TELUGU MURLI 14-03-2023

        14-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – శివబాబా అలౌకిక యాత్రికుడు, వారు మిమ్మల్ని సుందరంగా తయారుచేస్తారు, మీరు ఈ యాత్రికుడిని స్మృతి చేస్తూ-చేస్తూ ఫస్ట్ క్లాస్ గా అవుతారు’’

ప్రశ్న:-

ప్రతి ఈశ్వరీయ విద్యార్థికి సంగమయుగములో ఏ పురుషార్థము చేయమని శ్రేష్ఠ మతము లభిస్తుంది?

జవాబు:-

ఈశ్వరీయ విద్యార్థులకు ఏ శ్రీమతము లభిస్తుందంటే – ఈ సమయములో పావనంగా అయి రాజ్య పదవిని పొందేందుకు పురుషార్థము చేయండి. ప్రతి ఒక్కరూ తమ విషయంలో తాము చింత ఉంచుకొని ఇతరులకు చెప్పండి – అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు ఈ అంతిమ జన్మలో పవిత్రతా రాఖీని కట్టుకోండి, ఈ మృత్యు లోకములో వృద్ధి చేయడం ఆపు చేయండి. తండ్రికి చెందినవారిగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. ఈ సమయములో తండ్రి మతాన్ని అనుసరించి నిర్వికారులుగా అవ్వడం ద్వారా మీరు 21 జన్మలకు నిర్వికారులుగా అవుతారు.

పాట:-

ఓ దూరదేశపు యాత్రికుడా… (ఓ దూర్ కే ముసాఫిర్…)

ఓంశాంతి.

ఈ పాటను అందరూ వింటున్నారు. ఓ దూరదేశపు యాత్రికుడా, మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి. మన ఆ మాతా-పిత దూరదేశంలో ఉండేవారని మీకు తెలుసు. ఈ మాతా-పితలు దగ్గరగా ఉండేవారు. మనుష్యులందరూ ఆ దూరదేశపు యాత్రికుడిని తలచుకుంటారు. దూరదేశపు యాత్రికుడు పరిస్తాన్ ను స్థాపన చేస్తారు, దానిని స్వర్గం అని, హెవెన్ అని అంటారు. నిర్వికారీ ప్రపంచమని అంటారు. అక్కడ దుఃఖము లేనే లేదు. ఓ దూరదేశపు యాత్రికుడా – ఇలా ఎవరు పిలుస్తున్నారు? ఒకవేళ అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే వారు – ఓ పరమాత్మా రండి అని పిలవరు కదా. అందరూ దూరదేశపు యాత్రికులే, అందరూ అక్కడి నుండి ఇక్కడకు ప్రయాణము చేయాల్సిందే. వాస్తవానికి మనుష్యాత్మలందరూ అక్కడ పరంధామములో నివసించేవారు. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఇది చాలా సుదీర్ఘమైన యాత్ర. కానీ ఆత్మ సెకండులో చేరుకుంటుంది. విమానాలు మొదలైనవి కూడా ఇంత వేగంగా వెళ్లలేవు. ఆత్మ అయితే సెకండులోనే సూక్ష్మవతనములోకి, మూలవతనములోకి ఎగిరి వెళ్లిపోతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరములోకి వెళ్ళినా లేక కొత్త ఆత్మలు పై నుండి వచ్చినా, సమయము అంతే పడుతుంది. కొత్త ఆత్మలైతే వస్తూనే ఉంటాయి కదా. వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆత్మ అంత వేగంగా ఇంకెవ్వరూ పరుగు తీయలేరు.

తండ్రి కూడా యాత్ర చేయవలసి ఉంటుందని మీకు తెలుసు. వారు ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్తారు. భగవంతుడు వచ్చి మమ్మల్ని తమ వద్దకు తీసుకువెళ్తారని భక్తులకు కూడా తెలుసు. ఇక్కడకు వచ్చి కలిసినా, అది తిరిగి తీసుకువెళ్ళేందుకే వస్తారు. మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయడానికి రండి అని పాడుతారు కూడా. మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటారు. ఎవరెవరైతే మంచి రీతిగా తండ్రిని తలచుకుంటారో వారే సమీపంగా వస్తారని మీకు తెలుసు. ఆశ్చర్యము కదా. వారే మన తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. లేదంటే తండ్రిని వేరుగా, టీచరును వేరుగా గుర్తు చేయడం జరుగుతుంది. మొత్తం జీవితమంతా తండ్రి కూడా గుర్తుంటారు, టీచరు కూడా గుర్తుంటారు. ఈ రోజుల్లో బాల్యము నుండే గురువులను ఆశ్రయిస్తున్నారు, ఇక ఆ మాతా-పితలను, టీచరును, గురువును తలచుకుంటూ ఉంటారు. తర్వాత ఎప్పుడైతే తమ రచనను రచిస్తారో, అప్పుడు తమ పత్నిని, పిల్లలను కూడా తలచుకోవడం మొదలుపెడతారు. అప్పుడిక మాతా-పిత మొదలైనవారి స్మృతి తగ్గిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు మీకు ఆ ఒక్క యాత్రికుని స్మృతి మాత్రమే ఉంది. ఆత్మ పవిత్రమైనది, ఒకవేళ ఆత్మ కొత్త శరీరము తీసుకుంటే చాలా ఫస్ట్ క్లాస్ శరీరము లభిస్తుంది. పరమాత్మ అంటారు, నాకైతే కొత్త శరీరము లభించదు. నేను మిమ్మల్ని సుందరంగా తయారుచేయడానికి వస్తాను. వైకుంఠములోనైతే అన్ని వస్తువులు సుందరంగానే ఉంటాయి. ఇళ్ళు కూడా వజ్ర-వైఢూర్యాలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ యాత్రికుడు ఎంత అలౌకికమైనవారు. కానీ మీరు పదే-పదే వారిని మర్చిపోతారు ఎందుకంటే ఇప్పుడు మీకు మాయతో యుద్ధము జరుగుతుంది. మాయ మిమ్మల్ని స్మృతి చేయనివ్వదు. తండ్రి అంటారు, మీరు నన్ను ఎందుకు స్మృతి చేయరు? బాబా, ఏమి చేయాలి, పరవశమైపోతున్నాము అనగా మాయకు వశమైపోతున్నాము, మిమ్మల్ని మర్చిపోతే ఇక ఆ సంతోషమే ఉండదు అని అంటారు. రాజు వద్ద జన్మ తీసుకుంటే వారి పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ద్వాపరము యొక్క రాజ్యములో కూడా సుఖ-దుఃఖాలైతే ఉండనే ఉంటాయి. ఎవరైనా కోపగించుకుంటే దుఃఖము కలుగుతుంది. అక్కడ రాజ్యములో కోపము చేయరని కాదు. అప్పుడప్పుడు రాకుమారులు, రాకుమార్తెలను కూడా కోపములో ఏదో ఒకటి అనేస్తారు. కుమారుడు యోగ్యునిగా లేకపోతే ఇక సింహాసనముపై కూర్చోలేరు. ఒకవేళ పెద్ద కుమారుడు యోగ్యునిగా లేకపోతే ఇక చిన్న కుమారుడిని కూర్చోబెడతారు. ఇక్కడ తండ్రి అంటారు, శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. నేను పిల్లలైన మిమ్మల్ని 21 జన్మల కొరకు భారత్ కు రాజులుగా తయారుచేస్తాను. ఈ భారత్ దైవీ రాజ్య స్థానముగా ఉండేది అనగా దేవీ-దేవతల రాజ్యముండేది. ఇది కేవలం బ్రహ్మా ద్వారా ఈశ్వరీయ సంతానంగా అయిన మీకు మాత్రమే తెలుసు.

పిల్లలైన మీకు తండ్రి యొక్క పూర్తి జీవిత చరిత్ర గురించి తెలుసు. ఇక ఇతర మనుష్యులెవ్వరికీ వారి జీవిత చరిత్ర గురించి తెలియదు. మనం గాడ్ ఫాదర్ అని ఎందుకంటాము, ఇది కూడా తెలియదు. వారిని ఎందుకు పిలుస్తారు? మాకు మా వారసత్వాన్ని ఇవ్వండి అని. కానీ అది ఎలా లభిస్తుంది, అది ఎవరికీ తెలియదు. వారసత్వమైతే తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. తండ్రి యాత్రికుడు. ఎవరైతే సుందరంగా ఉండేవారో, వారిని మాయ నల్లగా, గవ్వ సమానంగా చేసేసింది. యాత్రికుడు మరియు హసీనా (అందగత్తె) అనే ఒక కథ కూడా ఉంది. ఈ యాత్రికుడు ఎంతమందిని సుందరంగా తయారుచేస్తారు మరియు ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు! తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. మనము తండ్రికి చెందినవారిగా అయ్యాము, వారు మనల్ని భగవాన్, భగవతీగా చేస్తారు. వారంటున్నారు – మీ ఆత్మ ఛీ-ఛీగా తయారయ్యింది, అందుకే శరీరము కూడా అటువంటిదే లభిస్తుంది. ఇప్పుడు నన్ను స్మృతి చేసి ఆత్మను పవిత్రంగా తయారుచేసుకుంటే ఇక శరీరము కూడా కొత్తది లభిస్తుంది. మీరు సూర్యవంశీ, చంద్రవంశీ మహారాజా-మహారాణిగా ఉండేవారు, ఇప్పుడు మాయ మురికిగా తయారుచేసింది. నన్ను కూడా మర్చిపోయేలా చేసింది. ఇది కూడా ఆటే. ప్రతి యాత్రికుడిని పరిస్తాన్ అనగా స్వర్గానికి యజమానిగా తయారుచేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. కావున వారి మతాన్ని అనుసరించాలి. అంతేకానీ బాప్ దాదా పిల్లల మతాన్ని అనుసరించాల్సిన అవసరము లేదు. అలా కాదు. పిల్లలే వారి శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రికి మన మతాన్ని ఇవ్వకూడదు. బ్రహ్మా మతము ప్రసిద్ధమైనది. వారు జగత్పిత కావున జగన్మాత కూడా అలాగే ఉంటారు. జగదంబ మతము ద్వారా స్వర్గానికి వెళ్ళాలనే అందరి మనోకామనలు పూర్తి అవుతాయి. అంతేకానీ, ఈ జగదంబ కూడా ఎవరైనా మనుష్యుల మతాన్ని అనుసరించాలని కాదు. అలా కాదు. మనుష్యులకు జగదంబ, జగత్పితల మతము గురించి తెలియదు. బ్రహ్మా దిగి వచ్చినా కానీ నీవు బాగుపడవు అని అంటారు. జగదంబ పేరుతో ఎందుకు అనరు? వీరు ఎందుకు పూజించబడతారు మరియు వీరు ఎవరు అన్నది మనుష్యులకు ఏ మాత్రము తెలియదు. ఇది ఇప్పుడు మీకు తెలుసు. చూడండి, మమ్మా అన్ని వైపులకు మతాన్ని ఇచ్చేందుకు వెళ్తారు. ఒక రోజు గవర్నమెంట్ కూడా ఈ మాతా-పితలను తెలుసుకుంటారు. కానీ చివర్లో ఇక టూ లేట్ అవుతుంది. ఈ సమయములో రాజా-రాణుల రాజ్యమైతే లేదు. ఇదంతా డ్రామా రిపీట్ అవుతుందని ప్రపంచానికి తెలియదు. మనము పాత్రధారులమని మనకు ఇంతకుముందు ఏమైనా తెలుసా. అయితే ఆత్మ వివస్త్రగా వస్తుందని, మళ్ళీ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుందని అంటారు. కానీ నంబరువన్ పూజ్యుల నుండి పూజారులుగా ఎవరు అవుతారు అంటూ డ్రామా ఆదిమధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. వారికి ఏమీ తెలియదు.

ఇప్పుడు మీకు తెలుసు, ఈ పరంధామ యాత్రికుడు చాలా అద్భుతమైనవారు, వీరి మహిమ అపారమైనది. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, ఎవరైతే పతితుల నుండి పావనులుగా అవుతారో వారే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మొత్తం ప్రపంచమైతే స్వర్గములోకి రాదు. మొత్తం ప్రపంచము ఏమీ రాజయోగము నేర్చుకోదు. ప్రపంచమంతా పావనంగా అవ్వనున్నది, అందుకే శుభ్రత కావాలి. తర్వాత మీరు పావన ప్రపంచములోకి వచ్చి రాజ్యం చేయాలి, అందుకే మొత్తము ప్రపంచము శుభ్రమైపోతుంది. సత్యయుగములో ఎంత శుభ్రత ఉండేది! బంగారం-వెండి యొక్క మహళ్ళు ఉంటాయి. లెక్కలేనంత బంగారముంటుంది. ఒక కథను కూడా వినిపిస్తారు – సూక్ష్మవతనములో చాలా బంగారం చూసాను – కొద్దిగా తీసుకువెళ్దామని అన్నాను… కానీ ఇక్కడకు ఏమైనా తీసుకురాగలరా. ఇప్పుడు మీరు దివ్యదృష్టితో వైకుంఠాన్ని చూస్తారు, అది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. దాని రచయిత తండ్రి. వారు యజమాని కదా. యజమాని అని నాథుడినే అంటారు. ఎవరైనా అనాథలుగా ఉంటే వీరికి నాథుడెవ్వరూ లేరని అంటారు. నాథుడు లేకపోతే కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు.

మనము పరంధామము నుండి వచ్చామని, మనం పరదేశీయులమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడకు కేవలం పాత్రను అభినయించడానికి వచ్చాము. తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము పతితుల నుండి పావనులుగా అయ్యి ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేస్తున్నాము. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. మనము గాడ్-ఫాదర్లీ స్టూడెంట్స్. వీరు కూడా వింటున్నారు. ఎలాగైతే వీరు పావనముగా అయి రాజ్య పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారో, అలాగే మీరందరూ చేస్తారు. ఓ దూరదేశపు యాత్రికుడా, వచ్చి మమ్మల్ని దుఃఖము నుండి విడిపించండి, సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని అందరూ పిలుస్తారు. పావన ప్రపంచము సత్యయుగము. అది నిర్వికారీ ప్రపంచము, అదే ప్రపంచము మళ్ళీ వికారీ ప్రపంచంగా అయిపోయింది. నిర్వికారీ ప్రపంచములో నిర్వికారులు ఉంటారు. ఇక్కడ అందరూ వికారులు ఉన్నారు, దీని పేరే దుఃఖధామము, నరకము. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తగా తయారుచేస్తారు, పిల్లలైన మీకు మళ్ళీ రాజ్య భాగ్యాన్ని ఇవ్వడము – ఇదే తండ్రి పని. వారిని దూరదేశపు యాత్రికుడు అని అంటారు. ఓ పరమపిత పరమాత్మ అని ఆత్మ వారిని స్మృతి చేస్తుంది. మనం కూడా అక్కడ పరంధామములో పరమపిత వద్ద ఉండేవారమని మీకు తెలుసు. మనం 84 జన్మలు అనుభవించి ఇప్పుడు పతితులుగా అయ్యామని ఈ తండ్రి అర్థం చేయించారు. వారిని పిలుస్తూ ఉంటారు, దూరదేశపు యాత్రికుడా రండి, మేమైతే తమోప్రధానంగా, పతితముగా అయిపోయాము, మీరు వచ్చి మమ్మల్ని సతోప్రధానంగా చేయండి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు, మళ్ళీ సతోప్రధానము నుండి తమోప్రధానంగా అవుతారు. ఆ దూరదేశపు యాత్రికుడు వచ్చి వీరి ద్వారా మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడము కోసం చదివిస్తారు. కావున పురుషార్థము చేయాలి కదా. తండ్రి వచ్చి ప్రవృత్తి మార్గాన్ని తయారుచేస్తారు మరియు వారంటారు – ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ పవిత్రత విషయంలోనే గొడవలు జరుగుతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. పిల్లలైన మీరిప్పుడు శ్రీమతాన్ని అనుసరించాలి. ఇప్పుడు అందరిదీ వినాశ కాలములో విపరీత బుద్ధిగా ఉంది. తండ్రి గురించి తెలియనే తెలియదు, వారి పట్ల ప్రీతి లేదు. పరమాత్మ అయితే సర్వవ్యాపి అని అంటారు. సర్వవ్యాపి అనడం వలన ప్రీతి ఏమాత్రం మిగల్లేదు.

ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు – మేము అందరి నుండి ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడిస్తాము కావున తప్పకుండా వారి నుండి వారసత్వాన్ని పొందుతాము. తండ్రి అంటారు – గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ ఒకవేళ పరిస్తాన్ యొక్క దేవకన్యలుగా అవ్వాలంటే నిర్వికారులుగా అవ్వండి. లేదంటే అక్కడ జన్మ ఎలా లభిస్తుంది? ఇది వికారీ ప్రపంచము, నరకము. నిర్వికారీ ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. సృష్టి అయితే అదే, కేవలం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతుంది. ఇప్పుడు తండ్రి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయడానికి వచ్చారు కావున తప్పకుండా వారి మతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. శ్రీమతము గాయనము చేయబడింది. భగవంతుడు అంటారు – పిల్లలూ, నేను మిమ్మల్ని ఇటువంటి భగవతీ-భగవానులుగా తయారుచేస్తాను. వాస్తవానికి దేవీ-దేవతలైన మిమ్మల్ని భగవతీ-భగవాన్ అని అనలేరు, ఈ సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలనే అంటారు, భగవంతుడు అని అనరు. అన్నిటికన్నా ఉన్నతమైనది మూలవతనము, రెండవ నంబరులో సూక్ష్మవతనము. ఈ స్థూలవతనమైతే మూడవ నంబరులో ఉంది. ఇక్కడ ఉండేవారిని భగవంతుడు అని ఎలా అంటారు? వికారీ ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచంగా తయారుచేసేవారు ఒక్కరు మాత్రమే. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. మాతా-పితలైన జగదంబ-జగత్పితలు వెళ్ళి మొట్టమొదటి మహారాజు-మహారాణిగా అవుతారని పిల్లలకు తెలుసు. ఇప్పుడైతే వారు కూడా చదువుకుంటున్నారు, చదివించేవారు శివబాబా. స్మృతి కూడా వారినే చేస్తారు. ఇప్పుడు మీరు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మలో నా మతాన్ని అనుసరించి నిర్వికారులుగా ఉంటే 21 జన్మలు మీరు నిర్వికారులుగా అవుతారు. ఇది పురుషార్థము చేసే సంగమయుగము. తండ్రి అంటారు, నేను వచ్చాను కావున మీరు ఈ జన్మలో నా మతాన్ని అనుసరించి నిర్వికారులుగా అవ్వండి. ప్రతి ఒక్కరూ స్వయం గురించి స్వయమే చింత చేయాలి మరియు ఎవరు వచ్చినా సరే, వారికి ఇలా చెప్పాలి – అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలంటే పవిత్రత యొక్క రాఖీని కట్టుకోండి. ఇప్పుడు మృత్యులోకములో వృద్ధి చేయకూడదు. ఇక్కడ ఆదిమధ్యాంతాలు దుఃఖము ఉంది. ఇది ఆసురీ సంప్రదాయము. సత్యయుగములోనైతే దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు నరకవాసులు వారిని పూజిస్తున్నారు. మనమే పవిత్రంగా, పూజ్యులుగా ఉండేవారమని వారికి తెలియదు. ఇప్పుడు మనము మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి. మీరు పిల్లలకు జన్మనిచ్చి వారు కూడా నరకవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నారా? నరకములో పిల్లలకు జన్మనివ్వాలా. దాని కన్నా స్వర్గములోకి వెళ్ళి రాకుమారులకు ఎందుకు జన్మను ఇవ్వకూడదు. తండ్రికి చెందినవారిగా అవ్వడముతో మీరు యోగ్యులుగా అవుతారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా దుఃఖాన్ని ఇస్తారు. బిడ్డ జన్మిస్తే సంతోషము, మరణిస్తే దుఃఖము. సత్యయుగములో గర్భములో కూడా మహలు వలె ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత కూడా మహళ్ళలోనే ఉంటారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారు.

మనము ఈశ్వరీయ విద్యార్థులము. తండ్రికి పిల్లలము కూడా, టీచరు రూపములో వారికి విద్యార్థులము కూడా. గురువు రూపములో వారికి పూర్తి అనుచరులము కూడా. ఆత్మలమైన మనము తండ్రికి అనుచరులము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. లేదంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఇకపోతే, వ్యాపార-వ్యవహారాలైతే చేయాలి, లేదంటే పిల్లలను ఎలా సంభాళిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అన్ని వైపుల నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. పవిత్రముగా అయి పరిస్తాన్ లో దేవకన్యలుగా అవ్వాలి.

2. మాతా-పితల శ్రేష్ఠ మతాన్ని మనము అనుసరించాలి. దేహాభిమానానికి వశమై వారికి మన మతాన్ని ఇవ్వకూడదు.

వరదానము:-

మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయి మొత్తం విశ్వానికి సర్వ శక్తుల కిరణాలను ఇచ్చే విశ్వ కళ్యాణకారీ భవ

ఎలాగైతే సూర్యుడు తన కిరణాల ద్వారా విశ్వాన్ని ప్రకాశింపజేస్తాడో, అలాగే మీరందరూ కూడా మాస్టర్ జ్ఞాన సూర్యులు కావున మీ సర్వ శక్తుల కిరణాలను విశ్వానికి ఇస్తూ ఉండండి. ఈ బ్రాహ్మణ జన్మ లభించిందే విశ్వ కళ్యాణము కోసము కావున సదా ఈ కర్తవ్యంలోనే బిజీగా ఉండండి. ఎవరైతే బిజీగా ఉంటారో వారు స్వయం కూడా నిర్విఘ్నముగా ఉంటారు మరియు సర్వుల పట్ల కూడా విఘ్న-వినాశకులుగా అవుతారు. వారి వద్దకు ఏ విఘ్నము రాలేదు.

స్లోగన్:-

బాధ్యతలను సంభాళిస్తూ అంతా తండ్రికి అర్పించి డబల్ లైట్ గా ఉండడమే ఫరిశ్తాగా అవ్వడము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top