TELUGU MURLI 26-02-2023

                  26-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 31-12-93 మధువనం

‘‘కొత్త సంవత్సరములో సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఎగరండి మరియు సర్వుల పట్ల మహాదాని, వరదానిగా అయి వ్యర్థాన్ని సమాప్తము చేయండి’’

ఈ రోజు నవ యుగ కొత్త సృష్టి యొక్క రచయిత అయిన బాప్ దాదా తమ నవ యుగానికి ఆధారమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదాతో పాటు పిల్లలైన మీరందరూ సదా సహయోగులు, అందుకే మీరే ఆధారమూర్తులు. ప్రపంచము లెక్కలో ఈ రోజు సంవత్సరము యొక్క సంగమము. పాత సంవత్సరము వెళ్ళిపోతూ ఉంది మరియు కొత్త సంవత్సరము వస్తూ ఉంది. ఇది సంవత్సరము యొక్క సంగమ దినము మరియు మీరు అనంతమైన సంగమయుగములో కూర్చున్నారు. మీరందరూ కొత్త సంవత్సరముతోపాటు నవ యుగం కోసం అందరికీ అభినందనలు చెప్తారు. ఒక్క రోజు కోసం అభినందించరు, కానీ నవ యుగములోని అనేక జన్మల కొరకు అభినందనలు చెప్తారు. ఈ సమయములో బ్రాహ్మణ ఆత్మలమైన మనది కొత్త జీవితమని ఈ సంగమములో మంచి రీతిలో అనుభవము చేస్తారు. కొత్త జీవితములోకి వచ్చేసారు కదా. బ్రాహ్మణుల ప్రపంచమే కొత్తది. అమృతవేళ నుండి చూసినట్లయితే కొత్త రీతి, కొత్త ప్రీతి ఉంది. పాత ప్రపంచములోని దినచర్య మరియు కొత్త జీవితమైన బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్యలో ఎంత వ్యత్యాసం ఉంది! అన్నీ కొత్తవైపోయాయి – స్మృతి కొత్తది, వృత్తి కొత్తది, దృష్టి కొత్తది, అన్నీ మారిపోయాయి కదా. మరియు కొత్త జీవితము ఎంత ప్రియముగా అనిపిస్తుంది! మామూలుగా కూడా కొత్త వస్తువు అందరికీ ప్రియమనిపిస్తుంది. పాత వస్తువును విడిచిపెట్టాలనుకుంటారు మరియు కొత్త వస్తువును తీసుకోవాలనుకుంటారు. మరి ఇది ఈ సమయము యొక్క చిన్నని కొత్త ప్రపంచము. ప్రపంచం కూడా కొత్తది మరియు సంస్కారాలు కూడా కొత్తవి, అందుకే ప్రపంచమువారు కూడా కొత్త సంవత్సరాన్ని ఆర్భాటంగా జరుపుకుంటారు.

జరుపుకోవడము అంటే అర్థము – ఉల్లాస-ఉత్సాహాలలోకి రావడము. ఉత్సాహము ఉంటుంది, అందుకే జరుపుకునే రోజును ఉత్సవము అని అంటారు. ఉత్సాహముతోనే ఒకరికొకరు అభినందనలు లేక శుభాకాంక్షలు ఇస్తారు లేక గ్రీటింగ్స్ ఇస్తారు. బ్రాహ్మణ ఆత్మలైన మీ కోసం ప్రతి రోజు ఉత్సవము. సదా ఉత్సవములో అనగా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారు. ఈ ఉల్లాస-ఉత్సాహాలే బ్రాహ్మణ జీవితము. ప్రపంచపు రీతి అనుసారంగా విశేషమైన రోజును జరుపుకుంటారు, ఈ రోజు జరుపుకునేందుకు అందరూ చేరుకున్నారు కదా. కానీ మీ నవ యుగము, కొత్త జీవితము యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. రెండవ తారీఖు వచ్చిందంటే ఉల్లాస-ఉత్సాహాలు సమాప్తమైపోతాయి, ఒక నెల గడిచిందంటే ఇంకా సమాప్తమైపోతాయి అని అలా కాదు. ప్రతి రోజు ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి, తక్కువ అవ్వవు. అలా ఉంది కదా? లేక తమ-తమ స్థానాలకు వెళ్తే ఉత్సాహము సమాప్తమైపోతుందా? ప్రతి ఘడియ ఉల్లాస- ఉత్సాహాలతో కూడుకున్నది ఎందుకంటే ఉల్లాస-ఉత్సాహాలే బ్రాహ్మణులైన మీ ఎగిరే కళకు రెక్కలు. ఈ ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఉంటారు. ఒకవేళ కార్యార్థము కర్మలోకి వచ్చినా కూడా, ఎగిరే కళ యొక్క స్థితితో కర్మయోగిగా అయ్యి కర్మలోకి వస్తారు. కనుక ఎగిరే కళ కలవారు కదా, రెక్కలు లేకుండా ఎగరలేరు. ఎగిరే కళకు రెక్కలైన ఈ ఉల్లాస-ఉత్సాహాలు సదా తోడుగా ఉంటాయి. ఈ ఉల్లాస-ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీకు అతి పెద్ద శక్తి. నీరస జీవితము కాదు. ప్రపంచమువారైతే, ఏం చేయాలి, రసము లేదు, నీరసముగా ఉంది, రస విహీనముగా ఉంది అని అంటారు మరియు మీరేమంటారు – ఉల్లాస-ఉత్సాహాలనే సారము ఉండనే ఉంది. ఎప్పుడూ నిరాశ చెందజాలరు. సదా దిల్ ఖుష్ గా ఉంటారు. ఎటువంటి కష్టతర విషయమైనా కానీ, ఉల్లాస-ఉత్సాహాలు కష్టాన్ని సహజంగా చేసేస్తాయి. ఉత్సాహము తుఫానును కూడా తోఫా (కానుక)గా చేసేస్తుంది, పర్వతాన్ని కూడా కేవలం ఆవగింజ వలె కాదు కానీ దూది వలె చేస్తుంది. ఉత్సాహము ఎటువంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనముగా అనుభవము చేయిస్తుంది, అందుకే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే నవ యుగానికి ఆధారమూర్తులు నవ జీవితము కల బ్రాహ్మణ ఆత్మలు మీరు. మీ గురించి మీకు తెలుసు. అంగీకరించారా లేక కేవలం తెలుసుకున్నారా? ఏమంటారు? తెలుసుకున్నారు కూడా, అంగీకరించారు కూడా మరియు అలాగే నడుచుకుంటున్నారు కూడా. కల్ప క్రితము కూడా మేమే ఉండేవారము, ఇప్పుడు కూడా ఉన్నాము మరియు అనేక సార్లు మేమే తయారవుతామని సదా ఈ ఉత్సాహము ఉంటుంది. కనుక అవినాశీ ఉత్సాహము అయ్యింది కదా. ఉండేవారు, ఉన్నారు మరియు సదా ఉంటారు – మూడు కాలాలకు చెందినవారిగా అయ్యారు కదా. గతము, వర్తమానము మరియు భవిష్యత్తు, మూడు కాలాలు అయ్యాయి. కనుక అవినాశీగా అయ్యారు కదా. అవినాశీ ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే ఆత్మలు నంబరువారుగా ఉన్నారా లేక అందరూ నంబరువన్ గా ఉన్నారా? అని బాప్ దాదా చూస్తున్నారు. ఉండడమే నిశ్చయబుద్ధి విజయులు అన్నప్పుడు, విజయీలైతే తప్పకుండా నంబరువన్ గా ఉంటారు కదా, నంబరువారుగా ఏమైనా ఉంటారా.

కావున సదా నవ జీవితము యొక్క ఈ ఉత్సాహములో ఎగురుతూ వెళ్ళండి ఎందుకంటే మీరు ఆధారమూర్తులు. కేవలము మీ జీవితం కోసమే ఆధారము కాదు, కానీ విశ్వములోని సర్వాత్మలకు ఆధారమూర్తులు. మీ శ్రేష్ఠ వృత్తితో విశ్వములోని వాతావరణము పరివర్తన అవుతూ ఉంది. మీ పవిత్ర దృష్టితో విశ్వములోని ఆత్మలు మరియు ప్రకృతి – రెండూ పవిత్రంగా అవుతున్నాయి. మీ దృష్టితో సృష్టి పరివర్తన అవుతూ ఉంది. మీ శ్రేష్ఠ కర్మలతో శ్రేష్ఠాచారీ ప్రపంచము తయారవుతూ ఉంది. కావున ఎంత బాధ్యత ఉంది! విశ్వం యొక్క బాధ్యతా కిరీటాన్ని ధరించి ఉన్నారు కదా? లేక ఎప్పుడైనా భారీగా అనిపించినప్పుడు తీసేస్తారా? ఏం చేస్తారు? ఎవరైతే డబల్ లైట్ గా ఉంటారో, వారికి ఈ బాధ్యతా కిరీటము కూడా సదా లైట్ గా(తేలికగా) అనుభవమవుతుంది, భారీ అనిపించదు. ఈ సమయములోని కిరీటధారులు భవిష్య కిరీటధారులుగా అవుతారు. మరి కొత్త సంవత్సరములో ఏం చేస్తారు? అవ్యక్త సంవత్సరాన్ని కూడా జరుపుకున్నారు, అవ్యక్త సంవత్సరము అనగా ఫరిశ్తాగా అయ్యారా లేక ఇప్పుడు అవ్వాలా? ఫరిశ్తాలు ఏం చేస్తారు?

అవ్యక్తము అంటే అర్థమే ఫరిశ్తా. సంవత్సరము పూర్తి అయ్యింది, మరి ఫరిశ్తాలుగా అయ్యారు కదా లేదా అవ్వలేదా? అవ్యక్త సంవత్సరాన్ని ఇప్పుడు ఇంకా పెంచాలా? రెండు సంవత్సరాలను ఒక సంవత్సరంగా తయారుచేయాలా? ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకున్నారు, ఇప్పుడు ఫరిశ్తాలుగా అయ్యి ఏం చేస్తారు?

సదా ప్రతి రోజు, ప్రతి సమయము మహాదానిగా మరియు వరదానిగా అవ్వాలి. కనుక ఈ సంవత్సరాన్ని మహాదాని, వరదాని సంవత్సరముగా జరుపుకోండి. ఎవ్వరు సంబంధ-సంపర్కములోకి వచ్చినా సరే, ఆ ఆత్మకు మహాదానిగా అయ్యి ఏదో ఒక శక్తిని, జ్ఞానాన్ని, గుణాన్ని దానము ఇవ్వాల్సిందే. మూడు ఖజానాలు ఎంత నిండుగా అయ్యాయి! జ్ఞానం యొక్క ఖజానా నిండుగా ఉందా లేక కాస్త తక్కువగా ఉందా? మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు కదా. కావున జ్ఞానం యొక్క ఖజానా కూడా ఉంది, శక్తుల ఖజానా కూడా ఉంది మరియు గుణాల ఖజానా కూడా ఉంది. మూడింటిలో సంపన్నంగా ఉన్నారా లేక ఒక్కదానిలో సంపన్నంగా ఉండి, రెండింటిలో లేరా? వర్తమాన సమయములో ఆత్మలకు మూడింటి అవసరము చాలా ఉంది. మొత్తం రోజంతటిలో ఏదో ఒకటి దానము ఇవ్వాల్సిందే, జ్ఞానాన్ని కానీ, శక్తులను కానీ, గుణాలను కానీ, ఇవ్వాల్సిందే. మహాదానీ ఆత్మలు దానము ఇవ్వని రోజు ఏదీ ఉండకూడదు. సంవత్సరము పూర్తయిపోయిన తర్వాత మాకైతే అవకాశము లభించనే లేదని అనడము – ఇలా ఉండకూడదు. అవకాశం తీసుకోవడము కూడా మీపైనే ఉంది, అవకాశము ఇచ్చేవారు ఇస్తే అప్పుడు అవకాశము తీసుకోగలరా లేక స్వయము కూడా అవకాశము తీసుకోగలరా, తీసుకోవడము వచ్చా? లేదంటే ఎవరైనా ఇస్తేనే తీసుకోవడము వచ్చా? ఎవ్వరూ అవకాశము ఇవ్వకపోతే అప్పుడేమి చేస్తారు? చూస్తూ, ఆలోచిస్తూ ఉంటారా? మొత్తం రోజంతటిలో బ్రాహ్మణ ఆత్మలతో కానీ, అజ్ఞానీ ఆత్మలతో కానీ సంబంధ-సంపర్కములోకైతే వస్తూనే ఉంటారు కదా, ఎవరితో సంబంధ సంపర్కములలోకి వచ్చినా, వారికి ఏదో ఒక దానము అనగా సహయోగాన్ని ఇవ్వండి. దానము అన్న పదానికి ఆత్మిక అర్థము సహయోగము ఇవ్వడము. మరి రోజు మహాదాని లేక వరదానిగా అయ్యి వరదానము ఎలా ఇస్తారు? వరదానము ఇచ్చే విధి ఏమిటి? మీ జడ చిత్రాలైతే ఇప్పటి వరకు వరదానము ఇస్తూనే ఉన్నాయి. కావున వరదానాన్ని ఇచ్చే విధి – ఏ ఆత్మ సంబంధ-సంపర్కములోకి వచ్చినా సరే, వారికి మీ స్థితి యొక్క వాయుమండలము ద్వారా మరియు మీ వృత్తి యొక్క వైబ్రేషన్ల ద్వారా సహయోగాన్ని ఇవ్వండి అనగా వరదానాన్ని ఇవ్వండి. ఎలాంటి ఆత్మ అయినా కానీ, దూషించేవారైనా కానీ, నిందించేవారు కానీ, మీ శుభ భావన, శుభ కామనల ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా అటువంటి ఆత్మకు కూడా గుణ దానము లేక సహనశీలతా శక్తి యొక్క వరదానాన్ని ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా క్రోధాగ్నిలో కాలిపోతూ మీ ఎదురుగా వస్తే, అగ్నిలో నూనె వేస్తారా లేక నీళ్ళు వేస్తారా? నీళ్ళు వేస్తారు కదా లేక కొన్ని నూనె చుక్కలు కూడా వేస్తారా? ఒకవేళ క్రోధి ఎదురుగా మీరు నోటి ద్వారా క్రోధం చేయలేదు, నోటితోనైతే శాంతిగా ఉన్నారు కానీ కళ్ళ ద్వారా, ముఖం ద్వారా క్రోధ భావనను పెట్టుకున్నట్లయితే, అది కూడా నూనె చుక్కలు వేసినట్లు. క్రోధంతో ఉన్న ఆత్మ పరవశమై ఉంటుంది, దయ అనే శీతల జలం ద్వారా వరదానము ఇవ్వండి. మరి అటువంటి వరదానిగా అయ్యారా? లేకపోతే ఏ సమయములో అవసరం ఉందో, ఆ సమయములో సహనశక్తి యొక్క బాణము నడవదా? ఒకవేళ ఏ అమూల్య వస్తువైనా సమయానికి కార్యములో ఉపయోగపడకపోతే దానిని అమూల్యమైనది అని అంటారా? అమూల్యము అనగా సమయానికి దాని విలువను కార్యములో పెట్టడము. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? మహాదానిగా, వరదానిగా అవ్వండి. చైతన్యములో సంస్కారాన్ని నింపుకున్నప్పుడే జడ చిత్రాల ద్వారా కూడా వరదానీ మూర్తులుగా అవుతారు. సంస్కారాలనైతే ఇప్పుడే నింపుకోవాలి కదా, లేక ఏ సమయములో మూర్తిగా అవుతారో ఆ సమయములో నింపుకుంటారా?

మహాదానీ-వరదానీ మూర్తులుగా అవ్వడము ద్వారా వ్యర్థము స్వతహాగానే సమాప్తమైపోతుంది ఎందుకంటే ఎవరైతే మహాదానిగా ఉన్నారో, వరదానిగా ఉన్నారో, ఇతరులకు ఇచ్చేటువంటి దాతగా ఉన్నారో, మరి దాతకు అర్థమే సమర్థులు. సమర్థంగా ఉన్నప్పుడే ఇవ్వగలరు. కావున ఎక్కడ సమర్థత ఉంటుందో, అక్కడ వ్యర్థము స్వతహాగానే సమాప్తమవుతుంది. సమర్థ స్థితి అంటే స్విచ్ ఆన్ అవ్వడము. ఎలాగైతే ఈ స్థూల లైటు యొక్క స్విచ్ ఆన్ చేయడము అనగా అంధకారాన్ని సమాప్తం చేయడము, ఇటువంటి సమర్థ స్థితి అనగా స్విచ్ ఆన్ చేయడము. మరి స్విచ్ సరిగ్గా ఉందా లేక అప్పుడప్పుడు సరిగ్గా ఉంటూ, అప్పుడప్పుడు లూజ్ అయిపోతుందా లేక ఫ్యూజ్ పోతుందా? ఆన్ చేయడమైతే వస్తుంది కదా. ఈ రోజుల్లోనైతే చిన్న-చిన్న పిల్లలు కూడా స్విచ్ ఆన్ చేయడములో తెలివైనవారిగా ఉంటారు. టి.వి. స్విచ్ ఆన్ చేస్తారు కదా. మరి స్విచ్ ఆన్ చేయడము ద్వారా ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తము చేసే శ్రమ నుండి విముక్తులవుతారు. అవ్యక్త ఫరిశ్తాల శ్రేష్ఠ కార్యము ఇదే. ఇంకేం నవీనతను చేస్తారు? అవ్యక్త సంవత్సరములో మీ చార్టును పెట్టుకున్నారా లేక అప్పుడప్పుడు పెట్టుకున్నారు, అప్పుడప్పుడు పెట్టుకోలేదా? అప్పుడప్పుడు చేసేవారిగా అయ్యారా లేక సదా కాలము చేసేవారిగా అయ్యారా? అప్పుడప్పుడు పెట్టుకునేవారు ఎక్కువగా ఉన్నారు.

ఈ కొత్త సంవత్సరములో కొత్త చార్టును పెట్టుకోండి. ఏ కొత్త చార్టును పెట్టుకుంటారు? నాలుగు సబ్జెక్టుల గురించైతే మంచి రీతిలో తెలుసుకున్నారు. కనుక ఈ సంవత్సరములో ఈ చార్టునే పెట్టుకోండి, నాలుగు సబ్జెక్టులలోనూ – జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో, ప్రతి సబ్జెక్టులో ప్రతి రోజు ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. జ్ఞానము అనగా వివేకవంతులుగా అవ్వడము, వివేకాన్ని ఇవ్వడము మరియు వివేకవంతులుగా అయి నడుచుకోవడము. జ్ఞానములో కూడా నవీనతకు అర్థము, స్వయములో ఏ లోపమైతే ఉందో దానిని ధారణ చేసినట్లయితే నవీనత అయినట్లే కదా. కాదు అన్నదాని నుండి అవునుగా అయ్యింది అంటే కొత్తది అయినట్లే కదా. ఇదే విధంగా యోగ ప్రయోగంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త అనుభవం చేయండి. యోగంలో చాలా మంచిగా కూర్చున్నారు, చాలా మంచిగా యోగం జోడించారు, కానీ నవీనత ఏముంది? పర్సెంటేజ్ ను పెంచుకోవడము కూడా నవీనతయే. ఈ రోజు ఒకవేళ మీ యోగం యొక్క పర్సెంటేజ్ 50 శాతము ఉంది మరియు రేపు 50 నుండి వృద్ధి జరిగింది అంటే నవీనత జరిగినట్లే. ఒక్క నెలలోనే 50-50 వరకే పెంచడము అని కాదు. కావున నాలుగు సబ్జెక్టులలోనూ స్వ ప్రగతిలో నవీనత, విధిలో నవీనత, ప్రయోగంలో నవీనత, ఇతరులను సహజ యోగిగా తయారుచేయడములో ఇంకా పర్సెంటేజ్ ను పెంచడము అనగా నవీనత. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చానా, ఎవరిపైనైనా కోపం చేసానా, ఇదైతే సాధారణ చార్టు. ఇదైతే మీ రాయల్ ప్రజలు ఎవరైతే ఉంటారో, వారు కూడా పెట్టుకుంటారు. మీరు రాయల్ ప్రజలా లేక రాజులా? కావున నవీనత ద్వారా స్వతహాగానే తీవ్ర పురుషార్థపు సమీపత యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. ఏం చార్టు పెట్టుకోవాలో అర్థమైందా? మరియు ప్రతి మూడు నెలలకు ఒకసారి పంపించండి, ప్రతి రోజు చార్టును ఇక్కడకు పంపవద్దు, పని పెరిగిపోతుంది. ఈ సంవత్సరమైతే మీరు ఎకానమీ కూడా చేయాలి కదా! ఈ సంవత్సరము విశేషంగా ఎకానమీకి సంబంధించినది. ఏక్ నామీ మరియు ఎకానమీ. జ్ఞాన సరోవరాన్ని తయారుచేస్తున్నారు కనుక అన్నింటిలో ఎకానమీ చేయండి. అన్ని ఖజానాలలో, సమయములో కూడా, సంకల్పంలో కూడా, సంపదలో కూడా, అన్నింటిలో ఎకానమీ. కనుక ప్రతి మూడు నెలలు స్వయమే సాక్షిగా అయ్యి చార్టును చెక్ చేసుకుని క్లుప్తంగా మీ సమాచారాన్ని ఇవ్వండి. ప్రతి మూడు నెలలలో చూసుకోండి – ప్రగతి జరుగుతుందా లేక ఎలా ఉన్నామో అలాగే ఉన్నామా? పడిపోయే కళలోకైతే వెళ్ళవద్దు. కానీ ఎలా ఉన్నారో అలాగే ఉండడము కూడా ఉండకూడదు. పురుషార్థం చేయడములో చాలా చిన్నవారిగా కాకూడదు. చాలా చిన్నవారిగా అవ్వడము మంచిగా అనిపిస్తుందా! ఇలా అనవద్దు, చేయాలనైతే అనుకుంటాము కానీ ఏం చేయాలి…! ఏం చేయాలి-ఏం చేయాలి అని అనవద్దు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలా… ఇది బ్రాహ్మణుల భాష కాదు. కానీ ఇలా చేయండి అని ఇతరులకు కూడా సహయోగము ఇస్తారు. ఏం చార్టును పెట్టుకోవాలో అర్థమైందా? ఎవరెవరు ఏమేమి చేస్తారో ఇప్పుడు చూస్తాము.

బాప్ దాదా స్నేహము కారణంగా పేరును ప్రకటించరు. ఎవరు ఏమేం చేసారో తెలుసు కదా. ఈ రోజుల్లో టి.వి. యొక్క ఫ్యాషన్ ఉంది, బాప్ దాదా వద్ద కూడా టి.వి. ఉంది. గడిచిన సంవత్సరము ఏ పనినైతే ఇచ్చారో దానిని ఎవరు ఎంత చేసారు అన్నది బాప్ దాదాకు తెలుసు. సగం విలువ కలవారిగా ఎంతమంది ఉన్నారు, పూర్తి విలువ కలవారిగా ఎంతమంది ఉన్నారు అని పేర్లు ప్రకటించాలా?

కనుక ఈ సంవత్సరము స్వయము కోసం కూడా మరియు సర్వుల కోసం కూడా మహాదానీ, వరదానీ మూర్తులుగా అవ్వండి మరియు ప్రతి రోజు ఏదో ఒక నవీనతను అనగా ఉన్నతిని తప్పకుండా తీసుకురండి. మరి ఇది స్వయం కోసం చేసే పురుషార్థము. సేవలో ఏం చేస్తారు? సేవలో కూడా నవీనతను తీసుకురావాలి కదా. మేళాలను కూడా చాలా చేసారు, ప్రదర్శనీలనైతే లెక్కలేనన్ని చేసారు, సెమినార్లు-కాన్ఫరెన్సులను కూడా చాలా చేసారు, ఇప్పుడు శబ్దాన్ని ప్రసిద్ధము చేసే మైక్లనైతే తయారుచేయాల్సిందే, కానీ దానికి విధి ఏమిటి? ముందు కూడా వినిపించాము కానీ తక్కువ చేసారు. సేవ యొక్క రిజల్టులో ఏం చూడడము జరిగిందంటే, పెద్ద నిమిత్త ఆత్మలను సమీపంగా తీసుకువచ్చేందుకు ముందుగా, ఎవరైనా రాజకీయనేత కానీ, ఎవరైనా పెద్ద పారిశ్రామికవేత్త కానీ, ఎవరైనా పెద్ద ఆఫీసర్ కానీ, వారిని సమీపంగా తీసుకువచ్చేందుకు సాధనము – వారి సెక్రటరీలను మంచిగా సమీపములోకి తీసుకురండి. మీరు పెద్దవారి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వారు బాగుంది- బాగుంది అంటూ తర్వాత నిద్రపోతారు. వారిని మళ్ళీ మేల్కొలిపేందుకు ఇంత సమయమైతే లభించదు, వారు ఇవ్వరు, మీరు వెళ్ళలేరు, అందుకే సెక్రటరీలు ఎవరైతే ఉంటారో, వారు మారరు కూడా, పెద్దవారైతే అందరూ మారిపోతూ ఉంటారు. ఈ రోజు ఒక మినిస్టర్ యొక్క సేవను చేస్తారు మరియు రేపు వారు ప్రజలుగా అయిపోతారు. సెక్రటరీలు మంచిగా సహయోగులుగా అవ్వగలరు. కనుక ఏ వర్గము యొక్క సేవలోనైనా ఈ సంవత్సరము విశేషంగా సెక్రటరీలు, మేనేజర్లు లేక ప్రైవేట్ అసిస్టెంట్లు, ఎవరైతే శక్తిశాలిగా ఉన్నారో, పెద్దవారికి సమీపంగా ఉంటారో, ఆ ఆత్మల సేవను విశేషంగా చేయండి.

మరొక విషయము, ముందు కూడా సూచన ఇచ్చాము – వర్తమాన సమయములో ‘తక్కువ ఖర్చు మరియు ఎక్కువ ఖ్యాతి’ ఉండాలి, దానికి విధి – చిన్న లేక పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, అసోసియేషన్ ఉంటే వారితో సంబంధ-సంపర్కాలు పెట్టుకోండి, రెడీగా ఉన్న స్టేజ్ పై పేరు ప్రఖ్యాతి చేయండి. తక్కువ ఖర్చు, ఎక్కువ ఖ్యాతి ఉండాలి. చేస్తున్నారు కానీ ఇంకా తీవ్ర గతితో చేయండి. ప్రతి దేశంలో లేక ప్రతి గ్రామంలో లేక ప్రతి జిల్లాలో రకరకాల అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో లేక కార్యాలను చేసే చాలా వర్గాలవారు ఎవరైతే ఉన్నారో, కాన్ఫరెన్సులు చేసేవారు లేక సమ్మేళనాలు చేసేవారు, రెడీగా ఉన్న స్టేజ్ పై సందేశాన్ని ఇవ్వండి. అప్పుడు సమయము మరియు శ్రమ, రెండూ మిగులుతాయి. ఇప్పుడు దీనిని తీవ్ర గతిలోకి తీసుకురండి. చెక్ చేసుకోండి – ఏ దేశానికి లేక ఏ స్థానానికి నిమిత్తమయ్యారో, ఆ స్థానములోని ఏ సంస్థ కూడా వంచితమవ్వకూడదు ఎందుకంటే వర్తమాన సమయంలో వాయుమండలము పరివర్తన అయిపోయింది. ఇప్పుడు భయం తక్కువగా ఉంది, స్నేహం ఎక్కువగా ఉంది, మంచిదని అంగీకరిస్తారు. మంచిగా అవ్వరు కానీ మంచిదని అంగీకరిస్తారు, అందుకే ఈ రెండు రకాల సేవలకు ఇంకా అండర్ లైన్ చేసినట్లయితే సహజంగా మైక్లు తయారైపోతాయి. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు కనుక కొత్త విధి మరియు విధానము కూడా కావాలి కదా.

ఈ కొత్త సంవత్సరము అమృతవేళలో సదా ఈ స్లోగన్ ను ఇమర్జ్ చేసుకోండి – ‘‘సదా ఉల్లాస-ఉత్సాహంలో ఎగరాలి మరియు ఇతరులను కూడా ఎగిరేలా చేయాలి’’ మధ్య-మధ్యలో చెక్ చేసుకోండి – అమృతవేళ చెక్ చేసుకోవడము మరియు రోజంతా మర్జ్ చేయడము, మళ్ళీ రాత్రికి, ఈ రోజైతే ఊరికే అలా గడిచిపోయిందని ఆలోచించుకోవడము, ఇలా ఉండకూడదు. ఇలా కాదు, ఉల్లాస-ఉత్సాహాలకు బదులుగా వేరే మార్గంలోకైతే వెళ్ళలేదు కదా? ఎగిరే కళకు బదులుగా వేరే ఏ కళ అయితే తనవైపుకు ఆకర్షితము చేయలేదు కదా? అని మధ్య-మధ్యలో చెక్ చేసుకోండి, ఇమర్జ్ చేసుకోండి అచ్ఛా!

నలువైపులా ఉన్న నవ జీవితాన్ని అనుభవం చేసే సర్వ బ్రాహ్మణ పిల్లలకు, సదా నవ యుగానికి ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా సంకల్పం, మాట మరియు కర్మ ద్వారా మహాదానీ-వరదానీ ఆత్మలకు, సదా స్వ స్థితి ద్వారా ఇతరుల పరిస్థితులను కూడా సహజము చేసే సమర్థ ఆత్మలకు, సదా ప్రతి రోజు స్వయములో ప్రగతిని అనగా నవీనతను అనుభవం చేసే సమీప ఆత్మలకు, సదా ఏక్ నామీ మరియు ఎకానమీ చేసే తండ్రి సమానమైన సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

తనువును ఆత్మకు మందిరముగా భావిస్తూ దానిని స్వచ్ఛముగా తయారుచేసుకునే నంబరువన్ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మా భవ

బ్రాహ్మణ ఆత్మలమైన మనం మొత్తం కల్పములో నంబరువన్ శ్రేష్ఠ ఆత్మలము, వజ్ర సమానమైనవారము, ఈ స్మృతితో తనువును ఆత్మకు మందిరముగా భావిస్తూ స్వచ్ఛముగా ఉంచుకోవాలి. మూర్తి ఎంత శ్రేష్ఠముగా ఉంటుందో, అంతగానే మందిరము కూడా శ్రేష్ఠముగా ఉంటుంది. కావున ఈ శరీరం రూపీ మందిరానికి మనం ట్రస్టీలము, ఈ ట్రస్టీతనము తనకు తానే స్వచ్ఛతను లేక పవిత్రతను తీసుకువస్తుంది. ఈ విధి ద్వారా తనువు యొక్క పవిత్రత సదా ఆత్మిక సుగంధాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది.

స్లోగన్:-

ఆత్మికతలో ఉండే వ్రతమును చేపట్టడమే జ్ఞానీ ఆత్మగా అవ్వడము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top