TELUGU MURLI 04-02-2023

04-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

 

‘‘మధురమైన పిల్లలూ – తండ్రి నుండి సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోవాలంటే ఇతరులందరి నుండి బుద్ధి యొక్క ప్రీతిని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇదే మీ గమ్యము’’

ప్రశ్న:-

పిల్లలైన మీరు ఈ సమయంలో ఏ మంచి కర్మను చేసిన కారణముగా దానికి ప్రతిఫలముగా షావుకార్లుగా అవుతారు?

జవాబు:-

అన్నింటికన్నా అత్యంత మంచి కర్మ – జ్ఞాన రత్నాలను దానం చేయడము. ఈ అవినాశీ జ్ఞాన ఖజానాయే ట్రాన్స్ఫర్ అయి 21 జన్మల కొరకు వినాశీ ధనంగా అవుతుంది, దీని ద్వారానే సుసంపన్నులుగా అవుతారు. ఎవరు ఎంతగా జ్ఞాన రత్నాలను ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయిస్తారో, అంతగా వారు షావుకార్లుగా అవుతారు. అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేయడము – ఇదే సర్వోత్తమ సేవ.

ఓంశాంతి.

శివబాబా తమ సాలిగ్రామాలైన పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది తన పిల్లలకు, ఆత్మలకు పరమాత్మ ఇచ్చే జ్ఞానం. ఆత్మ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వదు. పరమాత్మ శివుడు కూర్చొని బ్రహ్మా, సరస్వతులకు మరియు అదృష్ట సితారైన పిల్లలకు అర్థం చేయిస్తారు, అందుకే దీనిని పరమాత్మ జ్ఞానం అని అంటారు. పరమాత్మ అయితే ఒక్కరే, మిగిలినదంతా ఆ రచయిత యొక్క రచనయే. ఏ విధంగా లౌకిక తండ్రి – వీరంతా నా రూపాలే అని అనరు. అలా కాదు. వీరు నా రచన అని అంటారు. అలాగే వీరు ఆత్మిక తండ్రి, వీరికి కూడా పాత్ర లభించి ఉంది. వీరే ముఖ్యమైన యాక్టర్, క్రియేటర్ మరియు డైరెక్టర్. ఆత్మను క్రియేటర్ అని అనరు. పరమాత్మ విషయంలో – మీరు చూపే మార్గము, మీరు ఇచ్చే గతి మీకే తెలుసు అని అంటారు. ఆ గురువులందరికీ తమ-తమ వేర్వేరు మతాలు ఉంటాయి, అందుకే పరమాత్మ వచ్చి ఒకే మతాన్ని ఇస్తారు. వారు అతి ప్రియమైనవారు. ఆ ఒక్కరితోనే బుద్ధియోగాన్ని జోడించాలి, ఇంకెవరెవరి పట్ల అయితే మీ ప్రీతి ఉందో, వారంతా మోసం చేసేవారే, అందుకే వారందరి నుండి బుద్ధిని తొలగించాలి. నేను మీకు సర్వ సంబంధాల సుఖాన్ని ఇస్తాను, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇదే గమ్యము. నేను అందరికీ డియరెస్ట్ డాడ్ (అత్యంత ప్రియమైన తండ్రిని) కూడా, టీచర్ ను కూడా మరియు గురువును కూడా. వారి ద్వారా మాకు జీవన్ముక్తి లభిస్తుంది అని మీరు భావిస్తారు. ఇదే అవినాశీ జ్ఞాన ఖజానా, ఈ ఖజానా ట్రాన్స్ఫర్ అయి మళ్ళీ 21 జన్మల కొరకు వినాశీ ధనముగా అవుతుంది. 21 జన్మలు మనం ఎంతో సుసంపన్నులుగా అవుతాము. రాజులకే రాజులుగా అవుతాము. ఈ అవినాశీ ధనాన్ని దానం చేయాలి. ఇంతకుముందు వినాశీ ధనాన్ని దానం చేసేటప్పుడు అల్పకాలికమైన, క్షణభంగురమైన సుఖము మరుసటి జన్మలో లభించేది. గత జన్మలో ఏవో దాన-పుణ్యాలు చేసి ఉంటారు, దానికి ఫలము లభించింది అని అంటారు. ఆ ఫలము కేవలం ఒక్క జన్మకే లభిస్తుంది. దానిని జన్మ-జన్మాంతరాల ప్రారబ్ధము అని అనరు. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో దాని ప్రారబ్ధము మనకు జన్మ-జన్మాంతరాలూ లభిస్తుంది. ఇది అనేక జన్మల ఆట. పరమాత్మ నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. అన్నింటికన్నా మంచి కర్మ – అవినాశీ జ్ఞాన ఖజానాను దానం చేయడము. ఎంతగా ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో అంతగా స్వయం కూడా షావుకార్లుగా అవుతారు, ఇతరులను కూడా తయారుచేస్తారు. ఇది సర్వోత్తమ సేవ, దీని ద్వారా సద్గతి లభిస్తుంది. దేవతల ఆచార-వ్యవహారాలు చూడండి, ఏ విధంగా సంపూర్ణ నిర్వికారులుగా, అహింసా పరమో ధర్మంగా ఉంటారు. సంపూర్ణ పవిత్రత సత్య, త్రేతాయుగాలలోనే ఉంటుంది. దేవతలే స్వర్గములో ఉంటారు, వారినే ఉన్నతమైనవారని మహిమ చేస్తారు. ఎవరైతే సత్యయుగములో సూర్యవంశీయులుగా అవుతారో వారే సంపూర్ణులు, ఆ తర్వాత కొద్దిగా కల్తీ కలుస్తుంది. దేవతలు ఏ స్వర్గంలోని నివాసులో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వైకుంఠము చాలా అద్భుతమైన ప్రపంచము, అక్కడకు ఇతర ధర్మాల వారు వెళ్ళలేరు. ఈ ధర్మాలన్నింటినీ రచించేవారు ఒక్క ఉన్నతోన్నతమైన భగవంతుడే. ఈ దేవతా ధర్మాన్ని బ్రహ్మా ఏమీ స్థాపించరు, వారు అంటారు – నేనూ అపవిత్రంగానే ఉండేవాడిని, నాలో జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది. ఇతర పవిత్ర ఆత్మలు అందరూ పై నుండి వస్తారు, తమ ధర్మాన్ని స్థాపన చేయడానికి. ఇక్కడైతే పరమాత్మ ధర్మ స్థాపన చేస్తారు, ఎప్పుడైతే వీరిలోకి వస్తారో, అప్పుడు వీరికి బ్రహ్మా అన్న పేరును పెడతారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః… అని అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏమని ఉత్పన్నమవుతుందంటే – ఈ దేవతల ద్వారా మనుష్య సృష్టి రచించబడిందా? అలా కాదు. పరమాత్మ అంటారు, నేను ఏ సాధారణ తనువులోకైతే వస్తానో, వారికి బ్రహ్మా అన్న పేరును పెట్టడం జరుగుతుంది. వారు సూక్ష్మ బ్రహ్మా, కావున ఇద్దరు బ్రహ్మాలు ఉంటారు. వీరికి బ్రహ్మా అన్న పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే నేను సాధారణ తనువులోకి వస్తాను అని అంటారు. బ్రహ్మా ముఖ కమలము ద్వారా బ్రాహ్మణులను రచిస్తాను. ఆదిదేవుని ద్వారా మానవాళి రచింపబడింది, వీరు మానవాళికి మొదటి తండ్రి. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది.

ఇప్పుడు మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తారు. కానీ ఎప్పుడైతే దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి సంబంధాన్ని తెంచుతారో, అప్పుడే అలా తయారవుతారు. బాబా, నేను మీ వాడినే, అంతే. మేమే మళ్ళీ యువరాజులుగా అవుతాము అన్న నిశ్చయము ఉంది. చతుర్భుజుని సాక్షాత్కారం కలుగుతుంది కదా. వారు యుగళులు. చిత్రాలలో బ్రహ్మాకు 10, 20 భుజాలను చూపిస్తారు. కాళికి ఎన్ని భుజాలను చూపించారు, ఇన్ని బాహువులు కలవారు ఎవరూ ఉండరు. ఇవన్నీ అస్త్ర-శస్త్రాలు. మనది ప్రవృత్తి మార్గము. ఇకపోతే బ్రహ్మాకు ఇన్ని భుజాలు చూపిస్తారు, ఈ బ్రహ్మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు వీరికి భుజాల వంటివారు అని భావిస్తారు. అంతేకానీ, ఈ కాళి మొదలైనవారెవరూ లేరు, ఏ విధముగా కృష్ణుడిని నల్లగా చేసేసారో అలాగే కాళి చిత్రాన్ని కూడా నల్లగా చేసేసారు. ఈ జగదాంబ కూడా బ్రాహ్మణియే. మనం స్వయాన్ని భగవంతునిగా లేక అవతారముగా చెప్పుకోము. బాబా అంటారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. వాస్తవానికి శివ కుమారులందరూ సాలిగ్రామాలు. తర్వాత మనుష్య తనువులోకి రావడంతో మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా పిలవబడతారు. బ్రహ్మాకుమార-కుమారీలు వెళ్ళి మళ్ళీ విష్ణుకుమార-కుమారీలుగా అవుతారు. తండ్రి రచిస్తారు, ఆ తర్వాత పాలన కూడా వారే చేయాల్సి ఉంటుంది. ఇటువంటి డియరెస్ట్ డాడ్ కు (అతి ప్రియమైన తండ్రికి) మీరు వారసులు, వారితో మీరు వ్యాపారం చేస్తారు. వీరు కేవలం మధ్యవర్తి మాత్రమే.

బాబాది పవిత్రమైన గవర్నమెంట్, వారు ఈ గవర్నమెంట్ ను కూడా పాండవ గవర్నమెంట్ గా చేయడానికి వచ్చారు. ఇది మన ఉన్నతమైన సేవ. బాబా సహాయముతో గవర్నమెంట్ వారి ప్రజలను మనము మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాము. కావున మనం వారికి సేవకులము కదా. మనం విశ్వ సేవకులము, మొత్తం విశ్వమంతటికీ సేవ చేయడానికి మనం బాబాతోపాటు వచ్చాము. మనం ఏమీ తీసుకోము. వినాశీ ధనము, మహళ్ళు మొదలైనవి మనం ఏమి చేసుకుంటాము. మనకైతే కేవలం మూడడుగుల భూమి కావాలి.

పిల్లలైన మీకు ఇప్పుడు సత్యాతి-సత్యమైన జ్ఞానం లభిస్తుంది, శాస్త్రాల జ్ఞానాన్ని జ్ఞానం అని అనరు, అది భక్తి. జ్ఞానం అనగా సద్గతి. సద్గతి అనగా ముక్తి-జీవన్ముక్తి. ఎప్పటివరకైతే జీవన్ముక్తులుగా అవ్వరో అప్పటివరకు ముక్తులుగా కూడా అవ్వలేరు. మనం జీవన్ముక్తులుగా అవుతాము. మిగిలినవారంతా ముక్తులుగా అవుతారు. అందుకే మీరు చూపే మార్గము, మీరు ఇచ్చే గతి మీకే తెలుసు అని అంటారు. అప్పుడిక పరమాత్మ సర్వవ్యాపి అన్న విషయం ఇందులో ఉండదు. వారు అంటారు, కల్ప-కల్పమూ నేను నా మతము ద్వారా అందరికీ సద్గతిని ఇస్తాను. సద్గతితోపాటు గతి కూడా లభిస్తుంది. కొత్త ప్రపంచములో ఉండేదే కొద్దిమంది. ఇంతకుముందు ఒకే ప్రపంచంలో సూర్యుడు, ఒకే ప్రపంచంలో చంద్రుడు, ఒకే ప్రపంచంలో తొమ్మిది లక్షల సితారలు అని అనేవారము… ఈ సమయంలోనే ఈ ప్రపంచంలో సూర్యుడు ఉన్నారు. ఈ ప్రపంచంలో శివుడు ఉన్నారు, వారికే ఇంతటి విస్తారము ఉంది. అలాగే ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి మరియు అదృష్ట సితారలు ఉన్నారు. సత్యయుగములో తప్పకుండా తక్కువ సంఖ్యయే ఉండాలని వివేకం కూడా చెప్తుంది. ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరు ఎంతగా పవిత్రముగా అవుతారో, అంతగా ధారణ జరుగుతుంది. అపవిత్రత వలన ధారణ తక్కువగా జరుగుతుంది. పవిత్రత ఫస్ట్. క్రోధం యొక్క భూతము ఉండిపోయినా మాయతో ఓడిపోతారు. ఇది యుద్ధము కదా. గురువుకు చేతిని పూర్తిగా ఇవ్వాలి. లేదంటే మాయ చాలా ప్రబలమైనది. ఎవరి చేయి అయితే వారి చేతిలో ఉందో వారి కొరకు వర్షం కురుస్తుంది. తండ్రి సాక్షీగా అయి పాత్రను కూడా అభినయిస్తారు, చూస్తూ ఉంటారు కూడా. తల్లి, తండ్రి మరియు అనన్యులైన లక్కీ సితారలెవరైతే ఉన్నారో వారినే ఫాలో చేయాలి అని కూడా మీరు అర్థం చేసుకోగలరు. మురళిని చదవడం ఎప్పుడూ వదలకూడదు అని అర్థం చేయించడం జరిగింది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ 23-12-58

సర్వశక్తివంతుడైన తండ్రికి ఎన్ని ఆత్మిక ఫ్యాక్టరీలు (సెంటర్లు) ఉన్నాయో చూడండి. అక్కడి నుండి ప్రతి ఒక్కరికీ ఆత్మిక రత్నాలు లభిస్తాయి. బాబా అన్ని ఫ్యాక్టరీలకు యజమాని. మేనేజర్లు సంభాళిస్తున్నారు, దుకాణాలు నడుస్తున్నాయి. దుకాణాలు అనండి, హాస్పిటళ్ళు అనండి… ఇది బ్రాహ్మణులైన మీ ఫ్యామిలీ కూడా. మీరు విద్య ద్వారా మీ జీవితాన్ని తయారుచేసుకోవాలి. ఇందులో ఆత్మిక విద్య మరియు భౌతిక విద్య, రెండూ కలిసి ఉన్నాయి. రెండూ అనంతమైనవే. మరియు అక్కడ ఉన్న ఆత్మిక మరియు భౌతిక విద్య, రెండూ హద్దులోనివి. గురువులు ఏ శాస్త్రాలు మొదలైనవాటి యొక్క ఆత్మిక శిక్షణనైతే ఇస్తారో అదంతా హద్దులోనిది. మనం మనుష్యులెవ్వరినీ గురువుగా భావించము. మన సద్గురువు ఒక్కరే, వారు ఒకే రథములోకి వస్తారు. ఘడియ-ఘడియ వారిని స్మృతి చేస్తారు, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. మీకు ఆ తాతగారి నుండి ధనం లభిస్తుంది, అందుకే వారిని స్మృతి చేయాలి. వికర్మలుగా తయారయ్యే కర్మలేవీ చేయకూడదు. సత్యయుగములో కర్మలు అకర్మలుగా ఉంటాయి, ఇక్కడ కర్మలు వికర్మలుగా అవుతాయి ఎందుకంటే ఇక్కడ 5 భూతాలూ ఉన్నాయి. మనం పూర్తిగా సురక్షితముగా ఉన్నాము. బాబా అంటారు, వికారాలను దానముగా ఇవ్వండి, మళ్ళీ వాటిని తిరిగి తీసుకుంటే నష్టం వాటిల్లుతుంది. మనం దాచిపెట్టి చేస్తే ఎవరికీ తెలియదు అని భావించకండి. ధర్మరాజుకైతే తెలుస్తుంది కదా. ఈ సమయంలోనే బాబాను అంతర్యామి అని అంటారు, వారు పిల్లలు ప్రతి ఒక్కరి రిజిస్టరును చూడగలరు. వారికి పిల్లలైన మన లోపల ఏముందో తెలుసు, అందుకే ఏమీ దాచిపెట్టకూడదు. బాబా, మా ద్వారా పొరపాటు జరిగింది, క్షమించండి, ధర్మరాజు సభలో శిక్షలు ఇవ్వకండి అని కూడా ఉత్తరాలు రాస్తారు. డైరెక్టుగా శివబాబాకు రాసినట్లుగా రాస్తారు. బాబా పేరు మీద ఈ పోస్ట్ బాక్స్ లో ఉత్తరం వేస్తారు. పొరపాటును చెప్పడం ద్వారా సగం శిక్ష తగ్గిపోతుంది. ఇక్కడ పవిత్రత ఎంతో కావాలి. సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఇక్కడే తయారవ్వాలి. రిహార్సల్ ఇక్కడ జరుగుతుంది, తర్వాత అక్కడ ప్రాక్టికల్ గా పాత్రను అభినయించాలి. నేను వికర్మలేవీ చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. సంకల్పాలైతే ఎన్నో వస్తాయి, మాయ ఎంతగానో పరీక్ష తీసుకుంటుంది, భయపడకండి. ఎన్నో నష్టాలు కలుగుతాయి, వ్యాపారం నడవదు, కాలు విరిగిపోతుంది, రోగగ్రస్థులవుతారు… కానీ ఏమి జరిగినా సరే తండ్రి చేతిని విడిచిపెట్టకండి. అనేక రకాల పరీక్షలు వస్తాయి. మొట్టమొదట అవి బాబా ఎదురుగా వస్తాయి, అందుకే బాబా అంటారు, జాగ్రత్తగా ఉండండి. పహల్వాన్లుగా అవ్వాలి.

భారత్ లో ఎన్ని అయితే అందరికీ సెలవులు లభిస్తాయో, అన్ని ఇంకెక్కడా లభించవు, కానీ ఇక్కడ మనకు ఒక్క క్షణము కూడా సెలవు లభించదు ఎందుకంటే బాబా అంటారు, శ్వాస, శ్వాసలోనూ స్మృతిలో ఉండండి. ఒక్కొక్క శ్వాస అమూల్యమైనది. కావున దానిని వ్యర్థం ఎలా చేయగలము. ఎవరైతే వ్యర్థం చేస్తారో వారు పదవిని భ్రష్టం చేసుకుంటారు. ఈ జన్మలోని ఒక్కొక్క శ్వాస అత్యంత విలువైనది. రాత్రింబవళ్ళు బాబా సేవలో ఉండాలి. మీరు సర్వశక్తివంతుడైన బాబాను ప్రేమించేవారా లేక వారి రథాన్ని ప్రేమించేవారా? లేక ఇరువురిని ప్రేమించేవారా? తప్పకుండా ఇరువురిని ప్రేమించేవారిగా అవ్వాలి. వారు ఈ రథములో ఉన్నారు అని బుద్ధిలో ఉంటుంది. వారి కారణముగా మీరు వీరిని ప్రేమించేవారిగా అయ్యారు. శివుని మందిరములో కూడా నందిని పెట్టడం జరిగింది. దానిని కూడా పూజించడం జరుగుతుంది. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. ఎవరైతే రోజూ వినరో వారు కొన్ని-కొన్ని పాయింట్లను మిస్ అవుతారు. రోజూ వినేవారు ఎప్పుడూ పాయింట్లలో ఫెయిల్ అవ్వరు. మ్యానర్స్ కూడా బాగుంటాయి. బాబా స్మృతిలో ఎంతో లాభం ఉంది. ఆ తర్వాత బాబా జ్ఞానాన్ని స్మృతి చేయాలి. యోగంలో కూడా లాభము ఉంది, జ్ఞానంలో కూడా లాభము ఉంది. బాబాను స్మృతి చేయడంలో అన్నింటికన్నా ఎక్కువ లాభం ఉంది ఎందుకంటే వికర్మలు వినాశనమవుతాయి మరియు పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్వాస, శ్వాసలోనూ తండ్రిని స్మృతి చేయాలి, ఒక్క శ్వాసను కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. వికర్మలుగా అయ్యేటువంటి కర్మలేవీ చేయకూడదు.

2. గురువు చేతిలో చేతినిచ్చి సంపూర్ణ పావనంగా అవ్వాలి. ఎప్పుడూ క్రోధానికి వశీభూతులై మాయతో ఓడిపోకూడదు. పహల్వాన్లుగా అవ్వాలి.

వరదానము:-

సమర్థ స్థితి అనే ఆసనంపై కూర్చుని వ్యర్థాన్ని మరియు సమర్థాన్ని నిర్ణయించే స్మృతి స్వరూప భవ

ఈ జ్ఞానం యొక్క సారం స్మృతి స్వరూపులుగా అవ్వడము. ప్రతి కార్యాన్ని చేసే ముందు ఈ వరదానం ద్వారా సమర్థ స్థితి అనే ఆసనంపై కూర్చుని ఇది వ్యర్థమా లేక సమర్థమా అని నిర్ణయించండి, ఆ తర్వాత కర్మలోకి రండి, కర్మ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి – ఆ కర్మ యొక్క ఆది, మధ్య మరియు అంతము, మూడు కాలాలు సమర్థంగా ఉన్నాయా? ఈ సమర్థ స్థితి యొక్క ఆసనమే హంస ఆసనము, దీని విశేషతయే నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి ద్వారా సదా కాలం కొరకు మర్యాదా పురుషోత్తమ స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు.

స్లోగన్:-

అనేక రకాల మానసిక రోగాలను దూరంగా పారద్రోలేందుకు సాధనము – సైలెన్స్ శక్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top