TELUGU MURLI 19-02-2023

 

                19-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి‘ ‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 23-12-93 మధువనం

‘‘పవిత్రత యొక్క దృఢ వ్రతము ద్వారా వృత్తి పరివర్తన’’

ఈ రోజు ఉన్నతోన్నతుడైన తండ్రి మహానులైన తమ పిల్లలందరినీ చూస్తున్నారు. మహానాత్మలుగా అయితే పిల్లలందరూ అయ్యారు ఎందుకంటే మహానులుగా అయ్యేందుకు అన్నింటికంటే ముఖ్యమైన ఆధారమైన ‘పవిత్రత’ను ధారణ చేసారు. పవిత్రతా వ్రతాన్ని అందరూ ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేసారు. ఏ రకమైన దృఢ సంకల్పము రూపీ వ్రతాన్ని అయినా ఆచరించటము అనగా తమ వృత్తిని పరివర్తన చేసుకోవటము. దృఢ వ్రతము వృత్తిని మార్చేస్తుంది, అందుకే భక్తిలో వ్రతం తీసుకుంటారు కూడా మరియు వ్రతము పెట్టుకుంటారు కూడా. వ్రతము తీసుకోవటము అనగా మనసులో సంకల్పం చేయటము మరియు వ్రతము పెట్టుకోవటము అనగా స్థూల రీతిగా ఉపవాసము ఉండటము. ఆహార-పానీయాల విషయములో అయినా, నడవడికలో అయినా రెండింటి లక్ష్యము – వ్రతము ద్వారా వృత్తిని మార్చుకోవటము. మీరందరూ కూడా పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు మరియు వృత్తిని శ్రేష్ఠంగా తయారుచేసుకున్నారు. సర్వాత్మల పట్ల ఏ వృత్తిని తయారుచేసుకున్నారు? ఆత్మ భాయి-భాయి. బ్రదర్ హుడ్ (సోదరత్వము), ఈ వృత్తి ద్వారానే బ్రాహ్మణులు మహానాత్మలుగా అయ్యారు. ఈ వ్రతము అయితే అందరిదీ పక్కాగా ఉంది కదా?

బ్రాహ్మణ జీవితము యొక్క అర్థమే పవిత్ర ఆత్మ, మరియు ఈ పవిత్రత బ్రాహ్మణ జీవితానికి పునాది. పునాది దృఢంగా ఉందా లేక కదులుతోందా? ఈ పునాది సదా స్థిరంగా-దృఢంగా ఉండటమే బ్రాహ్మణ జీవితము యొక్క సుఖాన్ని ప్రాప్తి చేసుకోవటము. అప్పుడప్పుడు పిల్లలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేస్తూ తమ సత్యమైన చార్టును ఇచ్చేటప్పుడు ఏమంటారు? ఎంతగా అతీంద్రియ సుఖము అనుభవమవ్వాలో, ఎంతగా శక్తులు అనుభవమవ్వాలో అంతగా అవ్వటం లేదు, లేదంటే మరో మాటలో ఏమంటారంటే, అనుభవమవుతుంది కానీ సదా అవ్వటం లేదు. దీనికి కారణము ఏమిటి? అనటానికైతే మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు, ఒకవేళ మీరు మాస్టర్ సర్వశక్తివంతులా అని అడిగితే ఏమంటారు? ‘కాదు’ అనైతే అనరు కదా. అవును, మేము మాస్టర్ సర్వశక్తివంతులము అనే అంటారు. ఒకవేళ మాస్టర్ సర్వశక్తివంతులైతే మరి శక్తులు ఎక్కడకు వెళ్ళిపోతాయి? మరియు ఉన్నదే బ్రాహ్మణ జీవనధారులుగా. నామధారులు (పేరుకు మాత్రమే) కారు, మీరు జీవనధారులు. బ్రాహ్మణుల జీవితములో సంపూర్ణ సుఖ-శాంతుల అనుభూతి లేకపోతే లేక బ్రాహ్మణులు సర్వ ప్రాప్తులతో సదా సంపన్నంగా లేకపోతే, మరి బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు అలా ఉంటారు? ఇంకెవ్వరైనా అలా ఉండగలరా? బ్రాహ్మణులే అలా ఉండగలరు కదా. మీరందరూ మీ సంతకం ఎలా చేస్తారు? బి.కె.ఫలానా అని రాస్తారు కదా. పక్కానే కదా? బి.కె. అంటే అర్థమేమిటి? ‘బ్రాహ్మణ్’. కావున బ్రాహ్మణుల నిర్వచనము ఇదే.

‘ఎంతగా’ మరియు ‘అంతగా’ అనే పదాలు ఎందుకు వస్తాయి? పవిత్రత సుఖ-శాంతులకు జనని అని అంటారు. ఎప్పుడైనా అతీంద్రియ సుఖము లేక స్వీట్ సైలెన్స్ యొక్క అనుభవము తక్కువైతే, దానికి కారణము పవిత్రతా పునాది బలహీనంగా ఉండటము. ఇంతకుముందు కూడా వినిపించాము, పవిత్రత అంటే కేవలము బ్రహ్మచర్య వ్రతమనే కాదు, ఆ వ్రతము కూడా గొప్పదే ఎందుకంటే ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ రోజుల్లో మహానాత్మలుగా పిలువబడేవారు కూడా కష్టమని కూడా కాదు, అసలు అది అసంభవమనే భావిస్తారు. కావున అసంభవాన్ని మీ దృఢ సంకల్పము ద్వారా సంభవము చేసారు మరియు సహజంగా పాలన చేసారు, అందుకే ఈ వ్రతాన్ని ధారణ చేయటము కూడా తక్కువైన విషయమేమీ కాదు. బాప్ దాదా ఈ వ్రతాన్ని పాలన చేసే ఆత్మలకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాల సహితంగా అభినందనలను ఇస్తారు. కానీ బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరినీ సంపూర్ణంగా మరియు సంపన్నంగా చూడాలనుకుంటున్నారు. కావున ఎలా అయితే ఈ ముఖ్యమైన విషయాన్ని జీవితములో అలవరచుకున్నారో, అసంభవాన్ని సహజంగా సంభవము చేసారో, అటువంటివారికి అన్ని రకాల పవిత్రతను ధారణ చెయ్యటము ఏమంత పెద్ద విషయము. పవిత్రత యొక్క నిర్వచనము గురించి అందరికీ చాలా బాగా తెలుసు. ఒకవేళ మిమ్మల్నందరినీ – ‘‘పవిత్రత అంటే ఏమిటి’’ అనే టాపిక్ పై భాషణ చెయ్యండి అని చెప్తే చాలా బాగా చెయ్యగలరు కదా? మరి తెలుసు అన్నప్పుడు, దానిని నమ్మినప్పుడు మళ్ళీ ఈ ‘అంతగా’, ‘ఎంతగా’ అన్న మాటలు ఎందుకు? సుఖము, శాంతి మరియు శక్తుల అనుభూతి తక్కువైపోవటానికి ఏ పవిత్రత బలహీనం అవుతుంది? పవిత్రత ఏదో ఒక స్టేజ్ లో అచలంగా ఉండటం లేదు, కనుక పవిత్రత యొక్క ఏ రూపములో అలజడి ఉందో చెక్ చేసుకోండి. బాప్ దాదా పవిత్రత యొక్క అన్ని రూపాలను స్పష్టం చెయ్యరు ఎందుకంటే మీకు తెలుసు, అనేక సార్లు విని ఉన్నారు, వినిపిస్తూ ఉంటారు కూడా, మీతో మీరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు – అవును, పవిత్రత అంటే ఇది, పవిత్రత అంటే అది… అని. మెజారిటీ వారి రిజల్టు చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? జ్ఞానం చాలా ఉంది, యోగం యొక్క విధిలో కూడా విధాతలుగా అయ్యారు, ధారణ విషయాలను వర్ణించటంలో కూడా చాలా తెలివైనవారిగా ఉన్నారు మరియు సేవలో కూడా ఒకరికంటే ఒకరు ముందున్నారు, ఇంకేం మిగిలింది? నంబరువన్ జ్ఞానవంతులుగా అయితే అయ్యారు, కేవలము ఒక్క విషయములో నిర్లక్ష్యులుగా అవుతారు, అదేమిటంటే – స్వయము ఒక్క క్షణములో వ్యర్థము ఆలోచించటము, చూడటము, మాట్లాడటము మరియు చెయ్యటములో ఫుల్ స్టాప్ పెట్టి దానిని పరివర్తన చెయ్యటము. ఈ బలహీనతయే సుఖ అనుభూతిలో తేడా తీసుకువస్తుందని, శక్తి స్వరూపంగా అవ్వటంలో లేక తండ్రి సమానంగా అవ్వటంలో విఘ్న స్వరూపంగా అవుతుందని అర్థం చేసుకుంటారు కూడా, అయినా కూడా ఏం జరుగుతుంది? స్వయాన్ని పరివర్తన చేసుకోలేకపోతారు, ఫుల్ స్టాప్ పెట్టలేకపోతారు. ‘సరే, నాకు అర్థమైంది’ అని ఆలోచిస్తూ కామా (,) పెడతారు. లేదా ఇతరులను చూసి – ఇలా అవుతుందా! ఇలా అవ్వాలి కదా! అని ఆశ్చర్యార్థక గుర్తును (!) పెడతారు. లేదా ప్రశ్నార్థకముల (?) క్యూ (లైన్) కడతారు, ఎందుకు అనే క్యూ కడతారు. ఫుల్ స్టాప్ (.) అనగా బిందువు. బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ – ఈ రెండింటి స్మృతి ఉన్నప్పుడే ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఈ స్మృతి ఫుల్ స్టాప్ పెట్టడంలో అనగా బిందువు పెట్టడంలో సమర్థంగా చేస్తుంది. ఆ సమయంలో కొంతమంది లోలోపల ఎలా ఆలోచిస్తారంటే – నేను ఆత్మిక స్థితిలో స్థితి అవ్వాలి కానీ మాయ తన స్క్రీన్ ద్వారా ఆత్మకు బదులుగా వ్యక్తులను లేక విషయాలను పదే-పదే ఎదురుగా తీసుకువస్తుంది, దాని వల్ల ఆత్మ దాగిపోతుంది మరియు పదే-పదే వ్యక్తులు మరియు విషయాలు స్పష్టంగా ఎదురుగా వస్తాయి. కావున మూల కారణము ఏమిటంటే – స్వయాన్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉంది. ఇతరులను కంట్రోల్ చెయ్యటము చాలా బాగా వస్తుంది కానీ స్వయముపై కంట్రోల్ అనగా పరివర్తనా శక్తిని కార్యములో ఉపయోగించటము తక్కువగా వస్తుంది.

బాప్ దాదా కొంతమంది పిల్లల మాటలు విని చిరునవ్వు నవ్వుతుంటారు. స్వయాన్ని పరివర్తన చేసుకునే సమయము వచ్చినప్పుడు లేక సహనం చేసే సమయము వచ్చినప్పుడు లేక ఇముడ్చుకునే సమయము వచ్చినప్పుడు, అటువంటి సమయములో ఏమంటారు? చాలావరకు ఏమంటారంటే – ‘నేనే మరణించాలా’, ‘నేనే మారాలా’, ‘నేనే సహించాలా’. కానీ ‘మరణిస్తే స్వర్గానికి వెళ్తారు’ అని లోకులు అంటారు కదా, ఆ మరణించటములో ఎవరూ స్వర్గానికి వెళ్ళరు కానీ ఈ మరణించటములో స్వర్గములో శ్రేష్ఠమైన సీట్ లభిస్తుంది. కావున ఇది మరణించటము కాదు కానీ స్వర్గములో స్వరాజ్యాన్ని తీసుకోవటము. కనుక మరణించటము మంచిదే కదా? కష్టమనిపిస్తుందా? ఆ సమయములో కష్టమనిపిస్తుంది. నేనసలు తప్పే చెయ్యలేదు, వారిదే తప్పు, కానీ తప్పును ఒప్పుగా ఎలా చెయ్యాలి, ఇది రాదు. తప్పు చేసేవారు మారాలా లేక ఒప్పు చేసేవారు మారాలా? ఎవరు మారాలి? ఇద్దరూ మారాల్సి ఉంటుంది. ‘మారటము’ అన్న పదాన్ని ఆధ్యాత్మిక భాషలో ‘ముందుకు వెళ్ళటము’ అని భావించండి. ‘మారటము’ అని అనుకోకండి, ‘ముందుకు వెళ్ళటము’ అని భావించండి. తప్పుగా మారటము కాదు, మంచిగా మారటము. స్వయాన్ని మార్చుకునే శక్తి ఉందా? లేక ఎప్పుడో ఒకప్పుడు మారుతాములే అని అనుకుంటారా?

పవిత్రత యొక్క అర్థమే – సదా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధాలు మరియు సంపర్కాలలో మూడు బిందువుల మహత్వాన్ని ప్రతి సమయము ధారణ చెయ్యటము. ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే క్షణములో ఫుల్ స్టాప్ పెట్టడములో సదా స్వయాన్ని ముందుగా ఆఫర్ చేసుకోండి ‘‘నేను చెయ్యాలి’’ అని. ఇలా ఆఫర్ చేసుకునేవారికి మూడు రకాల ఆశీర్వాదాలు లభిస్తాయి. 1. స్వయానికి స్వయము యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి, సంతోషము లభిస్తుంది, 2. తండ్రి ద్వారా ఆశీర్వాదాలు, 3. బ్రాహ్మణ పరివారానికి చెందిన శ్రేష్ఠ ఆత్మలెవరైతే ఉన్నారో, వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. కావున అది మరణించటము అయ్యిందా లేక పొందటము అయ్యిందా, ఏమంటారు? పొందారు కదా. కావున ఫుల్ స్టాప్ పెట్టే పురుషార్థాన్ని మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా పరివర్తనా శక్తిని తీవ్రగతితో పెంచుకోండి. ఇలా అయితే అవుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది… అని నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి, ఇవి నిర్లక్ష్యముతో కూడిన సంకల్పాలు. నిర్లక్ష్యాన్ని పరివర్తన చేసి అలర్ట్ గా అవ్వండి. అచ్ఛా!

నలువైపుల కల మహానాత్మలకు, సర్వ శ్రేష్ఠమైన పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసే ఆత్మలకు, సదా స్వయానికి క్షణములో ఫుల్ స్టాప్ పెట్టే శ్రేష్ఠ పరివర్తక ఆత్మలకు, సదా స్వయాన్ని శ్రేష్ఠ కార్యములో నిమిత్తులుగా చేసుకునేందుకు ఆఫర్ చేసుకునే ఆత్మలకు, సదా మూడు బిందువుల మహత్వాన్ని ప్రాక్టికల్ గా ధారణ చేసి చూపించే తండ్రి సమానమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో మిలనము

అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? (బాప్ దాదా అక్కడున్న వారందరినీ అడుగుతున్నారు) దాదీలను చూసి సంతోషిస్తారు కదా? ఎందుకు సంతోషిస్తారు? ఎందుకంటే వారు తమ వైబ్రేషన్లు మరియు కర్మల ద్వారా సంతోషాన్ని ఇస్తారు, అందుకే సంతోషిస్తారు. ఎప్పుడైనా ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలను కలిసినప్పుడు సంతోషాన్ని అనుభవము చేస్తారు కదా. (టీచర్లతో) ఫాలో కూడా చేస్తారు కదా. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే – తండ్రి అయితే తండ్రే కదా, సమానంగా ఎలా అవ్వగలము? కానీ నిమిత్త ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు మీ తోటి వారే కదా? మరి వారు అవ్వగలిగినప్పుడు మీరు అవ్వలేరా? కావున అందరి లక్ష్యము సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి అని. ఒకవేళ 16 కళలు కలవారిగా అవ్వాలా లేక 14 కళలు కలవారిగా అవ్వాలా అని చేతులెత్తిస్తే ఎందులో ఎత్తుతారు? 16 కళలలో కదా. మరి 16 కళలు అంటే అర్థమేంటి? సంపూర్ణము అని కదా. లక్ష్యమే అటువంటిదైనప్పుడు అలా అవ్వాల్సిందే. కష్టమేమీ కాదు, అలా అవ్వాల్సిందే. చిన్న-చిన్న విషయాలలో గాభరా పడకండి. మూర్తిగా అవుతున్నారు కనుక ఎన్నో కొన్ని ఉలి దెబ్బలైతే పడతాయి కదా, లేదంటే అటువంటి మూర్తిగా ఎలా అవుతారు. ఎవరు ఎంతగా ముందు ఉంటారో వారు తుఫానులు కూడా అందరికంటే ఎక్కువగా దాటాల్సి ఉంటుంది కానీ ఆ తుఫాను వారికి తుఫానులా అనిపించదు, తోఫా (కానుక)లా అనిపిస్తుంది. ఈ తుఫాను కూడా అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుక వెల అవుతుంది, కావున కానుకలా అయ్యింది కదా. మరి కానుకను తీసుకోవటము మంచిగా అనిపిస్తుందా లేక కష్టమనిపిస్తుందా? కావున ఇది కూడా తీసుకోవటమవుతుంది, ఇవ్వటము కాదు. ఇవ్వటము కష్టమనిపిస్తుంది, తీసుకోవటమైతే సహజమే.

నా పాత్రే ఇలా ఉందా, అన్ని విఘ్నాల అనుభవాలు నావద్దకే రావాలా! అని ఇలా ఆలోచించకండి. రండి అని వాటిని వెల్కమ్ చేయండి. అవి కానుకలు. ఎక్కువలో ఎక్కువ కానుకలు లభిస్తాయి, అందులో ఏముంది? చాలా సరియైన మూర్తిగా అవ్వటము అనగా ఉలి దెబ్బలు పడటము. ఉలి దెబ్బలు వేసి-వేసి దానిని సరిగ్గా తయారుచేస్తారు. మీరైతే అనుభవజ్ఞులుగా అయ్యారు, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఆటలా అనిపిస్తుంది. చూస్తూ ఉంటారు మరియు నవ్వుతూ ఉంటారు, ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. టీచర్లు ధైర్యవంతులా లేక అప్పుడప్పుడు గాభరా పడతారా? ఇలా అవుతుందని ఆలోచించనే ఆలోచించలేదు, ముందే తెలిసి ఉంటే ఆలోచించేవారము… డబుల్ ఫారెనర్స్ ఇలా అనుకుంటారా – బ్రాహ్మణులుగా అవ్వటంలో కూడా ఇలా అవుతుంది అని మేము ఆలోచించనే ఆలోచించలేదు అని? బాగా ఆలోచించి, అర్థం చేసుకుని వచ్చారు కదా లేక ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుందా? అచ్ఛా!

ఎవరు ఎలా ఉన్నా కానీ బాప్ దాదా మంచినే చూస్తారు, అందుకే బాప్ దాదా అందరినీ మంచివారు అనే అంటారు, చెడ్డవారు అని అనరు. 9 చెడు విషయాలు ఉండి, ఒక్క మంచి విషయము ఉన్నా కూడా తండ్రి ఏమని అంటారు? మంచివారు అని అంటారా లేక వీరు చాలా చెడ్డవారు, వీరు చాలా బలహీనులు అని అంటారా? అచ్ఛా. ఇది చాలా పెద్ద గ్రూప్ (21 దేశాల వారు వచ్చారు) మంచిది. హౌస్ ఫుల్ అయితే అప్పుడు ఇంకొకటి తయారవుతుంది. ఒకవేళ ఫుల్ అవ్వకపోతే ఇంకొకటి తయారయ్యే అవకాశం ఉండదు. అవసరమే సాధనాలను ఎదురుగా తీసుకువస్తుంది.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే యుగము – సంగమయుగము

మిమ్మల్ని మీరు పదమాపదమ భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతూ ఉందా? మరి ఎన్ని పదమాలను జమ చేసుకున్నారు? లెక్కలేనన్నా? ఎందుకంటే జమ చేసుకునే సమయము ఇప్పుడే అన్నది తెలుసు. సత్యయుగములో జమ అవ్వదు. కర్మలు అక్కడ కూడా ఉంటాయి కానీ అవి అకర్మలుగా ఉంటాయి ఎందుకంటే అక్కడి కర్మలకు ఇక్కడి కర్మ ఫలము యొక్క లెక్కతో సంబంధము ఉంటుంది. కనుక ఇక్కడున్నది జమ చేసుకునే సమయము మరియు అక్కడున్నది తినే సమయము. మరి అంతటి అటెన్షన్ ఉంటుందా? ఎన్ని జన్మలకు జమ చేసుకోవాలి? (84) జమ చేసుకోవటంలో సంతోషము ఉంటుంది కదా? కష్టమనిపించదు కదా? ఎందుకు కష్టమనిపించదు? ఎందుకంటే ప్రత్యక్ష ఫలము కూడా లభిస్తుంది. ప్రత్యక్ష ఫలము లభిస్తుందా లేక భవిష్యత్తుపై ఆధారపడి నడుస్తున్నారా? భవిష్యత్తు కంటే ప్రత్యక్ష ఫలము అతి శ్రేష్ఠమైనది. సదా శ్రేష్ఠ కర్మలు మరియు శ్రేష్ఠ ప్రత్యక్ష ఫలము లభించేందుకు సాధనమేమిటంటే – సదా ఇది గుర్తుంచుకోండి ‘‘ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు’’. ఏ విధంగా డబల్ ఫారెనర్స్ అని పేరు ఉంది, డబల్ అన్న టైటిల్ చాలా బాగుంది. కావున అన్నింటిలో డబల్ – సంతోషంలో, నషాలో, పురుషార్థములో, అన్నింటిలో డబల్. సేవలో కూడా డబల్. ఉండేది కూడా సదా డబల్ గా, కంబైండ్ గా ఉంటారు, సింగల్ గా ఉండరు. ఎప్పుడైనా డబల్ అవ్వాలి అన్న సంకల్పము వస్తుందా? కంపెనీ కావాలా లేక కంపానియన్ కావాలా? కావాలంటే చెప్పండి. కంపానియన్ కావాలి అని అక్కడకు వెళ్ళి చెప్పకండి. ఎంతమందిని కంపానియన్ గా చేసుకున్నా కానీ ఇటువంటి కంపానియన్ లభించరు. ఎంత మంచి కంపానియన్ అయినా కానీ అందరూ తీసుకునేవారిగానే ఉంటారు, ఇచ్చేవారిగా ఉండరు. ఈ ప్రపంచములో అటువంటి కంపానియన్ ఎవరైనా ఉన్నారా? అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మొదలైన దేశాలలో కాస్త వెతికి రండి, లభిస్తారా! ఎందుకంటే మనుష్యాత్మలు ఎంత ఇచ్చేవారిగా ఉన్నా కానీ ఇస్తూ-ఇస్తూ తప్పకుండా తీసుకుంటారు. మరి దాత కంపానియన్ గా లభించినప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సే వస్తుంది. వీరంతా వెళ్ళేవారు కారు. ఎవరూ బలహీనంగా అయితే లేరు కదా? ఫోటో తీస్తున్నారు. మీరు ఇలా అన్నారు అని తర్వాత మీకు ఫోటో పంపిస్తాము. మేము వెళ్ళిపోవడం అనేది జరగనే జరగదు అని చెప్పండి. బాప్ దాదా కూడా మీరందరూ లేకుండా ఒంటరిగా ఉండలేరు. అచ్ఛా!

వరదానము:-

మహావీరులుగా అయి తండ్రి సాక్షాత్కారాన్ని చేయించే వాహనధారీ మరియు అలంకారధారీ భవ

మహావీరులు అనగా శస్త్రధారులు. శక్తులను లేక పాండవులను సదా వాహనములో చూపిస్తారు మరియు వారికి శస్త్రాలను కూడా చూపిస్తారు. శస్త్రాలు అనగా అలంకారాలు. వాహనము అనగా శ్రేష్ఠ స్థితి మరియు అలంకారాలు అనగా సర్వశక్తులు. ఇటువంటి వాహనధారులు మరియు అలంకారధారులే సాక్షాత్కార మూర్తులుగా అయి తండ్రి సాక్షాత్కారాన్ని చేయించగలరు. అదే మహావీరులైన పిల్లల కర్తవ్యము. ఎవరైతే తమ ఎగిరే కళ ద్వారా సర్వ పరిస్థితులను దాటుతారో వారినే మహావీరులు అంటారు.

స్లోగన్:-

ఏకరస పురుషార్థము ద్వారా ఉన్నతమైన స్థితిని తయారు చేసుకున్నట్లయితే హిమాలయము వంటి పెద్ద పరీక్ష కూడా దూది వలె అవుతుంది.

సూచన:-

ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, రాజయోగీ తపస్వీ సోదరీ-సోదరులందరూ సాయంత్రము 6.30 నుండి 7.30 గం. వరకు విశేషంగా యోగాభ్యాస సమయములో ఎలా అనుభవం చేయాలంటే – జ్ఞాన సూర్యుడైన సర్వశక్తివంతుడైన పరమాత్ముని కిరణాలు నాపై పడుతున్నాయి మరియు నా నుండి మొత్తం ప్రపంచంలోకి వెళ్తున్నాయి, తద్వారా మొత్తం ప్రపంచం నుండి అజ్ఞానాంధకారము దూరమవుతూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top