TELUGU MURLI 29-03-2023

29-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మీ స్మృతి అసాధారణమైనది, ఎవరినైతే మీరు ఈ కళ్ళ ద్వారా చూడరో, వారిని స్మృతి చేస్తారు మరియు వారి స్మృతితో మీ వికర్మలు వినాశనమైపోతాయి’’

ప్రశ్న:-

ఏ ఒక్క అలవాటును త్యాగం చేసినట్లయితే అన్ని గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి?

జవాబు:-

అర్ధకల్పం నుండి దేహాభిమానంలోకి వచ్చే అలవాటు ఏదైతే పక్కా అయ్యిందో, ఇప్పుడు ఈ అలవాటును త్యాగం చేయండి. అతి ప్రియమైన శివబాబాను స్మృతి చేయండి. ఏ దేహధారి స్మృతి లేనట్లయితే అన్ని యోగ్యతలు వచ్చేస్తాయి, లోపాలు తొలగిపోతాయి. ఆత్మ పవిత్రతా సాగరముగా అవుతుంది. సంతోషపు పాదరసము ఎక్కి ఉంటుంది. అన్ని గుణాలు స్వతహాగా వస్తూ ఉంటాయి.

పాట:-

ఓం నమః శివాయ…

ఓంశాంతి.

పిల్లలు తమ అనంతమైన తండ్రి మహిమను విన్నారు మరియు పిల్లల ఎదురుగా ఆ అనంతమైన తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి బుద్ధిలోకి ఇది తప్పకుండా రావాలి – ఎవరి మహిమ అయితే ఉందో మేము ఆ శివబాబా ముందు, వారి సమ్ముఖములో కూర్చున్నాము మరియు వారి ద్వారా మేము 21 జన్మల కోసం సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది గుర్తుకు రావడంతోనే సంతోషపు పాదరసం ఎక్కాలి. అంతేకానీ, ఏ సమయంలోనైతే ఎదురుగా వింటారో ఆ సమయంలోనే స్మృతి ఉంటూ ఆ తర్వాత మర్చిపోవడం కాదు. అలా కాదు, మర్చిపోకూడదు. మనం మళ్ళీ మన రాజ్య-భాగ్యము తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. కావున బుద్ధి ఆ నిరాకారుడైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. వారిని బుద్ధి ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. రాత్రింబవళ్ళు మేము అనంతమైన తండ్రి నుండి భవిష్య 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నామని బుద్ధిలో గుర్తుండాలి. నిశ్చయమైతే పక్కాగానే ఉంటుంది. లౌకిక తల్లిదండ్రుల పట్ల నిశ్చయం కూర్చున్నాక మళ్ళీ వారిపై సంశయం ఏమైనా ఏర్పడగలదా. కానీ ఇవి కొత్త విషయాలు. బుద్ధి ద్వారా తండ్రిని తెలుసుకోవాల్సి ఉంటుంది. మేము శివబాబాకు చెందినవారిగా అయ్యాము, వారి నుండే వారసత్వము లభించనున్నదని పిల్లలకు తెలుసు. మనం కల్పకల్పము ఆ తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాము. బాబా, మీ ద్వారా మాకు మళ్ళీ రాజ్యం లభిస్తుందని బుద్ధిలో గుర్తుకొస్తుంది. మనం హక్కుదారులము. హక్కుదారులైనప్పుడు తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. లౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. వారైతే చాలా గుర్తుంటారు. ఇందులో అసాధారణమైన విషయం ఏమిటంటే, ఈ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు భస్మమవుతాయి, అందుకే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. లౌకిక తండ్రి స్మృతి అయితే దానంతట అదే కలుగుతుంది. ఈ కళ్ళ ద్వారా చూస్తారు. కొడుకు జన్మించడం జరుగుతుంది మరియు అమ్మా, నాన్న అని అంటూ ఉంటాడు. ఈ తండ్రి కళ్ళకు కనిపించరు. బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. మనం శివబాబాకు బ్రహ్మా ద్వారా సంతానముగా అయ్యాము మరియు 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు శ్రీమతముపై పురుషార్థము చేస్తూ ఉంటాము. ఇందులో మొట్టమొదటి ముఖ్యమైనది పవిత్రత. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా బుద్ధి పవిత్రముగా అవుతూ ఉంటుంది. మేమైతే పిల్లలమే అని భావించకండి. తండ్రిని స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు. మేము పిల్లలమేనని చాలామంది పిల్లలు భావిస్తారు మరియు తండ్రిని స్మృతి చేయరు. నోటితో రామ-రామ అనండి అని అంటారు కదా. కానీ ఈ రామునికి (శివబాబాకు) చిత్రమైతే లేదు, అందుకే మనుష్యుల బుద్ధియోగం ఆ రాముని వైపుకు వెళ్ళిపోతుంది. సద్గతిదాత అయిన శివుడినైతే అందరూ మర్చిపోయారు.

శివబాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. మొదట తప్పకుండా రచయిత అయిన శివబాబా వచ్చి ఉంటారు, అప్పుడే స్వర్గం యొక్క రచనను రచించి ఉంటారు. వారి తర్వాత మళ్ళీ రాముని రాజ్యం కొనసాగింది. ఇప్పుడు మీరు సత్య, త్రేతాయుగాలలో రాజ్యం చేయడం కోసం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. పరమపిత పరమాత్మ శివ ఒక్కసారే వస్తారు. రామ-సీత, లక్ష్మీ-నారాయణులు మొదలైనవారు కూడా ఒక్కసారే వస్తారు. పునర్జన్మలు తీసుకోవచ్చు కానీ నామ, రూప, దేశ, కాలాలు అన్నీ మారిపోతాయి. రామ-సీతాలు కూడా ప్రారబ్ధాన్ని అనుభవించడం కోసం పునర్జన్మలు తీసుకుంటారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి, అప్పుడే సంతోషము ఉంటుంది. ఎవరికైనా అర్థం చేయించడము కూడా చాలా సహజము. స్వర్గ రచయిత అయిన తండ్రి నుండి మీకు ఈ సమయంలో వారసత్వం లభించగలదు. అనంతమైన తండ్రి స్మృతి అయితే అందరూ చేస్తారు. తండ్రి కొత్త సృష్టి రచయిత కావున అందరూ సుఖవంతులుగా అయిపోతారు. ఈ సమయంలోనైతే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఈ డ్రామాయే సుఖ, దుఃఖాలతో రచింపబడి ఉంది. సుఖములో ఎవరు రాజ్యం చేస్తారు? లక్ష్మీ-నారాయణులు, మళ్ళీ త్రేతాలో రామ-సీత… ఇన్ని సంవత్సరాలు ఈ వంశము యొక్క రాజ్యం నడుస్తుందని మీకు తెలుసు. మా క్రైస్టు రాజ్యము రచించారని క్రిస్టియన్లు భావిస్తారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్ రాజ్యం చేస్తూ వచ్చారు. గతించిపోతూ ఉంటుంది కదా. భారతవాసులకైతే ఏమీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, దానినే హెవెన్, స్వర్గము అని అంటారు, దానిని తండ్రే స్థాపన చేస్తారు. పతిత ప్రపంచములో వచ్చినప్పుడే పావనంగా తయారుచేస్తారు. ఇది గుర్తుండాలి. మనం ఆ తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని శ్రీమతము అనుసారంగా తీసుకుంటున్నాము మరియు ధారణ చేస్తున్నాము. దీనిని మర్చిపోకూడదు. తప్పకుండా శివబాబా కల్పక్రితము కూడా వచ్చారు, వారి స్మృతి చిహ్నము కూడా ఉంది. ఇప్పుడు వారు మళ్ళీ వచ్చి ఉన్నారు. మొదట నిరాకారుడైన శివబాబా వస్తారు, వారు వచ్చి మిమ్మల్ని దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణులు ప్రాక్టికల్ గా రాజ్యం చేస్తారు. మళ్ళీ భక్తి మార్గంలో పూజారులుగా అయి చిత్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఈ సమయంలో లక్ష్మి-నారాయణుల ఖచ్చితమైన చిత్రాలేవీ లేవు, తర్వాత ప్రాక్టికల్ గా వస్తారు. ఇప్పుడు శివబాబా మిమ్మల్ని ప్రాక్టికల్ గా బ్రహ్మా ద్వారా చదివిస్తున్నారు. ఇది ఎంత డైరెక్టు విషయము. ఇంకే స్కూలులోనూ మీ ఆత్మ చదువుతుంది, టీచర్ ఆత్మ మనల్ని చదివిస్తుంది అని అనరు. అక్కడ అంతా మనుష్యులు, మనుష్యులను చదివిస్తారు. వాస్తవానికి చదివించేది ఆత్మ. ఆత్మయే ఇంద్రియాల ద్వారా చదువుతుంది. నేను ఇప్పుడు బారిస్టరుగా అయ్యాను అని ఆత్మ అంటుంది. నాలెడ్జ్ తో బ్యారిస్టరుగా అవుతారు. ఇక్కడైతే ఇది అద్భుతమైన విషయము. నిరాకార శివబాబా నిరాకార ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఆత్మలో సంస్కారాలు ఉంటాయి. మనుష్యులు దీనిని మర్చిపోతారు. నిరాకార తండ్రి వీరి ద్వారా అర్థం చేయిస్తారు. వారికున్న ఒక్క పేరు శివ. మీరు కూడా శివబాబా అని అంటారు, బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. లౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారా శరీరము గుర్తుకు వస్తుంది. శివబాబాకు శరీరమైతే లేదు. పరమాత్ముని మందిరమే నిరాకారీ రూపానికి చెందినది. దేవతలు ఆకారులు, మనుష్యులు సాకారులు. వారు నిరాకార శివ, మీ ఆత్మ ఇప్పుడు జ్ఞాన సంపన్నముగా అవుతుంది. తండ్రి అంటారు, నేను నిరాకారుడిని. నాలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. నేను మిమ్మల్ని ఈ ముఖము ద్వారా చదివిస్తున్నాను. మీరు కూడా నా సమానంగా జ్ఞాన సంపన్నముగా అవ్వండి. ఈ జ్ఞానాన్ని నిరాకార తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. నిరాకార పరమాత్మనే జ్ఞానసంపన్నులు, ఆనందస్వరూపులు, పతితపావనుడు అని అంటారు. బాబా అంటారు, పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచముగా నేనే తయారుచేస్తాను. ఏ విధముగా నిరాకారుడినైన నాలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉందో, అలాగే ఆత్మలైన మిమ్మల్ని కూడా తయారుచేస్తాను. మీ ఆత్మ కూడా ఈ విధంగా జ్ఞాన సంపన్నముగా అవుతుంది, మిమ్మల్ని తమ సమానంగా తయారుచేస్తాను. ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము వినడము ద్వారా మీరు చక్రవర్తీ రాజా, రాణిగా అవుతారు. మనుష్యులు, మనుష్యులను దేవతలుగా తయారుచేయలేరు.

తండ్రి జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు. పిల్లలను తమ సమానముగా తయారుచేస్తారు, కావున అన్ని గుణాలు ఉండాలి. మీరు దేవతలుగా అయితే యోగ్యతలు మారిపోతాయి. తండ్రి యోగ్యతలు వేరు, తండ్రి జ్ఞాన సాగరుడు, మీరు కూడా తయారవ్వాలి. తండ్రి పవిత్రతా సాగరుడు. మనం అర్ధకల్పం పవిత్రముగా ఉంటాము. తండ్రి అంటారు, డ్రామానుసారంగా మీరు పతితంగా అవుతారు, మళ్ళీ నేను వచ్చి 21 జన్మల కోసం పావనంగా తయారుచేస్తాను. కేవలం మీరు శ్రీమతముపై నడవండి, నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇంకెవరినీ కాదు. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. తండ్రిని మరిచి ఇంకెవరి స్మృతిలోనైనా ఉంటే లోపాలు కలవారిగా అవుతారు. శివబాబా అతి ప్రియమైనవారు, అందరికన్నా ప్రియమైన తండ్రి. వందేమాతరం అని మీ పేరు కూడా గాయనం చేయబడింది. మీ ఆత్మ పవిత్రముగా అవుతుంది. మీరు పవిత్రముగా అయి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు, అందుకే మీకు శివ శక్తి పాండవ సైన్యము అన్న పేరు ప్రసిద్ధి చెందింది. మీరు పాండవులు కూడా ఎందుకంటే పరంధామం యొక్క యాత్రలో మాయపై విజయం పొందేందుకు యుద్ధ మైదానములో నిలబడి ఉన్నారు. మనం తండ్రి వలె మాస్టర్ జ్ఞానసాగరులుగా, పవిత్రతా సాగరులుగా అవ్వాలని పిల్లలకు తెలుసు. దేహ అహంకారం తెగిపోవాలి. జన్మ-జన్మాంతరాలు దేహాన్ని ధారణ చేసారు, కావున ఆ అలవాటు పక్కా అయిపోయింది. ఇప్పుడు ఈ అలవాటును త్యాగం చేయాలి. ఏ విధంగా తండ్రి నిరాకారుడు, మరి దేహాభిమానం ఎక్కడి నుండి వచ్చింది? మీరు కూడా ఈ పాత దేహాన్ని వదిలి నా వద్దకు రావాలి. వినాశనం జరుగుతుందంటే ఏదో కారణము ఉంటుంది కదా. పైసాకు కూడా విలువ చేయనిదే వినాశనమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు. అక్కడ సదా సుఖమే సుఖము ఉంటుంది. అది సుఖధామము మరియు శాంతిధామము, ఇది దుఃఖధామము. రావణుడే అశాంతపరిచాడు, మళ్ళీ శాంతిని ఇచ్చేవారు పరమపిత పరమాత్మ. మనసుకు శాంతి కావాలి అని కొందరంటారు. చెప్పండి, ఎటువంటి శాంతి కావాలి? ఇదైతే దుఃఖధామము, మీరు సుఖధామం వెళ్ళనున్నారా? తండ్రిని స్మృతి చేస్తే సుఖధామానికి వెళ్తారు. అశాంతపరిచేది రావణుడి-మాయ, అది ఇక్కడ హాజరై ఉంది. ముక్తి, జీవన్ముక్తులలో అశాంతపరిచే రావణుడు ఉండడు, అందుకే ఇప్పుడు మన ఇంటికి తిరిగి పదండి. ఒకవేళ సత్యయుగములోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ప్రతి ఆత్మ జీవన్ముక్తిని తప్పకుండా కోరుకుంటుంది. అందరూ సత్యయుగములోకి, జీవన్ముక్తిలోకి వెళ్తారని కాదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే వెళ్తారు. మిగిలిన ఆత్మలు ఎవరైతే పై నుండి వస్తారో, వారు మొదట జీవన్ముక్తిలో ఉంటారు. మాయ నీడ పడదు. సతోప్రధానంగా అయి మళ్ళీ సతో, రజో, తమోలలోకి వస్తారు. మాయ ఉన్నా కూడా ఆత్మ సుఖాన్ని తప్పకుండా అనుభవించనున్నది. దుఃఖము ఉండజాలదు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు కదా. మళ్ళీ అపవిత్రముగా అవ్వడంతో దుఃఖాన్ని పొందుతారు, అంతేకానీ, రావడంతోనే దుఃఖాన్ని పొందుతారని కాదు. ఈ సుఖ, దుఃఖాల ఆట రచింపబడి ఉంది.

మనుష్యులకు ఆకర్షించేందుకు బోర్డు పెట్టాలి బాబాకు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కేవలం చిత్రాలను చూసి మనుష్యులు తికమకపడతారు. శివబాబా చిత్రాన్ని పెట్టారనుకోండి మరియు కింద దైవీ విశ్వ రాజ్యాధికారము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము అని రాస్తారు. మనుష్యులు చిత్రాన్ని చూసి భగవంతుడు ఇలా ఏమైనా ఉంటారా అని అంటారు. భగవంతుని రూపము ఏమిటి? అయినా రాయబడి ఉంటుంది – సోదరీలు మరియు సోదరులారా, వచ్చి అనంతమైన తండ్రి నుండి 21 జన్మలు సదా సుఖాన్ని పొందే పురుషార్థము చేయండి. అది ఎవరైనా సమ్ముఖముగా వచ్చినప్పుడే అర్థం చేయించబడుతుంది. ఆహ్వానం ఇస్తారు. రోజు రోజుకు చాలా క్లుప్తముగా తయారుచేయవలసి ఉంటుంది. చివర్లో తగ్గిపోతూ ఉంటుంది. మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయండి మరియు వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి. కావున సోదరీ-సోదరులారా, తండ్రి నుండి 21 జన్మల కోసం సత్యయుగపు రాజ్యాన్ని, రానున్న ఈ యుద్ధానికి ముందే వచ్చి ప్రాప్తించుకోండి అని వ్రాయాలి. ఈ యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇది ప్రపంచానికి ఏమీ తెలియదు. ఈ యుద్ధము ద్వారానే భారత్ సుఖధామముగా అవుతుందని మీకు తెలుసు. యుద్ధము జరగకూడదని వారు ప్రయత్నిస్తారు. మహాభారీ, మహా భారత యుద్ధం ద్వారానే మహా వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. ఆత్మలందరూ తిరిగి తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే ఆట పూర్తయ్యింది, మళ్ళీ పాత్రను అభినయించేందుకు వస్తారు. కావున యుక్తిగా వ్రాయాలి.

మీరు ఆత్మిక పండాలు, వారు దైహిక దేహధారి పండాలు. మీరు స్వయాన్ని విదేహీ ఆత్మగా, దేహము నుండి వేరుగా భావిస్తారు, తండ్రి ఆత్మలైన మనల్ని తీసుకువెళ్తారని మీకు తెలుసు. కావున అనంతమైన తండ్రి నుండి మీరు వచ్చి వారసత్వాన్ని తీసుకోండి అని మీరు వ్రాయవలసి ఉంటుంది. నిరాకారుడు అన్న పదాన్ని తప్పకుండా వ్రాయాలి. బాబా ఈ కర్మక్షేత్రము పైకి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మనం కూడా అక్కడి నుండే వస్తాము. పాత్రధారులుగా ఉన్న ఆత్మలందరూ, అవినాశీ, అమరమైన ఆత్మలు, ఎప్పుడూ మరణించవు. దీనిపై మంచి రీతిలో నిశ్చయం ఏర్పడాలి. మనం శివబాబా నుండి అనేకసార్లు వారసత్వం తీసుకున్నాము, మళ్ళీ తీసుకుంటాము. శివబాబా మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని పురుషార్థము ద్వారా మీరు తెలుసుకున్నారు, మరి వారి నుండి వారసత్వం ఎందుకు తీసుకోవడం లేదు? తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. అంతేకానీ, కేవలం రామ-రామ అని అనడముతో ముక్తి ఏమైనా జరుగుతుందా. ఫలానావారు స్వర్గస్థులయ్యారని వార్తాపత్రికల్లో వేస్తారు. వారిని అడగాలి, స్వర్గము అని దేనిని అంటారు? ఇదైతే నరకము, మరి పునర్జన్మ కూడా నరకములోనే తీసుకుంటారు. స్వర్గము ఉన్నట్లయితే పునర్జన్మలు కూడా స్వర్గములోనే తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా శరీరాన్ని వదిలి నరకము నుండి స్వర్గములోకి వెళ్ళారు అంటే, అక్కడ వారికి చాలా వైభవాలు లభిస్తాయి. మరి నరకం యొక్క వైభవాలను తినిపించడానికి వారిని స్వర్గము నుండి నరకములోకి ఎందుకు పిలుస్తారు? వారికి నరకం యొక్క భోజనం తినిపించినట్లయితే బుద్ధి అలాగే అయిపోతుంది. ఎలాంటి అన్నమో అలాంటి మనసు ఏర్పడుతుంది. స్వర్గములోనైతే పాలు-నెయ్యి యొక్క నదులు ప్రవహిస్తాయి. మీకైతే కిరోసిన్ యొక్క భోజనం తినిపిస్తారు. శ్రీనాథ ద్వారములో మంచి నేతి యొక్క భోగ్ పెడతారు ఎందుకంటే అక్కడ రాధే, కృష్ణుల చిత్రము ఉంది. కావున వారి స్మృతిలో భోగ్ కూడా మంచి-మంచి వైభవాలతో తయారుచేసి పెడతారు. ఇటువంటి భోగ్ ఇంకెక్కడా పెట్టరు. జగన్నాథ మందిరం కూడా ఉంది, అక్కడ అన్నం యొక్క భోగ్ పెడతారు, అక్కడ వైభవాలను నివేదించరు. ఇప్పుడిది నరకము కావున దుఃఖము ఉంది. స్వర్గములోనైతే సుఖము ఉండేది. తండ్రి చాలా మంచిగా అర్థం చేయిస్తారు, కానీ ధారణ నంబరువారుగా జరుగుతుంది, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. డ్రామా అనుసారంగా నౌకర్లుగా కూడా అవ్వనున్నారు. థర్డ్ క్లాస్ టికెట్ కూడా ఎవరో అయితే తప్పకుండా తీసుకుంటారు కదా. సూర్యవంశీ రాజధాని ఫస్ట్ క్లాస్, చంద్రవంశీ రాజధాని సెకండ్ క్లాస్, ప్రజలు థర్డ్ క్లాస్. వారిలో కూడా నంబరువారుగా ఉంటారు. ఇప్పుడు ఎవరికి ఏ టికెట్ కావాలనుకుంటే అది తీసుకోండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానముగా, జ్ఞాన సాగరులుగా, పవిత్రతా సాగరులుగా అవ్వాలి. విదేహిగా అయ్యే అభ్యాసము చేయాలి.

2. తండ్రి స్మృతితో బుద్ధిని పవిత్రముగా తయారుచేసుకోవాలి. అనంతమైన తండ్రి నుండి మనం 21 జన్మల వారసత్వం తీసుకుంటున్నామని సదా ఇదే నషాలో ఉండాలి.

వరదానము:-

అతీతతనము యొక్క అభ్యాసము ద్వారా పాస్ విత్ ఆనర్ గా అయ్యే బ్రహ్మా తండ్రి సమాన భవ

ఎలాగైతే బ్రహ్మా తండ్రి సాకార జీవితములో కర్మాతీతముగా అయ్యే ముందు అతీతముగా మరియు ప్రియముగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షముగా అనుభవము చేయించారు. సేవను లేక ఏ కర్మను విడిచిపెట్టలేదు కానీ అతీతముగా అయ్యి సేవ చేసారు. ఈ అతీతతనము ప్రతి కర్మలో సఫలతను సహజముగా అనుభవము చేయిస్తుంది. కావున సేవా విస్తారాన్ని ఎంతగానైనా పెంచండి కానీ విస్తారములోకి వెళ్తూ సార స్థితి యొక్క అభ్యాసము తక్కువగా ఉండకూడదు, అప్పుడే డబుల్ లైట్ గా అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని ద్వికిరీటధారులుగా, బ్రహ్మా తండ్రి సమానంగా పాస్ విత్ ఆనర్లుగా అవుతారు.

స్లోగన్:-

స్వయాన్ని ఎటువంటి శక్తి స్తంభముగా చేసుకోవాలంటే, దాని ద్వారా అనేకులకు కొత్త జీవితాన్ని తయారుచేసుకొనే శక్తి ప్రాప్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top