TELUGU MURLI 11-03-2023

           11-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – జ్ఞానము మరియు యోగబలముతో పాత పాప ఖాతాలను సమాప్తం చేసుకుని కొత్త పుణ్య ఖాతాను జమ చేసుకోవాలి, యోగబలముతో సదా ఆరోగ్యవంతులుగా, సుసంపన్నులుగా అవ్వాలి’’

ప్రశ్న:-

సంగమయుగములో ఉన్న ఏ విశేషతలు మొత్తం కల్పమంతటిలోనూ ఉండవు?

జవాబు:-

సంగమయుగములోనే 5000 సంవత్సరాల తర్వాత ఆత్మ మరియు పరమాత్మల ప్రియమైన మంగళ మిలనము జరుగుతుంది. తండ్రితో పిల్లలు కలుసుకునే మరియు వారసత్వాన్ని తీసుకునే సమయము ఇదే. తండ్రి ఆత్మలందరి కొరకు ఈ సమయములోనే జ్ఞానాన్ని ఇస్తారు, అందరి ముక్తిప్రదాతగా అవుతారు. సంగమయుగములోనే దేవీ-దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది, ఎవరైతే ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారో వారు మళ్ళీ తిరిగి వస్తారు. అందరూ తమ-తమ పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకుని తిరిగి వెళ్తారు. ఇటువంటి విశేషతలు ఇంకే యుగములోనూ ఉండవు.

ఓం శాంతి.

పరమపిత శివ అన్న పేరును తప్పకుండా ఉపయోగించాలి. పరమాత్మ లేక ఖుదా లేక గాడ్ అని ఎంతోమంది అంటూ ఉంటారు. కానీ తండ్రి పేరు తప్పకుండా కావాలి. తండ్రి పేరు శివ. వారు నిరాకారుడు కదా. నిజానికి ఆత్మలు కూడా నిరాకారియే. ఇక్కడకు వచ్చి సాకారులుగా అవుతారు. పరమపిత పరమాత్మ అక్కడి నుండి పిల్లలను మరియు ధర్మపితలను పాత్రను అభినయించేందుకు పంపిస్తారు అని అంటారు. గాడ్ ఫాదర్ అని అంటున్నప్పుడు మనుష్యుల బుద్ధిలోకి లౌకిక తండ్రి రారు. లౌకిక తండ్రి తన పిల్లలకు మాత్రమే తండ్రి అవుతారు. కానీ హే పరమపిత అని అనడంతో బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఆత్మయే వారిని తలచుకుంటుంది. దేహాన్ని ఇచ్చిన దైహిక తండ్రిని కూడా ఆత్మయే తలచుకుంటుంది. అంతేకాక ఆత్మల యొక్క యథార్థమైన తండ్రిని కూడా తలచుకుంటారు కదా. కానీ వారు ఎవరు, వారిని తండ్రి అని ఎవరు పిలుస్తున్నారు? ఎందుకు వారిని దయ చూపించమని అడుగుతున్నారు? వారు అందరికీ తండ్రి, ఇది అందరికీ తెలుసు. కానీ ఒకవేళ అందరూ తండ్రులే అయినట్లయితే, ఇక వారిని ఆ విధంగా పిలవడం అనేది నిరూపించబడదు. పరమాత్మయే అన్నీ ఇచ్చారు అని, ఈ కొడుకును కూడా పరమాత్మయే ఇచ్చారు అని అంటారు. కావున భగవంతుడిని తప్పకుండా తలచుకుంటారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి, ఈ దుఃఖాల నుండి విముక్తులను చేయండి అని పిలుస్తారు. కావున తప్పకుండా ఎక్కడికో తీసుకువెళ్తారు కదా. అందరినీ విముక్తులను చేసి శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకువెళ్తారు. కల్ప-కల్పమూ కల్పం యొక్క సంగమయుగములోనే వారు వస్తారు. వారు మధ్యలో వస్తారని కాదు. ఎప్పుడైతే నాటకం పూర్తవ్వవలసి ఉంటుందో అప్పుడే అందరినీ తీసుకువెళ్ళేందుకు వస్తారు. తండ్రి అంటారు, నేను ఒక్కసారే వస్తాను. నేను ఘడియ-ఘడియ రావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే అందరూ తమోప్రధానముగా అవుతారో, అప్పుడు నేను ఒకేసారి వస్తాను ఎందుకంటే 84 జన్మలను తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ముందే వచ్చినట్లయితే ఈ 84 జన్మల చక్రము పూర్తవ్వదు. చక్రము పూర్తిగా అంతిమానికి చేరుకోవాలి కదా. ఎప్పుడైతే నేను రావాల్సి ఉంటుందో, అప్పుడు వచ్చి మొట్టమొదట పిల్లలకు తండ్రిగా అవుతాను, ఆ తర్వాత శిక్షకునిగా, సద్గురువుగా కూడా అవుతాను. తండ్రి జన్మనిస్తారు, టీచర్ శరీర నిర్వహణార్థము శిక్షణను ఇస్తారు, ఆ తర్వాత సద్గతి కొరకు గురువును స్వీకరించడం జరుగుతుంది. గురువును ఇక్కడే స్వీకరిస్తారు, సత్యయుగములో ఎవరూ గురువును స్వీకరించరు. అక్కడ తండ్రి మరియు టీచర్ ఉంటారు. అక్కడ తండ్రి టీచర్ గా అయి చదివించరు. తండ్రి వేరుగా, టీచర్ వేరుగా ఉంటారు. ఇక్కడ ఈ తండ్రి, టీచర్, గురువు ఒక్కరే. వారు పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. మీరు ముఖవంశావళి, ఆ తర్వాత కావాల్సింది చదువు. కావున మొత్తం సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. డ్రామాలో ముఖ్యమైన రచయిత, ముఖ్యమైన నటులు ఎవరెవరు. మొత్తం విశ్వము యొక్క చక్రానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేస్తారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము యొక్క సమాచారమంతటినీ తెలియజేస్తారు. ఈ మొత్తం చక్రము ఎలా తిరుగుతుంది, మొట్టమొదట కొత్త ప్రపంచములో ఎవరెవరు వస్తారు! మొట్టమొదట – వీరు మా అనంతమైన తండ్రి అని పిల్లలు అర్థం చేసుకోవాలి. మా తండ్రి ఈ శివుడు అని ఈ బ్రహ్మా కూడా అంటారు. బ్రహ్మాకు కూడా శివుడే రచయిత. ఈ బ్రహ్మా నా పుత్రుడు అని శివబాబా కూడా అంటారు. నేను వీరిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది, కావున నేను వీరిని దత్తత తీసుకున్నాను. మొదట వీరికి లేఖరాజ్ అన్న పేరుండేది, ఆ తర్వాత బ్రహ్మా అన్న పేరును పెట్టాను. నేను వీరిని నా వానిగా చేసుకున్నాను. మనుష్యులు తండ్రి-తండ్రి అని అంటారు కానీ తెలుసుకోకుండా అంటారు. శివుని చిత్రము ఎదురుగా వెళ్తారు కానీ వారు మా తండ్రి అని హృదయపూర్వకముగా భావించరు. ఎవరైనా లౌకిక తండ్రి చిత్రాన్ని చూస్తే వీరు మా తండ్రి అని వెంటనే అంటారు. శివుని ఎదురుగా ఆ భావన అంత హృదయాంతరాల నుండి వెలువడదు. వారిని పరమాత్మగా కూడా భావిస్తారు కానీ అంత రుచితో హృదయపూర్వకముగా వీరు మా తండ్రి అని అనరు. కేవలం భక్తి మార్గపు ఆచారం అనుసారముగా వందనం చేస్తారు. వారి నుండి ఏ ప్రాప్తి లభిస్తుంది, అది బుద్ధిలోకి రాదు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నిశ్చయం ఏర్పరచుకునేందుకు పాయింట్లు అయితే ఎన్నో ఇస్తారు. కానీ పిల్లలు మర్చిపోతారు. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసము. మిలట్రీ వారికైనా లేక సివిలియన్స్ కైనా, ఈ జ్ఞానము అందరి కోసము ఉంది.

శివబాబా మన తండ్రి, టీచర్, సద్గురువు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది మన చాలా పురాతన మిలనము. వీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చారు. దీనిని ఆత్మలు మరియు పరమాత్మల ప్రియమైన మంగళ మిలనము అని అంటారు. పరమపిత పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ కలుసుకుంటారు. ఈ సమయంలోనే వారు అందరికీ ముక్తిప్రదాతగా అవుతారు. అందరూ శిక్షణ తీసుకోరు. ఎవరైతే దేవతలుగా అయ్యేవారు ఉంటారో, వారే శిక్షణ తీసుకుంటారు. మనుష్య సృష్టి యొక్క ఇంత పెద్ద వృక్షమేదైతే ఉందో దీని ద్వారా అంటు కడతారు. ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా రకరకాల అంట్లు కడుతూ ఉంటుంది. బాబా కూడా అంటు కడుతూ ఉంటారు, అప్పుడు ఈ కులానికి చెందినవారెవరైతే ఉంటారో వారు తిరిగి వస్తారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు మరియు ఈ పునాదికి చెందినవారు ఉంటారో, వారి అంటు మాత్రమే కట్టడం జరుగుతుంది. మీరు నిజానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, ఆ తర్వాత వేరే-వేరే ధర్మాల వారి అంటు కూడా కట్టబడుతుంది. ఎవరైతే బదిలీ అయి ఉంటారో, వారు మళ్ళీ తిరిగి వస్తారు. రకరకాల వారు ముసల్మానులు, పార్సీలు మొదలైనవారు వస్తూ ఉంటారు కదా. మన దైవీ ధర్మము యొక్క వృక్షానికే అంటు కట్టబడుతూ ఉంటుంది. ఆ ఒక్క తండ్రియే మన తండ్రి, టీచర్, సద్గురువు అని ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నారు. తండ్రి మాకు జన్మనిచ్చారు అని, ఆ తర్వాత ఫలానా టీచర్ చదివించారు అని మనుష్యులు అంటూ ఉంటారు. ఆ తర్వాత చివరిలో గురువు వద్దకు వెళ్తారు. కొందరు గురువు వద్దకు వెళ్ళరు కూడా. ప్రతి ఒక్కరికీ తమ-తమ నమ్మకాలు ఉంటాయి. కానీ తప్పకుండా ఎవరో ఒకరిని తలచుకుంటూ ఉంటారు. తండ్రినైనా తలచుకుంటారు లేక మిత్ర-సంబంధీకులనైనా తలచుకుంటారు. ఇప్పుడు మీరు అందరి స్మృతిని మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారే సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు. వారే సత్యఖండాన్ని స్థాపన చేసేవారు. మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల చక్రానికి సంబంధించిన చరిత్రను మరియు భౌగోళికాన్ని తెలియజేస్తారు. మనం స్వదర్శన చక్రధారులుగా అయ్యాము కావున తప్పకుండా చక్రాన్ని స్మృతి చేయవలసి ఉంటుంది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ప్రారంభం నుండి అంతిమం వరకు మీరు చక్రము గురించి తెలుసుకున్నారు మరియు అది ఈ కల్పం యొక్క సంగమయుగములోనే తెలుసుకోగలుగుతారు. మధ్యలో ఎవరూ తెలుసుకోలేరు. తండ్రి కల్ప-కల్పమూ కల్పము యొక్క సంగమములోనే చదివిస్తారు. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికముల రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు, దీనిని తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయి చక్రవర్తీ రాజులుగా అవుతారు. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానము మాయమైపోతుంది. నాటకం పూర్తయ్యాక ఆత్మలో రాజరికపు పాత్ర ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీది నేర్చుకునే పాత్ర. తండ్రి రావడం, పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించడం, ఉన్నత పదవిని ప్రాప్తింపజేయడం – ఇది ఇప్పటి పాత్ర. పదవి ప్రాప్తి చేసుకున్న తర్వాత ఇక ఇది సమాప్తమైపోతుంది. అప్పుడిక ఈ సృష్టి చక్రపు జ్ఞానము కనుమరుగైపోతుంది. మనుష్యులెవ్వరికీ ఈ సృష్టి చక్రము యొక్క జ్ఞానము లేదు. సన్యాసులైతే అసలు ఈ చక్రాన్ని ఒప్పుకోనే ఒప్పుకోరు. వృక్షాన్ని చూసి – ఇది ఒక ఊహ అని అంటారు. పిల్లలైన మీరు కూడా ధారణ చేయాలి. యోగము పూర్తిగా లేకపోతే ధారణ జరగదు. బుద్ధి పవిత్రముగా అవ్వలేదు. పులి పాలు బంగారు పాత్రలోనే నిలవగలవు అని అంటారు కదా. అలాగే ఈ జ్ఞానామృతము కూడా పిల్లలకు లభిస్తుంది. పాత్ర లోహము నుండి మారి స్వర్ణిమముగా అవుతుంది, అప్పుడే ధారణ జరుగుతుంది, ఈ విషయంలో బాగా పురుషార్థం చేయడం జరుగుతుంది. ఇది చాలా సహజము, ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికముల గురించి తెలుసుకోవాలి. సత్యయుగములో ఎవరు రాజ్యం చేసేవారు, ఎంత సమయం చేసారు, వారి వంశావళి అయితే ఉంటుంది కదా. కావున దైవీ వంశమువారు 1250 సంవత్సరాలు రాజ్యం చేసారు అని అంటారు, వారు ఏమైనా యుద్ధం ద్వారా రాజ్యం తీసుకున్నారా? కాదు. ఇప్పటి పురుషార్థపు ప్రారబ్ధాన్నే పొందారు. ఈ మొత్తం చక్రమంతటినీ మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు చాలా సంతోషిస్తారు. మిలట్రీ వారికైనా సరే అర్థం చేయించవచ్చు. ఢిల్లీలో వారు వస్తూండేవారు కదా. వారికి కూడా బాబా ఇలా అర్థం చేయించేవారు కదా – మీరు విన్నారు కదా, గీతను వినిపించినప్పుడు అందులో భగవానువాచ ఉంది – ఎవరైతే యుద్ధ మైదానములో మరణిస్తారో, వారు నన్ను పొందుతారు, స్వర్గవాసులుగా అవుతారు అని. కానీ కేవలం గీతను చదవడం ద్వారా లేక వినడం ద్వారా మీరు స్వర్గములోకి వెళ్ళిపోతారని కాదు, మీరు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటే, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే, బాబాను స్మృతి చేయండి, శ్రీమతముపై నడవండి. ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ జ్ఞానము ఈ సమయం కొరకే ఉంది. శివబాబాను స్మృతి చేసే ప్రాక్టీస్ చేయాలి.

ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఆ గురువులకు బదులుగా ఒక్క శివబాబాను స్మృతి చేయాల్సి ఉంటుంది. ఇందులోనే శ్రమ ఉంది. అందరికీ తండ్రి వారొక్కరే. వారి ద్వారానే స్వర్గ వారసత్వము లభించగలదు. శాంతి, సుఖము యొక్క వారసత్వము వారి ద్వారానే లభిస్తుంది. ఈ సమయము తండ్రి ద్వారా తండ్రిని కలుసుకునే లేక వారసత్వాన్ని పొందే సమయము. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది. అనేక ధర్మాల వినాశనము మరియు ఏక ధర్మ స్థాపన యొక్క కార్యము ఒక్క పరమపిత పరమాత్మదే, దీనిని ఇంకెవ్వరూ చేయలేరు. ఎవరైతే తండ్రి ద్వారా చదువుకుంటారో, రాజయోగాన్ని నేర్చుకుంటారో వారు స్వర్గములోకి వెళ్తారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమమని మీకు తెలుసు. మహాభారీ యుద్ధము కూడా ఎదురుగా నిలిచి ఉంది, ఎవరైతే చదువుకుంటారో వారే పదవిని పొందుతారు. మిగిలినవారంతా లెక్కాచారాలన్నింటినీ తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా మీ పాపాల ఖాతాను సమాప్తం చేసుకోవాలి మరియు పుణ్య ఖాతాను జమ చేసుకోవాలి. ఎంతెంతగా జ్ఞాన-యోగాలలో ఉంటారో అంతంతగా పాత ఖాతా భస్మమై కొత్తది జమ అవుతుంది. యోగబలము ద్వారా మీ ఆయుష్షు పెరుగుతుంది. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సుసంపన్నులుగా అవుతూ ఉంటారు. జ్ఞానము మరియు యోగము ద్వారా ఈ రెండూ లభిస్తాయి. మీ కొరకు ఇది హాస్పిటల్ కూడా, అలాగే కాలేజి కూడా. నిజానికి సత్యాతి-సత్యాతి విశ్వవిద్యాలయము ఇదే. ప్రభుత్వం వారి యూనివర్శిటీలు ఏవైతే ఉన్నాయో, నిజానికి వాటిని యూనివర్శిటీలు అని అనరు. యూనివర్స్ అని మొత్తం విశ్వాన్ని అంటారు. వాటిలో విశ్వము యొక్క జ్ఞానము ఏమీ లేదు, అవన్నీ హద్దులోనివి. ఎన్ని హద్దులు సృష్టించారు. యూనివర్శిటీని హిందీలో విశ్వవిద్యాలయ్ అని అంటారు అనగా మొత్తం విశ్వమంతటి నుండి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. కానీ ఆ యూనివర్శిటీలో అలా జరగజాలదు. ఇక్కడికైతే ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. విశ్వ రచయితయే ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేస్తారు. మనం వ్రాయడమే అలా వ్రాస్తాము. ఇప్పుడు విశ్వవిద్యాలయానికి మరియు యూనివర్శిటీకి ఉన్న తేడా ఏమిటి. కేవలం అది హిందీ పదము, ఇది ఇంగ్లీష్ పదము. విశ్వ రచయితయే ఈ విశ్వవిద్యాలయాన్ని రచించారు. ఇందులో తండ్రి మనుష్యులను దేవతలుగా, రాజులకే రాజులుగా తయారుచేస్తారు. విముక్తులను చేస్తారు. ఇక్కడ శ్రీమతము లభిస్తుంది కానీ ఆసురీ మతం వారు శ్రీమతాన్ని కూడా అంగీకరించరు. ఇక్కడ ఈ శ్రీమతము ద్వారా ఎంత శ్రేష్ఠముగా అవుతారు. తమ తనువు, మనస్సు, ధనములతో భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు, అదీ చాలా గుప్తముగా చేస్తున్నారు. తండ్రి కూడా గుప్తముగానే వస్తారు. శ్రీకృష్ణుడు అయితే గుప్తముగా ఉండరు. కానీ తండ్రి గురించి తెలియని కారణముగా గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేసారు, అంతేకాక కృష్ణుని నాట్యాన్ని చూపించారు. అక్కడ యువరాజులు, యువరాణులు వాళ్ళలో వాళ్ళు నాట్యం చేస్తూ ఉండవచ్చు. అక్కడికి ప్రజలు ఏమైనా వెళ్ళగలుగుతారా. తండ్రి ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు, జ్ఞాన ధనాన్ని తీసుకొని మళ్ళీ దానం చేస్తూ వెళ్ళండి అని అంటారు. ఇది చాలా ఉన్నతమైన చదువు. దీనిని చాలా సాధారణముగా కూర్చుని చదవాలి. కుర్చీపైనైతే ఆసనము వేయలేరు. కాలుపై కాలు మడత వేసుకొని కూర్చోవడం – ఈ రాజరికపు కూర్చునే పద్ధతి సరైనది. మామూలుగా అయితే మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. సత్యయుగములో నోటిలో బంగారు చెంచా ఉంటుంది. పిల్లలు సాక్షాత్కారము కూడా పొందారు. విమానాలలో ఎలా నింపుకొని వస్తారో చూసారు. మహళ్ళు మొదలైనవన్నీ చాలా త్వరత్వరగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా బాబా చూస్తూండగానే కరెంటు, కార్లు మొదలైనవి ఏమేమి తయారయ్యాయి. ఇంతకుముందు ధాన్యం ఎంత చౌకగా ఉండేది. మరి సత్యయుగములో ఇంకెంత చౌకగా ఉంటుంది. ఇక్కడ బంగారు నాణానికి 100 రూపాయల విలువ ఉంటే అక్కడ పైస విలువ ఉంటుంది. కావున ఎంత తేడా ఉంది. మీకు ఈ ఒక్క జన్మలోని చదువుతో 21 జన్మల రాజ్యము లభిస్తుంది, మరి మీకు ఇంకేమి కావాలి. బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. కూతురు ఒకవేళ జ్ఞానము తీసుకోకపోతే ఆమెకు వివాహం చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ కొడుకు జ్ఞానం తీసుకోకపోతే వెళ్ళి నీవు నీది సంపాదించుకో, వివాహం చేసుకో అని అంటారు. బాబా అయితే ప్రతి విషయానికి సలహానిస్తారు. వివాహాలకు వెళ్ళినప్పుడు, కేవలం పళ్ళు తీసుకొని శివబాబాను స్మృతి చేసి తిన్నట్లయితే అవి పవిత్రముగా అవుతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే బ్రాహ్మణ కులభూషణులైన స్వదర్శన చక్రధారీ కంటి రత్నాలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి ఏ జ్ఞాన ధనాన్ని అయితే తీసుకున్నారో దానిని దానం చేయాలి. గుప్త రీతిగా ఈ చదువును చదువుకొని 21 జన్మల కొరకు రాజ్యాన్ని తీసుకోవాలి.

2. అందరి స్మృతిని మరచి ఒక్క తండ్రినే సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు రూపములో స్మృతి చేయాలి.

వరదానము:-

ఆత్మిక నషా ద్వారా దుఃఖ-అశాంతుల నామరూపాలను సమాప్తం చేసే సర్వ ప్రాప్తి స్వరూప భవ

ఆత్మిక నషాలో ఉండటం అనగా నడుస్తూ-తిరుగుతూ ఆత్మను చూడటము లేక ఆత్మాభిమానిగా ఉండటము. ఈ నషాలో ఉండటం ద్వారా సర్వ ప్రాప్తుల అనుభవం కలుగుతుంది. ప్రాప్తి స్వరూపులై ఆత్మిక నషాలో ఉండే ఆత్మలకు అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. దుఃఖ-అశాంతుల నామరూపాలు కూడా ఉండవు ఎందుకంటే దుఃఖం మరియు అశాంతి యొక్క ఉత్పత్తి అపవిత్రత వలన జరుగుతుంది. ఎక్కడైతే అపవిత్రత ఉండదో, అక్కడికి దుఃఖ-అశాంతులు ఎక్కడి నుండి వస్తాయి! ఎవరైతే పావన ఆత్మలుగా ఉంటారో, వారి వద్ద సుఖ-శాంతులు స్వతహాగానే ఉంటాయి.

స్లోగన్:-

ఎవరైతే సదా ఒక్కరి లగనములోనే నిమగ్నమై ఉంటారో, వారే నిర్విఘ్నులుగా ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top