TELUGU MURLI 17-03-2023

  17-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి సమానముగా దయార్ద్ర హృదయులుగా అయి ప్రతి ఒక్కరికి ప్రాణదానాన్ని ఇవ్వాలి, అనేకమంది మనుష్యుల సౌభాగ్యము తయారయ్యేలాంటి ఏర్పాట్లు చేయాలి’’

ప్రశ్న:-

ఈ సమయములో ప్రపంచములోని మనుష్యులు ప్రతి ఒక్కరు పేదవారిగా ఉన్నారు, అందుకే వారికి ఏ సౌకర్యాలు మీరు ఇవ్వాలి

జవాబు:-

మీ వద్ద అవినాశీ జ్ఞాన రత్నాల రూపీ రోటీలు ఏవైతే ఉన్నాయో, వాటిని తీసుకునేందుకు వస్తారు, మీరు చాలా ప్రేమతో వారి జోలిని నింపాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ ప్రేమతో నడిపించాలి, ఎవ్వరూ అలగకూడదు. మీ వద్దకు చాలామంది మనుష్యులు తమ ప్రాణదానము తీసుకునేందుకు వస్తారు, అందుకే భండారాలను తెరుస్తూ వెళ్ళండి. వారిని భాగ్యశాలురుగా తయారుచేసేందుకు మీ ద్వారము ఎల్లప్పుడూ తెరవబడే ఉండాలి. ఒకవేళ ప్రాణదానము ఇచ్చేందుకు బదులుగా కాలదన్నినట్లయితే ఇది చాలా పెద్ద పాపము.

పాట:-

బాల్యపు రోజులు మర్చిపోకూడదు…(బచ్పన్ కే దిన్ భులా నా దేనా…)

ఓంశాంతి.

పిల్లలు పాటను విన్నారు. అనంతమైన తండ్రి అయిన శివ పరమాత్మ బ్రహ్మా తనువు ద్వారా కూర్చుని అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీరు తల్లిదండ్రులకు చెందినవారిగా అయ్యారు, ఈ బాల్యాన్ని మర్చిపోకండి. ఆ లౌకిక బాల్యాన్ని అయితే ఎప్పుడూ మర్చిపోవడము జరగదు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలుంటారు. తల్లిదండ్రులను తెలుసుకుంటూ పెద్దవారవుతూ ఉంటారు. తల్లిదండ్రుల కర్తవ్యము మొదలైనవి వారికి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీరు నిరాకార తండ్రికి పిల్లలుగా అయ్యారు. తండ్రి భండారము, అవినాశీ జ్ఞాన రత్నాలను దానమిస్తూ ఉంటారు. మీరు భవిష్య 21 జన్మల కోసం అవినాశీ జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులను మర్చిపోతే జోలి మళ్ళీ ఖాళీ అయిపోతుంది. పిల్లలైన మీరు ఇక్కడ మీ జీవితాన్ని ఉన్నతంగా తయారుచేసుకుంటున్నారు. చాలా భారీ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడికి మీరు తండ్రి వద్దకు చాలా ధనవంతులుగా అయ్యేందుకు వస్తారు. పేదవారి నుండి షావుకార్లుగా అయ్యేందుకు వస్తారు, అందరూ పేదవారుగానే ఉన్నారు. పేదవారు, తమ బ్రతుకు తెరువును తయారుచేసుకునేందుకు లేక 21 జన్మల కోసం తమ అధికారాన్ని అనగా వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. కావున వారు అవినాశీ జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పిల్లలైన మీరు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలి ఎందుకంటే ఈ ఖజానా మరెక్కడా అయితే లభించదు. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ ప్రేమతో నడిపించాలి, ఎవ్వరూ అలగకూడదు మరియు అవినాశీ జ్ఞాన రత్నాల రూపీ రోటీని తీసుకునేందుకు వస్తే వారి జోలిని నింపాలి. కాలదన్నకూడదు. తండ్రి వద్దకు పిల్లలు భండారమును నిండుగా చేసుకునేందుకే వస్తారు. పేదవారికి దానము లభిస్తే ఎంతగా సంతోషిస్తారు. కొందరు పిసినారులుగా ఉంటారు, వారైతే పేదవారిని కాలదన్నుతారు. ఎవరైతే ధర్మాత్ములు, దయార్ద్ర హృదయులుగా ఉంటారో, వారు పిలిచైనా సరే ఏదో ఒకటి ఇచ్చేస్తారు. పిల్లలైన మీకు తెలుసు, ఈ సమయములో ప్రపంచములోని అందరూ పేదవారుగా ఉన్నారు. స్థూల ధనము ఉండి ఉండవచ్చు కానీ వారు కూడా అందరూ నిరుపేదగా అయ్యేవారే. ధనము అందరిది మట్టిలో కలిసిపోనున్నది. ఆ ధనం యొక్క నషా ఉన్న కారణంగా ఈ జ్ఞాన రత్నాల ఖజానాను తీసుకోవడము అనేది వారికి చాలా కఠినము. తండ్రి అయితే ఉన్నదే పేదల-పెన్నిధి, ఎవరైతే పిల్లలుగా అవుతారో, అందులో స్వంత పిల్లలు వస్తారు లేదా సవతి పిల్లలు వస్తారు – తండ్రి ద్వారా తమ ఉన్నతమైన జీవితాన్ని తయారుచేసుకునేందుకు, 21 జన్మల కోసం నిరుపేదల నుండి షావుకార్లుగా అయ్యేందుకు వస్తారు. సత్యయుగములోనైతే చాలామంది షావుకార్లు ఉంటారు. పేదవారు కూడా నంబరువారుగా ఉంటారు కానీ గుడిసెలలో ఉండాల్సి వచ్చేటువంటి పేదవారు ఉండరు. ఇక్కడైతే ఎంత మురికిలో ఉంటారు. అక్కడ ఇటువంటి విషయం ఉండదు.

కావున మీ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో, బ్రహ్మాకుమారులు కుమారీలు ఉన్నారో, వారి వద్దకు చాలామంది మనుష్యులు, తమ ప్రాణదానము తీసుకునేందుకు వస్తారు. పిల్లలైన మీరు ప్రాణదానము ఇచ్చేందుకు భండారాలను తెరుస్తూ ఉండండి. ఇది ఎంత పుణ్యము అవుతుంది. ఒకవేళ భండారము తెరచి మళ్ళీ మూసేస్తే, చెప్పండి, ఇంతమంది పరిస్థితి ఏమవుతుంది! దుఃఖితులుగా అవుతారు. పాపము, చాలా దుఃఖితులుగా, నిరుపేదలుగా ఉన్నారని మనకు తెలుసు. ఇక్కడకు వచ్చి భాగ్యశాలురుగా అవుతారు. వారి కోసం సదా ద్వారాలు తెరవబడి ఉండాలి. భవిష్యత్తు 21 జన్మల వారసత్వము లభిస్తుంది. సదా సుఖీగా అవుతారు, కావున ఎంత దానం చేయాలి. శివబాబా, ఏవైతే మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను ఇస్తారో, వాటిని మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి. రాజధాని స్థాపన అవుతూ ఉంది కదా. లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. తండ్రి రాజయోగము నేర్పిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు నేర్పించాలి. చాలామంది మనుష్యులు వచ్చి తమ సౌభాగ్యాన్ని తయారుచేసుకోవాలి – ఇటువంటి ఏర్పాట్లు చేయాలి. అందరికీ ప్రాణదానము ఇవ్వాలి. ఒకవేళ ప్రాణదానము ఇవ్వకుండా కాలదన్నితే చాలా పాపము కలుగుతుంది. చాలా-చాలా ప్రేమతో అర్థము చేయించాలి. మాయ ఎటువంటిది అంటే, పూర్తిగా మూర్ఛితం చేసేస్తుంది. ద్రోహులుగా అయినట్లయితే ముందు కన్నా కూడా నీచంగా అయిపోతారు. ప్రతి ఒక్క సైన్యములో కొందరు ద్రోహులుగా అవుతారు. ఎంతగా గూఢచారితనము చేస్తారు. మీ యుద్ధము ఉన్నదే మాయతో. ఎవరైతే పిల్లలుగా అయి మళ్ళీ మాయ వైపుకు వెళ్ళిపోతారో, వారు ద్రోహులుగా అవుతారు. అనేక మందిని దుఃఖితులుగా చేస్తారు. పాపము, ఎంతమంది అబలలు, కన్యలు, ఖైదీలుగా అయిపోతారు. మన జ్ఞానము శక్తివంతమైనది. తల్లిదండ్రుల వారసత్వమైన విషాన్ని తాగడము, తాగించడము ఇక సమాప్తమైపోతుంది. ఇది చాలా చెడ్డ వ్యాపారము, అందుకే గతించినదేదో గతించిపోయింది. అర్ధకల్పమైతే అందరూ పతితముగా అవుతూ వచ్చారు, ఇప్పుడు తండ్రి అంటారు – పిల్లలూ, వీటి ద్వారా మీకు చాలా చెడు గతి ఏర్పడింది. ఇప్పుడు ఈ వ్యాపారాలను ఆపేయండి, ఇది పతిత ప్రపంచము, దీనిని ఎవ్వరూ 16 కళా సంపూర్ణ ప్రపంచము, సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము అనైతే అనరు. సూర్యవంశీయులు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు. రామ-సీతలను కూడా చంద్రవంశీయులు, క్షత్రియులు అని అంటారు. మనుష్యులైతే వారిని కూడా భగవంతునిగా భావిస్తారు. పిల్లలైన మీకు తెలుసు, సూర్యవంశీయులకు మరియు చంద్రవంశీయులకు రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు 16 కళా సంపూర్ణులు, కొత్త ప్రపంచానికి యజమానులు, వీరు 14 కళా సంపూర్ణులు, రెండు కళలు తగ్గిపోతాయి. ప్రపంచము కొద్దిగా పాతదిగా అవుతుంది. సూర్యవంశీయుల పేరు ప్రఖ్యాతి చెందింది. పిల్లలు అంటారు కూడా, బాబా, మేమైతే సూర్యవంశీయులుగా అవుతాము. రెండు కళలు కూడా ఎందుకు తగ్గాలి. స్కూలులో ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే తల్లిదండ్రుల పేరును కూడా అప్రతిష్ఠపాలు చేస్తారు. పాస్ అయితే సంతోషిస్తారు. ఫెయిల్ అయితే మనసు గాభరా పడుతుంది. కొందరైతే నీటిలో దూకి మరణిస్తారు. ఎవరైతే పూర్తిగా పాస్ అవుతారో, వారు సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల వంశంలోకి వెళ్తారు. కల్ప క్రితము కూడా ఇలాగే జరిగింది. సరిగ్గా ఈ సమయంలో తండ్రి వచ్చి మొదట బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేసి కూర్చుని వారిని చదివిస్తారు, వారే మళ్ళీ సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు, ఇందులో చదవాలి మరియు చదివించాలి. లేదంటే చదువుకున్నవారి ఎదురుగా మళ్ళీ సేవలు చేస్తారు. ఇక్కడ మీ ముందు లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. ఇక్కడ అంధ విశ్వాసం ఉండజాలదు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాఠశాలలో చదువుకుంటున్నామని అర్థము చేయించబడుతుంది. సాక్షాత్కారం కూడా చేసుకున్నారు, అందుకే, మేము లక్ష్మీ-నారాయణులుగా అవుతామని అంటారు. ఊరికే అలా ఏమైనా అవుతారా. తండ్రి తప్ప ఎవ్వరూ అలా తయారుచేయలేరు. ఆ గీతను వినిపించేవారు కూడా ఎవ్వరూ ఇలా అనరు, మేము రాజులకే రాజులుగా తయారుచేస్తాము అని. మన్మనాభవ, నా పిల్లలుగా అవ్వండి. ఈ విధంగా ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ మాత్రమే అనగలరు. స్వయాన్ని ఎవ్వరూ ప్రజాపిత బ్రహ్మా అని కూడా పిలుచుకోలేరు. అసత్యపు వేషాలు ఎన్ని వేసుకున్నా కానీ ఈ విషయాలను అర్థం చేయించలేరు. వీటిని శివబాబాయే అర్థం చేయిస్తారు. మనుష్యులు మన్మనాభవ అని ఏమైనా అంటారా, వారు కల్పము ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చక్రం యొక్క రహస్యాన్ని ఏమైనా అర్థం చేయిస్తారా. చక్రము ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు చాలా జ్ఞానం లభిస్తుంది. మంద బుద్ధిగలవారు ఇంతగా చదువుకోలేరు. పరీక్ష చాలా కఠినమైనది. ఐ.సి.యస్. పరీక్షలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే సాహసం చేస్తారు. గవర్నమెంట్ కూడా, పరీక్షలు కఠినంగా ఉంటే తక్కువమంది పాస్ అవుతారని భావిస్తుంది. ఇక్కడ కూడా లిమిట్ ఉంది. 8 మంది నంబరువన్ లోకి వెళ్తారు, తర్వాత 108 మంది. ఈ సమయములో భారతవాసులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందులో కూడా దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో, వారు వెలువడుతారు. 33 కోట్ల దేవతలు గాయనము చేయబడతారు. అందులో 8 మంది నంబరువన్ సూర్యవంశీయులుగా అవుతారు. రాకుమారులు, రాకుమార్తెలు కూడా చాలామంది ఉంటారు కదా. ఇది చాలా పెద్ద భారీ పరీక్ష. 8 మంది విజయ మాలలో మణులుగా అవుతారు. ఇందులో కూడా ఒకరైతే మమ్మా కుమారి మరియు వీరు వృద్ధుడు. మమ్మా యువ అవస్థలో ఉన్నారు. బాగా చదువుకొని పదవిని పొందుతారు. వీరు కూడా వృద్ధాప్యంలో చదువుకొని పరీక్ష అయితే పాస్ అవుతారు కదా. తండ్రి నుండి వారసత్వం తీసుకోవడములో శ్రమించే విషయము ఉంది. పిల్లలైన మిమ్మల్ని భగవంతుడు చదివిస్తారు, ఇదైతే ఎంతో భాగ్యము యొక్క విషయము, మీరు భగవంతునికి చెందినవారిగా అయి, మళ్ళీ వారి సేవలో నిమగ్నమై ఉన్నారు. సింధ్ లో మీరందరూ వచ్చారు, తర్వాత వారిలో ఎంతమంది పడిపోయారు. ఇకపోతే, ఎవరైతే చురుకుగా ఉన్నారో వారిదైతే అద్భుతము. ఎంతమందిని తమ సమానంగా తయారుచేస్తున్నారు. కావున అభినందనలు ఇవ్వవలసి ఉంటుంది కదా. భట్టి ద్వారా నంబరువారుగా 300 మంది వెలువడ్డారు. ఇప్పుడైతే వేలమంది అయిపోయారు. కొత్త-కొత్త సెంటర్లు తెరుస్తూ వెళ్తారు. ఎంతమంది మనుష్యులు వచ్చి తమ జీవితాలను వజ్ర సమానంగా చేసుకుంటారు. మీరు తయారై మళ్ళీ ఇతరులను తయారుచేయాలి. వాడిపోయినవారిని స్పృహలోకి తీసుకురావాలి. చాలా ప్రేమతో ఒక్కొక్కరికి చేయి అందించడము జరుగుతుంది, పాపం, ఎక్కడా వారు కాలు జారకూడదు. సెంటర్లు ఎంత ఎక్కువగా ఉంటాయో, అంత ఎక్కువమంది వచ్చి ప్రాణదానము పొందుతారు. పావనమైన వజ్రం వంటి జీవితాన్ని తయారుచేసుకుంటారు. ఇప్పుడైతే పతితముగా, గవ్వ సమానంగా ఉన్నారు. కావున తండ్రి అంటారు, పురుషార్థం చేసి సూర్యవంశములోకి వచ్చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బ్రహ్మా, విష్ణు, శంకరులను స్మృతి చేయండి అని అనరు. చాలామంది మనుష్యులు అడుగుతారు, శంకరుని పాత్ర ఏమిటి? ప్రేరణ ద్వారా వినాశనం ఎలా చేయిస్తారు? చెప్పండి, ఇదైతే గాయనం చేయబడింది, చిత్రాలు కూడా ఉన్నాయి. దీని గురించి అర్థం చేయించడము జరుగుతుంది – వాస్తవానికి మీకు ఈ విషయాలకు ఎటువంటి కనెక్షన్ లేదు. మొదట అయితే మేము తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని అర్థము చేసుకోండి. మన్మనాభవగా అవ్వండి. శంకరుడు ఏం చేస్తారు, ఫలానావారు ఏం చేస్తారు, ఇందులోకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి. మీరు కేవలం రెండు పదాలను పట్టుకోండి – తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తే రాజధాని లభిస్తుంది. ఇకపోతే, శంకరుని మెడలో సర్పము ఎందుకు చూపించారు, యోగములో ఇలా ఎందుకు కూర్చుంటారు… ఈ విషయాలతో ఎటువంటి కనెక్షన్ లేదు. ముఖ్యమైన విషయమే, తండ్రిని స్మృతి చేయడము. ఇకపోతే, ఇలాంటి-ఇలాంటి ప్రశ్నలైతే చాలా అడుగుతారు, దీని వలన మీకు లాభమేముంది. మీరు అన్ని విషయాలను మర్చిపోండి.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మనం తండ్రి సందేశాన్ని ఇస్తాము. స్మృతి చేయకపోతే వికర్మాజీతులుగా అవ్వరు, మరి జ్ఞాన ధారణ ఎలా జరుగుతుంది. ఎవరైనా తప్పుడు ప్రశ్నలు అడిగితే చెప్పండి, మొదట జ్ఞానాన్ని అయితే అర్థం చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మిగిలిన విషయాలన్నింటినీ విడిచిపెట్టండి. మున్ముందు అర్థం చేసుకుంటూ ఉంటారు. వారసత్వాన్ని తీసుకునే ధైర్యం చూపించండి. మేము తండ్రి సందేశాన్ని ఇస్తాము, ఇక చేయడము, చేయకపోవడము, మీ ఇష్టము. తండ్రి వద్ద పవిత్రముగా అయినట్లయితే మళ్ళీ కొత్త పావన ప్రపంచములో ఉన్నత పదవిని ఇప్పిస్తారు. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి, అంతే. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో, వారే విజయ మాలలో కూర్చబడతారు, ఇక ఏ జప-తపాదులు మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు, వీటన్నింటి నుండి విడిపిస్తారు. ద్వాపరము నుండి మొదలుకొని హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ వారసత్వాన్ని అయితే తీసుకుంటారో, అది 21 జన్మల కోసం అవినాశీగా అయిపోతుంది. మేము ఈ వారసత్వాన్ని ఎలా పొందాము లేక ఇది అవినాశీ వారసత్వము అని అక్కడ మీకు ఎవ్వరికీ తెలియదు. మీకు ఇప్పుడు తెలుసు, మనం 21 జన్మలు రాజ్య-భాగ్యము చేస్తాము. అక్కడైతే సుఖము యొక్క ఆనందమే ఉంటుంది. వారసత్వము ప్రతి ఒక్కరు తండ్రి నుండే తీసుకోవాలని మనుష్యులు భావిస్తారు. కానీ అక్కడ మీ ఇప్పటి పురుషార్థము యొక్క ప్రారబ్ధం ఉంటుంది, అది 21 జన్మలు కొనసాగుతుంది. అంతేకానీ, ఆ సమయంలో ఏమైనా మంచి కర్మలు చేస్తారని కాదు. ఇక్కడైతే ఎటువంటి మంచి కర్మలు నేర్చుకుంటారంటే, జన్మ-జన్మలు మళ్ళీ మీరు రాజ్యంలోకి వస్తారు. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు – ఒకటైతే, పవిత్రముగా అవ్వండి మరియు నన్ను స్మృతి చేయండి. కానీ మాయ మరపింపజేస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది స్మృతి చేయడము వలన మనం చక్రవర్తీ రాజా-రాణిగా అవుతాము. ఇది ఎంత సహజమైన విషయము. కన్యల కోసమైతే అందరికన్నా సహజము. అదర్ కుమారీలకు మళ్ళీ మెట్లు దిగడంతో శ్రమ అనిపిస్తుంది. అక్కడక్కడ కుమారీలు ఎక్కువగా వెలువడుతారు. ఈ సమయములో వివాహము చేసుకోవడమైతే పూర్తిగా నాశనమవ్వడము. ఇక్కడ ప్రియుడైన శివునితో నిశ్చితార్థము చేసుకుంటే స్వర్గములో పూర్తిగా సుసంపన్నమవుతారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు, దీనితో ఏం ఫలం లభిస్తుంది? మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది సత్యమైన సంపాదన. బ్రాహ్మణులైన మీరు చేతులు నింపుకొని వెళ్తారు. ఇది మీ సత్యమైన సంపాదన. మిగిలినవారందరిది అసత్యమైన సంపాదన, కావున చేతులు ఖాళీ అయిపోతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే… చూడండి, సికీలధే అన్న పదానికి అర్థము ఎంత బాగుంది. ఈ విధంగా ఇతరులెవ్వరూ అనలేరు. చాలా ప్రేమగా కలుసుకుంటారు. ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు… మీరు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు, వీరిని అనంతమైన సికీలధే పిల్లలు అని అంటారు. తప్పకుండా ఇప్పుడు కల్పము యొక్క సంగమములో తండ్రిని వచ్చి కలుసుకున్నారు. మళ్ళీ భిన్న నామ-రూపాలతో కలుసుకుంటారు. ఎవరైతే కల్పక్రితము దీనిని చదివారో, వారిని మాత్రమే బాబా చదివిస్తారు, మళ్ళీ కల్ప-కల్పము చదువుకుంటూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే స్వదర్శన చక్రధారీ పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వాడిపోయినటువంటి వారిని మేల్కొలపాలి. ప్రేమతో ఒక్కొక్కరిని సంభాళించాలి. ఏ కారణము చేత ఎవరూ కాలు జారకూడదు – ఈ అటెన్షన్ పెట్టాలి.

2. పావన ప్రపంచములో ఉన్నత పదవిని పొందేందుకు ఇతర ప్రశ్నలన్నింటినీ విడిచి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. చాలామందికి ప్రాణదానము ఇచ్చే సేవ చేయాలి.

వరదానము:-

బిందువు మాత్ర యొక్క మహత్వాన్ని తెలుసుకొని గడిచినదానికి బిందువు పెట్టే సహజయోగీ భవ

అన్నింటికన్నా సరళమైన మాత్ర బిందువు. బాప్ దాదా కేవలం బిందువు యొక్క లెక్కను చెప్తారు. స్వయము కూడా బిందువు రూపముగా అవ్వండి, స్మృతి కూడా బిందువును చేయండి మరియు డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని తెలుసుకొని చేసిన తర్వాత బిందువు మాత్రను పెట్టండి. ఈ బిందువు మాత్ర యొక్క మహత్వాన్ని తెలుసుకొని గతించినదానికి బిందువు పెట్టండి, బిందువుగా అయిపోండి, అప్పుడు సహజయోగిగా అవుతారు. వాస్తవానికి ఇప్పుడు బిందువుగా అయి ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో అందరూ బిందువు రూపంలో ఉంటారు, అక్కడ సంకల్పం, కర్మ, సంస్కారం అన్నీ మర్జ్ అయి ఉంటాయి.

స్లోగన్:-

కర్మయోగిగా అయి కర్మ చేస్తూ కూడా ఉపరామ స్థితిలో ఉండడము అనగా ఎగిరే పక్షిగా అవ్వడము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top