TELUGU MURLI 07-03-2023

               07-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – విజయీ రత్నాలుగా అయ్యేందుకు జీవిస్తూనే మరణించి దేహీ-అభిమానులుగా అయి తండ్రి మెడలో హారముగా అయ్యేందుకు పురుషార్థం చేయండి’’

ప్రశ్న:-

స్వదర్శన చక్రం యొక్క రహస్యం స్పష్టముగా ఉంటూ కూడా పిల్లలలో ధారణ నంబరువారుగా అవుతుంది – ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే ఈ డ్రామా చాలా నియమానుసారముగా తయారై ఉంది. బ్రాహ్మణులే 84 జన్మలను అర్థం చేసుకొని స్మృతి చేయగలరు, కానీ మాయ బ్రాహ్మణులకే స్మృతిలో విఘ్నాలు కలిగిస్తుంది, ఘడియ-ఘడియ యోగాన్ని తెంచేస్తుంది. ఒకవేళ అందరికీ ఒకే విధంగా ధారణ జరిగినట్లయితే, అందరూ సహజముగానే పాస్ అయినట్లయితే, లక్షల సంఖ్యలో మాల తయారవుతుంది, అందుకే రాజధాని స్థాపన అవుతూ ఉన్న కారణంగా నంబరువారుగా ధారణ జరుగుతుంది.

పాట:-

నీ దారిలోనే మరణించాలి… (మర్నా తేరీ గలీ మే…)

ఓంశాంతి.

పిల్లలు పాటను విన్నారు. ఇది మరజీవా జన్మ. మనుష్యులు ఎప్పుడైతే శరీరము విడిచిపెడతారో, అప్పుడు వారికి ప్రపంచము అంతమైపోతుంది, ఆత్మ వేరైపోయినప్పుడు మామయ్య, చిన్నాన్న మొదలైనవారెవ్వరూ ఉండరు. వీరు మరణించారు అనగా ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందని అంటారు. వాస్తవానికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ ఆత్మ తిరిగి వెళ్ళిపోయింది లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – ఇదైతే పిల్లలకు తెలుసు, ఆత్మ పునర్జన్మలు తీసుకోవాల్సే ఉంటుంది. పునర్జన్మలనే జనన-మరణాలు అని అనడము జరుగుతుంది. చివరిలో ఏ ఆత్మలైతే వస్తారో, వారు ఒక్క జన్మను తీసుకోవాల్సి రావచ్చు. అంతే, వారు ఆ శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోతారు. పునర్జన్మలు తీసుకోవడము కూడా అతి పెద్ద లెక్కాచారము. కోట్లాది మంది మనుష్యులు ఉంటారు, ఒక్కొక్కరి విస్తారాన్ని అయితే చెప్పలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు – ఓ బాబా, మా దేహం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ త్యాగం చేసి ఇప్పుడు మేము మీ మెడలో హారముగా అవ్వడానికి వచ్చాము అనగా జీవిస్తూనే మీకు చెందినవారిగా అవ్వడానికి వచ్చాము. పురుషార్థమైతే శరీరముతోపాటు చేయవలసి ఉంటుంది. ఒంటరిగా ఆత్మ అయితే పురుషార్థము చేయలేదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – ఎప్పుడైతే రుద్ర యజ్ఞాన్ని రచిస్తారో, అప్పుడు అక్కడ శివుని చిత్రాన్ని పెద్దగా మట్టితో తయారుచేస్తారు మరియు అనేక సాలిగ్రామాల చిత్రాలను మట్టితో తయారుచేస్తారు. మరి ఆ సాలిగ్రామాలు ఎవరు, వాటిని తయారుచేస్తారు మరియు పూజిస్తారు? శివుని కోసమైతే, వీరు పరమపిత పరమాత్మ అని అర్థం చేసుకుంటారు. శివుడిని ముఖ్యముగా పెడతారు. ఆత్మలైతే చాలామంది ఉన్నారు. కావున వారు కూడా చాలా సాలిగ్రామాలను తయారుచేస్తారు. 10,000 లేదా ఒక లక్ష కూడా సాలిగ్రామాలను తయారుచేస్తారు. రోజూ తయారుచేస్తారు మరియు పగులగొడతారు మళ్ళీ తయారుచేస్తారు. చాలా శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పూజారులకు గానీ, ఆ యజ్ఞము రచించేవారికి గానీ వీరు ఎవరు అన్నది తెలియనే తెలియదు. మరి ఇంతమంది ఆత్మలు పూజకు యోగ్యంగా ఉన్నారా? కాదు. అచ్ఛా, భారతవాసుల సంఖ్య అనుసారంగా 33 కోట్ల సాలిగ్రామాలను తయారుచేసారనుకోండి, అది కూడా జరగలేదు ఎందుకంటే అందరూ అయితే తండ్రికి సహాయం చేయరు. ఇవి అర్థం చేసుకునేందుకు చాలా గుహ్యమైన విషయాలు. రుద్ర యజ్ఞాన్ని రచించేందుకు నాలుగు, ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేస్తారు. అచ్ఛా, ఇప్పుడు శివుడైతే పరమపిత పరమాత్మ అన్నది సరైనది, కానీ మిగిలిన పూజింపబడుతున్న ఇంతమంది సాలిగ్రామాలు అందరూ ఏ పిల్లలు? ఈ సమయంలో పిల్లలైన మీరే తండ్రిని తెలుసుకుంటారు మరియు సహాయకులుగా అవుతారు. ప్రజలు కూడా సహాయం చేస్తారు కదా. శివబాబాను ఎవరైతే స్మృతి చేస్తారో, వారు స్వర్గములోకైతే వచ్చేస్తారు. అయితే, జ్ఞానాన్ని ఎవరికీ ఇవ్వకపోయినా కూడా స్వర్గములోకైతే వచ్చేస్తారు. వారైతే ఎంతమంది ఉంటారు! కానీ ముఖ్యమైనవారు 108. మమ్మాను కూడా చూడండి, ఎంత గొప్ప రత్నము! ఎంతగా పూజింపబడతారు! ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా తప్పకుండా అవ్వాలి. జన్మ-జన్మాంతరాలుగా మీరు దేహాభిమానులుగా ఉన్నారు. నేను ఆత్మను, పరమపిత పరమాత్మ సంతానమును అని ఏ మనిషి కూడా ఈ విధంగా అనరు. సంతానమైనప్పుడు మరి వారి పూర్తి జీవిత చరిత్ర తెలిసి ఉండాలి. పారలౌకిక తండ్రి యొక్క జీవిత చరిత్ర చాలా గొప్పది. కావున పిల్లలు అంటారు, ఇప్పుడు జీవిస్తూనే మరణించి బాబా, మేము మీ మెడలో హారముగా తప్పకుండా అవుతాము. ఆత్మలది కూడా పెద్ద-పెద్ద మాల ఉంది. అలాగే మనుష్య సృష్టిది కూడా అతి పెద్ద మాల ఉంది. ప్రజాపిత బ్రహ్మా ముఖ్యమైనవారు. వారిని ఆదమ్, ఆది దేవ్, మహావీర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు.

ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఆత్మలమైన మనమందరము ఒక్క నిరాకారుడైన తండ్రి యొక్క సంతానము మరియు ఈ మొత్తం మనుష్య సృష్టిది వంశావళి ఉంది, దీనిని జీనలాజికల్ ట్రీ (వంశ వృక్షము) అని అంటారు. ఎలాగైతే ఇంటి పేరు ఉంటుంది కదా – అగర్వాల్, మళ్ళీ వారి పిల్లలు, మనవలకు కూడా అగర్వాల్ అనే పేరు కొనసాగుతుంది. వంశ వృక్షాన్ని తయారుచేస్తారు కదా. ఒక్కరి నుండి పెరుగుతూ-పెరుగుతూ పెద్ద వృక్షమైపోతుంది. ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారందరూ శివబాబా మెడలో హారముగా ఉన్నారు. వారైతే అవినాశీ. ప్రజాపిత బ్రహ్మా కూడా ఉన్నారు. కొత్త ప్రపంచము ఏ విధంగా రచించబడుతుంది, ప్రళయము ఏమైనా జరుగుతుందా? కాదు. ప్రపంచమైతే నిలిచే ఉంటుంది, కేవలం ఎప్పుడైతే పాతదిగా అవుతుందో, అప్పుడు తండ్రి వచ్చి దానిని కొత్తదిగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనం చాలా కొత్తగా ఉండేవారము. మన ఆత్మ పవిత్రముగా, కొత్తగా ఉండేది. శుద్ధమైన బంగారముగా ఉండేది, దాని వలన మళ్ళీ ఆత్మలమైన మన యొక్క ఆభరణము (శరీరము) కూడా బంగారము వంటిది లభించింది, దానినే శరీరం కల్పవృక్ష సమానంగా అవ్వడమని అంటారు. ఇక్కడైతే మనుష్యుల ఆయుష్షు సుమారుగా 40-45 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కడో కొంతమందిదైతే ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు ఉంటుంది. అక్కడైతే మీ ఆయుష్షు సుమారుగా 125 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండదు. మీ ఆయుష్షును కల్పవృక్ష సమానముగా తయారుచేస్తారు. ఎప్పుడు అకాల మృత్యువులు జరగవు. ఆత్మలైన మీరు శివబాబాకు పిల్లలు. బ్రహ్మా ద్వారా తప్పకుండా బ్రాహ్మణులే జన్మిస్తారు, వారి ద్వారా మళ్ళీ ప్రజలను రచించడము జరుగుతుంది. మొట్టమొదట బ్రాహ్మణులైన మీరు బ్రహ్మా ముఖ వంశావళిగా అవుతారు. శివబాబా అయితే ఒక్కరే ఉన్నారు, మరి మాత ఎక్కడ? ఇది చాలా గుహ్యమైన రహస్యము. నేను వచ్చి వీరి ద్వారా పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటాను. కావున మీరు పాత ప్రపంచం నుండి జీవిస్తూనే మరణిస్తారు. అక్కడ ఎవరైతే దత్తత తీసుకుంటారో, వారు ధనము ఇవ్వడము కోసం దత్తత తీసుకుంటారు. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడము కోసం దత్తత తీసుకుంటారు, యోగ్యులుగా తయారుచేస్తారు. తోడుగా తీసుకొని వెళ్తారు, అందుకే ఈ పాత ప్రపంచం నుండి జీవిస్తూనే మరణించాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అయి తండ్రికి చెందినవారిగా అవ్వాలి. మనం అక్కడి నివాసులము, మళ్ళీ సత్యయుగములో సుఖం యొక్క పాత్రను అభినయించాము. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. శాస్త్రాలలోనైతే లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని ఆత్మలైన మిమ్మల్ని పవిత్రముగా తయారుచేస్తారు. ఆత్మ యొక్క మాలిన్యాన్ని తొలగిస్తారు. మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభిస్తుంది. వారు మళ్ళీ మూడవ నేత్రము కథను కూర్చుని తయారుచేసారు. వాస్తవానికి అది ఇక్కడి విషయము. మీకు బ్రహ్మాండము నుండి మొదలుకొని మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల సమాచారమంతా లభిస్తుంది. తండ్రి ఒక్కసారే వచ్చి అర్థం చేయిస్తారు. సన్యాసులైతే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. వీరైతే వచ్చి పిల్లలను చదివిస్తారు, అంతే. ఇదైతే కొత్త విషయం అవుతుంది. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఇది అతి పెద్ద కాలేజ్. నియమము ఉంది, ఒక వారమైతే మంచి రీతిలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. భట్టీలో కూర్చోవాల్సి ఉంటుంది. గీత పఠనము లేక భాగవత పఠనమును కూడా ఒక వారం పెడతారు కదా, కావున ఏడు రోజులు భట్టీలో కూర్చోవాల్సి ఉంటుంది. అందరూ వికారులుగానే ఉన్నారు, సన్యాసులు ఇళ్ళు, వాకిళ్ళను విడిచిపెట్టి నిర్వికారులుగా అవుతారు, అయినా కూడా జన్మ వికారాల ద్వారా తీసుకుని మళ్ళీ నిర్వికారులుగా అయ్యేందుకు సన్యసిస్తారు. చాలామంది పునర్జన్మలను కూడా అంగీకరిస్తారు ఎందుకంటే ఉదాహరణలను చూస్తారు. కొందరు చాలా వేద శాస్త్రాలను చదువుతూ-చదువుతూ శరీరాలను విడిచిపెడితే, అప్పుడు ఆ సంస్కారాల అనుసారముగా మళ్ళీ జన్మ తీసుకుంటారు, అప్పుడు బాల్యము నుండే శాస్త్రాలు అధ్యయనం అయిపోతాయి. జన్మ తీసుకొని స్వయాన్ని అపవిత్రముగా భావించి మళ్ళీ పవిత్రముగా అయ్యేందుకు సన్యసిస్తారు. మీరైతే ఒకేసారి పవిత్రముగా అయి దేవతగా అవుతారు. మీరు మళ్ళీ సన్యసించవలసిన అవసరం ఉండదు. కావున వారి సన్యాసము అసంపూర్ణం అయినట్లు కదా. ఈ విషయాలను స్వయము కూడా అర్థం చేయించలేరు. బాబా కూర్చొని అర్ధం చేయిస్తారు. వారు ఉత్తమోత్తమమైన తండ్రి, వారికి మీరు పిల్లలుగా అయ్యారు. ఇది స్కూలు కూడా, రోజూ కొత్త-కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి. ఈ రోజు గుహ్యాతి గుహ్యమైనవి వినిపిస్తానని అంటారు. వినకపోతే ధారణ ఎలా జరుగుతుంది? ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, మీరు నాకు చెందినవారిగా అయ్యారు కావున శరీర భానాన్ని విడిచిపెట్టండి, తిరిగి తీసుకొని వెళ్ళేందుకు నేను గైడ్ గా అయి వచ్చాను.

మీరు పాండవ సంప్రదాయులు. వారు దైహిక పండాలు, మీరు ఆత్మిక పండాలు. వారు దైహిక యాత్రలకు తీసుకువెళ్తారు. మీది ఆత్మిక యాత్ర. వారైతే పాండవులకు మారణాయుధాలను ఇచ్చి, యుద్ధ మైదానములో చూపించారు. ఇప్పుడు పిల్లలైన మీలో కూడా శక్తి కావాలి. చాలామంది పెరుగుతూ ఉంటే మళ్ళీ శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. మరి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, నేను మిమ్మల్ని ఈ బ్రహ్మా ద్వారా ఒడిలోకి తీసుకున్నాను, అందుకే వీరిని మాత, పిత అని అనడము జరుగుతుంది. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని అనడమైతే అందరూ అంటారు. అచ్ఛా, వారినైతే గాడ్ ఫాదర్ అని అనడము జరుగుతుంది. గాడ్ మదర్ అని అయితే అనరు. మరి మదర్ అని ఎలా అంటారు? మనుష్యులు మళ్ళీ జగదంబను మదర్ గా భావిస్తారు. కానీ కాదు, వారికి కూడా తల్లి-తండ్రి ఉన్నారు. వారికి తల్లి మరి ఎవరు? ఇవి చాలా గుహ్యమైన విషయాలు. గాయనమైతే ఉంది కానీ ఎవరు నిరూపించి అర్థం చేయిస్తారు? వీరు తల్లి-తండ్రి అని మీకు తెలుసు. మొదట మాత ఉంటారు. తప్పకుండా మీరు ఈ బ్రహ్మా తల్లి వద్దకు మొదట రావలసి ఉంటుంది. వీరిలోకి ప్రవేశించి మిమ్మల్ని దత్తత తీసుకుంటాను, అందుకే వీరు తల్లి-తండ్రి అయినట్లు. ఈ విషయాలు ఏ శాస్త్రములోనూ లేవు. మీరు ముఖవంశావళిగా ఎలా అవుతారు అన్నది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను బ్రహ్మా ముఖము ద్వారా మిమ్మల్ని రచిస్తాను. ఎవరైనా రాజు ఉన్నారనుకోండి, వారు నోటి ద్వారా, మీరు నాకు చెందినవారని మీతో చెప్తున్నానని అంటారు. ఇలా ఆత్మే అంటుంది. కానీ వారిని మళ్ళీ తల్లి, తండ్రి అని అనరు. ఇది చాలా అద్భుతమైన విషయము. మీకు తెలుసు, మనం శివబాబాకు చెందినవారిగా అయ్యాము కావున ఈ దేహ భానాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించడము శ్రమతో కూడుకున్న పని. దీనినే రాజయోగము మరియు జ్ఞానము అని అనడము జరుగుతుంది. రెండు పదాలు వచ్చేస్తాయి. మనుష్యులు ఎప్పుడైతే మరణిస్తారో, అప్పుడు వారిని రామ-రామ అనండి అని అంటారు లేక గురువు తమ పేరును చెప్తారు. గురువు మరణిస్తే మళ్ళీ వారి పుత్రుడిని గురువుగా చేస్తారు. ఇక్కడైతే తండ్రి వెళ్ళిపోతే అందరూ వెళ్ళవలసి ఉంటుంది. ఇది మృత్యులోకం యొక్క అంతిమ జన్మ. బాబా మనల్ని అమరలోకములోకి తీసుకువెళ్తారు, వయా ముక్తిధామము వెళ్ళాలి.

ఇది కూడా అర్థం చేయించడం జరిగింది, ఎప్పుడైతే వినాశనము జరుగుతుందో, అప్పుడు ఈ కలియుగమనే పురము కిందికి వెళ్ళిపోతుంది. సత్యయుగము పైకి వస్తుంది. ఇకపోతే, సముద్రంలోకి ఏమీ వెళ్ళిపోవు. ఇక్కడ పిల్లలైన మీరు సాగరుని వద్దకు రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. ఇక్కడ మీరు సమ్ముఖములో జ్ఞాన నాట్యాన్ని చూస్తారు, గోప-గోపికలు కృష్ణుడి చేత డాన్స్ చేయించారని చూపిస్తారు, ఈ విషయము ఈ సమయానికి చెందినది. చాతక పక్షి వంటి పిల్లల ఎదురుగా తండ్రి మురళీ నడుస్తుంది. పిల్లలు కూడా నేర్చుకోవలసి ఉంటుంది. ఇక ఎవరు ఎంత నేర్చుకుంటే అంత. అనంతమైన తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోండి అని అర్థం చేయించాలి. ఓ భగవంతుడా అని అంటారు, వారైతే రచయిత. తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు. స్వర్గాన్ని రచించే తండ్రి వీరొక్కరే, అది మళ్ళీ అర్ధకల్పం కొనసాగుతుంది. బాబా మీకు ఎన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. పిల్లలు శ్రమ చేసి ధారణ చేయాలి. స్వదర్శన చక్రం యొక్క రహస్యాన్ని కూడా బాబా ఎంత స్పష్టంగా తెలియజేసారు. 84 జన్మల చక్రాన్ని బ్రాహ్మణులే స్మృతి చేయగలరు. ఇది బుద్ధి యోగాన్ని జోడించి చక్రాన్ని స్మృతి చేయడము. కానీ మాయ ఘడియ-ఘడియ యోగము తెంచేస్తుంది, విఘ్నాలు వేస్తుంది. సహజమైనట్లయితే మరి అందరూ పాస్ అయిపోతారు. లక్షల సంఖ్యలో మాల తయారవుతుంది. ఈ డ్రామాయే నియమానుసారముగా ఉంది. ముఖ్యమైనవారు 8 మంది, వారిలో తేడా రాజాలదు. త్రేతా అంతిమము వరకు ఎంతమందైతే రాకుమారులు-రాకుమార్తెలు ఉంటారో, అందరూ కలిసి తప్పకుండా ఇక్కడే చదువుతూ ఉండవచ్చు. ప్రజలు కూడా చదువుతూ ఉండవచ్చు. ఇక్కడే రాజ్య స్థాపన జరుగుతుంది. తండ్రియే రాజ్యాన్ని స్థాపన చేస్తారు, ఇంకే ఉపదేశకుడు రాజ్యాన్ని స్థాపన చేయరు. ఇదే గొప్ప అద్భుతమైన రహస్యము. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది? కలియుగములోనైతే రాజ్యము ఉండదు. అనేక ధర్మాలు ఉన్నాయి. భారతవాసులు నిరుపేదలుగా ఉన్నారు. కలియుగమనే రాత్రి పూర్తయి, పగలు ప్రారంభమయ్యింది, ఆ తర్వాత రాజ్యము కొనసాగింది. ఇది ఎలా జరిగింది! అల్లాహ్ అవల్దీన్ ఆటను చూపిస్తారు కదా. కుబేర సంపద బయటకు వస్తుంది. మీరు క్షణములో దివ్య దృష్టితో వైకుంఠాన్ని చూసి వస్తారు. అచ్ఛా!

మాత-పిత, బాప్ దాదా, పిల్లలు మొత్తం ఫ్యామిలీ కలిసి కూర్చున్నారు. మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానముగా అందరినీ రిఫ్రెష్ చేసే సేవను చేయాలి. చాతక పక్షులుగా అయి జ్ఞాన డాన్స్ చేయాలి మరియు చేయించాలి.

2. ఈ శరీర భానాన్ని విడిచిపెట్టి పాత ప్రపంచము నుండి జీవిస్తూనే మరణించాలి. అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. స్వయాన్ని స్వర్గ వారసత్వానికి యోగ్యులుగా కూడా తయారుచేసుకోవాలి.

వరదానము:-

హోలీ యొక్క అర్థ స్వరూపంలో స్థితులై సత్యమైన హోలీని జరుపుకునే అతి ఉన్నతమైన, అతి పవిత్రమైనవారిగా కండి

‘‘హో లీ’’ అనగా ఏదైతే జరిగిందో, అది జరిగిపోయింది, అది గడిచిపోయినట్లు. ఏ సీన్ అయితే జరిగిపోయిందో, అది హో లీ అనగా గతించిపోయింది, గడిచినదేదో గడిచిపోయింది అని భావించడము కోసం సదా డ్రామా యొక్క డాలును ఉపయోగించండి. ఎప్పుడైతే ప్రతి సమయం ఇది స్మృతిలో ఉంటుందో – హో లీ, ఏదైతే గతించిపోయిందో అది జరిగిపోయింది అని, అప్పుడు హోలీ రంగు పక్కాగా పడుతుంది. వారెప్పుడూ డ్రామా యొక్క ఎటువంటి సీన్ ను చూసినా ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఈ ప్రశ్నలలో చిక్కుకోరు. సదా జ్ఞాన మంథనాన్ని చేస్తూ తమ అతి పవిత్రమైన మరియు అతి ఉన్నతమైన స్టేజ్ ను తయారుచేసుకుంటారు.

స్లోగన్:-

ఎవరి వద్దనైతే పవిత్రత యొక్క సర్వ శ్రేష్ఠ ఖజానా ఉందో, వారే అందరికన్నా గొప్ప ధనవంతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top