TELUGU MURLI 06-2-2023

06-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

‘‘మధురవైున పిల్లలూ – బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు చాలా ఉన్నతవైున యాత్రలో వెళ్తున్నారు, అందుకే ఇప్పుడు మీకు డబుల్ ఇంజన్ లభించింది, ఇద్దరు అనంతవైున తండ్రులు ఉన్నారు, అలాగే ఇద్దరు తల్లులు కూడా ఉన్నారు’’

ప్రశ్న:-

సంగమయుగములో పిల్లలైన మీరు మీపై ఏ టైటిల్ ను పెట్టించుకోలేరు?

జవాబు:-

హిజ్ హోలీనెస్ లేక హర్ హోలీనెస్ అన్న టైటిల్ ను బి.కె.లైన మీరు మీపై పెట్టించుకోలేరు లేదా వ్రాసుకోలేరు ఎందుకంటే మీ ఆత్మ అయితే పవిత్రముగా అవుతుంది కానీ శరీరాలైతే తమోప్రధాన తత్వాలతోనే తయారై ఉన్నాయి. ఈ మహిమను ఇప్పుడు మీరు తీసుకోకూడదు. ఇప్పుడు మీరు పురుషార్థులు.

పాట:-

ఇది దీపము మరియు తుఫానుల కథ… (యే కహానీ హై దీవే ఔర్ తూఫాన్ కీ…)

ఓం శాంతి.

అనంతవైున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇదైతే పిల్లలు అర్థం చేసుకున్నారు – అనంతవైున తండ్రులు కూడా ఇద్దరు ఉన్నారు, అలాగే తల్లులు కూడా తప్పకుండా ఇద్దరు ఉంటారు. ఒకరు జగదాంబ, మరొకరు ఈ బ్రహ్మా కూడా తల్లి అయినట్లు. ఇరువురూ కూర్చొని అర్థం చేయిస్తారు కావున మీకు డబుల్ ఇంజన్ లభించినట్లు. పర్వతాలపైకి రైలు వెళ్ళేటప్పుడు డబుల్ ఇంజన్ పెడతారు కదా. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు కూడా ఉన్నతవైున యాత్రలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఘోర అంధకారముందని మీకు తెలుసు. ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో అప్పుడు ఎన్నో హాహాకారాలు జరుగుతాయి. ప్రపంచం మారినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే రాజ్యం బదిలీ అవుతుందో అప్పుడు కూడా యుద్ధాలు, మారణహోమాలు జరుగుతాయి. ఇప్పుడు కొత్త రాజధాని స్థాపన అవుతుందని పిల్లలకు తెలుసు. ఘోర అంధకారము నుండి మళ్ళీ అత్యంత ప్రకాశము ఏర్పడుతోంది. మీకు ఈ మొత్తం చక్రమంతటి చరిత్ర మరియు భౌగోళికముల గురించి తెలుసు కావున మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. స్కూల్లో చదివించే మాతలు మరియు కన్యలు ఎంతోమంది ఉన్నారు, వారు కూడా కూర్చుని పిల్లలకు అనంతవైున చరిత్ర మరియు భౌగోళికముల గురించి అర్థం చేయించినట్లయితే దానికి ప్రభుత్వమేమీ కోపగించుకోదు. వారి పెద్దవారికి కూడా అర్థం చేయించాలి, అప్పుడు ఇంకా సంతోషిస్తారు. వారికి ఏమని అర్థం చేయించాలంటే, ఎప్పటివరకైతే ఈ అనంతవైున చరిత్ర మరియు భౌగోళికముల గురించి అర్థం చేసుకోరో అప్పటివరకు పిల్లల కళ్యాణము జరుగదు, ప్రపంచములో జయ-జయ ధ్వనులు మ్రోగవు. పిల్లలకు సేవ చేయమని సూచనను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా టీచర్లు ఉంటే, వారు తమ కాలేజీలో ఒకవేళ ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికముల గురించి కూర్చుని అర్థం చేయించినట్లయితే పిల్లలు త్రికాలదర్శులుగా అవ్వగలరు. మరియు త్రికాలదర్శులుగా అవ్వడం ద్వారా చక్రవర్తులుగా కూడా అవ్వగలరు. ఏ విధంగా తండ్రి మిమ్మల్ని త్రికాలదర్శులుగా, స్వదర్శన చక్రధారులుగా తయారుచేసారో, అలా మీరు ఇతరులను మీ సమానముగా తయారుచేయాలి. ఇతరులకు ఏమని అర్థం చేయించాలంటే – ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారుతోంది, తమోప్రధాన ప్రపంచము మారి సతోప్రధానముగా అవుతోంది. సతోప్రధానముగా తయారుచేసేవారు ఒక్క పరమపిత పరమాత్మయే, వారు సహజ రాజయోగము మరియు స్వదర్శన చక్రం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. చక్రాన్ని అర్థం చేయించడం చాలా సహజము. ఒకవేళ ఈ చక్రాన్ని ఎదురుగా ఉంచినట్లయితే మనుష్యులు వచ్చి అర్థం చేసుకోగలుగుతారు – సత్యయుగములో ఎవరెవరు రాజ్యం చేసేవారు, మళ్ళీ ద్వాపరం నుండి అనేక ధర్మాల వృద్ధి ఎలా జరుగుతుంది అని. ఈ విధంగా మంచి రీతిలో అర్థం చేయించినట్లయితే బుద్ధి యొక్క కపాటాలు తప్పకుండా తెరుచుకుంటాయి. ఈ చక్రమును ముందుంచి మీరు మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. టాపిక్ ను కూడా పెట్టవచ్చు – మీరు వచ్చినట్లయితే మేము మీకు త్రికాలదర్శులుగా అయ్యే దారిని తెలియజేస్తాము, దాని ద్వారా మీరు రాజులకే రాజులుగా అవ్వగలరు. బ్రాహ్మణులైన మీకే ఈ చక్రము గురించి తెలుసు అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. ఎవరైతే ఈ చక్రమును బుద్ధిలో తిప్పుతూ ఉంటారో వారే ఆ విధముగా తయారవుతారు. తండ్రి జ్ఞానసాగరుడు, వారు కూర్చొని పిల్లలకు సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇతర మనుష్యులకు ఏమీ తెలియదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడంలో జ్ఞానం యొక్క విషయమే లేదు. ఈశ్వరుడిని తెలుసుకునేందుకు కూడా పురుషార్థమేమీ చేయలేరు, అప్పుడిక భక్తి కూడా కొనసాగజాలదు. ఏదైతే చెప్తారో దానినేమీ అర్థం చేసుకోరు. కచ్చాగా ఉండేవారు తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వరో కూడా అర్థం చేయించలేరు. ఎవరో ఒకరు అన్నారు, ఇక అంతే అందరూ అంగీకరిస్తారు. ఎలాగైతే ఎవరో ఒకరు ఆదిదేవ్ ని మహావీర్ అని అన్నారు, ఇక ఆ పేరు నడుస్తూ వచ్చింది. ఎవరు ఏ పేరును తెలివితక్కువతనముతో పెడితే అది అలా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – మనుష్యులై ఉండి మీరు డ్రామా రచయిత మరియు రచనను గురించి తెలుసుకోకపోతే, దేవతల పూజను చేస్తూ వారి చరిత్రను గురించి తెలుసుకోకపోతే దానిని అంధ విశ్వాసము అనే అంటారు. ఇంతమంది దేవీ-దేవతలు రాజ్యం చేసి వెళ్ళారు, అంటే వారు తప్పకుండా వివేకవంతులుగా ఉండేవారు, అందుకే పూజ్యులుగా అయ్యారు. ఇక బ్రహ్మా ముఖవంశావళులైన మీరు ఈ జ్ఞానాన్ని విని వివేకవంతులుగా అవుతారు. మిగిలిన ప్రపంచమంతటినీ రావణుడు జైల్లో పెట్టేసాడు. ఇది రావణుని జైలు, ఇందులో అందరూ శోక వాటికలో పడి ఉన్నారు. శాంతి ఎలా ఏర్పడగలదు? అని కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. అంటే మరి తప్పకుండా అశాంతి, దుఃఖము ఉన్నాయి అనగా అందరూ శోక వాటికలో కూర్చున్నారు. ఇప్పుడు శోక వాటిక నుండి అశోక వాటికలోకి ఒక్కసారిగా ఎవరూ వెళ్ళలేరు. ఈ సమయంలో ఎవరూ శాంతి లేక సుఖ వాటికలో లేరు. అశోక వాటిక అని సత్యయుగమును అంటారు. ఇదైతే సంగమయుగము, మిమ్మల్ని సంపూర్ణ పవిత్రులు అని అనలేరు. హిజ్ హోలీనెస్ అని బి.కే.లు ఎవరూ తమను తాము పిలిపించుకోలేరు లేదా రాయించుకోలేరు. హిజ్ హోలీనెస్ లేక హర్ హోలీనెస్ సత్యయుగములో ఉంటారు. వారు కలియుగములోకి ఎలా వస్తారు? ఇక్కడ ఆత్మ పవిత్రముగా అవుతున్నా కానీ శరీరము కూడా పవిత్రవైునది కావాలి కదా, అప్పుడే హిజ్ హోలీనెస్ గా పిలువబడగలరు కావున ఆ మహిమను తీసుకోకూడదు. ఇప్పుడు మీరు పురుషార్థులు. తండ్రి అంటారు – శ్రీ శ్రీ లేక హిజ్ హోలీనెస్ అని సన్యాసులను కూడా అనడానికి లేదు. ఆత్మ పవిత్రముగా అవుతుంది కానీ శరీరము పవిత్రంగా ఎక్కడ ఉంది? కావున వారూ అసంపూర్ణులే అయ్యారు కదా. ఈ పతిత ప్రపంచములో హిజ్ హోలీనెస్ గా లేక హర్ హోలీనెస్ గా ఎవరూ ఉండజాలరు. ఆత్మ మరియు పరమాత్మ ఎల్లప్పుడూ శుద్ధముగానే ఉంటారు అని వారు భావిస్తారు, కానీ శరీరము కూడా పవిత్రవైునది కావాలి కదా. అవును, లక్ష్మీ-నారాయణులను ఆ విధంగా అనవచ్చు, ఎందుకంటే వారి శరీరము కూడా సతోప్రధాన తత్వాలతో తయారవుతుంది. ఇక్కడ తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి. ఈ సమయంలో ఎవరినీ సంపూర్ణ పావనులు అని అనరు. ఈ విధంగా పవిత్రముగా అయితే చిన్న పిల్లలు కూడా ఉంటారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు.

తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – మీరు ఎంత వివేకవంతులుగా అవుతున్నారు. మీకు చక్రం గురించి కూడా పూర్తి-పూర్తి జ్ఞానం ఉంది. పరమపిత పరమాత్మ ఈ చైతన్య వృక్షానికి బీజము వంటివారు, వారికి మొత్తం వృక్షమంతటి జ్ఞానం ఉంది, వారే మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ సృష్టి చక్రపు జ్ఞానంతో మీరు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. ఏమని అర్థం చేయించాలంటే – మీరు పరంధామం నుండి వచ్చి ఇక్కడ వస్త్రాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తున్నారు. ఇప్పుడు అంతిమంలో అందరూ తిరిగి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి తమ తమ పాత్రలను అభినయించాలి. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే పురుషార్థం చేస్తారో వారు రాజ్య కుటుంబంలో లేక ధనవంతుల వద్ద జన్మ తీసుకుంటారు. అందరూ నంబరువారు పదవిని పొందుతారు, నంబరువారుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఎక్కడైతే విజయం పొందుతారో అక్కడ జన్మ జరుగుతుంది అని కూడా చూపించబడింది. ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేయించడం జరుగదు, మున్ముందు ప్రకాశము లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే శరీరము వదులుతారో వారికి తప్పకుండా మంచి ఇంట్లో జన్మ లభిస్తుంది. ఏ పిల్లలైతే బాగా పురుషార్థం చేస్తారో వారికి సంతోషము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి నషా ఉంటుంది. మీరు తప్ప మిగిలినవారందరూ అంధకారములో ఉన్నారు. గంగా స్నానాలు మొదలైనవి చేయడం ద్వారా ఎవరి పాపాలు కడగబడవు. యోగాగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి. ఈ రావణుని జైలు నుండి విడిపించేవారు ఒక్క తండ్రే, కావుననే పతితపావనా అని గానం చేస్తారు. కానీ, స్వయాన్ని పాపాత్ములుగా భావించరు. కల్ప పూర్వము కూడా వారి ఉద్ధరణ కన్యలైన మీ ద్వారానే చేయించాను అని తండ్రి చెబుతున్నారు. ఇది గీతలో కూడా రాయబడి ఉంది, కానీ ఎవరూ అర్థం చేసుకోరు. ఈ పతిత ప్రపంచములో పావనులు ఎవరూ లేరని మీరు అర్థం చేయించవచ్చు. కానీ, అర్థం చేయించడంలో కూడా చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు ప్రపంచము మారుతోందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఈశ్వరుని సంతానముగా అయ్యారు. ఈ బ్రాహ్మణ కులము అన్నింటికన్నా ఉన్నతవైునది. మీకు స్వదర్శన చక్రపు జ్ఞానం ఉంది, మళ్ళీ ఎప్పుడైతే విష్ణు కులములోకి వెళ్తారో అప్పుడు మీకు ఈ జ్ఞానం ఉండదు, ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది, కావుననే మీకు స్వదర్శన చక్రధారులు అన్న పేరును పెట్టడం జరిగింది. ఈ గుహ్యవైున విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందరూ ఈశ్వరుని సంతానమే అని నామమాత్రంగా అంటారు కానీ ప్రత్యక్షముగా ఇప్పుడు మీరే అలా అయ్యారు, అచ్ఛా!

మధురాతి మధురవైున పిల్లలందరికీ ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్. పిల్లలను స్మృతి చేయడం తండ్రి బాధ్యత మరియు తండ్రిని స్మృతి చేయడం పిల్లల బాధ్యత. కానీ, పిల్లలు అంతగా స్మృతి చేయడం లేదు, స్మృతి చేసినట్లయితే అది అహో సౌభాగ్యము, అచ్ఛా – మధురాతి మధురవైున ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాసు: 8-4-68

ఈ ఈశ్వరీయ మిషన్ నడుస్తూ ఉంది. ఎవరైతే మన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారో, వారే వస్తారు. ఎలాగైతే వారి మిషన్ క్రిస్టియన్లుగా తయారుచెయ్యడము. ఎవరైతే క్రిస్టియన్లుగా అవుతారో, వారికి క్రిస్టియన్ వంశంలో సుఖం లభిస్తుంది, వేతనము మంచిగా లభిస్తుంది, అందుకే చాలామంది క్రిస్టియన్లుగా అయ్యారు. భారతవాసులు అంత వేతనము మొదలైనవి ఇవ్వలేరు. ఇక్కడ అవినీతి చాలా ఉంది. మధ్యలో లంచం తీసుకోకపోతే ఉద్యోగం నుండే తీసేస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఏమి చెయ్యాలి అని పిల్లలు తండ్రిని అడుగుతారు. యుక్తితో వ్యవహరించండి ఆ తర్వాత శుభ కార్యంలో వెచ్చించండి అని అంటారు.

పతితులమైన మమ్మల్ని పావనంగా చెయ్యండి, ముక్తులను చెయ్యండి, ఇంటికి తీసుకువెళ్ళండి అని ఇక్కడ అందరూ తండ్రితో మొర పెట్టుకుంటారు. తండ్రి తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తారు కదా. ఇంటికి వెళ్ళడానికే ఇంత భక్తి మొదలైనవి చేస్తారు. కానీ ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడే తీసుకువెళ్తారు. భగవంతుడు ఒక్కరే. అంతేకానీ అందరిలోకి భగవంతుడు వచ్చి మాట్లాడుతారు అని కాదు. వారు రావడము అన్నది సంగమములోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇటువంటి-ఇటువంటి మాటలు నమ్మరు, ఒకప్పుడు నమ్మేవారు. ఇప్పుడు మీరు భక్తి చేయడం లేదు. మీరు అంటారు మేము మొదట్లో పూజ చేసేవారము, ఇప్పుడు తండ్రి వచ్చారు మమ్మల్ని పూజ్య దేవతలుగా తయారుచేయడానికి. మీరు సిక్కులకు కూడా అర్థం చేయించండి. మనుషుల నుండి దేవతలుగా… అన్న గాయనము కూడా ఉంది. దేవతల మహిమ ఉంది కదా. దేవతలు ఉండేది సత్యయుగంలో. ఇప్పుడు ఇది కలియుగము. తండ్రి కూడా సంగమయుగంలోనే పురుషోత్తములుగా అయ్యే శిక్షణ ఇస్తున్నారు. దేవతలు అందరికంటే ఉత్తములు, అందుకే ఇంతగా పూజిస్తారు. ఎవరి పూజ అయితే చేస్తున్నారో వారు తప్పకుండా ఎప్పుడో ఉండి ఉండాలి, ఇప్పుడు లేరు. ఈ రాజధాని గడిచిపోయింది అని భావించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. మనం విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అని ఎవరికైనా తెలుసా ఏమిటి! మేము చదువుకుని ఇలా అవుతున్నాము అని మీకు తెలుసు. కావున చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. తండ్రిని చాలా ప్రేమగా గుర్తు చెయ్యాలి. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నప్పుడు ఎందుకు గుర్తు చెయ్యకూడదు. మళ్ళీ దైవీ గుణాలు కూడా కావాలి.

రాత్రి క్లాసు: 9-4-68

విశ్వంలో శాంతి ఎలా నెలకొనాలి అనే అంశంపైనే ఈరోజుల్లో కాన్ఫరెన్సులు చేస్తున్నారు. వారికి చెప్పండి, చూడండి, సత్యయుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, అద్వైత ధర్మం ఉండేది. చప్పట్లు మోగడానికి రెండవ ధర్మమే ఉండేది కాదు. ఉన్నదే రామరాజ్యం, అప్పుడే విశ్వములో శాంతి ఉండేది. విశ్వంలో శాంతి కావాలి అని మీరు కోరుకుంటున్నారు. అదైతే సత్యయుగంలో ఉండేది. తర్వాత అనేక ధర్మాలు వచ్చిన కారణంగా అశాంతి వచ్చింది. కానీ ఎవరైనా అర్థం చేసుకునే అంత వరకు మనం తల కొట్టుకోవాల్సి వస్తుంది. మున్ముందు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది, అప్పుడు సన్యాసులు మొదలైనవారి చెవులు తెరుచుకుంటాయి. ఇదైతే పిల్లలైన మీ కోసమే, మీ రాజధాని స్థాపన జరుగుతోంది. మీకు ఇదే నషా ఉంది. మ్యూజియమ్ యొక్క ఆడంబరాన్ని చూసి చాలామంది వస్తారు. లోపలకి వచ్చి చాలా ఆశ్చర్యపోతారు. కొత్త కొత్త చిత్రాలపై కొత్త కొత్త వివరణను వింటారు.

యోగము ముక్తి-జీవన్ముక్తి కోసమని పిల్లలకు తెలుసు. దీనిని మనుష్యులు ఎవ్వరూ నేర్పించలేరు. ఇది కూడా రాయాలి – ఒక్క పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ ముక్తి-జీవన్ముక్తి కోసం యోగాన్ని నేర్పించలేరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. మనుష్యులు చదివే విధంగా ఇది స్పష్టంగా వ్రాయాలి. సన్యాసులు ఏమి నేర్పింస్తుండవచ్చు. యోగము-యోగము అని అంటూ ఉంటారు, కానీ వాస్తవానికి యోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. మహిమ ఉన్నదే ఒక్కరిది. విశ్వంలో శాంతిని స్థాపన చెయ్యడము మరియు ముక్తి-జీవన్ముక్తిని ఇవ్వడము ఒక్క తండ్రి పనే. ఇలా-ఇలా విచార సాగర మంథనము చేసి పాయింట్లు అర్థం చేయించాలి. మనం చెప్పే విషయం విని మనుష్యులకు నిజమే అనిపించేలా పాయింట్లు వ్రాయాలి. ఈ ప్రపంచమైతే మారాల్సిందే. ఇది మృత్యులోకము, కొత్త లోకాన్ని అమరలోకము అని అంటారు. అమరలోకములో మనుష్యులు ఎలా అమరులుగా ఉంటారు, ఇది కూడా అద్భుతము కదా. అక్కడ ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది మరియు తమ సమయానికి తామే శరీరాన్ని మారుస్తారు, వస్త్రాలను మార్చినట్లుగా మారుస్తారు. ఇవన్నీ కూడా అర్థం చేయించాల్సిన విషయాలు… అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క ప్రియస్మృతులు, గుడ్ నైట్ మరియు నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సృష్టిచక్రపు జ్ఞానంతో స్వయం కూడా త్రికాలదర్శులుగా మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా అలా తయారుచేసే సేవను చేయాలి.

2. సంగమయుగములో శోకవాటిక నుండి బయటపడి సుఖశాంతుల వాటికలోకి వెళ్ళేందుకు తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి.

వరదానము:-

జ్ఞానాన్ని రమణీకతతో స్మరణ చేస్తూ, ముందుకు వెళ్ళే సదా హర్షితంగా, అదృష్టవంతులుగా కండి.

ఇది కేవలం ఆత్మ, పరమాత్మల గురించి రుచిలేని జ్ఞానం కాదు. చాలా రమణీకమైన జ్ఞానం, కేవలం రోజూ తమ కొత్త కొత్త టైటిల్స్ ను గుర్తు పెట్టుకోండి – నేను ఆత్మనే కానీ ఎటువంటి ఆత్మను. ఒక్కోసారి కళాకార ఆత్మను, ఒక్కోసారి వ్యాపారి ఆత్మను… ఇలా రమణీకతతో ముందుకు వెళ్తూ ఉండండి. ఎలాగైతే తండ్రి కూడా రమణీకంగా ఉంటారో, చూడండి, ఒక్కోసారి చాకలివానిగా అవుతారు, అలాగే ఒక్కోసారి విశ్వ రచయితగా, ఒక్కోసారి వినమృడైన సేవకునిగా అవుతారు. కావున తండ్రి ఎలా ఉన్నారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. అదే విధంగా ఈ రమణీక జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండండి, అప్పుడే అదృష్టవంతులు అని అంటారు.

స్లోగన్:-

ఎవరి ప్రతి నర నాడులలో అనగా సంకల్పాలలో సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాల రక్తం నిండి ఉందో, వారే సత్యమైన సేవాధారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top