TELUGU MURLI 05-03-2023

05-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి‘ ‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 10-01-1994 మధువనం

‘‘ఒక్క ‘పాయింట్’ అన్న పదాన్ని మూడు రూపాలతో స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురావడము – ఇదే రక్షణ యొక్క సాధనము’’

విశ్వకళ్యాణకారి బాప్ దాదా తమ మాస్టర్ విశ్వకళ్యాణకారి పిల్లలందరినీ చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము అతి శ్రేష్ఠమైనది. ప్రతి ఒక్కరు నంబరువన్ పురుషార్థం చేయాలనే లక్ష్యముంచుకొని ముందుకు ఎగురుతూ వెళ్తున్నారు. లక్ష్యము అందరిదీ నంబరువన్ గా అవ్వడమే కానీ లక్షణాలు నంబరువారుగా ఉన్నాయి. మరి లక్ష్యము మరియు లక్షణాలు రెండింటిలో తేడా ఎందుకుంది? జ్ఞానదాత అయిన తండ్రి కూడా ఒక్కరే, యోగం యొక్క విధి కూడా ఒక్కటే, దివ్య గుణాలను ధారణ చేసేందుకు సహజ ప్రత్యక్ష ప్రమాణమైన సాకార బ్రహ్మా తండ్రి కూడా ఒక్కరే, సేవా సాధనాలు మరియు సేవ యొక్క విధిని నేర్పించేవారు కూడా ఒక్కరే. ముఖ్యమైన విషయము – చదువు మరియు పాలన – రెండింటినీ ఇచ్చేవారు ఒక్కరే మరియు వారు మొదటి నంబరువారు, అయినప్పటికీ ప్రత్యక్ష జీవితంలో లక్షణాలు నంబరువారుగా ఎందుకున్నాయి? వాస్తవానికి అందరికీ స్వయం గురించి మంచి రీతిలో తెలుసు – లక్షణాలను ధారణ చేయడంలో నేను ఏ నంబరులో ఉన్నాను? అని. నంబరువారుగా అవ్వడానికి విశేషమైన ఆధారము ఒకే పదము – ‘పాయింట్’. పాయింట్ స్వరూపాన్ని అనుభవం చేయడము. రెండవది, ఏవైనా సంకల్పాలు, మాటలు లేక కర్మలు వ్యర్థంగా ఉంటే వాటికి పాయింట్ పెట్టడము అనగా బిందువు పెట్టడము. మూడవది, జ్ఞానము మరియు ధారణ యొక్క అనేక పాయింట్స్ ను మననం చేసి స్వయం పట్ల మరియు సేవ పట్ల సమయానికి కార్యంలో ఉపయోగించడము. కనుక ‘పాయింట్’ అన్న పదము ఒక్కటే కానీ మూడు స్వరూపాల పాయింట్ ను సమయానికి స్మృతిలోకి, స్వరూపంలోకి తీసుకురావడము – ఇందులో తేడా వచ్చేస్తుంది. స్మృతి అందరికీ ఉంటుంది కానీ స్మృతిని స్వరూపంలోకి తీసుకురావడము, ఇందులో నంబరువారుగా అవుతున్నారు. చాలా సార్లు బాప్ దాదా పిల్లలందరూ స్మృతిలో చాలా చురుకుగా ఉండడాన్ని చూస్తారు. ఇలా జరగాలి – అని ఆలోచిస్తూ కూడా ఉంటారు, ఇది రైట్, ఇది రాంగ్, ఈ జ్ఞానం కూడా ఇమర్జ్ అవుతుంది. జ్ఞానము అనగా నాలెడ్జ్ మరియు నాలెడ్జ్ ఈజ్ లైట్, నాలెడ్జ్ ఈజ్ మైట్ (జ్ఞానము ప్రకాశము, జ్ఞానము శక్తి) అని అంటారు కనుక ఎక్కడైతే ప్రకాశం కూడా ఉంటుందో, శక్తి కూడా ఉంటుందో అక్కడ ‘ఇది జరగాలి’ అనేది ఉండదు. ఏమి ఆలోచిస్తారంటే – బాప్ దాదా అయితే ఇలా చెప్తారు, అవ్వాల్సిందే, జ్ఞానమైతే ఇదే, కానీ ఆ సమయంలో నాలో ఏముంది – ఇది జరగాలి, ఇది జరగాలి అన్నదానిలోనే ఉండిపోతారు. దీని అర్థమేమిటంటే జ్ఞానాన్ని ప్రకాశము మరియు శక్తి రూపంలో సమయమనుసారంగా కార్యంలో ఉపయోగించలేరు. దీనినే – స్మృతిలో ఉంది కానీ స్వరూపంలోకి తీసుకొచ్చే శక్తి తక్కువగా ఉంది అని అంటారు. ఎప్పుడైతే – ఇది రాంగ్, ఇది రైట్, ఇది అంధకారము, ఇది ప్రకాశము, ఇది వ్యర్థము, ఇది సమర్థము అన్న లైట్ అనగా ప్రకాశముందో, అప్పుడు అంధకారమని అర్థమై కూడా అంధకారంలో ఉంటే, అటువంటివారిని జ్ఞానీ లేక తెలివైనవారని అంటారా? జ్ఞానీగా లేరంటే ఎలా ఉన్నట్లు? భక్తులుగానా లేక అసంపూర్ణ జ్ఞానులుగానా? రాంగ్ అని అర్థమై కూడా రాంగ్ కర్మలకు లేక సంకల్పాలకు లేక స్వభావ-సంస్కారాలకు వశీభూతులైతే వారిని ఏమి అంటారు? వారికి ఏ టైటిల్ ఉండాలి? బాప్ దాదా సమయం యొక్క వేగాన్ని చూసి పిల్లలందరికీ పదే-పదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు.

‘అటెన్షన్’ అన్న పదాన్ని కూడా డబల్ అండర్ లైన్ చేయిస్తున్నారు – ఈ ప్రకృతి యొక్క తమోగుణీ శక్తి మరియు మాయ యొక్క సూక్ష్మ రాయల్ తెలివి యొక్క శక్తి తమ కార్యాన్ని తీవ్ర వేగంతో చేస్తున్నాయి మరియు చేస్తూ ఉంటాయి. ప్రకృతి యొక్క భయంకర రూపాన్ని తెలుసుకోవడం సహజమే కానీ రకరకాల భయంకర అలజడులలో అచలంగా ఉండాలి, ఈ విషయంలో ఇంకా అటెన్షన్ కావాలి. మాయ యొక్క అతి సూక్ష్మ స్వరూపాన్ని తెలుసుకోవడంలో కూడా మోసపోతారు. మాయ ఎటువంటి రాయల్ రూపాన్ని ధరిస్తుందంటే రాంగ్ ను రైట్ గా అనుభవం చేయిస్తుంది. అది పూర్తిగా రాంగ్ కానీ బుద్ధిని ఎలా పరివర్తన చేస్తుందంటే – అది సత్యమైన తెలివిని, రియలైజ్ అయ్యే శక్తిని మాయం చేస్తుంది. ఏ విధంగానైతే ఎవరైనా మాయ-మంత్రాలు చేస్తారు కదా, అప్పుడు పరవశులవుతారు, అలా రాయల్ మాయ రియలైజ్ అయ్యే శక్తిని మాయం చేసి సత్యాన్ని అర్థం చేసుకోనివ్వదు. అది పూర్తిగా రాంగ్ అయి ఉంటుంది కానీ మాయ యొక్క నీడకు వశీభూతులైన కారణంగా రాంగ్ ను రైట్ గా భావిస్తారు మరియు ఋజువు చేయడంలో మాయ యొక్క సుప్రీమ్ కోర్టుకు వకీలుగా అవుతారు. మరి వకీలు ఏం చేస్తారు? అబద్ధాన్ని సత్యము అని నిరూపించడంలో తెలివైనవారిగా ఉంటారు. సత్యాన్ని సత్యంగా నిరూపించడంలో కూడా తెలివైనవారిగా ఉంటారు కానీ అబద్ధాన్ని సత్యమని నిరూపించడంలో తెలివైనవారిగా ఉంటారు, రెండింటిలోనూ తెలివైనవారిగా ఉంటారు. అందుకే బాప్ దాదా ‘అటెన్షన్’ అన్న పదాన్ని డబల్ అండర్ లైన్ చేయిస్తున్నారు. రియలైజ్ అయ్యే శక్తిని పరివర్తన చేసే సూక్ష్మ స్వరూపమైన మాయ నీడ నుండి సదా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి ఎందుకంటే మాయ విశేషంగా ఈ స్వరూపంలో తన కార్యాన్ని చేస్తుంది. అర్థమయిందా? ఇప్పుడేం చేస్తారు? జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా విశేష ఆత్మలు సూచన ఇచ్చారంటే, మంచి రీతిలో మాయ యొక్క ఈ నీడ నుండి బయటపడి తండ్రి ఛత్రఛాయలోకి స్వయాన్ని, విశేషంగా మనసు-బుద్ధిని ఈ ఛత్రఛాయ ఆధారంలోకి తీసుకురండి ఎందుకంటే మనసులో నెగెటివ్ భావము మరియు భావనలను ఉత్పన్నం చేసేలా విశేషంగా మాయ యొక్క ప్రభావము నడుస్తూ ఉంది మరియు బుద్ధిలో యథార్థమైన రియలైజేషన్ ను సమాప్తం చేసేటువంటి విశేషమైన మాయ యొక్క కార్యం నడుస్తూ ఉంది.

ఏ విధంగానైతే ఏదైనా సీజన్ ఉన్నప్పుడు, సీజన్ నుండి రక్షించుకునేందుకు దాని అనుసారంగా విశేషమైన అటెన్షన్ పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు వర్షాలు పడితే గొడుగులు, రెయిన్ కోట్లు మొదలైనవాటి గురించి అటెన్షన్ పెడతారు, చలికాలం వస్తే వెచ్చదనాన్ని కలిగించే వస్త్రాలను ఉంచుకుంటారు, అటెన్షన్ పెడతారు కదా. అలాగే మనసు మరియు బుద్ధిపైన ప్రభావం పడకుండా ఉండేందుకు ముందుగానే రక్షణా సాధనాన్ని విశేషంగా అలవరచుకోండి. ఆ విశేషమైన సాధనము చాలా సహజము, ఇంతకుముందు కూడా వినిపించాము – అది ఒకే పదము ‘పాయింట్’. సహజమే కదా. విస్తారంగా ఏమీ వినిపించలేదు కదా. నిజమే, నేను ఆత్మను, బిందువును, జ్యోతి రూపాన్ని అని అంటూ ఉంటారు, కానీ అందులో స్థితులవ్వరు. పాయింట్ పెడదామని అనుకుంటారు కానీ ప్రశ్నార్థక చిహ్నము మరియు ఆశ్చర్యార్థక చిహ్నము వస్తాయి. పాయింట్ పెట్టడం సహజమా లేక ప్రశ్నార్థక చిహ్నము లేక ఆశ్చర్యార్థక చిహ్నము పెట్టడం సహజమా? ఏది సహజము? బిందువు పెట్టడం సహజము కదా. మరి అటువంటప్పుడు ప్రశ్న మరియు ఆశ్చర్యంలోకి ఎందుకు వెళ్తారు? ఈ విధిని అలవరచుకోండి. ఇది అబద్ధము సత్యముగా నిరూపణ అయ్యే సీజన్ మరియు అబద్ధము, సత్యము కన్నా స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఏ విధంగా ఈ రోజుల్లోని ఫ్యాషన్ కదా, అసత్యమైన వస్తువులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి, వాటి ముందు సత్యమైనవాటి విలువ తగ్గిపోతుంది. సత్యమైన వెండిని చూడండి మరియు వైట్ సిల్వర్ ను చూడండి, ఏది సుందరంగా అనిపిస్తుంది? సత్యమైన వెండి నల్లగా అయిపోతుంది మరియు వైట్ సిల్వర్ సదా మెరుస్తూ ఉంటుంది. మరి వైట్ సిల్వర్ ఆకర్షిస్తుందా లేక సత్యమైనది ఆకర్షిస్తుందా? కనుక సీజన్ ను గుర్తించండి, మాయ యొక్క స్వరూపాలను గుర్తించండి, ప్రకృతి యొక్క రకరకాల తమోగుణీ రంగులను గుర్తించండి. ఒకటేమో తెలుసుకోవడము, రెండవది, గుర్తించడము. తెలియడం ఎక్కువ తెలుసు, గుర్తించడంలో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు, అప్పుడప్పుడు రైట్ చేస్తారు. ఇప్పుడేం చేస్తారు? సురక్షితంగా ఉంటారు కదా. ఇక తర్వాత – మేము అర్థం చేసుకోలేదు, ఇలా కూడా జరుగుతుందా ఏమిటి? అని అనకండి. ఈ ఏమిటి-ఏమిటి అనేది నడవదు. ఇప్పుడైతే ఇంకా తండ్రి కొద్ది-కొద్దిగా దయ చూపిస్తున్నారు, కొద్ది-కొద్దిగా అడుగులు వేస్తున్నారు. కానీ తర్వాత ‘ఏమిటి’ మరియు ‘ఎందుకు’ అనేది ఎవ్వరూ వినరు. ఇలా కాదు, అలా… ఈ వాదనలు నడవవు. జడ్జిగా అవ్వండి, మాయకు వకీలుగా అవ్వకండి. ఎప్పుడైతే వాదిస్తారో, అప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అందరూ అనుభవజ్ఞులే కదా, అనుభవమవుతుంది కదా. వింటూ-వింటూ సాక్షీగా అయి హర్షిస్తున్నారు. మంచి రీతిలో అర్థం చేసుకున్నారా? పాండవులు, శక్తులు అర్థం చేసుకున్నారా, టీచర్స్ అర్థం చేసుకున్నారా? అందరూ అవును-అవును అనైతే అంటున్నారు. అవును అంటున్న ఫోటో తీయబడుతుంది.

మూడవ సీజన్ విశేషంగా బలహీన స్వభావ-సంస్కారాలు, సంబంధ-సంపర్కంలోకి రావడము, దీని విస్తారం కూడా చాలా పెద్దదిగా ఉంది. అది ఈ రోజు వినిపించము. చాలామంది పిల్లలు ఏమంటారంటే – ఏం చేయాలి, ఇంతకుముందైతే నాలో ఇది లేనే లేదు, ఇప్పుడు ఏమయిందో తెలియదు, ఈ సంస్కారం నాలో ఉండేదే కాదు, ఇప్పుడు వచ్చేసింది. దానికి కారణాలు ఏమిటి మరియు విధి ఏమిటి అనే విస్తారాన్ని ఇంకెప్పుడైనా వినిపిస్తాము. అచ్ఛా!

నలువైపులా ఉన్న బాప్ దాదా మహావాక్యాలను వినే మరియు ధారణ చేసే చాతక పిల్లలకు, అన్ని సబ్జెక్టులను స్మృతితో పాటు స్వరూపంలోకి తీసుకొచ్చే సమీప ఆత్మలకు, సదా జ్ఞానం యొక్క ప్రతి విషయాన్ని లైట్ మరియు మైట్ స్వరూపంతో కార్యంలోకి తీసుకొచ్చే శ్రేష్ఠ ఆత్మలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునే తండ్రి యొక్క జ్ఞానయుక్త ఆత్మలకు, సదా తండ్రి ఛత్రఛాయలో ఉండే, మాయ నీడ నుండి సురక్షితంగా ఉండే, తెలుసుకోవడం మరియు గుర్తించడం, రెండింటి విశేషతను జీవితంలోకి తీసుకొచ్చే విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో మిలనము – శక్తి సైన్యము తీవ్రవేగంతో నడుస్తుంది కదా. సైన్యాన్ని నడిపించేందుకు బాప్ దాదాతో పాటు నిమిత్త ఆత్మలైన మీరు కూడా నిమిత్తంగా ఉన్నారు. తండ్రి అయితే సదా తోడుగా ఉన్నారు మరియు సదా ఉంటారు కూడా. అయినా మీరు బాప్ దాదాకు శ్రేష్ఠమైన భుజాలు కదా. తండ్రి శక్తినిస్తారు, తండ్రి శక్తి రూపంలో ఉన్నారు కానీ నిమిత్తంగా అర్థం చేయించేందుకు మైక్ లుగా మీరు నిమిత్తులై ఉన్నారు. ఎంత సరదా విషయాలు వింటారు. ఆటలా అనిపిస్తుంది కదా. ఆటే కదా. ఆట-ఆటలో విజయులుగా అయి అందరినీ మాయాజీతులుగా, విజయులుగా చేయాల్సిందే, ఇదైతే గ్యారంటీ. కానీ మధ్య-మధ్యలో ఈ ఆటలు చూడాల్సి వస్తుంది. మరి అలసిపోవడం లేదు కదా? నవ్వుతూ, ఆడుతూ, దాటుతూ మరియు దాటిస్తూ నడుస్తున్నారు. ఏదైనా అలాంటి మాట విన్నప్పుడు మనసు నుండి ఏం వెలువడుతుంది? వాహ్ డ్రామా వాహ్. అయ్యో డ్రామా అయ్యో అని వెలువడదు. వాహ్ డ్రామా. వాహ్-వాహ్ అంటూ అందరూ వాహ్-వాహ్ గా అవ్వాల్సిందే. ఇవన్నీ దాటాల్సిందే. అచ్ఛా!

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

విజయము మా జన్మ-సిద్ధ అధికారము – ఈ నిశ్చయము మరియు నషాతో నిర్విఘ్న స్థితిని అనుభవం చేయండి

ఏ విధంగానైతే తండ్రి ఉన్నతోన్నతమైనవారో, అదే విధంగా ఆత్మలమైన మనం కూడా ఉన్నతోన్నతమైన శ్రేష్ఠ ఆత్మలము – ఈ అనుభవం చేస్తూ నడుస్తున్నారా? ఎందుకంటే ప్రపంచంలోని వారికి అందరికన్నా శ్రేష్ఠమైనవారు, ఉన్నతోన్నతమైనవారు తండ్రి తర్వాత దేవతలు. కానీ దేవతల కన్నా ఉన్నతమైనవారు బ్రాహ్మణాత్మలైన మీరు, ఫరిశ్తాలైన మీరు – ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. దేవతా పదవిని ఈ బ్రాహ్మణ జీవితం కన్నా ఉన్నతమైనది అని అనరు. ఉన్నతమైనది ఇప్పటి ఈ బ్రాహ్మణ జీవితము. మీరు దేవతల కన్నా ఎందుకు ఉన్నతమైనవారు అనేది మంచి రీతిలో తెలుసు కదా. దేవతా రూపంలో తండ్రి యొక్క జ్ఞానం ఇమర్జ్ అవ్వదు. పరమాత్మ మిలనం యొక్క అనుభవాన్ని ఈ బ్రాహ్మణ జీవితంలో చేస్తారు, దేవతా జీవితంలో కాదు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు కానీ ఈ సమయంలో మీరు దేవతా జీవితంలోని వారి కన్నా ఉన్నతమైనవారు, కనుక ఇంతటి నషా సదా ఉండాలి, అప్పుడప్పుడు కాదు ఎందుకంటే తండ్రి అవినాశీ మరియు అవినాశీ తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో, అది కూడా అవినాశీ, ఏ స్మృతినైతే ఇప్పిస్తారో అది కూడా అవినాశీ, అప్పుడప్పుడు ఉండేది కాదు. కనుక ఇది చెక్ చేసుకోండి – ఈ నషా సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఎప్పుడైతే సదా ఉంటుందో, అప్పుడే ఆనందం కలుగుతుంది. ఒకసారి ఉండి, ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు ఆనందంలో ఉంటారు, అప్పుడప్పుడు తికమకలో ఉంటారు. కనుక అప్పుడప్పుడు ఆనందం, అప్పుడప్పుడు తికమక కాదు, సదా ఉండాలి. ఏ విధంగానైతే ఈ శ్వాస సదా నడుస్తుంది కదా. ఒకవేళ ఒక్క సెకండు శ్వాస ఆగినా లేక అప్పుడప్పుడు మాత్రమే శ్వాస నడుస్తే, దానిని జీవితము అని అంటారా? కనుక ఈ బ్రాహ్మణ జీవితంలో నిరంతరం ఆనందంలో ఉన్నారా? ఒకవేళ ఆనందంలో లేకపోతే తప్పకుండా తికమకపడతారు. మరి మాతలు సదా ఆనందంలో ఉంటున్నారా? మీరు శక్తులు కదా, సాధారణమైనవారైతే కాదు, లేదా ఇంటికి వెళ్తే సాధారణ మాతలుగా అయిపోతారా? అలా కాదు, సదా మేము శక్తులము అన్నది గుర్తుండాలి. మీరు హద్దుకు సంబంధించినవారు కాదు, మీరు అనంతమైన విశ్వకళ్యాణకారులు. శక్తులు అనగా అసురులపై విజయం పొందేవారు. శక్తులను అసుర సంహారిణీ అనగా ఆసురీ సంస్కారాలను సంహరించేవారు అని అంటారు. కనుక శక్తులందరూ ఇటువంటి ధైర్యవంతులేనా? మరియు పాండవులు అనగా విజయీ. పాండవులు ఎప్పుడూ – కావాలనుకోవడం లేదు కానీ ఓటమి కలుగుతుంది అని ఈ విధంగా ఎప్పుడూ అనలేరు ఎందుకంటే అర్ధకల్పం ఓటమి పొందారు, ఇప్పుడిది విజయాన్ని ప్రాప్తి చేసుకునే సమయము, మరి విజయం పొందే సమయంలో కూడా ఒకవేళ ఓడిపోతే ఇక విజయులుగా ఎప్పుడు అవుతారు? అందుకే ఈ సమయంలో సదా విజయీ. విజయము జన్మ-సిద్ధ అధికారము. అధికారాన్ని ఎవరూ వదిలిపెట్టరు, గొడవపడి-కొట్లాడి అయినా సరే తీసుకుంటారు మరియు ఇక్కడైతే సహజంగా లభిస్తుంది. విజయము మన జన్మ-సిద్ధ అధికారము. అధికారము యొక్క నషా లేక సంతోషం ఉంటుంది కదా? హద్దు అధికారంలో కూడా ఎంత నషా ఉంటుంది! ప్రైమ్ మినిస్టరు ఏమైనా – నేను ప్రైమ్ మినిస్టర్ ను అన్నది మర్చిపోతారా? నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు – నేను ప్రైమ్ మినిస్టర్ ను అన్నది ఏమైనా మర్చిపోతారా? కనుక హద్దు అధికారాన్ని మరియు అనంతమైన అధికారాన్ని ఎవరు ఎంతగా మరపింపజేసినా మర్చిపోలేరు. మాయ పని మరపింపజేయడము మరియు మీ పని విజయీగా అవ్వడము ఎందుకంటే విజయము మరియు ఓటమి అంటే ఏమిటి అన్న తెలివి ఉంది. ఓటమి విషయంలో కూడా అనుభవజ్ఞులు మరియు విజయం విషయంలో కూడా అనుభవజ్ఞులు. మరి ఓడిపోవడం వలన ఏం జరిగింది, విజయం పొందడం వలన ఏం జరిగింది – రెండింటి వ్యత్యాసం గురించి మీకు తెలుసు, అందుకే మీరు సదా విజయీగా ఉన్నారు మరియు సదా విజయీగానే ఉంటారు ఎందుకంటే అవినాశీ తండ్రి మరియు అవినాశీ ప్రాప్తులకు అధికారులము ఆత్మలమైన మనము – ఇది సదా ఇమర్జ్ రూపంలో ఉండాలి. అలా లేకపోతే ఎలా! అవ్వడమైతే అయ్యాము! తెలుసుకోవడమైతే తెలుసుకున్నాము! అలా కాదు. ప్రాక్టికల్ గా ఉన్నాము. మరి ఎవరికైతే తెలుసో వారే నిశ్చయంతో నడుస్తారు. కనుక ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చయము మరియు నషా ఉండాలి. నషాకు ఆధారమే నిశ్చయము. నిశ్చయం తక్కువైతే నషా కూడా తగ్గుతుంది, అందుకే నిశ్చయబుద్ధి విజయీ అని అంటారు. కనుక పునాది ఏమైనట్లు? నిశ్చయము. నిశ్చయంలో ‘అప్పుడప్పుడు’ అనేవారిగా అవ్వకండి. లేదంటే చివర్లో రిజల్ట్ యొక్క సమయంలో కూడా ప్రాప్తి అప్పుడప్పుడు లభించేదిగా ఉంటుంది, తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాప్తి ఉంది, తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది. కనుక ప్రాప్తి లభించే సమయంలో ప్రాప్తి అందుకోండి, పశ్చాత్తాప సమయంలో ప్రాప్తిని పొందలేరు. చేసేస్తాములే, అయిపోతుందిలే! అలా కాదు, చేయాల్సిందే అన్న ఈ నిశ్చయం ఉండాలి. చేసేస్తాములే… అన్న ఈ భరోసాతో నడవకండి. చేయడమైతే చేస్తున్నాము కదా… ఇంకేమి అవుతుంది… తయారైపోతాములే… అలా కాదు, ఇప్పుడే తయారవ్వాలి. ‘లే, లే’ అని కాదు. శ్వాసపై ఎలాంటి భరోసా లేదు అని ఇతరులతో ఛాలెంజ్ చేస్తారు కదా, ఇతరులకు జ్ఞానమిస్తారు కదా, మరి మొదట స్వయానికి జ్ఞానమిచ్చుకోండి. ఎప్పుడో చేసేవారా లేక ఇప్పుడే చేసేవారా? కనుక మీరు సదా విజయానికి అధికారి ఆత్మలు. విజయము జన్మ-సిద్ధ అధికారము, ఈ స్మృతితో ఎగురుతూ ఉండండి. ఏం జరిగినా కానీ – నేను సదా విజయీని అన్నది స్మృతిలోకి తీసుకురండి. ఏం జరిగినా, నిశ్చయం స్థిరంగా ఉంది, దానిని ఎవ్వరూ కదిలించలేరు. అచ్ఛా, ఇప్పుడు అందరూ ఎలాంటి అద్భుతం చేసి చూపించాలంటే ప్రతి స్థానము విజయీగా అనగా నిర్విఘ్నంగా ఉండాలి. ఎలాంటి విఘ్నాలు రాకూడదు. విఘ్నాలు వస్తాయి కానీ ఓడిపోకూడదు. కనుక ఎక్కడైతే విజయముంటుందో, అక్కడ విఘ్నాలు తొలగిపోతాయి, అప్పుడు నిర్విఘ్నంగా అవుతారు. సదా నిర్విఘ్నము – ఈ అద్భుతం చేసి చూపించండి. ఏ గీతా పాఠశాల అయినా, ఉప సేవాకేంద్రాలు అయినా, సేవాకేంద్రాలు అయినా కానీ స్వయం నిర్విఘ్నంగా అవ్వండి మరియు ఇతరులను కూడా నిర్విఘ్నంగా తయారుచేయండి. ఇలాంటి అద్భుతం చూపించండి. చేయాల్సిందే. చేస్తాములే, చూస్తాములే! అలా కాదు! ‘లే, లే’ అని అన్నారంటే నిశ్చయంలో పర్సెంటేజ్ ఉన్నట్లు. అందరూ ఈ శుభవార్తను వినాలి – చిన్న-పెద్ద సెంటర్లు అన్నీ నిర్విఘ్నంగా ఉన్నాయి అని. ఏ రకమైన విఘ్నము రానే రాకుండా ఉండాలి. ఇతరుల విఘ్నాలను కూడా తొలగిస్తాము, విజయులుగా అవుతాము. ఇలాంటి సమాచారాలు రావాలి. ఎక్కడి నుండైనా, విఘ్నానికి సంబంధించిన ఏ సమాచారము రాకూడదు. ఇలా అయితే అనకండి – మేమైతే బాగున్నాము, వీరు చేస్తారు, మేమేమి చేయాలి అని. మూడు నెలలు విజయీగా ఉండి చూపించండి. మూడు నెలల్లోనే తెలిసిపోతుంది. అందరూ సరే అంటే ఈ అద్భుతం చేసి చూపించండి. అచ్ఛా.

వరదానము:-

ఒక్క తండ్రి యొక్క ప్రేమలో లవలీనమై ఉంటూ అన్ని విషయాల నుండి సురక్షితంగా ఉండే మాయాప్రూఫ్ భవ

ఏ పిల్లలైతే ఒక్క తండ్రి యొక్క ప్రేమలో లవలీనమై ఉంటారో, వారు సహజంగానే నలువైపులా ఉన్న వైబ్రేషన్స్ నుండి, వాయుమండలం నుండి దూరంగా ఉంటారు ఎందుకంటే లీనమై ఉండడం అనగా తండ్రి సమానంగా శక్తిశాలిగా, అన్ని విషయాల నుండి సురక్షితంగా ఉండడము. లీనమై ఉండడం అనగా ఇమిడి ఉండడము, ఎవరైతే ఇమిడి ఉంటారో వారే మాయాప్రూఫ్ గా ఉంటారు. ఇదే సహజ పురుషార్థము, కానీ సహజ పురుషార్థము అన్న పేరుతో నిర్లక్ష్యులుగా అవ్వకండి. నిర్లక్ష్య పురుషార్థులకు లోలోపల మనసు తింటూ ఉంటుంది కానీ బయటికి వారు తమ మహిమ యొక్క పాటను పాడుకుంటూ ఉంటారు.

స్లోగన్:-

పూర్వజులము అన్న పొజిషన్ లో స్థితులై ఉన్నట్లయితే మాయ మరియు ప్రకృతి యొక్క బంధనాల నుండి విముక్తులుగా అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top