TELUGU MURLI 08-03-2023

                 08-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – అందరికీ సుఖాన్ని ఇచ్చే భోళా వ్యాపారి ఒక్క తండ్రియే, వారే మీ పాత వస్తువులన్నింటినీ తీసుకొని కొత్తవాటిని ఇస్తారు, వారి పూజయే జరుగుతుంది’’

ప్రశ్న:-

మీ ఈశ్వరీయ మిషనరీ యొక్క కర్తవ్యము ఏమిటి, మీరు ఏ సేవను చేయాలి?

జవాబు:-

మీ కర్తవ్యమేమిటంటే – మనుష్యమాత్రులందరి కళ్యాణాన్ని చేయడము, అందరినీ తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారుచేయడానికి తండ్రి సందేశాన్ని ఇవ్వడము. స్వర్గ స్థాపన కర్త అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ కళ్యాణము జరుగుతుంది అని మీరు అందరికీ తెలియజేయండి. మీరు అందరికీ లక్ష్యాన్ని ఇవ్వాలి. దేవతలను నమ్మేవారు ఎవరైతే ఉంటారో, మీ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. మీవన్నీ ఆత్మికమైన విషయాలు.

పాట:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు… (భోలేనాథ్ సే నిరాలా…)

ఓం శాంతి.

భోళానాథుడైన శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. భోళానాథుడు కేవలం ఒక్క శివబాబాయే. వారిని గౌరీనాథుడు అని కూడా అంటారు, గౌరి అనగా ఒక్క పార్వతి మాత్రమే కాదు. గౌరీనాథుడు లేక బబుల్ నాథుడు అనగా వారు తుమ్మ ముళ్ళ వంటివారిని పుష్పాలుగా తయారుచేస్తారు మరియు ఎవరైతే నల్లగా అయిపోయారో వారిని తెల్లగా తయారుచేస్తారు. మహిమ అంతా ఒక్కరిదే. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము లేక డ్రామా. డ్రామా అని అన్నప్పుడు అందులో ముఖ్యమైన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా గుర్తుకొస్తారు. ముఖ్యంగా తప్పకుండా హీరో, హీరోయిన్ల జోడీ ఉంటుంది. ఇక్కడ కూడా ముఖ్యమైనవారు ఎవరో ఒకరు తప్పకుండా కావాలి. మాత-పిత ప్రసిద్ధమైనవారు. సూక్ష్మవతనములో శంకర, పార్వతులు ఉన్నారు అని అంటారు. బ్రహ్మా గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. బ్రహ్మా, సరస్వతులు అని అంటారు, కానీ వారు జంట ఏమీ కాదు. నిజానికి శంకర, పార్వతుల జంట కూడా లేదు. విష్ణువు గురించి కూడా ప్రపంచానికి తెలియదు. వారికి ఏ అలంకారాలనైతే చూపిస్తారో అవి కూడా వారివి కావు. ఇక్కడ లక్ష్మీ-నారాయణుల జంట అని అంటారు. ఎంతో సుఖాన్ని ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో, వారినే అందరికన్నా భోళానాథుడు అని అంటారు. భోళానాథుడు వ్యాపారి కూడా. మన నుండి పాత వస్తువులు తీసుకొని కొత్తవాటిని ఇస్తారు. మొట్టమొదట బుద్ధిలోకి రావాల్సింది ఏమిటంటే – అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు ఎవరు? అందరికన్నా ఎక్కువ సుఖాన్ని ఇచ్చేవారు ఎవరు? ఎవరైతే అనేకులకు సుఖాన్నిస్తారో వారికి పూజ కూడా జరుగుతుంది. కావున ఇవన్నీ విచార సాగర మథనము చేయాల్సిన విషయాలు. విచార సాగర మథనము అన్న పదము చాలా ప్రసిద్ధమైనది. కావున మనుష్యులలో ఉన్నతోన్నతులు లక్ష్మీ-నారాయణులు అని భావించడం జరుగుతుంది, అచ్ఛా, వారు ఏ సుఖాన్ని ఇచ్చినందుకు మనుష్యులు వారిని తలచుకుంటూ ఉంటారు మరియు వారిని పూజిస్తూ ఉంటారు? నిజానికి వారేమీ సుఖాన్ని ఇవ్వలేదు. అయితే, వారు సుఖధామానికి యజమానులుగా ఉండేవారు, కానీ వారిని ఆ విధముగా తయారుచేసినవారు ఎవరు? అంతకుముందు వారెక్కడ ఉండేవారు? ఒకవేళ బాబా వారిని ఆవిధముగా తయారుచేయకపోతే వారు ఎక్కడ ఉండేవారు! ఈ విషయాలన్నీ పిల్లలకు తెలుసు. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. వారు ఇంత ఉన్నతముగా తయారయ్యారంటే దాని కొరకు వారికి అటువంటి పనిని ఎవరు నేర్పించారు? తప్పకుండా ఏదో శిక్షణ లభించింది! గతంలో వారు ఎవరు అనేది ప్రపంచానికి తెలియదు. లక్ష్మీ-నారాయణులు 84 జన్మలను తీసుకొని అంతిమంలో బ్రహ్మా-సరస్వతులుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. మరి లక్ష్మీ-నారాయణుల మహిమను గానం చేయాలా లేక వారి చేత ఎవరైతే పురుషార్థం చేయిస్తారో, వారికి ఎవరైతే ప్రారబ్ధాన్ని ఇచ్చారో వారి మహిమను చేయాలా? ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. లక్ష్మీ-నారాయణులు ఏమి చేసి వెళ్ళారు అనేది అర్థం చేయించాలి. వారిది కూడా మొత్తం రాజధాని కొనసాగింది. కానీ గాయనము కేవలం ఒక్కరిది మాత్రమే కొనసాగుతుంది. శంకరాచార్యులు వచ్చి సన్యాసుల రచనను రచించారు, తర్వాత వారి పాలనను కూడా చేసారు. ఆ తర్వాత ఎప్పుడైతే తమోప్రధానావస్థను పొందుతారో, అప్పుడు వారిని సతోప్రధానముగా ఎవరు తయారుచేయాలి? మాయ అందరినీ తమోప్రధానముగా చేసేసింది. లక్ష్మీ-నారాయణులు ఎవరైతే సతోప్రధానులుగా ఉండేవారో, వారు మళ్ళీ చక్రములో తిరిగి తమోప్రధానతలోకి వస్తారు. ప్రతి ఒక్కరి విషయంలో ఇలాగే జరుగుతుంది. ఎంత పెద్ద పదవిలో ఉన్నవారైనా, సతో, రజో, తమోలను ప్రతి ఒక్కరూ దాటాల్సిందే. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. మరి ఈ తమోప్రధాన ప్రపంచాన్ని మళ్ళీ సతోప్రధానంగా ఎవరు తయారుచేయాలి? మొట్టమొదట సతోప్రధానులు సుఖములోకి వస్తారు, ఆ తర్వాత దుఃఖములోకి వెళ్తారు. ఈ రహస్యము ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. 84 జన్మలు తీసుకోవడం జరిగితే తప్పకుండా సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అవ్వాల్సే ఉంటుంది. ప్రతి వస్తువూ సతో, రజో, తమోగా తప్పకుండా అవుతుంది. మత ప్రవక్తలు కూడా ఇలా అవుతారు. వారు కూడా ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. మరి ఎప్పుడూ తమోప్రధానంగా అవ్వని ఉన్నతోన్నతమైనవారు ఎవరు? ఒకవేళ వారు కూడా తమోప్రధానంగా అయినట్లయితే మరి వారిని సతోప్రధానంగా ఎవరు తయారుచేస్తారు? కావున బలిహారమంతా వారిదే. ఈ-ఈ విధంగా విచార సాగర మథనము చేయడం ద్వారా హృదయానికి ఏ పాయింట్ అయితే నచ్చుతుందో, మంచిగా అనిపిస్తుందో, దానిని వినిపించడం జరుగుతుంది. భోళానాథుడైన పరమపిత పరమాత్మయే అందరి సద్గతిదాత, వారే సతోప్రధానులుగా తయారుచేస్తారు. అందరూ దుర్గతి నుండి బయటకు వచ్చి గతి, సద్గతులను పొందుతారు. నంబరువారుగా ఎవరెవరైతే మొట్టమొదట వస్తారో – వారు సతోప్రధాన, సతో, రజోలను దాటి తమోప్రధానులుగా తప్పకుండా అవుతారు. మొట్టమొదట ఎప్పుడైతే ఆత్మ కిందికి వస్తుందో అప్పుడు సుఖాన్ని అనుభవిస్తుంది. దుఃఖాన్ని అనుభవించదు. అది కొత్త ఆత్మ అని, అందుకే ఇంత సుఖము ఉంది, గౌరవము ఉంది అని మనుష్యులు గుర్తించలేరు. ఇప్పుడు అందరిదీ తమోప్రధాన అవస్థ. తత్వాలు, గనులు మొదలైనవన్నీ తమోప్రధానంగా ఉన్నాయి. కొత్త వస్తువులు ఉండేవి, ఇప్పుడు పాతవిగా అయిపోయాయి. అక్కడి ధాన్యము, ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ ఎంత బాగుంటాయి, అది కూడా పిల్లలకు సాక్షాత్కారం చేయించడం జరిగింది. సూక్ష్మవతనములోకి కుమార్తెలు వెళ్తారు, బాబా శూభీ రసాన్ని త్రాగించారు అని చెప్తారు. తప్పకుండా ఉన్నతోన్నతుడైన తండ్రి, వస్తువులు కూడా ఉన్నతోన్నతమైనవే ఇస్తారు. ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడేనని పిల్లలకు బుద్ధిలో ఉండాలి. అందరూ వారినే స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ అని అంటారు, గాడ్ తప్పకుండా పైనే ఉంటారు. ఆత్మ గాడ్ ఫాదర్ ను తలచుకుంటుంది. ఎందుకంటే ఆత్మకు దుఃఖము ఉంది కావున భోళానాథుడైన తండ్రి వచ్చి సుఖాన్ని ఇస్తారు. మరి వారిని ఎందుకు స్మృతి చేయరు? ఆత్మ అంటుంది, నేను శరీరముతో ఎప్పుడైతే దుఃఖితముగా అవుతానో అప్పుడు తండ్రిని ఎంతగానో స్మృతి చేస్తాను. శత్రువైన రావణుడు దుఃఖాన్ని ఇస్తాడు కావున తండ్రిని స్మృతి చేస్తారు. దుఃఖములో ఆత్మలమైన మనమందరమూ పరమాత్మను స్మృతి చేస్తాము. మళ్ళీ ఎప్పుడైతే ఆత్మలమైన మనం స్వర్గములో ఉంటామో అప్పుడు తండ్రిని స్మృతి చేయము. ఈ విధంగా ఆత్మయే అంటుంది, ఆత్మ తండ్రినే పిలుస్తుంది కదా. మనుష్యులకైతే వారి కర్తవ్యము గురించి, చరిత్ర గురించి ఏమీ తెలియదు. ఆత్మ ఏ విధంగా చక్రములోకి వస్తుందో, ఆ డ్రామా రహస్యము గురించి కూడా ఏమీ తెలియదు. మాయా రావణుడు దుఃఖాన్ని ఇస్తాడు అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఈ రావణ రాజ్యం ద్వాపరము నుండి ప్రారంభమయ్యింది. ఇది కూడా అర్థం చేయించాలి ఎందుకంటే అందరికన్నా పురాతన శత్రువు రావణుడే అని ఎవరికీ తెలియదు. అతని మతము అనుసారముగానే ఈ విభజనలు మొదలైనవన్నీ జరిగాయి.

మనం శ్రీమతము ద్వారా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారే అందరి సద్గతిదాత. వారెప్పుడైతే వస్తారో అప్పుడే బ్రహ్మా, విష్ణు, శంకరుల ద్వారా కార్యము చేయిస్తారు. ఉన్నతోన్నతమైనవారు వారొక్కరే, వారి చరిత్రను గురించి ఎవరికీ తెలియదు. ఈ ఆటయే ఈ విధంగా తయారుచేయబడి ఉంది. కావున బాబా అర్థం చేయిస్తారు, అందరికన్నా పెద్ద శత్రువు రావణుడు, అతడిపై విజయం పొందాలి. ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో వారికే అర్థం చేయిస్తారు. వారే వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. సత్యయుగము నుండి త్రేతా అంతిమము వరకు సాంప్రదాయము ఎంతగా వృద్ధి చెందుతూ ఉంటుందో ఆలోచించండి. మరి ఇంతమందికి జ్ఞానాన్ని ఇచ్చే సేవను చేయాలి. ఇంతమందిలో జ్ఞాన బీజాన్ని నాటాలి. జ్ఞానం ఎప్పుడూ వినాశనమవ్వదు. యుద్ధం చేసేవారి ఉద్ధరణ కూడా చేయాలి. మన దైవీ సాంప్రదాయం వారు ఎక్కడ ఉన్నా సరే, వారు బయటకు వస్తారు. ఎవరైతే యుద్ధ మైదానములో మరణిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని ఆ యుద్ధం చేసేవారితో అంటారు కానీ వారు అలా చెప్పినంత మాత్రాన ఏమీ స్వర్గములోకి వెళ్ళలేరు. ఎప్పటివరకైతే మీరు లక్ష్యాన్ని ఇవ్వరో అప్పటివరకు వెళ్ళలేరు. లక్ష్యాన్ని కేవలం బ్రాహ్మణులే ఇవ్వగలుగుతారు, అందరూ తప్పకుండా మరణించవలసిందే. ముసల్మానులు అల్లాహ్ ను స్మృతి చేస్తారు, సిక్కులు గురునానక్ ను స్మృతి చేస్తారు కానీ స్వర్గములోకేమైనా వెళ్ళగలరా. సంగమయుగములోనే స్వర్గములోకి వెళ్ళడం జరుగుతుంది. కావున ఈ యుద్ధాలు చేసేవారికి కూడా బ్రాహ్మణులైన మీరు తప్ప ఈ మంత్రాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. స్వర్గానికి యజమానులుగా తయారుచేసేవారు అందరికన్నా ఉన్నతోన్నతుడైన ఆ తండ్రే. యుద్ధంలో మరణించేవారు స్వర్గములోకి వెళ్తారు అని భగవానువాచ ఉండడం కరక్టే కానీ అది ఏ యుద్ధము? రెండు రకాల యుద్ధాలు ఉన్నాయి. ఒకటి ఆత్మికమైనది, ఇంకొకటి దైహికమైనది. ఆ తుపాకీ బుల్లెట్లతో యుద్ధం చేసేవారికి కూడా మీరు జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. మీ తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గములోకి వెళ్తారు అని ఉంది. ఎప్పుడైతే సంగమయుగము ఉంటుందో అప్పుడే మీరు స్వర్గములోకి వెళ్లగలుగుతారు. అవన్నీ దైహికమైన విషయాలు, ఇవి ఆత్మిక విషయాలు. మనది మాయపై విజయాన్ని పొందే యుద్ధము. మరణించే సమయంలో మనుష్యులకు మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. వారు మరణించేందుకే వెళ్తారు కావున బాబా సందేశాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వండి అని ఒక రోజు ప్రభుత్వము కూడా మీకు చెప్తుంది. మీరు ఈశ్వరీయ మిషనరీ. మీ పని అనేకుల కళ్యాణము చేయడం. భగవంతుడిని స్మృతి చేయండి, ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది అని చెప్పండి, ఇది విని ఎంతో సంతోషిస్తారు. ఎవరైతే ఈ కులానికి చెందినవారు ఉంటారో, వారే అంగీకరిస్తారు. దేవతలను నమ్మేవారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు కావున అందరి కళ్యాణము చేయాలి. తండ్రిని స్మృతి చేయకుండా ఎవరూ స్వర్గములోకి వెళ్ళలేరు. స్వర్గ స్థాపన కర్త అయిన తండ్రిని ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడే కళ్యాణము జరుగుతుంది. యుద్ధం చేసేవారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు కావున మళ్ళీ యుద్ధాలలోకే వస్తారు అని బాబా అర్థం చేయించారు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా. స్వర్గములోకైతే వెళ్ళలేరు. ఎవరైతే భారత్ కు సేవ చేస్తారో వారికి ఫలమైతే లభించాలి కదా. కావున వారి సేవను కూడా చేయాలి, పెద్ద-పెద్ద వారికి అర్థం చేయించాలి. మీ ప్రభావము వెలువడుతుంది. ఇక్కడికి వచ్చి భాషణ చేయండి అని మీతో అంటారు. ఏ విధముగా మేజర్ బాబాను ఆహ్వానించారు. అక్కడా, ఇక్కడా అర్థం చేయించేందుకు దూరవలసి ఉంటుంది. పెద్దవారికి అర్థం చేయించడం ద్వారా చిన్నవారు ఎందరో వస్తారు. కానీ మీరు గురువులకు మొదట అర్థం చేయించినట్లయితే వారి శిష్యులు వారి తలను పాడు చేసేస్తారు, అప్పుడిక వారిని తొలగించి ఇంకెవరికైనా ఆ స్థానాన్ని ఇచ్చేస్తారు ఎందుకంటే ఇవి పూర్తిగా కొత్త విషయాలు కదా. మొత్తం ప్రపంచంలోని మనుష్యులు ఒక్కరు కూడా గీతను పూర్తిగా అర్థం చేసుకోరు. తప్పకుండా రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది అని అంటారు, ఆ తర్వాత ఏం జరిగింది, అది వారికి తెలియదు. మనుష్యులకు ఏమీ తెలియదు. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. క్రైస్ట్ ఇక్కడ బికారి రూపంలో ఉన్నారని క్రిస్టియన్లు కూడా అంగీకరిస్తారు. మరి బికారి నుండి సంపన్నుడిగా ఎవరు తయారుచేయాలి? సర్వుల సద్గతిదాత అయితే ఒక్క పరమాత్మయే, కావున ఒకవేళ పిల్లలైన మీరు కూర్చొని బాగా అర్థం చేయించినట్లయితే అనేకుల కళ్యాణం చేయగలుగుతారు. స్వర్గ రచయిత అయిన తండ్రే పతిత పావనుడు, కావున వారి శ్రీమతముపై నడవాల్సి ఉంటుంది. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారే వెలువడుతారు. ఎవరికైతే స్వదర్శన చక్రము లేక మన్మనాభవ అర్థము బుద్ధిలో ఉంటుందో, వారినే బ్రాహ్మణులు అని అంటారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. ప్రజలుగా ఎంతోమంది అవుతారు. త్రేతా అంతిమము వరకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మంత్రము లభిస్తుంది. ఎవరైతే మన కులానికి చెందినవారు ఉంటారో వారికే బాణం తగులుతుంది. మీ బాణాలలో ఇప్పుడు శక్తి నిండుతూ ఉంటుంది. ఆ తర్వాత చివరిలో చాలా తీక్షణమైన బాణాలు తగులుతాయి. సన్యాసులకు కూడా బాణాలు తగిలాయి కదా. తప్పకుండా భగవంతుడే ఈ బాణాలను వేస్తారు అని ఆ తర్వాత అర్థం చేసుకుంటారు. మీ జ్ఞాన బాణాలు ఇప్పుడు ఎంతో శక్తివంతంగా, రిఫైన్ గా అవుతూ ఉంటాయి. ముఖ్యమైన బాణము ఒక్కటే – మన్మనాభవ. ఇదే సంగమయుగమని, ఇక్కడి నుండే స్వర్గములోకి వెళ్ళగలుగుతారని యథార్థ రీతిగా అర్థం చేయించారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలిచి ఉంది. అది కూడా యుద్ధ మైదానమే, ఇది కూడా యుద్ధ మైదానమే. మాయపై విజయం పొందడంలో శ్రమ ఉంటుంది. సాధారణ ప్రజలుగా కూడా ఎందరో అవ్వనున్నారు. ఈ కులములోకి వచ్చేవారు ఎవరైతే ఉండరో వారికి అసలు గుర్తే ఉండదు. సేవ కొరకు విచార సాగర మథనము చేస్తూ ఉన్నట్లయితే మీకు జ్ఞానపు పాయింట్లు వస్తూ ఉంటాయి. ఆ యుద్ధములో కూడా – ఈ విధంగా చేస్తే విజయాన్ని పొందుతాము అని విచార సాగర మథనము నడుస్తుంది. బుద్ధి అయితే ఆ కోణంలో నడుస్తుంది కదా. అభ్యాసము కూడా చేస్తారు. ఎప్పుడైతే చురుకుగా అవుతారో అప్పుడు యుద్ధము చేయడానికి మైదానములోకి వెళ్తారు. మీ వద్దకు లెక్కలేనంత మంది వస్తారు. భగవంతుని ద్వారము వద్ద భక్తుల గుంపు ఏర్పడనున్నది, దోమల గుంపులా వస్తారు. భగవంతుని వద్ద ఎంతైతే భక్తుల గుంపు ఉంటుందో అంత గుంపు ప్రధానమంత్రి లేక రాజులు, రాణులు వచ్చినప్పుడు ఉండదు. భగవంతుని వద్దకు ఎంతో భావనతో వస్తారు. ఎటువంటి చెడు ఆలోచన ఉండదు. వీరు నిరాకారుడైన తండ్రి కదా. కావున భగవంతుని ఎదురుగా భక్తుల గుంపు ఉండాలి అని భావించడం జరుగుతుంది, అందరూ ఇక్కడికి రావాల్సే ఉంటుంది. ఇక్కడ మన జడమైన స్మృతిచిహ్నాలు కరెక్టుగా ఉన్నాయి. శివబాబా చిత్రము కూడా ఉంది, జగత్పిత, జగదాంబ కూడా ఉన్నారు. ఇప్పుడు మీ ఈ సమూహము శక్తి సేన సమూహము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు స్వదర్శన చక్రము మరియు మన్మనాభవ యొక్క అర్థాన్ని బుద్ధిలో యథార్థ రీతిగా ఉంచుకోవాలి. అందరికీ లక్ష్యాన్ని ఇచ్చే సేవను చేయాలి.

2. మాయపై విజయం పొందేందుకు విచార సాగర మథనము చేస్తూ జ్ఞానపు లోతుల్లోకి వెళ్ళాలి. రత్నాలను వెలికి తీయాలి.

వరదానము:-

పవిత్రత యొక్క స్థితి ద్వారా అవినాశీ ఈశ్వరీయ ఆనందాన్ని అనుభవం చేసే హోలీహంస భవ

హోలీ పండుగ నాడు అందరూ పెద్ద-చిన్న అన్న భానాన్ని మరచి పరస్పరంలో అందరమూ సమానమే అని భావించి ఆనందంగా ఆడుకుంటారు, శత్రుత్వపు సంస్కారాలను మరచి మంగళ మిలనమును జరుపుకుంటారు. ఈ ఆచారము కూడా ఇప్పటిదే. పిల్లలైన మీరు ఎప్పుడైతే హోలీ అనగా పవిత్రత యొక్క స్థితిలో నిలుస్తారో, తండ్రి సాంగత్యము అనే రంగులో రంగరింపబడి ఉంటారో, అప్పుడు ఈశ్వరీయ ఆనందంలో దేహ భానాన్ని లేక భిన్న-భిన్న సంబంధాల భానాన్ని, చిన్న-పెద్ద అన్న భానాన్ని విస్మృతి చెంది ఒక్క ఆత్మ స్వరూప భానము ఉంటుంది. ఇదే హోలీహంస స్థితి. ఈ స్మృతి చిహ్నమునే ప్రతి సంవత్సరము హోలీ ఉత్సవముగా జరుపుకుంటారు.

స్లోగన్:-

ఎవరి జీవితములోనైతే శీతలత ఉంటుందో, వారు ఇతరుల రగులుతున్న హృదయాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top