప్పుడు ఈ రెండు రకాల సేవలు మంచి ఆర్భాటముగా నడుస్తున్నాయి మరియు ఇక ముందు కూడా నడుస్తూ ఉంటాయి. బాప్ దాదాకు గుర్తుంది, మొదట విదేశాల నుండి వి.ఐ.పి.ల సంగతైతే వదిలేయండి, ఐ.పి.లను తీసుకురావడము కూడా కష్టమనిపించేది. మరియు ఇప్పుడైతే సహజమనిపిస్తుంది కదా! మరి ఇది సేవకు ప్రత్యక్ష ఫలము. మరియు ఎంతమంది ఆశీర్వాదాలు లభించాయి! ఎవరి చేతిలోకైతే పుస్తకం వెళ్తుందో, వారందరి ఆశీర్వాదాలు ఎవరి ఖాతాలో జమ అవుతాయి? ఎవరైతే నిమిత్తులుగా అవుతారో వారి ఖాతాలో జమ అవుతాయి. ఇచ్చే సేవ కావచ్చు, తయారుచేసే సేవ కావచ్చు, ఐడియాలను ఇచ్చే సేవ కావచ్చు, రాసే సేవ కావచ్చు – అందరికీ ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తున్నాయి! చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి, మీరు కేవలం రిసీవ్ చేసుకోండి. స్వయములోనే బిజీగా ఉంటారు కనుక ఆశీర్వాదాలను రిసీవ్ చేసుకోరు. మరియు ఐ.పి.లు లేక వి.ఐ.పి.లు ఎవరైతే సంపర్కములోకి వస్తారో, వారు ఒక్కరే ఎంతమందికి అనుభవము వినిపిస్తారు, అప్పుడు వారందరి ఆశీర్వాదాలు బ్రాహ్మణాత్మలకు చాలా-చాలా ప్రాప్తిస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాలను రిసీవ్ చేసుకున్నా కూడా సంపన్నంగా అయిపోతారు. బుక్ ను కూడా మంచిగా చేసారు మరియు ఈ ప్రోగ్రాం కూడా చాలా మంచిగా ఉంది. మరియు భారతవాసుల విశేష సేవగా ఇప్పుడు కారు యాత్ర నడుస్తుంది. (బిజినెస్ వింగ్ లోని సోదర-సోదరీలు 11 కార్లతో కూడిన ఒక ర్యాలీని రాజ్ కోట్ నుండి బొంబే వరకు చేసారు, ఇందులో అనేక రకాల సేవలు జరుగుతున్నాయి). దాని రిజల్టు కూడా చాలా మంచిగా వెలువడుతూ ఉంది మరియు ఇకముందు ఒక్కరు నిమిత్తముగా అయినా కూడా అనేకుల భాగ్యాన్ని మేల్కొలుపుతూ ఉంటారు. కావున ఈ సేవా రిజల్టు కూడా మంచిగా కనిపిస్తుంది. ఈ సేవలో ఎవరైతే నిమిత్తముగా అయ్యారో, ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారో, వారందరికీ కూడా, నలువైపులా ఉన్న భారతవాసులైన పిల్లలకు, సహయోగీ పిల్లలకు, నిమిత్త పిల్లలకు బాప్ దాదా అభినందనలు చెప్తున్నారు. శ్రమ నామ మాత్రము మరియు సఫలత ఎక్కువ, ఇప్పుడు ఇటువంటి సేవా ప్లానులు తయారుచేయండి. ఈ సేవలో కూడా ఇదే కనిపిస్తుంది – శ్రమ తక్కువ, రిజల్టు ఎక్కువ. విదేశములోని రెండు ప్రోగ్రాములలో కూడా ఇలాగే ఉంది. అచ్ఛా!

దేశ-విదేశాలలోని సర్వ సేవలలో ఉమంగ-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారికి, అలసటలేనివారిగా అయ్యి ఇతరులకు దానము-వరదానము ఇచ్చే ఆత్మలకు, నలువైపులా ఉన్న తండ్రి యొక్క సర్వ సంబంధాల లవ్ లో లీనమై ఉండే లవలీన ఆత్మలకు, సదా సహజ అనుభవం చేసే, ఇతరులకు కూడా సహజ అనుభవం చేయించే సహయోగీ ఆత్మలకు, సదా స్వయాన్ని స్వమానము ద్వారా సహజంగా దేహ భానము నుండి ముక్తులుగా చేసుకునే జీవన్ముక్త ఆత్మలకు, సదా తండ్రి తోడును అనుభవము చేసుకునే మరియు సహచరునిగా అనుభవము చేసుకునే సమీప ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

తమ ఆది మరియు అంతిమము రెండు స్వరూపాలను ఎదురుగా పెట్టుకొని సంతోషము లేక నషాలో ఉండే స్మృతి స్వరూప భవ

ఏ విధంగా ఆది దేవ్ బ్రహ్మా మరియు ఆది ఆత్మ శ్రీకృష్ణుడు, ఇరువురిలోని వ్యత్యాసాన్ని చూపిస్తూ కూడా వారిని కలిపి చూపిస్తారు. అదే విధంగా మీరందరూ తమ బ్రాహ్మణ స్వరూపము మరియు దేవత స్వరూపము, రెండింటినీ ఎదురుగా పెట్టుకుని ఆది నుండి అంతిమము వరకు మేము ఎంతటి శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నాము అన్నది చూడండి. అర్ధకల్పము రాజ్య భాగ్యము ప్రాప్తించుకున్నారు మరియు అర్ధకల్పము గౌరవనీయ, పూజ్యనీయ, శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు. మరి ఇదే నషా మరియు సంతోషములో ఉండడము ద్వారా స్మృతి స్వరూపులుగా అయిపోతారు.

స్లోగన్:-

ఎవరి వద్దనైతే జ్ఞానమనే అపారమైన ధనం ఉంటుందో, వారికి సంపన్నత యొక్క అనుభూతి కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top