TELUGU MURLI 20-02-2023

           20-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురమైన పిల్లలూ – సూర్యవంశీ విజయమాలలోని మణులుగా అయ్యేందుకు శ్రీమతముపై పూర్తిగా పావనులుగా అవ్వండి, పావనులుగా అయ్యే పిల్లలు ధర్మరాజు శిక్షల నుండి విముక్తులవుతారు’’

ప్రశ్న:-

దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థములో నిమగ్నులైయున్న పిల్లలలో ఏ నషా ఉంటుంది?

జవాబు:-

నేను బాబాకు చెందినవాడిని, నేను బాబా బ్రహ్మాండానికి యజమానిని, బాబా నుండి వారసత్వాన్ని తీసుకొని యజమానిగా అవుతాను. ఈ నషా దేహీ-అభిమానులుగా ఉండే పిల్లలకే ఉంటుంది, వారే వారసులుగా అవుతారు. వారికి పాత ప్రపంచపు సంబంధాలు గుర్తుండవు. దేహాభిమానంలోకి రావడం వల్లనే మాయ దెబ్బ తగులుతుంది, సంతోషము మాయమైపోతుంది, అందుకే బాబా అంటారు, పిల్లలూ – దేహీ-అభిమానులుగా అయ్యేందుకు కృషి చేయండి. మీ చార్ట్ ను పెట్టుకోండి.

పాట:-

రానున్న భవిష్యత్తుకు నీవే భాగ్యానివి… (ఆనే వాలే కల్ కీ తుమ్ తక్దీర్ హో…)

ఓంశాంతి.

పిల్లలకు ఏమని తెలుసంటే – శివబాబా ఇక్కడ సంగమయుగములో అవతారము తీసుకున్నారు లేక పై నుండి వచ్చారు మరియు మీరు శివశక్తులు, శివుని వారసులు. నిజానికి మీ పేరు శివశక్తులు. శివుని నుండి జన్మించిన శక్తులు. శివుడు మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు మరియు శక్తులైన మీరు శివబాబాను మీవారిగా/ చేసుకున్నారు. శివుడు వచ్చి తమ వారసులుగా చేసుకున్నారు. శక్తులైన మీరు శివబాబాకు వారసులుగా అయినట్లు. శివబాబా నరకాన్ని స్వర్గముగా తయారుచేయడానికి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారి వారసులమైన మనము వారి నుండి వారసత్వాన్ని పొందేందుకు వారికి సహాయకులుగా ఉన్నాము. ఈ పతిత ప్రపంచాన్ని లేక నరకాన్ని పావనంగా తయారుచేయడానికి తండ్రి వచ్చి ఉన్నారు. పతిత సృష్టిని పావనంగా తయారుచేసేవారు నిరాకార పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కారు. మీరు నిరాకారుడైన శివబాబా పిల్లలు. వారు ఇక్కడ ఎవరిలోకైతే వచ్చారో వారిది సాకార తనువు. నిజానికి మీరు నిరాకారీ ప్రపంచములో ఉన్నప్పుడు కూడా వారసులే. ఆత్మలందరూ ఆ పరమపిత పరమాత్మకు పిల్లలు. కానీ అది నిరాకారీ ప్రపంచములో. అక్కడ ఎప్పుడైతే మీరు నా వద్ద ఉంటారో అప్పుడు నా పిల్లలుగానే ఉంటారు. తర్వాత నేను కూడా పతిత సృష్టిని పావనంగా తయారుచేయడానికి రావాల్సి ఉంటుంది. వచ్చి శరీరాన్ని ధరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ నిరాకారీ ప్రపంచము నుండి తండ్రి వచ్చి ఉన్నారు. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని వారసులుగా తయారుచేసారు. శివశక్తులు ప్రసిద్ధమైనవారు, శివశక్తులు అనగా శివుని సంతానము. పతిత పావనుడు ఎవరు అనేది ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. పతిత ప్రపంచాన్ని తప్పకుండా కలియుగమనే అంటారు, పావన ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు. నిరాకారీ ప్రపంచములో ఆత్మలైన మీరు సదా పావనంగా ఉంటారు. ఓ పతిత పావనా రండి, అని పాడుతారు కూడా. రకరకాలుగా తలచుకుంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. పావనంగా తయారుచేయడానికి తప్పకుండా కలియుగాంతములో సంగమములో వస్తారు అని అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ కల్పం యొక్క సంగమయుగములోనే వస్తాను, వచ్చి పిల్లలైన మిమ్మల్ని నా వారసులుగా తయారుచేస్తాను. అనగా మీరు డబుల్ వారసులుగా అవుతారు. ఆ మాటకొస్తే మీరు శివబాబా పిల్లలే. కానీ స్వయాన్ని మర్చిపోయారు. ఆత్మలమైన మనము వాస్తవానికి శివబాబా యొక్క నిర్వాణధామానికి వారసులము అని ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా అంటారు – మీరందరూ వారసులే కదా. బ్రహ్మాండములో ఉండే పిల్లలు బ్రహ్మాండానికి యజమానులు. తర్వాత ఇక్కడ సృష్టిలోకి వచ్చి పాత్రను అభినయించాలి. తండ్రిని అందరూ ఎంతగానో స్మృతి చేస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో, అప్పుడు – ఓ భగవంతుడా, దయ చూపించండి అని ఆర్తనాదాలు చేస్తారు. ముందు-ముందు ఇంకా ఎంతో దుఃఖము రానున్నది. పంచదార మొదలైనవాటిపై ఏ విధంగా కంట్రోల్ పెడుతున్నారో అలాగే ఆహారధాన్యాలపై కూడా పెడతారు. మనుష్యులకు ఆహారమైతే కావాలి కదా. ఇక అప్పుడు ఆకలితో చనిపోతూ ఉంటే కొట్లాడి, గొడవ చేసి దోచుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ప్రపంచం చాలా దుఃఖితముగా అవుతుందో, అప్పుడు తండ్రి వచ్చి సుఖమయమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. కావున ఇప్పుడు తండ్రి శ్రీమతముపై పూర్తిగా పావనముగా అయి చూపించాలి. పూర్తిగా పావనముగా అయ్యే వారే సూర్యవంశీ విజయమాలలోని మణులుగా అవుతారు. వారు ధర్మరాజు శిక్షలను అనుభవించరు. తండ్రి కూర్చుని ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. జగత్పిత ఉన్నారు కావున జగదాంబ కూడా ఉన్నారని అర్థం చేయించడం జరిగింది. కానీ వారి గురించి గీతలో వర్ణన ఏమీ లేదు. గీతతో ఉన్న కనెక్షన్ అంతా చెదిరిపోయి ఉంది. భక్తులు భగవంతుడిని తలచుకుంటారు. భగవంతుడే మనుష్యులందరి మనోకామనలను పూర్తి చేయగలరు, అందుకే వారిని తలచుకుంటారు. కృష్ణుడైతే మనోకామనలను పూర్తి చేయలేరు. అందరి మనోకామనలను పూర్తి చేసేవారు అని ఒక్క భగవంతుడినే అంటారు. ఆ తర్వాత జగదాంబ, భగవతి అన్ని మనోకామనలను పూర్తి చేసేవారు. జగదాంబ ఎవరు? బ్రహ్మాకు పూర్తి వారసురాలైన కుమార్తె, శివబాబాకు మనుమరాలు. వేరే మనుష్యులు గొప్ప-గొప్ప రాజులు మొదలైనవారికి వారసులుగా అవుతారు. ఈ వారసులు అన్న పదము కుటుంబానికి సంబంధించినది. ఇది సన్యాసులకు వర్తించదు. ఇప్పుడు మనము శివబాబాకు వారసులుగా అయ్యామని మీకు తెలుసు. అక్కడ బాబాతో పాటు ఉంటాము. అక్కడ వారసత్వము యొక్క విషయమేమీ లేదు. ఇక్కడైతే మనకు వారసత్వము కావాలి. స్వర్గము తండ్రి ఇచ్చే ఆస్తి, అక్కడ దుఃఖము యొక్క విషయమే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీకు తాతగారి ఆస్తి లభిస్తుంది, కావున వారిని స్మృతి చేయాలి.

మీరు ఈశ్వరుని వారసులు, మిగిలినవారంతా రావణుని వారసులు. రావణ సాంప్రదాయము అని అంటూ ఉంటారు కదా. ఇక్కడ మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు. అక్కడున్నది ఆసురీ రావణ సాంప్రదాయులు. వారికి రావణుడి నుండి వారసత్వము లభిస్తుంది. ఇది రావణ రాజ్యం కదా. వారికి పంచ వికారాల వారసత్వము లభించి ఉంది, ఆ వారసత్వాన్ని మీరు తిరిగి శివబాబాకు దానం చేస్తారు. కృష్ణునికి ఏమైనా పంచ వికారాలను దానం ఇస్తారా. మీరు శివబాబాకు పంచ వికారాలను దానం ఇస్తారు. దేవతలకు ఏమైనా దానం ఇస్తారా. కృష్ణుడు మొదలైన దేవతలైతే వికారాల దానాన్ని శివబాబాకు ఇచ్చి అటువంటి పదవిని పొందారు. కావున వారు ఎలా దానం తీసుకుంటారు? శివబాబా అంటారు, ఈ పంచ వికారాలను దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది. గ్రహణం కూడా ఎంతగా పట్టి ఉందంటే, దాని వల్ల ఒక్క కళ కూడా మిగల్లేదు. పూర్తిగా నల్లగా అయిపోయారు. ఇప్పుడు నాకు దానం ఇచ్చేయండి, ఇక మళ్ళీ వికారాలలోకి వెళ్ళకండి. దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లయితే పదభ్రష్టులుగా అవుతారు. నారాయణుడిగా అవ్వాలంటే భూతాలను పారద్రోలాలి. తండ్రి నరుడి నుండి నారాయణుడిగా తయారుచేయడానికే వస్తారు. బాబా మనల్ని తమ ఇంటికి మరియు ఆస్తికి హక్కుదారులుగా తయారుచేసారని మీకు తెలుసు. ఇది డబుల్ వారసత్వము అయినట్లు కదా. ముక్తి మరియు జీవన్ముక్తి, రెండింటి వారసత్వాన్ని తండ్రి ఇస్తారు. తండ్రికి వారసులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తూ యోగము మరియు జ్ఞాన బలంతో వికర్మలను వినాశనం చేసుకుంటారు. జ్ఞానం కూడా బలము కదా. జ్ఞానం ఉంటుంది, జ్ఞానాన్ని చదువుకుని పెద్ద-పెద్ద పదవులను పొందుతారు. పోలీస్ శాఖలో పెద్ద ఆఫీసర్లు మొదలైనవారిగా అవుతారు. మనుష్యులు పోలీసులకు ఎంతగా భయపడతారు. ఎవరైనా అటువంటి పని ఏదైనా చేస్తే, పోలీస్ అన్న మాటను వినగానే మొహం పాలిపోతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు చదువు ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత తండ్రిని స్మృతి చేయకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు. వారు లౌకిక తండ్రి. ఈ పారలౌకిక తండ్రినైతే ఎంతగానో స్మృతి చేయాల్సి ఉంటుంది. ఎంతో స్మృతి చేయడం ద్వారానే ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా కష్టపడతారో అంతగా పావనంగా అయి పావన ప్రపంచపు రాజ్యాన్ని పొందుతారు. తిరిగి నా వద్దకు వచ్చి మళ్ళీ సత్యయుగములోకి వెళ్ళి రాజ్యం చేయాలి. మేము మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలి అని అందరూ భగవంతుడిని తలచుకుంటూ ఉంటారు.

అమరనాథుడు పార్వతికి కథ వినిపించారు అని అంటారు, ఇప్పుడు మీరందరూ పార్వతులే. శివబాబా కేవలం ఒక్క పార్వతికి మాత్రమే కథను వినిపించి ఉంటారా. మీరు ఎంతోమంది వింటారు కదా. అందరూ – మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయండి అని తలచుకుంటూ ఉంటారు. పావనంగా తయారుచేసేవారు ఒక్కరే. వారు పావనంగా ఎలా తయారుచేస్తారు? మొట్టమొదట జగదాంబ పావనంగా అవుతారు. ఆ తర్వాత వారి శక్తులు ఉన్నారు. స్వర్గ రచయిత ఒక్క తండ్రి మాత్రమే, ఇంకెవ్వరూ కాలేరు. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులుగా అయ్యారు. పిల్లలైన మీకు ఎంత నషా ఉండాలి. శివబాబా మిమ్మల్ని ఒడిలోకి తీసుకొని స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు. మేము ఈశ్వరుని ఒడిలోకి వచ్చాము అని మీరు భావిస్తారు. తప్పకుండా ఈశ్వరుడు మనల్ని తిరిగి తమతో పాటు తీసుకువెళ్తారు. విశేషంగా పిల్లలైన మిమ్మల్ని వారసులుగా తయారుచేసారు. మీ పాత్ర ఉంది. ఇప్పుడు మీ బుద్ధి ఎంత విశాలంగా అయ్యింది. సత్యయుగములో ఉన్నదే దేవీ-దేవతల రాజ్యమని అర్థం చేసుకోవాలి. తప్పకుండా భగవంతుడే స్థాపన చేసి ఉంటారు కదా. కానీ ఎలా చేసారు? ఇది ఎవరికీ తెలియదు. యాదవులు, కౌరవులు, పాండవులు అన్న పేర్లు కూడా ఉన్నాయి. పాండవుల్లో అందరినీ పురుషులుగానే చూపిస్తారు. శక్తి సేన అన్న పేరు ఎక్కడ ఉంది? మీరు గుప్తముగా ఉన్నారు. వారికి ఈ విషయము తెలియదు, కానీ ఏమంటారంటే – ఎవరైతే యుద్ధములో మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారు అని. కానీ అది ఏ యుద్ధము? ఇది మాయపై విజయం పొందే యుద్ధము, దీనిని ఒక్క తండ్రే నేర్పిస్తారు. తప్పకుండా శివబాబా మనల్ని తమ ఒడిలోకి తీసుకున్నారని, దత్తత తీసుకున్నారని మీరు భావిస్తారు. కావున ఇక అన్ని వైపుల నుండి బుద్ధియోగము తెగిపోవాలి. రాజు చేత దత్తత తీసుకోబడితే ఇక ఆ రాజు, రాణులకు కొడుకుగానే స్వయాన్ని భావిస్తారు. అప్పుడు యువరాజులు, యువరాణులే మిత్ర-సంబంధీకులుగా ఉంటారు. ఆ కులము లేక వంశము మారిపోతుంది. అలా ఇక్కడ కూడా బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవ్వాలి. దేవతలు లేక శక్తులతో నారదుడిని కూడా కూర్చోబెడతారు. భగవంతుడు నారదుడితో – నీవు నీ ముఖాన్ని చూసుకో అని అన్నారు. నారదుడు భక్తి చేసేవారు.

ఇప్పుడు పిల్లలైన మీరు బాగా పురుషార్థము చేయాలి. మీలో ఏ భూతమూ ఉండకూడదు. ఎవరైనా క్రోధము చేస్తే వారిలో భూతము ఉంది అని భావించాలి. పంచ వికారాలను ఇక్కడ దానమివ్వాలి, అప్పుడే ఆ నషా ఎక్కగలదు. ఆ తర్వాత మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. దేవతల ముఖము ఉన్నట్లుగా ఉంటుంది. మీరు రూప్-బసంత్ (యోగీ-జ్ఞానీ స్వరూపులు, జ్ఞానాన్ని వినిపించేవారు) కదా. ఏ విధముగా బాబా జ్ఞాన రత్నాలను ఇస్తారో, అలా మీ నోటి నుండి కూడా రత్నాలే వెలువడాలి. పురుషార్థము చేస్తూ ఉండండి. గమ్యము చాలా ఉన్నతమైనది, విశ్వానికి యజమానులుగా అవ్వాల్సి ఉంటుంది. మనమే అనేక సార్లు విశ్వానికి యజమానులుగా అయ్యాము. ఈ విధంగా ఇంకే సన్యాసులు మొదలైనవారు అనలేరు. తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలూ, మీరు లెక్కలేనన్ని సార్లు విశ్వానికి యజమానులుగా అయ్యారు, మళ్ళీ ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ విజయాన్ని పొందండి. మొత్తం ఆధారమంతా పురుషార్థముపై ఉంది. పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము, మరి ఆ సంతోషము స్థిరంగా ఎందుకు ఉండదు? పాత ప్రపంచపు సంబంధాలు గుర్తుకొస్తాయి. దేహాభిమానం వస్తుంది. మొట్టమొదటి శత్రువు దేహాభిమానమే. దేహాభిమానం వచ్చిందంటే మాయ దెబ్బ తగులుతుంది. నేను బాబాకు చెందినవాడిని, బాబా బ్రహ్మాండానికి యజమానిని. బాబా నుండి వారసత్వాన్ని తీసుకొని విశ్వానికి యజమానిగా అవుతాను, ఈ నషా ఉండాలి. దేహీ-అభిమానులుగా అయ్యే కృషి చేయాలి. కల్పములో ఒకేసారి బాబా వచ్చి మీకు దేహీ-అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. బాబాను స్మృతి చేయండి అని ఎంతగా చెప్తారు, అయినా మర్చిపోతారు, చార్ట్ వ్రాయడంలో అలసిపోతారు. పిల్లలు తమ చార్ట్ ను చూసుకోవాలి. ఒక్క తండ్రి ఇంతమంది పిల్లల చార్ట్ ను ఎంతవరకని చూస్తారు. బాబాకు ఎంత పని ఉంటుంది. ఉత్తరాలకు జవాబు వ్రాయడంలో వేళ్ళు అరిగిపోతాయి. కానీ పిల్లలకు బాబా చేతితో రాసిన ఉత్తరం చదవాలి అన్న కోరిక ఉంటుంది. నీతోనే కూర్చుంటాను, నీకే వ్రాస్తాను, నీవు రాసినదే చదువుతాను… శివబాబా, కేరాఫ్ బ్రహ్మా అని రాస్తారు కూడా. అప్పుడు బాబా జవాబు కూడా రాస్తారు. ఎన్ని ఉత్తరాలు వ్రాయవలసి ఉంటుంది. అయితే, సేవాధారులైన పిల్లలు సేవా సమాచారాన్ని వ్రాస్తే తండ్రి కూడా సంతోషిస్తారు. మంచి-మంచి ఉత్తరాలు వ్రాస్తే వాటిని నయనాలపై పెట్టుకుంటారు, తమ హృదయంలో పెట్టుకుంటారు. లేకపోతే చెత్త బుట్టలో పడేయవలసి ఉంటుంది. సేవాధారులైన పిల్లలను ఎంతో మహిమ చేస్తాను. సేవ చేసే పిల్లలే హృదయంపైకి ఎక్కగలరు. సుపుత్రులైన పిల్లలు తల్లి-తండ్రిని ఫాలో చేస్తారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో మనుష్యులు ముక్తి కొరకు ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. కానీ వారికి ముక్తి ఎక్కడ ఉంది అనేది తెలియనే తెలియదు. వారికి ఏమీ తెలియదు. జ్ఞానమనేది ఒక్క జ్ఞానసాగరుని వద్దే ఉంది. సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడము, దీనినే జ్ఞానం అని అంటారు. ఎప్పటివరకైతే సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోరో, అప్పటివరకు అంధులుగా ఉన్నట్లు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా ఉంది. ఎన్నో కష్టాలు రానున్నాయి. ఈ ప్రపంచం చాలా అశుద్ధముగా ఉంది. అయినా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలూ, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భూతము ఉన్నట్లయితే మీరు సుందరముగా ఎలా అవ్వగలరు? మీరు అంటారు, బాబా, మేము మీ మతముపై నడుస్తాము, అప్పుడు బాబా అంటారు, మరి భూతాలను పారద్రోలండి. ఈ ప్రపంచముపై మమకారాన్ని ఉంచుకోకూడదు. బుద్ధియోగము కొత్త ప్రపంచం వైపుకు వెళ్ళిపోవాలి. మన కొరకు స్వర్గ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. కావున స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. తండ్రిని, మధురమైన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయండి. శరీర నిర్వహణార్థము ఉద్యోగం కూడా చేయండి. అలాగే ఈ ఈశ్వరీయ సేవను కూడా చేయండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రూప్-బసంత్ గా అయి నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞాన రత్నాలే వెలువడాలి. దేవతల వలె ప్రసన్నచిత్తులుగా అవ్వాలి.

2. జ్ఞానం మరియు యోగ బలంతో వికర్మలను వినాశనం చేసుకుని తండ్రి నుండి డబుల్ వారసత్వాన్ని (ముక్తి-జీవన్ముక్తులను) తీసుకోవాలి.

వరదానము:-

‘‘వదిలితే వదిలిపోతుంది’’ – ఈ పాఠం ద్వారా నంబరువన్ తీసుకునే ఎగిరే పక్షి భవ

ఎగిరే పక్షిగా అయ్యేందుకు ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి – ‘‘వదిలితే వదిలిపోతుంది’’. ఏ రకమైన కొమ్మను తమ బుద్ధి రూపీ పాదముతో పట్టుకొని కూర్చోకండి. ఈ పాఠంతోనే బ్రహ్మా తండ్రి నంబరువన్ గా అయ్యారు. వారు ఇలా ఆలోచించలేదు – తోటివారు నన్ను వదిలితే నేను విముక్తుడిని అవుతాను, సంబంధీకులు వదిలితే విముక్తుడిని అవుతాను, విఘ్నాలు కలిగించేవారు విఘ్నాలు కలిగించడము వదిలితే విముక్తుడిని అవుతాను అని. వారు స్వయానికి సదా ఈ పాఠాన్నే ప్రాక్టికల్ గా చదివించుకున్నారు – స్వయం వదిలితే వదిలిపోతుంది అని. కావున నంబరువన్ లోకి వచ్చేందుకు ఈ విధంగా ఫాలో ఫాదర్ చేయండి.

స్లోగన్:-

ఎవరి సంకల్పాలలోనైతే ఒక్క బాబాయే ఉంటారో వారి మనసు సదా శక్తిశాలిగా ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top