TELUGU MURLI 18-03-2023

18-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – అతి ప్రియమైన తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని ఇచ్చేందుకు యుక్తులను కనుగొనాలి, ఏక్యురేట్ పదాలతో భగవంతుని పరిచయాన్ని ఇచ్చినట్లయితే సర్వవ్యాపి విషయము సమాప్తమైపోతుంది’’

ప్రశ్న:-

అవినాశీ జ్ఞాన రత్నాలను ఏరుకునే పిల్లల కర్తవ్యము ఏమిటి?

జవాబు:-

జ్ఞానములోని ప్రతి విషయముపై బాగా విచార సాగర మంథనము చేసి ఒక్క తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. పుణ్యాత్ములుగా తయారుచేసేవారితోపాటు పాపాత్ములుగా ఎవరు తయారుచేసారు అన్నది అర్థం చేయించడం పిల్లలైన మీ కర్తవ్యము. అందరినీ రావణుడి రేగు పళ్ళు ఏరుకోవడం నుండి రక్షించి జ్ఞాన రత్నాలను ఏరుకునేలా చేయాలి. సేవ చేసేందుకు భిన్న-భిన్న యుక్తులను కనుగొనాలి. సేవలో బిజీగా ఉండడం ద్వారానే అపారమైన సంతోషము ఉంటుంది.

పాట:-

ఓ ప్రియతమా, వచ్చి కలుసుకో… (ప్రీతమ్ ఆన్ మిలో…)

ఓం శాంతి.

తండ్రి అయిన పరమాత్మను ఎల్లప్పుడూ రచయిత అని అంటారు. ఈ పశుపక్ష్యాదులు మొదలైన రచననంతా వారే రచిస్తారని మనుష్యులు అంటారు. కానీ వారికి ఇలా అర్థం చేయించాలి – మీరు మొట్టమొదట మనుష్యుల విషయాన్ని అర్థం చేసుకోండి, రచయిత అయిన పరమపిత మనుష్య సృష్టిని ఎలా రచిస్తారో అర్థం చేసుకోండి. మనుష్యులే వారిని తండ్రీ అంటూ పిలుస్తారు ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. అందరూ ఆ ఒక్క రచయితనే స్మృతి చేస్తారు. కావున మొట్టమొదట మనుష్య సృష్టి రచయిత ఎవరు అనేది అర్థం చేయించాలి. ఆ రచయితయే అందరికీ తండ్రి అవుతారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మకు తన పరిచయము లేదు, అలాగే తన తండ్రి పరిచయము లేదు. ఒకవేళ స్వయం ఆత్మ యొక్క పరిచయం ఉన్నా తాము ఎవరి సంతానము అనేది అర్థం చేసుకోగలుగుతారు! మనం పరమపిత పరమాత్ముని సంతానము. ఆ తండ్రి రచయిత కావున తప్పకుండా మొట్టమొదట మనుష్య సృష్టినే రచిస్తూ ఉండవచ్చు, అది కొత్త ప్రపంచముగా లేక స్వర్గముగా ఉంటుంది. తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు. తండ్రి దుఃఖాన్ని ఇచ్చేందుకు రచనను రచించడం అనేది జరగదు. మనం ఆ తండ్రికి పిల్లలము అన్నప్పుడు, ఆ తండ్రి స్వర్గాన్ని రచిస్తారన్నప్పుడు, మనం కూడా అక్కడే ఉండాలి లేక పరంధామంలో ఉండాలి. కానీ మనం ఇక్కడ పాత్రను అభినయించేందుకు రావాల్సి ఉంటుంది. ఇవి విచార సాగర మంథనము చేసేందుకు యుక్తులు. ఎంత సమయం లభిస్తే అంత సమయం ఇదే విచార సాగర మంథనము చేయాలి. సాధు-సత్పురుషులు మొదలైనవారెవ్వరికీ యథార్థ రీతిలో తండ్రి గురించి తెలియదు. రచయిత తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు కావున ఆత్మలందరూ నిర్వాణధామంలోనే ఉండాలి. ఆ నిర్వాణధామము ఆత్మలైన మనందరి ఇల్లు, అక్కడే తండ్రి కూడా ఉంటారు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. యోగము లేని కారణముగానే మనుష్యుల చేత పాపాలు జరుగుతాయి లేక ధారణ జరగదు. తండ్రిని స్మృతి చేయరు. భగవంతుడైతే ఒక్కరే. వారు అతి ప్రియమైన స్వర్గ రచయిత. అక్కడ ఎంతో సుఖము ఉంటుంది. ఇక్కడ దుఃఖము ఉన్న కారణముగానే భగవంతుడిని తలచుకుంటారు. తండ్రి పిల్లలకు సుఖము కొరకే జన్మనిస్తారు. సత్య, త్రేతా యుగాలను సుఖధామము అని అంటారు. ఇప్పుడు ఇది కలియుగము. దీని తర్వాత మళ్ళీ సత్యయుగము రానున్నది. కావున తప్పకుండా తండ్రి కూడా రావాలి. ఈ-ఈ విధముగా విచార సాగర మంథనము చేసి ఆ తర్వాత ఎవరికైనా కూర్చొని అర్థం చేయించాలి. ఇక్కడ మీకు తండ్రి ద్వారా తండ్రి పరిచయము లభిస్తుంది. మనుష్యులకు ఆ అతి ప్రియమైన తండ్రి గురించి తెలియదు. ఆ తండ్రి గురించే తెలియని కారణముగా స్వయాన్ని వారి సంతానముగా కూడా భావించరు. మనం ఆ తండ్రిని తెలుసుకున్నాము కావున వారిని స్మృతి చేస్తాము. వారు ఆత్మలందరికీ అనంతమైన తండ్రి. ఆ నిరాకారుడు ఈ సాకార ప్రజాపిత ద్వారా రచనను రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు, బ్రాహ్మణ, బ్రాహ్మణీలు కూడా ఉన్నారు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మాకు తండ్రి పరమపితయే అవుతారు, వారిని రచయిత అని అంటారు. ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే భగవంతుడిని అర్థం చేసుకుంటారో, అప్పుడు మిగలినవి అర్థం చేసుకోగలుగుతారు. భగవంతుని గురించి అర్థం చేసుకోకుండా ఇంకేమీ అర్థం చేసుకోలేరు. అది కూడా ఎలా అర్థం చేయించాలంటే – వీరు అర్థం చేయించేది చాలా ఏక్యురేట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది అని మనుష్యులు భావించాలి. ఆ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అని, మరి తప్పకుండా నరకానికి కూడా ఎవరో రచయిత ఉంటారు అని – ఈ విధముగా ఎవరూ అర్థం చేయించరు. పావనంగా తయారుచేసేవారు ఒక్క తండ్రియే, కావున తప్పకుండా పతితముగా తయారుచేసేవారు కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఇది బాగా అర్థం చేయించాలి. మనం స్మృతి చేసే ఆ తండ్రి ఎవరో తెలియజేయాలి. రావణుడినైతే తలచుకోరు. మనుష్యులకు పావనంగా తయారుచేసే రాముడైన పరమాత్మ గురించి కూడా తెలియదు, అలాగే పతితముగా తయారుచేసే రావణుడి గురించి కూడా తెలియదు, పూర్తిగా అజ్ఞానములో ఉన్నారు. ఫారం నింపే సమయంలో కూడా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీ ఆత్మకు తండ్రి ఎవరు – ఈ ప్రశ్నను ఇంకెవ్వరూ అడగలేరు. ఆత్మ ప్రతి మనిషిలోనూ ఉంది. జీవాత్మ, పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు కదా. పుణ్యాత్ములుగా తండ్రియే తయారుచేస్తారు, మరి వీరిని పాపాత్ములుగా ఎవరు తయారుచేస్తారు? ఇది తప్పకుండా అర్థం చేయించాల్సి ఉంటుంది. స్వర్గ రచయిత అయిన తండ్రికి మనమందరమూ పిల్లలము, వారి గురించి మీకు తెలుసా? వారు తప్పకుండా పావన ప్రపంచాన్నే రచిస్తూ ఉండవచ్చు కదా? ఇప్పుడు ఇది పతిత ప్రపంచము, అందుకే మనుష్యులందరూ హే పతిత పావనా రండి అని గానం చేస్తూ ఉంటారు. ఇంతమంది పతిత మనుష్యులను పావనులుగా ఎవరు తయారుచేస్తారు? వారు సర్వవ్యాపి అయినట్లయితే పరమపిత పరమాత్మా రండి అని పిలిచే విషయమే ఉండదు. వారు సర్వవ్యాపి అయినట్లయితే వారిని స్మృతి చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మేము మీకు చాలా మంచి సలహాను ఇస్తాము. బ్రహ్మా ఇచ్చే సలహా ఎంతో ప్రసిద్ధమైనది కదా. మనం బ్రహ్మాముఖవంశావళి బ్రాహ్మణ, బ్రాహ్మణీలము. బ్రహ్మాకు కూడా సలహాను ఇచ్చేవారు తప్పకుండా ఉన్నతమైనవారే అయి ఉంటారు. బ్రహ్మా పరమపిత పరమాత్మ అయిన శివునికి సంతానము. వారు ఆత్మలకు తండ్రి. వీరు ప్రజాపిత. పిల్లలైన మీరు సేవ కొరకు ఈ-ఈ విధముగా విచార సాగర మంథనము చేసినట్లయితే మీకు ఎంతో సంతోషము ఉంటుంది. ఎవరైనా వస్తే వారికి జ్ఞాన రత్నాలను ఇవ్వాలి. తండ్రి వచ్చి అవినాశీ జ్ఞాన రత్నాలను ఏరుకునేలా చేస్తారు, దాని ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. మళ్ళీ రావణుడు వచ్చి రేగు పళ్ళు ఏరుకునేలా చేస్తాడు. శివుని చిత్రము, దేవతల చిత్రాలు అన్నీ రాతితోనే తయారుచేయబడతాయి. రాతిని పూజిస్తూ-పూజిస్తూ రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. శివునిది కూడా రాతి చిత్రమే. తప్పకుండా ఏదో సమయంలో శివబాబా చైతన్యములోకి వచ్చి చదివిస్తూ ఉండవచ్చు. ప్రజాపిత బ్రహ్మా కూడా ఉంటారు. బ్రహ్మాకుమారి సరస్వతి కూడా ఉంటారు. ఇప్పుడు వారు ప్రత్యక్షముగా ఉన్నారు. సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారు అని వీరి గురించే గాయనము ఉంది. వీరు అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేసే జ్ఞాన దేవి. వారు దానికి గుర్తుగా సరస్వతికి వీణను చూపించారు. ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి. ఎవరైతే భాషణ చేయాల్సి ఉంటుందో వారు విచార సాగర మంథనము చేయాల్సి ఉంటుంది. మొదట భాషణను వ్రాసుకొని ఆ తర్వాత రిఫైన్ చేయాలి. గొప్ప-గొప్ప వక్తలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. చాలా ఏక్యురేట్ గా వినిపిస్తారు. కొద్దిగా జంకినా పరువుపోతుంది. ముందు నుండే పూర్తి ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ కూడా ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వగిలిగేంతగా బుద్ధిలో ఉండాలి. సేవ చేయాలి. వికారీ గురువుల సంకెళ్ళలో ఎంతోమంది చిక్కుకొని ఉన్నారు. వారు ఎవరి సద్గతినీ చేయలేరు. పతిత-పావనుడు అని నిరాకారుడైన భగవంతుడినే అంటారు. సర్వవ్యాపి జ్ఞానము ద్వారా ఎవరి సద్గతీ జరగలేదు. పతిత-పావనుడు ఒక్క శివబాబాయే, వారినే రుద్రుడు అని కూడా అంటారు. రుద్ర యజ్ఞము కూడా ఎంతో ప్రసిద్ధమైనది. ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇంకెవ్వరూ రచించలేరు. రుద్ర జ్ఞాన యజ్ఞము ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది? జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉంటారు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో శాస్త్రాలను కూడా ఉంచుతారు. రామాయణము, భాగవతము మొదలైన కథలను వినిపిస్తారు, దానిని రుద్ర యజ్ఞము అని అంటారు. నిజానికి రుద్ర యజ్ఞము ఇదే. ఈ యజ్ఞమైతే ఎంతోకాలం కొనసాగుతుంది. వారి యజ్ఞము ఎక్కువలో ఎక్కువ ఒక నెల జరుగుతుంది. కానీ ఇది ఎంత సమయం కొనసాగుతుందో చూడండి. ఇందులో పురాతన వస్తువులేవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమవ్వనున్నాయి. ఈ పురాతన ప్రపంచమంతా ఇందులో భస్మమవ్వనున్నది. ఇది ఎంత పెద్ద యజ్ఞము, ఆలోచించండి. ఎప్పుడైతే అందరి శరీరాలు స్వాహా అవుతాయో, అప్పుడు ఆత్మలందరూ తిరిగి పరంధామానికి వెళ్తారు. ఎప్పటివరకైతే తండ్రి రారో అప్పటివరకు పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వగలరు, మాయ సంకెళ్ళ నుండి ఎవరు విముక్తులుగా చేస్తారు? ఎవరో ఒకరు ఉండాలి కదా, కావుననే స్వయంగా ఆ యాజమానియే వస్తారు. వారు సర్వవ్యాపిగా కూర్చొని జ్ఞానాన్ని ఇవ్వరు, వారు స్వయంగా వస్తారు. మేము వారి సంతానము, మనవలము. నిజానికి మీరు కూడా అంతే. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు, తమ పరిచయాన్ని ఇస్తున్నారు. స్వర్గ స్థాపన జరుగుతోంది. మనము రాజయోగ ఋషులము, వారు హఠయోగ ఋషులు. ఈ విషయంపై బహుశా ఒక కథ కూడా వినిపిస్తారు – ఫలానా ఋషి బరువు ఎక్కువ ఉందా లేక రాజఋషి బరువు ఎక్కువ ఉందా అని. అవనీ భక్తి మార్గానికి చెందిన విషయాలు మరియు ఇది జ్ఞాన మార్గము. భక్తి మరియు జ్ఞానము యొక్క తూకము గురించి ఒక కథ ఉంది. ఒక వైపు అన్నీ భక్తికి చెందిన శాస్త్రాలు ఉన్నాయి మరియు ఇంకొక వైపు ఒక్క జ్ఞానం యొక్క గీత ఉంది. అప్పుడు గీతయే బరువుగా ఉంటుంది. గీత రాజఋషులకు చెందినది, హఠయోగులవైతే అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఒక వైపు వాటన్నింటినీ పెట్టండి, ఇంకొక వైపు గీతను పెట్టండి. నిజానికి అది కూడా మనదేమీ కాదు. మనదైతే ఒక్క జ్ఞానము విషయమే. గీతా భగవానుడు సద్గతిని కలిగించడానికే వస్తారు. కావున పిల్లల బుద్ధిలో ఇవన్నీ ఉండాలి. ఆ తర్వాత ఇక ఎవరైనా అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా మన కర్తవ్యం ప్రతి ఒక్కరికీ అర్థం చేయించడము. మృత్యువు సమయంలో అందరి కళ్ళూ తెరుచుకుంటాయి. ఈ జ్ఞాన యజ్ఞము ద్వారానే ఈ వినాశ జ్వాల వెలువడింది. ఇప్పుడు పాండవులైన మీ పతి స్వయంగా పరమపిత పరమాత్మయే. పతితులను పావనులుగా తయారుచేసేవారు ఒక్క పరమాత్మయే, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. వారు యువరాజు. వారిని ఎవరూ గాడ్ ఫాదర్ అని అనరు. ఎప్పుడైతే పిల్లలకు జన్మనిస్తారో, అప్పుడు ఫాదర్ అని అంటారు. శ్రీకృష్ణుడు స్వయమే ఒక బాలుడు కావున వారిని తండ్రి అని ఎలా అనగలరు. ఇది నియమ విరుద్ధము. శ్రీకృష్ణునితో పాటు మరి జోడి కూడా కావాలి, వారికి పిల్లలు ఉండాలి, అప్పుడే వారిని ఫాదర్ అని అనగలరు. అలాగైతే వారు గృహస్థునిగా అయినట్లు. ఇక్కడైతే నిరాకారుడైన తండ్రి కూర్చొని జ్ఞానాన్ని ఇస్తారు. వారెప్పుడూ గృహస్థములోకి రారు, సదా పవిత్రముగా ఉంటారు. శ్రీకృష్ణుడైతే తల్లి గర్భము నుండి జన్మ తీసుకుంటారు కావున వారిని పతితపావనుడు అని ఎలా అంటారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా తనువులోకే రావాల్సి ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి కదా. అందుకే వీరికి బ్రహ్మా అన్న పేరును పెట్టి, నేను ఈ సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని చెప్తారు. వీరు 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు మరియు వీరు వానప్రస్థావస్థలో ఉన్న పూర్తి అనుభవీ రథము. అర్జునుడి విషయంలో కూడా – వారు ఎంతోమంది గురువుల వద్దకు వెళ్ళినట్లుగా, శాస్త్రాలు మొదలైనవి చదివినట్లుగా చెప్తారు కదా కావున అర్థం చేయించడం కూడా ఆ విధంగానే అర్థం చేయించాలి. ప్రజాపిత బ్రహ్మా అన్న పేరును ఎప్పుడైనా విన్నారా? బ్రహ్మా ఉన్నారంటే తప్పకుండా మొదట బ్రాహ్మణులు ఉండాలి. వర్ణాలు కూడా ముఖ్యమైనవి. చక్రములో కూడా వర్ణాలను చూపిస్తారు. బ్రాహ్మణ కులము అన్నింటికన్నా చిన్నది. వారు జ్ఞానము తీసుకునే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. బ్రాహ్మణులు ఎంత తక్కువమంది ఉంటారు. ఆ తర్వాత వారికన్నా ఎక్కువగా దేవతలు, వారికన్నా ఎక్కువగా క్షత్రియులు, వారికన్నా ఎక్కువగా వైశ్యులు, శూద్రులు ఉంటారు. కావున బ్రాహ్మణులైన మీరు ఎంత తక్కువమంది ఉన్నారు. వీరిలో కూడా ఎవరికైతే ఎల్లప్పుడూ సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉంటుందో, వారు చాలా తక్కువగా ఉన్నారు. అమృతవేళలో సంతోషపు పాదరసము పైకెక్కుతుందని తండ్రి అర్థం చేయించారు. పగలుపూట మరియు రాత్రివేళ వాయుమండలము చాలా అశుద్ధముగా ఉంటుంది, ఆ సమయంలో స్మృతి కష్టంగా ఉంటుంది. అమృతవేళ సమయం గాయనం చేయబడింది. ఆ సమయంలోనే ఆత్మలందరూ అలసిపోయి శరీరము నుండి అతీతమై విశ్రాంతి తీసుకుంటారు. అది శుభ ముహూర్తము. నిజానికి తండ్రి స్మృతి నడుస్తూ-తిరుగుతూ హృదయంలో ఉండాలి. ఇకపోతే హఠముతో ఒకచోట కూర్చొని స్మృతి చేసినట్లయితే అది నిలవదు. ఋషులు, మునులు, భక్తులు మొదలైనవారు కూడా అమృతవేళ లేచి కీర్తనలు మొదలైనవి చేస్తారు ఎందుకంటే ఆ సమయంలో శుద్ధమైన వాయుమండలం ఉంటుంది. కావున ఎవరైనా వస్తే వారికి – మేము చదువుకుంటున్నాము అని అర్థం చేయించాలి. ఇందులో అంధవిశ్వాసం యొక్క విషయమేమీ లేదు. నిరాకారుడైన తండ్రి, టీచర్ రూపములో మాకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని చెప్పండి. అప్పుడు – వీరికి నిరాకారుడు ఎలా చదివిస్తున్నారు అని మనుష్యులు ఆశ్చర్యపోతారు. భగవానువాచ అని కూడా తప్పకుండా ఉంది, కావున తప్పకుండా శరీరములోకి వచ్చే రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. ఎవరో ఒకరి శరీరాన్ని అద్దెకు తీసుకొని ఉంటారు కావున మొదట యుక్తిగా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. సర్వవ్యాపి అని అన్నట్లయితే వారసత్వము ఏమి లభిస్తుంది. ఎప్పటివరకైతే భగవంతుని మహావాక్యాలు చెవిలో పడవో అప్పటివరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడు నిరాకారుడు, బ్రహ్మా సాకార ప్రజాపిత, మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. నిరాకార పరమాత్మ బ్రహ్మా తనువు ద్వారా చదివిస్తారు. మన లక్ష్యము మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము. తండ్రి పరిచయము ఇచ్చినట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది. కొందరు భగవంతుడు నిరాకారుడు అని వ్రాస్తారు, అటువంటివారికి అర్థం చేయించాలి. కొందరేమో మాకు తెలియనే తెలియదు అని వ్రాస్తారు. అరే, మీకు తండ్రి గురించి తెలియదా? పరమపిత పరమాత్మ అని అంటున్నారంటే తప్పకుండా వారెవరో ఉంటారు కదా! తాము పరమపిత పరమాత్మ నుండి భవిష్య జన్మ-జన్మాంతరాల కొరకు జీవనోపాధిని పొందుతున్నామని పిల్లలకు తెలుసు. ఇందులో ఎవరైతే విఘ్నాలను కలిగిస్తారో వారికి ఎంత పాపం కలుగుతుంది. అది కూడా తెలిసి విఘ్నాలు కలిగిస్తారు. తెలియనివారిపై దోషమేమీ లేదు. ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచమంతా తెలియనివారే కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు… ఈ ఒక్కొక్క పదం యొక్క అర్థం పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట మాత, పిత, ఆ తర్వాత బాప్ దాదా. ఎవరైతే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో వారినే మాత, పిత అని అంటారు. ఆ తర్వాత వీరు బాప్ దాదా, ఆ తర్వాత వీరు జగదాంబ అని అంటారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. అన్నింటికన్నా గుహ్యమైన చిక్కు ప్రశ్న ఇదే, దీనిని అర్థం చేసుకోవడం ద్వారా మనుష్యులకు ఎంతో లాభం కలుగుతుంది. ఆ తర్వాత సికీలధే (చాలాకాలం దూరమై తర్వాత కలిసినవారు) అని అంటారు, ఇది రెండవ చిక్కు ప్రశ్న. ఆ తర్వాత బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు అని అంటారు, ఇది కూడా కొత్త చిక్కు ప్రశ్నయే. ఒక్కొక్క విషయములోనూ చిక్కు ప్రశ్న ఉంది. అచ్ఛా!

స్వదర్శన చక్రధారీ ప్రకాశ రత్నాలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అమృతవేళ యొక్క శుభ ముహూర్తములో తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేస్తూ సంతోషపు పాదరసాన్ని పైకెక్కించుకోవాలి. నడుస్తూ-తిరుగుతూ కూడా స్మృతి యొక్క అభ్యాసము చేయాలి.

2. పాప కర్మల నుండి రక్షించుకునేందుకు మరియు జ్ఞానాన్ని బాగా ధారణ చేసేందుకు ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడించేందుకు కృషి చేయాలి.

వరదానము:-

బిందు రూపములో స్థితులై సారయుక్త, యోగయుక్త, యుక్తియుక్త స్వరూపాన్ని అనుభవం చేసే సదా సమర్థ భవ

ప్రశ్నార్థకమనే వంకర మార్గంలో వెళ్ళేందుకు బదులుగా ప్రతి విషయములోనూ బిందువు పెట్టండి. బిందు రూపములో స్థితులవ్వండి, అప్పుడు సారయుక్త, యోగయుక్త, యుక్తియుక్త స్వరూపాన్ని అనుభవము చేస్తారు. స్మృతి, మాటలు మరియు కర్మలు అన్నీ సమర్థంగా అవుతాయి. బిందువుగా అవ్వకుండా విస్తారములోకి వెళ్ళినట్లయితే ఎందుకు, ఏమిటి అనే వ్యర్థమైన మాటలు మరియు కర్మలలో సమయాన్ని, శక్తులను వ్యర్థం చేసుకుంటారు ఎందుకంటే అక్కడ అడవి నుండి బయట పడాల్సి ఉంటుంది, అందుకే బిందు రూపములో స్థితులై సర్వ కర్మేంద్రియాలను ఆర్డర్ అనుసారముగా నడిపించండి.

స్లోగన్:-

‘‘బాబా’’ అనే పదము యొక్క డైమండ్ తాళంచెవి తోడుగా ఉన్నట్లయితే సర్వ ఖజానాల అనుభూతి కలుగుతూ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top