TELUGU MURLI 22-02-2023

22-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – మీకు జ్ఞానమనే సాక్కిరిన్ లభించింది, ఈ సాక్కిరిన్ యొక్క బిందువు మన్మనాభవ, ఈ ఔషధాన్నే అందరికీ తినిపిస్తూ ఉండండి’’

ప్రశ్న:-

సత్యాతి-సత్యమైన క్షేమ సమాచారము ఏమిటి? మీరు అందరికీ ఏ ఆత్మిక పాలనను చేయాలి?

జవాబు:-

ప్రతి ఒక్కరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము, ఇదే సత్యాతి-సత్యమైన క్షేమ సమాచారము. మీరు శ్రీమతముపై అందరికీ సంతోషమనే శక్తిశాలి ఔషధాన్ని తినిపిస్తూ ఉండండి. అనంతమైన తండ్రి ద్వారా జీవన్ముక్తి అనే ఔషధము ఏదైతే మీకు లభించిందో, దానిని అందరికీ ఇస్తూ వెళ్ళండి. అతీంద్రియ సుఖములో ఉంటూ అందరికీ జ్ఞాన-యోగాలనే ఫస్ట్ క్లాస్ ఔషధాన్ని తినిపించటము, ఇదే అన్నింటికన్నా మంచి ఆత్మిక పాలన.

ఓంశాంతి.

జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. జ్ఞానమనే మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. ఈ పాత ప్రపంచము మారనున్నదని ఇప్పుడు మీకు తెలుసు. దీనిని మార్చేవారు ఎవరు మరియు ఏ విధంగా మారుస్తారు అన్నది పాపం మనుష్యులకు తెలియదు ఎందుకంటే వారికి జ్ఞానమనే మూడవ నేత్రమే లేదు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానమనే సాక్కిరిన్… సాక్కిరిన్ యొక్క ఒక్క బిందువైనా సరే ఎంత తియ్యగా ఉంటుంది. అలాగే, జ్ఞానము యొక్క పదము కూడా ఒకటే ఉంది, మన్మనాభవ. ఇది అన్నింటికన్నా ఎంత మధురమైన పదము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము మరియు సుఖధామానికి దారి చూపిస్తున్నారు. తండ్రి పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషంలో, ఆనందంలో ఉంటారో వారి కొరకు అది ఔషధంలా ఉంటుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది అద్భుతమైన ఔషధము. ఈ ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఒకరికొకరు ఈ విధంగా అద్భుతమైన పాలనను చేయాలి.

పిల్లలైన మీరు శ్రీమతంపై సర్వుల ఆత్మిక పాలనను చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే సత్యాతి-సత్యమైన క్షేమ సమాచారము. అనంతమైన తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఔషధము లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో భారత్ జీవన్ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. తండ్రి చాలా పెద్ద ఉన్నతమైన ఔషధాన్ని ఇస్తారు, అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలనుకుంటే గోప-గోపికలను అడగండి అన్న గాయనము ఉంది. ఇది జ్ఞాన-యోగాల యొక్క ఎంత ఫస్ట్ క్లాస్ ఔషధము మరియు ఈ ఔషధము ఒక్క ఆత్మిక సర్జన్ వద్దే ఉంది, ఇంకెవరికీ ఈ ఔషధము గురించి తెలియనే తెలియదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, మీ కొరకు అరచేతిలో కానుకను తీసుకువచ్చాను. ముక్తి-జీవన్ముక్తుల ఈ కానుక నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్ప-కల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. తర్వాత దానిని రావణుడు దోచుకుంటాడు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషమనే పాదరసం ఎంతగా పైకెక్కి ఉండాలి. మనకు ఒకే ఒక్క తండ్రి, శిక్షకుడు మరియు సత్యాతి-సత్యమైన సద్గురువు ఉన్నారని, వారు మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా! కావున సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (ఈశ్వరీయ విద్యార్థి జీవితము అత్యంత ఉత్తమమైనది). ఇది ఇప్పటి గాయనమే. తర్వాత కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషంగా ఉంటారు. సత్యాతి-సత్యమైన సంతోషము ఎప్పుడు జరుపుకోబడుతుంది అనేది ప్రపంచానికి తెలియదు. మనుష్యులకు సత్యయుగం యొక్క జ్ఞానమే లేదు. కావున వారు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడైతే ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతటి దుఃఖ ప్రపంచము.

తండ్రి పిల్లలైన మీకు ఎంతటి సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఏ విధంగా ప్రేయసీ-ప్రియులు ఉంటారు, వారు పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. ఆమె అతనికి ప్రేయసిగా మరియు అతను ఆమెకు ప్రియునిగా ఉంటారు. ఇక్కడ ఆ విషయం లేదు, ఇక్కడైతే మీరందరూ ఆ ఒక్క ప్రియునికి జన్మ-జన్మాంతరాలుగా ప్రేయసులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడూ మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడిని కలుసుకోవటానికి తలచుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే దుఃఖము ఎక్కువ అవుతుందో, అప్పుడు ఎక్కువగా తలచుకుంటూ ఉంటారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు కానీ సుఖములో ఎవరూ స్మరించరు అన్న గాయనము కూడా ఉంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతునిగా ఉన్నారు, అలాగే రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా, తమోప్రధానంగా అవుతూ ఉంటుంది, అందుకే ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు దానితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి, అప్పుడు మీరు ఈ విధంగా (లక్ష్మీ-నారాయణుల) వలె అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినదే. ఉన్నతోన్నతుడైన తండ్రిని చాలా ప్రేమతో, స్నేహంతో స్మృతి చేయాలి. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను, అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు అంతమవుతాయి. పతిత-పావనుడైన తండ్రి అంటారు, మీరు చాలా పతితంగా అయ్యారు, అందుకే ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి, అప్పుడు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పతిత-పావనుడైన తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు, కావున తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. తప్పకుండా సత్యయుగంలో పావన ప్రపంచం ఉండేది, అప్పుడు అందరూ సుఖంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు, పిల్లలూ, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది సంగమయుగము. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. నావ అనేది కేవలం ఒక్కటే కాదు, మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద ఓడలా ఉంది, దానిని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు.

మధురమైన పిల్లలైన మీకు ఎంతటి సంతోషం ఉండాలి. మీ కొరకైతే సదా సంతోషమే సంతోషము. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వాహ్! ఇది ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవానువాచ, నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను కావున పూర్తిగా నేర్చుకోవాలి. ధారణ చేయాలి. పూర్తిగా చదవాలి. చదువులో ఎప్పుడూ నంబరువారుగానే ఉంటారు. కావున స్వయాన్ని చూసుకోవాలి – నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా లేక కనిష్టంగా ఉన్నానా. తండ్రి అంటారు, స్వయాన్ని చూసుకోండి – నేను ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యునిగా ఉన్నానా? ఆత్మిక సేవను చేస్తున్నానా? ఎందుకంటే తండ్రి అంటారు, పిల్లలూ, సేవాధారులుగా అవ్వండి, ఫాలో చేయండి. నేనూ సేవ కోసమే వచ్చాను. రోజూ సేవ చేస్తాను, అందుకోసమే ఈ రథము తీసుకున్నాను. వీరి రథానికి అనారోగ్యం వచ్చినా కానీ నేను వీరిలో కూర్చొని మురళి వ్రాస్తాను. నోటితో మాట్లాడలేను అన్నప్పుడు వ్రాస్తాను, అప్పుడు పిల్లలకు మురళి మిస్ అవ్వకుండా ఉంటుంది కావున నేను కూడా సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమవ్వండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. తండ్రియే మిమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానిగా తయారుచేయడానికి వచ్చారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అని అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులు ఎవరు అనేది చూడడం జరుగుతుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులను చూడండి. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడరు. నేను ఆత్మలనే చూస్తాను అని తండ్రి అంటారు. ఇకపోతే, ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అన్న జ్ఞానమైతే ఉంది. నేను కూడా ఈ శరీరంలోకి వచ్చాను, దీనిని అద్దెకు తీసుకున్నాను. శరీరం ద్వారానే ఆత్మ చదవగలదు. బాబా కూర్చుని ఉన్న స్థానము ఇది. ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదు, శరీరమే చిన్నగా, పెద్దగా అవుతుంది. ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో, వారందరి సింహాసనము ఈ భృకుటి మధ్యలో ఉంటుంది. శరీరాలైతే అందరివీ వేర్వేరుగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనము పురుషునిది, కొందరి అకాల సింహాసనము స్త్రీది. కొందరి అకాల సింహాసనము చిన్న బాలునిది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి యొక్క సందేశాన్ని ఇస్తారు. స్మృతి ద్వారానే తుప్పు వదలనున్నది. బంగారంలో ఎప్పుడైతే వేరే మాలిన్యాలు కలుస్తాయో, అప్పుడు బంగారం విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు పట్టడం వలన మీరు విలువలేనివారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. ఆ నేత్రము ద్వారా మీ సోదరులను చూడండి. సోదర దృష్టితో చూసినట్లయితే కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలమవ్వవు. రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలంటే, విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే ఈ కృషి చేయండి. పరస్పరంలో సోదరులము అని భావిస్తూ అందరికీ జ్ఞానము ఇవ్వండి. అప్పుడిక ఈ అలవాటు పక్కా అవుతుంది. మీరందరూ సత్యాతి-సత్యమైన సోదరులు. తండ్రి కూడా పై నుండి వచ్చారు, అలాగే మీరు కూడా వచ్చారు. తండ్రి పిల్లల సహితంగా సేవ చేస్తున్నారు. తండ్రి సేవ చేసేందుకు ధైర్యము ఇస్తారు. పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం చేస్తారు. కావున ఆత్మనైన నేను సోదరుడిని చదివిస్తున్నాను అన్న ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ చదువుతుంది కదా. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు, ఇది ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. సంగమములోనే తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు – స్వయాన్ని ఆత్మగా భావించండి అని. మీరు వివస్త్రగా వచ్చారు, తర్వాత ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ కృషి చేయాలి. మీకు మీరుగా కష్టపడాలి, ఇతరులతో మనకేముంది. దానము ఇంటి నుండి ప్రారంభమవ్వాలి అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించినట్లయితే బాణము బాగా తగులుతుంది. ఈ పదునును నింపుకోవాలి. కృషి చేస్తేనే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి ఫలాన్ని ఇచ్చేందుకే వచ్చారు కావున కృషి చేయాల్సి ఉంటుంది. కొంత సహనం కూడా చేయాల్సి వస్తుంది.

మీతో ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే ఇక ఇతరులు ఏం చేయగలరు? చప్పట్లు అనేవి రెండు చేతులతో మోగుతాయి. ఒకరు నోటితో ఏదైనా అంటే, రెండవవారు మౌనంగా ఉంటే ఎదుటివారు తమంతట తాము మౌనంగా ఉండిపోతారు. చేతికి చేయి కలిస్తే చప్పుడు వస్తుంది. పిల్లలు ఒకరికొకరు కళ్యాణము చేసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, సదా సంతోషంగా ఉండాలనుకుంటే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సోదరులైన ఆత్మల వైపు చూడండి. సోదరులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. ఇది అలవాటు అయినట్లయితే ఇక ఎప్పుడూ అశుద్ధమైన దృష్టి మోసం చేయదు. జ్ఞానమనే మూడవ నేత్రంతో మూడవ నేత్రాన్ని చూడండి. బాబా కూడా మీ ఆత్మనే చూస్తారు. సదా ఆత్మనే చూడటానికి ప్రయత్నించాలి. శరీరాన్ని చూడనే చూడకూడదు. యోగము చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులను చూస్తూ ఉన్నట్లయితే సేవ బాగా జరుగుతుంది. సోదరులకు అర్థం చేయించండి అని బాబా చెప్పారు. సోదరులందరూ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానము ఒక్కసారే బ్రాహ్మణ పిల్లలైన మీకు లభిస్తుంది. మీరు బ్రాహ్మణులు, తర్వాత దేవతలుగా అవ్వనున్నారు. ఈ సంగమయుగాన్ని ఏమైనా వదులుతారా. లేదంటే ఆవలి తీరానికి ఎలా వెళ్తారు. అటువైపుకు ఏమైనా దూకుతారా. ఇది అద్భుతమైన సంగమయుగము. కావున పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటును చేసుకోవాలి. ఇది మీకు లాభాన్ని కలిగించే విషయమే. తండ్రి శిక్షణలను సోదరులకు ఇవ్వాలి. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుష్యులు మనుష్యులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా. మీరు ఆత్మతో మాట్లాడుతారు కావున ఆత్మనే చూడాలి. జ్ఞానాన్ని శరీరం ద్వారా ఇచ్చినా కానీ ఇక్కడ శరీర భానాన్ని తెంచవలసి ఉంటుంది. పరమాత్మ అయిన తండ్రి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారని మీ ఆత్మ భావిస్తుంది. ఆత్మలను చూస్తాను అని తండ్రి కూడా అంటారు, అలాగే మేము పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నాము అని ఆత్మలు కూడా అంటారు. వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. దీనినే ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడము అని అంటారు. ఆత్మ-ఆత్మతో ఇచ్చి పుచ్చుకుంటుంది. ఆత్మలోనే జ్ఞానము ఉంది. ఆత్మకే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది పదును పెట్టడం వంటిది. మీ జ్ఞానములో ఈ పదును ఏర్పడినట్లయితే ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వెంటనే బాణం తగులుతుంది. అభ్యాసము చేసి చూడండి, బాణము గురి తగులుతుందా, లేదా అని. ఈ కొత్త అలవాటును ఏర్పరచుకున్నట్లయితే ఇక శరీర భానము తొలగిపోతుంది, మాయ తుఫానులు తక్కువగా వస్తాయి, చెడు సంకల్పాలు రావు, అశుద్ధమైన దృష్టి కూడా ఉండదు. ఆత్మనైన నేను 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాను. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజము. పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వడం కూడా నా పాత్రనే అని తండ్రికి తెలుసు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. నేను బంధింపబడి ఉన్నాను, మధురమైన పిల్లలూ, ఆత్మిక స్మృతియాత్రలో ఉన్నట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని పిల్లలకు అర్థం చేయిస్తాను. ఇది అంత్యకాలము కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీకు సద్గతి లభిస్తుంది. స్మృతియాత్రతో పిల్లర్ దృఢంగా అవుతుంది. ఈ దేహీ-అభిమానులుగా అయ్యే శిక్షణ పిల్లలైన మీకు ఒక్కసారే లభిస్తుంది. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము. బాబా అద్భుతమైనవారు కావున బాబా జ్ఞానము కూడా అద్భుతమైనది. దీనిని ఎప్పుడూ, ఎవ్వరూ తెలియజేయలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అందుకే తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, ఈ అభ్యాసము చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానము ఇవ్వండి. మూడవ నేత్రంతో సోదరులను చూడండి. ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మ సోదరులను చూసే అభ్యాసము చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులకు జ్ఞానం ఇవ్వాలి. మహావీరులుగా అయ్యి ఈ ఆజ్ఞను పాటించాలి.

2. మీతో ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు మౌనముగా ఉండండి. చప్పట్లు అనేవి రెండు చేతులతో మోగుతాయి, ఒకరు నోటితో గొడవ పడితే, మరొకరు మౌనముగా ఉంటే ఎదుటివారు తమంతట తామే మౌనంగా ఉండిపోతారు.

వరదానము:-

అమృతవేళ యొక్క పునాది ద్వారా మొత్తం రోజంతటి దినచర్యను సరిగ్గా ఉంచుకునే సహజ పురుషార్థీ భవ

ఏ విధంగా రైలును పట్టాలపై నిలబెడితే అది దానంతటదే మార్గంలో నడుస్తూ ఉంటుందో, అలా రోజూ అమృతవేళ స్మృతి రూపీ రేఖపై నిలబడండి. అమృతవేళ సరిగ్గా ఉంటే మొత్తం రోజంతా సరిగ్గా ఉంటుంది. అమృతవేళ యొక్క పునాది పక్కాగా ఉన్నట్లయితే మొత్తం రోజంతా స్వతహాగా సహయోగము లభిస్తూ ఉంటుంది మరియు పురుషార్థము కూడా సహజమవుతుంది. ఎవరైతే సదా తండ్రి స్మృతి మరియు శ్రీమతము అనే రేఖ లోపల ఉంటారో, వారే సత్యమైన సీతలు. వారి నరనరాల్లో ఒక్క రాముని స్మృతి యొక్క శబ్దము ఉంటుంది.

స్లోగన్:-

బాబా సహాయాన్ని క్యాచ్ చేయాలంటే బుద్ధిని ఏకాగ్రము చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top