TELUGU MURLI 04-03-2023

04-03-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మీరు ఆత్మిక యాత్రలో ఉన్నారు, మీరు దేహ భానాన్ని మరియు పాత ప్రపంచాన్ని మరిచి తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి’’

ప్రశ్న:-

సాక్షిగా అయి ఏ విషయాన్ని ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాలి?

జవాబు:-

వీరి అవస్థ ఎలా ఉంది? తండ్రిని పొంది అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నారా, లేదా? అని ఏ విధముగా తండ్రి సాక్షిగా అయి ప్రతి బిడ్డ యొక్క అవస్థను చూస్తారో, అదే విధముగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి – నేను స్వయాన్ని ఎంతటి సౌభాగ్యశాలిగా భావిస్తున్నాను? ఎంత సంతోషము ఉంటుంది? తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకున్నానా? వారసులను తయారుచేసానా? యోగబలముతో పాపాలను భస్మం చేసి పుణ్యాత్మగా అయ్యానా?

పాట:-

రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు… (రాత్ కే రాహీ థక్ మత్ జానా…)

ఓంశాంతి.

ఇది పిల్లలకు అర్థం చేయించడం జరిగింది, ఏ విధముగానైతే ఆత్మ శాంతి స్వరూపమో, అదే విధంగా పరమపిత పరమాత్మ కూడా శాంతి స్వరూపులు. ఓం యొక్క అర్థం కూడా అర్థం చేయించబడింది – ఓం అనగా అహమ్ ఆత్మ, మమ మాయ. సన్యాసులు అహమ్ బ్రహ్మస్మి అని అంటారు. వారు బ్రహ్మమునే ఈశ్వరునిగా భావిస్తారు. రచనను మాయ అని అంటారు. అహమ్ బ్రహ్మస్మికి ఈ విధంగా అర్థం తీస్తారు. కానీ ఇదంతా తప్పు. మనుష్యులు ఏవైతే చేస్తారో, అవన్నీ మనుష్యుల ద్వారా విన్న మాటల అనుసారంగా చేస్తారు. ఎవరు ఏది అర్థం చేయించారో, ఏ ఆచారాన్ని నడిపించారో, దానిపై నడుచుకోవడం మొదలుపెడతారు. దానికి పేరు వస్తుంది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఓ బాటసారి… ఎక్కడి బాటసారి? పరంధామం యొక్క బాటసారి. ఇది ఆత్మల కోసం ఆత్మిక యాత్ర అయ్యింది. ఆత్మలు తిరిగి వెళ్ళడము కోసం యాత్ర. గైడ్ అయితే తప్పకుండా కావాలి. విదేశాల నుండి ఎవరైనా వస్తే వారికి కూడా ముఖ్యమైన అన్ని స్థానాలను చూపించేందుకు గైడ్ లభిస్తారు. పరమపిత పరమాత్మను కూడా గైడ్ అని అంటారు. పండాలను కూడా గైడ్ అని అంటారు. మరి తండ్రి అంటారు – ఇప్పుడు నేను వచ్చాను పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందకు. ఇది ఎంత ఫస్ట్ క్లాస్ యాత్ర. దీని కోసం భక్తులు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారు. రండి, మమ్మల్ని మీ పరంధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. ఆ భౌతిక యాత్రలు అనేక రకాలుగా ఉంటాయి. ఎంతమంది దైహిక పండాలు ఉన్నారు! ఆత్మిక పండా ఒక్కరే. వారు మళ్ళీ పాండవ సైన్యాన్ని, శక్తి సైన్యాన్ని చూపించారు. యుద్ధము యొక్క విషయమేదీ లేదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – ఓ మధురమైన పిల్లలూ. మొదట అయితే నిశ్చయము ఉండాలి, తప్పకుండా వారు తండ్రి. మీ బుద్ధియోగము తండ్రి వద్దకు వెళ్ళాలి. బాబా వచ్చి ఉన్నారు మనల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు. ఇక్కడ ఇది దుఃఖధామము, పతిత ప్రపంచము, నరకము. హెల్ అన్న పేరైతే ఉంది కదా. స్వర్గస్థులయ్యారు… అని పాడుతారు కూడా. తప్పకుండా ఏదో కొత్త వస్తువే అయి ఉంటుంది. మనుష్యులకు తెలియదు, కేవలం అనేస్తారు. ఆచార-పద్ధతులు ఏవైతే కొనసాగుతూ వచ్చాయో, ఆ విధంగా అనేస్తూ ఉంటారు. ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అనగా ఆత్మ పరమాత్మగా అయిపోయింది అని అంటారు. ఇది డ్రామా అని వారికి తెలియదు. ఆత్మ అవినాశీ. ఆ అవినాశీ ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. పరమాత్మలో కూడా పాత్ర నిండి ఉంది. దీనినే డ్రామా యొక్క అద్భుతము అని అంటారు. పరమాత్మ కన్నా కూడా పాత్రధారులైన మీదైతే ఇంకా ఎక్కువ పాత్ర ఉంది. వారైతే క్రియేటర్, డైరెక్టర్. మీరు ఎవరైతే దేవీ-దేవతలుగా అవుతారో, వారిది అందరికన్నా ఎక్కువ పాత్ర ఉంటుంది. ఆది నుండి అంతిమము వరకు మీ పాత్ర ఉంది. సత్య, త్రేతాయుగాలలోనైతే తండ్రి యొక్క పాత్ర లేదు. అక్కడ బాబా ఏమీ చేయవలసిన అవసరం ఉండదు. ఈ సమయంలో నేను చాలా సేవ చేస్తాను. పిల్లలైన మిమ్మల్ని మరియు భక్తులను కూడా తృప్తిపరచాల్సి ఉంటుంది. భక్తులకు సాక్షాత్కారము కలిగితే ఇక అంతే, మేము ఈశ్వరుడిని పొందామని వారు భావిస్తారు. భక్తులకు ఎంతగా పేరు ఉంది! అది భక్తుల మాల మరియు ఇది రుద్ర మాల. జ్ఞాన మాలలో భక్తి ఉండదు. వారైతే జ్ఞాన సాగరుని నుండి జ్ఞానాన్ని ధారణ చేసి భక్తులను కూడా ఉద్ధరణ చేస్తారు. వారిదే మళ్ళీ రుద్ర మాల తయారవుతుంది.

ఇప్పుడు పిల్లలైన మీరు, మేము ఆత్మిక యాత్రలో ఉన్నామని భావిస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ స్మృతిని పెంచాలి. అది చాలా మధురమైన వస్తువు. తండ్రి రచయిత కూడా, పిల్లలను రచిస్తారు. బ్రహ్మా ముఖ వంశావళిని తయారుచేసారు. మేము శివబాబాకు సంతానము అని అందరూ అంటారు, తర్వాత ముఖ్యమైన డైరెక్షన్ ను ఇస్తారు – మన్మనాభవ, నేను వచ్చి ఉన్నాను మిమ్మల్ని చదివించడానికి. ఇదే విధంగా 5,000 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ రాజయోగాన్ని నేర్పించాను. నేను నిరాకార ఆత్మలతో మాట్లాడుతాను. మీరు మీ ఇంద్రియాలను ఆధారముగా తీసుకుంటారు. నేను వీరి ఇంద్రియాలను ఆధారంగా తీసుకుంటాను. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి, అందుకే పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనినే సన్యసించడము అని అంటారు. మొట్టమొదట అయితే నిశ్చయము ఉండాలి – నేను ఆత్మను, దేహము కాదు. ఈ దేహ భానాన్ని మర్చిపోవాలి. పాత ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు నేను తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను, కావున నా శ్రీమతముపై నడుచుకోండి. దేహ సహితముగా దేహం యొక్క అన్ని సంబంధాలు మొదలైనవాటిని మర్చిపోండి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. శ్రమ లేకుండా రాజ్యము ఏమైనా లభిస్తుందా. విశ్వానికి యజమానులుగా అవ్వాలి. ఏ జ్ఞానము అయితే నాలో ఉందో, అది ఇప్పుడు మీలో కూడా వచ్చింది. మీకు క్లుప్తముగా మరియు విస్తారముగా కూడా అర్థం చేయించడం జరుగుతుంది. బీజము నుండి ఇంతటి వృక్షమంతా వెలువడుతుంది. మళ్ళీ వృక్షము వివరాలలోకి వెళ్తే అది చాలా విస్తారమైనది. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ పాత వృక్షాన్ని మర్చిపోండి. ఇప్పుడు కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. భగవానువాచ – నేను మీకు రాజయోగాన్ని మరియు రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తాను. ఈ రచనను ఎలా రచిస్తాను, ఎలా వృద్ధి చెందుతుంది. ఇదే డ్రామాను అర్థం చేసుకోవడము. ఇదైతే మనుష్యులే తెలుసుకుంటారు. భగవంతుడు చదివించడము కూడా మనుష్యులనే చదివిస్తారు. ముఖ్యమైనది గీత. గీతకు పేరు ఉంది. గీతలో భగవానువాచ అని ఉంది. వ్యాస భగవానువాచ… అని కాదు, శ్రీకృష్ణ భగవంతుడు గీతను వినిపించారు, వ్యాసుడు రాసారు అని అంటారు. అదైతే తర్వాత రాయబడింది కదా. ఈ సమయంలో రాస్తే అది వినాశనమైపోతుంది. మీరు వీటన్నింటినీ ఎక్కువలో ఎక్కువ రెండు, నాలుగు వేలు తయారుచేస్తారు. ఆ గీతలు లక్షలు, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ ఈ పాత శాస్త్రాలే వెలువడుతాయి, వీటి నుండి మళ్ళీ కాపీ చేస్తారు, ఏ పదాలైతే ఈ గీతలో ఉన్నాయో, అవే వెలువడుతాయి. డ్రామాలో అదే రచించబడి ఉంది. ఏ సమయంలోనైతే శాస్త్రాలు రాసారో, మళ్ళీ అదే సమయంలో తప్పకుండా రాస్తారు. లక్ష్మీ-నారాయణులుగా కూడా వారే అవుతున్నారు. వారి మహళ్ళు మొదలైనవి అవే తయారవుతాయి.

ఈ సమయంలో బాబా ఈ కల్ప వృక్షము యొక్క మరియు డ్రామా యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు కలుసుకున్నారు, కల్ప-కల్పము కలుసుకుంటూ ఉంటారని అంటారు. భగవానువాచ కూడా రాయబడి ఉంది. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడు కొత్త సృష్టిని రచిస్తారు, తప్పకుండా వారిని రాజులుగా తయారుచేస్తారు. ద్వాపరానికైతే తయారుచేయరు కదా. కల్ప-కల్పము నేను సంగమములోనే వస్తానని అంటారు. గైడ్ అయితే అంతిమము వరకు తోడుగా ఉంటారు. ఆ గురువులైతే మరణిస్తారు, ఆ తర్వాత వారి సింహాసనం కొనసాగుతుంది. తండ్రి అంటారు, నేనైతే మిమ్మల్నందరిని తిరిగి తీసుకొని వెళ్ళాలి. నేను నా పూర్తి సమయానుసారముగా వస్తాను. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మన్మనాభవ అన్న పదము గీతలో కూడా ఆదిలోనూ మరియు అంతిమంలోనూ ఉంది. నన్ను స్మృతి చేయండి అనే అంటారు. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేస్తాను. రాజులకే రాజులుగా తయారుచేస్తాను. ఆ సూర్యవంశం, చంద్రవంశంలోనే మీరు పునర్జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మీరు కలియుగములో ఉన్నారు, కలియుగము నుండి మిమ్మల్ని సత్యయుగములోకి తీసుకువెళ్తున్నాను.

నేను కల్ప-కల్పము వచ్చి స్థాపన చేస్తాను. ఈ సమయంలోనే వస్తాను. మేము కూడా డ్రామాకు వశమై ఉన్నాము. సాక్షిగా అయి ప్రతి ఒక్కరి అవస్థను చూస్తాము – వీరి అవస్థ ఎలా ఉంది? అనంతమైన తండ్రిని పొంది అతీంద్రియ సుఖాన్ని పొందుతున్నారా, లేదా?అని. ప్రతి ఒక్కరు తమ మనసును ప్రశ్నించుకోవాలి – మేము స్వయాన్ని ఎంతటి సౌభాగ్యశాలిగా భావిస్తున్నాము? తండ్రికి పిల్లలుగా అయ్యారు, కావున తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకున్నారా? బాబా అందరినీ లక్ష్మీ-నారాయణులుగా తయారుచేస్తారని కాదు. ఇది చదువు, ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత. స్కూలులో చదివించేటప్పుడు లక్ష్యము, ఉద్దేశ్యము ఉంటుంది కదా. మీకు తెలుసు, మనకు 5,000 సంవత్సరాల క్రితం వలె అదే విధముగా తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భగవానువాచ – నేను మిమ్మల్ని పతిత మనుష్యుల నుండి పావన దేవతలుగా తయారుచేస్తాను. గాడ్ చదివిస్తారు మరి తప్పకుండా గాడ్-గాడెస్ గా తయారుచేస్తారు కదా. ఏ విధముగా బ్యారిస్టర్, బ్యారిస్టర్ ను తయారుచేస్తారు. భక్తి మార్గములో భగవతి-భగవాన్ అని అంటారు కానీ వారు దేవీ-దేవతలు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అని అంటారు.

తండ్రి వచ్చి మనల్ని ఎలా చదివిస్తారో మీకు తెలుసు. ముఖ్యమైన లక్ష్యము, ఉద్దేశ్యము కూడా బుద్ధిలో ఉంది. చక్రాన్ని అయితే బుద్ధిలో తిప్పాల్సిందే. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండాలి. పవిత్రముగా అవ్వకపోతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా ఎలా అవుతారు? ఈ డ్రామా రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చిత్రాలు మొదలైనవాటిని కూడా తండ్రి తయారుచేయించారు. బాబా ఆర్టిస్టుగా ఉండేవారు కాదు కదా. ఈ వస్తువులను ఇంకెవ్వరూ తయారుచేయించలేరు. ఇవి మ్యాపులు. ఇది వృక్షము, బీజము పైన ఉంది. కల్ప వృక్షము కింద జగదంబ కూర్చున్నారు, వారు అందరి సుఖము యొక్క కామనను పూర్తి చేస్తారు. సత్యయుగములో దుఃఖం యొక్క పేరు ఉండదు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని మీరు అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అని… సిక్కులు వారి మహిమను చేస్తారు. దేవీ-దేవతలే స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. వారు ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు, మళ్ళీ బయటకు వస్తారు. మనం కూడా ఇంతకుముందు హిందూ ధర్మము అని రాసేవారము. ఇప్పుడు మనం బ్రాహ్మణ ధర్మానికి చెందినవారము అని అంటాము. మనం బ్రాహ్మణ ధర్మము అని రాస్తాము కానీ వారు మళ్ళీ హిందూ అనే భావిస్తారు ఎందుకంటే వారి వద్ద బ్రాహ్మణ ధర్మానికి చెందిన కాలమ్ ఏదీ లేనే లేదు. మనం దేవీ-దేవతలము అని అంటాము, అయినా కూడా మార్చి హిందు అని రాసేస్తారు ఎందుకంటే బ్రాహ్మణ లేక దేవీ-దేవతా ధర్మము పేరే మాయమైపోయింది. పిల్లలైన మీకు తెలుసు, మనమే దేవీ-దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము. అక్కడ యథా రాజా-రాణి తథా ప్రజా అందరికీ ఈ లక్ష్మీ-నారాయణుల వంటి డ్రెస్లు ఉంటాయి. పీతాంబరము – ఇది సత్యయుగీ సూర్యవంశీయుల డ్రెస్. త్రేతాలోని రామ రాజ్యములో మళ్ళీ వేరే డ్రెస్ ఉంటుంది. ఆచార-వ్యవహారాలు వేరుగా ఉంటాయి. శ్రీకృష్ణుడిని ఎల్లప్పుడూ పీతాంబరధారి అని అంటారు.

కావున ఇప్పుడు ఈ నిశ్చయం ఏర్పరచుకోవాలి, తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఈ మృత్యులోకం సమాప్తం కానున్నది. ఎప్పుడైతే మీరు నిరంతరము తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, అప్పుడు సంపూర్ణ నిర్వికారిగా అవుతారు. ఆ యోగబలముతో పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి, పుణ్యాత్మగా అయిపోతారు. మీరు తండ్రి వద్ద సరెండర్ అవుతారు, పుణ్య కర్మలు చేస్తారు. మళ్ళీ స్మృతితో ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. భగవానువాచ అని ఎప్పుడైనా విన్నారా? స్వర్గ స్థాపన చేసే ఫాదర్ వారే. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మహారాజుగా అవ్వాలనుకుంటే మీరు ఎంతమంది ప్రజలను తయారుచేసారో చెప్పండి? ఫలానావారు మాకు దృష్టిని ఇచ్చారు, బాణము తగిలింది అని ఇలా చాలామంది రాస్తారు. ప్రజలను తయారుచేసేందుకు మరియు వారసులను తయారుచేసేందుకు శ్రమించవలసి ఉంటుంది. ప్రజలైతే చాలా సహజముగా తయారైపోతారు, మరి సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? వారిని కూడా శ్రమ చేసి తయారుచేయాలి. మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవ్వాలి. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లు. తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. పిల్లలైన మీరు ఈ శ్రమ చేయాలి. ఏదైనా విషయంలో తికమకపడితే అడుగుతూ ఉండండి. తండ్రి చదివిస్తున్నప్పుడు ఇందులో ఏ సంశయము రాకూడదు కదా. అనేక రకాల సంకల్పాల తుఫానులైతే వస్తాయి. బుద్ధియోగాన్ని తెంచేందుకు ప్రయత్నిస్తాయి. తుఫానులు వస్తాయి, మాయ చాలా హైరానా పరుస్తుంది. అప్పుడు, నా మనసే పాడైపోయిందని అంటారు. అనారోగ్యము మొదలైనది ఏదైతే ఎప్పుడూ రాలేదో, అది ఇప్పుడు వస్తూ ఉంటుంది. విఘ్నాలు చాలా వస్తాయి, ఇందులో బలహీనముగా అవ్వకూడదు. అచ్ఛా!

బాప్ దాదా మరియు మధురాతి-మధురమైన మమ్మా యొక్క సికీలధే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏ ఫస్ట్ క్లాస్ యాత్రనైతే నేర్పించారో, ఆ ఆత్మిక యాత్రలో ఉండాలి. శ్రీమతముపై దేహ సహితముగా అన్నీ మర్చిపోవాలి.

2. ఎప్పుడూ కూడా మాయా తుఫానులలో బలహీనముగా లేక సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. ఏ విషయములోనూ తికమకపడకూడదు.

వరదానము:-

సదా నిండుతనం యొక్క అనుభూతి ద్వారా వంకరగా ఉన్న మార్గాన్ని సరి చేసే శక్తి అవతార భవ

సదా శక్తులు, గుణాలు, జ్ఞానం, సంతోషం యొక్క ఖాజానాలతో నిండుగా ఉన్నట్లయితే నిండుతనం యొక్క నషాతో వంకర మార్గము కూడా సరైపోతుంది. ఒకవేళ ఖాళీగా ఉన్నట్లయితే గొయ్యిలా ఏర్పడుతుంది మరియు గోతిలో పడడము వలన బెణకడం జరుగుతుంది. ఎవరైతే బలహీనంగా మరియు ఖాళీగా ఉంటారో వారి సంకల్పాలలో బెణుకు వచ్చినట్లుగా అవుతుంది. శక్తి అవతారము అనగా వంకరగా ఉన్నదానిని సరి చేసే కాంట్రాక్టు తీసుకునేవారు. అటువంటి కాంట్రాక్టును తీసుకునేవారు ఎప్పుడూ మార్గము వంకరగా ఉంది అని అనరు. ఒకవేళ ఎవరైనా పడిపోతే అటెన్షన్ యొక్క లోపము లేదా బుద్ధి నిండుగా లేదు అని అర్థము.

స్లోగన్:-

ఆత్మిక నషాను ధారణ చేసేవారే ఆత్మిక గులాబీలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top