TELUGU MURLI 28-02-2023

                28-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి ఇచ్చే జ్ఞానం యొక్క అద్భుతం ఏమిటంటే, మీరు ఈ జ్ఞానము మరియు యోగబలముతో పూర్తి పవిత్రముగా అవుతారు, తండ్రి మిమ్మల్ని జ్ఞానం ద్వారా జ్ఞాన దేవకన్యలుగా చేసేందుకు వచ్చారు’’

ప్రశ్న:-

తండ్రి చేసే అద్భుతానికి పిల్లలు తండ్రికి ముందుగానే ఏ కానుకను ఇస్తారు?

జవాబు:-

తండ్రిపై బలిహారమవ్వడమే వారికి ముందుగానే కానుకను ఇవ్వడము. బాబా మొదట సుందరముగా తయారుచేయాలి, ఆ తర్వాత బలిహారమవుతాము అని కాదు. ఇప్పుడు పూర్తిగా బలిహారమవ్వాలి. శరీర నిర్వహణ చేస్తూ, పిల్లలను సంభాళిస్తూ శ్రీమతముపై నడవడమే బలిహారమవ్వడము. ఈ పాత ప్రపంచములోనైతే గవ్వలున్నాయి, వీటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి తండ్రిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి.

పాట:-

నీవు ప్రేమ సాగరుడవు… (తూ ప్యార్ కా సాగర్ హై…)

ఓంశాంతి.

పిల్లలకు తెలుసు, తండ్రి సమ్ముఖములో కూర్చున్నారు, మరియు మిగిలినవారు ఎవరైతే దూరంగా కూర్చున్నారో, వారందరికీ కూడా చెప్తున్నారు, వినడమైతే వారు కూడా వినాలి. పిల్లలకు తెలుసు, తండ్రి జ్ఞాన సాగరుడు, కావున తప్పకుండా వారిలో జ్ఞానము ఉంటుంది కదా. ఏ విధంగా సన్యాసులు, విద్వాంసులు ఉంటారు, వారు మేము విద్వాంసులమని భావిస్తారు. పరమపిత పరమాత్మ, మాత-పితల సమ్ముఖములో కూర్చున్నామని పిల్లలకు తెలుసు. వారు జ్ఞాన సాగరుడు. జ్ఞానముతో సద్గతి జరుగుతుంది. ఆ జ్ఞాన సాగరుడి నుండి లోటాను నింపుకున్నట్లుగా తీసుకుంటారు. సాగరమైతే ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది కదా. సాగరము నుండి ఎంత నీరు మొత్తం ప్రపంచానికి లభిస్తూ ఉంటుంది. ఎప్పుడూ తరిగిపోదు, లెక్కలేనంత నీరు ఉంటుంది. మరి తండ్రి కూడా జ్ఞాన సాగరుడు, ఎప్పటివరకైతే జీవిస్తామో, అప్పటివరకు వారి నుండి జ్ఞానము వింటూనే ఉంటాము. వారు సదా నిండుగా ఉంటారు. కొన్ని జ్ఞాన రత్నాలను ఇస్తారు, వాటి ద్వారా మొత్తం సృష్టి సద్గతిని పొందుతుంది. వారు జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, వారి సాంగత్యముతో పతితుల నుండి పావనులుగా అవుతారు. మీరు జ్ఞాన గంగలు, మానససరోవరము ఉంటుంది కదా. సరోవరము ఒక పెద్ద చెరువు. దానిని కూడా కైలాస పర్వతము పైన చూపిస్తారు. అది పెద్ద సాగరము, అందులో మునగడం ద్వారా మనుష్యుల నుండి దేవకన్యలుగా అవుతారని భావిస్తారు. దేవకన్యల యొక్క అర్థమైతే వారు అర్థం చేసుకోలేరు. దేవకన్యలు చాలా సుందరంగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, తండ్రి మనకు ఈ జ్ఞాన స్నానము చేయించి ఇటువంటి సుందరమైన, అందమైన జ్ఞాన దేవకన్యలుగా తయారుచేస్తారు. అక్కడైతే ప్రాకృతిక సౌందర్యము ఉంటుంది. ఇక్కడ కాటుక, క్రీములు మొదలైనవి రాసుకొని అలంకరించుకుంటారు. ఇది కృత్రిమ సౌందర్యము. తత్వాలే తమోప్రధానముగా ఉన్నాయి. అక్కడ తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి. దేవతల వలె సుందరముగా ఎవ్వరూ ఉండరు. ఇక్కడి సౌందర్యములో ఆరోగ్యమైతే ఉండదు. అక్కడ మీ ఆరోగ్యము కూడా బాగుంటుంది మరియు సౌందర్యము కూడా ఉంటుంది. బాబా అయితే అద్భుతం చేస్తారని పిల్లలు భావిస్తారు. మనుష్యులు పెద్ద-పెద్ద మార్బల్స్ యొక్క విగ్రహాలను తయారుచేస్తారు లేదా మంచి కళతో చిత్రాలను తయారుచేస్తారు, కావున వారికి చాలా కానుకలు లభిస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, తండ్రి జ్ఞానము మరియు యోగబలముతో మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారుచేస్తారు. తండ్రి అయితే అద్భుతము చేస్తారు. జ్ఞానము మరియు యోగము యొక్క బలిహారము ఎంత గొప్పది. అద్భుతము ఏమిటంటే, బాబా యొక్క జ్ఞానబలముతో ఆత్మ పూర్తిగా పవిత్రముగా అవుతుంది. 5 తత్వాలు కూడా పవిత్రముగా అవుతాయి, వాటి వలన ప్రాకృతిక సౌందర్యము ఉంటుంది. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచములో తేడా అయితే ఉంటుంది కదా. ప్రతి ఒక్క వస్తువు సతోప్రధానముగా, సతో, రజో, తమోగా అవుతుంది. ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. ఎలాంటి-ఎలాంటి మనుష్యులు ఉంటారో, మళ్ళీ వారి కోసం వైభవాలు కూడా అలాగే ఉంటాయి. షావుకార్ల కోసం వైభవాలు కూడా బాగుంటాయి కదా. పేదవారి వద్ద గవ్వలు ఉంటాయి. కావున ఈ పాత ప్రపంచములో కూడా గవ్వలే ఉంటాయి. కొత్త ప్రపంచములో అంతా కొత్తగా ఉంటుంది. కావున వారు ఎంత అతి ప్రియమైన బాబా, వారిని మనం మహిమ చేస్తాము. నేను ఎంత అతి ప్రియమైనవాడిని అని బాబా స్వయమైతే ఇలా అనరు. పిల్లలు బాబా మహిమను చేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని జ్ఞాన యోగాలతో ఎలా తయారుచేస్తాను. బాబాకు మరి ఏం కానుక లభిస్తుంది. ముందుగానే బాబాకు కానుకను ఇస్తారు అనగా వారిపై బలిహారమవుతారు. మీపై బలిహారమవుతామని పాడుతారు కూడా, మరి తప్పకుండా ముందుగానే బలిహారమవుతారు కదా. అంతేకానీ, మొదట బాబా సుందరముగా తయారుచేయాలి, ఆ తర్వాత మీరు బలిహారమవుతారు అని కాదు. బలిహారం కూడా పూర్తిగా కావాలి. ఆ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. అలాగని అందరూ బాబా వద్దకు వచ్చి కూర్చుండిపోవాలని కాదు. మీరు శ్రీమతంపై నడవాలి. వారు సర్వాత్మలకు తండ్రి. వారిని ఆత్మలకు రచయిత అని అనరు. సృష్టి రచయిత లేక స్వర్గ రచయిత అని అంటారు. ఇకపోతే, ఆత్మ మరియు ఈ ఆట అయితే అనాదిగా ఉన్నాయి. కానీ ఈ సమయంలో పాత ప్రపంచాన్ని కొత్తగా తయారుచేస్తారు. పరివర్తన చేస్తారు. శరీరమైతే వినాశీ. బాబా ఇప్పుడు మన ఆయుష్షును ఎంతగా పెంచుతారు. అనంతమైన ఆయుష్షు లభిస్తుంది. అక్కడ సుమారుగా 150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఇక్కడైతే కొందరిది ఒక సంవత్సరము ఆయుష్షు కూడా ఉంటుంది. కొందరు ఒక మాసం కూడా జీవించరు. జన్మించిన వెంటనే మరణిస్తారు. అక్కడ ఈ విధంగా ఉండదు. అందరి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. అక్కడి నియమానుసారముగా, పాత్రలు త్వరగా పగిలిపోవడం అనేది జరగదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు చాలా శ్రమ చేయాలి. శివ శక్తి సైన్యమైన మీరు తండ్రికి సహాయకులు. మీరు అర్థం చేసుకుంటారు, ఈ సమయంలో రావణరాజ్యము ఉంది, అందరూ వికారులుగా ఉన్నారు. ఆ వికారుల నుండి సన్యాసులు వేరుగా అయిపోతారు, మళ్ళీ సృష్టి రచించడము జరగదు. సన్యాసులు సన్యాస సృష్టినే రచిస్తారు అనగా నోటి ద్వారా తమ సమానముగా సన్యాసులుగా తయారుచేస్తారు. వారిని వంశావళి అని అనరు. వంశావళి గృహస్థ ఆశ్రమంలో ఉంటారు. సత్యయుగములో వంశావళి పుష్పాల వలె ఉంటారు. సన్యాసులకు వంశావళి ఉండజాలదు. పరిమితంగా ఉంటారు. ఇదైతే అపరిమితమైనది కదా. గృహస్థ ఆశ్రమము అని అంటారు. వాస్తవానికి ఆశ్రమమనేది చాలా ఉన్నతమైనది. ఆశ్రమము పవిత్రముగా ఉంటుంది. వికారీ గృహస్థాన్ని ఆశ్రమము అని అనలేరు. తండ్రి పవిత్ర గృహస్థ ఆశ్రమ ధర్మంవారిగా తయారుచేస్తారు, మాయా రావణుడు అధర్మబద్ధులుగా తయారుచేస్తాడు. మనుష్యులు అధర్మబద్ధులుగా అయిపోయారు. ధర్మబద్ధులు, అధర్మబద్ధులు అని మనుష్యులనే అంటారు. జంతువులను ఏమైనా అంటారా. కావున తండ్రి వచ్చి ధర్మబద్ధులుగా తయారుచేస్తారు, మాయ అధర్మబద్ధులుగా చేస్తుంది. కానీ వారి గురించి తెలియదు. ఏ విధంగా ఈశ్వరుని గురించి తెలియదో, అలాగే మాయను గురించి కూడా తెలియదు. పరమాత్మ కోసం సర్వవ్యాపి అని అంటారు. కానీ సర్వవ్యాపి అయితే 5 వికారాలు. ఈ సమయంలో భక్తులందరూ తండ్రిని స్మృతి చేస్తారు అనగా అందరిలోనూ భగవంతుని స్మృతి ఉంది. అలాగని వారు సర్వవ్యాపి అని కాదు. 5 వికారాలే దుఃఖాన్ని ఇస్తాయి. కావున భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు, చాలా దుఃఖితులుగా ఉన్నారు. మళ్ళీ దుఃఖము, సుఖము భగవంతుడే ఇస్తారని అంటారు. రావణుడి పేరునే మర్చిపోతారు మరియు సంపదను మాయ అని భావిస్తారు. సంపద అని అయితే ధనాన్ని అంటారు. ఈ సమయంలో మనుష్యులందరూ మాయా రావణుడికి శిష్యులుగా ఉన్నారు. మీరు ఈశ్వరుడికి శిష్యులుగా అయ్యారు. వారు రావణుడి దుఃఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి వచ్చి మాతలకు గురువు పదవిని ఇస్తారు. ఇక్కడ పతి స్త్రీకి గురువు అని అంటారు, కానీ వారు ఇంకా పతితంగా చేస్తారు. ద్రౌపది కూడా నా పరువును కాపాడండి అని అన్నారు కదా. ఈ కన్యల ద్వారానే ఉద్ధరణ చేస్తాను అని ఇప్పుడు తండ్రి అంటారు. కన్యకు గాయనం ఉంటుంది, ఎవరైతే 21 జన్మల కోసం పుట్టినింటిని మరియు మెట్టినింటిని ఉద్ధరిస్తారో, వారే కుమారి. ఈ సమయంలో మీరు కన్యలుగా అవుతారు కదా. మాతలు కూడా కుమారిలుగా అవుతారు. మీరు బ్రహ్మాకుమారీలు కదా. కావున ఈ సమయంలో మీ మహిమ కొనసాగుతూ వస్తుంది. కుమారీలు అద్భుతం చేసారు. తండ్రియే కుమారీలను తమవారిగా చేసుకున్నారు. కావున పేరును ప్రసిద్ధం చేయాలి. మాతలు కూడా ఈశ్వరీయ ఒడిని తీసుకొని కుమారీలుగా అవుతారు. కన్యల మహిమ వాస్తవానికైతే కేవలం గాయన-మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా తండ్రి మిమ్మల్ని మేల్కొలుపుతారు. తండ్రి కుమారీలను తమవారిగా చేసుకున్నారు. మెట్లు ఎక్కి మళ్ళీ దిగడము కష్టమవుతుంది. ఇప్పుడు కూడా చూసినప్పుడు, అనవసరంగా వివాహం చేసుకున్నానని అంటారు కదా. మళ్ళీ పిల్లలు జన్మించడంతో మోహపు బంధనము జోడించబడుతుంది. కావున తండ్రి అర్థం చేయిస్తారు, అర్ధకల్పం కన్యలకు వివాహం చేయించి వికారులుగా తయారుచేసారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, పవిత్రంగా అవ్వండి అని అంటారు. పవిత్రతలో సుఖము కూడా ఉంది, అలాగే గౌరవము కూడా ఉంది అని చూస్తారు. సన్యాసులకు ఎంత గౌరవము ఉంది. బంధనముక్తులుగా అవుతారు. అది పవిత్రత యొక్క బలము, అదేమీ యోగ బలము కాదు. యోగబలము కేవలం మీ వద్దే ఉంది. వారిదైతే తత్వముతో యోగము, అది నివసించే స్థానము. ఏ విధంగా 5 తత్వాలు ఉన్నాయో, అలాగే అది ఆరవ తత్వము, దానిని బ్రహ్మము, ఈశ్వరుడు అని అంటారు, అందుకే వారి యోగము కృత్రిమమైనది. ఆ యోగము ద్వారా వికర్మలు వినాశనమవ్వవు, అందుకే గంగా స్నానాలు చేసేందుకు వెళ్తారు. యోగము ద్వారా పావనముగా అవుతాము అన్న నిశ్చయం ఒకవేళ ఉన్నట్లయితే, మళ్ళీ గంగా స్నానాలు చేయరు. దీని ద్వారా వారి యోగము నియమవిరుద్ధంగా ఉందని నిరూపించబడుతుంది. ఏ విధంగా హిందు ధర్మము అంటూ ఏదీ లేదో, అలాగే బ్రహ్మము కూడా ఈశ్వరుడు కాదు. నివసించే స్థానాన్ని ఈశ్వరునిగా భావిస్తారు. ఈ విషయాన్ని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కావున కుమారీలు అర్థం చేయించగలరు. బి.కె.లమైన మేము ఈ భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాము, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యాన్ని తయారుచేస్తాము. తండ్రి అంటారు, మాతల పేరును చాలా ప్రసిద్ధం చేయాలి. పురుషులు దీనిలో సహాయం చేయాలి. వీరు పవిత్రంగా ఉండాలనుకుంటే పవిత్రంగా ఉండనివ్వండి. కావున తండ్రి వచ్చి మొదట మాతలకు మరియు కుమారీలకు జ్ఞానాన్ని ఇచ్చి తమవారిగా చేసుకుంటారు. అందరూ శివ వంశీయులే, తర్వాత మళ్ళీ బ్రహ్మాకుమారులు మరియు కుమారీలుగా అవుతారు. కుమారులు కూడా ఉన్నారు కానీ కొద్దిమందే ఉన్నారు. కుమారీలు ఎక్కువమంది ఉన్నారు. మీ స్మృతిచిహ్న మందిరాలు కూడా ఇక్కడ ఏక్యురేట్ గా ఉన్నాయి. వికారాలు లేకుండా సృష్టి ఎలా ఉత్పన్నమవుతుంది అని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ దుఃఖమయమైన పతిత సృష్టి అవసరం లేదు. కావున తప్పకుండా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. గవర్నమెంట్ కూడా అంటుంది, జన్మించేవారి సంఖ్య తగ్గాలి ఎందుకంటే ఇంతటి ధాన్యము ఎక్కడి నుండి వస్తుందని వారు భావిస్తారు. వారు పవిత్రత విషయాన్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు శివాలయం స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. అనంతమైన ప్రపంచము శివాలయముగా అవుతుంది. వారైతే ఒక మందిరానికి శివాలయము అన్న పేరును పెట్టారు. అది హద్దు యొక్క శివాలయము అయినట్లు. ఇది అనంతమైన శివాలయము అవుతుంది. మొత్తం స్వర్గాన్ని శివాలయము అని అంటారు. శివుడు దేవీ-దేవతలను రచించారు. వారి మందిరాలు తయారయ్యాయి. అది చైతన్యమైన శివాలయము. ఆ తర్వాత ఇది వేశ్యాలయముగా అవుతుంది. చైతన్య దేవతల జడ మందిరాలను తయారుచేసి వాటిని మళ్ళీ వికారీ మనుష్యులు పూజిస్తారు. శివాలయాన్ని శివబాబా తయారుచేస్తారు. శివ శక్తి పాండవ సైన్యము వారికి సహాయకులు. మెజారిటీ శక్తులు ఉన్న కారణముగా వారి పేరు ప్రసిద్ధమయ్యింది. కన్యలు ఎక్కువ మంది ఉన్నారు. శివబాబా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. శ్రీకృష్ణుడైతే చిన్న రాకుమారునిగా ఉండేవారు, వారు తమవారిగా ఎలా చేసుకుంటారు. వారైతే స్వయమే స్వయంవరం చేసుకొని మహారాజుగా అవుతారు. మరి ఇక్కడ శివబాబా కంసపురి నుండి బయటకు తీసి మిమ్మల్ని శ్రీకృష్ణపురి అయిన సత్యయుగములోకి తీసుకువెళ్తారు. ఇది కంసపురి. ఇప్పుడు మొత్తం ప్రపంచము ఒకవైపు మరియు కొద్దిమంది పిల్లలైన మీరు మరొకవైపు ఉన్నారు. అర్ధకల్పం మనుష్యులు వ్యతిరేకంగా అర్థం చేయించారు. తండ్రి వచ్చి సరిగ్గా అర్థం చేయించారు. ఇంతకుముందు ఈ బేధాలను తెలియజేసే చాలా మంచి పుస్తకము ఉండేది. ఇప్పుడైతే పాయింట్లు కూడా ఇంకా-ఇంకా మంచివి వెలువడుతూ ఉన్నాయి. తండ్రి అంటారు, రోజు రోజుకు మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. జ్ఞానమంతటినీ ఒకేసారి కలిపైతే ఇవ్వరు. మొదట తేలికైన విషయాలను వినిపించేవారు. రోజు రోజుకు గుహ్యమవుతూ ఉంటుంది. గుహ్యమైన విషయాలన్నింటినీ ఒకే సమయంలో ఎలా వినిపిస్తాను. ఏదైతే అర్థం చేయిస్తారో అదే కల్పక్రితము కూడా అర్థం చేయించారు, ఇందులో సంశయం యొక్క విషయమేమీ లేదు. ఇంతకుముందైతే బాబా ఇలా అనేవారు, ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నారు అని కాదు. అరే, ముందు అయితే మొదటి తరగతిలో ఉండేవారు. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, అవి ఇంకా వెలువడుతూ ఉంటాయి. ఎప్పటివరకైతే జీవిస్తారో, అప్పటివరకు బాబా వినిపిస్తూనే ఉంటారు. బాబా ఏవైనా గుహ్యమైన రహస్యాలను వినిపించినట్లయితే, అవి మళ్ళీ చెప్తాము. ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. ఈ శాస్త్రవాదులకు కూడా శాస్త్రాలు కంఠస్థమై ఉంటాయి. ఇప్పుడు 18 అధ్యాయాలైతే లేవు. వీరైతే జ్ఞానసాగరుడు. వినిపిస్తూనే ఉంటారు. ఆ తండ్రియే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు. ఈ ప్రపంచములోనైతే ఏమీ లేదు. ప్రేమ లేదు, సారము లేదు. వారైతే అన్ని విషయాల యొక్క సాగరుడే సాగరుడు.

వారు సర్వవ్యాపి, మనము వారు ఒక్కటే అని మనుష్యులు అంటారు. కానీ వారి మహిమైతే చాలా గొప్పది. భక్తులు, సాధువులు మొదలైనవారందరూ వారిని స్మృతి చేస్తారు. దుఃఖితులుగా ఉన్నారు, అందుకే, తిరిగి నిర్వాణధామములోకి వెళ్ళాలి అని అంటారు. ఎప్పుడైతే నిర్వాణధామం యొక్క యజమాని వస్తారో, అప్పుడే మనల్ని తీసుకువెళ్తారు. పిల్లల కోసం స్వర్గం యొక్క బహుమానాన్ని తండ్రి తీసుకువస్తారు. స్వయం స్వర్గానికి యజమానులుగా అవ్వరు. తండ్రి స్వర్గము యొక్క బహుమానాన్ని ఇస్తారు. మళ్ళీ రావణుడు వచ్చి దుఃఖాన్ని ఇస్తాడు. దుఃఖము యొక్క బహుమతి అని అనరు. స్వర్గమనే బహుమానం యొక్క తాళంచెవిని కన్యలకు ఇచ్చారు. కన్యలు భారత్ ను స్వర్గముగా చేస్తారు. మేము పారలౌకిక మాత, పితల ఒడిని తీసుకున్నాము అని కన్యలు తమ మిత్ర-సంబంధీకులకు కూడా అర్థం చేయించవచ్చు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గృహస్థాన్ని ఆశ్రమముగా అనగా పవిత్రముగా తయారుచేయాలి. పవిత్రతలోనే బలము ఉంది, పవిత్రతకే గౌరవము ఉంది, అందుకే యోగబలాన్ని మరియు పవిత్రతా బలాన్ని జమ చేసుకోవాలి.

2. అతి ప్రియమైనవారు ఒక్క తండ్రియే. వారిపై పూర్తి-పూర్తిగా బలిహారమై పాత ప్రపంచం నుండి బుద్ధిని తొలగించాలి.

వరదానము:-

ఆత్మిక ఆకర్షణ ద్వారా సేవను మరియు సేవా కేంద్రాన్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్ళే యోగీ ఆత్మా భవ

ఏ యోగీ ఆత్మలైతే ఆత్మికతలో ఉంటారో, వారి ఆత్మిక ఆకర్షణ సేవ మరియు సేవా కేంద్రాన్ని స్వతహాగానే ఎక్కే కళలోకి తీసుకువెళ్తుంది. యోగయుక్తముగా ఉంటూ ఆత్మికత ద్వారా ఆత్మలను ఆహ్వానిస్తే జిజ్ఞాసులు స్వతహాగానే పెరుగుతారు. దీని కోసం మనసును ఎల్లప్పుడూ తేలికగా పెట్టుకోండి, ఏ రకమైన బరువు ఉండకూడదు. హృదయము స్వచ్ఛంగా ఉంచుకుంటూ సర్వ మనోకామనలు స్వతహాగా నెరవేర్చుకుంటూ వెళ్ళండి, అప్పుడు ప్రాప్తులు మీ ఎదురుగా స్వతహాగానే వస్తాయి. మీదే అధికారము కదా.

స్లోగన్:-

ఎవరైతే సర్వ బంధనాలు మరియు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారో వారే పరమాత్మ జ్ఞానీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top