TELUGU MURLI 25-03-2023

25-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – ఇది అద్భుతమైన పాఠశాల, ఇక్కడ మీకు జ్ఞానసాగరుడైన పతిత-పావనుడైన తండ్రి జ్ఞానామృతాన్ని త్రాగించి పావనంగా తయారుచేస్తారు, ఇటువంటి పాఠశాల ఇంకేదీ ఉండదు’’

ప్రశ్న:-

తండ్రి ఇచ్చే ఏ సలహాను స్వీకరించినట్లయితే తండ్రి ప్రతి క్షణమూ మీకు సహాయకులుగా ఉంటారు?

జవాబు:-

బాబా సలహా ఇస్తారు – పిల్లలూ, మీరు జిన్నుభూతములా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తింటూ, త్రాగుతూ, నడుస్తూ బుద్ధియోగాన్ని నాతో జోడించండి మరియు అన్ని వైపుల నుండీ బుద్ధిని తొలగిస్తూ వెళ్ళండి. మీరు తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేసే సేవను చేయండి, ఇదే మీరు చేసే సహాయము. ఈ స్మృతియే మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తుంది, ఇదే సులువైన బేరము. ధైర్యము ఉంచినట్లయితే తండ్రి ప్రతి క్షణమూ మీకు సహాయకులుగా ఉంటారు. పిల్లలు ధైర్యమును ఉంచితే ఖుదా సహాయం చేస్తారు.

పాట:-

నాకు ఆధారాన్ని అందించేవారు… (ముఝ్ కో సహారా దేనేవాలే…)

ఓం శాంతి.

పిల్లలు పాటను విన్నారు. ఇలా పిల్లలూ, పిల్లలూ అని అనేవారు ఎవరు? తప్పకుండా పిల్లలు అని పిలిచేవారు తండ్రే. ఆ మాటకొస్తే ప్రపంచానికి కూడా తెలుసు – పిల్లలు అని పిలిచేవారు ఒకరేమో పరమపిత, వారినే పరమ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు, మీరందరూ పిల్లలు. పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఈ పాఠశాలలో చదువుకుంటారు. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా. మాతా-పితలకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటారు. పరమపిత పరమాత్మ కూర్చొని చదివిస్తారు. ఇది అద్భుతం కదా. ఇటువంటి అద్భుతమైన, విచిత్రమైన పాఠశాల ఇంకేదీ ఉండదు. జ్ఞానసాగరుడైన పతిత-పావనుడు ఎవరైతే ఉన్నారో, వారే జ్ఞానామృతాన్ని త్రాగించి పావనంగా తయారుచేస్తారని పిల్లలకు తెలుసు. పతిత పావనా రండి అని పాడుతారు కూడా. కావున తప్పకుండా ఇది పతిత ప్రపంచము, అలాగే పావన ప్రపంచము కూడా ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని, కొత్త ఇంటిని పావనము అని అంటారు. తర్వాత అదే ఇల్లు పాతబడుతుంది. కావున ఇది పాత ప్రపంచమని, కొత్త ప్రపంచము ఒకప్పుడు ఉండేదని పిల్లలకు తెలుసు. అక్కడ ఎంతో సుఖము ఉండేది. పిల్లలు పాటను విన్నారు. దీనిని కేవలం భక్తి మార్గంలో పాడుతారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అలా ఉన్నారు. భక్తి మార్గపు పాటలను మనము జ్ఞానంలోకి తీసుకువస్తాము. తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. వారు పతిత-పావనుడు కావున పావనంగా తయారుచేసి తీసుకువెళ్తారు. ఈ-ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇది తప్పకుండా పతిత ప్రపంచమే. పావన దేవతలకు లేక పావన సన్యాసులకు పతిత మనుష్యులు నమస్కరిస్తారు. కానీ పతిత-పావనుడైన తండ్రి ఒక్కరే. అందరూ ఆ పావనంగా తయారుచేసేవారిని తలచుకుంటారు ఎందుకంటే మొత్తం ప్రపంచమంతటినీ దుఃఖము నుండి విముక్తులుగా చేయడము, ఇది ఒక్క తండ్రి పనే. దుఃఖాన్ని ఇచ్చేది ఎవరు? వికారాలు. వికారాల పేర్లు ఏమిటి? కామమనే భూతము, క్రోధమనే భూతము, అశుద్ధ అహంకారమనే భూతము. శరీరాన్ని కూడా భూతము అని అంటారు ఎందుకంటే ఇది పంచ భూతాలతో (తత్వాలతో) తయారుచేయబడ్డ శరీరము. ఆత్మ దీనికి అతీతమైనది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు మరియు దాని కోసం చదువుకుంటున్నారు. వినాశనము జరుగనున్నదని, మహా భారీ యుద్ధము జరుగనున్నదని మనుష్యులు కూడా భావిస్తారు. కానీ ఆ తర్వాత ఏమి జరుగుతుంది, ఇది తెలియదు ఎందుకంటే గీతా భగవానుడిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. రాజయోగాన్ని గీతా భగవానుడే నేర్పించారు. శ్రీకృష్ణుడు నేర్పించలేరు. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసి వారిని ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. అది తికమకపరిచింది. నేను, మీరూ అందరూ ఇలా తికమకలో ఉండేవారము, ఇప్పుడు బయట పడ్డాము. మనుష్యులు దుర్గతిని పొంది ఉన్నారు, మనం ఇప్పుడు జ్ఞానము ద్వారా సద్గతి అయిన పగలులోకి వెళ్తున్నాము.

తండ్రి అంటారు, నేను జ్ఞానసాగరుడిని, ఇంకెవ్వరూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు అని ఒక్కరినే అంటారు, ఆ తర్వాత వారి నుండి జ్ఞాన గంగలు వెలువడుతాయి. శివశక్తి జ్ఞానగంగలు అని అంటారు. అది నీటి గంగ, అది ప్రవహిస్తూనే ఉంటుంది. నీటి గంగ ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలదు అని కాదు, అలా కాదు. జ్ఞానగంగలైన మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వగలరు. జ్ఞానగంగలైన మీరు అక్కడికక్కడే వెలువడుతారు. వారు దానికి గుర్తుగా ఫలానా స్థానములో గంగ వెలువడిందని భావిస్తారు, కావున అక్కడ ఒక గోముఖాన్ని తయారుచేస్తారు. నిజానికి కుమార్తెలైన మీరే గోముఖము వంటివారు. గోవులైన మీ ముఖము నుండి ఈ జ్ఞానం వెలువడుతుంది. మీరు జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన సత్యాతి-సత్యమైన గంగలు. మీకు సృష్టిచక్రపు ఆదిమధ్యాంత జ్ఞానాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రినే జ్ఞానసాగరుడు అని అంటారు. వారే వరల్డ్ ఆల్మైటీ, సర్వశక్తివంతుడు. వారు సర్వ వేదాలు, గ్రంథాలు గురించి తెలిసినవారు. వారు అన్నింటి సారాన్ని అర్థం చేయిస్తారు. ప్రతి ధర్మానికి శాస్త్రమనేది ఒకటే ఉండాలి. ఏ విధంగా శ్రీమద్భగవద్గీత ఒకటే ఉంది, బైబిల్ ఒకటే ఉంది. ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేసారు, ఆ తర్వాత వారి వెనుక ఇతరులు వస్తూ ఉంటారు. వారు ఏదైతే ఉచ్చరించారో, దానిని తర్వాత ధర్మశాస్త్రముగా తయారుచేస్తారు. వెంటనే తయారుచేయరు. ఆ సమయంలోనైతే వారు ధర్మ స్థాపన చేయవలసి ఉంటుంది. ఆ శాస్త్రాలు మొదలైనవాటన్నింటినీ తర్వాత తయారుచేస్తారు. తండ్రి అంటారు, ఈ వేద-శాస్త్రాలు, జప-తపాదులు మొదలైనవన్నీ భక్తి సాంప్రదాయము. ఇది జ్ఞాన సాంప్రదాయము. భక్తి ఆయువు ఇప్పుడు పూర్తవుతుంది, తర్వాత తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి పతితులను పావనులుగా తయారుచేస్తారు. మనమే బ్రాహ్మణులమని, మళ్ళీ మనమే దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల పూర్తి లెక్క అంతా బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులము. ఇంతకుముందు మనం శూద్ర కులానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు మనం బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అయ్యాము. ఇది కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు. దేవీ-దేవతా ధర్మం వారైతే ఎవరూ లేరు. తాము నిజానికి దేవీ-దేవతా కులానికి చెందినవారని హిందువులకు ఏమైనా తెలుసా. ఇప్పుడు మనం శూద్ర కులానికి చెందినవారిగా ఉన్నాము. మన ధర్మాన్ని మరచి ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా, నిరుపేదలుగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీరు హంసో, సోహం అర్థాన్ని తెలుసుకున్నారు. హంసో ఆత్మ (ఆత్మనైన నేను) పరంధామ నివాసిని. ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాను. మొట్టమొదట మనం సత్యయుగములో దేవతా కులములోకి వచ్చాము, ఆ తర్వాత వైశ్య, శూద్ర కులాలలోకి వచ్చాము. మళ్ళీ దేవతా కులములోకి వెళ్తాము. ఏ కులములో ఎన్ని జన్మలు ఉంటాయి అనేది మీకు తెలుసు. ఇకపోతే బాబా కూర్చుని ఒక్కొక్క జన్మ గురించైతే తెలియజేయరు. సారములో తెలియజేస్తారు. బీజము మరియు వృక్షము గురించి తెలుసుకోండి, అంతే. తండ్రి బీజరూపుడు. మనము కల్పవృక్షములోని వారము. మనము పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వచ్చాము. సత్యయుగము నుండి మొదలుకుని చక్రములో తిరిగాము, ఆ తర్వాత ఇతర ధర్మాల వారు ఫలానా, ఫలానా సమయంలో వస్తారు, తర్వాత ఎప్పుడైతే వినాశనము జరుగుతుందో అప్పుడు ఆత్మలందరూ తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళీ తమ, తమ సమయమనుసారంగా, నంబరువారుగా వస్తారు ధర్మ స్థాపన చేయడానికి. ఈ రహస్యాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. పిల్లలు అంటారు, బాబా, మీరు ఏదైతే చదివిస్తారో దాని ద్వారా మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము. మీరు ఇచ్చే సుఖము ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మనుష్యమాత్రులందరూ అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేవారు. అదైతే జంతువులు కూడా ఇస్తాయి. మనుష్య జీవితము అమూల్యమైనది అని అంటారు. మనుష్యులే దేవీ-దేవతలుగా అవ్వగలరు. మనుష్యులు విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. బాబా, మీరు ఏ సుఖాన్ని అయితే ఇచ్చారో, దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. మీరు విశ్వ రచయిత. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు, అంతే. ఇంకే హఠయోగము మొదలైనవాటి విషయమే లేదు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు, బాబా కొత్త విశ్వానికి రచయిత అని మీకు తెలుసు. బాబా పరంధామం నుండి వచ్చారు. వీరు అతి ప్రియమైన తండ్రి, అందరూ వీరిని స్మృతి చేస్తారు. ఏ ధర్మం వారైనా సరే, ఓ గాడ్ ఫాదర్, హే భగవాన్ లేక అల్లా అని తప్పకుండా అంటూ ఉంటారు. తండ్రి అంటారు, నేను అందరికీ సుఖాన్ని ఇచ్చి వెళ్తాను, కావుననే భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను సుఖము ఇచ్చేందుకు వచ్చాను, ఇక తర్వాత అర్ధకల్పం వరకూ నన్ను ఎవరూ స్మృతి చేయరు. అక్కడ దుఃఖాన్ని ఇచ్చేందుకు మాయ ఏమీ ఉండదు. మీరు విశ్వానికి యజమానులుగా, దేవీ-దేవతలుగా అవుతారు, కావున పిల్లలైన మీ హృదయములో రాత్రింబవళ్ళూ ఇది ఉండాలి. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. మేము హక్కుదారులము కూడా. తండ్రి కొత్త విశ్వమైన స్వర్గాన్ని రచిస్తారు కావున తప్పకుండా పిల్లలనే యజమానులుగా చేస్తారు కదా. గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించినప్పుడు మరి మనమందరమూ స్వర్గములో ఎందుకు లేము. అందరూ స్వర్గములో ఉన్నట్లయితే నరకము ఉండనే ఉండదు. ఇది గెలుపు-ఓటముల, సుఖ-దుఃఖాల ఆట. కొత్త ప్రపంచం మళ్ళీ పాతగా అవుతుంది. కొత్తగా ఎవరు తయారుచేస్తారు, పాతగా ఎవరు తయారుచేస్తారు, ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఇది బుద్ధిలో ఉంటుంది. సత్య, త్రేతాయుగాలలో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు, తర్వాత ద్వాపరములో వేరే-వేరే ధర్మాలు వెలువడుతాయి, కల్పపూర్వము ఏ విధముగా జరిగిందో, అలాగే మళ్ళీ రిపీట్ అవుతుంది.

ఇప్పుడు మళ్ళీ సత్యయుగము మొదలవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. పాత ప్రపంచము అంతమై కొత్తది రానున్నది. ఈ ప్రపంచము ఇప్పుడింకా పాతబడుతూనే ఉంటుందని, ఇంకా ఎంతో సమయం ఉందని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, మీరు ఘోర అంధకారములో ఉన్నారు, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. నేను పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయడానికి వచ్చేసాను. ఇంతకుముందు ఇక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు బ్రహ్మా ముఖము ద్వారా పిల్లలు జన్మిస్తూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మాకు తప్పకుండా అనేకమంది పిల్లలు ఉంటారు. వారు కూర్చొని చదువుకుంటారు, వారే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఎవరైతే తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారో, పవిత్రముగా అవుతారో మరియు స్వదర్శన చక్రధారులుగా అవుతారో – వారే రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. అందరూ అయితే తీసుకోరు. మిగిలినవారంతా తమ, తమ లెక్కాచారాలను తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతారు. బాబా దేవతా ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమవ్వనున్నాయి. మహా భారీ యుద్ధము కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఈ చరిత్ర, భౌగోళికాల రహస్యాన్ని గీతా భగవానుడు కూర్చొని అర్థం చేయిస్తారు. భగవంతుని మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. శ్రీకృష్ణుడిని మనుష్య సృష్టికి బీజరూపుడని, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అనరు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ఒక్కరే. సూర్యవంశీయుల మహిమ వేరు. చంద్రవంశీయుల మహిమ వేరు. వైశ్య, శూద్ర వంశీయుల మహిమ వేరు. ప్రతి ఒక్కరి మహిమ ఎవరిది వారిదే. చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టరే, గవర్నర్ గవర్నరే. అందరూ ఒకే సమానముగా ఉండరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారని మనుష్యులకేమైనా తెలుసా. మీరు మీ కోసమే గుప్త రీతిలో మరియు అహింసాయుతముగా రాజ్యస్థాపన చేసుకుంటున్నారు. కామ ఖడ్గపు హింసా లేదు, స్థూలమైన కొట్లాటలు లేక తుపాకీల హింసా లేదు. మీరు మారణాయుధాలు మొదలైనవాటిని ఉపయోగించకూడదు. మనము బాబా సహాయముతో కల్పపూర్వము వలే భారత్ ను మళ్ళీ వజ్రతుల్యముగా తయారుచేస్తున్నామని బ్రాహ్మణులైన మీకు తెలుసు. ఇది ఆత్మిక సేవ. మనుష్యులు భౌతికమైన సేవను చేస్తారు. మనం బాబా శ్రీమతము ద్వారా శ్రేష్ఠముగా అవుతున్నాము. మిగిలినవారంతా మనుష్య మతము ద్వారా భ్రష్టులుగానే అవుతూ ఉంటారు. కిందకు తప్పకుండా దిగాల్సిందే. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది. అది చాలా మంచి భక్తి. ఒక్కరి పూజనే చేస్తారు, ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ లో దేవతలను పూజిస్తారు, ఆ తర్వాత కుక్క, పిల్లి, రాళ్ళు-రప్పలు, మట్టి మొదలైన పంచ భూతాలకు కూడా భక్తి చేయడం మొదలుపెడతారు. దానిని వ్యభిచారీ భక్తి అని అంటారు. అవ్యభిచారుల నుండి వ్యభిచారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి మీకు అవ్యభిచారీ యోగాన్ని నేర్పిస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ తింటూ, తాగుతూ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. శ్రమ అంతా ఇందులోనే ఉంది. మీ ఇంటికి వెళ్ళండి-రండి, కానీ కేవలం గుప్త రీతిలో బుద్ధితో స్మృతి చేయండి. నోటితో రామ, రామ అని, లేక శివాయ నమః అని అనాల్సిన అవసరం కూడా లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రి గుప్తమైనవారు, జ్ఞానసాగరుడు. ఈ సృష్టి చక్రమంతటి గురించి వారికి తెలుసు. వారిని పరమ ఆత్మ అని అంటారు. వీరూ ఆత్మ, వీరికి ఆ తండ్రి నుండి జ్ఞానం లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి తర్వాత చేయించాలి. పాపం, వారు దారి వెతుకుతూ ఉంటారు, వారికేమీ తెలియదు. శాంతిధామము నిర్వాణధామమని మీకు తెలుసు. అక్కడి నుండి ఆత్మలమైన మనం వస్తాము. స్వర్గము సుఖధామము, నరకము దుఃఖధామము, మాయాపురి. ఆ స్వర్గము విష్ణుపురి మరియు ఈ నరకము రావణపురి. తండ్రి అంటారు, మీరు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, అంతే. ఒకవేళ మధ్యలో బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతే దానిని పక్కకు తీసుకురండి. తింటూ, తాగుతూ, నడుస్తూ కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఇది చాలా సహజము. ఎవరైనా విదేశాలలో ఉన్నారనుకోండి, వారి పత్ని భారత్ లో ఉంటే దూరముగా ఉన్నా కూడా ఆమె స్మృతి బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఎంత దూరముగా ఉన్నాము కానీ బుద్ధితో తండ్రిని స్మృతి చేయాలి, వారి నుండి ఎంతో సుఖము లభిస్తుంది, మిగిలినవారందరి నుండి దుఃఖమే లభిస్తుంది. మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ సదాకాలికమైన సుఖాన్ని ఇవ్వలేరు. తండ్రి అంటారు, జిన్నుభూతము వలే స్మృతి చేస్తూ ఉండండి, అంతే. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేస్తూ ఉండండి, నాకు ఈ సేవే చేయండి. నేను మీకు స్మృతి చేయించే సేవను చేస్తాను. మీరేమో నన్ను స్మృతి చేసే సేవ చేయండి. ఈ సలహాను అంగీకరించండి (స్వీకరించండి). ఇదే మీరు చేసే సహాయము. పిల్లలు ధైర్యమును ఉంచితే తండ్రి సహాయం చేస్తారు. ఈ స్మృతియే మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తుంది. ఇది ఎంత సులువైన బేరము. ఆ గురువులైతే ఎన్నో ఎదురుదెబ్బలు తినిపిస్తారు. ఒక్క సద్గురువు ఎప్పుడైతే వస్తారో అప్పుడిక ఏ గురువునూ ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. గురుత్వమే తొలగిపోతుంది. అందరూ సద్గతిని పొందుతారు. ఒక్క సద్గురువు రావడంతో ఇక అనేకమంది గురువులను ఆశ్రయించే ఆచార-వ్యవహారము అర్ధకల్పం కొరకు తొలగిపోతుంది. మళ్ళీ భక్తి మార్గంలో ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. సత్యయుగములో గురువులు ఎవరూ ఉండరు. అక్కడ అకాల మృత్యువు ఎప్పుడూ జరుగదు. ఆరోగ్యము, సంపద మరియు సుఖము 21 జన్మల వరకూ లభిస్తాయి. ఇలా ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీకు తండ్రి ద్వారానే ఆరోగ్యము, సంపద మరియు సుఖము లభిస్తాయి. మిగిలినవారంతా నిర్వాణధామానికి వెళ్ళిపోతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే స్వదర్శన చక్రధారీ పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతముపై భారత్ ను వజ్రతుల్యముగా తయారుచేసే ఆత్మిక సేవను చేయాలి. గుప్త రీతిలో తండ్రిని స్మృతి చేస్తూ శ్రేష్ఠముగా అవ్వాలి.

2. మీతో మీరు మాట్లాడుకోవాలి, ఆత్మిక సంభాషణ చేయాలి – బాబా, మీరు ఏ సుఖాన్ని అయితే ఇచ్చారో, దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా, మీ చదువు ద్వారా మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. మీరు కొత్త సృష్టిని రచిస్తారు, దానికి మేము హక్కుదారులము.

వరదానము:-

భృకుటి రూపీ కుటీరంలో కూర్చొని అంతర్ముఖత అనే రసాన్ని ఆస్వాదించే సత్యమైన తపస్వీమూర్త భవ

ఏ పిల్లలైతే తమ మాటలపై నిగ్రహం ఉంచుకొని శక్తిని మరియు సమయాన్ని జమ చేసుకుంటారో, వారికి స్వతహాగా అంతర్ముఖత అనే రసము అనుభవమవుతుంది. అంతర్ముఖత అనే రసము మరియు మాటల రసము – ఈ రెండింటికీ రాత్రికీ పగలుకు ఉన్నంత తేడా ఉంది. అంతర్ముఖులు సదా భృకుటి అనే కుటీరంలో తపస్వీ మూర్తులుగా అనుభవం చేసుకుంటారు. వారు వ్యర్థ సంకల్పాల పట్ల మనసుతో మౌనమును మరియు వ్యర్థ మాటల పట్ల నోటితో మౌనమును ఉంచుతారు, అందుకే అంతర్ముఖత అనే రసము యొక్క అలౌకిక అనుభూతి కలుగుతుంది.

స్లోగన్:-

రహస్యము తెలిసినవారిగా అయి ప్రతి పరిస్థితిలోనూ రాజీగా ఉండేవారే జ్ఞానీ ఆత్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top