TELUGU MURLI 11-02-2023

11-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

-:—————————————————————————————————–:-

‘‘మధురమైన పిల్లలూ – సదా స్వయాన్ని రాజఋషులుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే మీ అన్ని రోజులు సు11-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనంఖముగా గడుస్తాయి, మాయ ఇబ్బందుల నుండి రక్షింపబడి ఉంటారు’’

ప్రశ్న:-

ఏ అవకాశము మీకు ఇప్పుడు ఉంది, అది మళ్ళీ లభించదు?

జవాబు:-

ఇప్పుడు కొద్ది సమయమే ఉంది, ఇందులోనే పురుషార్థం చేసి చదువు ద్వారా ఉన్నత పదవిని పొందగలరు, మళ్ళీ ఈ అవకాశం లభించదు. ఈ జీవితము చాలా దుర్లభమైనది, అందుకే త్వరగా మరణిస్తే విముక్తులైపోతాము అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఎవరినైతే మాయ విసిగిస్తుందో లేక ఎవరికైతే కర్మభోగం ఉంటుందో, ఈ ఆలోచన వారికే వస్తుంది. మీరైతే తండ్రి స్మృతితో మాయాజీతులుగా అవ్వాలి.

పాట:-

ఓర్పు వహించు మానవా…(ధీరజ్ ధర్ మనువా…)

ఓంశాంతి.

పిల్లలు పాటను విన్నారు. ఎవరు అన్నారు మరియు ఎవరు విన్నారు? అనంతమైన తండ్రి అన్నారు మరియు అన్ని సెంటర్లలోని పిల్లలు విన్నారు. చూడండి, తండ్రి బుద్ధియోగము పిల్లలందరి వైపుకు వెళ్తుంది. అన్ని సెంటర్లలోని బ్రాహ్మణ కుల భూషణులు లేక స్వదర్శన చక్రధారులు లేక రాజఋషులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లలకు, మేము రాజఋషులము అన్నది కూడా స్మృతిలో ఉండాలి. రాజ్యం కోసం పురుషార్థము చేస్తున్నారు, ఆ రాజ్యములో చూడండి, సదా సుఖములోనే రోజులు గడుస్తాయి. కలియుగములోనైతే సుఖపు రోజులు గడవనే గడవవు. రాజఋషులుగా ఉన్న మీవి కూడా సుఖపు రోజులు ఇక్కడ గడవాలి. ఒకవేళ పిల్లలు స్వయాన్ని రాజఋషులుగా భావిస్తేనే మరియు నిశ్చయము దృఢముగా, నిశ్చలముగా, స్థిరముగా ఉన్నట్లయితేనే సుఖంలో రోజులు గడుస్తాయి. లేదంటే ఘడియ-ఘడియ మర్చిపోవడము వలన మాయ యొక్క ఇబ్బందులు చాలా వస్తాయి. పిల్లలకు తెలుసు, మనం తండ్రి నుండి రాజయోగం నేర్చుకుని సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము లేక నరుని నుండి నారాయణునిగా అవుతున్నాము. అది కూడా పరమపిత పరమాత్మ తప్ప ఎవ్వరూ తయారుచేయలేరు. పరమపిత పరమాత్మ అని అంటున్నప్పుడు ఏ సాకారుని వైపుకు లేక ఆకారుని వైపుకు బుద్ధి వెళ్ళదు, నిరాకార తండ్రినే స్మృతి చేస్తారు. పిల్లలూ, ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని తండ్రి ఓదార్పునిస్తారు. ఈ కలియుగం అనే నరకము మారి స్వర్గముగా అవుతుంది. స్వర్గం యొక్క స్థాపన, నరకం యొక్క వినాశనము అని అంటూ ఉంటారు. భగవంతుడు స్వయంగా కూర్చుని రాజయోగం నేర్పిస్తారు. మనుష్యులెవరైనా నరకానికి చెందినవారు కావచ్చు, స్వర్గానికి చెందినవారు కావచ్చు, రాజయోగము నేర్పించలేరు. పిల్లలకు తెలుసు, బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులైన మనమే స్వదర్శన చక్రధారులము. ఆత్మలైన మనకు సృష్టి చక్రం యొక్క జ్ఞానము ఉంది. దేవతలకు దీని గురించి తెలియదు. స్వదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడికి లేక విష్ణువుకు ఎందుకు చూపించారు? ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు సంపూర్ణంగా అవ్వలేదు. పైకి-కిందకు అవుతూ ఉంటారు. ఈ స్వదర్శన చక్రం ఫైనల్ కు గుర్తు. ఈ రోజు మీరు స్వదర్శన చక్రాన్ని తిప్పుతారు, రేపు మాయతో ఓటమి పొంది పడిపోతే, అప్పుడు మీకు అలంకారాన్ని ఎలా చూపించగలరు? స్వదర్శన చక్రమైతే స్థిరంగా ఉండాలి, అందుకే విష్ణువుకు చూపిస్తారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. విష్ణువు మందిరము ఎక్కడ ఉన్నా కూడా లేక స్వదర్శన చక్రధారి మందిరము ఏది ఉన్నా కూడా, అక్కడకు వెళ్ళి మీరు అర్థం చేయించవచ్చు. శ్రీకృష్ణునికి కూడా స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు. రాధే-కృష్ణుల యుగళ్ చిత్రంలో స్వదర్శన చక్రాన్ని చూపించరు. స్వదర్శన చక్రధారులైతే బ్రాహ్మణ కుల భూషణులైన మీరే, మిమ్మల్నే పరమపిత పరమాత్మ స్వదర్శన చక్రధారులుగా లేక త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. ఎప్పుడైతే వీరు దేవతలుగా అవుతారో, అప్పుడు వీరిని త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథ్ అని అనలేరు ఎందుకంటే ఇప్పుడైతే మనం స్వర్గం యొక్క మెట్లు పైకి ఎక్కుతాము. సత్యయుగం నుండైతే మెట్లు కిందకు దిగవలసి ఉంటుంది. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. అక్కడ ఈ విషయం తెలిసినట్లయితే మీరు రాజ్యం చేయలేరు, ఇదే చింత పట్టుకొని ఉంటుంది.

కావున ఇప్పుడు తండ్రి పిల్లలకు, గాభరా పడకండి అని ఓదార్పునిస్తారు. మాయపై విజయం పొందాలి. మాయా తుఫానులు తప్పకుండా వస్తాయి, విఘ్నాలు కలుగుతాయి. దీనికి చికిత్స – యోగములో ఉండడము. మాయ యోగాన్ని కూడా తెంచేస్తుంది. కానీ పురుషార్థం చేసి యోగంలో ఉండాలి. ఎవరైతే యోగంలో ఉంటారో వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఎంతగా ఆయుష్షు పెరుగుతుందో అంతగా అంతిమం వరకు తండ్రితో యోగము జోడించి వారసత్వము తీసుకుంటారు. యోగముతో ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోవాలి, అందుకే తండ్రి అంటారు – యోగీ భవ. నన్ను నిరంతరము స్మృతి చేయండి. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా స్వర్గంలో ప్రారబ్ధాన్ని పొందుతారు. కావున తండ్రి అంటారు, పిల్లలూ, యోగములో ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇంకా కొద్ది సమయమే ఉంది. వినాశనం త్వరగా జరిగితే మేము స్వర్గములోకి వెళ్ళిపోతామని మీరు ఇలా అనరు ఎందుకంటే ఈ జీవితం చాలా దుర్లభమైనది. ఇప్పుడు శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త శరీరము తీసుకొని చదువును చదవగలరని కాదు. బాల్యావస్థలో ఉన్నప్పుడే వినాశనం ఆరంభమైపోతుంది. యువకులుగా కూడా అవ్వలేరు ఎందుకంటే ఇందులో చిన్నా-పెద్దా అందరి వినాశనం జరగనున్నది. త్వరగా మరణించాలి అని ఎవరంటారు అంటే, ఎవరినైతే మాయ బాగా విసిగిస్తుందో లేక ఎవరికైతే ఏదైనా కర్మభోగం ఉంటుందో, దాని నుండి ముక్తులవ్వాలనుకుంటారు. కానీ ఈ అవకాశం మళ్ళీ లభించదు, అందుకే పురుషార్థములో నిమగ్నమై ఉండండి. ఇకపోతే, ఎప్పుడైతే సమయం వస్తుందో, అప్పుడు కోరుకోకపోయినా కూడా అందరూ వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే తండ్రి అందరిని ఆత్మిక యాత్రలో తీసుకొని వెళ్తారు. అంతేకానీ, కేవలం 10-20 లక్షల మందినే తీసుకువెళ్తారని కాదు. ఏ విధంగా కుంభమేళాలకు 10-15 లక్షల మంది వెళ్తారు. ఇదైతే ఆత్మ, పరమాత్మల మేళా. తండ్రి స్వయం పండాగా అయి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, వారి వెనుక లెక్కలేనన్ని ఆత్మలు వెళ్తాయి. కానీ అందరూ త్వరగా వెళ్ళిపోతారని కూడా కాదు. ప్రళయం జరిగినట్లయితే ఇక ఈ భారత ఖండమే ఉండదు. కానీ ఈ భారత్ అవినాశీ ఖండము. ఇక్కడ చాలామంది ఉండిపోతారు. మళ్ళీ సత్యయుగములో ఒకే సూర్యవంశీ రాజధాని స్థాపన జరుగుతుంది. కలియుగం వినాశనమై సత్యయుగ స్థాపన జరగడంలో మధ్యలో ఈ కొద్ది సమయమే లభిస్తుంది, ఇందులో కొద్దిమందే మిగులుతారు, మళ్ళీ కొత్తగా తమ రాజధానిని తయారుచేసుకుంటారు. ఇకపోతే, పురుషార్థం కోసం ఈ కొద్ది సమయమే ఉంది, దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. ఇతర సంగమాలను కళ్యాణకారి అని అనరు ఎందుకంటే కిందకు దిగుతూ ఉంటారు. ఇప్పుడు సంపూర్ణ సుఖము నుండి సంపూర్ణ దుఃఖములోకి వచ్చారు. ఈ జ్ఞానము ఇంకెవ్వరి బుద్ధిలోను లేదు. ఇంతకుముందు మనకు కూడా ఏమీ తెలియదు, అంధ విశ్వాసంతో అందరినీ పూజించేవారము. ఇప్పుడైతే అన్ని రకాల శ్రీమతము లభిస్తుంది. ఈ వ్యాపారాన్ని కూడా ఎవరో అరుదైన వ్యాపారి మాత్రమే చేస్తారు. ఏ విధంగానైతే కళను నేర్చుకోవలసి ఉంటుందో, అలాగే ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే కళ. దీనిపై ధ్యాసనుంచాలి.

తండ్రి రోజూ అమృతవేళ వచ్చి చదివిస్తారు అప్పుడు ఆ సమయంలో తండ్రి ఎదురుగా అన్ని సెంటర్లలోని పిల్లలు ఉంటారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీ అందరినీ స్మృతి చేస్తాను, ఇందులో మాయ నాకు ఏ విఘ్నము కలిగించదు. పిల్లలైన మీరు నన్ను ఘడియ-ఘడియ మర్చిపోతారు, మాయ మీకు విఘ్నాలు కలిగిస్తుంది. కొంతమంది రాస్తారు, బాబా, పిల్లలైన మమ్మల్ని మర్చిపోకండి. కానీ నేనైతే ఎప్పుడూ మర్చిపోను, నేనైతే అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి, నేను రోజు ప్రియస్మృతులను ఇస్తాను, పిల్లలకు ఖజానాను పంపిస్తాను. అందరికీ మేలుకొల్పుతూ ఉంటాను, తండ్రి శ్రీమతముపై అనంతమైన వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేయండి. ఇందులో పొరపాట్లు చేయకండి లేక సాకులు చెప్పకండి. కర్మబంధనము ఉంది అని అంటారు. ఇదైతే మీది, తండ్రి ఏం చేస్తారు. తండ్రి అంటారు, యోగములో ఉన్నట్లయితే కర్మబంధనము తొలగిపోతూ ఉంటుంది, మీ ద్వారా వికర్మలు జరగవు. అర్ధకల్పము మీరు వికర్మల నుండి విముక్తులవుతారు. మరి ఉన్నత పదవిని పొందేందుకు సేవను కూడా చేయాలి. మమ్మా, బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. కొందరు పిల్లలు కూడా మంచి సేవ చేస్తారు. మీ లక్ష్యము, ఉద్దేశ్యము ఏమిటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఈ కార్డును చేతికి ఇవ్వండి. దానితో అందరూ, వీరు ఏ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు, వీరైతే పెద్ద వ్యాపారులు అని అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరి నాడిని చూడాలి. చక్రము గురించి అర్థం చేయించడము అన్నింటికన్నా మంచిది. ఎటువంటి వ్యక్తి అయినా సరే, చక్రాన్ని చూసి, తప్పకుండా ఇది కలియుగము, ఇప్పుడు సత్యయుగము రానున్నదని అర్థం చేసుకుంటారు. క్రిస్టియన్లకు కూడా అర్థం చేయించవచ్చు, ఇది నరకము, ఇప్పుడు స్వర్గ స్థాపన జరగనున్నది. దానిని తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ యే చేస్తారు. కానీ మనుష్యుల బుద్ధి ఎలా అయ్యిందంటే వారు తమను తాము నరకవాసులుగా కూడా భావించరు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు కూడా, మరి తప్పకుండా మనం నరకములో ఉన్నామని భావించాలి. ఇప్పుడు ఇది కలియుగము, పునర్జన్మలు కూడా తప్పకుండా కలియుగములోనే తీసుకుంటారు. స్వర్గం ఎక్కడ ఉంది? బాబా అయితే స్మశానములోకి వెళ్ళి అర్థం చేయించండి అని అంటారు. కానీ పిల్లలు త్వరగా అలసిపోతారు. వారికి అర్థం చేయించాలి, ఇప్పుడైతే కలియుగము, ఒకవేళ స్వర్గములో పునర్జన్మను తీసుకోవాలనుకుంటే వచ్చి అర్థం చేసుకోండి. మేము కూడా పురుషార్థం చేస్తున్నాము, తర్వాత నరకము ఉండనే ఉండదు. స్వర్గములోకి వెళ్ళాలా? అక్కడ విషం లభించదు. దానిని ఇక్కడే విడిచిపెట్టవలసి ఉంటుంది. ఎలా విడిచిపెట్టాలి? బాబా యుక్తులను తెలియజేస్తారు.

నేపాల్ లో విజయ అష్టమి రోజున చిన్న-పెద్దా అందరూ వేటాడుతారు. మీరు కూడా అందరికీ అర్థం చేయించాలి, ప్రతి ఇంటిలోనూ శివుడు మరియు లక్ష్మీ-నారాయణుల చిత్రాలను తప్పకుండా ఉంచాలి. నౌకర్లకు, మేస్త్రీలకు కూడా అర్థం చేయించాలి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. తండ్రి స్వర్గము కోసం అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. యోగము జోడించడం ద్వారా తండ్రి సాక్షాత్కారము కూడా చేయించగలరు. తండ్రి ఉన్నదే కళ్యాణకారి కావున పిల్లలు కూడా అటువంటి కళ్యాణకారులుగా అవ్వాలి. పేదవారే తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. షావుకార్లు కష్టం మీద చేసుకుంటారు. ప్రఖ్యాతి గాంచిన సన్యాసులు ఎవరైతే ఉంటారో, వారు అంతిమములో వస్తారు. ఇప్పుడు చాలావరకు పేదవారు, సాధారణమైనవారే జ్ఞానం తీసుకుంటారు. తండ్రి కూడా సాధారణ తనువులో వస్తారు, పేదవారిలో రారు. ఒకవేళ వీరు కూడా పేదవారైనట్లయితే ఏమీ చేయలేరు. పేదవారు ఇంతమందిని ఎలా సంభాళించగలరు! కావున చూడండి, ఎటువంటి యుక్తిని ఉంచారు. సాధారణముగానూ ఉండాలి, బలిహారము కూడా అవ్వాలి మరియు ఇంతమంది పాలన కూడా జరుగుతూ ఉండాలి. వీరితోపాటు ఇంకా చాలామంది బలిహారమై వారసులుగా అయ్యారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే కళను ఏదైతే నేర్పించారో, అందులోనే నిమగ్నమవ్వాలి.

2. శ్రీమతముపై నడవడంలో పొరపాటు చేయకూడదు లేక సాకులు చెప్పకూడదు. కర్మ బంధనాల నుండి విముక్తులయ్యేందుకు స్మృతిలో ఉండాలి.

వరదానము:-

శ్రేష్ఠ కర్మధారిగా అయి ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునే పదమాపదమ భాగ్యశాలీ భవ

ఎవరివి ఎంతగా శ్రేష్ఠ కర్మలు ఉంటాయో, వారి అదృష్టము యొక్క గీత అంతగా పెద్దగా మరియు స్పష్టంగా ఉంటుంది. అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు సాధనమే శ్రేష్ఠ కర్మలు కావున శ్రేష్ఠ కర్మధారిగా అవ్వండి మరియు పదమాపదమ భాగ్యశాలీగా అయ్యే అదృష్టాన్ని ప్రాప్తి చేసుకోండి. కానీ శ్రేష్ఠ కర్మలకు ఆధారము శ్రేష్ఠ స్మృతి. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రి స్మృతిలో ఉండడము ద్వారానే శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి, అందుకే ఎంత కావాలనుకుంటే అంత పెద్ద భాగ్యపు రేఖను గీసుకోండి. ఈ ఒక్క జన్మలో అనేక జన్మల అదృష్టము తయారవ్వగలదు.

స్లోగన్:-

తమ సంతుష్టత యొక్క పర్సనాలిటీ ద్వారా అనేకులను సంతుష్ట పరచడమే సంతుష్టమణిగా అవ్వడము.

‘‘మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు’’

ఓ గీతా భగవంతుడా, మీ మాటను నిలబెట్టుకోవడానికి రండి అని మనుష్యులు ఈ పాటను గానము చేస్తారు. ఇప్పుడు స్వయం ఆ గీతా భగవంతుడు తమ కల్పక్రితపు మాటను పాలన చేసేందుకు వచ్చారు మరియు అంటారు, ఓ పిల్లలూ, భారత్ లో ఎప్పుడైతే అతి ధర్మ గ్లాని జరుగుతుందో, అప్పుడు నేను ఈ సమయములో నా ప్రతిజ్ఞను పాలన చేసేందుకు (ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు) తప్పకుండా వస్తాను, ఇప్పుడు నేను రావడము అంటే అర్థము – నేను ప్రతి యుగములో వస్తానని కాదు. యుగాలన్నింటిలోనైతే ఎటువంటి ధర్మ గ్లాని జరగదు, కలియుగములోనే ధర్మ గ్లాని జరుగుతుంది, కనుక పరమాత్మ కలియుగ సమయములోనే వస్తారని తెలుసుకోండి. కలియుగము మళ్ళీ కల్ప కల్పము వస్తుందంటే నేను కల్ప కల్పము వస్తానని భావించండి. కల్పములో మళ్ళీ నాలుగు యుగాలు ఉంటాయి, దీనినే కల్పము అని అంటారు. అర్ధకల్పము సత్య, త్రేతాయుగాలలో సతోగుణంగా, సతోప్రధానంగా ఉంటారు, అక్కడకు పరమాత్మ వచ్చే అవసరమేమీ ఉండదు. మళ్ళీ మూడవ యుగమైన ద్వాపరము నుండైతే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి, ఆ సమయములో కూడా అతి ధర్మ గ్లాని ఉండదు. దీని ద్వారా ఏమి నిరూపించబడుతుందంటే, పరమాత్మ మూడు యుగాలలోనైతే రానే రారు, ఇక మిగిలింది కలియుగము, దీని అంతిమములో అతి ధర్మ గ్లాని జరుగుతుంది. ఆ సమయములో పరమాత్మ వచ్చి అధర్మాన్ని వినాశనము చేసి సత్య ధర్మ స్థాపన చేస్తారు. ఒకవేళ పరమాత్మ ద్వాపరములో వచ్చి ఉన్నట్లయితే ద్వాపరము తర్వాత ఇప్పుడు సత్యయుగము రావాలి, మరి కలియుగము ఎందుకు వచ్చింది? పరమాత్మ ఘోర కలియుగాన్ని స్థాపన చేసారు అనైతే అనరు, ఇప్పుడు ఇదైతే జరగజాలదు, అందుకే పరమాత్మ అంటారు – నేను ఒక్కడినే మరియు ఒక్కసారే వచ్చి అధర్మాన్ని వినాశనము చేసి, కలియుగాన్ని వినాశనము చేసి సత్యయుగ స్థాపన చేస్తాను, కనుక నేను వచ్చే సమయము సంగమయుగము.

2. మనుష్యాత్మల అదృష్టాన్ని తయారుచేసేవారు ఎవరు మరియు అదృష్టాన్ని పాడు చేసేవారు ఎవరు? అదృష్టాన్ని తయారుచేసేవారు, పాడు చేసేవారు ఆ పరమాత్మేనని మనం ఇలా అనము. ఇకపోతే, తప్పకుండా అదృష్టాన్ని తయారుచేసేవారు పరమాత్మ మరియు అదృష్టాన్ని పాడు చేసుకునేవారు స్వయం మనిషి. ఇప్పుడు ఈ అదృష్టము ఎలా తయారవుతుంది? తర్వాత ఎలా పడిపోయారు? ఈ విషయముపై అర్థం చేయించడము జరుగుతుంది. మనుష్యులు ఎప్పుడైతే తమను తాము తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో, అప్పుడు పాడైపోయిన ఆ అదృష్టాన్ని మళ్ళీ తయారుచేసుకుంటారు. ఇప్పుడు మనం పాడైపోయిన అదృష్టము అని అంటున్నప్పుడు ఏదో సమయములో మన అదృష్టము తయారై ఉండేది, అది మళ్ళీ పాడైపోయింది అని దీనితో ఋజువు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పాడైన ఆ అదృష్టాన్నే పరమాత్మ స్వయంగా వచ్చి తయారుచేస్తారు. ఇప్పుడు ఎవరైనా పరమాత్మ స్వయం నిరాకారుడు, వారు అదృష్టాన్ని ఎలా తయారుచేస్తారు అని అంటారు. నిరాకార పరమాత్మ ఎలా తమ సాకార బ్రహ్మా తనువు ద్వారా, అవినాశీ జ్ఞానము ద్వారా మన పాడైపోయిన అదృష్టాన్ని తయారుచేస్తారు అన్న ఈ విషయంపై అర్థం చేయించడము జరుగుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వడము పరమాత్మ పని, ఇకపోతే, మనుష్యాత్మలు ఒకరి అదృష్టాన్ని ఒకరు మేల్కొలపలేరు. అదృష్టాన్ని మేల్కొలిపేవారు ఒక్క పరమాత్మ మాత్రమే, అందుకే వారికి స్థిరమైన స్మృతిచిహ్న మందిరాలు ఉన్నాయి. అచ్ఛా. ఓం శాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top