TELUGU MURLI 31-03-2023

31-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మీ స్వభావాన్ని చాలా మధురముగా తయారుచేసుకోండి, పొరపాటున కూడా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి, చెడు మాటలు మాట్లాడడము, క్రోధం చేయడము, తిట్టడము… ఇవన్నీ దుఃఖము ఇవ్వడము’’

ప్రశ్న:-

మాయ ఏ రూపంలో పిల్లలకు పరీక్ష తీసుకుంటుంది? ఆ పరీక్షలో స్థిరముగా ఉండేందుకు విధి ఏమిటి?

జవాబు:-

ముఖ్యమైన పరీక్ష కామము మరియు క్రోధము రూపంలో వస్తుంది. ఈ రెండూ అతి కష్టం మీద వెంటపడడము మానుతాయి. క్రోధమనే భూతము ఘడియ-ఘడియ తలుపు తడుతుంది. వీరు ఎక్కడా భౌ-భౌ అనైతే అనడం లేదు కదా అని చూస్తుంది. అనేక రకాల తుఫానులు దీపాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తాయి. ఈ పరీక్షలలో స్థిరముగా ఉండేందుకు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రితో యోగం పెట్టుకోవాలి. లోపల సంతోషపు వాయిద్యాలు మ్రోగుతూ ఉండాలి. జ్ఞానము మరియు యోగబలమే ఈ పరీక్షల నుండి పాస్ చేయించగలవు.

పాట:-

బలశాలితో నిర్బలుని యుద్ధము… (నిర్బల్ కీ లడాయీ బల్వాన్ సే…)

ఓంశాంతి.

పిల్లలు అర్థం చేసుకుంటారు మరియు తండ్రి కూడా అర్థం చేయిస్తారు – మీరు మళ్ళీ పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు, మిగిలినవారంతా లౌకిక తండ్రులు. ఇక్కడ అందరూ ఆసురీ బుద్ధి కలవారు, సత్యయుగములో దైవీ బుద్ధి కలవారు ఉంటారు. ఆసురీ నుండి మళ్ళీ తర్వాత దైవీగా తప్పకుండా అవ్వాలి. ఆసురీ మరియు దైవీ, పతితులు మరియు పావనులలో తేడా చాలా ఉంది. మనం పావనంగా ఉండేవారము, మళ్ళీ రావణుడు పతితముగా చేసాడని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా మనం పావన ప్రపంచము, సత్యయుగీ రాజ్య-భాగ్యము యొక్క వారసత్వము తీసుకుంటున్నాము – అది కూడా 21 జన్మల కోసము. ఎప్పుడైతే బాబా పిల్లలకు చెప్తారో, అప్పుడే స్మృతి చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఏ విషయమైతే గుర్తుంటుందో, అది మళ్ళీ ఇతరులకు అర్థం చేయించడము కోసం మనసు పరితపిస్తూ ఉంటుంది. స్మృతి లేకపోతే మనసు పరితపించదు. అప్పుడు ఆ సంతోషంలో ఉప్పొంగడము అన్నది జరగదు. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. మనం పోగొట్టుకున్న సత్యయుగ రాజ్య-భాగ్యాన్ని మళ్ళీ తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. క్రిస్టియన్ల నుండి ఏ రాజ్యమైతే వారు పోగొట్టుకున్నారో, దానిని తీసుకున్నారు. కానీ మాయ మన రాజ్యాన్ని లాక్కుంది, ఇది ఎవరికీ తెలియదు. హఠముతో, నిరాహార దీక్షలు మొదలైనవి చేసి క్రిస్టియన్ల నుండైతే రాజ్యం తీసేసుకున్నారు. ఇక్కడైతే ఆ విషయమేమీ లేదు. మనం 5,000 సంవత్సరాల క్రితం వలె తండ్రి శ్రీమతముపై నడవడం ద్వారా మళ్ళీ రాజ్య-భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నామని మీ మనసులో ఉంది. ఇందులో ఖడ్గము మొదలైనవేవీ ఉపయోగించే మతాన్ని ఇవ్వరు. వారంటారు, పిల్లలూ, మధుర స్వభావులుగా అవ్వండి, చాలా మధురంగా అవ్వండి. సత్యయుగములో సింహం, మేక కూడా కలిసే నీరు తాగేవి. ఒకదానితో ఒకటి ప్రేమగా ఉండేవి. దుఃఖపు దాడి ఉండదు. ఇక్కడ దుఃఖపు దాడి చాలా ఉంటుంది. కామ ఖడ్గాన్ని నడిపించడము, ఇది కూడా దుఃఖపు దాడి. ఎవరితోనైనా చెడు మాటలు మాట్లాడడము లేక క్రోధం చేయడము, తిట్టడము, ఇది కూడా దుఃఖాన్ని ఇవ్వడము. తండ్రి అంటారు, ఎవ్వరికీ కూడా ఈ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీ స్వభావాన్ని చాలా మధురముగా చేసుకోండి. పొరపాటున కూడా దుఃఖాన్నిచ్చే పని చేయకండి. శ్రీకృష్ణుడి కోసం, ఇంతమంది రాణులను ఎత్తుకుపోయారని అంటారు. అయినా కూడా, సుఖాన్ని ఇవ్వడము కోసమే ఎత్తుకెళ్ళారని అంటారు. శ్రీకృష్ణుని విషయం కాదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భాగవతంతో గీతకు, గీతతో మళ్ళీ మహాభారత యుద్ధానికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఇది అదే సంగమయుగము. శ్రీకృష్ణుడిదైతే పేరే లేదు. శ్రీకృష్ణుని రాజధాని సత్యయుగంలో ఉంటుంది. శ్రీకృష్ణుడేమీ పతితుల నుండి పావనంగా చేయడము కోసం ఎప్పుడూ రాఖీని కట్టలేదు. ఇది పతితులను పావనంగా తయారుచేసే ఉత్సవము. పతిత-పావనుడు పరమాత్మ కానీ శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుని జన్మ అయితే సత్యయుగంలో జరిగింది. అక్కడైతే కంసుడు, రావణుడు, శూర్పణఖ మొదలైనవారు ఉండరు. వీరు ఈ సమయంలో ఆసురీ సంప్రదాయం వారిగా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం అనంతమైన తండ్రి నుండి అనేక సార్లు రాజయోగం నేర్చుకున్నాము మరియు 21 జన్మలు రాజ్య పదవిని పొందాము, మళ్ళీ మాయ వలన రాజ్య-భాగ్యము పోగొట్టుకున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే తల్లిదండ్రుల హృదయంపైకి, తాతగారి హృదయం పైకి ఎక్కిన పిల్లలుగా ఉన్నారో, వారే సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరైతే ఆజ్ఞాకారులుగా అవ్వరో, వారు ఏం పదవిని పొందుతారు. సూర్యవంశీ పదవినే పొందాలి. లేదంటే వెళ్ళి పైసా అంత విలువ కూడా చేయని దాస దాసీలుగా అవుతారు. బాప్ దాదా ఆజ్ఞపై నడవరు. బ్రహ్మా మతము కూడా ప్రసిద్ధమైనది. శివబాబా శ్రీమతము కూడా ప్రసిద్ధమైనది. కావున బ్రహ్మా మరియు శివబాబాతోపాటు వారి సంతానం యొక్క మతము కూడా ప్రసిద్ధి చెందాలి. మీరు శివబాబా మరియు బ్రహ్మా, ఇరువురి మతముపై నడవాలి, అప్పుడే శ్రేష్ఠముగా అవుతారు. మాత, పితలు కూడా శ్రేష్ఠముగా అయ్యేందుకు ఎంత మంచి ధారణ చేస్తారు, పిల్లలందరినీ చదివిస్తారు. మురళీ పిల్లలందరి వద్దకు వెళ్తుంది. చదివించడమే వీరి పాత్ర. తల్లిదండ్రులకన్నా కూడా బాగా చదివించే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. శివబాబా విషయమైతే ఉన్నతమైనది. కానీ ఈ సమయంలో మమ్మా, బాబా కన్నా కూడా తెలివైన పిల్లలు ఉన్నారు. సంపూర్ణముగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. ఏదో ఒక ముల్లు కూడా గుచ్చుకుంటూ ఉంటుంది, మాయ దాడి జరుగుతుంది. దీపానికి తుఫాన్లు వస్తాయి. ఎంతగా జ్ఞానం మరియు యోగములో ఉంటారో, అంతగా ఈ నేతితో మీ జ్యోతి వెలిగి ఉంటుంది. ఏదైనా దీపములో నెయ్యి కొంచెం తగ్గితే ప్రకాశం తగ్గిపోతుంది. కొందరి దీపము చాలా బాగా వెలుగుతూ ఉంటుంది. ఆత్మ రూపీ దీపానికే తుఫాన్లు వస్తాయి. తుఫానులైతే వస్తాయి, బాబా అంటారు, నంబరువన్ అనుభవజ్ఞుడిని నేను. రుస్తుంతో తప్పకుండా మాయ రుస్తుంగా అయి పోరాడుతుంది.

తండ్రి అర్థం చేయిస్తారు, ఓ దీపములారా, ఇలాంటి-ఇలాంటి తుఫానులు వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో ఏ పాప కర్మ చేయకండి. ఎవరైనా ఏమైనా అంటే ఒక చెవితో విని ఇంకొకదానితో వదిలేయండి, ఇటువంటి అభ్యాసం చేయవలసి ఉంటుంది. క్రోధం కూడా మనుష్యులను పూర్తిగా సర్వ నాశనం చేసేస్తుంది. ఇది కూడా పెద్ద పరీక్ష అవుతుంది. క్రోధమనే భూతం వచ్చి తలుపు తడుతుంది, భౌ-భౌ అనడము చూస్తుంది. ఒకవేళ ఎవరైనా భౌ-భౌ అనడము మొదలుపెడితే దీపం ఆరిపోతుంది. మాయ అందరిది పరీక్ష తీసుకుంటూ ఉంటుంది. వీరిలో క్రోధం ఉండేది కాదు, ఇప్పుడు మళ్ళీ వీరిలో క్రోధము వచ్చేసింది అని భావించడము జరుగుతుంది. బాబా వద్ద చాలా మంచి-మంచి పిల్లలు ఉండేవారు, మాయా తుఫానులను సహించుకోలేకపోవడంతో పడిపోయారు, అప్పుడు వారి భాగ్యము అని అనడము జరుగుతుంది. మేము పరీక్షలో నిలవలేము అని అంటారు. పిల్లలైతే పరీక్షలో అంగదుని వలె చాలా స్థిరముగా ఉండాలి. ఇది కూడా ఒక ఉదాహరణ.

పిల్లలైన మీ లోపల సంతోషపు ఢంకా మోగాలి. సర్వశక్తివంతుడైన బాబాతో యోగం పెట్టుకోవడముతో సహాయం దానంతట అదే లభిస్తూ ఉంటుంది. ఏ ఆయుధాలను ఉపయోగించరు. బాబా అన్ని యుక్తులను నేర్పిస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. క్రోధములో కూడా స్థితులు ఉంటాయి. కామం యొక్క భూతమైతే చాలా చెడ్డది. ఎవరిలోకి కామం యొక్క భూతము మళ్ళీ ప్రవేశించకూడదు. దానిని యోగబలముతో తొలగించి వేయాలి. యోగముతోనే క్రోధమనే భూతము కూడా తొలగిపోతుంది. ఘడియ-ఘడియ తలుపు తడుతూ ఉంటాయి, ఎక్కడైనా అవకాశం చూసాయంటే ఇక దూరిపోతాయి. ఈ 5 దొంగలు లోపల చాలా నష్టపరుస్తాయి. మనం ఎంత షావుకార్లుగా ఉండేవారము, 5 వికారాలు ఎంత నిరుపేదగా చేసేసాయి. వీటిలో పెద్ద సర్దార్ కామము. సెకెండు నంబరు క్రోధము. కామము రాజు వంటిది. అతి కష్టం మీద వెంట పడడము మానుతుంది. చాలా భారీ శత్రువులు, చాలా విసిగిస్తాయి. పాపం అబలలు ఎంతగా దెబ్బలు తింటారు. వారి ఫిర్యాదులను వినలేము. ఈ ఫిర్యాదులను వినేవారు కేవలం ఒక్క తండ్రి మాత్రమే. కానీ అది కూడా, సత్యమైనవారు ఎవరైతే ఉంటారో, వారివే వింటారు. అసత్యమైనవారివి కాదు. మరి ఈ వికారాలు మనుష్యులను పూర్తిగా అశుద్ధంగా చేసేస్తాయి. క్రోధమనే రోగము ఉప్పొంగితే, క్రోధము స్వయాన్ని కూడా సర్వ నాశనం చేయిస్తుంది, ఇతరుల ఔషధం కూడా ఆగిపోతుంది. హంగామా జరుగుతుంది. కావున తండ్రి నుండి ఎవరైతే ఔషధం తీసుకునేందుకు వస్తారో, వారిది ఆగిపోతుంది. వారిపై బంధనాలు వచ్చేస్తాయి. ఇక వారి భవిష్య అవినాశీ జన్మ-జన్మాంతరాల జీవనాధారము ఆగిపోతుంది. ఈ విధంగా ఎవరైతే పరమపిత పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవడంలో విఘ్నాలు కలిగిస్తారో, వారిపై ఎంత పాపం ఉంటుంది. ఇక అడగకండి. వారు తమపై తాము కృపకు బదులుగా శపించుకుంటున్నట్లుగా ఉంటారు. కొందరు ద్రోహులుగా అయితే ఎంతమందికి నష్టం చేకూరుస్తారు. భవిష్య వజ్ర తుల్యమైన జీవితం తయారుచేసుకోవడంలో ఆటంకం కలుగుతుంది, అందుకే తండ్రి అంటారు, మహాపాపులు, మహా-బుద్ధిహీనులు, మహా-దురదృష్టవంతులను చూడాలంటే ఇక్కడే చూడండి. కొందరు వార్తాపత్రికలలో తప్పుగా రాస్తారు, దానితో పాపం మాతలకు ఎన్ని ఆపదలు వస్తాయి. తెలిసి ఉండి కూడా ఏదైనా అలా చేస్తే వారిపై ధర్మరాజు దెబ్బలు ఎన్ని పడతాయి. తండ్రి అంటారు, ద్రోహులుగా అయ్యేటువంటి మరియు అబలలపై అత్యాచారం జరిగేటువంటి పనులేవీ చేయకూడదు. వారిని కపటులు అని కూడా అంటారు. తలలో రక్తం వేడెక్కితే ఇక ఖడ్గం ఎత్తి చంపడము మొదలుపెడతారు. అప్పుడు వారిని ఉరికంబానికి ఎక్కిస్తారు. ఇక్కడ కూడా అలాగే అవుతారు. ఎవరిలోనైనా క్రోధమనే భూతం వస్తే ఎంతోమంది జీవనాధారాన్ని ఆపేస్తారు. తండ్రి అంటారు, అటువంటివారి కోసం చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎవరైతే ద్రోహులుగా అయి విఘ్నాలు వేస్తారో, వారికి చాలా పాపం కలుగుతుంది. ఉన్నతిలోకి వెళ్తే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు, పడితే పూర్తిగా ముక్కలు, ముక్కలుగా అయిపోతారు… వైకుంఠానికి యజమానులుగా అయినా అవుతారు లేక నౌకర్లుగా అయినా అవుతారు. ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో, వారు అంతే పాపాత్ములుగా కూడా అవుతారు. అనేకులకు దుఃఖాన్ని ఇవ్వడానికి నిమిత్తముగా అవుతారు. బాబాకు దయ కలుగుతుంది. మాతల పైన అయితే గౌరవం ఉంచాలి. వందేమాతరం అని గాయనం చేయబడుతుంది. తండ్రి వచ్చి కలశాన్ని మాతలపై పెడతారు, వారిపై అత్యాచారాలు చాలా జరుగుతాయి. కావున చాలాకాలం క్రితం విడిపోయి కలిసిన పిల్లలకు చాలా సహాయం అందించాలి. ఒకవేళ ఎవరైనా సహాయానికి బదులుగా ఇంకా తప్పుడు పనులు చేస్తే ఎంత నష్టం జరుగుతుంది. చాలా సుపుత్రులుగా అవ్వాలి. అసురులను దేవతలుగా తయారుచేయాలి.

బాబా జీవించి ఉండగానే మీ కొత్త చిత్రాన్ని తయారుచేస్తారు. కళాకారులు చిత్రాలను తయారుచేస్తారు కదా. ఎవరైతే చాలా బాగా తయారుచేస్తారో వారికి బహుమతి లభిస్తుంది. తండ్రి అంటారు, నేను జ్ఞానం మరియు యోగబలముతో మీ చిత్రాన్ని ఎలా తయారుచేస్తాను అంటే, ఇక మీరు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత పూర్తిగా ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది. ఇక మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. జ్ఞానం, యోగబలముతో మీరు ఎంత సుందరముగా అవుతారు. బాబా వంటి ఫస్ట్ క్లాస్ కళాకారుడు ఎవరూ ఉండరు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడము ఈ తండ్రి పనే. ఇది నంబరువన్ సేవ, దీనితో మొత్తం ప్రపంచము మారిపోతుంది. ఆ మధురమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అని అంటారు. ఇది నరకము, పతిత ప్రపంచము అన్న విషయం కూడా మనుష్యుల బుద్ధిలో లేదు. ఇది కేవలం పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది. గొప్ప-గొప్ప కోటీశ్వరులందరి ధనము కూడా మట్టిలో కలిసిపోతుంది. చాలా దుఃఖితులై మరణిస్తారు. ఈ రోజుల్లో పెద్ద-పెద్ద వ్యక్తులను కూడా హతమారుస్తూ ఉంటారు. శత్రుత్వము తీవ్రమైపోతే ఇక అడగకండి. చాలా చెడు సమయం రానున్నది. ఇప్పుడు పిల్లలైన మీరు భవిష్యత్తు కోసం పురుషార్థం చేస్తున్నారు, ఇంకెవ్వరూ భవిష్యత్తు కోసం పురుషార్థం చేయరు. పురుషార్థంలో మళ్ళీ మాయ మరిపింపజేస్తుంది, ఇక ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. మాయ పూర్తిగా ముఖం తిప్పేస్తుంది, అందుకే చాలా సంభాళించుకోవాలి. ఎంత వీలైతే అంత సంతోషంగా బాబాను స్మృతి చేయాలి. మనం తండ్రి నుండి 21 జన్మల సుఖం యొక్క వారసత్వాన్ని మళ్ళీ తీసుకుంటున్నాము. తండ్రిని స్మృతి చేయడంతో సంతోషము కలుగుతుంది. వారు ఈ కళ్ళతో మహళ్ళు మొదలైనవి చూసినప్పుడు సంతోషము కలుగుతుంది. మీరు దివ్య దృష్టి ద్వారా లేక జ్ఞానమనే మూడవ నేత్రము ద్వారా మనం తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని తెలుసుకున్నారు. ఒకవేళ తండ్రి మతముపై నడిస్తేనే లభిస్తుంది. సావధానపరుస్తూ ఉంటారు – పిల్లలూ, శ్రీమతముపై చాలా మధురముగా అవ్వండి, మౌనముగా ఉండండి మరియు తండ్రిని స్మృతి చేయండి.

పిల్లలైన మీ వంటి సౌభాగ్యశాలులు ఈ సృష్టిలో ఎవరూ లేరు. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అక్కడ చాలా సుఖం ఉంటుంది. ఎవరైతే కల్ప క్రితము నేర్చుకొని ఉంటారో, వారే రాజయోగం నేర్చుకుంటారని కూడా మీకు తెలుసు. పండాలు సేవ చేసి పుష్పాలను లేక మొగ్గలను తోట యజమాని వద్దకు తీసుకురావడము మీరు చూస్తారు. అప్పుడు వారి సేవకు అభినందనలు కూడా లభిస్తాయి. జ్ఞానం చాలా సహజమైనది. ఈ జీవితాన్ని అతి అమూల్యమైనది అని అంటారు. రాళ్ళ నుండి వజ్ర తుల్యంగా, పేదవారి నుండి షావుకార్లుగా అవుతారు. అతీంద్రియ సుఖమయ జీవితము గురించి గోప గోపికలను అడగండి అని అంటూ ఉంటారు కూడా. ఏ గోప గోపికలు? బాబా ఎలాగైతే వినిపించారో ఇది పెద్ద లాటరీ. తండ్రి స్వర్గ రచయిత కావున తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయడము చాలా సహజము. విశ్వానికి యజమానులుగా అవ్వడము ఏమైనా తక్కువ విషయమా. అక్కడ ఇంకే ధర్మము ఉండదు. మనం అర్ధకల్పం అనేక రకాల దుఃఖాలను చూసామని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు చాలా మంచి పురుషార్థం చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరూ సుఖవంతులుగా ఉండరు. అక్కడైతే అంతా సుఖవంతులుగా ఉంటారు. ఇటువంటి సుఖమయ రాజ్యంలో ఉన్నత పదవిని పొందడంలో చాలా ఆనందం ఉంటుంది. బాక్సింగ్ లో ఘడియ-ఘడియ దెబ్బలు తింటూ పడిపోతూ ఉండకూడదు. వికారాలలో పడితే ఒక్కసారిగా తీవ్రంగా దెబ్బ తగులుతుంది. క్రోధం కూడా చాలా చెడ్డది. ఘడియ-ఘడియ దెబ్బలు తినకూడదు, లేదంటే పడిపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీపై కృపకు బదులుగా శాపం కలిగేటువంటి కర్మలేవీ చేయకూడదు. ఏ భూతానికైనా వశమై ద్రోహులుగా ఎప్పుడూ అవ్వకూడదు.

2. శ్రీమతముపై చాలా-చాలా మధురముగా అవ్వాలి, మౌనంగా ఉండాలి. చాలా మధుర స్వభావముతో మాట్లాడాలి. ఎప్పుడూ కామానికి లేక క్రోధానికి వశమవ్వకూడదు.

వరదానము:-

సరళ సంస్కారాల ద్వారా మంచి, చెడుల ఆకర్షణ నుండి అతీతంగా ఉండే సదా హర్షితమూర్త భవ

తమ సంస్కారాలను ఎంత ఈజీగా (సరళంగా) చేసుకోవాలి అంటే ప్రతి కార్యము చేస్తూ కూడా ఈజీగా ఉండాలి. ఒకవేళ సంస్కారాలు టైట్ గా ఉన్నట్లయితే పరిస్థితులు కూడా టైట్ అవుతాయి, సంబంధ సంపర్కములోకి వచ్చేవారు కూడా టైట్ గా వ్యవహరిస్తారు. టైట్ అనగా పెనుగులాటలో ఉండేవారు, అందుకే సరళ సంస్కారాల ద్వారా డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ మంచి మరియు చెడు యొక్క ఆకర్షణ నుండి అతీతంగా ఉండండి, మంచి ఆకర్షించకూడదు మరియు చెడు కూడా ఆకర్షించకూడదు – అప్పుడే హర్షితంగా ఉండగలరు.

స్లోగన్:-

ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో, వారే కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా ఉంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top