13-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం
‘‘మధురమైన పిల్లలూ – ఇది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్శిటీ – ఇది మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు యూనివర్శిటీ, ఎప్పుడైతే ఈ నిశ్చయము పక్కాగా ఉంటుందో అప్పుడు మీరు ఈ చదువును చదువగలుగుతారు’’
ప్రశ్న:-
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఈ సమయంలో ఏ కృషి చేస్తారు?
జవాబు:-
కనులను అపవిత్రము నుండి పవిత్రముగా తయారుచేసుకునే, అలాగే మధురముగా తయారయ్యే కృషి చేస్తారు. సత్యయుగములోనైతే అందరి కనులు శుద్ధముగానే ఉంటాయి. అక్కడ ఈ శ్రమ ఉండదు. ఇక్కడ పతిత శరీరములో, పతిత ప్రపంచములో పిల్లలైన మీరు – ఆత్మలమైన మేము సోదరులము అని నిశ్చయం చేసుకుని కనులను శుద్ధముగా తయారుచేసుకునే పురుషార్థము చేస్తున్నారు.
ప్రశ్న:-
భక్తులు చెప్పే ఏ ఒక్క మాటతో సర్వవ్యాపి విషయము తప్పు అవుతుంది?
జవాబు:-
భక్తులు అంటారు, ఓ బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీపై బలిహారమవుతాము… – వారు వస్తారు అనగా వారు ఇక్కడ లేరు అన్నది నిరూపణ అవుతుంది.
ఓం శాంతి.
తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు – మీ ఆత్మ స్వధర్మములో కూర్చున్నారా? ఒక్క అనంతమైన తండ్రినే ఉన్నతోన్నతమైన ఆత్మ లేక పరమ ఆత్మ అని అంటారని మీకు తెలుసు. పరమాత్మ తప్పకుండా ఉన్నారు. వారు పరమపిత కదా. పరమపిత అనగా పరమాత్మ. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని మీరందరూ విన్నారు. ఆత్మ చాలా చిన్నదని, సూక్ష్మమైనదని మీకు తెలుసు. దానిని ఈ కనుల ద్వారా చూడలేరు. ఆత్మను చూసినటువంటి మనుష్యులు ఎవరూ ఉండరు. అయితే, అది కనిపించవచ్చు – కానీ దివ్యదృష్టి ద్వారానే, మరియు అది డ్రామా ప్లాన్ అనుసారముగానే కనిపిస్తుంది. భక్తి మార్గములో కూడా ఈ కనులకు ఏ సాక్షాత్కారము కలగదు. అక్కడ దివ్యదృష్టి లభిస్తుంది, దాని ద్వారా చైతన్యముగా చూస్తారు. దివ్యదృష్టి అనగా చైతన్యముగా చూడడము. ఆత్మకు జ్ఞానమనే చక్షువు లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు, కొందరు ఎంతో భక్తి చేస్తారు, దానిని నవవిధ భక్తి అని అంటారు. ఏ విధంగా మీరాకు సాక్షాత్కారము కలిగినప్పుడు ఆమె నాట్యం చేసేవారు. ఆ సమయంలో వైకుంఠమైతే లేదు కదా. మీరా 5, 6 వందల సంవత్సరాల క్రితం ఉండేవారు. ఏదైతే గతించిపోయిందో దానిని దివ్యదృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. హనుమంతుడు, గణేశుడు మొదలైనవారి చిత్రాలకు ఎంతో భక్తి చేస్తూ-చేస్తూ వాటిలో లీనమైపోయినట్లు అవుతారు. వారికి సాక్షాత్కారము కలుగుతుంది కానీ దాని ద్వారా ముక్తి ఏమీ లభించదు. ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గము పూర్తిగా అతీతమైనది. భారత్ లో భక్తి మార్గములో ఎన్నో మందిరాలు ఉంటాయి. అక్కడ శివలింగాన్ని కూడా పెడతారు. కొందరు చిన్నగా తయారుచేస్తారు, కొందరు పెద్దగా తయారుచేస్తారు. ఏ విధముగా మీరు ఆత్మలో, అలా వారు పరమ ఆత్మ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సైజ్ అయితే ఒకటే. మనమంతా సోదరులము, ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు అని అంటారు కూడా. అనంతమైన తండ్రి ఒక్కరే, మిగిలినవారంతా పరస్పరంలో సోదరులు, పాత్రను అభినయిస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి జ్ఞానం యొక్క విషయాలు, వీటిని ఒక్క తండ్రియే అర్థం చేయిస్తారు. వీటిని ఎవరికైతే అర్థం చేయిస్తారో వారు తిరిగి ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. మొట్టమొదట ఒక్క నిరాకారుడైన తండ్రియే అర్థం చేయిస్తారు. వారి గురించే సర్వవ్యాపి అని, రాయి-రప్పలలో ఉన్నారు అని అనేస్తారు. ఇది రైట్ కాదు కదా. ఒకవైపు అంటారు – బాబా, ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీపై బలిహారమవుతాము. మీరు సర్వవ్యాపి అని ఏమైనా అంటారా. మీరు వస్తే మేము మీపై బలిహారమవుతాము అని అంటారు. మరి దీని అర్థము వారు ఇక్కడ లేరనే కదా. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కావున తప్పకుండా వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. ఈ విషయాలను తండ్రియే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు, దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతోకాలం దూరంగా ఉన్నారు… అని గానం చేస్తారు. దాని లెక్కను కూడా అర్థం చేయించారు. ఆత్మలైన మీరు ఎంతోకాలంగా దూరంగా ఉంటారు. ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చారు రాజయోగాన్ని నేర్చుకునేందుకు. తండ్రి అయితే సేవకులు. గొప్ప వ్యక్తులు సంతకం చేసేటప్పుడు – ఒబీడియంట్ సర్వెంట్ (విధేయుడైన సేవకుడను) అని కింద వ్రాస్తారు. తండ్రి పిల్లలందరి సేవకులు. వారు అంటారు, పిల్లలూ, నేను మీ సేవకుడను. మీరు ఎంతో అధికారంతో పిలుస్తారు – భగవంతుడా, రండి, వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని. పావనులు పావన ప్రపంచములోనే ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మిగిలినదంతా వినడానికి ఇంపుగా ఉన్న విషయాలే. ఇది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్శిటీ. ఇక్కడి లక్ష్యము, ఉద్దేశ్యము ఏమిటి? మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడము. మేము ఈ విధంగా తయారవ్వాలి అని పిల్లలకు నిశ్చయము ఉంది. ఎవరికైతే నిశ్చయము ఉండదో వారు స్కూల్లో కూర్చుంటారా? నిశ్చయము ఉన్నట్లయితే బారిస్టర్ నుండి, సర్జన్ నుండి నేర్చుకుంటారు. లక్ష్యము, ఉద్దేశ్యము గురించే తెలియకపోతే వారు రానే రారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది సత్యాతి-సత్యమైన, నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్య కథ. దీనిని కథ అని ఎందుకు అంటారు? ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. కావున గతాన్ని కథ అని అంటారు, ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యాతి-సత్యమైన శిక్షణ. కొత్త ప్రపంచములో దేవతలు ఉంటారు, పాత ప్రపంచములో మనుష్యులు ఉంటారు. దేవతల్లో దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనుష్యుల్లో లేవు. మనుష్యులు వారిని దేవతలు అని అంటారు మరియు మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని గానం చేస్తారు. స్వయం గురించి – మేము పాపులము, నీచులము, వికారులము అని అంటారు. దేవతలు ఎప్పుడు ఉండేవారు? తప్పకుండా సత్యయుగములోనే ఉండేవారు అని అంటారు. కలియుగములో ఉండేవారు అని అనరు. ఈ రోజుల్లో మనుష్యుల బుద్ధి తమోప్రధానముగా ఉన్న కారణముగా తండ్రి టైటిల్స్ ను కూడా స్వయానికి పెట్టుకుంటున్నారు. నిజానికి శ్రేష్ఠముగా తయారుచేసే శ్రీశ్రీ (శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైనవారు) ఒక్క తండ్రియే. శ్రేష్ఠమైన దేవతల మహిమ వేరు. ఇప్పుడు ఇది కలియుగము. సన్యాసుల గురించి కూడా తండ్రి అర్థం చేయించారు, ఒకటేమో హద్దు సన్యాసము, ఇంకొకటి అనంతమైన సన్యాసము. మేము ఇళ్ళు- వాకిళ్ళు అన్నీ వదిలేసాము అని వారు అంటారు. కానీ ఈ రోజుల్లో చూడండి, లక్షాధికారులుగా అయి కూర్చున్నారు. సన్యాసము అనగా సుఖాన్ని త్యాగము చేయడము. పిల్లలైన మీరు అనంతమైన సన్యాసాన్ని చేస్తారు ఎందుకంటే ఈ పాత ప్రపంచము అంతము కానున్నదని మీకు తెలుసు, అందుకే దీని పట్ల వైరాగ్యము ఉంది. వారు ఇళ్ళూ-వాకిళ్ళను వదిలి, మళ్ళీ లోపలికి దూరి వచ్చారు. ఇప్పుడు పర్వతాలు మొదలైనవాటిపై, గుహలలోనూ ఉండడం లేదు. కుటీరాలు నిర్మించుకున్నా కానీ దాని కోసం ఎంత ఖర్చు చేస్తారు. నిజానికి కుటీరం నిర్మించేందుకు పెద్ద ఖర్చేమీ అవ్వదు. కానీ పెద్ద-పెద్ద మహళ్ళను నిర్మించుకుని ఉంటారు. ఈ రోజుల్లోనైతే అందరూ తమోప్రధానముగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నదే కలియుగము. సత్యయుగ దేవతల చిత్రాలు లేకపోతే స్వర్గం యొక్క నామ-రూపాలే మాయమైపోయేవి. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. అర్ధకల్పం భక్తి మార్గము యొక్క కథలు ఉన్నాయి, వాటిని వింటూ మెట్లు దిగుతూ వచ్చారు, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఖచ్చితముగా అదే డ్రామా రిపీట్ అవుతుంది. ఎవరికీ భక్తిని వదిలివేయండి అని చెప్పకూడదని, జ్ఞానం వచ్చినట్లయితే భక్తి దానంతట అదే వదిలిపోతుంది అని బాబా అర్థం చేయించారు కూడా. నేను ఒక ఆత్మను, ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని భావిస్తారు. మొదట అనంతమైన తండ్రి పరిచయము కావాలి. ఆ నిశ్చయము ఏర్పడినట్లయితే ఇక హద్దు తండ్రి నుండి బుద్ధి తొలగిపోతుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధి యోగము తండ్రితో జోడించబడుతుంది. తండ్రి స్వయంగా అంటారు, శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. దేహధారుల స్మృతి ఉండకూడదు. అది దైహిక యాత్ర, ఇది మీ ఆత్మిక యాత్ర, ఇందులో ఎదురుదెబ్బలు తినకూడదు. భక్తి మార్గము రాత్రి. ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. ఇక్కడ ఎదురుదెబ్బలు యొక్క విషయమే లేదు. స్మృతి చేసేందుకు ఎవరూ ప్రత్యేకంగా కూర్చోరు. భక్తి మార్గములో కృష్ణుని భక్తులు నడుస్తూ-తిరుగుతూ కృష్ణుడిని స్మృతి చేయలేరా? హృదయములో అతని స్మృతి ఉండిపోతుంది కదా. ఒకసారి ఏ వస్తువునైతే చూస్తారో ఆ వస్తువు గుర్తుంటుంది. మరి మీరు ఇంట్లో కూర్చొని శివబాబాను స్మృతి చేయలేరా? ఇది కొత్త విషయము. కృష్ణుడిని స్మృతి చేయడము, ఇది పాత విషయమైపోయింది. శివబాబా గురించైతే – వారి నామ, రూపాలేమిటి అనేది ఎవరికీ తెలియదు. సర్వవ్యాపి అంటే ఏమిటి! ఎవరైనా చెప్పగలగాలి కదా. ఆత్మలమైన మన తండ్రి పరమపిత పరమాత్మయే అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మను పరమాత్మ అని అనలేరు. ఇంగ్లీష్ లో ఆత్మను సోల్ అని అంటారు. పారలౌకిక తండ్రి గురించి తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఆ తండ్రియే జ్ఞానసాగరుడు, వారిలో మనుష్యులను దేవతలుగా తయారుచేసే జ్ఞానము ఉంది. తండ్రి అంటారు, నేను ప్రతిరోజూ గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది. స్మృతినే మర్చిపోతారు. బాబా రోజూ చెప్తారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆత్మనైన నేను బిందువును. ఒక అద్భుతమైన సితార మెరుస్తూ ఉంటుంది అని కూడా అంటారు. ఆత్మ శరీరము నుండి బయటకు వస్తే అది ఈ కళ్ళకు కనిపించదు. ఆత్మ వెళ్ళిపోయింది, వెళ్ళి ఇంకొక శరీరములోకి ప్రవేశించింది అని అంటారు. ఆత్మలమైన మనము ఏ విధముగా పునర్జన్మలు తీసుకుంటాము అనేది మీకు తెలుసు. ఇప్పుడు అపవిత్రముగా అయ్యాము. మొదట ఆత్మలైన మీరు పవిత్రముగా ఉండేవారు, మీ గృహస్థ ధర్మము పవిత్రముగా ఉండేది. ఇప్పుడు రెండూ అపవిత్రముగా అయిపోయాయి. ఎప్పుడైతే రెండూ పవిత్రముగా ఉండేవో, అప్పుడు వారిని పూజిస్తారు. మీరు పవిత్రులు, మేము అపవిత్రులము అని అంటారు. అక్కడ రెండూ పవిత్రముగా ఉంటాయి, ఇక్కడ రెండూ అపవిత్రముగా ఉన్నాయి. కావున మొదట పవిత్రముగా ఉంటూ తర్వాత అపవిత్రముగా అయ్యారా? లేక అపవిత్రులుగానే జన్మ తీసుకున్నారా? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, మొదట ఆత్మలైన మీరే పవిత్రముగా, పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరే పూజారులుగా, అపవిత్రులుగా అయ్యారు. 84 జన్మలను తీసుకున్నారు. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికము గురించి మీకే తెలుసు. ఎవరెవరు రాజ్యం చేసేవారు, వారికి ఆ రాజ్యం ఎలా లభించింది, ఈ చరిత్ర కూడా మీకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇప్పుడే తెలుసు, ఇంతకుముందు తెలియదు, రాతి బుద్ధి కలవారిగా ఉండేవారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇంతకుముందు లేదు, నాస్తికులుగా ఉండేవారు. ఇప్పుడు ఆస్తికులుగా అవ్వడం ద్వారా మీరు ఎంత సుఖీగా అవుతారు. మీరు ఇక్కడకు ఈ దేవతలుగా అయ్యేందుకే వచ్చారు. ఈ సమయంలో చాలా మధురముగా అవ్వాలి. మీరు ఒకే తండ్రి సంతానము, పరస్పరం సోదరీ-సోదరులవుతారు కదా. అశుద్ధ దృష్టి వెళ్ళడానికి వీల్లేదు. ఈ సమయంలో కష్టపడాల్సి ఉంటుంది. కళ్ళే అన్నింటికన్నా అశుద్ధముగా ఉంటాయి. అర్ధకల్పం అశుద్ధముగా ఉంటాయి, అర్ధకల్పం శుద్ధముగా ఉంటాయి. సత్యయుగములో దేవతల నేత్రాలు శుద్ధముగా ఉంటాయి. ఇక్కడ అశుద్ధముగా ఉంటాయి. ఈ విషయంలో సూరదాస్ కథను కూర్చుని వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి రావాల్సే ఉంటుంది. ఎవరైతే పతితముగా అయ్యారో, వారినే పావనముగా తయారుచేయాల్సి ఉంటుంది.
కృష్ణుడు మరియు రాధే, ఇరువురూ వేర్వేరు రాజ్యాలకు చెందినవారని మీకు తెలుసు. వారు యువరాజు, యువరాణి. మళ్ళీ స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అయినప్పుడు వారి వంశము గానం చేయబడుతుంది. ఆ కాలము కూడా వారి నుండే ప్రారంభమవుతుంది. సత్యయుగపు ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. కానీ తండ్రి 1250 సంవత్సరాలే అని అంటారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మా యొక్క రాత్రి అర్ధకల్పము, మళ్ళీ బ్రహ్మ యొక్క పగలు అర్ధకల్పము. జ్ఞానము ద్వారా సుఖము లభిస్తుంది, భక్తి ద్వారా దుఃఖము లభిస్తుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మళ్ళీ అంటారు, మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, స్వధర్మములో స్థితులవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. వారే పతితపావనుడు. స్మృతి చేస్తూ-చేస్తూ మీరు పావనంగా అయిపోతారు. అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. తండ్రి స్వర్గ రచయిత కదా. కావున మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు అని స్మృతిని కలిగిస్తారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు కావుననే అక్కడకు వెళ్ళేందుకు అర్హులుగా లేరు, అందుకే పావనులుగా అవ్వండి. నేను ఒక్కసారే రావాల్సి ఉంటుంది. భగవంతుడు ఒక్కరే. ప్రపంచము కూడా ఒక్కటే. మనుష్యుల మతాలు అనేకం ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఎన్ని నోర్లో అన్ని విషయాలు. ఇక్కడ ఉండేది ఒకే మతము, అది అద్వైత మతము. వృక్షములో చూడండి, ఎన్ని మత, మతాంతరాలు ఉన్నాయి. వృక్షము ఎంత పెద్దగా అయిపోయింది. అక్కడ ఒకే మతము, ఒకే రాజ్యము ఉండేవి. మనమే విశ్వాధిపతులుగా ఉండేవారమని మీకు తెలుసు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ జరగవు. ఇక్కడ చూడండి, కూర్చుని-కూర్చునే మరణిస్తారు. నలు వైపుల నుండీ మృత్యువు ఉంది. అక్కడ మీ ఆయువు ఎంతో పెద్దగా ఉండేది. ఇప్పుడు మీరు ఈశ్వరునితో యోగాన్ని జోడించి మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున మీరు యోగేశ్వర్ మరియు యోగేశ్వరీ. తర్వాత మీరే రాజ-రాజేశ్వరిగా అవుతారు, ఇప్పుడు జ్ఞాన-జ్ఞానేశ్వరిగా ఉన్నారు. మళ్ళీ రాజ-రాజేశ్వరిగా ఎలా అవుతారు? ఈశ్వరుడు అలా తయారుచేసారు. వీరికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈశ్వరుడు నేర్పించారు. అక్కడ 21 తరాలు వారి రాజ్యము కొనసాగుతుంది. ఇక్కడైతే ఒక జన్మలో దాన పుణ్యాలు చేయడంతో రాజుగా అవుతారు, మరణించారంటే అది సమాప్తము. అందరికీ అకాల మృత్యువు వస్తూ ఉంటుంది. సత్యయుగములో ఈ నియమము లేదు. అక్కడ మృత్యువు కబళించింది అని ఎప్పుడూ అనరు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఏ విధముగా సర్పము తన కుబుసాన్ని మారుస్తుంది. అక్కడ ఎల్లప్పుడూ సంతోషమే సంతోషము ఉంటుంది. కొద్దిగా కూడా దుఃఖపు విషయం ఉండదు. మీరు సుఖధామానికి అధిపతులుగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు, అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచము నుండి అనంతమైన సన్యాసము చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ ఆత్మిక యాత్రలో ఉండాలి.
2. పురుషార్థము చేసి కనులను తప్పకుండా శుద్ధముగా తయారుచేసుకోవాలి. లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని బుద్ధిలో ఉంచుకొని చాలా-చాలా మధురముగా అవ్వాలి.
వరదానము:-
ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే వివేకవంతులైన జ్ఞానీ ఆత్మలుగా కండి
ఎవరైతే మొదట ఆలోచిస్తారో, ఆ తర్వాత చేస్తారో, వారే వివేకవంతులైన జ్ఞానీ ఆత్మలు. ఏ విధంగా గొప్ప వ్యక్తులు భోజనాన్ని చెక్ చేయిస్తారు, ఆ తర్వాతనే తింటారు. అలా ఈ సంకల్పాలు బుద్ధికి భోజనం వంటివి, వీటిని మొదట చెక్ చేయండి, ఆ తర్వాతనే కర్మలోకి తీసుకురండి. సంకల్పాలు చెక్ చేయడం ద్వారా వాణి మరియు కర్మలు స్వతహాగా సమర్థంగా అవుతాయి మరియు ఎక్కడైతే సమర్థత ఉంటుందో, అక్కడ సంపాదన ఉంటుంది. కావున సమర్థులుగా అయ్యి ప్రతి అడుగులో అనగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో పదమాల సంపాదనను జమ చేసుకోండి, ఇదే జ్ఞానీ ఆత్మల లక్షణము.
స్లోగన్:-
తండ్రి మరియు సర్వుల ఆశీర్వాదాల విమానంలో ఎగిరేవారే ఎగిరే యోగులు