TELUGU MURLI 12-02-2023

   12-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 16-12-93 మధువనం

‘‘సత్యమైన స్నేహీగా అయ్యి ఒక్క తండ్రి ద్వారా సర్వ సంబంధాలను సాకారములో అనుభవము చేయండి’’

ఈ రోజు విశ్వ స్నేహీ అయిన బాప్ దాదా తమ అతి స్నేహీ మరియు సదా తండ్రికి సహచరులు మరియు సహయోగులైన ఆత్మలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న బ్రాహ్మణ ఆత్మలందరూ తప్పకుండా స్నేహీలే. స్నేహము బ్రాహ్మణ జీవితములో పరివర్తనను తీసుకువచ్చింది. అయినా కూడా స్నేహీలలో మూడు రకాలవారు ఉన్నారు – ఒకరు స్నేహం చేసేవారు, రెండవవారు స్నేహాన్ని నిర్వర్తించేవారు మరియు మూడవవారు స్నేహములో ఇమిడిపోయేవారు. ఇమిడిపోవడము అనగా సమానముగా అవ్వడము. స్నేహం చేసేవారు ఒక్కోసారి స్నేహం చేస్తారు కానీ స్నేహం చేస్తూ-చేస్తూ ఒక్కోసారి ఆ స్నేహము తెగిపోతుంది, ఒక్కోసారి జోడించబడుతుంది, అందుకే ఎప్పటికప్పుడు స్నేహాన్ని జోడించడానికి పురుషార్థము చేయాల్సి వస్తుంది ఎందుకంటే తండ్రితోపాటుగా ఇంకా ఎక్కడైనా స్నేహము ఉన్నట్లయితే, అది వ్యక్తుల పట్ల అయినా లేక ప్రాకృతిక సాధనాల పట్ల అయినా, అలా ఎక్కడైనా సంకల్పమాత్రమైనా కూడా స్నేహము జోడింపబడి ఉన్నట్లయితే తండ్రితో స్నేహము చేసేవారి లిస్ట్ లోకి వస్తారు. స్నేహానికి గుర్తు ఏమిటంటే – ఎటువంటి శ్రమ లేకుండా స్నేహితుని వైపుకు స్నేహము స్వతహాగానే వెళ్తుంది. స్నేహం చేసే ఆత్మ ప్రతి సమయము, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో ఆధారాన్ని అనుభవము చేస్తుంది. ఒకవేళ సాధనాల పట్ల స్నేహము ఉన్నట్లయితే ఆ సమయములో తండ్రి కన్నా కూడా ఎక్కువగా సాధనాల సహాయము అనగా ఆధారము అనుభవమవుతుంది. ఆ సమయములో ఆ ఆత్మకు సంకల్పములో తండ్రి స్నేహము గుర్తుకొస్తుంది కూడా, తండ్రి స్నేహము శ్రేష్ఠమైనదని ఆలోచిస్తారు కూడా కానీ ఈ సాధనము లేక వ్యక్తి యొక్క ఆధారము కూడా తప్పకుండా అవసరము అని అనుకుంటారు, అందుకే రెండు వైపులా స్నేహము అసంపూర్ణమవుతుంది మరియు పదే-పదే స్నేహము జోడించాల్సి వస్తుంది. ఒకే బలము, ఒకే నమ్మకము అన్నదానికి బదులుగా మరోదానిపై నమ్మకము పెట్టుకోవడము కూడా తప్పకుండా అవసరము అని అనిపిస్తుంది. అందుకే తండ్రి స్నేహము ద్వారా సర్వ ప్రాప్తుల అనుభవము ఏదైతే ఉంటుందో, దానికి బదులుగా ఇతర ఆధారాల ద్వారా కలిగే అల్పకాలికమైన ప్రాప్తి తనవైపుకు ఆకర్షితము చేస్తుంది. ఎంతగా ఆకర్షిస్తుందంటే ఇక దానినే అత్యంత అవసరము అని భావించడము మొదలుపెడతారు. దానిని ఆకర్షణ అని అనుకోరు కానీ ఆధారము అని భావిస్తారు. ఇటువంటివారిని స్నేహము చేసేవారు అని అంటారు.

రెండవవారు స్నేహాన్ని నిర్వర్తించేవారు. వారికి స్నేహము చేయడంతోపాటు దానిని నిర్వర్తించే శక్తి కూడా ఉంటుంది. నిర్వర్తించటము అనగా స్నేహానికి రెస్పాన్స్ ఇవ్వటము, రిటర్న్ ఇవ్వటము. స్నేహానికి రిటర్న్ ఏమిటంటే, స్నేహీ తండ్రి పిల్లల పట్ల ఏ శ్రేష్ఠ ఆశలనైతే పెట్టుకుంటారో, ఆ అన్ని ఆశలను ప్రాక్టికల్ లో పూర్తి చెయ్యటము. స్నేహాన్ని నిర్వర్తించేవారు చాలావరకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు, కానీ సదా తండ్రి సమానంగా అనగా ఇమిడిపోయి ఉండే ఆ అనుభూతి అప్పుడప్పుడు జరుగుతుంది, అప్పుడప్పుడు జరగదు. అయినా కూడా నిర్వర్తించేవారు సమీపంగా ఉంటారు, కానీ సమానంగా ఉండరు. స్నేహాన్ని నిర్వర్తించేవారికి అది నిర్వర్తించినందుకు రిటర్న్ లో పదమాల గుణాల ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాల సహాయము అనేది విశేషంగా తండ్రి ద్వారా లభిస్తూ ఉంటుంది. మూడవవారు, ఎవరైతే స్నేహములో ఇమిడిపోయి ఉంటారో ఆ ఆత్మల నయనాలలో, మాటలలో, సంకల్పాలలో, ప్రతి కర్మలో సహజంగా మరియు స్వతహాగా స్నేహీ తండ్రి యొక్క తోడు సదా అనుభవమవుతుంది. తండ్రి వారి నుండి వేరుగా ఉండరు మరియు వారు తండ్రి నుండి వేరుగా ఉండరు. ప్రతి సమయము తండ్రి పట్ల ఉన్న స్నేహానికి రిటర్న్ లో ప్రాప్తించిన సర్వ ప్రాప్తులతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటారు, అందుకే మరే ఇతర ఆధారము వారిని ఆకర్షితము చెయ్యలేదు ఎందుకంటే ఏదైనా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క అవసరమనేది ఇతరులెవరినో ఆధారంగా చేస్తుంది అనగా సంపూర్ణ స్నేహములో తేడా తీసుకొస్తుంది. స్నేహములో ఇమిడి ఉన్న ఆత్మలు సదా సర్వ ప్రాప్తి సంపన్నులుగా ఉన్న కారణంగా సహజంగానే ‘ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు’ అన్న అనుభూతిలో ఉంటారు. కనుక అందరూ స్నేహీలే కానీ మూడు రకాల వారు ఉన్నారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి – నేను ఎవరిని. మీ గురించి మీరు తెలుసుకోగలరు కదా. స్నేహీలు కావుననే స్నేహము కారణంగా బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారు. కానీ స్నేహముతోపాటు దానిని నిర్వర్తించే శక్తి ఉండటము, ఇందులో నంబరువారుగా ఉంటారు. స్నేహముతో పాటు శక్తి కూడా అవసరము. ఎవరిలోనైతే స్నేహము మరియు శక్తి, రెండింటి బ్యాలెన్స్ ఉంటుందో, వారే తండ్రి సమానంగా అవుతారు. ఇలా స్నేహములో ఇమిడిపోయే ఆత్మలకు ఎలా అనుభవమవుతుందంటే – వారికి తండ్రి స్నేహము నుండి దూరమవ్వటమనేది కష్టము. స్నేహములో ఇమిడిపోవటము సహజము, దూరమవ్వటము కష్టము ఎందుకంటే ఇమిడిపోయే ఆత్మలకు ఒక్క తండ్రియే ప్రపంచము.

ప్రపంచములో ఆకర్షించే విషయాలు రెండే ఉంటాయి – ఒకటి వ్యక్తుల సంబంధాలు మరియు రెండవది రకరకాల వైభవాలు లేక సాధనాల ద్వారా ప్రాప్తి లభించడము. స్నేహములో ఇమిడిపోయి ఉండే ఆత్మలకు సర్వ సంబంధాల రసానుభూతి ఒక్క తండ్రి ద్వారా సదా కలుగుతుంటుంది. సర్వ ప్రాప్తులకు ఆధారము ఒక్క తండ్రియే, అంతేకానీ వైభవాలు లేక సాధనాలు కాదు. వైభవాలు మరియు సాధనాలు అనేవి రచన మరియు తండ్రి రచయిత. ఎవరికైతే స్వయంగా రచయితనే ఆధారముగా ఉన్నారో, వారికి రచన ద్వారా లభించే అల్పకాలికమైన ప్రాప్తి గురించి స్వప్నమాత్రము కూడా సంకల్పము కలగదు. బాప్ దాదాకు అప్పుడప్పుడు పిల్లల స్థితిని చూసి నవ్వు వస్తుంటుంది ఎందుకంటే ఆశ్చర్యము అని చెప్పలేము, ఫుల్ స్టాప్ ఉంటుంది. నడుస్తూ-నడుస్తూ బీజాన్ని వదిలేసి కొమ్మలు-రెమ్మలకు ఆకర్షితులవుతారు. ఏదో ఒక ఆత్మను ఆధారంగా చేసుకుంటారు, ఏవో సాధనాలను ఆధారంగా చేసుకుంటారు ఎందుకంటే బీజము యొక్క రూపము, రంగు శోభనీయకంగా ఉండవు మరియు కొమ్మలు-రెమ్మలు యొక్క రూపము, రంగు చాలా శోభనీయకంగా ఉంటాయి. దేహధారుల సంబంధము యొక్క ఆధారము దేహ-భానములో సహజంగా అనుభవమవుతుంది మరియు తండ్రి యొక్క ఆధారము దేహ-భానము నుండి దూరమవ్వటంతో అనుభవమవుతుంది. దేహ-భానములోకి వచ్చే అలవాటైతే ఉండనే ఉంది. వద్దనుకున్నా కానీ అలా ఉంటారు, అందుకే దేహధారుల సంబంధము యొక్క ఆధారము సహజంగా అనుభవమవుతుంది. ఇది రైట్ కాదు అని అనుకుంటారు కూడా, అయినా కూడా ఆధారంగా చేసుకుంటారు. బాప్ దాదా దీనిని చూస్తూ నవ్వుకుంటుంటారు. ఆ సమయములోని స్థితి నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. ఏ విధంగా మీరు క్లాసుల్లో లేక మీ భాషణల్లో ఒక చిలుక కథను వినిపిస్తారు కదా – నీటి కుళాయిపై కూర్చోవద్దని దానికి చెప్పారు, కానీ అది కుళాయిపై కూర్చునే కుళాయిపై కూర్చోవద్దు అని చెప్తుంటుంది. అలాగే పిల్లలు కూడా ఆ సమయములో మనసులో ఒక వైపేమో ఇలా ఆలోచిస్తుంటారు – ‘ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు’ అని, పదే-పదే తమలో తాము ఇది రిపీట్ కూడా చేస్తుంటారు కానీ దానితో పాటు ఇలా కూడా ఆలోచిస్తుంటారు – స్థూలంలో అయితే ఆధారము కావాలి కదా అని. మరి ఆ సమయములో నవ్వు వస్తుంది కదా మరియు ఆ సమయములో ఇక మాయ అవకాశము తీసుకుంటుంది. బుద్ధిని ఎలా మార్చేస్తుందంటే అసత్యమైన ఆధారమే సత్యమైన ఆధారముగా అనుభవమవుతుంది. ఏ విధంగా ఈ రోజుల్లో నకిలీది నిజమైనదానికంటే కూడా మంచిగా అనిపిస్తుంది, అలా ఆ సమయంలో తప్పు, ఒప్పుగా అనిపిస్తుంది. మరియు ఆ తప్పుడు విషయము, అసత్యమైన ఆధారము దానిని పక్కా చేసేందుకు లేక ఆ అసత్యాన్ని సత్యంగా నిరూపించేందుకు, ఎలా అయితే ఏదైనా స్థానము బలహీనంగా ఉంటే దాన్ని దృఢంగా చేయడానికి పిల్లర్ వేయడం జరుగుతుంది, అలాగే మాయ కూడా బలహీన సంకల్పాన్ని దృఢంగా చేసేందుకు చాలా రాయల్ పిల్లర్ వేస్తుంది. ఏ పిల్లర్ వేస్తుంది? మాయ ఎటువంటి సంకల్పాలను కలిగిస్తుందంటే – ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, చాలామంది పెద్ద-పెద్దవారు కూడా ఇలాగే చేస్తారు, ఇలాగే నడుస్తారు, లేదా ఇలా అంటారు – ఇప్పుడైతే పురుషార్థులమే, సంపూర్ణంగా అయితే అవ్వలేదు కావున తప్పకుండా ఇప్పుడు ఏదో ఒక లోపమైతే ఉండనే ఉంటుంది, మున్ముందు సంపూర్ణంగా అవుతాము అని అనుకుంటారు – ఇటువంటి వ్యర్థ సంకల్పాల రూపీ పిల్లర్ బలహీనతను గట్టిపరుస్తుంది. కనుక ఇటువంటి పిల్లర్ ను ఆధారంగా చేసుకోకూడదు. సమయము వచ్చినప్పుడు ఈ నకిలీ పిల్లర్ మోసగిస్తుంది. సర్వ సంబంధాల ఆధారముగా సదా ఒక్క తండ్రే ఉండాలి అనే ఆ అనుభవాన్ని తక్కువగా చేస్తారు. ఈ సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచండి. సర్వ సంబంధాల అనుభూతి తక్కువైన కారణంగా ఎక్కడో అక్కడ అల్పకాలికమైన సంబంధము జోడించబడుతుంది. స్థూల జీవితములో కూడా స్థూల రూపములో ఆధారాన్ని లేక ప్రతి పరిస్థితిలో స్థూల రూపములో సహయోగాన్ని ఇచ్చే ఆధారము తండ్రినే. ఈ అనుభవాన్ని ఇంకా పెంచండి. తండ్రి అయితే సూక్ష్మంగా మాత్రమే సహయోగాన్ని ఇచ్చేవారు అని అనుకోకండి. వారు నిరాకారుడు, ఆకారుడు, అంతేకానీ సాకారుడైతే కాదు, కానీ వారితో ప్రతి సంబంధాన్ని సాకార రూపములో అనుభవము చేయగలరు. సాకార స్వరూపములో తోడు యొక్క అనుభవము చేయగలరు. ఈ అనుభూతిని లోతుగా అర్థం చేసుకోండి మరియు స్వయాన్ని ఇందులో దృఢంగా చేసుకోండి. అప్పుడు వ్యక్తులు, వైభవాలు లేక సాధనాలు తమవైపుకు ఆకర్షితము చెయ్యవు. సాధనాలను నిమిత్తమాత్రంగా కార్యములో వినియోగించటము మరియు సాక్షీగా అయ్యి సేవ కోసం కార్యములో పెట్టడము – ఇటువంటి అనుభూతిని పెంచండి. ఆధారంగా చేసుకోవద్దు, నిమిత్తమాత్రముగా ఉండాలి. ఇటువంటివారినే స్నేహములో ఇమిడిపోయి ఉండే సమాన ఆత్మలు అని అంటారు. కనుక నేను ఎవరిని అని మీకు మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? అచ్ఛా!

సదా స్నేహములో ఇమిడిపోయి ఉండే సమాన ఆత్మలకు, సదా ఒక్క తండ్రి నుండి సర్వ సంబంధాలను అనుభవము చేసే ఆత్మలకు, సదా ఒక్క తండ్రిని ఆధారమూర్తిగా, సత్యమైన ఆధారముగా అనుభవము చేసే ఆత్మలకు, సదా సర్వ ప్రాప్తులను రచయిత అయిన తండ్రి ద్వారా అనుభవము చేసే ఆత్మలకు, సదా సహజంగా, స్వతహాగా ‘ఒకే బలము, ఒకే నమ్మకము’ను అనుభవము చేసే సత్యమైన స్నేహీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో మిలనము:- సదా ఇమిడిపోయి ఉంటారా లేక స్మృతి చేసేందుకు శ్రమ చెయ్యాల్సి ఉంటుందా? ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కనిపించరు. కథలు వినేటప్పుడు నవ్వు వస్తుంది కదా. కథ నడుస్తూ ఉన్నంత సమయం తమకేమైందో తమకే అర్థం కాదు మరియు ఎప్పుడైతే కథ పూర్తయిపోతుందో, అప్పుడు ఆలోచిస్తారు – ఏమిటి ఇలా జరిగింది? అది నేనేనా లేక ఇంకెవరైనానా. ఇలా అనుకుంటారు ఎందుకంటే ఆ సమయములో పరవశమవుతారు కదా. పరవశమైనవారికి తమ స్పృహ ఉండదు. ఎప్పుడైతే స్పృహ వస్తుందో, అప్పుడు ఉన్నతి చెందేందుకు ఉత్సాహము కూడా వస్తుంది. అచ్ఛా, సంగఠన పెరుగుతూ ఉంది మరియు పెరుగుతూనే ఉంటుంది. మరియు నిమిత్త ఆత్మలైన మీరు ఈ ఆటనంతా చూసి హర్షితులవుతుంటారు. అందరూ నడుస్తున్నారు, కొందరు నడుస్తున్నారు, కొందరు ఎగురుతున్నారు, మరి మీరేం చేస్తారు? ఎగురుతూ-ఎగురుతూ మీతో పాటు ఇతరులను కూడా ఎగిరేలా చేస్తున్నారు ఎందుకంటే దయాహృదయుడైన తండ్రి యొక్క దయాహృదయము కల ఆత్మలుగా అయ్యారు, కావున దయ కలుగుతుంది కదా. అయిష్టము కలగదు, కానీ దయ కలుగుతుంది. మరియు ఈ దయనే హృదయపూర్వకమైన ప్రేమలా పని చేస్తుంది. అచ్ఛా, ఎవరైతే నడుస్తున్నారో వారు చాలా-చాలా మంచిగా నడుస్తున్నారు. అలసటలేనివారిగా అయ్యి సేవ చేస్తున్నారు కదా. నిమిత్త ఆత్మల అలసటలేనితనాన్ని చూసి అందరిలో ఉల్లాసము వస్తుంది కదా.

అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము

సాధారణతను సమాప్తము చేసి విశేషత కల సంస్కారాలను నేచురల్ మరియు నేచర్ గా తయారుచేసుకోండి

స్వయాన్ని సదా సంగమయుగ ఆత్మిక ఆనందములో ఉండేవారిగా అనుభవము చేస్తారా? ఆనందములో ఉంటారా లేక ఒక్కోసారి ఆనందములో ఉంటే, ఒక్కోసారి తికమకపడుతుంటారా లేక సదా ఆనందములో ఉంటారా? స్థితి-గతులు ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా ఏదైనా అటువంటి పరిస్థితి వచ్చినా లేక అటువంటి పరీక్ష వచ్చినా తికమకపడతారా? (కొద్ది సమయము కోసం తికమకపడతాము). ఒకవేళ ఆ కొద్ది సమయములోనే మీకు మృత్యువు వచ్చినట్లయితే ఏమవుతుంది? అకాల మృత్యువుల సమయము కదా. కావున కొద్ది సమయమైనా కూడా ఒకవేళ ఆనందముగా ఉండేందుకు బదులుగా తికమకపడితే, మరియు ఆ సమయములోనే అంతిమ క్షణము వస్తే అంతిమతి సో గతి ఎలా ఉంటుంది? అందుకే సదా ఎవర్రెడీ అని వింటూ ఉంటారు కదా. ఎవర్రెడీ అంటే ఏమిటి? ప్రతి క్షణము అలా ఎవర్రెడీగా ఉన్నారా? ఏ సమస్యా కూడా సంపూర్ణంగా అవ్వటంలో విఘ్నరూపంగా అవ్వకూడదు. అంతిమము మంచిగా ఉంటే భవిష్య ఆది కూడా మంచిగా ఉంటుంది. కనుక ఎవర్రెడీ పాఠాన్ని అందుకే చదివించటం జరుగుతుంది. కొద్ది సమయమే అలా తికమకపడతాము కదా అని అనుకోకండి ఎందుకంటే కొద్ది సమయమైనా, ఒక్క క్షణమైనా మోసగించగలదు. ఎక్కువ సమయము ఇలా ఉండదు, కేవలం రెండు-నాలుగు నిమిషాలు అలా గడుస్తాయి అని అనుకుంటారు కానీ ఒక్క క్షణమైనా మోసగించేదిగా ఉండచ్చు అన్నప్పుడు ఇక ఒక నిమిషము గురించి ఆలోచించనే ఆలోచించవద్దు ఎందుకంటే మీరు అందరికంటే విలువైన ఆత్మలు, అమూల్యమైనవారు. అమూల్యమైన ఆత్మలను ప్రపంచములోని వారితో పోల్చలేము. ప్రపంచములోనివారు మిమ్మల్నందరినీ సాధారణమైనవారిగా భావిస్తారు. కానీ మీరు సాధారణమైనవారు కారు, విశేష ఆత్మలు. విశేష ఆత్మల అర్థమేమిటంటే – వారు ఏ కర్మ చేసినా, ఏ సంకల్పము చేసినా, ఏ మాట మాట్లాడినా వారి ప్రతి మాట మరియు ప్రతి సంకల్పము విశేషమైనదిగా ఉండాలి, సాధారణముగా ఉండకూడదు. సమయము కూడా సాధారణ రీతిలో గడవదు. ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము విశేషమైనదిగా ఉండాలి. ఇటువంటివారిని విశేష ఆత్మలు అని అంటారు. మరి విశేషంగా చేస్తూ-చేస్తూ సాధారణంగా అయిపోవటంలేదు కదా అన్నదానిని చెక్ చేసుకోండి. కొందరు ఎలా ఆలోచిస్తారంటే – మేమైతే ఎటువంటి పొరపాటు చెయ్యలేదు, ఎటువంటి పాప కర్మ చెయ్యలేదు, వాణి ద్వారా కూడా ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు అని, కానీ భవిష్యత్తును మరియు వర్తమానాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకున్నారా? చెడును చెయ్యలేదు కానీ మంచిని చేసారా? చెడు చెయ్యలేదు అని కేవలము దీనినే చెక్ చేసుకోకండి, కానీ చెడుకు బదులుగా చాలా మంచి పని చేసారా లేక సాధారణమైనది జరిగిందా? కనుక ఇటువంటి సాధారణత ఉండకూడదు, శ్రేష్ఠత ఉండాలి. నష్టము జరగలేదు కానీ జమ అయ్యిందా? ఎందుకంటే జమ చేసుకునే సమయము ఇప్పుడే ఉంది కదా. ఇప్పుడు జమ చేసుకున్నదానిని భవిష్యత్తులో అనేక జన్మలు తింటుంటారు. మరి ఎంతగా జమ అవుతుందో అంతగానే తింటారు కదా. ఒకవేళ తక్కువ జమ చేసుకుంటే తక్కువగా తినాల్సి ఉంటుంది అనగా ప్రారబ్ధము తక్కువైపోతుంది. మరి శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని పొందాలనే లక్ష్యము ఉందా లేక సాధారణమైనదైనా ఫరవాలేదా? స్వర్గములోకైతే వెళ్ళనే వెళ్తాము, దుఃఖమైతే కలగదు, సాధారణమైన ప్రారబ్ధమైనా అభ్యంతరమేముంది… ? అభ్యంతరము ఉందా లేక ఫరవాలేదా? కనుక చెక్ చేసుకోండి – ప్రతి క్షణము, ప్రతి సంకల్పము విశేషమైనదిగా ఉండాలి. ఏ విధంగా అర్ధకల్పము దేహ-భానములో ఉండే ఆ అభ్యాసము నేచురల్ గానే, అనుకోకుండానే పని చేస్తుంటుంది కదా. దేహ-అభిమానములోకి రావటము నేచురల్ అయ్యింది కదా. అలా దేహీ-అభిమానీ స్థితి నేచురల్ మరియు నేచర్ గా అవ్వాలి. ఏదైతే నేచర్ (స్వభావము) గా అవుతుందో అది స్వతహాగానే తన పని చేస్తుంది, ఆలోచించాల్సిన అవసరము ఉండదు, కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరము ఉండదు, ఏమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరము ఉండదు కానీ స్వతహాగానే జరిగిపోతుంది. కనుక విశేషతతో కూడుకున్న అటువంటి సంస్కారాలు నేచర్ గా అవ్వాలి మరియు ఇది ప్రతి ఒక్కరి మనసు నుండి రావాలి. అంతేకానీ, నా నేచర్ ఇది, నా నేచర్ ఇది కాదు అని అనకూడదు. ప్రతి ఒక్కరి నోటి నుండి, మనసు నుండి ఇదే మాట వెలువడాలి – విశేష ఆత్మల విశేషతతో కూడినదే నా నేచర్. మరి ఇటువంటివారేనా లేక శ్రమ చేయాల్సి వస్తుందా? ఏదైతే నేచర్ గా ఉంటుందో అందులో శ్రమ ఉండదు. ఎవరి నేచర్ అయినా రమణీకమైనదైతే స్వతహాగానే రమణీకత నడుస్తుంటుంది కదా. నేనేం చేసాను అన్నది వాళ్ళకు తెలియను కూడా తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా నేనేం చెయ్యను, ఇది నా నేచర్ అని అంటారు. కనుక విశేషత కూడా అటువంటి నేచర్ గా అవ్వాలి. మీ నేచర్ ఏమిటి? అని ఎవరైనా అడిగితే అప్పుడు అందరి మనసుల నుండి – మా నేచర్ విశేషతతో కూడినది అని వెలువడాలి. సాధారణ కర్మలు చెయ్యటము సమాప్తమైపోయింది ఎందుకంటే మరజీవులుగా అయ్యారు కదా. కావున సాధారణత నుండి చనిపోయారు, విశేషతలో జీవిస్తున్నారు అనగా కొత్త జన్మ జరిగింది. సాధారణత గత జన్మ నేచర్, ఇప్పటిది కాదు ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు. మరి కొత్త జన్మ యొక్క నేచర్ విశేషతతో కూడినది, ఇటువంటి అనుభవము ఉండాలి. మరి ఇప్పుడేం చేస్తారు? సాధారణతను సమాప్తి చేయడము. సంకల్పములో కూడా సాధారణత ఉండకూడదు.

మాతలు ఆనందంలో ఉంటున్నారా? మిమ్మల్ని తికమకపెట్టేందుకు ఎవరు ఎంత ప్రయత్నము చేసినా కానీ మీరు ఆనందములో ఉండండి. తికమకపెట్టేవాళ్ళు తికమకపడతారు కానీ మీరు మాత్రం తికమకపడకండి ఎందుకంటే అజ్ఞానుల పని తికమకపెట్టటము మరియు జ్ఞానుల పని ఆనందములో ఉండటము. కనుక వాళ్ళు వాళ్ళ పని చేస్తారు, మీరు మీ పని చెయ్యండి. సదా ఆనందాన్ని అనుభవము చెయ్యండి, అప్పుడే నషాతో చెప్పగలరు. అలా ఉన్నప్పుడే చెప్పగలరు కదా? అలా లేనివారు చెప్పలేరు కూడా. మేము తికమకపడేవారము కాము అని ఛాలెంజ్ చేయవచ్చు ఎందుకంటే విశేష ఆత్మలు. ఏం గుర్తు పెట్టుకుంటారు? ఆనందములో ఉండే విశేష ఆత్మలు. ఇటువంటి ధైర్యము కలవారే కదా. ధైర్యము కలవారికి స్వతహాగానే సహాయము లభిస్తుంది. అచ్ఛా!

వరదానము:-

సహజ విధి ద్వారా విధాతను తమవారిగా చేసుకునే సర్వ భాగ్యాల ఖజానాలతో సంపన్న భవ

భాగ్యవిధాతను తమవారిగా చేసుకునే విధి ఏమిటంటే – తండ్రి మరియు దాదా, ఇరువురితో సంబంధము ఉండాలి. చాలామంది పిల్లలు ఏమంటారంటే – మాకైతే డైరెక్ట్ గా నిరాకారునితో కనెక్షన్ ఉంది, సాకారుడు కూడా నిరాకారుడి నుండే పొందారు, మేము కూడా వారి నుండే అంతా పొందుతాము అని. కానీ ఇది ఖండితమైన తాళంచెవి వంటిది, బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా అవ్వకుండా భాగ్యము తయారవ్వదు. సాకారుడు లేకుండా సర్వ భాగ్యాల భండారముకు యజమానిగా అవ్వలేరు ఎందుకంటే భాగ్యవిధాత భాగ్యాన్ని బ్రహ్మా ద్వారానే పంచుతారు. కావున విధిని తెలుసుకుని సర్వ భాగ్యపు ఖజానాలతో నిండుగా అవ్వండి.

స్లోగన్:-

స్వయముతో, సేవతో, సర్వులతో సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ను తీసుకోండి, అప్పుడు సిద్ధి స్వరూపులుగా అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top