TELUGU MURLI 07-02-2023

07-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి”బాప్ దాదా” మధువనం

‘‘మధురవైున పిల్లలూ – ఈ సమయంలో మీకు నిరాకారీ మతము లభిస్తుంది, గీతా శాస్త్రము నిరాకారీ మతానికి సంబంధించిన శాస్త్రమే కానీ సాకార మతానికి సంబంధించినది కాదు, ఈ విషయాన్ని నిరూపించండి’’

ప్రశ్న:-

ఏ గుహ్యవైున విషయాన్ని చాలా యుక్తిగా ఫస్ట్ క్లాస్ పిల్లలే అర్థం చేయించగలరు?

జవాబు:-

ఈ బ్రహ్మాయే శ్రీకృష్ణుడిగా అవుతారు, ప్రజాపిత అని బ్రహ్మానే అంటారు, శ్రీకృష్ణుడిని అనరు. నిరాకార భగవంతుడు బ్రహ్మా ముఖము ద్వారా బ్రాహ్మణులను రచించారు. శ్రీకృష్ణుడైతే చిన్న బాలుడు. గీతా భగవంతుడు నిరాకార పరమాత్మ. శ్రీకృష్ణుని ఆత్మ పురుషార్థము చేసి ఈ ప్రారబ్ధాన్ని పొందింది. ఇది చాలా గుహ్యవైున విషయము – దీనిని ఫస్ట్ క్లాస్ పిల్లలే యుక్తిగా అర్థం చేయించగలరు. మీ శాయశక్తులా ప్రయత్నించి ఈ విషయాన్ని నిరూపించండి, అప్పుడు సేవా సఫలత లభిస్తుంది.

పాట:-

నా మనస్సు అనే ద్వారము వద్దకు ఎవరు వచ్చారు… (కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే…)

ఓం శాంతి.

ఈ కనులు తెలుసుకోలేవు అని పిల్లలు పాటలో విన్నారు. ఎవరిని తెలుసుకోలేవు? భగవంతుడిని. ఈ కనులు శ్రీకృష్ణుడిని అయితే తెలుసుకోగలవు. కానీ భగవంతుడిని తెలుసుకోలేవు. ఆత్మనే పరమాత్మను తెలుసుకోగలదు. మన పరమపిత పరమాత్మ నిరాకారుడని ఆత్మ అంగీకరిస్తుంది. నిరాకారుడైన కారణంగా, ఈ కనుల ద్వారా చూడలేని కారణంగా స్మృతి అంతగా నిలువదు. ఈ విధంగా నిరాకారుడైన తండ్రే నిరాకారులైన పిల్లలకు (ఆత్మలకు) చెప్తున్నారు. మీకు నిరాకార మతము లభిస్తుంది. గీతా శాస్త్రము నిరాకారీ మతానికి సంబంధించినది. సాకారీ మతానికి సంబంధించినది కాదు. గీత ధర్మశాస్త్రము కదా. ఇస్లాములు మొదలైనవారికి కూడా ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇబ్రహీం ఉచ్ఛరించారు, బుద్ధుడు, క్రైస్టు ఉచ్ఛరించారు. వారి చిత్రాలైతే ఉన్నాయి. సర్వశాస్త్రమయి శిరోమణి అయిన గీతలో మనుష్యులు శ్రీకృష్ణుని చిత్రమును చూపించేసారు. కానీ అది పొరపాటని తండ్రి అర్థం చేయిస్తారు. గీతను నేనే ఉచ్ఛరించాను, నేనే రాజయోగాన్ని నేర్పించాను మరియు స్వర్గ స్థాపనను చేసాను. నేను నిరాకారుడినైన పరమపిత పరమాత్మను. నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని, మనుష్య సృష్టికి బీజరూపుడను. నన్నే వృక్షపతి అని అంటారు. శ్రీకృష్ణుడిని వృక్షపతి అని అనరు. పరమపిత పరమాత్మయే మనుష్య సృష్టికి బీజరూపుడు, రచయిత. శ్రీకృష్ణుడిని రచయిత అని అనరు. వారు కేవలం దైవీ గుణాలు కల మనిషి మాత్రమే. భగవంతుడు ఒక్కరే. శ్రీకృష్ణుడిని ఏమీ అందరికీ పరమాత్మ అని అనలేరు. తండ్రి అంటారు – నేను 5 వేల సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమయుగములో వస్తాను. నేను మొత్తం సృష్టి అంతటికీ తండ్రిని, నన్నే గాడ్ ఫాదర్ అని అంటారు. శ్రీకృష్ణుని పేరును ఉపయోగించడం వలన పరమపిత పరమాత్మను తెలుసుకోలేరు. ఇది చాలా పెద్ద పొరపాటు చేసేసారు. గీత ద్వారా ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మాన్ని నేనే స్థాపన చేసాను. నన్ను శివుడు లేక రుద్రుడు, భగవంతుడు అని అంటారు. ఇంకే సూక్ష్మ దేవతను లేక మనిషిని భగవంతుడు అని అనరు. లక్ష్మీ-నారాయణులు మొదలైనవారెవరినీ పరమాత్మ అని అనరు. పరమాత్మ ఒక్కరే అని అంటారు. భగవానువాచ కూడా ఉంది, మరి తప్పకుండా భగవంతుడు వచ్చి ఉంటారు మరియు వారు వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. తండ్రి అంటారు – కల్పపూర్వము కూడా నేను పిల్లలైన మీకు ఇది చెప్పాను. శ్రీ కృష్ణుడు ఎప్పుడూ పిల్లలూ, పిల్లలూ అని అనలేరు. పరమపిత పరమాత్మనే అందరినీ పిల్లలు అని అంటారు. కల్ప పూర్వము కూడా నేను పిల్లలైన మీకు దేహీ అభిమానులుగా అవ్వమని, నిరాకారుడినైన నన్ను మీ తండ్రిగా, భగవంతునిగా భావించమని చెప్పాను. సాకార తండ్రి ప్రజాపిత బ్రహ్మా అవుతారు, ఎందుకంటే బ్రహ్మా ద్వారానే భగవంతుడు బ్రాహ్మణ, బ్రాహ్మణీలను రచించారు. శ్రీకృష్ణుడు ప్రజాపిత కారు. నేను బ్రహ్మా ముఖము ద్వారా బ్రాహ్మణ, బ్రాహ్మణీలను రచిస్తాను అని భగవంతుడు అంటారు. ఈ బ్రహ్మాయే శ్రీకృష్ణునిగా అవుతారు, ఇది ఎంత గుహ్యవైున విషయము. ఈ విషయాన్ని అర్థం చేయించడంలో చాలా యుక్తి కావాలి. ఫస్ట్క్లాస్ పిల్లలే దీనిని అర్థం చేయించగలరు. తండ్రి అంటారు – చాలా మంచి కుమారులు మరియు కుమారీలు ఉండాలి, వారు గీతా భగవంతుడు నిరాకార పరమాత్మయేనని నిరూపించాలి. ఎవరైతే గీతను రచించారో వారే పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు మరియు స్వర్గమును రచించారు. తప్పకుండా ఉన్నతోన్నతుడైన తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తారు. శ్రీకృష్ణుడైతే ప్రారబ్ధాన్ని పొందారు. ఆ ప్రారబ్ధాన్ని ఇచ్చేవారు పరమపిత పరమాత్మ. శ్రీకృష్ణుడు వారి పుత్రుడు. శ్రీకృష్ణుని ఆత్మ పురుషార్ధం చేసి ప్రారబ్ధాన్ని పొందింది. పురుషార్థము చేయించేవారిని తొలగించి పురుషార్థము చేసి ప్రారబ్ధమును పొందినవారి పేరును పెట్టి గీతను ఖండితం చేసేసారు.

సేవను పెంచేందుకు పిల్లలు శాయశక్తులా కృషి చేయాలి. గీతను ఎవరు ఉచ్ఛరించారు? గీత ద్వారా ఏ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఈ విషయం ద్వారా మీరు మంచి రీతిలో విజయాన్ని పొందగలరు. పరమపిత పరమాత్మ ద్వారా స్వర్గానికి యజమానులుగా అవుతారే కానీ శ్రీకృష్ణుని ద్వారా కాదు, కావున ఈ విషయంలో శ్రమించాలి. అన్ని శాస్త్రాలూ గీత యొక్క పిల్లలే. కావున పిల్లల ద్వారా ఎప్పుడూ వారసత్వము లభించజాలదు. వారసత్వమును తప్పకుండా తండ్రే ఇస్తారు. చిన్నాన్నలు, మామయ్యలు, గురువులు మొదలైనవారెవరి నుండి వారసత్వము లభించజాలదు. అనంతవైున తండ్రి నుండే అనంతవైున వారసత్వము లభిస్తుంది. ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా వ్రాయాలంటే దీని ద్వారా తప్పకుండా గీత ఖండితం చేయబడిందని అర్థం చేసుకోగలగాలి. గీతను అవమానపరిచారు కావుననే భారత్ నిరుపేదగా, గవ్వతుల్యముగా అయిపోయింది. ఈ విధంగా వ్రాయండి. భారత్ ను స్వర్గముగా తయారుచేసేది ఎవరు? స్వర్గము ఎక్కడ ఉంది? కలియుగం తర్వాత సత్యయుగము వచ్చినట్లయితే మరి దాని స్థాపన తప్పకుండా సంగమములోనే జరగాలి. శివ భగవానువాచ – నేను కల్పకల్పము సంగమములో పావన ప్రపంచాన్ని తయారుచేయడానికి వస్తాను. ఏ విధంగా నిరూపించాలంటే – శివ పరమాత్మయే అందరినీ దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు, శ్రీకృష్ణుడు కాదు అని అందరూ అర్థం చేసుకోగలగాలి. ఎవరైతే గీతా భగవానుడిని అర్థం చేసుకుంటారో వారే వచ్చి పుష్పాలను అర్పిస్తారు. అందరూ పుష్పాలను అర్పించరు, ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే పుష్పాలుగా అయి బలిహారమవుతారు. బాబాకు ఎవరైనా పుష్పాన్ని ఇస్తే, నాకు ఇటువంటి పుష్పాలు (పిల్లలు) కావాలి అని బాబా అంటారు. నాపై ముళ్ళు బలిహారవైుతే నేను వాటిని పుష్పాలుగా తయారుచేస్తాను. బబుల్ నాథ్ అన్న పేరు కూడా నాదే. తుమ్మ ముళ్ళను పుష్పాలుగా తయారుచేసేవారు అని నన్నే అంటారు. శ్రీకృష్ణుడైతే స్వయము పుష్పము వలె ఉంటారు. అది అల్లా పుష్పాల తోట, ఇది రావణుని అడవి. మళ్ళీ దీనిని దైవీ పుష్పాల తోటగా బాబానే తయారుచేస్తారు. మీరే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణుల యొక్క దైవీ రాజ్యవంశము అని అంటారు. బ్రాహ్మణ కులపు వంశము అని అనరు. ఇది బ్రాహ్మణ కులము. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా ప్రజలను రచించారు, కావుననే ఇతడిని ప్రజాపిత అని అంటారు. శివబాబాను లేక శ్రీకృష్ణుడిని ప్రజాపిత అని అనరు. 16108 రాణులు ఉండేవారని శ్రీకృష్ణుడికి కళంకమును మోపారు. ప్రజాపిత బ్రహ్మాయే ఇంతమంది పిల్లలకు జన్మనిచ్చారు.

జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మయే. ధర్మరాజు పాపాలకు దండన వేస్తారు. ప్రెసిడెంట్ కు కూడా అందరికన్నా పెద్ద జడ్జ్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. రాజులచేత ఎప్పుడూ ప్రమాణం చేయించడం జరుగదు, ఎందుకంటే వారిని భగవంతుడే రాజుగా తయారుచేస్తారు. అది అల్పకాలం కొరకు. కానీ, ఇక్కడ బాబా 21 జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు, అక్కడ ప్రమాణం చేయించే విషయమే ఉండదు. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షమే కానీ అడవి వృక్షమేమీ కాదు. పరమపిత పరమాత్మను వృక్షపతి అని అంటారు. శ్రీకృష్ణుడు ఈ వృక్షం యొక్క రహస్యమును తెలియజేయలేరు. వృక్షపతియే దీనిని అర్థం చేయించగలరు. నరుని నుండి నారాయణునిగా తండ్రే తయారుచేస్తారు కానీ శ్రీకృష్ణుడు కాదు. ముఖ్య ధర్మశాస్త్రాలు నాలుగు, మిగిలినవన్నీ దంత కథలే. మొట్టమొదట ఏ ధర్మం స్థాపించబడింది మరియు ఎవరి ద్వారా స్థాపించబడింది? స్వర్గములో దేవీ దేవతా ధర్మమే ఉండేది, మరి తప్పకుండా దానిని తండ్రే రచిస్తారు కదా. తండ్రి పాత ప్రపంచము నుండి విముక్తులను చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖం చాలా ఉంది, త్రాహి-త్రాహి అని అంటూ ఉంటారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. సాధారణవైున వ్యక్తులు ఎవరూ వారసత్వాన్ని ఇవ్వలేరు. పిల్లలకు సర్వ ప్రాప్తులను చేయించేది తండ్రి మాత్రమే. అనంతవైున తండ్రే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ-ఈ విధముగా ఆకర్షణ కలిగించాలి. ఏ విధంగానైతే వేటాడేవారు ఎవరినైనా వేటకు తీసుకువెళ్తే మొత్తం అన్ని ఏర్పాట్లను చేసి, వేటను ముందుకు తీసుకువచ్చి కేవలం వారిచేత వేటాడింపజేస్తారు. ఇక్కడ మాతల ద్వారా చేయించాలి. కావున వేటను మాతల ముందుకు తీసుకురావాలి అని తండ్రి అంటారు. మాతలు ఎంతోమంది ఉన్నారు. ఒక్కరి పేరు ప్రఖ్యాతమవుతుంది. మీరు శక్తి సైన్యము. శక్తి వంశము అని ఎప్పుడూ అనరు. శక్తి సైన్యములో ముఖ్యవైునవారు జగదాంబ, కాళి, సరస్వతి. చండిక మొదలైన తప్పుడు పేర్లు కూడా ఎన్నో పెట్టేసారు. కావున పిల్లలైన మీరు ఇటువంటి విషయాలపై స్పష్టం చేయాలి. ఉన్నతోన్నతుడైన భగవంతుడు, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు. సరస్వతి ప్రజాపిత బ్రహ్మాకు కుమార్తె. ఆమెను జ్ఞానదేవి అని అంటారు. మరి తప్పకుండా వారి పిల్లలను కూడా జ్ఞానదేవి అనే అంటారు కదా. అంతిమంలో మీ విజయమే జరగనున్నది. కొందరు గీతకన్నా ఎక్కువగా వేదాలకు విలువనిస్తారు. అయినా గీత ప్రచారమే ఎక్కువగా ఉంది. నేను సంగమయుగములోనే వస్తాను అని బాబా అంటారు. శ్రీకృష్ణుని చిత్రము సత్యయుగానికి చెందినదే. మళ్ళీ 84 జన్మలలో రూపము మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పరమపిత పరమాత్మ వచ్చి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే జ్ఞానీ ఆత్మలుగా అవ్వగలుగుతారు. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, వారి ద్వారా మీరు జ్ఞానీ ఆత్మలుగా అవుతారు. మిగిలినవారంతా భక్త ఆత్మలే. నాకు జ్ఞానీ ఆత్మలంటేనే ఇష్టము అని బాబా అంటారు. మహిమ అంతా గీతకే ఉంది. ధ్యానములోకి వెళ్ళేవారి కన్నా జ్ఞానులే శ్రేష్ఠవైునవారు. ధ్యానము అని ట్రాన్స్ ను అంటారు, కానీ ఇక్కడైతే బాబాతో యోగాన్ని జోడించాలి. ధ్యానములోకి వెళ్ళడం వలన లాభమేమీ లేదు. తండ్రి అంటారు – నేను రాజయోగాన్ని నేర్పించాను, శ్రీకృష్ణుడికి ఈ ప్రారబ్ధాన్ని నేనే ఇచ్చాను. అతడు తప్పకుండా తన పూర్వజన్మలో పురుషార్థము చేసి ఉంటారు. మొత్తం సూర్యవంశ రాజధాని అంతా నా ద్వారానే ప్రారబ్ధాన్ని పొందింది. దిల్వాడా మందిరం యొక్క తారతమ్యాన్ని కూడా ఏ విధంగా వ్రాయాలంటే అది చదవగానే మనుష్యులకు వెంటనే బాణం తగలాలి. అనంతవైున తండ్రి జ్ఞానసాగరుడని, వారు చాలా మధురవైునవారని, మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని ఫార్మ్ ను కూడా నింపించాలి. ఆ సద్గురువు లేకుండా అంతా ఘోర అంధకారమే. ఇటువంటి తండ్రి మహిమను చేయడం ద్వారా బుద్ధిలో ప్రేమ కలుగుతుంది. తండ్రి సమ్ముఖంలోకి వచ్చి జన్మనిచ్చినప్పుడే ప్రేమ కలుగుతుంది కదా. మీకు జన్మనిచ్చారు, కావుననే ప్రేమ కలిగింది. తండ్రి అని అనడంతోనే స్వర్గం గుర్తుకొస్తుంది. బాబా స్వర్గ స్థాపన చేస్తారు, మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము, మీరు నమ్మండి లేక నమ్మకపోండి. అనంతవైున తండ్రి అయితే అందరికీ తండ్రి, వారి ద్వారా తప్పకుండా స్వర్గ వారసత్వం లభిస్తుంది. తండ్రి ఉన్నదే కొత్త ప్రపంచానికి రచయిత, కావున వారు తప్పకుండా కొత్త ప్రపంచపు వారసత్వమునే ఇస్తారు. అచ్ఛా!

మధురాతి మధురవైున సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి ప్రియవైునవారిగా అయ్యేందుకు బుద్ధిలో జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞానీ ఆత్మలుగా అవ్వాలి. తండ్రితో యోగాన్ని జోడించాలే కానీ ధ్యానముపై ఆశను పెట్టుకోకూడదు.

2. మాతలను ముందు ఉంచి వారి పేరును ప్రఖ్యాతి చేయాలి. అథారిటీతో గీతా భగవానుడి గురించి నిరూపించాలి. శాయశక్తులా ప్రయత్నించి సేవను పెంచాలి.

వరదానము:-

శ్రేష్ఠ జీవితం యొక్క స్మృతి ద్వారా విశాల స్టేజ్ పైన విశేష పాత్రను అభినయించే హీరో పాత్రధారి భవ

బ్రహ్మా తండ్రి పిల్లలైన మీకు దివ్య జన్మను ఇస్తూనే – పవిత్ర భవ, యోగీ భవ అనే వరదానాన్ని ఇచ్చారు. జన్మ లభించినప్పటి నుండే పెద్ద తల్లి రూపంలో పవిత్రతతో కూడిన ప్రేమ ద్వారా పాలన చేసారు. సదా సంతోషాలతో కూడిన ఊయలలో ఊపారు, సర్వ గుణమూర్తులుగా, జ్ఞానమూర్తులుగా, సుఖ-శాంత స్వరూపులుగా అయ్యే జోలపాటను ప్రతిరోజు పాడారు, అటువంటి మాతాపితల శ్రేష్ఠ పిల్లలైన మీరు బ్రహ్మాకుమార-కుమారీలు. ఈ జీవితం యొక్క మహత్వాన్ని స్మృతిలో పెట్టుకుని విశ్వమనే విశాల స్టేజ్ పై విశేషమైన పాత్రను, హీరో పాత్రను అభినయించండి.

స్లోగన్:-

బిందువు అనే పదం యొక్క మహత్వాన్ని తెలుసుకొని బిందువుగా అయ్యి బిందువైన తండ్రిని స్మృతి చేయడమే యోగిగా అవ్వడము.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

మొట్టమొదటగా ఇది తెలుసుకోవటము తప్పనిసరి – మన అసలైన లక్ష్యము ఏమిటి? దానిని కూడా బుద్ధిలో మంచి రీతిలో ధారణ చెయ్యాలి, అప్పుడే సంపూర్ణ రీతిలో ఆ లక్ష్యములో ఉపస్థితులవ్వగలరు. మన అసలైన లక్ష్యము – నేను ఆత్మను, ఆ పరమాత్మ సంతానమును. నిజానికి కర్మాతీతుడను. మళ్ళీ తమను తాము మర్చిపోవటము వలన కర్మబంధనములోకి వచ్చేసారు, ఇప్పుడు మళ్ళీ అది గుర్తు రావటం వలన, ఈశ్వరీయ యోగములో ఉండటం ద్వారా చేసిన వికర్మలను వినాశనము చేసుకుంటున్నారు. కనుక నేను ఆత్మను, పరమాత్మ సంతానమును అన్నది మన లక్ష్యమయ్యింది. ఇకపోతే ఎవరైనా తమను తాము దేవతలుగా భావించుకుని ఆ లక్ష్యములో స్థితులైనట్లయితే ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అది లభించజాలదు. అంతేకాక మీ వికర్మలు వినాశనమవ్వవు. ఇప్పుడు మనకు ఈ పూర్తి జ్ఞానం ఉంది, ఆత్మనైన నేను పరమాత్మ సంతానమును, కర్మాతీతమై భవిష్యత్తులో వెళ్ళి జీవన్ముక్త దేవీ దేవతా పదవిని పొందుతాను – అన్న ఈ లక్ష్యములో ఉండటం ద్వారా ఆ శక్తి లభిస్తుంది. మాకు సుఖము, శాంతి, పవిత్రత కావాలి అని ఇప్పుడు మనుష్యులు ఏదైతే కోరుకుంటారో, వారు కూడా ఎప్పుడైతే పూర్ణ యోగులుగా అవుతారో, అప్పుడే ఆ ప్రాప్తి ఉంటుంది. దేవతా పదవైతే మీ భవిష్య ప్రారబ్ధము, మన పురుషార్థము వేరు మరియు మన ప్రారబ్ధము కూడా వేరు. కనుక ఈ లక్ష్యము కూడా వేరు. నేను పవిత్ర ఆత్మను, చివరకు పరమాత్మగా అవుతాను అన్న ఈ లక్ష్యములో ఉండకూడదు. అలా కాదు. కానీ మనము పరమాత్మతో యోగాన్ని జోడించి పవిత్ర ఆత్మగా అవ్వాలి, ఇకపోతే ఆత్మ ఏమీ పరమాత్మగా అవ్వదు.

2. ఈ అవినాశీ ఈశ్వరీయ జ్ఞానానికి అనేక పేర్లు పెట్టబడి ఉన్నాయి. కొందరు ఈ జ్ఞానాన్ని అమృతమని కూడా అంటారు, కొందరు జ్ఞానాన్ని అంజనము అని అంటారు. జ్ఞాన అంజనాన్ని గురువు ఇచ్చారని గురు నానక్ అన్నారు. కొందరు జ్ఞాన వర్షమని కూడా అన్నారు ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారానే మొత్తము సృష్టి పచ్చగా అవుతుంది. తమోప్రధానమైన మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు సతోగుణ మనుష్యులుగా అవుతారు మరియు జ్ఞాన అంజనము ద్వారా అంధకారము తొలగిపోతుంది. ఈ జ్ఞానాన్నే మళ్ళీ అమృతమని కూడా అంటారు, దీని ద్వారా మనుష్యులు ఎవరైతే 5 వికారాల అగ్నిలో కాలుతున్నారో, వారు శీతలంగా అవుతారు. చూడండి, కామేషు, క్రోధేషు అని గీతలో పరమాత్మ స్పష్టంగా చెప్పారు, అందులో కూడా మొట్టమొదటగా ముఖ్యమైనది కామము, 5 వికారాలలో ఇది ముఖ్యమైన బీజము. బీజము ఉండటం ద్వారా దాని నుండి క్రోధము, లోభము, మోహము, అహంకారము మొదలైన వికారాల వృక్షము పెరుగుతుంది, దాని వలన మనుష్యుల బుద్ధి భ్రష్టమైపోతుంది. ఇప్పుడు అదే బుద్ధిలో జ్ఞాన ధారణ జరుగుతుంది, ఎప్పుడైతే జ్ఞాన ధారణ పూర్తిగా బుద్ధిలో జరుగుతుందో అప్పుడే వికారాల బీజము నశించిపోతుంది. వికారాలను వశము చేసుకోవటము చాలా కఠినమైన పని అని సన్యాసులు భావిస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానమైతే సన్యాసులలో లేనే లేదు. మరి అటువంటి శిక్షణను ఇచ్చేది ఎలా? మర్యాదలలో ఉండండి అని మాత్రమే అంటారు. కానీ అసలైన మర్యాద ఏది? ఆ మర్యాద అయితే ఈరోజుల్లో తొలగిపోయింది, ఎక్కడ ఆ సత్య-త్రేతాయుగ దేవీ దేవతల మర్యాదలు. వారు గృహస్థములో ఉంటూ నిర్వికారీ ప్రవృత్తిలో ఎలా ఉండేవారు. ఇప్పుడు ఆ సత్యమైన మర్యాదలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజుల్లో వ్యతిరేకమైన, వికారీ మర్యాదలను అనుసరిస్తున్నారు, మర్యాదలలో నడవండి అని ఒకరికొకరు ఏదో అలా ఊరికే నేర్పిస్తుంటారు. మనుష్యుల మొట్టమొదటి బాధ్యత ఏమిటి అన్నదైతే ఎవరికీ తెలియదు. మర్యాదలలో ఉండండి అని ఇంతమాత్రమే ప్రచారము చేస్తారు, కానీ మనుష్యుల మొట్టమొదటి మర్యాద ఏమిటి అన్నది కూడా వారికి తెలియదు. మనుష్యుల మొట్టమొదటి మర్యాద – నిర్వికారిగా అవ్వటము. మీరు ఈ మర్యాదలో ఉంటారా అని ఒకవేళ ఎవరినైనా అడిగితే ఈరోజుల్లో ఈ కలియుగ సృష్టిలో నిర్వికారిగా అయ్యే ధైర్యము లేదు అని అంటారు. మర్యాదలలో ఉండండి, నిర్వికారిగా అవ్వండి అని ఇప్పుడు ఊరికే నోటితో అన్నంత మాత్రాన ఎవ్వరూ నిర్వికారులుగా అవ్వజాలరు. నిర్వికారులుగా అయ్యేందుకు మొదట ఈ జ్ఞాన ఖడ్గంతో ఈ 5 వికారాల బీజాన్ని సమాప్తం చేయాలి. అప్పుడే వికర్మలు భస్మమవ్వగలవు, అచ్ఛా – ఓం శాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top