TELUGU MURLI 27-03-2023

27-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి సమానముగా నిర్భయులుగా అవ్వండి, మీ అవస్థను సాక్షిగా ఉంచుకుంటూ సదా హర్షితముగా ఉండండి, స్మృతిలో ఉండడం ద్వారానే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది’’

ప్రశ్న:-

అదృష్టవంతులైన పిల్లలు సదా ఫ్రెష్ గా మరియు హర్షితముగా ఉండేందుకు ఏ విధిని ఉపయోగిస్తారు?

జవాబు:-

రోజుకు రెండు సార్లు జ్ఞాన స్నానం చేస్తారు. గొప్ప వ్యక్తులు ఫ్రెష్ గా ఉండేందుకు రెండు సార్లు స్నానం చేస్తారు. పిల్లలైన మీరు కూడా జ్ఞాన స్నానం రెండు సార్లు చేయాలి. దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి 1. సదా హర్షితముగా ఉంటారు,
2. అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా అవుతారు,
3. ఎటువంటి సంశయమైనా తొలగిపోతుంది,
4. మాయావీ వ్యక్తుల సాంగత్యము నుండి సురక్షితముగా ఉంటారు,
5. తండ్రి మరియు టీచర్ సంతోషిస్తారు, 6. పుష్పాలుగా అవుతారు, అపారమైన సంతోషములో ఉంటారు.

పాట:-

మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి… (జాగ్ సజనియా జాగ్…)

ఓం శాంతి.

శివబాబా బ్రహ్మా ముఖము ద్వారా పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు. వీరు గౌముఖము. గౌముఖము నంది గణము కదా. పాట కూడా విన్నారు. ప్రియుడు ప్రేయసులతో మాట్లాడుతారు, నిజానికి ప్రేయసులు అంటే కేవలం స్త్రీలనే కాదు, ఈ పురుషులు కూడా ప్రేయసులే. ఎవరైతే భక్తి చేస్తారో, భగవంతుడిని తలచుకుంటారో వారంతా ప్రేయసులే అవుతారు. ప్రియుడైతే ఒక్కరే. సాధువులు కూడా భగవంతుడిని కలుసుకునేందుకు సాధన చేస్తారు. కావున వారు కూడా ప్రేయసులే అవుతారు. ఆ ఒక్క భగవంతుడు ఎవరు? ఆ ఒక్కరు అని గాడ్ ఫాదర్ నే అంటారు. ఏ విధంగా వరుడు, తన వధువును (పత్నిని) తీసుకువెళ్ళేందుకు రావలసి ఉంటుంది. అలా ఇక్కడ అందరూ వధువులే. అందరూ ప్రియుడిని స్మృతి చేస్తారు, కావున వారు తప్పకుండా రావలసి ఉంటుంది. ఒక్కరి కోసమే కాదు, అందరి కోసము రావలసి ఉంటుంది మరియు ప్రేయసులందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఏదో ఒక రోగము, వ్యాధి తప్పకుండా ఉంటాయి. కావున ఇది నరకము. స్వర్గములో సుఖము ఉంటుంది, నరకములో దుఃఖము ఉంటుంది. ఈ సమయంలో మనమందరమూ నరకవాసీ ప్రేయసులము, అనగా అందరమూ మాయా రావణుని ఖైదులో ఉన్నాము. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలనే అర్థం చేయిస్తారు. మొత్తం ప్రపంచమంతా ఖైదులో ఉంది, దీనిని దుఃఖధామము అని అంటారు. ధామము అనగా నివసించే స్థానము. కలియుగములో దుఃఖము ఉంది, సత్యయుగములో సుఖము ఉంది. దైవీ సాంప్రదాయము, ఆసురీ సాంప్రదాయము – ఇవి గీతా భగవానుడైన శివుని మహావాక్యాలు. వారు స్వయం అంటున్నారు – ప్రేయసులారా, ఇప్పుడు నవ యుగము వచ్చింది. ఇది పాత ప్రపంచము. ఇప్పుడు మేల్కోండి అని ప్రియుడు చెప్తున్నారు. ఇప్పుడు ఇక కొత్త యుగమైన సత్యయుగము వస్తుంది. గీత ద్వారా స్వర్గ స్థాపన చేసారు. గీత భారత్ యొక్క దేవీ-దేవతా ధర్మ శాస్త్రము. ఆ దేవతా ధర్మం ఇప్పుడు కనుమరుగైపోయింది. అనగా పిండిలో ఉప్పు అంత మాత్రమే మిగిలి ఉంది. చిత్రాలు ఉన్నాయి కానీ ఎవరూ స్వయాన్ని దేవతలుగా అంగీకరించరు. సత్యయుగములో దేవీ-దేవతా ధర్మం ఉండేదని, దానినే స్వర్గమని అనేవారని మర్చిపోయారు. ఎప్పుడైతే లక్ష్మీ-నారాయణుల రాజ్యముంటుందో, అప్పుడు – ‘ఇది స్వర్గము’ అని అక్కడివారు అనరు. అలా అనుకున్నట్లయితే ఇక్కడ నరకము రానున్నది అన్నది కూడా వారికి అర్థమవ్వాలి. ఈ రహస్యాలన్నీ మనకు ఇప్పుడే తెలుసు. 5,000 సంవత్సరాల క్రితం స్వర్గము ఉండేది, ఇప్పుడు నరకము ఉంది. దేవీ-దేవతా ధర్మం యొక్క కాలు విరిగిపోయి ఉంది. ఈ విషయాలను గీత వినిపించే ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. సర్వ శాస్త్రమయి శిరోమణి గీతయే. గీతా భగవానుడే గీత ద్వారా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. ఇక తర్వాత అర్ధకల్పం అక్కడ గీత యొక్క అవసరమే ఉండదు. అక్కడ ప్రారబ్ధము ఉంటుంది. బాబా స్వయం చెప్తున్నారు – ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఇది కనుమరుగయ్యే ఉంది కదా. మనం రోజూ కొత్త-కొత్త విషయాలను వింటాము. వారు 18 అధ్యాయాలు వినిపిస్తూ వచ్చారు. దానిని కొత్తది అని ఎవరు అంటారు? పూర్తిగా 18 అధ్యాయాలు వ్రాసేసారు. ఇక్కడైతే మనం చదువుకుంటూ ఉంటాము. యోగం జోడిస్తూ ఉంటాము. ఇందులో కూడా సమయం పడుతుంది.

జ్ఞానం మరియు యోగం రెండూ సోదరీ, సోదరుల వంటివి. బాబా అంటారు, ధ్యానము కన్నా జ్ఞానం శ్రేష్ఠమైనది. ఎందుకంటే దీని ద్వారానే మీరు జీవన్ముక్తిని పొందగలుగుతారు. మాకు సాక్షాత్కారం కలిగితే పురుషార్థం చేస్తాము అని ఇలా ఎవ్వరూ అనలేరు. మీ ఎదురుగా శ్రీకృష్ణుని చిత్రాన్ని చూస్తున్నారు కదా, అలా యువరాజు, యువరాణులుగా అవుతారు, ఇక ఆపై మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి. యువరాజులుగా, యువరాణులుగా అవుతారు అని చెప్పినప్పుడు ఆ మాట నమ్మాలి కదా. ఇప్పుడు నవయుగము వస్తోంది. ఎక్కడైతే విజయము పొందుతారో అక్కడకు వెళ్ళి యువరాజులుగా జన్మిస్తారు. రత్న-ఝడితమైన మురళి కూడా ఉంటుంది. ఇది ఒక గుర్తు. శ్రీకృష్ణునికి కూడా మురళిని చూపిస్తారు ఎందుకంటే వారు యువరాజు కదా. అంతేకానీ అక్కడ జ్ఞానం యొక్క విషయమేమీ లేదు. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాయే. ఆ బాబా చెప్తున్నారు, పిల్లలూ – వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. చివరిలో మంత్రాన్ని ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు. అంతమతిని బట్టి గతి లభిస్తుంది అని అంటూ ఉంటారు కదా. అంతిమములో నా స్మృతిని గుర్తుంచుకున్నట్లయితే గతి లభిస్తుంది. మీరు ఈ రోజు, రేపు అంటూ వచ్చారు. మనుష్యులు ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఎలా మరణిస్తారు అన్నదానికి రెండు, మూడు సందర్భాలు చూపిస్తాను. ఆ సమయంలో మంత్రమునైతే గుర్తు చేసుకోలేకపోతారు. ఉన్నట్లుండి ఇంటి కప్పు కూలిపోయిందనుకోండి, ఆ సమయంలో స్మృతి చేయగలరా? భూమి కంపిస్తుంది, ఇక ఆ సమయంలో ఆర్తనాదాలు చేయడంలో నిమగ్నమైపోతారు. ఎంతో సమయం బట్టి అభ్యాసం ఉంటేనే ఆ సమయంలో అవస్థ చలించకుండా ఉంటుంది. సాక్షీగా ఉంటూ హర్షితముఖులుగా కూర్చొని ఉంటారు. మనుష్యులైతే కొద్దిగా శబ్దం వస్తే భయంతో పారిపోతారు. మీరు ఎప్పుడూ ఎక్కడికి పారిపోరు. భయపడే విషయమేమీ లేదు. ఏ విధముగా బాబా నిర్భయులో, అలాగే పిల్లలు కూడా నిర్భయులుగా అవ్వాలి.

బాబా అంటారు – పిల్లలూ, ఇప్పుడు నవయుగము వస్తోంది. ఇప్పుడు ఇక స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకోండి. మొత్తం భారత్ అంతటినీ మీరు ఇన్ష్యూర్ చేస్తారు. బాబా నుండి శక్తి తీసుకొని భారత్ ను మీరు ఇన్ష్యూర్ చేస్తున్నారు. భారత్ వజ్రతుల్యముగా అవుతుంది. మళ్ళీ అందులోనూ ఎవరు ఎంతగా జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారో అంతగా పొందుతారు. తనువు, మనస్సు, ధనము అన్నీ ఇన్ష్యూర్ అవుతాయి. బాబా అంటారు, ఈ జ్ఞానం ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేటువంటిది. ఏ విధంగా సుదాముని ఉదాహరణ ఉంది కదా, క్షణములో మహలును చూసారు. మరి అది ప్రత్యక్ష ఫలమే కదా. యువరాజు, యువరాణుల సాక్షాత్కారాన్ని కూడా చూస్తారు. కానీ యువరాజు, యువరాణులైతే సత్యయుగములోనూ ఉన్నారు, త్రేతాలోనూ ఉన్నారు. తాము ఎక్కడ యువరాజులుగా అవుతారు అనేది అర్థం చేసుకోగలరా. అందరూ సూర్యవంశీయులుగా అయితే అవ్వలేరు. ఇవన్నీ సాక్షాత్కారాలు. అంతేకానీ ఆత్మ ఏమీ బయటకు వచ్చి అక్కడికి వెళ్ళదు. ఈ సాక్షాత్కారాలు కూడా డ్రామాలో రచింపబడియున్నాయి. ఆత్మను పిలిచినప్పుడు అక్కడ ఆత్మ ఏమైనా శరీరాన్ని వదిలి వస్తుందా. అలా వచ్చినట్లయితే ఇక ఆ శరీరము ఉండదు. ఇవన్నీ సాక్షాత్కారాలే. బాబా భిన్న-భిన్న రూపాలతో సాక్షాత్కారాలు చేయిస్తారు. ఇది నిశ్చితమై ఉంది, అప్పుడే ఆత్మ వస్తుంది, ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి కొత్త విషయాలు కదా. కావున క్లాస్ కు కూడా రెగ్యులర్ గా రావలసి ఉంటుంది. మీకు తెలుసు – చాలా మంచి-మంచి వ్యక్తులు ఫ్రెష్ గా ఉండేందుకు రెండు సార్లు స్నానం చేస్తారు. ఈ జ్ఞాన స్నానాన్ని కూడా రెండు సార్లు చేసినట్లయితే ఫ్రెష్ గా ఉంటారు. రెండు సార్లు జ్ఞాన స్నానం చేయడం ద్వారా చాలా-చాలా లాభాలు ఉంటాయి. లేకపోతే అనవసరంగా మీ రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు. తండ్రి రిజిస్టర్ ద్వారా కూడా తెలుసుకుంటారు. పూర్తి అదృష్టవంతులు, భాగ్యవంతులు ఎవరు? అని. అరే, అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనం తీసుకునేందుకు వస్తారు, స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఒకవేళ ఇంతటి నిశ్చయము లేకపోతే ఉన్నత పదవిని కూడా పొందలేరు. రెండు సార్లు స్నానం చేయడం ద్వారా మీరు చాలా-చాలా హర్షితముగా ఉంటారు. బాబా అంటారు, నేను గైడ్ గా అయి పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. నేను మిమ్మల్ని ఎంతగా తిరగడానికి తీసుకువెళ్తూ ఉంటాను! వారు ఏరోప్లేన్ ద్వారా పైకి వెళ్తారు, వారికి ఎంతగా మహిమ జరుగుతుంది. వాస్తవానికి మీ మహిమయే జరగాలి. మీరు వైకుంఠానికి వెళ్ళి అంతా తిరిగి వస్తారు. ఇది చాలా అద్భుతమైన విషయము! బాబా అంటారు, అందరికన్నా దూరంగా ఉండే నేను పరాయి దేశంలోకి వచ్చాను. ఇందులో సర్వవ్యాపి విషయమే లేదు. మీరు సందేశకులు, సందేశం ఇచ్చేవారు కదా. నేను మిమ్మల్ని పంపిస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామానుసారంగా ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించేందుకు రావలసి ఉంటుంది. అలాగే నేనూ వచ్చాను, వచ్చి చదివిస్తాను. ఇది గీతా పాఠశాల. ఆ సత్సంగాలకు మీరు జన్మ-జన్మాంతరాలు వెళ్తూ ఉంటారు. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవి నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్యము ఏమీ ఉండదు. ఇప్పుడైతే లోలోపల సంతోషపు చప్పట్లు మ్రోగుతూ ఉంటాయి. విద్యార్థి జీవితములో ఎవరైతే బాగా చదువుకుంటారో వారికి ఎంతో సంతోషము ఉంటుంది కదా. పిల్లల సంబంధములో కూడా సంతోషము ఉంటుంది. టీచర్ కు కూడా సంతోషము ఉంటుంది. వీరు మాత, పిత మరియు టీచరు కూడా, కావున సంతోషము ఉంటుంది. పిల్లల కర్తవ్యము చదువుకోడము. ఇప్పుడు తండ్రి సమ్ముఖముగా వచ్చారు, కావున ఒక్క తండ్రి నుండే వినండి. మీరు అర్ధకల్పం ఎంతగానో భ్రమించారు. ఇప్పుడు ఇక భ్రమించడం ఆపు చేయండి. కానీ ఎప్పుడైతే పూర్తి నిశ్చయం ఉంటుందో అప్పుడే అది సాధ్యమవుతుంది.

కలియుగంలో ఇంకా ఎన్నో సంవత్సరాలు మిగిలి ఉన్నాయని మనుష్యులు అంటారు. మీరు వారికి తెలియజేసినప్పుడు, వారు – ఇదంతా కల్పన, ఇంద్రజాలము, అబలలు ఇక అక్కడే కూర్చుండిపోతారు అని అంటారు. బాబా తమ వైపుకు లాగుతారు, మళ్ళీ మాయావీ పురుషులు తమ వైపుకు లాగుతారు. వారు మధ్యలో వ్రేలాడుతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఎప్పటివరకైతే రెండు సార్లు జ్ఞాన స్నానం చేయరో అప్పటివరకూ ఏ లాభము ఉండదు. అరే, కొన్ని సార్లు మురళిలో ఎలాంటి పాయింట్ల వెలువడుతాయంటే, వాటి ద్వారా ఎటువంటి బాణం తగులుతుందంటే, దానితో మీ సంశయమే తొలగిపోతుంది. వేరే సత్సంగాలకు వెళ్ళేందుకు ఎప్పుడూ వద్దు అనరు. కానీ ఇక్కడకు వచ్చేందుకు వద్దు అంటారు ఎందుకంటే ఇక్కడ పవిత్రముగా తయారయ్యే ముఖ్యమైన విషయం ఉంది. పతి, పత్ని ఇరువురూ పవిత్రముగా అవ్వాలి. ఇక్కడైతే పత్ని, తన పతి మరణించినప్పుడు అతని చితిలోకి వెళ్ళి కాలిపోతుంది, అలా చేస్తే పతి లోకములోకి వెళ్తారని భావిస్తుంది. మరి పతి నరకములో ఉంటే పత్ని కూడా నరకములోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇరువురూ స్వర్గములోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయండి. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి! కుమార్తెలు – మేము వివాహం చేసుకోము అని అంటారు, వారేమో – తప్పకుండా వివాహం చేసుకోవాలి అని అంటారు. బాబా అంటారు – కుమార్తెలూ, ఈ అంతిమ జన్మలో వివాహం చేసుకున్నట్లయితే మోహ జాలము పెరిగిపోతూ ఉంటుంది. పతి పట్ల మోహము, ఆ తర్వాత పిల్లల పట్ల మోహము, పుట్టింటి పట్ల, అత్తవారింటి పట్ల మోహము కలుగుతుంది… ఈ రోజు బిడ్డ పుడితే పార్టీలు ఇస్తారు, రేపు బిడ్డ చనిపోతే ఆర్తనాదాలు చేస్తారు. సత్యయుగములో మీరు చాలా సంతోషముగా ఉంటారు.

బాబా అర్థం చేయిస్తున్నారు – పిల్లలూ, ఇంటి-ఇంటినీ స్వర్గముగా తయారుచేయండి. చిత్రాలు పెట్టండి. ఎవరు వచ్చినా ఇలా చెప్పండి – మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారా? రండి, మేము మీకు అర్థం చేయిస్తాము. బాబా చాలా మంచి, మంచి స్లోగన్లు చెప్తారు. రెండు సార్లు స్నానం చేయడం ద్వారా మీరు చాలా మంచి పుష్పాలుగా అవుతారు. అపారమైన సంతోషము ఉంటుంది. ఈశ్వరుని మహిమ అపారమైనది అని అంటారు. అలాగే మీ సంతోషపు మహిమ కూడా అపారమైనదిగా అవుతుంది. గీత మహిమ కూడా అపారమైనది. గీత ద్వారా మేము స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అని మీరు అంటారు.

ప్రేయసులారా మేల్కోండి, ఇప్పుడు సత్యయుగము వస్తోంది… అని ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. దీపమునైన నేను మీ జ్యోతిని వెలిగించేందుకు వచ్చాను. ఈ దాదా కూడా ఇప్పుడు పురుషార్థియే. బాబా మీకు కొత్త యుగము కొరకు కొత్త కథను వినిపిస్తున్నారు. ఇది ఎంత మంచి పాట! ఈ మార్గమే కొత్తది. వారు అంటారు, శాస్త్రాల ద్వారానే భగవంతుని మార్గము లభిస్తుంది అని. మళ్ళీ అంటారు, అందరిలోనూ ఈశ్వరుడే ఈశ్వరుడు ఉన్నారు, అంతా వారి మహిమయే, మనమైతే ప్రపంచంలోకి సుఖపడేందుకు వచ్చాము, ఏదైనా తినండి, తాగండి, ఆనందించండి కానీ ఆత్మకు ఏమీ అంటదు అని. తమ అశుద్ధమైన కోరికలను పూర్తి చేసుకునేందుకు ఆత్మ నిర్లేపి అని అనేస్తారు. ఇటువంటివారి సాంగత్యములో ఎప్పుడూ చిక్కుకోకండి. మీరు హంసలు. బాబా అంటారు, మీరు పూర్తిగా ప్రియమైనవారిగా అవ్వాలి. వికారాలలోకి వెళ్ళడం ఒక పెద్ద నేరము. ఇప్పుడు నా మాటను అంగీకరించకపోతే, ఇప్పుడు స్వచ్ఛముగా అవ్వకపోతే, సహాయకులుగా అవ్వకపోతే ధర్మరాజు ద్వారా ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి! భగవంతుడు కొత్త ప్రపంచాన్ని చూపించారు, మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవ్వడానికి వచ్చారు కావున మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి – నేను సొంత బిడ్డనా లేక సవతి బిడ్డనా? శివబాబా తాతగారు, బ్రహ్మా తండ్రి, మనం మనుమలము, మనుమరాళ్ళము. ఇది ఈశ్వరీయ కుటుంబము. తాతగారు గుర్తుండకపోతే వారసత్వము ఎలా తీసుకుంటారు? కావున తాతగారిని తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి లేకుండా తాతగారు ఎలా ఉంటారు? వారు తాతగారు, వీరు మనుమలు. మధ్యలో తండ్రి తప్పకుండా ఉంటారు. తాతగారిపై మనుమలకు హక్కు ఉంటుంది. కావుననే మీరు తాతగారి నుండి తప్పకుండా ఆస్తిని తీసుకోవాలి అని అంటారు. ఇది సంతోషకరమైన విషయం కదా.

మనం శివ భగవానుడి గీత ద్వారా భారత్ యొక్క భాగ్యాన్ని వజ్రతుల్యముగా తయారుచేస్తున్నాము. ఒక్క గీతయే వజ్రతుల్యముగా తయారుచేస్తుంది. మిగిలినవన్నీ గవ్వ సమానముగా తయారుచేస్తాయి. భారత్ యొక్క భాగ్యానికి పూర్తిగా అడ్డుగీత పడింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి భారత్ యొక్క భాగ్యాన్ని మేల్కొలుపుతారు. మనుష్యులు గీత పెట్టి ఉన్న చిన్న లాకెట్ ను తయారుచేసి ధరిస్తారు. కానీ దాని మహత్వము గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ నియమాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. పవిత్ర బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. మోసం చేస్తూ మమ్మా, బాబా అని అనకండి. సత్యంగా అయినప్పుడే నషా ఎక్కుతుంది. హాఫ్ కాస్ట్ (అర్ధ బ్రాహ్మణులు)గా అయినవారికి నషా ఎక్కదు. భగవంతుడు భారత్ పై బలిహారమయ్యారు, నేను భారత్ ను మళ్ళీ వజ్రతుల్యముగా తయారుచేస్తాను అని అంటారు. కావున వారు భారత్ కు ప్రియునిగా అయ్యారు కదా. భారత్ ను మళ్ళీ ఉన్నతముగా తయారుచేస్తారు. ప్రియుడు ప్రేయసిపై పిచ్చివాని వలె అవుతారు కదా. కావున భారతవాసులపై వారు ఎంతగా పిచ్చివాని వలె అవుతారు! ఎంత దూరం నుండి పరుగెత్తుకుంటూ వస్తారు మరియు ఎంత నిరహంకారిగా ఉన్నారు! అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన తండ్రి నుండి అపారమైన జ్ఞాన ధనాన్ని తీసుకునేందుకు రెండు సార్లు జ్ఞాన స్నానం చేయాలి. చదువులో తప్పకుండా రెగ్యులర్ అవ్వాలి.

2. ఫుల్ కాస్ట్, సత్యమైన పవిత్రమైన బ్రాహ్మణులుగా అవ్వాలి. బాబాకు సహాయకులుగా అవ్వాలి. అశుద్ధమైన కోరికలు కలవారి సాంగత్యములో ఎప్పుడూ చిక్కుకోకూడదు.

వరదానము:-

తనువు, మనస్సు మరియు హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా స్వామిని సంతుష్టపరిచే సత్యమైన హోలీహంస భవ

స్వచ్ఛత అనగా మనస్సు, వాణి, కర్మ, సంబంధము అన్నింటిలోనూ పవిత్రత. పవిత్రతకు చిహ్నంగా తెల్లని రంగును చూపిస్తారు. హోలీహంసలైన మీరు కూడా తెల్లని వస్త్రధారులు, స్వచ్ఛమైన హృదయము కలవారు అనగా స్వచ్ఛతా స్వరూపులు. తనువు, మనస్సు మరియు హృదయములో సదా ఎటువంటి మచ్చలేనివారు అనగా స్వచ్ఛమైనవారు. స్వచ్ఛమైన మనస్సు మరియు స్వచ్ఛమైన హృదయముపై స్వామి సంతుష్టులవుతారు. అటువంటి వారికి అన్ని కోరికలు పూర్తి అవుతాయి. హంస విశేషత స్వచ్ఛత, అందుకే బ్రాహ్మణ ఆత్మలను హోలీహంసలు అని అంటారు.

స్లోగన్:-

ఎవరైతే ఈ సమయంలో అన్నింటినీ సహనం చేస్తారో, వారే చక్రవర్తిగా తయారవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top