TELUGU MURLI 09-03-2023

      09-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మీరు తండ్రి యొక్క కర్తవ్యము మరియు గుణాల సహితముగా వారిని స్మృతి చేయాలి, స్మృతితోనే మీరు వికర్మాజీతులుగా అవుతారు, వికారాల మాలిన్యం భస్మమవుతుంది’’

ప్రశ్న:-

జ్ఞాన ధారణ ఏ పిల్లలకు చాలా సహజముగా జరగగలదు?

జవాబు:-

ఎవరిలోనైతే ఎటువంటి పాత చెడు సంస్కారాలు ఉండవో, ఎవరి బుద్ధి స్మృతితో శుద్ధముగా అవుతూ ఉంటుందో, వారికి జ్ఞానము చాలా బాగా ధారణ అవుతుంది.
2. పవిత్రమైన బుద్ధిలోనే అవినాశీ జ్ఞాన రత్నాలు నిలుస్తాయి.
3. భోజనం చాలా శుద్ధముగా ఉండాలి – తండ్రికి స్వీకరింపజేసి, ఆ తర్వాత తినడం ద్వారా కూడా జ్ఞాన ధారణ బాగా జరుగుతుంది. జ్ఞానాన్ని ధారణ చేస్తూ-చేస్తూ మీరు మురళీధరులుగా అయిపోతారు.

పాట:-

నిన్ను పిలవాలని మనస్సు కోరుకుంటుంది… (తుమ్హారే బులానే కో జీ చాహ్తా హై…)

ఓంశాంతి.

ఆత్మ పరమాత్మను పిలుస్తుంది, కేవలం ఆత్మ అని అంటే మరి ఆత్మ అయితే వాణి నుండి అతీతమైనదని అంటారు, అందుకే జీవాత్మ, పరమాత్మను పిలుస్తుందని అంటారు. పరమాత్మ గురించి భక్తుల బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్తుంది. మనుష్యులేమీ అర్థం చేసుకోరు ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపి అని వారు భావిస్తారు, అప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్ళాలి. సర్వవ్యాపి అని భావించిన కారణముగా అందరూ భగవంతుని రూపాలేనని అంటారు. వారు పిలుస్తారు కానీ బుద్ధిలో లక్ష్యము లేదు. పరమపిత పరమాత్మ వైపుకు బుద్ధి వెళ్ళదు. ఏ జీవాత్మ బుద్ధిలోకి ఇది రాదు, మనం ఆ జ్యోతిర్లింగాన్ని ఎందుకు స్మృతి చేస్తున్నాము? వారు మనకు ఏమిస్తారని వారిని మనం గుర్తు చేస్తున్నాము? ఎవరైతే చాలా మంచివి ఇచ్చి వెళ్తారో, వారిని స్మృతి చేయడము జరుగుతుంది. వారి స్మృతి జీవితాంతము ఉంటుంది. కొందరు కొంచెం ధనాన్ని ఇస్తారు, అటువంటి ఇచ్చి-పుచ్చుకోవడమైతే నడుస్తూనే ఉంటుంది. కానీ ఎవరైనా పేదవారు ఉన్నారనుకోండి, వారికి ఎవరైనా ఇల్లు కట్టి ఇచ్చినా కానీ లేదా వారి కన్యకు వివాహం చేయించడంలో ఎవరైనా సహాయం చేసినా కానీ, జీవితాంతము ఇచ్చినవారు గుర్తుంటారు. వారి నామ రూపాలు గుర్తుంటాయి – ఫలానావారు మాకు ఇల్లు కట్టించి ఇచ్చారు అని. ఇక్కడ కూడా తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులకైతే ఆత్మ గురించి గానీ, పరమాత్మ గురించి గానీ జ్ఞానము లేదు. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, దాని గురించి తెలియదు. అది లోపలికి ఎప్పుడు ప్రవేశిస్తుంది, మళ్ళీ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుంది, ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. దాని సాక్షాత్కారము కూడా దివ్య దృష్టితోనే చూడగలరు. వారు బ్రహ్మ తత్వము అని అంటారు, కావున బ్రహ్మము యొక్క సాక్షాత్కారము కూడా జరుగుతుంది. అఖండమైన ప్రకాశమే ప్రకాశము కనిపిస్తుంది. బ్రహ్మ తత్వములోనైతే తప్పకుండా చాలా ప్రకాశము కనిపిస్తుంది. కానీ పరమాత్మ ఏమీ అటువంటి వస్తువైతే కాదు కదా, మనుష్యులు ఆ విధంగా భావిస్తూ కూర్చున్నారు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఇంతకుముందు లింగం రూపమే ఉండేది. ఇప్పుడైతే బుద్ధిలో, వారు నక్షత్రము వంటివారని ఉంది. ఆత్మ రూపము అదే, ఇంకే వస్తువు అలా ఉండదు. పరమాత్మ కూడా ఆ బిందువు రూపమే. ఇప్పుడు లక్ష్మీ-నారాయణులకు ఇంత మహిమ ఉంది, వారిలో ఏ సౌందర్యము ఉంది? ఆత్మ మరియు శరీరము రెండూ సతోప్రధానముగా, పవిత్రముగా ఉన్నాయి. హర్షితముఖులుగా, తెల్లగా ఉన్నారు. ఆత్మ అయితే చాలా సూక్ష్మమైన వస్తువు కదా. ఆత్మకు మాలిన్యం చేరడముతో ప్రకాశం తగ్గిపోతుందని అర్థం చేయించడం జరుగుతుంది. ఈ ప్రకాశము తక్కువగా మరియు ఎక్కువగా ఉండడం కూడా చాలా సూక్ష్మమైన విషయము. మనం దీపము ఉదాహరణ ఇస్తాము, కానీ ఆత్మ దాని కన్నా కూడా చిన్నని నక్షత్రము. సాక్షాత్కారము జరుగుతుంది, చూసిన వెంటనే మళ్ళీ అదృశ్యమైపోతుంది. ఇప్పుడు మీరు తండ్రిని స్మరిస్తారు. తండ్రి తమ రూపం గురించి తెలియజేసారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. ఇతర మనుష్యులు శివుడిని స్మృతి చేస్తారు కానీ ఈ జ్ఞానముతో స్మృతి చేయరు. వారికి తెలియనే తెలియదు. తెలియని కారణముగా వికర్మలు వినాశనమవ్వవు. మేము యోగము జోడించడం ద్వారా వికర్మాజీతులుగా అవుతామని తెలియనే తెలియదు. అచ్ఛా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియదు. మీకు తండ్రి అర్థం చేయిస్తారు, యోగముతో మీరు వికర్మాజీతులుగా అవుతారు. 5 వికారాల మాలిన్యం భస్మమవుతుంది. వివరణ లభించిన తర్వాత ఆ సంతోషముతో స్మృతి చేస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయని వారికి తెలియదు. ఇప్పుడు తండ్రి జ్ఞానము ఇస్తారు. ఇకపోతే, మనుష్యులు అంధ విశ్వాసంలో ఉన్నారు, వీటి ద్వారా భక్తి మార్గములో అల్పకాలిక సుఖము లభిస్తుంది.

ఇప్పుడు వారిని ఇక్కడకు పిలుస్తారు, పిలవాల్సిన అవసరమే లేదని మీకు తెలుసు. పరమాత్మ గురించి తెలియనే తెలియనప్పుడు మళ్ళీ ఎలా పిలుస్తారు? ఎవరినైతే స్మృతి చేయడము జరుగుతుందో, వారి మహత్వము, కర్తవ్యము, గుణాల గురించి తెలుసుకోవాలి. పరమాత్మ పరిచయం ఎవరి వద్ద కూడా లేదు, అందుకే జన్మ-జన్మాంతరాలు ఏవేవో చేస్తూ వచ్చారు, వివేకము ఏ మాత్రము లేదు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. బాబా, మీరు వచ్చి జ్ఞానాన్ని వినిపించినట్లయితే మేము విని మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము అని పాటలో కూడా అంటారు. ఏ విధముగా శాస్త్రాలలో పిండిలో ఉప్పు అంత ఉంటుందో, అదే విధంగా ఈ భక్తి మార్గపు పాటలలో కూడా ఎంతో కొంత ఉంది. ఈ పాటలో తండ్రి మహిమ ఉంది, తండ్రిని పిలుస్తారు – మీరు వచ్చి మాకు వినిపించినట్లయితే మేము మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము. మీరు వచ్చి మాకు రాజయోగము నేర్పించినట్లయితే మేము మురళీధరులుగా అవుతాము. మురళీధరులనే జ్ఞానీ ఆత్మలు అని అనడము జరుగుతుంది. తండ్రి అయితే నిరాకారుడని పిల్లలైన మీకు తెలుసు. మరి వారు ఎలా వస్తారు? ఆత్మ పరంధామం నుండి వస్తుందని ఇప్పుడైతే అర్థం చేసుకున్నారు. మొట్టమొదట గర్భంలోకి వెళ్ళవలసి ఉంటుంది. జీవాత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు, కానీ వారి కర్తవ్యము గురించి ఏమీ తెలియదు. అలా కేవలం పిలుస్తూ ఉంటారు. వారు రానే రారు. తండ్రి అంటారు, నేను నా పూర్తి సమయానుసారముగా, ఎప్పుడైతే సంగమయుగం ప్రారంభమవుతుందో, అప్పుడు వస్తాను. సంగమయుగం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే రాత్రి పూర్తయి పగలు వచ్చేది ఉందో, అప్పుడు సంగమయుగం వస్తుంది. సంగమయుగం వచ్చిందంటే తండ్రి కూడా తోడుగా వస్తారు. సంగమయుగములోనే తండ్రి కూర్చుని చదివిస్తారు. ఈ విషయాలన్నీ బ్రాహ్మణ పిల్లలైన మీకే తెలుసు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – నేను నిరాకారుడిని, ఎలా రావాలి. దీని గురించైతే ఎవరూ, ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకవేళ కలియుగాంతములో వచ్చి ఉంటే మళ్ళీ వస్తారు కదా. కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమములో వస్తారు. తప్పకుండా ఏదో కార్యము చేసేందుకే వస్తారు. తప్పకుండా సృష్టిని పావనంగా చేయడానికి వస్తారు, వారు వచ్చినప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన చేసేందుకు వస్తారని అంటారు. ఎలా వస్తారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి ప్రజలను రచించవలసి ఉంటుంది లేక రాజయోగము నేర్పించవలసి ఉంటుంది, మరి ఎవరికి నేర్పిస్తారు? సత్యయుగం ఆదిలోనైతే దేవతా వర్ణము ఉంటుంది. దానికి ముందు బ్రాహ్మణ వర్ణం ఉంటుంది. మరి తప్పకుండా బ్రహ్మా తనువులోకి వచ్చి బ్రాహ్మణ వర్ణాన్ని రచించవలసి ఉంటుంది. బ్రహ్మాను ప్రజాపిత అనే అంటారు. ఇప్పుడు ఆ బ్రహ్మా ఎక్కడి నుండి వస్తారు. సూక్ష్మవతనము నుండి దిగి వస్తారా? ఎలాగైతే విష్ణువు అవతరణ గురించి, పై నుండి గరుడ వాహనముపై స్వారీ చేస్తూ వస్తారని చూపిస్తారు. ఇప్పుడు విష్ణువైతే ఇక్కడకు వచ్చేది లేదు. విష్ణువు రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు ఎవరైతే ఉన్నారో, వారు కూడా ఇక్కడ ఈ చదువుతోనే ఈ పదవిని పొందారు. విష్ణువు రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులే పాలన చేస్తారు. కానీ అలా ఎవ్వరూ గరుడ వాహనంపై దిగి రారు మరియు అక్కడేమీ లక్ష్మీ-నారాయణుల ఆత్మలు కలిసి రావు. మొదట నారాయణుని ఆత్మ వస్తుంది, ఆ తర్వాత లక్ష్మిది వస్తుంది. స్వయంవరం చేసుకున్న తర్వాత విష్ణువుగా యుగళ్ రూపముగా పిలువబడతారు. రాధే-కృష్ణులు తప్పకుండా విష్ణువు యొక్క రెండు రూపాలు. బాల్యాన్ని కూడా చూపించవలసి ఉంటుంది కదా. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే ఈ మొదటి నంబరువారు 84 జన్మలను పూర్తి చేస్తారో, అప్పుడు మేము వీరిలోకే వచ్చి మళ్ళీ వీరిని మొదటి నంబరుగా చేయవలసి ఉంటుంది. 84 జన్మలను అనుభవించి తప్పకుండా వృద్ధ అవస్థను పొంది ఉంటారు, అప్పుడే వారికి బ్రహ్మా అన్న పేరును పెట్టారు. వీరిలోకి ప్రవేశించారు.

మనుష్య సృష్టిని ఏ విధముగా మరియు ఎప్పుడు రచిస్తారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయం గురించి మనుష్యులెవ్వరికీ జ్ఞానము ఉండదు. మనుష్యులు ఎప్పుడైనా ఏదైనా మంచి కొత్త వస్తువును ఆవిష్కరిస్తే గవర్నమెంట్ వద్దకు వెళ్తారు, ఆ తర్వాత వారు దానిని వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సహాయం చేస్తారు. ఈ జ్ఞానం కూడా అటువంటిదే. మొట్టమొదట తండ్రి వచ్చి వీరిలోకి ప్రవేశించారు, వీరిలో కూర్చొని జ్ఞానాన్ని ఇచ్చారు. మొదట కొద్ది-కొద్దిగా ఉండేది, ఇప్పుడు వృద్ధి పొందుతూ ఉంటుంది. ఎంతటి గుహ్యాతి గుహ్యమైన విషయాలను మీరు వింటున్నారు. మొదట తేలికపాటి జ్ఞానము ఉండేది, ఇప్పుడు లోతైనది లభిస్తూ ఉంటుంది. కానీ ఆత్మలో పాత భక్తి యొక్క తప్పుడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పుడైతే తొలగుతాయో, అప్పుడే జ్ఞాన ధారణ జరుగుతుంది. ఎప్పుడైతే యోగం ఉంటుందో, అప్పుడే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి మరియు బుద్ధి శుద్ధమవుతూ ఉంటుంది. మొదట కొద్దిగా జ్ఞానము విన్నా సరే, ఎంతగా నషా ఎక్కి పరుగులు తీసారు. ఆ తర్వాత ఎంతోమంది పడిపోయారు కూడా. మాయ కూడా హైరానా పరుస్తుంది. ఇప్పుడు బ్రహ్మా యొక్క పిల్లలు, బ్రహ్మాకుమారులు మరియు కుమారీలుగా అయ్యారు. ఈ విషయాన్ని పూర్తి రీతిలో అర్థం చేయించాలి. లేదంటే మనుష్యులు భయపడతారు. ఇప్పుడు తండ్రి అయితే తప్పకుండా బ్రహ్మా శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. అది కూడా పెద్దది కావాలి. చిన్న పిల్లలలోకి ప్రవేశిస్తారా ఏమిటి? అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమములో వస్తానని అంటారు. వీరు చాలా శాస్త్రాలను చదివారు, గురువుల దగ్గరకు వెళ్ళారు. మరి అనుభవజ్ఞులు అయి ఉంటారు కదా. తండ్రి అంటారు, నేను వానప్రస్థ అవస్థలో వస్తాను. వీరు శాస్త్రాలు మొదలైనవి చదివారు, కావుననే అర్థం చేయించగలరు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, బాబా ఎలా వస్తారు మరియు వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారుచేస్తారు అనగా పాత ప్రపంచాన్ని కొత్తగా ఎలా తయారుచేస్తారు. మిమ్మల్ని ఇప్పుడు కొత్తగా తయారుచేస్తున్నారు. ఈ పాత తనువులో రాజయోగం నేర్చుకొని మళ్ళీ సత్యయుగీ కొత్త శరీరాన్ని తీసుకుంటారు. తర్వాత దేవీ-దేవతలుగా పిలవబడతారు. అక్కడ మాయ ఉండదు. మేము బ్రహ్మాకుమారులము, కుమారీలము అని మీరు అర్థం చేయించవచ్చు. బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు. ఈ విషయాన్ని అయితే అందరూ అంగీకరిస్తారు – భగవంతుడు ఆడమ్-బీబీల (బ్రహ్మా-సరస్వతి) ద్వారా రచనను రచించారు. నేను రాజులకే రాజులుగా తయారుచేస్తానని గీతలో అంటారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి జ్ఞానామృతాన్ని తాగించి, అసురుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఇది రాయబడి ఉంది కానీ మొదట శూద్ర వర్ణము నుండి బ్రాహ్మణ వర్ణములోకి తీసుకువస్తారు, కావున మేము బ్రహ్మాకుమారులము, కుమారీలము అని మీరు అర్థం చేయించగలరు. బ్రహ్మా ప్రజాపిత. వాస్తవానికి మీరు కూడా బ్రహ్మా సంతానమే, బ్రాహ్మణులుగా అవ్వడమనేది సంగమములోనే జరుగుతుంది. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులైన మనం చదువుకుంటాము. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని సంభాళిస్తాము. మనం మన వికారాల ఆహుతినిస్తాము. యజ్ఞంలో అంతా స్వాహా చేయబడుతుంది కదా. కావున మనం రుద్ర జ్ఞాన యజ్ఞములో ఇంకే చెత్తను వేయము, మన పాపాలను స్వాహా చేస్తాము. అగ్ని మొదలైనవేవీ ప్రజ్వలితం చేయడము జరగదు. అలాగే శబ్దము మొదలైనవేవీ చేయము. వారైతే అక్కడ స్వాహా, స్వాహా… అంటూ ఎంతగా శబ్దాలు చేస్తారు. మనమైతే యోగంలో ఉంటాము, ఏ శబ్దం ఉండదు. నిశ్శబ్దముగా ఉంటాము. యోగాగ్నితో పాపాలు భస్మమవుతాయి. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో యోగాగ్నితో మనం మన 5 వికారాలను స్వాహా చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. బ్రహ్మా యొక్క పుత్రిక అయిన సరస్వతి కూడా గాయనం చేయబడ్డారు, వారిని జగదంబ అని అంటారు, వారి ద్వారా అన్ని కామనలు పూర్తవుతాయి. ఆ అంబ మళ్ళీ లక్ష్మిగా అవుతారు.

పిల్లలకు పాయింట్లు అయితే చాలా అర్థం చేయించడము జరుగుతుంది, ధారణ కూడా జరగాలి కదా. ఎప్పుడైతే యోగంలో ఉంటారో, అప్పుడే ధారణ జరుగుతుంది, మళ్ళీ వికర్మలు కూడా వినాశనమవ్వాలి. బుద్ధి పవిత్రంగా ఉండకపోతే అవినాశీ జ్ఞాన రత్నాలు నిలవవు. పిల్లలకు అర్థం చేయించారు, మొదట భోగ్ పెట్టి, ఆ తర్వాతే తినడము జరుగుతుంది ఎందుకంటే అంతా వారి ద్వారా ఇవ్వబడినది. కావున మొదట వారిని స్మృతి చేసి భోగ్ పెడతారు, ఆ సమయంలో ఆహ్వానించడము జరుగుతుంది. ఆ తర్వాత కలిసి తింటున్నట్లుగా ఉంటుంది. బాబా అయితే సంపూర్ణ పవిత్రులు. మనం ఆటవికులవంటివారము. మనం స్మృతి చేస్తే బాబా మనతో పాటు కూర్చుని తినగలరా. మనం స్వయాన్ని సంపూర్ణ పవిత్రులు అని అయితే అనలేము. మరి ఆటవికులవంటి మనతో వారు తింటారా? భావనను స్వీకరిస్తారు. భావన స్వీకరించడము ఏమీ తినడమైతే కాదు కదా. సువాసనను తీసుకుంటారు. అయితే, ఎవరైనా 75 శాతం ధారణ చేసే మంచి పిల్లలు భోజనం తయారుచేసి బాబాకు తినిపించినట్లయితే, అది భావనా యోగ్యంగా కూడా ఉండాలి ఎందుకంటే బాబా పూర్తిగా శుద్ధమైనవారు. వారు పతితులైన మనతో తినాలి అని లా చెప్పదు. వారు భావనను తీసుకుంటూ ఉండవచ్చు? బాబా అంటారు, నేను భావనను కూడా ఎందుకు తీసుకోవాలి, నేనైతే నిష్కామిని. భావన తీసుకోవాలి అన్న కోరిక కూడా నాలో లేదు. నేను 100 శాతం నిష్కామిని. భోగ్ పైకి వెళ్తుంది, బహురూపి కూర్చొని దేవతలకు తినిపిస్తారు. మేము బ్రహ్మా భోజనాన్ని తినాలి అని దేవతలు కోరుకుంటారు, కావున బాబా, మమ్మా మరియు పై నుండి దేవతల ఆత్మలు వస్తాయి, వారు కూర్చొని తింటారు. అది కూడా ఎప్పుడైతే వండేవారు యోగీగా ఉంటారో, అప్పుడే అభిరుచితో తింటారు. దేవతలు కూడా బ్రహ్మా భోజనాన్ని మహిమ చేస్తారు. తండ్రి అయితే అంటారు, నేను మీకు సేవ చేసేందుకే వచ్చి ఉన్నాను. నేను మీకు పూర్తి నిష్కామ సేవాధారిని. మీరు 36 రకాలైనా పెట్టండి లేదా 108 రకాల భోగ్ నైనా పెట్టండి, భక్తులే భోగ్ పెడతారు మరియు భక్తులే పంచుకొని తింటారు. భగవంతుడు నిష్కామి, అయినా కూడా ఆఫర్ చేయాలి. గొప్ప రాజులు మొదలైనవారు ఎప్పుడూ చేతిలోకి తీసుకోరు. వారిలో కూడా రకరకాలవారు ఉంటారు. కొందరు తీసుకుంటారు కూడా. బాబాకు రాజులు మొదలైనవారితో కనెక్షన్ ఉండేది కదా. కావున మనం బాబాకు భోగ్ పెడతాము, బాబా నుండి విశ్వానికి యజమానులుగా అయ్యే రాజ్యాన్ని తీసుకోవాలి అన్న కోరిక మనకు ఉంది. వారు ఉన్నదే దాత. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు. భోగ్ ను ఎక్కడికీ తీసుకువెళ్ళడము జరగదు. ఇక్కడే కూర్చొని వైకుంఠం యొక్క సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇక్కడి నుండి మాయమైనట్లుగా ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నిష్కామి కావచ్చు, కానీ భోజనం యొక్క భోగ్ ను తప్పకుండా పెట్టాలి. చాలా శుద్ధతతో భోజనం తయారుచేసి బాబాతో కూర్చొని తినాలి.

2. ఈ రుద్ర యజ్ఞంలో యోగబలంతో మీ పాపాలను స్వాహా చేసుకోవాలి. శబ్దంలోకి రాకూడదు, మౌనంగా ఉండాలి. బుద్ధిని యోగబలంతో పవిత్రంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

అతీతంగా మరియు ప్రియంగా అయ్యే విశేషత ద్వారా తండ్రికి ప్రియంగా అయ్యే నిరంతర యోగీ భవ

నేను తండ్రికి ఎంత ప్రియంగా ఉన్నాను అన్నదాని యొక్క లెక్క అతీతంగా ఉన్నదాని ద్వారా వేయవచ్చు. ఒకవేళ కొద్దిగా అతీతంగా ఉండి, మిగిలినదంతా చిక్కుకుని ఉన్నట్లయితే ప్రియమైనవారిగా కూడా అంతగానే ఉంటారు. ఎవరైతే సదా తండ్రికి ప్రియమైనవారో, వారికి గుర్తు – స్వతహా స్మృతి. ప్రియమైన వస్తువు స్వతహాగా మరియు నిరంతరంగా గుర్తుంటుంది. మరి వీరు కల్ప-కల్పపు ప్రియమైన వస్తువు. ఇటువంటి ప్రియమైన వస్తువును ఎలా మర్చిపోగలరు! ఎప్పుడైతే తండ్రి కన్నా కూడా అధికంగా ఎవరైనా వ్యక్తిని లేక ఏదైనా వస్తువును ప్రియముగా భావించడం మొదలుపెడతారో, అప్పుడే మర్చిపోతారు. ఒకవేళ సదా తండ్రిని ప్రియమైనవారిగా భావించినట్లయితే నిరంతర యోగీగా అయిపోతారు.

స్లోగన్:-

ఎవరైతే తమ పేరు-గౌరవం మరియు కీర్తిని త్యాగం చేసి అనంతమైన సేవలో ఉంటారో, వారే పరోపకారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top