TELUGU MURLI 01-04-2023

01-04-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – లక్ష్యమనే సబ్బుతో ఆత్మ రూపీ వస్త్రాన్ని శుభ్రం చేసుకోండి, లోపల ఏ విధమైన మాలిన్యము ఉండకూడదు’’

ప్రశ్న:-

పురుషార్థీ పిల్లలు కర్మల యొక్క ఏ గుహ్య గతిని తెలుసుకుంటూ పురుషార్థములో సదా తత్పరులై ఉంటారు?

జవాబు:-

ఆత్మపై అనేక జన్మల పాప కర్మల భారముంది, అనేక కఠిన సంస్కారాలు ఉన్నాయి, ఆ సంస్కారాలను యోగము లేకుండా పరివర్తన చేయడం జరగదు. ఆత్మ పాప కర్మలు చేస్తూ-చేస్తూ పూర్తిగా మలినముగా అయిపోయింది, అందుకే దీనిని శుభ్రం చేసే శ్రమ చేయాలి. అది స్మృతి లేకుండా శుభ్రమవ్వదు. స్మృతిలో తుఫానులు కూడా వస్తాయి కానీ ఎన్ని తుఫానులు వచ్చినా సరే, వారు పురుషార్థములో సదా నిమగ్నమై ఉంటారు.

పాట:-

నేను ఒక చిన్న బాలుడిని… (మై ఎక్ నన్హా సా బచ్చా హూ…)

ఓంశాంతి.

ఇప్పుడు ఎవరెవరైతే వచ్చి తండ్రికి పిల్లలుగా అవుతారో వారు స్వయమే అంటారు – ఓ బాబా, నేను ఇప్పుడు కొత్త చిన్న బాలుడిని. కొందరు ఒక నెలకు చెందినవారు, కొందరు 8 రోజులకు చెందినవారు, ఇక్కడైతే అందరూ చిన్నవారే కదా. మేము చిన్న పిల్లలము అని కొత్త పిల్లలు అంటారు. కొందరికి 20 సంవత్సరాలు, కొందరికి 15 సంవత్సరాలు గడిచాయి. వృద్ధి పొందుతూ ఉంటారు. వారంటారు, సంతానముగా అయితే అయ్యాను కానీ చిన్న బాలుడిని, మాకు కూడా మా వారసత్వము ఇవ్వండి లేదా మా పై కూడా జ్ఞాన వర్షాన్ని కురిపించండి. జ్ఞాన వర్షమైతే కురుస్తుంది కదా. వీరిని భాగ్యశాలి రథము అని అంటారు, ఎవరైతే జ్ఞాన గంగను తీసుకువచ్చారో లేక జ్ఞానామృతాన్ని తీసుకువచ్చారో, వారికి పేర్లు చాలా ఉన్నాయి. వీరు భగీరథుడు కూడా, అర్జునుడు కూడా, దక్ష ప్రజాపతి అని కూడా అంటారు. ఉన్నదైతే ఒక్కరే ప్రజాపిత, వారు అందరికీ లక్ష్యాన్ని ఇస్తారు. చాలామంది పిల్లలు వస్తారు, వారి వస్త్రాలు పూర్తిగా మలినముగా, పాతవిగా ఉంటాయి. కొందరి వస్త్రాలు ఒకలాగ ఉంటాయి, కొందరివి ఇంకోలాగ ఉంటాయి! కొందరివైతే ఎంతగా పాడై ఉన్నాయంటే అవి ఉతకడంతో పూర్తిగా చిరిగిపోతాయి. తండ్రి అంటారు, ఈ చాకలిరేవు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. వస్త్రాలను ఉతుకుతూనే వచ్చారు. కొందరైతే మంచిగా అయిపోయారు. కొందరైతే ఎంతగానైనా శుభ్రం చేయండి, అయినా కూడా మలినముగానే ఉంటారు! జ్ఞానమనే కర్రతో తీవ్రంగా దెబ్బ వేస్తే చిరిగిపోయినట్లుగా అవుతారు, పారిపోతారు. ఎవరైతే శుభ్రమవ్వరో, శుద్ధంగా అయి ఇతరులను శుద్ధంగా తయారుచేయరో, వీరి భాగ్యములో లేదని భావించడము జరుగుతుంది. ఎవరైతే స్వయము మంచిగా తయారవుతారో, వారు ఇతరుల వస్త్రాలను కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. ఇది చాకలిరేవు కూడా. ఆత్మ పవిత్రముగా అవ్వడంతో మళ్ళీ శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది, నల్లనివారి నుండి తెల్లనివారిగా అవుతారు. ఈ సమయంలో అందరూ నల్లగా ఉన్నారు. తండ్రి అయితే పూర్తిగా రాజులకే రాజుగా తయారుచేసేందుకే వచ్చారు ఎందుకంటే పాపాత్ములుగా అయితే అందరూ ఉన్నారు కదా. ఈ జన్మ గురించైతే తెలుస్తుంది. ఇంతకుముందు ఉన్న జన్మల గురించైతే తెలియదు. అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోకుండా, మారకుండా ఉంటే, బహుశా ఇంతకుముందు పతితులుగా ఉండి ఉంటారు, అందుకే సంస్కారాలు మారడము లేదని భావించడము జరుగుతుంది. ఏ విధముగా వేడి పెనంపై నీళ్ళు పడగానే ఆవిరైపోతాయి.

భగవంతుడు వచ్చి లక్ష్యమనే సబ్బుతో శుభ్రం చేస్తారు. ప్రతి ఒక్కరి నాడిని చూడడము జరుగుతుంది. తండ్రి అయితే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. పిల్లలూ, నన్ను స్మృతి చేయడం ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. నష్టోమోహులుగా కూడా అవ్వాలి. అతి ప్రియమైన తండ్రి, అర్ధకల్పం ద్వాపరము నుండి మొదలుకొని భక్తులు భక్తి చేసారు. వారే మళ్ళీ దేవీ-దేవతలుగా అవ్వనున్నారు. తెలిసిపోతుంది. తండ్రి అంటారు, లేస్తూ-కూర్చుంటూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎలాగైతే కుమారీ, కుమారులకు నిశ్చితార్థము జరిగితే వారికి ఒకరి స్మృతి ఒకరికి ఉంటుంది కదా. ఇక్కడైతే ప్రియుడిని విడిచిపెట్టి పారిపోతారు. ఏ ప్రియుడైతే స్వర్గానికి యజమానులుగా చేస్తారో, వారిని ఏ మాత్రము స్మృతి చేయరు. ఈ విధముగా ఎవరూ చెప్పలేరు. నేను కల్ప క్రితము వలె అజామిళ్ వంటి పాపాత్ములను ఉద్ధరించేందుకు వచ్చాను. కొందరి వస్త్రాలు బాగున్నాయి, కొందరివి వస్త్రాలు మురికిపట్టి ఉన్నాయి. స్త్రీ అంటుంది, బాబా, మమ్మల్ని పవిత్రముగా, శుద్ధముగా తయారుచేయండి అని. నేనైతే వికారాలు లేకుండా ఉండలేను అని పురుషుడు మళ్ళీ అంటాడు. గొడవ జరుగుతుంది. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి! ఎవరైతే పవిత్రముగా అవ్వరో, వారు ఎన్ని విఘ్నాలు కలిగిస్తారు. సన్యాసులనైతే ఎవరూ ఆపలేరు. గవర్నమెంట్ కూడా, మీ పిల్లలను ఎవరు సంభాళిస్తారని వారిని అనలేదు. ఇక్కడ ఈ విషయంపై గొడవ జరుగుతుంది. ఒకరు పవిత్రముగా అవుతారు, ఇంకొకరు అజామిళ్ వంటి పాపులుగా ఉండిపోతారు. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధిగా అవుతారో, వారు ఎవ్వరినీ లక్ష్య పెట్టరు. పూర్తిగా నష్టోమోహులుగా అవుతారు. రాజ్యాన్ని కూడా కాలదన్నుతారు. భక్తి మార్గములో మీరా ఉదాహరణ ఉంది. భక్తి మార్గములో ఇలాంటివారు చాలామంది ఉన్నారు. ఇక్కడ అతి కష్టం మీద వెలువడతారు. అయితే, మేమైతే పవిత్రముగా అవ్వాలి అని అనేవారు కూడా వెలువడుతారు. మాకు రాజ్యం గురించేమీ లెక్క లేదు అని వారు వెంటనే అంటారు. ఏ విధముగా ఆ రాజులకు రాణుల లెక్క ఉండేది కాదో, విడిచిపెట్టేసేవారు, అలాగే ఇప్పుడు రాజులను లెక్క చేయని రాణులు వెలువడుతారు. మేమైతే స్వర్గానికి యజమానులుగా అవుతాము, అంతే. భక్తి మార్గములో ఏ రాజులైతే సన్యసించారో, వారి పేర్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఇది జ్ఞాన మార్గము. ఒక్కరు అర్థం చేసుకోగలరు – నేను ఎంతవరకు చాకలివానిగా అయ్యాను? మంచి చాకలివానిగా ఎందుకు అవ్వకూడదు. చాకలివారిలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. విదేశాలలో వస్త్రాలను ఉతకడము కోసం పంపించడము జరుగుతుంది, అంటే తప్పకుండా వారు మంచిగా వస్త్రాలను శుభ్రం చేస్తూ ఉండి ఉండవచ్చు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కొందరైతే వెంటనే శుభ్రమై, శ్రీమతముపై నడవడం మొదలుపెడతారు. పావనంగా అవుతారు మరియు తయారుచేస్తారు. పురుషులు పవిత్రముగా అవ్వకపోతే స్త్రీలు ఎంతగా సహనం చేయవలసి వస్తుంది! ఈ రోజుల్లోనైతే చాలా సంభాళించవలసి ఉంటుంది ఎందుకంటే మనుష్యులు ప్రతి ఒక్కరు 5 భూతాలకు వశమై ఉన్నారు. క్రోధానికి వశమై కూడా చాలా నష్టపరుస్తారు. వారంటారు, బాబా, మేము పరవశమయ్యాము. దేహ అహంకారము వచ్చేస్తుంది. దేహ అహంకారం రావడంతోనే మళ్ళీ ఇతర వికారాలు వచ్చేస్తాయి. తమను తాము దేహీగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయకపోతే రిజిష్టరు పాడైపోతుంది. మనసులో తుఫానులైతే వస్తాయి కానీ కర్మేంద్రియాలతో చేయకూడదు.

తండ్రి అంటారు, విశ్వానికి యజమానులుగా అవ్వడము పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువా ఏమిటి. లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా అయ్యారు అంటే తప్పకుండా ఏదో పురుషార్థం చేసే ఉంటారు కదా. తప్పకుండా తండ్రి కూర్చుని స్వర్గం కోసం రాజా, రాణులుగా తయారుచేస్తారు కావున తండ్రి శ్రీమతముపై నడవాలి. శ్రీమతము ఒక్క తండ్రిదే. మిగిలినవన్నీ భూత మతాలు. శ్రీమతాన్ని మర్చిపోతే వెంటనే భూతాలు వచ్చేస్తాయి. వెంటనే మాయ దాడి చేసి భుజాన్ని కిందికి దించేస్తుంది. నేను ఎంతవరకు మురికిపట్టి ఉన్నాను అని తమను తాము చూసుకోవాలి. మంచి పిల్లలు కుమారకా మొదలైనవారు ఉన్నారు… వారు సేవ చేస్తున్నారు. మురికిపట్టిన వస్త్రాలను ఉతకడానికి, 5 వికారాలపై విజయాన్ని ప్రాప్తింపజేయడానికి వెళ్తారు. ఎవరికైనా కామమనే భూతం వస్తే ఒక్కసారిగా పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. అశుద్ధముగా అయితే వారిని బి.కె. అని ఏమైనా అంటారా. వారి రిజిష్టరు మళ్ళీ ఒక్కసారిగా పాడైపోతుంది. బాబా శుభ్రం చేసేందుకు ఎన్నో దెబ్బలు వేస్తూ ఉంటారు. వారంటారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే వస్త్రం శుభ్రమవుతుంది, లేదంటే భూతాలు వస్తూ ఉంటాయి. ధారణ జరగకపోతే, నేను చాలా మురికిపట్టి ఉన్నానేమో, ఇంతకుముందు జన్మలో బహుశా నేను చాలా అశుద్ధముగా ఉండి ఉంటాను అని భావించాలి. సిగ్గు అనిపించాలి. పురుషార్థం చేయకపోతే అశుద్ధమైనవారు అశుద్ధముగానే ఉండిపోతారు. యోగ్యులుగా అవ్వరు. మీరు ఇక్కడకు యోగ్యులుగా అయ్యేందుకు వస్తారు. మంచి వస్త్రాలైతే సూర్యవంశీయులుగా లేక చంద్రవంశీయులుగా అవుతారు. బాబా ఇప్పుడు అనంతమైన విశాల బుద్ధిని ఇచ్చారు. మొత్తం ప్రపంచమంతటి చక్రాన్ని మీరు తెలుసుకున్నారు. మనుష్యులు ఓ పతిత-పావనా అని అంటారు కూడా, మరి వారు తప్పకుండా ఒక్కరే అయి ఉంటారు, వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. వారు నిరాకారుడు. ఈ చాకలిరేవు వెలువడి 5,000 సంవత్సరాలు గడిచింది. తండ్రి అంటారు, 5-5 వేల సంవత్సరాల తర్వాత చాకలిరేవును భారత్ లోనే తయారుచేస్తాను. ఈ యోగముతో మీరు సదా పావనులుగా అవుతారు మళ్ళీ 21 జన్మలు మీరు పతితులుగా అవ్వరు. అక్కడ మాయ ఉండదు. పావనులుగా అవ్వకుండా మీరు వైకుంఠానికి వెళ్ళలేరు. ప్రజలైతే చాలామంది అవుతారు, కానీ ఇందులో తృప్తి పడకూడదు.

నీవే తల్లివి, తండ్రివి, మేము మీకు పిల్లలము, నీ కృపతో రాజ్యం యొక్క సుఖపు గనులను పొందాము అని పాడుతారు, అంతేకానీ ప్రజలుగా అవుతామని కాదు. ఇది ఉన్నదే దుఃఖధామము. ధనవంతులైతే ఉన్నారు ఎందుకంటే మంచి కర్మలు చేసారు. ఇది లౌకిక రాజ్యము, స్వర్గానికి సంబంధించినది పారలౌకిక రాజ్యము. రెండూ ఎలా లభిస్తాయి అన్నది కూడా పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు, నా శ్రీమతముపై నడవడము ద్వారా మళ్ళీ 21 జన్మలు మీరు శిక్షలను అనుభవించరు. అలాగని వ్యాపారాలు మొదలైనవి విడిచిపెట్టి ఇక్కడ కూర్చుండిపోకూడదు. పిల్లలను మీరు పాలన చేయాలి. వారు మీ రచన. వ్యాపార, వ్యవహారాలలో నష్టము లేక లాభము అయితే లభిస్తూనే ఉంటుంది. సత్యయుగములో అయితే ప్రారబ్ధము ఉంటుంది. అక్కడ నష్టపోవడము మొదలైన విషయమేమీ ఉండదు. ఇక్కడ మీరు శ్రీమతముతో ఎంత లాభాన్ని పొందుతారంటే 21 జన్మల వరకు నష్టపోయే విషయమేమీ ఉండదు. పూర్తిగా జ్ఞానాన్ని తీసుకోకపోవడముతో తక్కువ పదవి లభిస్తుంది. శ్రీమతముపై నడవడం ద్వారా నష్టోమోహులుగా అవుతారు, అప్పుడు మంచి పదవినే పొందుతారు. వారికి గౌరవము ఇక్కడే లభిస్తుంది. నంబరువారుగా రాజ్యము లభిస్తుంది అన్నప్పుడు మాత, పితలను ఫాలో చేయాలి. మదర్, ఫాదర్ కర్మలు నేర్చుకుంటారు మరియు నేర్పిస్తారు. శ్రీమతముపై నడుచుకోండి, వికారాలలోకి వెళ్ళకండి, పథ్యము పాటిస్తూ నడుచుకోండి అని అంటారు. యుక్తులైతే చాలా చెప్తారు. బాబా అవినాశీ సర్జన్. మిగిలినవారంతా వ్యాధిగ్రస్థులు. మీరు సహాయకులుగా అవుతారు. మీరు నంబరువారు సహాయక సర్జన్లుగా ఉన్నారు. అందరికన్నా చురుకైన అవినాశీ సర్జన్ శివబాబా ఒక్కరే. సర్జన్లలో నంబరువారుగా ఉంటారు కదా. కొందరైతే లక్షలు కూడా సంపాదిస్తారు, కొందరైతే తమ కడుపును కూడా పూర్తిగా నింపుకోలేరు. కొందరైతే నడుస్తూ-నడుస్తూ తండ్రి చేతిని విడిచిపెట్టేస్తారు, అప్పుడు వారి కోసం అంటారు కదా, వీరు ఛీ-ఛీ మురికిపట్టిన వస్త్రాలు. అనేక జన్మల సంస్కారాలు లాగుతాయి కదా, ఇక జ్ఞానాన్ని ధారణ చేయలేరు. జ్ఞానమనే రంగు అంటదు. ఇది కూడా డ్రామా! బాబా సుఖాన్ని ఇవ్వడానికే వస్తారు. సాధువులను కూడా నిర్వాణధామములోకి తమ సెక్షన్ లోకి పంపిస్తారు. భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఏదైతే ఉందో, అది కనుమరుగైపోయింది. తమ ధర్మము-కర్మ నుండి భ్రష్టులుగా అయ్యారు. దేవీ-దేవతలుగా పిలవబడేవారు ఎవరూ లేరు. వారు లేనప్పుడే నేను వచ్చి స్థాపన చేస్తాను. కావున తప్పకుండా ఇతర ధర్మాల ఆత్మలను కూడా తిరిగి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మనుష్యులు ముక్తిధామంలోకే వెళ్ళాలని కోరుకుంటారు. తండ్రి అంటారు, నేను దీని కోసమే వచ్చాను. కావున పిల్లలు తమను తాము ప్రశ్నించుకోవాలి – ఇంతకుముందు మేము చాలా పతితంగా ఉండేవారమా, అందుకే ధారణ జరగడం లేదా? మమ్మా, బాబా యొక్క సింహాసనాధికారులుగా అవ్వలేకపోతే వెళ్ళి దాస దాసీలుగా అవుతారు. తండ్రి అంటారు, నేను పతితులను పావనంగా తయారుచేసేందుకు వచ్చాను. ఈ శరీరాన్ని ఆధారముగా తీసుకున్నాను. లేదంటే పతితలను పావనంగా ఎలా తయారుచేస్తాను? పిల్లలైన మీరు అంటారు, తండ్రి ద్వారా మనమే దేవీ-దేవతలుగా, పావనంగా అవుతున్నాము. ఇప్పుడు అలా తయారవ్వలేదు, పురుషార్థులుగా ఉన్నారు. శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠముగా అవ్వాలి. ఈ జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. నాలెడ్జ్ ఫుల్ అని ఒక్క గాడ్ ఫాదర్ నే అనడము జరుగుతుంది. వారే మొత్తం బ్రహ్మాండము, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపిస్తారు. మీరు కూడా జ్ఞాన సంపన్నులుగా అవ్వండి. కొందరైతే జ్ఞాన సంపన్నులుగా అవుతారు, కొందరైతే ఏ మాత్రము ధారణ చేయరు. వారి భాగ్యములో లేదని భావిస్తారు. మంచి పిల్లలు చాలా మంచి పురుషార్థము చేస్తారు. ఇకపోతే, ఇళ్ళు-వాకిళ్ళనైతే సంభాళించాల్సిందే. ప్రారంభంలో వీరిది 14 సంవత్సరాల భట్టీ జరిగింది. వస్త్రాలను శుభ్రం చేస్తూ-చేస్తూ ఎంత మంచిగా, తెల్లగా అయిపోయారు! కొందరు చిరిగిపోయినట్లుగా అయిపోయారు, కొందరు మురికిగా ఉన్నవారు మురికిగానే ఉండిపోయారు. ఈ రోజుల్లోనైతే ఏడు రోజులు కూడా అతి కష్టము మీద నిలవగలరు. మొదట అయితే పూర్తి భట్టీ ఉండేది. భట్టీ జరగకపోతే మీరు ఎలా తయారవుతారు? ఇటుకలు భట్టీలో కాలుతాయి కదా. కొన్ని అపరిపక్వముగానే ఉండిపోతాయి, కొన్ని విరిగిపోతాయి. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది – చాలా వస్త్రాలు చినిగిపోతాయి, శ్రీమతంపై నడవకపోవడంతో శుభ్రమవ్వరు. ఇప్పుడు ఆత్మలకు పరమపితతో నిశ్చితార్థము చేయించడము జరుగుతుంది. శివబాబా అంటారు, నేనైతే సదా పావనుడిని. నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పావనంగా అవుతూ ఉంటారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ ప్రాక్టీసు చేయండి. మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో, వారైతే వెంటనే ప్రాక్టీసులో నిమగ్నమవుతారు. సంతోషముగా ఉంటారు. రాత్రి మేల్కొని తమ ఆత్మను శుభ్రం చేసుకుంటారు. పవిత్రముగా అయితే వస్త్రము కూడా పవిత్రమైనది లభిస్తుందని భావిస్తారు, అందుకే నిద్రను జయించేవారిగా అవ్వండి అని బాబా అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రముగా అవుతుంది. అమృతవేళ సమయం మంచిది. ఆ సమయంలో స్మృతి చేయమని సలహా ఇస్తారు. నిద్ర వస్తే కళ్ళల్లో నూనె వేసుకోండి. అనగా పురుషార్థము చేయండి. స్మృతి చేయండి అని శ్రీమతము లభిస్తుంది. మాయ తుఫానులను తీసుకొచ్చినా కూడా మీరు బాబాను స్మృతి చేయండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతంపై పూర్తి నష్టోమోహులుగా అవ్వాలి. పథ్యంతో మరియు యుక్తితో నడుచుకోవాలి. రిజిస్టర్ పాడవ్వనివ్వకూడదు.

2. నిద్రను జయించేవారిగా అయి విశేషంగా అమృతవేళ ఆత్మను శుభ్రం చేసుకునేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. జ్ఞాన-యోగాలతో ఆత్మను పావనంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

ఒకే సంకల్పములో స్థితులై మహా తీర్థం యొక్క ప్రత్యక్షతను చేసే బాధ్యతాయుత ఆత్మా భవ

ఈ ఆబూ విశ్వం కోసం లైట్ హౌస్ వంటిది. ఈ మహా తీర్థాన్ని ప్రత్యక్షం చేసేందుకు బ్రాహ్మణ పిల్లలందరికీ ఒకే సంకల్పము ఉండాలి – ప్రతి ఆత్మకు ఇక్కడి నుండి ఆశ్రయం లభించాలి. అందరి కళ్యాణము జరగాలి. ఎప్పుడైతే ఈ శుభ ఆశల దీపము ప్రతి ఒక్కరిలో వెలుగుతుందో, అందరి సహయోగము ఉంటుందో, అప్పుడు కార్యంలో సఫలత ఉంటుంది. ఇది నా బాధ్యత అని అందరి మనసుల నుండి శబ్దం వెలువడాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు స్వయాన్ని ఇటువంటి బాధ్యత కలవారిగా భావిస్తారో, అప్పుడే ప్రత్యక్షతా కిరణాలు తండ్రి ఇంటి నుండి నలువైపులా వ్యాపిస్తాయి.

స్లోగన్:-

అంతర్ముఖత యొక్క విశేషతను ధారణ చేసినట్లయితే సర్వుల ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి.

గమనిక:-
ఈ మాసపు మురళీలు (ఈశ్వరీయ మహావాక్యాలు) అన్నీ నిరాకార శివ పరమాత్మ బ్రహ్మా ముఖ కమలము ద్వారా తమ బ్రహ్మావత్సలకు అనగా బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీల సమ్ముఖములో 18-01-1969 కి ముందు ఉచ్ఛరించినవి. ఇవి కేవలం బ్రహ్మాకుమారీ నిమిత్త టీచర్ అక్కయ్యల ద్వారా నియమిత బి.కె. విద్యార్థులకు వినిపించడము కోసము ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top