TELUGU MURLI 24-03-2023

24-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మీరు ఆత్మిక సమాజ సేవకులు, మీరు ఈ ప్రపంచాన్ని సుఖము, శాంతి మరియు పవిత్రతతో సంపన్నముగా తయారుచేసేందుకు మీ తనువు, మనస్సు, ధనములను సఫలం చేసుకోవాలి’’

ప్రశ్న:-

మాయపై విజయం పొందేందుకు పిల్లలైన మీ వద్ద ఏ ఆయుధము ఉంది? ఆ ఆయుధాన్ని ఉపయోగించే విధి ఏమిటి?

జవాబు:-

మాయపై విజయం పొందేందుకు మీ వద్ద ‘‘స్వదర్శన చక్రము’’ ఉంది. ఇదేమీ స్థూలమైన ఆయుధము కాదు, కానీ మనస్సు ద్వారా మన్మనాభవగా అవ్వండి. హంసో సోహం అన్న మంత్రాన్ని గుర్తు చేయండి, అప్పుడు ఈ విధి ద్వారా మాయ శిరస్సు ఖండించబడుతుంది. మీరు మాయాజీతులుగా అయి చక్రవర్తీ రాజులుగా అవుతారు.

పాట:-

ఈ పాపపు ప్రపంచము నుండి మరెక్కడికైనా తీసుకువెళ్ళు… (ఇస్ పాప్ కీ దునియా సే కహీ ఔర్ లే చల్…)

ఓం శాంతి.

బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలిసిన విషయమేమిటంటే – ఇది కలియుగీ పాపపు ప్రపంచము మరియు సత్యయుగము తప్పకుండా పుణ్య ప్రపంచము అని. పిల్లలకు అర్థం చేయించడం జరిగింది – ఏ మనుష్యులైతే పుణ్యాత్ములుగా ఉంటారో వారికి మంచి జన్మ లభిస్తుంది, పాపాత్ములకు చెడు జన్మ లభిస్తుంది. ఇప్పుడు ఇది పాపాత్ముల ప్రపంచము. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. శాంతిధామమునే పరంధామము అని అంటారు. ఇది దుఃఖధామము. భారత్ సత్యయుగములో సుఖధామంగా ఉండేది. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళాలి, తర్వాత సుఖధామంలోకి రావాలి. సుఖధామములో పవిత్రత, సుఖము, శాంతి మూడూ ఉంటాయి. ఈ దుఃఖధామములో అపవిత్రత, దుఃఖము, అశాంతి ఉన్నాయి. ఈ మూడు విషయాలను అర్థం చేసుకోవాలి. భారత్ లో ఈ మూడూ ఉన్నప్పుడు దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడు మీరు తనువు, మనస్సు, ధనము, సర్వస్వమునూ తండ్రిపై బలిహారం చేస్తారు. తనువు, మనస్సు, ధనములతో మీరు భారత్ కు సేవ చేస్తారు. తనువుతో కూడా సేవ చేయడం జరుగుతుంది కదా. సమాజ సేవకులు తనువుతో సేవ చేస్తారు. కొందరు ధనముతో సేవ చేస్తారు. కానీ మనస్సుతో చేసే సేవ గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మన్మనాభవ అర్థాన్ని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి, తద్వారా మీరు సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు. మన్మనాభవ అనగా అందరి బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. ఈ విధంగా చెప్పగలిగే మనుష్యులు ఇంకెవ్వరూ లేరు. వారు మిగిలిన సేవలన్నింటినీ చేస్తారు కానీ మనస్సుతో ఎవరూ చేయలేరు. మనస్సు ఎలా శాంతిస్తుంది అని మనుష్యులు అంటారు. మనస్సు మరియు బుద్ధి అనేవి ఆత్మ యొక్క ఇంద్రియాలు. మరియు ఈ కర్మేంద్రియాలు శరీరం యొక్క ఇంద్రియాలు. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు – స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయండి, మీ తండ్రిని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి అని. ఇది మనసుతో చేసే సేవ, ఎవరెవరైతే ఇది చేస్తారో వారే మాయపై విజయం పొందుతారు. మాయ శిరస్సు ఖండించబడుతుంది. అంతేకానీ, స్వదర్శన చక్రముతో మనుష్యుల శిరస్సు ఖండించబడుతుందని కాదు. దేవతలకు నిజానికి ఇటువంటి పాపము కలిగించే అలంకారాలేవీ ఉండవు.

శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రముతో శిరస్సు ఖండించారని మనుష్యులు భావిస్తారు. కానీ అది పాప కర్మ అయినట్లు. దేవతలు ఇటువంటి కర్మలు చేయలేరు. స్వదర్శన చక్రము అనేది ఎవరి శిరస్సునో ఖండించడానికి లేదు. ఇది మాయపై విజయం పొందేందుకు ఉపయోగించేది. స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మనం దేవతలుగా అవుతాము. మాయపై విజయం పొందుతాము. ఈ స్వదర్శన చక్రము ద్వారానే మీరు మాయపై విజయం పొందుతారు. ఇవి మీ ఆయుధాలు. శంఖము మ్రోగించేందుకు ఉంది. జ్ఞానం లభించి ఉంది కదా. స్వదర్శన చక్రాన్నీ ఎలా తిప్పాలి అనేది వారు నేర్పిస్తారు. కావున మీరు మళ్ళీ చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తున్నాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. ఇది తండ్రి నేర్పించారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా తయారుచేయలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరుని వంశావళిగా ఉన్నారు, తర్వాత విష్ణు వంశావళిగా అవుతారు. స్వదర్శన చక్రం యొక్క అలంకారాన్ని కూడా విష్ణువుకు ఇవ్వడం జరిగింది. మీరు పురుషార్థులు. స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఈ స్వదర్శన చక్రం ద్వారానే మీరు మాయాజీతులుగా అవుతారు. ఇది మీ ఆయుధము. శంఖము మ్రోగించేందుకు ఉంది. జ్ఞానం లభించింది కదా. స్వదర్శన చక్రాన్ని ఎలా తిప్పాలో నేర్పిస్తారు, అప్పుడు మీరు మళ్ళీ చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తున్నాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. ఇది తండ్రి నేర్పించారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా తయారుచేయలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరుని వంశావళిగా ఉన్నారు, తర్వాత విష్ణు వంశావళిగా అవుతారు. స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మనం విష్ణుకులములోకి వెళ్తాము. ఈ విషయాన్ని ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి ఇల్లు అయిన శాంతిధామాన్ని స్మృతి చేయండి, అక్కడి నుండే ఆత్మలు వస్తాయి. ఇప్పుడు ఇది నరకము, ఇప్పుడిక స్వర్గములోకి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలన్నీ వినాశనమవుతాయి. కానీ తండ్రితో పూర్తి యోగము లేకపోతే ధారణ జరగదు, అప్పుడిక ఎవరికీ అర్థం చేయించలేరు.

మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రహ్మాకుమార-కుమారీలు. ఎవరైతే పవిత్రముగా ఉంటారో వారే బి.కే.లు. ఎవరైతే పవిత్రముగా ఉండలేరో వారు బ్రహ్మా ముఖవంశావళిగా, శివబాబాకు మనుమలుగా పిలువబడలేరు. క్రోధము, లోభము యొక్క విషయము వేరు. కానీ పవిత్రముగా ఉండలేకపోతే వారిని బ్రాహ్మణులు అని అనడం కూడా తప్పే అవుతుంది. ఎవరిలోనైతే వికారాలు ఉంటాయో లేక ఎవరైతే వికారాలలోకి వెళ్తారో వారు బ్రాహ్మణ కులానికి చెందినవారు కారు. మీరు ఇలా అర్థం చేయించవచ్చు – మేమైతే పవిత్రముగా ఉంటాము కానీ ఎవరైనా వికారులుగా అయి అశుద్ధంగా అయినట్లయితే వారు బ్రాహ్మణులుగా పిలువబడేందుకు యోగ్యులు కారు అని. వికారాలలోకి వెళ్ళడం పతితత్వము. అటువంటి పతితులు ఇక్కడకు రాలేరు. కానీ కొన్ని కారణాల వల్ల రానివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇళ్ళు కట్టేవాళ్ళందరూ తప్పకుండా పతితులే కదా. అదే బ్రాహ్మణులైతే ఈ పనులు చేయరు. కావున వారితో ఈ పనులు చేయించాల్సి ఉంటుంది. ఎవరైనా సహాయకులుగా అయితే వారిని ఉండనివ్వడం జరుగుతుంది. నిజానికి పతితులు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఇది పావనులుగా అయ్యే స్థానము, పతితులు తప్పకుండా వస్తారు. భారత్ పావనంగా ఉండేది, స్త్రీ-పురుషులు ఇరువురూ పవిత్రముగా ఉండేవారు. పతి-పత్ని అయిన లక్ష్మీ-నారాయణులు ఇరువురూ సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు కదా. నేను స్వయం వారి మహిమను చేస్తాను. ఇప్పుడు మీరు సంగమయుగానికి చెందినవారిగా ఉన్నారు. సంగమములో తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు. విషయ-వికారాలలోకి వెళ్ళేవారిని పతితులు అని అంటారు. సన్యాసులు విషాన్ని వదిలేస్తారు కావున పతితులు వారికి నమస్కరిస్తారు. వికారాలు అన్న పదం చాలా అశుద్ధమైనది. నిర్వికారీ అనగా వైస్ లెస్. వికారులను విషస్ అని అంటారు. ఇది వేశ్యాలయము. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ సంగమములో వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేస్తాను, యోగ్యులుగా తయారుచేస్తాను. వారు పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేస్తారు. స్వర్గానికి యజమానులుగా స్వర్గ రచయితయే తయారుచేస్తారు కదా.

దేవతలు ఎంత సనాథలుగా ఉండేవారు అనేది తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడైతే అందరూ అనాథలుగా ఉన్నారు. ఇది దుఃఖమయమైన ప్రపంచము. అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. నంబర్ వన్ దుఃఖము కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, దాని ద్వారా ఆదిమధ్యాంతాలు దుఃఖము లభిస్తుంది. ఈ దుఃఖధామములో ఎవరికైనా శాంతి లభించడం అసంభవము ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం కదా. ఇంతమంది సన్యాసులు పవిత్రముగా ఉంటారు, అయినా భారత్ తమోప్రధానముగా అయిపోయింది కదా. వారు కేవలం పవిత్రముగా అవుతారు, అందుకే పతిత మనుష్యులు వారి సేవను చేస్తారు. భోజనం పెడతారు, మహళ్ళు మొదలైనవి నిర్మించి ఇస్తారు. కావున ఎవరైతే పవిత్రముగా అవుతారో వారి పేరు ప్రసిద్ధమవుతుంది. తండ్రి కూడా ఈ వికారాలపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. మనమే పూజ్య దేవతలుగా ఉండేవారము – అదంతా మర్చిపోయాము. నిర్వికారీ దేవీ-దేవతల వంశము కొనసాగుతుంది. అక్కడ జన్మ ఎలా జరుగుతుంది అని అడుగుతారు. అక్కడి ఆచార-వ్యవహారమేదైతే ఉంటుందో దాని అనుసారంగానే జరుగుతుంది. ముందు మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని రాజ్య భాగ్యపు వారసత్వాన్ని అయితే తీసుకోండి. అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారు అని అడుగుతారా? వంశమైతే కొనసాగుతుంది. ఆ సన్యాసము రజోప్రధానమైనది. దేవతల సన్యాసము సతోప్రధానమైనది. సన్యాసులు వికారాల ద్వారా జన్మ తీసుకుని అప్పుడు నిర్వికారులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. అది నిర్వికారీ ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. వికారాలు లేకుండా ప్రపంచం ఎలా కొనసాగుతుంది అన్న ఆలోచన వికారీ మనుష్యులకు ఉంటుంది. వారి దృష్టి ఎలా ఉంటుందో అటువంటి సృష్టియే కనిపిస్తుంది.

బాబా ఎంత బాగా తయారుచేస్తారు. లక్ష్యమైతే బుద్ధిలో ఉంటుంది కదా. భగవంతుడు మనల్ని తమ సమానముగా భగవతి, భగవానులుగా తయారుచేస్తారు. కావున మాస్టర్ భగవానులుగా అయినట్లు, తర్వాత దేవతలుగా అవ్వాలి. మాస్టర్ భగవాన్ గా అయి తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఏ విధముగా వారు పావనులో, అలాగే మీరు కూడా స్మృతి చేస్తూ, చేస్తూ పావనులుగా అవుతారు. తర్వాత పావన ప్రపంచములోకి వస్తారు. అక్కడ దుఃఖము యొక్క మాటే ఉండదు. మనుష్యులు ఎలా తయారవుతారంటే వారికి పావనంగా అయ్యేందుకు గురువులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ రోజుల్లోనైతే వికారులను, పతితులను కూడా గురువులుగా చేసుకుంటారు. గృహస్థులైన పతిత గురువులు ఏం పావనంగా తయారుచేస్తారు? ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి గురించి తెలియనే తెలియదు. ఇది అనాథల ప్రపంచము. సత్యయుగము సనాథల ప్రపంచము ఎందుకంటే దేవీ-దేవతా ధర్మాన్ని అయితే నాథుడే స్థాపించారు. ఎప్పుడైతే ఆ నాథునికి చెందినవారిగా అవుతారో అప్పుడే సనాథలుగా అవుతారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. భగవానువాచ అన్నది ఒక్క అర్జునుడి కోసమే కాదు, సంజయుడు కూడా ఉన్నారు. కావున ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతముపై నడవాలి. శ్రేష్ఠంగా అవ్వండి అని తండ్రి అంటారు. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి. పరమపిత పరమాత్మ అయిన శివుడే రచయిత మరియు డైరెక్టర్. వారు బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా రచిస్తారు, తర్వాత వారికి డైరెక్షన్ ఇస్తారు, ఆ తర్వాత బ్రహ్మా మాల మారి రుద్ర మాలగా, ఆ తర్వాత విష్ణు మాలగా అవుతుంది. తండ్రి అంటారు, కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు స్వర్గాన్ని స్మృతి చేయండి, అప్పుడు ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇది సత్యమైన సంపాదన. మనుష్యులకు కర్మల అనుసారంగా జన్మ లభిస్తుంది. ఇప్పుడు తండ్రి ఇటువంటి శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. ఇక్కడ ఇది శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠముగా తయారయ్యే సంపాదన. మిగిలినవారంతా మట్టిలో కలిసిపోనున్నారు. దేహాభిమానాన్ని కూడా వదిలివేయాలి. మనం ఆ తండ్రికి చెందినవారిగా అయ్యాము, ఆ తండ్రి వద్దకే వెళ్తాము. ఆత్మ అంటుంది – బాబా, మేము మీ స్మృతిలో ఉంటూ వికర్మలను సమాప్తం చేసే తీరుతాము, ఆ తర్వాత మీరు మమ్మల్ని స్వర్గములోకి పంపిస్తారు కదా. నరకం యొక్క వినాశనము, స్వర్గం యొక్క స్థాపన అయితే తప్పకుండా జరుగుతాయి కదా. మహా భారీ యుద్ధము ఎదురుగా ఉంది. దీని ద్వారా కూడా ముక్తి-జీవన్ముక్తుల ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక్కడ చూడండి, కూర్చుని, కూర్చునే రోగాలు వచ్చేస్తాయి. అక్కడైతే ఎల్లప్పుడూ విశ్రాంతియే విశ్రాంతి ఉంటుంది. ఇది దుఃఖధామం కదా, అందుకే సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయడం జరుగుతుంది. అక్కడ మాయ ఉండదు. దేహాభిమానము ఉండదు. తాము ఒక ఆత్మ అని, ఈ శరీరము ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిందని, ఇక వేరొక శరీరాన్ని తీసుకోవాలని భావిస్తారు. అక్కడ వారికి – మేము తండ్రి వద్దకు వెళ్తాము అన్న జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం మీకు ఈ సమయంలో ఉంది. మనం తిరిగి బాబా వద్దకు వెళ్ళాలి, ఆ తర్వాత బాబా స్వర్గములోకి పంపిస్తారు. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేస్తూ ఉండండి.

మీరు ఎంతగా ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో అంతగా ఉన్నతి లభిస్తుంది. శ్రీమతము ద్వారా శ్రేష్ఠముగా తయారవ్వాలి. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడం సుపుత్రుల పని. ఇప్పుడు తీసుకుంటే ఇక కల్ప-కల్పాంతరాలూ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తీసుకోకపోతే ఇక కల్ప-కల్పాంతరాలూ వారసత్వాన్ని తీసుకోలేరు. పిల్లలైన మీతో పోలిస్తే మొత్తం ప్రపంచమంతా నిరుపేదలే. అందరూ మట్టిలో కలిసిపోతారు. దివాలా తీస్తారు. మీరు సత్య ఖండము కొరకు సత్యమైన సంపాదన చేసుకుంటారు. తండ్రి అంటారు, మీరు నా ఇంటికి రావాలి, అందుకే ఆ ఇంటిని గుర్తు చేస్తూ ఉండండి. మీరు నా ఇంటికి యజమానులుగా ఉండేవారని, ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటిని స్మృతి చేయండని ఆ ఇంటి యజమానే తెలియజేస్తారు. డ్రామా పూర్తి అవుతుంది, ఇది ఎంత సహజము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా మరియు సుపుత్రులుగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. శ్రీమతముపై శ్రేష్ఠ కర్మలు చేస్తూ సత్యమైన సంపాదన చేసుకోవాలి.

2. సంపూర్ణ నిర్వికారులుగా అయి సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వాలి. పావనులుగా అయి స్వయాన్ని పావన ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

ఒక్క తండ్రినే తమ ప్రపంచముగా చేసుకుని సదా నవ్వుతూ, పాడుతూ మరియు ఎగురుతూ ఉండే ప్రసన్నచిత్త భవ

దృష్టితో సృష్టి మారిపోతుంది అని అంటారు. అలా మీ ఆత్మిక దృష్టి ద్వారా సృష్టి మారిపోయింది, ఇప్పుడు మీ కొరకు ఒక్క తండ్రియే ప్రపంచము. ఇంతకుముందు ఉన్న ప్రపంచానికి, ఇప్పటి ప్రపంచానికి తేడా వచ్చింది. ఇంతకుముందు ప్రపంచంలో బుద్ధి భ్రమిస్తూ ఉండేది, ఇప్పుడు తండ్రియే ప్రపంచమైపోయారు కనుక బుద్ధి భ్రమించటము ఆగిపోయింది. అనంతమైన ప్రాప్తులను ఇచ్చే బాబా లభించేసారు కనుక ఇంకేం కావాలి, అందుకే నవ్వుతూ, పాడుతూ, ఎగురుతూ సదా ప్రసన్నచిత్తులుగా ఉండండి. మాయ ఏడిపించినా కూడా ఏడవకూడదు.

స్లోగన్:-

మనసు స్వచ్ఛంగా ఉన్నట్లయితే కోరికలు నెరవేరుతూ ఉంటాయి, సర్వ ప్రాప్తులు స్వతహాగానే మీ ఎదురుగా వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top