TELUGU MURLI 13-03-2023

              13-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – స్మృతిలో ఉంటూ-ఉంటూ ఈ కలియుగ రాత్రి పూర్తి అయిపోతుంది, మీరు తండ్రి వద్దకు వెళ్లిపోతారు, మళ్లీ పగలులోకి వస్తారు, ఇది కూడా అద్భుతమైన యాత్ర’’

ప్రశ్న:-

పిల్లలైన మీకు స్వర్గములోకి వెళ్ళాలనే కోరిక ఎందుకు ఉంది?

జవాబు:-

ఎందుకంటే మీకు తెలుసు – ఎప్పుడైతే మనము స్వర్గములోకి వెళ్తామో అప్పుడు మిగిలిన ఆత్మలందరి కళ్యాణము జరిగి అందరూ తమ ఇల్లైన శాంతిధామానికి వెళ్లగలరు. మీకు స్వర్గములోకి వెళ్లాలనే లోభమేమీ లేదు. కానీ మీరు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు, ఇంత శ్రమ చేస్తారు కావున తప్పకుండా ఆ స్వర్గానికి యజమానులుగా కూడా అవుతారు. అంతేకానీ మీకు వేరే ఏ కోరికా లేదు. మనుష్యులకైతే – మాకు భగవంతుని సాక్షాత్కారమవ్వాలి అనే ఆశ ఉంటుంది కానీ ఇక్కడ మిమ్మల్ని స్వయంగా వారే చదివిస్తున్నారు.

పాట:-

రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు… (రాత్ కే రాహీ…)

ఓంశాంతి.

రాత్రి ప్రయాణీకుడు అనే పదానికి అర్థము పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఒకవేళ పిల్లల యొక్క స్వదర్శన చక్రము తిరుగుతూ ఉన్నట్లయితే, ఆ స్మృతిలో ఉన్నట్లయితే – మేము పగలుకు అనగా స్వర్గానికి ఎంత సమీపంగా చేరుకున్నాము అనేది అర్థం చేసుకోగలరు. ఇది అనంతమైన పగలు, అనంతమైన రాత్రి అని పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మా యొక్క అనంతమైన రాత్రి అని అంటారు. శాస్త్రాలలో ఎంత మంచి పేర్లు రాసి ఉన్నాయి. లక్ష్మీ-నారాయణుల రాత్రి కూడా ఉంటుంది అని అనరు. అలా కాదు. బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి అని అనడం జరుగుతుంది. లక్ష్మీ-నారాయణులైతే అక్కడ రాజ్యము చేసేవారు. సృష్టి చక్రమైతే తప్పకుండా మళ్లీ తిరగాలి. లక్ష్మీ-నారాయణుల రాజ్యము మళ్లీ సత్యయుగములో వస్తుంది. సత్యయుగము తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు తప్పకుండా వస్తాయి. కావున తప్పకుండా సత్యయుగములో మళ్లీ అదే రాజు ఉండాలి. ఈ జ్ఞానము కేవలం శివబాబా మాత్రమే బ్రహ్మా ద్వారా పిల్లలైన మీకు ఇస్తారు, అందుకే ఈ సృష్టి చక్ర జ్ఞానము మీకు మాత్రమే ఉంది, దేవతలకు లేదు. బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది, అందుకే బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీల రాత్రి అన్న పేరును పెట్టారు. ఇప్పుడు మీరు పగలు వైపుకు వెళ్తున్నారు. సత్యయుగాన్ని పగలు అని, కలియుగాన్ని రాత్రి అని అంటారు. మన ఈ యాత్ర కలియుగ అంతిమము మరియు సత్యయుగము ఆది యొక్క సంగమములోనే జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. మీరు కలియుగములో కూర్చుని ఉన్నారు కానీ మీ బుద్ధి అక్కడ ఉంది. నేను ఈ శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్లాలి అని ఆత్మ భావించాలి. ఎప్పుడైతే లక్ష్యము పూర్తి అవుతుందో అనగా తండ్రి యోగము నేర్పించడం సమాప్తము చేస్తారో, అప్పుడు చివర్లో శరీరాన్ని వదిలేస్తారు. చదువు పూర్తి అయినంత వరకు తండ్రి నేర్పిస్తూ, చదివిస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటారు. ఈ విధంగా స్మృతిలో ఉంటూ-ఉంటూ రాత్రి పూర్తి అయిపోతుంది మరియు మీరు తండ్రి వద్దకు వెళ్లిపోతారు. తర్వాత మీరు పగలులోకి వస్తారు. ఇది మీ అద్భుతమైన యాత్ర. తండ్రి బ్రహ్మాకుమారులు-కుమారీలైన మీ కొరకే పగలును స్థాపన చేస్తారు. ఇప్పుడు పగలు అనగా సత్యయుగము వస్తోంది. ప్రస్తుతము మీరు కలియుగ రాత్రిలో కూర్చుని ఉన్నారు. నిరంతరము తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి.

అందరూ తప్పకుండా మరణించవలసిందే అని తండ్రి అర్థం చేయించారు. మనుష్యులు – ఎప్పుడు చనిపోతాము? ఎప్పుడు వినాశనం జరుగుతుంది? అని అడుగుతారు. ఇప్పుడు దివ్య దృష్టితో మీరు వినాశనాన్ని సాక్షాత్కారము చేసుకున్నారు. తర్వాత ఈ కనులతో తప్పకుండా చూస్తారు. అంతేకాక స్థాపన, దేనినైతే సాక్షాత్కారములో చూస్తారో, దానిని కూడా ఈ కనులతో చూడనున్నారు. ముఖ్యంగా బ్రహ్మా యొక్క పగలు మరియు రాత్రి అని ఎవరి గురించైతే గాయనము చేయబడిందో, వారికే స్థాపన మరియు వినాశనం యొక్క సాక్షాత్కారమయ్యింది. కావున దివ్యదృష్టితో ఏదైతే చూశారో, అది ప్రాక్టికల్ గా తప్పకుండా జరుగుతుంది. భక్తి మార్గములో ఏదైతే సాక్షాత్కారమవుతుందో దానిని దివ్యదృష్టితో చూస్తారు. మీరు కూడా దివ్యదృష్టితో చూస్తారు. మీకు ఏ వస్తువు పైనా కోరిక ఉండదు. సన్యాసులకు పరమపిత పరమాత్మను చూడాలనే కోరిక ఉంటుంది. ఇక్కడ పిల్లలైన మీకైతే పరమపిత పరమాత్మ స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. మీకు స్వర్గములోకి వెళ్లాలనే కోరిక ఉంది. మనము స్వర్గములోకి వెళ్తే అందరి కళ్యాణము జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఎవరైతే మనుష్య సృష్టికి రచయిత మరియు బీజరూపుడో వారికి వృక్షము యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనకు ఆ తండ్రి గురించి, వారి వారసత్వము గురించి తెలుసు. ఏ విధంగా ఆ వృక్షాలలో, ఫలానా వృక్షము మామిడి వృక్షమని తెలుస్తుంది. విత్తనము నాటితే మొదట 2-4 ఆకులు వెలువడుతాయి, ఆ తర్వాత వృక్షము పెద్దదవుతూ ఉంటుంది, అయితే అది జడ బీజము. ఈ తండ్రి మనుష్య సృష్టికి చైతన్య బీజరూపుడు, వీరినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు.

ఇది పాఠశాల అని పిల్లలకు తెలుసు, ఇక్కడ ఈ విద్య (చదువు) లభిస్తోంది మరియు మీరు యోగము కూడా నేర్చుకుంటున్నారు. ఈ విద్య ద్వారా మీరు భవిష్య రాకుమార-రాకుమార్తెలుగా అవుతారు. ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడైతే అందరూ అపవిత్రంగా ఉన్నారు. కానీ ఎవరినైనా పతితులని అంటే వారు ఒప్పుకోరు. కృష్ణపురిలో కూడా ఒకరికొకరు దుఃఖాన్నిచ్చే కంసుడు, జరాసంధుడు మొదలైనవారు ఉండేవారని అంటారు. ఒకరికొకరు సుఖాన్నిచ్చే వారిని పావనులని అంటారు. స్వర్గములో ఎవరూ దుఃఖాన్ని ఇవ్వరు. అక్కడైతే పులి, మేక కలిసి ఒకే చోట నీరు తాగుతాయి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థము చేసుకోరు. శాస్త్రాలు ఏవైతే చదువుకున్నారో, ఆ మాటలే బుద్ధిలోకి వస్తాయి. దేవతల పూజారులు తమకు తామే చెంపదెబ్బలు వేసుకుంటారు. హిందువులు తమకు తామే చెంపదెబ్బలు వేసుకున్నారు. కూర్చొని తమ దేవతలను తామే నిందించారు. క్రైస్ట్, బుద్ధుడు మొదలైనవారికి ఎంత మహిమను చేస్తారు. కూర్చొని దేవతలను నిందిస్తారు. ఇది ధర్మగ్లాని అయ్యింది కదా. గీతలో కూడా యదా యదాహి ధర్మస్య… అని అంటారు. పేరు కూడా భారత్ దే. భారత్ యే భ్రష్టముగా, మళ్లీ శ్రేష్ఠముగా అవుతుంది. లక్ష్మీ-నారాయణులు శ్రేష్ఠంగా ఉండేవారు. భ్రష్ట మనుష్యులు శ్రేష్ఠులకు తల వంచి నమస్కరిస్తారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు, కానీ భగవంతుని గురించి వారికి తెలియదు. స్వయాన్నే భగవంతునిగా చెప్పుకుంటారు. మిగిలిన గురువులు మొదలైనవారు ఎవరెవరు ఉన్నారో వారు పతితంగా ఉన్నారు, వికారాలలోకి కూడా వెళ్తారు. వికారులను పతితులని అంటారు. వారు పావనంగా ఉన్నవారికి నమస్కరిస్తారు. సన్యాసులను కూడా గురువులుగా ఎందుకు చేసుకుంటారంటే, వారు మమ్మల్ని కూడా తమ సమానంగా పావనంగా చేయాలి అని. ఈ రోజుల్లో ఎవరో కష్టము మీద సన్యాసులుగా అవుతారు, ఇక గృహస్థులను గురువులుగా చేసుకుంటే ప్రాప్తి ఏముంటుంది? ఎందుకంటే వారే స్వయంగా పతితులుగా ఉన్నారు. కానీ కొత్త ఆత్మలు వస్తే, వారికి కొంత మహిమ ఉంటుంది. ఎవరికైనా పుత్రుడు జన్మిస్తే, ఎవరికైనా ధనము లభిస్తే సంతోషపడతారు. ఇక ఒకరిని చూసి ఒకరు అందరూ గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. వాస్తవానికి సద్గతి కొరకు గురువులను ఆశ్రయిస్తారు. వారు తప్పకుండా పంచ వికారాలను సన్యసించిన పవిత్రులుగా ఉండాలి. ఇకపోతే గృహస్థులను గురువులుగా చేసుకుంటే లాభమేముంది? గొప్ప-గొప్ప గృహస్థీ గురువులున్నారు, వారికి వేలాదిమంది శిష్యులున్నారు. ఎవరో ఒకరు ఒకరిని గురువుగా చేసుకుంటే, ఇక ఆ పీఠము అలాగే కొనసాగుతూ వస్తుంది. శిష్యులు వారి పాదాలు కడిగి ఆ నీటిని తాగుతారు, దానిని అంధ విశ్వాసము అని అంటారు. మనుష్యులు – ఓ భగవంతుడా, మీరు అంధులకు చేతి కర్ర… అని పాడుతారు కానీ దాని అర్థము కూడా తెలియదు. మాయా రావణుడు అంధులు (బుద్ధిహీనులు)గా చేస్తాడు. అందరూ రాతిబుద్ధి కలవారిగా అవుతారు, అందుకే తండ్రి అంటారు – ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సారాన్ని నేను వచ్చి వినిపిస్తాను. నారదుని ఉదాహరణ చెప్తారు, వారితో ఇలా అన్నారు – నీవు నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మిని వరించేందుకు యోగ్యునిగా ఉన్నావా? లక్ష్మి అయితే స్వర్గములో ఉంటారు. మనము పురుషార్థము చేసి భవిష్యత్తులో లక్ష్మిని లేక నారాయణుడిని వరించాలని ఇప్పుడు మీకు తెలుసు. కావున ఇది కూడా ఇక్కడి విషయమే. ముఖము మనిషిదే కానీ గుణము కోతిది. తండ్రి అంటున్నారు, మీ ముఖాన్ని చూసుకోండి. మనుష్యులు మీతో ఏమంటారంటే – మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలనే లోభమునైతే పెట్టుకున్నారు కదా. వారికి ఏమి అర్థం చేయించాలంటే – అరే, మేమైతే మొత్తం సృష్టి అంతటినీ స్వర్గంగా తయారుచేస్తాము, అంత శ్రమ చేసినందుకు తప్పకుండా యజమానులుగా కూడా మేమే అవ్వాల్సి ఉంటుంది కదా. ఎవరో ఒకరు రాజ్యము చేస్తారు కదా.

బాబా అర్థం చేయించారు, నంబర్ వన్ కామము మహాశత్రువు, ఇది మనుష్యులకు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. ఇది అర్ధకల్పపు కఠినమైన శత్రువు. డ్రామాలో సుఖ-దుఃఖాలున్నాయి కానీ దుఃఖములోకి తీసుకెళ్లేవారు కూడా ఉన్నారు కదా. అతడు రావణుడు. అర్ధకల్పము రావణ రాజ్యము నడుస్తుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కైలాస పర్వతముపై పార్వతి-శంకరులు ఉంటారని అంటారు చూడండి. ప్రెసిడెంట్ మొదలైనవారు కూడా అమరనాథ యాత్రకు కైలాస పర్వతముపైకి వెళ్తారు. కానీ అక్కడికి శంకరుడు, పార్వతి ఎక్కడ నుండి వచ్చారని కూడా ఆలోచించరు. పార్వతికి కథను వినిపించేందుకు ఆమె ఏమైనా దుర్గతిలో ఉన్నారా? సూక్ష్మవతనములోనైతే దుర్గతి యొక్క ప్రశ్నే ఉండదు. ఎంత దూర-దూరాలకు వెళ్లి మనుష్యులు ఎదురుదెబ్బలు తింటారు. ఇది భక్తి మార్గము. మనుష్యులు దుఃఖమునైతే పొందాల్సిందే. ప్రాప్తి కేవలం అల్పకాలికముగా మాత్రమే ఉంటుంది. అది ఎటువంటి ప్రాప్తి? తీర్థ యాత్రలలో ఎంత కాలముంటారో అంత కాలము పవిత్రంగా ఉంటారు. కొంతమందైతే మద్యము లేకుండా ఉండలేరు కావున రహస్యంగా దాచిపెట్టుకొని కూడా మద్యం సీసాలు తీసుకువెళ్తారు. మరి అది తీర్థ స్థానమెలా అవుతుంది? అక్కడ కూడా ఎంత మురికి ఏర్పడి ఉంది, ఇక అడగకండి. వికారీ మనుష్యులకు అక్కడ వికారాలు కూడా లభిస్తాయి. మనుష్యులు జ్ఞానము లేని కారణంగా భక్తి చాలా బాగుందని, దాని ద్వారానే భగవంతుడు లభిస్తారని భావిస్తారు. అర్ధకల్పము భక్తిలో ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుంది. అర్ధకల్పము తర్వాత ఎప్పుడైతే భక్తి పూర్తి అవుతుందో అప్పుడు మళ్లీ భగవంతుడు వస్తారు. బాబాకు దయ కలుగుతుంది. భక్తి ద్వారా భగవంతుడిని పొందుతారని కాదు. అలాగైతే మళ్లీ భగవంతుని ఎందుకు పిలుస్తారు? ఎందుకు తలచుకుంటారు? భగవంతుడు ఎప్పుడు లభిస్తారు, ఇది అర్థము చేసుకోరు. భక్తి ద్వారా శ్రీకృష్ణుని సాక్షాత్కారము కలిగితే, ఇక అంతే, భగవంతుడు లభించేసారని, వైకుంఠవాసిగా అయిపోయారని భావిస్తారు. శ్రీకృష్ణుని దర్శనమైతే ఇక అంతే, శ్రీకృష్ణపురిలోకి వెళ్లినట్లుగా భావిస్తారు. కానీ ఎవరూ వెళ్లరు. కనుక భక్తి మార్గములో అంధ విశ్వాసం చాలా ఉంది. పిల్లలైన మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. తండ్రి సాధారణ తనువులో వస్తారు, అందుకే వారిపై నిందలు పడ్డాయి. లేకుంటే మరి ఎవరి తనువులోకి రావాలి? శ్రీకృష్ణుని తనువులో నిందలు పడడం జరగదు. కానీ శ్రీకృష్ణుడు పతిత ప్రపంచములోకి పావనంగా తయారుచేయడానికి రావడమంటే, అది జరిగే పని కాదు. శ్రీకృష్ణుడిని పతితపావనుడు అని అనరు కూడా. మనుష్యులకు పతితపావనుడెవరు, వారు ఎలా వస్తారు అనేది కూడా అర్థం కాదు, అందుకే ఎవరికీ విశ్వాసము కుదరదు. వారు బ్రహ్మా తనువులో ఎలా వస్తారు అనేది శాస్త్రాలలో లేనే లేదు. బ్రహ్మా నోటి ద్వారా సూర్యవంశీ, చంద్రవంశీ ధర్మాలు స్థాపనవుతాయని అంటారు కూడా. మరి అవి ఎప్పుడు స్థాపనవుతాయి, ఎలా స్థాపన అవుతాయి అనేది మర్చిపోతారు. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడ కల్పం యొక్క సంగమయుగములోనే ఉండాలి కదా, అప్పుడే బ్రాహ్మణుల కొత్త సృష్టి రచింపబడుతుంది. మనుష్యులు చాలా భ్రమలో ఉన్నారు, వారికి దారి తెలియజేయాలి. తండ్రి వచ్చి ఎంత గొప్ప సేవ చేస్తారు. ఈ పంచ వికారాలతో మనము కోతుల కంటే హీనంగా అయిపోతూ వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు. మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత ఒక్కసారిగా ఎలా అయిపోయాము! ఇటువంటి వారిని తండ్రి వచ్చి మళ్లీ ఎంత ఉన్నతంగా చేస్తారు. కావున తండ్రిని ఎంతగా ప్రేమించాలి. ఈ విషయాలను తండ్రి వినిపిస్తున్నారా లేక దాదా వినిపిస్తున్నారా? ఇది కూడా చాలా మంది పిల్లలకు తెలియదు. తండ్రి అంటున్నారు – ఆలోచించండి, నేను ఎల్లప్పుడూ ఈ రథముపైనే ఉండగలనా? అలా జరగదు. నేను కేవలం సేవ చేసేందుకే వస్తాను.

బాబా వద్దకు ఈ సమాచారము వచ్చింది – మనుష్యులు ఎవరికైనా సుఖాన్ని ఇవ్వగలరా? ఇది మనుష్యుల చేతిలో ఉందా? అని ఎవరో ప్రశ్న అడిగారు. అందుకు ఒకరు – అలా జరగదు, ఈశ్వరుడే మనుష్యులకు సుఖాన్నివ్వగలరు, మనుష్యుల చేతిలో ఏమీ లేదు అని సమాధానమిచ్చారు. తర్వాత పిల్లలలో ఇంకొకరు ఎలా అర్థం చేయించారంటే – మనుష్యులే సుఖాన్ని ఇస్తారు, అన్నీ చేసేది మనుష్యులే, ఈశ్వరుని చేతిలో ఏమీ లేదు అని. అరే, మీరు ఏమైనా ఇవ్వగలరా. ఈశ్వరుని చేతిలోనే ఉంది కదా. శ్రీమతముపై నడుచుకోవాలని అర్థం చేయించాలి. పరమపిత శ్రీమతము లేకుండా ఎవ్వరూ సుఖాన్ని ఇవ్వలేరు. మీ గొప్పలు చెప్పుకోకూడదు. మనము శ్రీమతము ఆధారంగా మొత్తము సృష్టిని స్వర్గంగా తయారుచేస్తాము. మరి పిల్లలు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో చూడండి. వారేమో ఈశ్వరుని చేతిలో ఉందని అంటారు. మనుష్యుల చేతిలో ఉందని బి.కె.లు అంటారు. వాస్తవానికి ఉండేది తండ్రి చేతిలోనే. శ్రీమతము లేకుండా ఏమీ చేయలేరు. మనుష్యులు పూర్తిగా పైసకు కొరగానివారిగా అయిపోతారు. తండ్రి అంటారు, రావణుడు మనుష్యులను రాతిబుద్ధి కలవారిగా చేసేస్తాడు. నేను వచ్చి మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తాను. ఒక్క తండ్రి మహిమనే చేయాలి. మనము శ్రీమతముపై నడుచుకుంటున్నాము. ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ మనుష్యులను శ్రేష్ఠంగా తయారుచేయలేరు. అచ్ఛా!

బ్రహ్మా ముఖ వంశావళి, బ్రాహ్మణ కుల భూషణులు, స్వదర్శన చక్రధారులైన మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఇంత గొప్ప సేవ చేస్తారు, మనల్ని ఇంత ఉన్నతమైన దేవతలుగా చేస్తారు, ఇటువంటి తండ్రి పట్ల సత్యమైన హృదయపూర్వకమైన ప్రేమనుంచాలి. దేవతల సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి.

2. సదా ఒక్క తండ్రి మహిమనే చేయాలి. మీ గొప్పలు చూపించుకోకూడదు.

వరదానము:-

సేవా పాత్రను అభినయిస్తూ పాత్ర నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియమైనవారిగా ఉండే సహజ యోగీ భవ

చాలామంది పిల్లలు – యోగము ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరడం లేదు అని అంటారు. దీనికి కారణమేమిటంటే – అతీతంగా ఉండడంలో లోపము. అతీతముగా లేని కారణంగా ప్రేమ అనుభవమవ్వదు మరియు ఎక్కడైతే ప్రేమ ఉండదో, అక్కడ స్మృతి ఉండదు. ఎంత ఎక్కువ ప్రేమనో, అంత సహజ స్మృతి, అందుకే సంబంధాల ఆధారంగా పాత్రను అభినయించకండి, సేవా సంబంధముతో పాత్రను అభినయించండి, అప్పుడు అతీతంగా ఉంటారు. కమల పుష్ప సమానంగా పాత ప్రపంచపు వాతావరణము నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయినట్లయితే సహజయోగిగా అవుతారు.

స్లోగన్:-

ఎవరైతే కారణము అనే పదాన్ని మర్జ్ చేసి ప్రతి విషయంలోనూ నివారణ చేస్తారో, వారే జ్ఞానీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top